Wednesday, December 9, 2009

హైదరాబాదేం ఖర్మ- మొత్తం తెలంగాణాను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని అరవొచ్చుకదా!

....

...........

Present Telangana:

చర్విత చర్వణం

1948 నుంచి 1956 వరకూ తెలంగాణా ప్రాంతం ''హైదరాబాద్‌ రాష్ట్రం'' గా విడిగా వుండేది. హైదరాబాద్‌ రాష్ట్రానికి హైదరాబాద్‌ నగరమే రాజధానిగా వుండేది. అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రస్తుత కర్ణాటక, మహారాష్ట్రల్లోని కొన్ని జిల్లాలు కలిసి వుండేవి. అంతకు ముందు నాలుగు వందల సంవత్సరాల నుంచీ నైజాం రాష్ట్రం ఇంచుమించు ఇట్లాగే వుండేది. కోస్తాంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం కూడా కొంత కాలం నైజాం సంస్థానంలో వున్నప్పటికీ వాటిని నిజాం రాజు ఉదారంగా బ్రిటీష్‌ వారికి భరణంగా ఇచ్చేశాడు. వాటిని సీడెడ్‌, సర్కారు జిల్లాలుగా వ్యవహరించేవారు. ఇప్పటికీ చాలామంది సినీ డిస్ట్రిబ్యూటర్లు ఆనాటి నైజాం, సీడెడ్‌, సర్కారు అనే పదాలనే వాడుతుండటం మనం గమనించవచ్చు.

1953 వరకు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాస్‌ ప్రావిన్స్‌ క్రింద వుండేవి. తెలుగువాళ్ల పట్ల తమిళులు వివక్ష చూపుతున్నారని, మద్రాసీలన్న ముద్ర తప్ప తెలుగు వాళ్లకు సొంత అస్తిత్వం లేకుండా పోయిందని, ఉద్యోగాలు తదితర విషయాల్లో తీవ్ర వివక్ష ఎదురవుతోందని ఆక్రోశిస్తూ , ఆవేదన చెందుతూ, ఆవేశపడుతూ ఆంధ్ర, రాయలసీమ ప్రజలు మద్రాసు నుంచి విడిపోవాలని, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమించారు. ''మా తెలుగు తల్లికీ మల్లె పూదండ'' పాట ఆ ఆత్మగౌరవ పోరాటంలోంచి పుట్టిందే. చివరికి అమరజీవి పొట్టి శ్రీరాములు బలిదానంతో 1953లో ''కర్నూలు'' రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.

అయితే కర్నూలులో రాజధానికి కావలసిన సౌకర్యాలు సరిగా లేకపోవడంతో ఆంధ్ర నేతల కన్ను అప్పటికే అన్నివిధాలా అభివృద్ధి చెందిన ''హైదరాబాద''్‌ నగరం మీద పడింది. దరిమిలా ఆంధ్ర నేతలు '' మీది తెలుగే ... మాది తెలుగే '' అంటూ కలిసుందాం రా అంటూ సమైక్య గీతం మొదలుపెట్టారు.

1956 లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే సరికొత్త వాదన లేవదీశారు. ఆ కుట్రలో అమాయకంగా చిక్కుకుని, పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు, ఉప ముఖ్యమంత్రి పదవి వంటి హామీలను నమ్మి ''హైదరాబాద్‌ రాష్ట్రం'' ఆంధ్ర రాష్ట్రంలో విలీనమై తన అస్తిత్వాన్ని కోల్పోయింది. దాంతో పాటు కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకకు, మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహరాష్ట్రకు వదిలేయాల్సి వచ్చింది. దానివల్ల కూడా ఎంతో నష్టపోయింది.

మొదటినుంచీ ఆంధ్రాలో విద్యావకాశాలు విస్తృతంగా అందుబాటులో వుండడం వల్ల, ఇంగ్లీషు మీడియం చదువుల వల్ల ఆంధ్ర ప్రాంత ప్రజలు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందంజలో వున్నారు. నైజాం నిరంకుశ పాలనలో, ఉర్దూ మీడియం చదువుల వల్ల, ఉర్దూలో పరిపాలన వల్ల, అరకొర విద్యావకాశాల మూలంగా ఇక్కడి ప్రజలు అన్నిరంగాలలో వెనుకబడిపోయివున్నారు.

వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీలు కావాలంటారు.


ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలు ఏవిధంగానూ సమ ఉజ్జీలు కావు.
ఆంధ్ర ప్రదేశ్‌ అనే బండికి ఒక పక్క ఒంగోలు గిత్తను, మరో పక్క తెలంగాణా బక్కెద్దును కట్టినట్టయింది. అందుకే ఆ బండి నడక అవకతవకగా సాగుతూ వచ్చింది. ఒక ప్రాంత ప్రజలు విపరీతంగా లబ్ది పొందుతుంటే మరో ప్రాంత ప్రజలు అడిగేవాడు లేక అన్నివిధాలా నష్టపోతూ వచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడ్డ మరుక్షణం నుంచే ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణాకు ఆంధ్ర ప్రాంత వాసుల వలస ఉప్పెనలా మొదలయింది.
అక్కడ ఒక ఎకరం అమ్మితే ఇక్కడ వంద ఎకరాలు లభించే పరిస్థితి వుండటంతో రైతులు కూడా ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ఇక్కడ ఊరూరా భూములు సొంతం చేసుకుంటూ చవ్చారు. ఎన్ని ఒప్పందాలు ఎన్ని నియమ నిబంధనలు వున్నా తెలంగాణాలో వాటిని పట్టించుకునే, వలసలను అడ్డుకునే నాధుడే లేకుండా పోయాడు.

ఇట్లా జరుగుతుందనే అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహూృ ఆంధ్ర - హైదరాబాద్‌ రాష్ట్రాల విలీనాన్ని మొదట్లో అంగీకరించలేదు. చివరికి ఒత్తిళ్లకు తలొగ్గి బలవంతంగా రెండు రాష్ట్రాలనూ విలీనం చేస్తూ ''ఒక గడుసు అబ్బాయికి - ఒక అభం శుభం తెలియని అమాయక అమ్మాయిని కట్టబెడ్తున్నాం. ఈ కాపురం ఎన్నాళ్లు సాగుతుందో తెలియదు. ఒకవేళ ఇద్దరికీ కుదరకపోతే ఎప్పుడైనా సామరస్యంగా విడిపోవచ్చు '' అంటూ పెళ్లినాడే పెటాకుల మంత్రం జపించాడు.

నెహూృ అన్నట్టే అయింది.

పూలదండలు మార్చుకునే వరకు బుద్ధిగా వున్న పెళ్లికొడుకు ఆ మరుక్షణం నుంచే తన స్వార్థ విశ్వరూపం చూపించడం మొదలుపెట్టాడు. ఉపముఖ్యమంత్రి పదవి, పెద్దమనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు, తెలంగాణా అభివృద్ధి మండలి అనుమతి లేకుండా ఇతర్లు ఇక్కడి భూములు కొనకూడదన్న నిబంధనలు వగైరా వగైరా అన్నీ గాలికి కొట్టుకు పోయాయి.

ఒక్క హైదరాబాదుకే కాదు తెలంగాణా లోని అన్ని (10) జిల్లాలకు ఆంధ్ర, రాయలసీమ వాసుల వరదలా వెల్లు వెత్తారు. తెలంగాణా నుంచి ఆంధ్రరాయలసీమ జిల్లాలకు మాత్రం ఆవిధమైన వలసలు లేవు. అందుకు ఆస్కారం కూడా లేదు. ఉద్యోగాలు, నిధులు, నదీజలాలు అన్నింటా తెలంగాణాకు అన్యాయమే జరుగుతూ వచ్చింది. దాంతో 1969లో ఒకసారి పెద్ద ఎత్తున ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తలెత్తింది. దానిని రాష్ట్రంలోని బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం, కేంద్రంలోని ఇందిరా గాంధీ ప్రభుత్వం పాశవికంగా అణిచేశాయి. దాదాపు 370 మందిని చంపి, అప్పటి ఉద్యమ నాయకుడైన చెన్నారెడ్డినీ ప్రజాప్రతినిధుల్నీ టోకున కొనుగోలు చేసి, వారికి కొన్ని మంత్రి పదవులిచ్చి మరీ ఈ బలవంతపు సమైక్యతా కాపురాన్ని యధాప్రకారం బలవంతంగా కొనసాగేట్టు చేశారు.

2001 లో ప్రత్యేక తెలంగాణా వాదం మళ్లీ ఫీనిక్స్‌ పక్షిలా ప్రాణం పోసుకుంది. తెలంగాణా ఉద్యమం కెసిఆర్‌ ఆమరణ నిరాహార దీక్షతో 1969 కంటే మరింత పెద్ద ఎత్తున ప్రజా ప్రభంజనంలా మారింది. పైకి అన్ని పార్టీలూ మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదు, మేం తెలంగాణాకు అనుకూలం అనే పాట పాడుతున్నప్పటికీ లోపాయికారిగా ప్రత్యేక తెలంగాణా డిమాండ్‌కు తూట్లు పొడిచేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి.

