Friday, December 25, 2009

తెలంగాణా, ఆంధ్ర లకూ - తూర్పు, పశ్చిమ జర్మనీ లకూ మధ్య నున్న తేడా ...తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు సమస్య గురించిన చర్చల్లో తరచూ తూర్పు పశ్చిమ జర్మనీల ప్రస్తావన విన వస్తోంది. రెండు జర్మనీల మధ్య నిర్మించిన దుర్భేధ్యమైన బెర్లిన్‌ గోడను కొన్నాళ్ల క్రిందట కూల్చేశారు. అవి రెండూ తిరిగి ఒకే దేశంగా మారిపోయాయి. దేశాలే కలసి పోతుంటే రాష్ట్రాలను విడదీయడమేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.

నిజానికి తూర్పు, పశ్చిమ జర్మనీ దేశాలు మొదటి నుంచీ ఒకే (జర్మనీ) దేశంగా వుండేవి. ఇతర దేశాలను కబళించాలని ఉవ్విళ్లూరిన ఆ దేశం రెండో ప్రపంచ యుద్ధంలో తనే మట్టి కరచి నిట్టనిలువునా చీలిపోయింది. ఒక ముక్క అమెరికా ఆధిపత్యంలోకి, మరో ముక్క సోవియట్‌ రష్యా ఆధీనంలోకి వెళ్లాయి. సొవియట్‌ రష్యా పతనం తరువాత ఆ రెండు ముక్కలూ తిరిగి ఒక్కటయ్యాయి.

జర్మనీ పరిస్థితి వేరు, ఆంధ్ర తెలంగాణాల పరిస్థితివేరు.
ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలు ఆది నుంచీ వివిధ రాజుల ఏలుబడిలో... విభిన్న రాజ్యాలుగా వున్నాయే తప్ప సంపూర్ణంగా ఒకే దేశంగాగానీ, ఒకే రాష్ట్రంగా గానీ ఎన్నడూ లేవు.

మరీ ముఖ్యంగా గత మూడునాలుగు వందల సంవత్సరాలు ... ఆంధ్ర ప్రాంతం - బ్రిటీషు పరిపాలన కింద,
తెలంగాణా ప్రాంతం - మహ్మదీయ పరిపాలన కింద వుండటంతో ఈ ఇరు ప్రాంతాల భాషా సంస్కృతులు భిన్నంగా మారిపోయాయి. అభివృద్ధి, చదువు సంధ్యలు, ఆచారవ్యవహారాలు, సంస్కృతి, పండుగలు పబ్బాలు, నాగరికత అన్నింటిలో ఎన్నో తేడాలు చోటుచేసుకున్నాయి.

పైకి తెలుగు భాష ఒక్కటే అయినా ఒక ప్రాంతపు యాస మరొక ప్రాంతానికి అర్థంకానంత జటిలంగా తయారైంది. పరస్పర సంబంధాలను పటిష్టపరిచేందుకు భాష ఏమాత్రం దోహదం చేయలేదు. పైగా ఒక ప్రాంతపు యాస అంటే మరొక ప్రాంతానికి ఎంతో చులకన. సినిమాల్లో తమ భాషని కేవలం విలన్లకీ, బఫూన్లకీ పరిమితం చేసి అవహేళన చేస్తుంటే తెలంగాణా ప్రజలు మండిపోవడం, లేదా ఆత్మన్యూనతతో కృంగిపోవడం తెలిసిందే.

ఈ కారణాలవల్ల భాష పేరిట ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలను బలవంతంగా ఏకం చేసినా రెండు ప్రాంతాలూ మానసికంగా ఒకటి కాలేకపోయాయి.
దానికి తోడు ఉద్యోగాలు, వనరులు, నీరు, నిధులు మొదలైన వాటి పంపిణీలో జరిగిన అన్యాయం, వివక్ష; రాజకీయ నాయకుల స్వార్థం, అవకాశవాదం, పక్షపాత ధోరణి, అట్లాగే పత్రికలూ, మీడియా, విద్యారంగం మీద ఒకే ప్రాంతపు గుత్తాధిపత్యం రెండు ప్రాంతాలు ఒక్కటి అ య్యేందుకు వీలు లేకుండా కనిపించని ఇనుప గోడల్ని నిర్మించాయి.

ఇవి ఏకమై అర్థ శతాబ్ధం గడచినా ఆంధ్ర ఆంధ్ర గానే తెలంగాణా తెలంగాణా గానే మిగిలిపోయాయి తప్ప ఒక్కటి కాలేకపోయాయి. పరస్పర అనుమానాలు, అవమానాలు, అవహేళనలు, వివక్ష అట్లాగే కొనసాగుతున్నాయి.

ఈ వాస్తవాలన్నీ విస్మరించి తెలుగు జాతి అనే భావనని ఎంత రాజేసినా ఇవాళ తెలంగాణా ప్రాంతం ఏమాత్రం స్పందించే స్థితిలో లేదు.

