Sunday, December 13, 2009

ప్రత్యేక తెలంగాణా - ప్రజాకవి కాళోజీ కవితలుప్రత్యేక తెలంగాణా - ప్రజాకవి కాళోజీ కవితలు

ఉస్మానియా విద్యార్థులు 1969లో వీరోచితంగా సాగించిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కాలంలో ప్రజాకవి కాళోజీ అనేక ఉత్తేజకరమైన కవితలు రాశారు. నలభై సంవత్సరాల అనంతరం ప్రధానంగా అదే విద్యార్థుల పోరాట స్ఫూర్తి కారణంగా ప్రత్యేక తెలంగాణా స్వప్నం సాకారం కాబోతున్న తరుణంలో ఒకసారి వాటిని స్మరించుకుందాం.

తెలంగాణ వేరైతే


తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?

తెలంగాణ వేరైతే
కిలోగ్రాము మారుతుందా?
తెలంగాణ వేరైతే
తెలివి తగ్గిపొతుందా?

తెలంగాణ వేరైతే
చెలిమి తుట్టి పడుతుందా?
తెలంగాణ వేరైతే
చెలిమి లెండిపొతాయా?

కులము తగ్గిపొతుందా
బలము సన్నగిలుతుందా
పండించి వరికర్రల
గింజ రాలనంటుందా?

రూపాయికి పైసాలు
నూరు కాకపొతాయా?
కొర్టు అమలు అధికారము
ఐ.పి.సి. మారుతుందా?

పాకాల, లఖ్నవరం
పారుదలలు ఆగుతాయా?
గండిపేటకేమైనా
గండితుటు పడుతుందా?

ప్రాజెక్టులు కట్టుకున్న
నీరు ఆగనంటుందా?
పొచంపాడు వెలసి కూడ
పొలము లెండిపొతాయా?

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
–కాళోజీ
...............

దోపిడి చేసే ప్రాంతేతరులను...

దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం

దోస్తుగ ఉండే వారితొ మేమును
దోస్తే చేస్తం - ప్రాణమిస్తం
ఎంతకు అంత అన్న ధోరణితో
చింతమాని బ్రతుకును సాగిస్తం

తెలంగాణమిది - తెలంగాణమిది
తీరానికి దూరాన వున్నది
ముంచే యత్నం చేస్తే తీరం
మునుగును తానే - మునుగును తప్పక
-కాళోజి
....................

నిర్వాకం


నమ్ముకొని పెత్తనము ఇస్తే
నమ్మకము పోగొట్టుకొంటివి
కుప్పకావలి ఉండి కట్టలు
తప్పదీస్తివి ముద్దెరేస్తివి

సాటివాడు చేరదీస్తే
నోటినిండా మన్ను గొడ్తివి
పదవి అధికారముల బూని
పదిలముగ తల బోడి జేస్తివి

దాపునకు రానిస్తె చనువుగ
టోపి పెడితివి లాభపడితివి
అన్నవై తమ్ముళ్ల తలలను
నున్న జేస్తివి మురియబడితివి

తొత్తులను చుట్టూర జేర్చుక
పెత్తనాలు చేయబడితివి
‘పొచంపాడు’ పథకము
కూచికూచి చేసేస్తివి

‘దొంగ ముల్కి’ సనదులిచ్చి
దొరతనమ్ము వెలిగిస్తివి
తమ్ములను ఇన్నాళ్లబట్టి
వమ్మజేస్తివి తిన్నగుంటివి

ఎన్నిసార్లు మొత్తుకున్నను
అన్నవయ్యును గమ్మునుంటివి
అన్న అధికారమునకు తగిన
న్యాయబుద్దిని కోలుపోతివి

చిలిపి చేష్టలు చేసి ఇప్పుడు
చిలుక పలుకలు పలుకుచుంటివి
–కాళోజి
................

పోదాం పదరా!!

