Saturday, January 2, 2010

తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలుఆంధ్ర ప్రదేశ్ కు సంభందించినంత వరకు 2010 కచ్చితంగా "తెలంగాణా నామ" సంవత్సరమే !

స్వేచ్చా స్వాతంత్ర్యాల కోసం ,
స్వయం పాలన కోసం ,
ఆత్మ గౌరవం కోసం ,
అస్తిత్వం కోసం తెలంగాణా ప్రజలు శతాబ్దాలుగా పరితపిస్తున్నారు .

1947 ఆగస్ట్ 15 తొలి స్వాతంత్ర్య దినోత్సవ తీపి అనుభూతి తెలంగాణా ప్రజలకు తెలియదు. అప్పుడు వారు నిరంకుశ నిజాం సైన్యంతో , రజాకార్లతో జీవన్మరణ సాయుధ పోరాటం చేస్తున్నారు .

1948 సెప్టెంబర్ సైనిక చర్య నిజంగా తెలంగాణాను విముక్తం చేసిందో , వారు సాధించిన విజయాలను , వారి ఆకాంక్షలను చిదిమేసిందో ఇంకా చర్చనీయాంశమే .

అటు -
ప్రజల చేతుల్లో శత్రువుగా చావాల్సిన లేదా దేశం విడిచి పారిపోవాల్సిన "తర తరాల బూజు నిజం రాజు " హిజ్ ఎక్సలెన్సీ హై నెస్ గా " రాజ ప్రముఖ్ " గా గౌరవాన్నీ , భారత ప్రభుత్వ రక్షణను , రాజ భరణాలనూ పొందుతూ దర్జాగా బతికితే .

ఇటు -
తెలంగాణా పోరాట యోధులు జైళ్ళల్లో మగ్గాల్సి వచ్చింది . వారు పేద రైతులకు పంచిన లక్షలాది ఎకరాల భూమి తిరిగి జాగిర్దార్ల పరమైంది . రాష్ట్రం తిరిగి ప్రజా వ్యతిరేకుల హస్తగతమైంది.

1948 నుంచీ 1952 వరకూ తెలంగాణలో సాగింది స్వపరిపాలన కాదు దాదాపు పరాయి మిలిటరీ పాలన .

ఆ తరువాత తెలంగాణలో తొలిసారిగా (1952) ప్రజాస్వామిక ఎన్నికలు జరిగి, ప్రజా ప్రభుత్వం ఏర్పడి, తెలంగాణా ప్రజలు పట్టుమని నాలుగేళ్లయినా స్వపరిపాలన , స్వేచ్చా స్వాతంత్ర్యాల రుచి చూడక ముందే మళ్ళీ వారి నోట్లో దుమ్ము కొట్టారు .

1956 లో "మీది తెలుగే - మాది తెలుగే " అనే జిత్తులమారి నినాదం తో ,
దగాకోరు ఒప్పందాలతో రెండు రాష్ట్రాల విలీనం జరిగి తెలంగాణా తిరిగి తన అస్తిత్వాన్ని కోల్పోయింది .

తెలంగాణా ప్రజలు తమ నేలమీద తామే కాన్దీశీకుల్లా ... ఇంకొకరి దయధర్మాలతో బిక్కు బిక్కు మంటూ బతుకీడ్వాల్సిన దుస్తితి ఏర్పడింది .

విలీనమప్పుడు కుదుర్చు కున్న దగుల్భాజీ ఒప్పందాలన్నీ ఎలా ఉల్లంఘనకు గురయ్యాయో , తెలంగాణా నిధులూ , నీళ్ళూ , వనరులూ , ఉద్యోగాలూ ఎలా దోపిడీకి గురయ్యాయో , తెలంగాణా ప్రజల భాషా సంస్కృతులు , చరిత్ర ఏవిధంగా అవహేళనకు గురయ్యాయో మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు .

తెలంగాణా ఇప్పుడు
స్వాతంత్ర్యం కోసం, స్వాభిమానం కోసం, ఆత్మగౌరవం కోసం , న్యాయం కోసం , అస్తిత్వం కోసం పరితపిస్తోంది . అణువణువునా జ్వలిస్తోంది .