ఒక ప్రాంతం మాత్రమే కోరుకుంటే సమైక్యత సాకారం కాదు.
ఉభయ జర్మనీలు రెండూ కోరుకున్నాయి కాబట్టే అక్కడ బెర్లిన్‌ గోడ కూలిపోయింది.

ఇక్కడ భౌతికంగా ఏ గోడా లేకపోయినా రెండు ప్రాంతాలూ ఒకటి కాలేకపోతున్నాయి.
ఈ కనిపించని గోడను కూల్చడం ఇక సాధ్యమయ్యే పనికాదు.

తెలంగాణా తెలుగు జాతిగా కంటే తెలంగాణా జాతిగా మారిపోయింది.
తెలుగు జాతి పేరిట ఆంధ్ర ఆధిపత్యం కింద నలిగిపోవడం కంటే స్వతంత్ర జాతిగా తన ఉనికిని తను, తన అస్తిత్వాన్ని తను, తన ఆత్మగౌరవాన్ని తను కాపాడుకోవాలని తెలంగాణా తహతహలాడుతోంది.

ఈ పరిస్థితిని జర్మనీతో పోల్చడం కంటే, రష్యాలోంచి విడిపోయిన ఉజ్భెకిస్థాన్‌, తజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, ఉక్రేనియా, జార్జియా వంటి దేశాలతో పోల్చడం సబబుగా వుంటుంది.
అరవై సంవత్సరాలు అవన్నీ సొవియట్‌ రష్యా పేరిట ఒకే గొడుగు కింద వున్నప్పటికీ ఒకే జాతిగా మాత్రం మారలేక పోయాయి. 60 సంవత్సరాల అనంతరం వేటికవిగా విడిపోయాయి.

జాతులు విముక్తిని కోరుకుంటాయి.
తెలంగాణా కూడా విముక్తిని కోరుకుంటోంది.

కాబట్టి ఆంధ్ర తెలంగాణాలు కూడా విడిపోయి మానసికంగా కలసి వుండేందుకు ప్రయత్నిస్తేనే రెండు ప్రాంతాలకూ మంచిది.
కలసి వుంటే ఒక ప్రాంతానికే సుఖం రెండో ప్రాంతానికి తీరని దుఃఖమే.

కేవలం ఒక్క ప్రాంతం మాత్రమే ఎంత బలంగా కోరుకున్నా అది సమైక్యత కాదు కాక కాదు.
యాసిడ్‌ సీసా చూపించి, దౌర్జన్యం చేసి ఎవరైనా ఎదుటి వ్యక్తి ప్రేమను ఎలా పొందగలరు?

కాబట్టి ఉభయ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం శాశ్వతంగా నెలకొనాలంటే ఆంధ్ర తెలంగాణాలు తక్షణమే విడిపోవాలి.
కావలిస్తే మరో వంద సంవత్సరాల తరువాత ... ఉభయ ప్రాంతాలూ సర్వతోముఖ అభివృద్ధి సాధించిన అనంతరం సంతోషంగా, సమఉజ్జీలుగా మమేకం కావొచ్చు.

సర్వేజనా సుఖినోభవంతు.
జై తెలంగాణా! జై ఆంధ్రా!

11 comments:

 1. ఇంత క్లియర్ గ చెప్పిన చెప్పిన తరువాత కూడ ఆంధ్ర వాళ్ళు సమైక్య ఆంధ్ర అంటే మనం ఏమి చెయ్య లేము ....

  ReplyDelete
 2. భాషలొ ఎస ఉందని రాష్ట్రలు ఇస్తె జిల్లాకి ఒక భాష ఉంది.అప్పుఢు ఎన్ని రాష్ట్రలు ఇవ్వాలి ?

  ReplyDelete
 3. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 4. భాషలొ ఎస ఉందని రాష్ట్రలు ఇస్తె జిల్లాకి ఒక భాష ఉంది.అప్పుఢు ఎన్ని రాష్ట్రలు ఇవ్వాలి ????????????????

  Kodi Gudduku Eekalu Peekadam Ante Ide

  ReplyDelete
 5. గత 50 సంవత్సరాలనుండి మా తెలంగాణకు గజ్జి, గొకుడు, దురద, తామర పట్టిందే. ఇప్పుడు గందుకె గాళ్ళ ఇస్కుళ్ళను, హొటళ్ళను, సిన్మాలను గొకుతున్నము. గింత జల్దిన గజ్జి ఎట్ల బొతదె. గట్లనె మనం ఇడిపోదమే.
  జై తెలంగాణ!!!