పదరా పదరా పోదాం పదరా
తెలంగాణ సాధిద్దాం పదరా
దొంగల దూరం కొడదాం పదరా
వేరే రాజ్యం చేద్దాం పదరా || పదరా ||

షాట్లకు బెదరక చెదరక పదరా
హిరణ్యకశిపుడు హడలగ పదరా
నర్సింహుడవై ముందుకు పదరా
పదరా పదరా … || పదరా ||

అధికృత హింసనే పాలన అంటే
ప్రహ్లాదుని హేళన చేస్తుంటే
ప్రత్యక్షంగా నర్సింహులమై
ప్రతిహింసకు పాల్పడదాం || పదరా ||

హిరణ్యకశివుల పొట్టలు చీల్చి
ఫెగుల మాలలు చేద్దాం పదరా
పదరా పదరా ….

వేర్పడదామని ఇద్దరికుంటే
కాదను వారిని కాలదన్నమా
వేరే రాజ్యం చేయబూనమా
పదరా పదరా …..

–కాళోజి
................

నాగరికుడా ‘విను’...

నా నోటికాడి బుక్కను
నాణ్యంగా కాజేసిన
నాగరికుడా ‘విను’

నా నాగటి చాలులోన
నాజూకుగ పవ్వళించి
నను కాటేసిన
నాగరికుడా విను?

నావారల చేరదీసి
నానా విధ బోధలతో
నాణ్యంగా నన్ను కొరిగి
నలుబదైదు సంతకాల
నాటకమాడిన నటుడా
నాగరికుడా విను!

కోటిన్నర మేటి ప్రజల
గొంతోక్కటి గొడవొక్కటి
తెలంగాణ వెలిగి నిలిచి
ఫలించెలె భారతాన
భరత మాతాకీ జై
తెలంగాణ జిందాబాద్

-కాళోజి
.............

తెలంగాణ ‘యాస’ నెపుడు యీసడించు

తెలంగాణ ‘యాస’ నెపుడు
యీసడించు భాషీయుల
‘సుహృద్భావన’ ఎంతని
వర్ణించుట సిగ్గుచేటు

వాక్యంలో మూడుపాళ్ళు
ఇంగ్లీషు వాడుకుంటు
తెలంగాణీయుల మాటలో
ఉర్దూపదం దొర్లగానే
హిహీ అని ఇగిలించెడి
సమగ్రాంధ్ర వాదులను
ఏమనవలెనో తోచదు.

‘రోడ్డని’ పలికేవారికి
సడకంటె ఎవగింపు
ఆఫీసని అఘొరిస్తూ
కచ్చేరంటే కటువు
సీరియలంటే తెలుగు
సిల్సిల అంటే ఉరుదు

సాల్టు, షుగర్, టిఫిన్ తెనుగు
షర్కర్, నాష్తంట్ కొంప మునుగు
టీ అంటే తేట తెనుగు
చా అంటే ‘తౌరక్యము’
పొయినడంటే చావు
తోలడమంటే పశువు

దొబ్బడమంటే బూతు
కడప అంటే ఊరి పేరు
త్రోవంటె తప్పు తప్పు
దోవంటేనే దారి.

బొక్కంటే ఎముక కాదు
బొక్కంటె పొక్క తెలివి
మందలిస్తె తిట్టినట్లు
చీవాట్లు పెట్టినట్లు
పరామర్శ కానేకాదు

బర్రంటె నవ్వులాట
గేదంటేనే పాలు
పెండంటె కొంప మునుగు
పేడంటేనే ఎరువు

రెండున్నర జిల్లాలదె
దండి భాష తెలుగు
తక్కినోళ్ల నోళ్ల యాస
త్రొక్కి నొక్కి పెట్టు తీర్పు

వహ్వారే! సమగ్రాంధ్ర
వాదుల ఔదార్యమ్ము
ఎంత చెప్పినా తీరదు
స్నేహము సౌహర్ద్రమ్ము

భోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
భోయి భీమన్న ఒకడు
బెజవాడ గోపాలుని
సభ్యత నెర్గిన ఆంధ్రుడు

భోయీ భీమన్న ఒకడు
పదారణాల ఆంధ్రుడు
తెనుగు సభ్యత సంస్కృతి
ఆపాద మస్తకంబు
నోరు విప్పితే చాలు
తెనుగు తనము గుబాళించు