ఒకే పార్టీకి నాలుగు నాలికలు

ఒకే పార్టీలో కొందరు ఆంధ్ర ప్రదేశ్‌ సమైక్యంగా వుండాలంటారు.
మరికొందరు విభజిస్తే ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ మూడు రాష్ట్రాలుగా విభజించాలంటారు.
ఇంకొందరు ఉత్తరాంధ్రను వేరే రాష్ట్రం చేయాలంటారు.

మరీ విచిత్రంగా తెలంగాణాకు చెందిన ఒకరిద్దరు ప్రజానాయకమ్మణ్యులు గ్రేటర్‌ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తెస్తున్నారు..

రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లోని అనేక మున్సిపాలిటీలను, పంచాయితీలను లాక్కుని ఈమధ్యనే గ్రేటర్‌ హైదరాబాద్‌ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆ ప్రాంతాల ప్రజల అభిప్రాయ సేకరణ జరపకుండా ఏకపక్షంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ని ఏర్పాటు జరిగింది.

ఇప్పుడేమో ఇక్కడి సెటిలర్స్‌కి తెలంగాణా రాష్ట్రంలో భద్రత వుండదట. కేంద్ర పాలిత ప్రాంతమైతేనే వారికి రక్షణ వుంటుందట.
వారికి ఎవరి నుంచి భద్రత వుండదు.
హైదరాబాద్‌లోని తెలంగాణా వాసుల నుంచేనా?
అదే నిజమైతే హైదరాబాద్‌ కేంద్ర ప్రాంత పాలితమైతే వారి నుంచి ముప్పు ఎలా వుండకుండా పోతుంది.
హైదారాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయగానే తెలంగాణా వాసుల్ని హైదరాబాద్‌ నుంచి మిగతా తెలంగాణా రాష్ట్రంలోకి తరిమేసి హైదరాబాద్‌లో కేవలం సెటిలర్స్‌నే వుంచుతారా?
హైదరాబాద్‌ మీద ఇక్కడి మూలవాసులకు ఎట్లాంటి హక్కూ లేదా?
వారి భద్రతకు ఎవరు హామీ ఇస్తారు? ఎట్లా... ఏ ప్రాతిపదికన ఇస్తారు?

మిగతా జిల్లాల్లోని సెటిలర్స్‌ మాటేమిటి?


సెటిలర్స్‌ ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే లేరు.
తెలంగాణా లోని ప్రతి జిల్లాలో వున్నారు.
ఒక్కరో ఇద్దరో కాదు వేలు, లక్షల సంఖ్యలో వున్నారు.
మరి వారి భద్రత మాటేమిటి?
సెటిలర్స్‌ పాలిటి హీరోలు, మూలవాసుల పాలిటి విలన్లుగా మారుతున్న మూలవాస నేతలు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.

కేంద్ర పాలిత ప్రాంతమైతేనే ప్రభుత్వం సెటిలర్స్‌కి రక్షణ కల్పించగలుగుతుంది, ప్రత్యేక రాష్ట్ర మైతే ప్రభుత్వం సెటిలర్స్‌కి రక్షణ కల్పించలేదు అని ఎట్లా చెప్పగలుగుతున్నారు.?
ఒకవేళ అదే వాస్తవమైతే మొత్తం తెలంగాణాలోని సెటిలర్స్‌ రక్షణ కోసం మొత్తం తెలంగాణాని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేయకుండా కేవలం హైదరాబాద్‌నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు.

మద్రాస్‌లో గానీ, బెంగుళూరులో గానీ ఆంధ్ర సెటిలర్స్‌కి ఎప్పుడైనా భద్రత సమస్య ఎదురయిందా? అప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. అసలు ఈ వాదనే ఒక జిత్తుల మారి వాదన తప్ప న్యాయబద్ధమైన వాదన కాదు.

మద్రాస్‌ ప్రావిన్స్‌ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు కూడా ఇట్లాగే మద్రాస్‌ నగరంలో భాగం కావాలని నానా యాగీ చేశారు. ఆమరణ నిరాహార దీక్ష మొదలైన ఐదో రోజే నెహూృ ప్రత్యేక ఆంధ్ర డిమాండ్‌ను అంగీకరిస్తున్నట్టు పార్లమెంట్‌లో సూత్రప్రాయంగా ప్రకటించాడట. కానీ మద్రాస్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలన్న గొడవ వల్లే విపరీతమైన కాలయాపన జరిగి పొట్టి శ్రీరాములు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.

మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలు విడిపోయేటప్పుడు ముంబాయి విషయంలోనూ ఇట్లాంటి గొడవే జరిగింది.
కానీ వాస్తవాన్ని గ్రహించి గుజరాతీలు తమ వాదనను కట్టిపెట్టి ముంబాయిని వదిలి వెళ్లి అహమ్మదాబాద్‌ను రాజధానిగా అభివృద్ధి చేసుకున్నారు.

చివరికి ఇక్కడా అదే పునరావృతమవుతుంది.
హైదరాబాద్ రాష్ట్రం అంటే తెలంగాణా రాష్ట్రమే . తెలంగాణా రాష్ట్రం అంటే హైదరాబాద్ రాష్ట్రమే. ఈ రెంటినీ విడదీయడం అసంభవం.
అధర్మం అంతరిస్తుంది. న్యాయం గెలుస్తుంది.
తెలంగాణా స్వప్నం త్వరలోనే నిజమవుతుంది!

..........

11 comments:

 1. పచ్చగా పెరుగుతున్న పైరును ప్రాంతీయ వాదమనే తెగులు కబళిస్తోంది.

  ReplyDelete
 2. you useless fellow shut your blog, go and die for your KCR.

  ReplyDelete
 3. ఓ తెలబానూ! మీ జిన్నాకు మీకు బుద్దిలేదు. మూర్ఖపు గాడిదలు.

  ReplyDelete
 4. మీ వాదన ప్రకార౦ నాకు అర్థమయి౦ది ఇది.

  ***********
  అప్పటి హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రస్తుత కర్ణాటక, మహారాష్ట్రల్లోని కొన్ని జిల్లాలు కలిసి వుండేవి.హైదరాబాద్ రాష్ట్రం అంటే తెలంగాణా రాష్ట్రమే . తెలంగాణా రాష్ట్రం అంటే హైదరాబాద్ రాష్ట్రమే
  --
  కాని ఇప్పుడు అమాయకులైన తెలుగు ప్రజలను మాత్రమే "ఆ పది" జిల్లాలకోస౦ పీడిస్తున్నారు. తెలుగు వారిచే తెలుగు వారు పీడి౦పబడట౦ మన జాతికి గర్వకారణ౦.
  ************
  ఆంధ్ర నేతలు '' మీది తెలుగే ... మాది తెలుగే '' అంటూ కలిసుందాం రా అంటూ సమైక్య గీతం మొదలుపెట్టారు.
  --
  కాని తెల౦గాణ నేతలు అప్పటికీ వేర్పాటు వాదాన్ని తమ మనసులో౦చి చెరపలేదు
  ***********
  "అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహూృ పెళ్లినాడే పెటాకుల మంత్రం జపించాడు".
  --
  విలీన౦ చేసినా విభజన కుట్రకు ఆనాడే కా౦గ్రెస్ నాయకులు బీజ౦ వేశారన్న మాట.
  ***********
  ఉపముఖ్యమంత్రి పదవి, పెద్దమనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు, తెలంగాణా అభివృద్ధి మండలి అనుమతి లేకుండా ఇతర్లు ఇక్కడి భూములు కొనకూడదన్న నిబంధనలు , లా౦టి అధికారాలెన్ని ఉన్నా, అక్కడి నాయకులు తమ ప్రజలను దద్దమ్మలను చేశారు.
  ************
  "ఆ ప్రాంతాల ప్రజల అభిప్రాయ సేకరణ జరపకుండా ఏకపక్షంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ని ఏర్పాటు జరిగింది. "
  --
  మరిప్పుడు హైదరాబాద్ తెల౦గాణాలో ఉ౦డాలో వద్దో ప్రజల అభిప్రాయ సేకరణ జరుపుదామా?
  అసలు తెల౦గాణా కావాలో వద్దో ప్రజల అభిప్రాయ సేకరణ జరుపుదామా?
  ************
  "సెటిలర్స్‌కి తెలంగాణా రాష్ట్రంలో భద్రత వుండదట.వారికి ఎవరి నుంచి భద్రత వుండదు.
  హైదరాబాద్‌లోని తెలంగాణా వాసుల నుంచేనా?"
  --
  ప్రమాద౦ తెల౦గాణ సెటిలర్స్ వల్ల కాదు, తెల౦గాణ వాళ్ళ ను౦చి.
  ఇక్కడ సెటిలర్స్ అ౦టే, తెల౦గాణ, కోస్తా, రాయలసీమల ను౦చి హైదరాబాద్ కు వలస వచ్చిన వారు.
  *************
  సెటిలర్స్‌ ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే లేరు.
  తెలంగాణా లోని ప్రతి జిల్లాలో వున్నారు.
  --
  సెటిలర్స్‌ భారత దేశ౦ లోని ప్రతి జిల్లాలోనూ, గ్రామ౦లోనూ ఉన్నారు.
  **************
  హైదరాబాద్‌ మీద ఇక్కడి మూలవాసులకు ఎట్లాంటి హక్కూ లేదా?
  --
  హైదరాబాద్ మూలవాసుల౦టే ఎవరూ? తెల౦గాణా వాళ్ళా? నిజాములా? హైదరాబాద్ ను మూల౦గా చేసుకున్న ప్రజలా?
  ***************
  "మొత్తం తెలంగాణాని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేయకుండా కేవలం హైదరాబాద్‌నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు."
  --
  మేమే మా తెల౦గాణాను అభివృద్ది చేసుకు౦టా౦ అనే వేర్పాటు నేతలు, అభివృద్ది చె౦దిన హైదరాబాద్ లేకపోతే తెల౦గాణే వద్దని ఎ౦దుక౦టున్నారు?
  **************
  నిజ౦గా తెల౦గాణ అవసరమయితే దాదాపు 370 మందిని చంపి, అప్పటి ఉద్యమ నాయకుడైన చెన్నారెడ్డినీ ప్రజాప్రతినిధుల్నీ టోకున కొనుగోలు చేసినప్పుడే ప్రజలు తమ నేతల్ని చెప్పుతో కొట్టి తెల౦గాణను ఏర్పాటు చేసుకునేవారు.
  --
  ఇది ప్రజా ఉద్యమ౦ ముమ్మాటికీ కాదు. రాజకీయ రాబ౦దుల ఉన్నాదమే అ౦దుకే ప్రతి సారీ విఫలమవుతో౦ది.
  ***************
  అధర్మం అంతరిస్తుంది. న్యాయం గెలుస్తుంది.
  --
  ఇది నిజమే అయితే, ఆ౦ధ్ర సమైక్య౦గానే ఉ౦టు౦ది.
  ***************
  జై తెలుగుతల్లి