  ReplyDelete
 6. కొందరు సమైఖ్యాంగా,కొందరు వేర్పాటు అని రాష్ట్రాన్ని ద్వసం చేస్తున్నారు.
  రాష్ట్రాన్ని విభజించితె రాజకియ నాయకులకే లాబం ఎందుకంటె రాష్ట్రాలు ఎన్ని
  ఎర్పడితె అంతమంది ముఖ్యమంత్రులు,అంతమంది హొమ్ మినిస్ట్రెర్లు,అర్ధిక
  మంత్రులు లాంటి ఉద్యోగాలు వస్తాయి తప్ప విద్యార్థులకు ఉద్యోగాలు ఎక్కడి
  నుంచి పెరుగుతాయి.కొందరు స్వార్ద రాజకియ నాయకులు పదవులకొసం 2004 -2009
  ఎన్నికల సమయంలొ తెలంగాణాకు అనుకూలంగా మట్లాడారు.అసలు ప్రజాప్రతినిధుల
  అభిప్రాయాన్ని తిసుకొకుండానే హామిలు ఇచ్చారు,తెలుసుకొని ఉంటె ఇన్ని
  గొడవలు ఎందుకు జరుగుతాయి.రాష్ట్రాలను విభజించ తలిస్తె ముందుగ పరిపాలనకు
  అనుగుణంగ ముందు వ్యవస్తను ఎర్పటుచెయలి(అసెంబ్లి,కోర్టులు పరిపాలన భవనాలు
  అన్నిప్రాంతాలకు సమకూర్చి అప్పుడు విభజించాలి) ఇంతకుముందు కర్నూలు లొ
  ఉన్న రాజధానిని హైదరాబాద్‌కు ఎందుకుమార్చ్హరు అందరికి దగ్గరగ ఉంటుందని.
  1972లొ జై ఆంద్ర అన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు అప్పుడు తెలంగాణా వాళ్లె
  ముఖ్యమంత్రిగ ఉన్నారు(పి.వి.నరసింహరావు).53 సం''లు నుంచి ప్రత్యేక
  తెలంగాణా అన్నారు అప్పుడు ఎందుకు తిసుకొలేదు.చిన్నరాష్ట్రాలు ఐతె
  ప్రభుత్వ సంస్తలు (ఆర్.టి.సి)లాంటివి ప్రైవేటుపరం అవుతాయి,ఇప్పుడు
  ఇస్తున్న రాయతిలు అన్ని పోతాయి.నిరాహారదీక్షలు చేస్తే రాష్ట్రాలు
  ఇచ్చేస్తే నిరాహారదీక్ష చేసినప్పుడల్ల రాష్ట్రాలను
  ఇచ్చేస్తారా.

  ReplyDelete
 7. చరిత్ర గూర్చి మాట్లాడేవారు, చరిత్రను పూర్తిగా తెలుసుకోవాలి.
  తెలంగాణాకు సంబందించి కేవలం ఈ 56 ఏళ్ళు లేకపోతే హైదరబాదు రాష్ట్రంమే చరిత్ర కాదు. హైదరాబాదుతో సహా నిజాం నవాబు, అక్కడి ప్రజలు ఒక్కసారే ఆకాశం నుండి ఊడి పడలేదు...

  ఈ క్రింది అంశాలు కూడా చరిత్రే....
  నిజాం ఆంగ్లేయులతో, ఫ్రెంచి వారితో కుదుర్చుకున్న ఒప్పందాలు.
  తెలంగాణేతర ప్రాంతాలనుండి దాదాపు 200 ఏండ్లు హైదరాబాదుకి పెద్దమొత్తంలో ఆదాయం లభించింది.

  1)Andhra- means telugu literally, andhra pradesh means, land of telugu .
  ((so its baseless, to even argue with the section of telugu people who do not even know the roots and changing the word Andhra to telangana where and when ever they like..thinking that Andhra relates to coastal or rayalaseema) )

  2)entire telugu land despite having many kingdoms historically ,were together during 3 great empires,satavahans,kakatiyas and the vijayanagara dynasty, the golden period.

  3) it is due to the malicious intentions of alien rulers -mughals,nizams and british -the telugu land is divided in to 3 regions-telangana, northern circars or coastal and the rayalaseema.

  how many people from telangana know the basest of basic facts that it is the nizam( s ) who is ( are ) the real culprits .
  Friends brush up on these below facts:

  during the 6 treaties nizam signed with the british

  1) in 1766 1st treaty nizam gave away the northern circars to british,in return for payment of 90,000 pounds annually by the british to the nizam or british assistance to nizam when needed ( either 1 option annually).

  2)in 1768- 2nd treaty- as nizam succumbed to british , had to forge a gesture of friendship ,british payed an annual allowance of 50,000 pounds.

  3)in 1788 nizam gave up guntur district to british in return for an annual tribute of rs 7 lakhs.