కట్టుబొట్టు మాట మంతి
నడక ఉనికి ఒకటేమిటి
ఎగుడు దిగుడు ఊపిరిలో
కొట్టొచ్చే తెనుగు తనము
గోపాల కీర్తనమే జీవిక
పాపము అతనికి

ఉర్డంటే మండి పడెడి
పాటి తెనుగు ఆవేశము
జౌనపదుని లేఖ లేవో
జౌఇన రహిత ప్రాయంబున
వ్రాసినాడు అంతెకాని
తెలివిన పడి, వృద్ధదశలో
కాస్మా పాలిటన్ తనము
శిఖరోహణ అనుకొని
పరిణతి దశ నందు కొనగ
తాపత్రయ పడుచున్నడు

భోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
సమైక్యాంధ్రవాది వాడు
భీమశాస్ర్తి అని నాతో
పిలుపించు కొన్నవాడు
జానపదుని లేఖావళి
నాటి సఖుడు భీమన్న
-కాళోజి
............

ప్రత్యేక తెలంగాణ అంటే

ప్రత్యేక తెలంగాణ అంటే
పక్కలిరగ తన్నేందుకు
ఆ.ప్ర.రా. ప్రభుత్వాన్కి
అధికారము ఎక్కడిది?

ప్రజాస్వామ్య రాజ్యాంగం
పరిపాలన గల దేశము
ప్రజా మతము ప్రకటిస్తె
పట్టి కొట్టి చంపేస్తద?

వేలు లక్షలు ప్రజలు
జేలుకేగ సిద్ధపడితే
ఏర్పట్లు చేయలేక
లాఠీచార్జి పరిపాలన?

కాడెద్దుల ధోరణిలో
కూడని పనియే లేదా?
వినిగి వేసారి జనం
హింసకాండ తలబెడితే
కేంద్రానిది బాధ్యతంత

‘ప్రెస్టేజి’ పేర హింస
ప్రభుత్వాన్కి సబబైతె
ప్రాణిధర్మ హింసకాండ
ప్రజలకు కూడా సబబే

బ్రహ్మన్న చంపు చంపు
ఏ పాటి చంవుతావో
తూటాలు ఎన్నున్నయో
పేల్చుకో, ఆబాలం గోపాలం

చంపు చంపు చంపు అనుచు
బరి రొమ్ములతో బజార్లో
తూటాలను ఎదురుతాన్రు
ఒకటో రెండో వుంచుకో
తుదకు ఆత్మహత్యకైన
అక్కరకొస్తె నీకు, లేకుంటే
ప్రాణాలతో ప్రజల చేతికే
చిక్కితే నీకున్నది కుక్కచావు

తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తా
భరతమాతాకీ జై
తెలంగాణ జిందబాద్.

–కాళోజి
.................

సాగిపోవుటె బ్రతుకు...

సాగిపోవుటె బ్రతుకు
ఆగిపోవుటె చావు
సాగిపోదలచిన
ఆగరాదిచటెపుడు

ఆగిపోయిన ముందు
సాగనే లేవెపుడు
వేచియుండిన పోను
నోచుకోనే లేవు.

తొలగి తోవెవడిచ్చు
త్రోసుకొని పోవలయు.
బ్రతుకు పోరాటము
పడకు ఆరాటము.

బ్రతకదలచిన పోరు
సుతరాం తప్పదు.
చూపతలచిన జోరు
రేపనుట ఒప్పదు.

-కాళోజి
...............