  ReplyDelete
 5. పాపం పిచ్చి ఆంధ్రా వాళ్లు, కొత్త రాష్ట్రం పేరుతో రాజధానినే ఎత్తుకెల్లినా చోద్యం చూస్తూ కూర్చున్నారు, పోనిలే అన్నదమ్ములే అని. ఇప్పుడు వలస వాదులు అన్న అపవాదు ఒకటి మళ్లీ వాళ్లకి.

  ReplyDelete
 6. బావున్నాయండి మీ వాదనలు. మొత్తం తెలంగాణవాళ్ళందరినీ - చెన్నారెడ్డీ, ఆయన మామ కూడా అమాయకులే!! - అమాయకులకింద జమకట్టేసి, ఆంధ్రులందరినీ గడుసువాళ్ళుగా, దాదాపు మోసగాళ్ళుగా చిత్రించారు. మీరనే కాదులెండి, దాదాపు తెలంగాణవాదులంతా ఇలాగే మాట్టాడుతారు. ఈ రకంగా మాట్టాడి కూడా "ఎందుకు మీరు మా కోరికను వ్యతిరేకిస్తున్నారు" అంటూ ప్రశ్నిస్తారు. అమాయకులు మీరో మేమో అర్థం కాదు.
  బాగా అభివృద్ధి చెందిన హైదరాబాదు మాకు మాత్రమే కావాలని కోరుతున్నారు. దాని అభివృద్ధికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాల తరబడి ఇతర ప్రాంతాలను పక్కకు పెట్టిందని తెలిసీ! దాని అభివృద్ధిలో యావదాంధ్ర జాతికీ పాత్ర ఉందని తెలిసీ! గడుసరులెవరు సార్?