తెలంగాణా ప్రజలు "తమ రాష్ట్రం తమకు కావాలని , తమ నిధులు , తమ వనరులు , తమ ఉద్యోగాలు తమకు దక్కాలని ...నీళ్ళలో తమ వాటా తమకు సక్రమంగా రావాలని , తమ భాషా సంస్కృతులకూ చరిత్రకూ సముచిత గౌరవం వుండాలని కోరుకుంటున్నారు ... తప్ప ఇతర్ల సొమ్మును ఏమీ ఆశించడం లేదు .

న్యాయం తెలంగాణా ప్రజల పక్షాన వుంది .

తెలంగానాది ధర్మ యుద్ధం . ధర్మం చర ... సత్యం వద ...!

తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరుతుంది .

ప్రాంతాలకు , పక్షపాతాలకు , స్వార్ధానికి , అవకాశవాదానికి అతీతంగా నీతీ నిజాయితీ పరులైన తెలుగువాల్లంతా తెలంగాణా పోరాటానికి సంఘీభావం తెలపాలి .

సర్వే జనా సుఖినో భవంతు.
అందరికీ తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలు

జై తెలంగాణా !
జై జై తెలంగాణా !!
……………….

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?
……………………. ప్రజాకవి కాళోజీ
...

8 comments:

 1. కొందరు తెలంగాణానాయకుల మాటలువింటుటే తెలంగాణారాష్ట్రము అడిగినట్లుగాలేదు వారిమాటలు చేష్టలు తెలంగాణాదేశం కోరుతున్నట్లుగా ఉన్నాయి. (నాలుకకోస్తా,తరిమికొడతా,ఆస్తులనుతగలపెడుతూ)చేస్తున్న దురాగతాలు ఒకరాష్ట్రము కోసం చేస్తున్నట్లుగా లేదు .

  ReplyDelete
 2. కొత్త నిజాము కే సి ఆర్ గారు అవునా? లేక జాన రెడ్డి గారు అవుతారా

  ReplyDelete
 3. @venkateswarrao.avvuru gaaru:

  మీరు చెప్పినాడు నూటికి నూరు శాతం నిజం. కాని చాల మంది దీనిని రాజకీయ ఉద్యమం గా చూడటం సరి కాదు. ఇది పూర్తిగా ప్రజా ఉద్యమం. అందులో రాజకీయ నాయకులు కేవలం బాగస్వాములు మాత్రమె. వారు దీనిని నడిపిస్తున్నారు అనుకోవటం సరి కాదు. గుర్తు ఉందా, కేసిఆర్ రెండో రోజే నిరాహార దీక్ష వదిలేసినా రోజు తెలంగాణ బగ్గుమనలేదా? పాపం ఆయన విధి లేక ఊరకుండి పోయారు. ఇది ప్రజా ఉద్యమం. వారి అభిప్రయాలను అందరు సహృదయం తో అర్థం చేసుకోవాలని మనవి.

  -విజయ్

  ReplyDelete
 4. నూతన సంవత్సర శుభాకాంక్షలు .

  ReplyDelete
 5. 23 DECEMBER 2008 నుండి 1 JANUARY 2010 దాకా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ బ్లాగు చూడండి..
  http://creativekurrodu.blogspot.com/

  Happy New Year :)

  ReplyDelete
 6. meeku hapy new yr...

  telanganaa udyamam telangana prajala shreyassukosam vaari bhavishyath taraalakosam chesthunna udyamam pavitra udyamam

  ---john nitin

  ReplyDelete
 7. వెంకటేశ్వర్ రావు,విజయ్, మాలా కుమార్, నాయని ఆదిత్య, జాన్ నితిన్ గార్లకు
  ధన్యవాదాలు.
  నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  అనానిమస్ గారూ,
  నిజాముల బూజు ఇక తెలంగాణాకు మళ్ళీ పట్టే అవకాశం లేదు.
  నేటి తెలంగాణా విద్యార్ధి లోకాన్నీ , ప్రజా చైతన్యాన్నీ చూస్తుంటే భవిష్యత్ చిత్రపటం స్పష్టం గానే కనిపిస్తోంది కదా .
  పైన విజయ్ గారి కామెంట్ లో ఈ అంశాన్ని చక్కగా చెప్పారు. చూడండి.

  ReplyDelete