ప్రజా కవి కాళోజీ వెబ్ సైట్ సౌజన్యంతో . మరిన్ని కాళోజీ కవితలకు సందర్శించండి
http://kaloji.wordpress.com/
ప్రజా కవి కాళోజీ

14 comments:

 1. కాళోజీ కాదు కుళ్ళోజీ కవితలు ఇవి. ద్వేషాన్ని నరనరాన నింపుకున్న నికృష్ట మేధావి

  ReplyDelete
 2. అనామక, నేను ఆంధ్రా వాడినే మీరు కాళోజిని నోటి కోచ్చినట్లు అనడం బాగా లేదు. మనం దానిని ఆయన తన ప్రాంతాన్ని ఎంతగా ప్రేమించాడొ చూడాలి. అదేకాకా నువ్వు ఎదో ఆంధ్రా వాళ్లాంత చాలా మంచి వాళ్ళనుకొంట్టునావు. కొంతమంది అగ్రవర్ణ భూస్వామ్య ఆంధ్రా వాళ్ళకి డబ్బు సంపాదన ధ్యేయం, వారి అధికార, ధన ప్రదర్శన,వ్యాపార స్వభావం తెలంగాణా ప్రజల మనో భావాలను అర్థం చేసుకోవడం లో విఫలమైంది. ఇప్పుడు తీరిక గా కూచొని వారిని తిట్టటం లో లాభం లేదు. కాళోజిని గురించి నీకు ఎమీ తెలుసు నూటికో కోటికో అలాంటి వారు పుడతారు. వెధవ నాయకులను ఫాలో అయి ముర్ఖూలుగా మనం తయారైతే ఆయన ఎమీ చేస్తాడు దానికి.

  Sri

  ReplyDelete
 3. Excellent. I love this poetry. Thanks for letting me know.

  ReplyDelete
 4. తెలంగాణ నాది - రాయలసీమ నాది సర్కారు నాది - నెల్లూరు నాది అన్నీ కలసిన తెలుగునాడు - మనదే మనదే మనదేరా

  అని నినదించిన కవిగారెవరో కాస్త చెప్పండి సార్. పుణ్యముంటుంది

  ReplyDelete
 5. " తెలంగాణ నాది - రాయలసీమ నాది సర్కారు నాది ... @@@
  ఈ కవిత రాసింది ఎవరో అడిగిన వ్యక్తికీ తెలుసు అందరికీ తెలుసు.
  సినారె.
  కానీ ఆ నినాదం ఇప్పుడు కేవలం
  రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళది,
  కాం ట్రా క్తర్లది ,
  రాజకీయ దళార్లది ,
  వాణిజ్య వేత్తలది !
  తెలంగాణా విదిపోతుంటే
  తమ దోపిడీ సామ్రాజ్యం కూలిపోతోందని
  వాళ్ళే కకా వికలవుతున్నారు.
  అమాయక విద్యార్ధుల్లో దుష్ ప్రచారాలు చేస్తూ
  విలయం సృష్టిస్తున్నారు.
  కాళోజీ అన్నది నిజం
  తెలంగాణా విడిపోతే సామాన్య ప్రజలకు,
  దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు.

  ReplyDelete
 6. ప్రతాప్ గారు బాగా చెప్పారు. మీరన్నదే నిజమైతే కాళోజీ కవితలు కూడా కేసీయార్ లాంటి తాగుబోతులు కొందరు నిరొద్యగులు అవసరార్థం వాడుకుంటున్నరనుకోవచ్చుగా.