  తెలంగాణ విడిపోతే హై.తో కూడిన తెలంగాణకీ, మిగతా ప్రాంతానికీ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అంతరాలెలా ఉంటాయో మీరేమైనా లెక్క వేసారా? తెలంగాణ స్థూల ఉత్పత్తిలో కొత్త రాష్ట్ర ఉత్పత్తి (కొత్తగా ఏర్పడేది తెలంగాణ కాదు, కోస్తా సీమలతో కూడిన రాష్ట్రమే!) మూడో వంతు కూడా ఉండదు సార్! ఈ లెక్క వెయ్యడానికి మనకు పెద్ద ఆర్థిక పరిజ్ఞానమేమీ అవసరం లేదు.. 2005లో రాష్ట్ర ఉత్పత్తి 58 బిలియను డాలర్లు కాగా, అందులో హైదరాబాదు + దాని చుట్టుపక్కల ప్రాంతాల ఉత్పత్తి 37 బిలియనులు.(http://en.wikipedia.org/wiki/States_of_India_by_GDP) అంటే 66 శాతం వాటా! ఈ సంపదా, ఇక్కడ నుండి వచ్చే ఆదాయమూ ఏదీ కొత్త రాష్ట్రానికి చెందదు. ఇప్పుడు చెప్పండి అమాయకులెవరు? సమైక్యవాదులా, హై. మాకు మాత్రమే చెందాలంటున్నవాళ్ళా?

  ReplyDelete
 7. నేనేమీ ప్రత్యేక తెలంగాణాకి వ్యతిరేకం కాదు. వరంగల్ ని రాజధాని చేస్తే పక్కనే ఉన్న హనుమకొండ, కాజీపేట కూడా డెవెలప్ అవుతాయి. రామగుండంని రాజధాని చేస్తే పక్కనే ఉన్న గోదావరిఖని, పెద్దపల్లి కూడా డెవెలప్ అవుతాయి. ఒకప్పుడు సికందరాబాద్ హైదరాబాద్ కి పది కిలోమీటర్లు దూరంలో ఉండేది అని మా మామయ్య చెప్పాడు. ఇప్పుడు సికందరాబాదే కాదు, మౌలా అలీ, లాలాగూడా కూడా హైదరాబాద్ లో భాగాలే. రాష్ట్రం మొత్తాన్నీ నిర్లక్ష్యం చేసి హైదరాబాద్ డెవెలప్మెంట్ కోసం ఖర్చు పెట్టడం వల్లే హైదరాబాద్ ఇంత డెవెలప్ అయ్యింది. హైదరాబాద్ కి ప్రత్యామ్నాయంగా వరంగల్ నో, రామగుండంనో డెవెలప్ చేస్తే తెలంగాణాకే మంచిది కదా. పాలకవర్గం వాళ్ళు రాష్ట్రం మొత్తాన్నీ నిర్లక్ష్యం చేసి రాజధాని డెవెలప్మెంట్ కే ఎక్కువ ఖర్చు పెట్టారని అందరికీ తెలుసు. శ్రీకాకుళంని రాజధాని చేసి ఉంటే శ్రీకాకుళం, ఆముదాలవలస పట్టణాలు కూడా హైదరాబాద్, సికందరాబాద్ ల లాగ ట్విన్ సిటీస్ అయ్యేవి. బొబ్బిలిని రాజధాని చేసి ఉంటే బొబ్బిలి, సాలూరు పట్టణాలు కూడా ట్విన్ సిటీస్ అయ్యేవి. తమిళ నాడు, కర్నాటకలలో కూడా జరిగింది ఇదే. మా మామయ్య చదువుకునే రోజుల్లో తాంబరం చెన్నైకి శాటిలైట్ టౌన్ గా ఉండేది. ఇప్పుడు తాంబరం చెన్నైలో అంతర్భాగం. యలహంక కూడా బెంగళూరుకి శాటిలైట్ టౌన్ గా ఉండేది. ఇప్పుడు యలహంక బెంగళూరు నగరంలో భాగం. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఎలుకలని పట్టుకుతినే యానాది కులస్తులు ఉన్నట్టే తమిళ నాడులోని కావేరీ పరివాహక ప్రాంతాలలో కూడా ఎలుకలని పట్టుకుతినేవాళ్ళు ఉన్నారు. రాష్ట్ర రాజధానుల డెవెలప్మెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టినా రాష్ట్రాలలోని మెజారిటీ ప్రజల జీవితాలు మారవు.