  4) in 1798, nizam signed the subsidiary alliance treaty with british.
  5) in 1800, nizam ceded the 4 districts of then kadapa, ananthapur,kurnool,bellary,in return fot the payment for the maintainanace of the subsidiary force in hyderabad.

  thus by 1802 coastal andhra and rayalasemma came under the rule of british , where as the telangana region remained with nizam.

  6)in 1803 nizam signed another treaty with british, by which the forces of hyderabad,were placed at the disposal of british for any kind of emergency.

  this is the brief glimpse of how telugu land was divided.friends i recommend all of you to read this section of history.

  ReplyDelete
 8. తెలంగాణా రాష్ట్ర ఉధృత ఉద్యమ పోరాట స్పూర్తి పాటలు/గీతాలకై,(17).........
  ఈ బ్లాగ్స్ చూడండి
  వీటిని పాడుకొండి..విస్తృతంగా..ప్రచారం చేయండి..
  www.raki9-4u.blogspot.com. . జై తెలంగాణ జైజై తెలంగాణ

  ReplyDelete
 9. I don't understand why the depiction of Telangana accent in movies should become a political issue. For a long time villains in Telugu movies were using East/West Godavari accent (e.g. Rao Gopala Rao). Comedians have been using East/West Godavari accent for many decades e.g. Relangi, Allu Ramalingayya, Rajababu, Brahmanandam, Ali, Sunil. No one from East/West Godavari complained about it, in fact they thoroughly enjoy it. Many villains nowadays also use Rayalaseema accent. So why can't Telangana accent be used for villains & comedians?

  ReplyDelete
 10. http://www.pranahita.org/2007/10/nirdeshatmaka_vyakaranam/#comments

  ReplyDelete
 11. @ నిజం , శ్రీను , వెంకటేశ్వర్ రావు , హరి , రాఖీ అనానిమస్ ల స్పందనలకు ధన్య్వవదాలు .

  వెంకటేశ్వర్ రావు గారి అమాయమ , వితండ వాదానికి చెప్పగలిగింది ఏమి లేదు .

  హరి గారిది కూడా వితండ వాదమే .

  సర్కారు సీడెడ్ జిల్లాలను బ్రిటిష్ వారికి ఇచ్చి వాటి ద్వారా వచ్చిన ప్రజల సొమ్ముతో నిజాం నవాబు వజ్రాలు కొని పేపర్ వైట్లు గా వాడుకున్నాడు , బంగారు షెర్వానీలు కుట్టించుకుని వేసుకుని ఊరేగాడు . ........ అయితే ఏంటి ?

  తెలంగాణా ప్రజల సొమ్ము ఎంత గా వాడి విలాసలకే కాదు ధిల్లీ భోషాణం లోకి పోయిందో ఎవరు లెక్కలు తీయగలరు ?

  భారత ప్రజల సొమ్ము తోనే బ్రిటీష్ వాడు లండన్ బ్రిడ్జ్ కట్టాడని వాదిస్తే ఫలితం ఏమిటి ?

  దీనిని వితండ వాదం కాక మరేమంటారు ? అసలు సమస్యను అవహేళన చేసే, పక్కదారి పట్టించే ప్రయత్నాలలో భాగమిది. పనికి మాలిన అతి తెలివి ఇది.


  ఇక తెలంగాణా యాస ను సినిమా వాళ్ళు విలన్లకు , జోకర్లకు , బ్రోకర్లకు వాడి వాడి అవహేళన చేయడం అది ప్రజల భాష కాదు విలన్ల భాష , అనాగరికుల భాష అనే ముద్ర పడేట్టు ప్రచారం చేయడం ప్రతీ తెలంగాణా వ్యక్తినీ ఆగ్రహా వేషాలకు గురిచేస్తోంది .

  కథ , నేపధ్య ప్రాంతం , ఆవశ్యకత లతో నిమిత్తం లేకుండా తెలంగాణా మాండలికాన్ని కేవలం నీచ పాత్రలకే ఉపయోగించడం తెలంగాణా పట్ల ఉన్న చులకన భావానికి , బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం .

  "మా భూమి ", "చిల్లర దేవుళ్ళు ", "ఒసే రాములమ్మ ", "బతుకమ్మ " వంటి చిత్రాల్లో విలన్లు కూడా తెలంగాణా మాండలికం లోనే మాట్లాడతారు . అయినా పాత్రోచిత సంభాషణ ఎవరికీ బాధ కలిగించాడు .

  కాని మిగతా సినిమాల్లోది పాత్రోచిత , కదోచిత సంభాషణ కాదు . వాటిలో తెలంగాణా యాసను ఉద్దేశ పూర్వకంగానే ఉపయోగించి తమ శాదిజాన్ని చాటుకుంటున్నారు .

  తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే కాని తెలంగాణా భాషా సంస్కృతులకు , చరిత్రకు నిష్కృతి వుండదు .

  ReplyDelete