  ReplyDelete
 7. kaloji kadu vaadu kulloji

  ReplyDelete
 8. కాళోజీని "కుల్లోజీ" అని వెక్కిరించి ఏదో గొప్ప విమర్శ చేసినట్టు చంకలు గుద్దుకుంటున్న వాళ్ళని చూస్తుంటే జాలేస్తోంది.
  మిడి మిడి జ్ఞానం తో ఎవర్ని పడితే వాళ్ళని వెకిలిగా విమర్శిస్తే తమ లేకి తనమే బయట పడుతుంది.
  కాళోజీ గురించి ముందు కాస్తయినా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తోలి నాల్ల లో కాళోజీ విశాలాంధ్ర వాది.1956 కు ముందు నుంచే ఆంధ్ర ప్రాంత వలసల పట్ల అనేకమంది తెలంగాణా ప్రజల్లో ఆగ్రహా వేషాలు వుండేవి . "ఇడ్లీ సాంబార్ గో బ్యాక్" అనే ఉద్యమం ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక ముందే వచ్చింది. తెలంగాణా ప్రజల్లో చాలా మంది హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంద్ర రాష్ట్రం లో కలపడం ఏమాత్రం ఇష్టం లేదు. అప్పుడే తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసు కాల్పుల్లో అప్పుడే ఏడుగురు చనిపోయారు. అట్లాంటి రోజుల్లో కాళోజీ సమైక్యతను కోరుకున్నాడు. శ్రీ శ్రీ తో కలసి విశాలాంధ్ర కోసం ప్రచారం చేసాడు. వరంగల్ లో శ్రీ శ్రీ మీద జనం దాడి చేయబోతే తను అడ్డం పది కాపాడాడు. ౧౯౫౬ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఆంద్ర నేతలు పెద్ద మనుషుల ఒప్పందాన్ని, ముల్కీ నిబంధలను, మొదలైన వాటన్నింటినీ తుంగలో తొక్కి తెలంగాణాకు బాహారంగా అన్యాయం చేయడం, తెలంగాణా ప్రజలకు వారి భాషకు ఆంధ్రుల చేత అడుగడుగునా ఎదురయ్యే పరాభవాలు చూసిన తరువాతే కాళోజీ ప్రత్యెక తెలంగాణా వాది గా మారాడు. ప్రత్యక తెలంగాణా కోసం అహర్నిశలు పాటు పడ్డాడు. చరిత్ర తెలియకుండా తల తోక లేని వెకిలి కామెంట్లు రాసిన వాడికి సంతోశాన్నిస్తున్నఎమో కాని ఎందరినో గాయ పరుస్తాయి. గ్రహిస్తే మీరు మనుషులవుతారు. లేదంటే వాటిని కుక్కలా మొరుగుళ్ళు గా భావించి ఎవరూపట్టించుకోరు.

  ReplyDelete
 9. khaminchali.........
  Kaloji garu gopa kavi, thelugu basha prajakavi, kaani naadoka vinnapamu, ippude chadiva ayanaraasina patalu.

  Ivi evo bhuswamulanu vethirekinchinattuvunnayi, kaani andhra vallani vethirekinchi nattu levu.

  నమ్ముకొని పెత్తనము ఇస్తే
  నమ్మకము పోగొట్టుకొంటివి
  కుప్పకావలి ఉండి కట్టలు
  తప్పదీస్తివి ముద్దెరేస్తివి

  Deeni artham enti? 1956 lo Telangana, Vishala andhara lo vileenam ayindi kada.
  meeru cheppinattu 1965 lo Telangana vudyamam vachindi.. adi 1969 lo viplavam jarigindi annamata.

  motham gap maha ante 10 yrs... andulo kuda oka Telangana CM vunnattu vunnadu, ee 10yrs lo entha Dopidi Jarigindi, Meevullu dochukellara? mee adavalla nagalu dochukellara??....

  Neenu cheptha vinandi..
  Konthamandi Telangana Sayudha poratam lo vunnavallu..., GOVT of India Miltary action thechaka.. Emicheyalo theleeka danne Telagana vimochana potanga marchi.. pabbam gadupukovadaniki chesthunna pane ee vudyamam.

  Meeru inka NIZAM palanalone vunnattu vuhinchukoni, yeduguthunna varinichoosi emicheyalo theleka ayomaya sthithi lo raasina kavithalau laga vunnayi.

  Kavi ante.. Praja la samsyalanu thevali? ee kavithalalo naku ekkada samsya kanapadaledu, kevalam okarini thittinattu vunnayi.

  Ivi raasedi NAXALITELU... PRAJA KALA SANGHALA VALLU.

  Sama smaajam korukone vallu kadu.. santhi kamukulu anthakannakaadu.

  Kavitha chadivithe andulo bhavam choodali Bhavodwgam chudakudadu.

  ReplyDelete
 10. @Sai Kiran,
  Well said. It is good to know more information about KalOji. Some people do not have minimum commensense before accusing others. It is time to keep ourself restrain not balming historical persons. Whichever region they belongs to.

  Sri

  ReplyDelete
 11. by publishing kaloji's poems in your blog, you have done great service.well done.

  ReplyDelete