  ReplyDelete
 8. బాగుందండి బాగుంది మొత్తం మీద కష్టపడి చాలా సమాచారం సేకరించి ఎంతో సమయం వెచ్చించి రాశారు.నిజంగా మీరు చదువుకున్న వారైతే రాజకీయనాయుకులు ఆలొచించినట్లు ఆలోచించరు.ఒక రాజకీయ నాయకుడు వేసిన ఎత్తుగడని అర్థం చేసుశుకోకుండా అనవసరంగా విధ్యర్థుల జీవితాలని నాశనం చేసుకుంతున్నారని గ్రహిచలేక పోతున్నారు.తెలుగుదేశం ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి ఇవ్వలేదని తన స్వార్థ ప్రయోజనాల కోసం దొంగ నాటకాన్ని మొదలుపెట్టిన ఆ వ్యక్తిని సమర్ధిస్తున్నారే ఇది ఎంత వరకు న్యాయం.అభివృద్ది జరగలేదు అన్నారె అది ఎంత వరకు నిజం .......? ఒక జాతీయ సాంకేతిక సంస్థ(ణీట్) , భారతీయ సాంకేతిక సంస్థ(ఈఈట్) ఏ ప్రాంతంలో ఉన్నవి.....? వీటి వలన ఎంత మంది ఉపాధి పొందుతున్నారు? వీటికి సమాధానం ఆలోచించండి.నిజాముల పరిపాలన తప్పును గ్రహించక్ ...ఎవరో వచ్చరు , ఎదో తెసుకెళ్ళారు అని తెగ బాధ పడుతున్నారు ఎంత వరకు న్యాయం? వరి కోస్తా ఆంధ్రా ప్రాంతం లో పండదం వలన రాష్త్రంలోని అన్ని ప్రాంతాల వారు బియ్యం ప్రక్క రాష్త్రాల వారికంటే తక్కువగా పొందుతున్నారు. అదె విడిపోతె ఇది సాద్యమేన? అదె మీరు అన్నట్లు హైదరాబాదు రాష్ట్రంగా ఉండి ఉంటే ఇప్పుడు ఉన్న ఏశాన్య రాష్త్రాల మాదిరిగా ఉండేది అప్పటీ హైదరాబాదు రాష్ట్రం.కలిసి ఉండబట్టె ఏరొజు ప్రపంచలో అందరికి హైదరాబాదు అంటే విలువ...తెలుగోడు అంటే అభిమానం,భయం. ఒక్కసారి బయటా ప్రప్మచాన్ని కనుక్కొండి తెలుస్తుంది.కాబట్టీ ఇంకనైన ఒకసారి విశదీకరించి ఆలోచించండి.

  ReplyDelete
 9. చదువరి, పెదరాయుడు, ప్రవీణ్ తదితర మిత్రులకు అజ్నాతలకు ధన్యవాదాలు.

  తెలంగాణా ప్రజల ఆకాంక్షని వేర్పాటు వాదం , ప్రాంతీయ వాదం అని చరిత్ర తెలియని వాళ్ళు , స్వప్రయోజన పరులు మాత్ర మే ఆడిపోసుకుంటారు. తెలంగాణా ప్రజలు తమ రాష్ట్రం తమకు కావాలని కోరుకోవడం వేర్పాటు వాదమైతే , ఆంధ్ర రాయలసీమ ప్రజలు ఆనాడు మద్రాసు నుంచి విడిపోవాలనుకోవడం కూడా వేర్పాటు వాదం, ప్రాంతీయ వాదమేనా మరి ? ?

  పెదరాయుడు గారు ,
  ప్రజాభిప్రాయ సేకరణ జరిపితే అసలు ఆంధ్ర తెలంగాణా విలీనమయ్యేవే కాదండీ . "మాట తప్పిన ఎం ఎల్ ఎ లను , ఎం పీ లను " రీ కాల్ చేసే హక్కు ప్రజలకు వున్నా ఎప్పుడో తెలంగాణా వచ్చేది .

  చదువరి గారూ
  ఆరోజు నెహ్రు మాట విని ఆంధ్ర నేతలు మీ కర్నూలు రాజధానిని అభివృద్ది చేసుకుంటూ ఉండిపోతే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడి ఉండేదే కాదు కదా .
  అద్దె ఇంట్లో ఎన్నాళ్ళున్నా , చెట్లు నాటి, సున్నాలు వేసి ఎంత అందంగా తీర్చిదిద్దినా ఆ ఇల్లు మన సొంతమెట్లా అవుతుంది?
  రాష్ట్ర విభజన జరిగినప్పుడు మద్రాస్ విషయం లోనూ , బొంబాయ్ విషయంలోనూ ఇట్లాంటి వాదనలే వచ్చిన విషయం మీకు తెలియంది కాదు .

  భాషా ప్రయుక్త రాష్ట్రాల వాదన వల్ల అప్పటి వరకూ ఎంతో పెద్ద రాష్ట్రం గా వున్న హైదరాబాద్ రాష్ట్రం (పైన మాప్ చూడండి ) అన్యాయంగా చిన్న రాష్ట్రం అయిపొయింది.
  ఆంధ్రాలో విలీనమై మరింత తీవ్రంగా నష్టపోయింది.
  తెలంగాణాకు నదీ జలాల్లో రావలసిన వాటా న్యాయంగా ఇచ్చివుంటే ఈ యాభై నాలుగేళ్ళలో తెలంగాణా ఎంత సశ్య శ్యామలాంగా అయి ఉండేదో కూడా ఒక్కసారి నిజాయితీగా లెక్కలు వేయండిసార్.

  ప్రవీణ్ కమ్యూనికేషన్స్
  మీ సలహాకి తెలంగాణా ప్రజల తరఫున ధన్యవాదాలు .

  ప్రవీణ్
  ఇంకా తెలంగాణా ఉద్యమం ఒక మంత్రి పదవి రాని వాడి వ్యక్తిగత స్వార్ధ ఉద్యమంగానే భావిస్తున్నారా . ? !
  ఒకసారి " ప్రత్యెక తెలంగాణా : ఒక సమైక్యవాది ఆత్మ విమర్శ " టపా చదవండి.

  ReplyDelete
 10. అద్దె ఇల్లా? గుంటూరు నుండో, తిరపతి నుండో వచ్చి ఇక్కడ ఉన్నవాడు అద్దె ఇంట్లో ఉండేవాడైతే, కరీమ్‌నగరునుండో, నిజామాబాదు నుండో వచ్చి ఇక్కడ ఉన్నవాడు కూడా అద్దె ఇంట్లో ఉన్నట్టేనండి. ఏనాడైతే రెండు ప్రాంతాలూ ఏకమై హై. రాజధానిగా ఒకే రాష్ట్రంగా ఏర్పడ్డాయో, ఆనాడే హై. అందరిదీ అయిపోయింది. అందరికీ స్వంతమైపోయింది. ఇక్కడ యాదగిరికి ఎంత హక్కుందో సుబ్బారావుకు, అప్పలకొండకు, మునిరత్నానికి కూడా అంతే హక్కుంది.

  పోతే, ఆనాడు మా కర్నూలును వదులుకోకుండా ఉండాల్సింది అన్నారు చూసారూ.. నిజమే వదులుకోకుండా ఉండాల్సింది. అయిందేదో అయిపోయిందిలెండి, ఇక చేసేదేమీ లేదు. ఇకముందు అలా జరగనివ్వకుండా జాగర్తపడతాంలెండి. ఇప్పుడు హై.ను వదిలేసుకోని పోతే, ఓ పాతికేళ్ళు పోయాక 'ఆనాడు సోనియా చెప్పిన మాటవిని హై.ను వదులుకుని పోకుండా ఉండాల్సింది కదా' అని మరొకరిచేత చెప్పించుకోకుండా ఉంటాం.

  "...మద్రాస్ విషయం లోనూ , బొంబాయ్ విషయంలోనూ ఇట్లాంటి వాదనలే వచ్చిన విషయం... " -నిజమేనండి, మద్రాసు రాష్ట్రం నుండి, బొంబాయి రాష్ట్రం నుండి విడిపోతామని పోయినవాళ్ళు రాజధానిని వదిలేసి పోయి, తమ రాజధానిని ఏర్పాటు చేసుకున్నారు. అదే న్యాయం ప్రకారం ఇప్పుడు కూడా విడిపోతామంటున్న తెలంగాణ కూడా హై.ను వదిలేసి పోవాలి కదా మరి!

  ReplyDelete
 11. ‘‘అక్కడ ఒక ఎకరం అమ్మితే ఇక్కడ వంద ఎకరాలు లభించే పరిస్థితి వుండటంతో రైతులు కూడా ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ఇక్కడ ఊరూరా భూములు సొంతం చేసుకుంటూ చవ్చారు. ఎన్ని ఒప్పందాలు ఎన్ని నియమ నిబంధనలు వున్నా తెలంగాణాలో వాటిని పట్టించుకునే, వలసలను అడ్డుకునే నాధుడే లేకుండా పోయాడు.’’

  ఏమండి.. ఇక్కడ మీరు పది ఎకరాలమ్మి ముంబయిలో ఓ గజం కొనుక్కొండి. మిమ్మల్లి ఎవడైనా వద్దంటాడా... ఎందుకండి పనికి రాని మాటలు. అడ్డుకునే నాధుడు లేకపోయాడా అని అంటారేంటి. . మా స్నేహితులు ఓ పది మంది హర్యానాలో ఫ్యాక్టరీ పెట్టారు. అక్కడేవరైనా మీలాగా వాపోతే వాళ్ల పరిస్థేతేంటి.

  ReplyDelete