Saturday, September 29, 2012

ఆత్మబలిదానాలకు చరమగీతం పాడేందుకే ఈ తెలంగాణా మార్చ్‌


అన్యాయాలకు
అక్రమాలకు
అవహేళనలకు
అబద్ధాలకు
ఆధిపైత్యపు అహంకారాలకు
అవకాశవాదుల నక్కజిత్తులకు
కాగితం పులుల ప్రేలాపనలకు
ఆత్మన్యూనతకు
ఆత్మబలిదానాలకు
చరమగీతం పాడేందుకే
ఈ తెలంగాణా మార్చ్‌


Monday, September 24, 2012

ప్రతిఒక్కరికి ఎందులోనో ఒకదాన్లో ప్రతిభ వుంటుంది.


Everyone is a genius. But if you judge a fish on its ability to climb a tree, it will live its whole life believing that it is stupid.
- Albert Einstein

ఈ లోకంల ప్రతిఒక్కరూ ప్రతిభావంతులే .
కని, 'ఏదీ చెట్టెక్కి సూపియ్' అని చేపకు పరీక్ష పెట్టినవనుకో 
ఇగ అది ఈత సంగతి మర్సిపోయి  'నాకు చెట్టెక్క రాదు  ఏం రాదు' 
అని జీవితమంత కుములుకుంట  కూసుంటది. 



Sunday, September 23, 2012

ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌ 'లోపలి మనిషి' ...



భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేశారు. 
అవసరమా?
అప్పటి హైదరాబాద్‌ స్టేట్‌లో మరాఠీ, కన్నడ, తెలుగు మూడు భాషలుండె. 
ఆ మూడింటినీ అధికార భాషలుగా గుర్తిస్తూ హైదరాబాద్‌ స్టేట్‌ను అలాగే ఉంచితే ఏమయ్యేది?
స్విట్జర్లాండ్‌లాంటి దేశానికి ఆరు అధికార భాషలున్నప్పుడు 
హైదరాబాద్‌ రాష్ట్రానికి మూడు ఉంటే తప్పేంటి?

....
అప్పటి హైదరాబాద్‌ జనరల్‌ జి.ఎన్‌.చౌదరి (బెంగాలీ వ్యక్తి). 
ఇక్కడి వారికి ఇంగ్లీష్‌ రాదని ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి మద్రాసీ, బెంగాలీ, ఉత్తర భారతీయులను వేల సంఖ్యలో తీసుకువచ్చి ఉద్యోగాలు ఇచ్చాడు. 
అది ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక కూడా కొనసాగింది. 
ఇక్కడి వాళ్లకు ఇంగ్లీష్‌ రాదు అని ఆంధ్రులను ఉద్యోగాల్లో భర్తీ చేయడం మొదలుపెట్టింది ప్రభుత్వం.

నాకు ఒక విషయం అర్థం కాలే... 
మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు తెలుగు అర్థమవుతుంది. 
తెలుగు రాయగలరు. చదవగలరు. 
అట్లాంటప్పుడు అడ్మినిస్ట్రేషన్‌ ఇంగ్లీష్‌లో ఎందుకు సాగాలి?
అంతా ఇంగ్లీష్‌లోనే సాగాలి అనుకున్నప్పుడు 
భాషా ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు ఉద్దేశం, లక్ష్యం ఏమిటి మరి ????

- ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌

...

చదవండి ఇవాళ్టి (23 సెప్టెంబర్‌ 2012) - నమస్తే తెలంగాణా - దిన పత్రికలోని జిందగీ శీర్షిక కింద (Page No.10) ప్రచురించిన ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌ లోపలి మనిషి : 'అది అత్యంత విషాదం' ను పూర్తిగా ఇక్కడ:
 ... ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌ ...

http://epaper.namasthetelangaana.com/epapermain.aspx?edcode=9&eddate=9/23/2012%2012:00:00%20AM&querypage=10




.

ఈ ప్రపంచం ఎవరి వల్ల నశిస్తుంది?


The world will not be destroyed by those who do evil,
but by those who watch them without doing anything.
- Albert Einstein


చెడ్డోళ్ల వల్ల ఈ ప్రపంచం నాశనం కాదు. 
ఆ చెడును అడ్డుకోకుండా ఊరికే సూసుకుంట కూసునే 
మంచోళ్ళ వల్లనే ఈ దునియా నాశనమైపోతది.


Saturday, September 22, 2012

కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ "నిర్జన వారధి "

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన 
కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ   "నిర్జన వారధి " 
పుస్తకావిష్కరణ సభ 23 సెప్టెంబర్ 2012 ఆదివారం ఉదయం 10 .30 కు హిమాయత్ నగర్ ఉర్దూ గల్లీ లోని ఉర్దూ హాల్ లో. 
92 సంవత్సరాల కోటేశ్వరమ్మ గారు స్వయంగా పాల్గొంటున్నారు.


Wednesday, September 19, 2012

Money Money డబ్బు డబ్బు ...


Yes
Money can't buy happiness
But
It's more comfortable to cry 
sitting in a Car than on a bicycle.

నిజమే 
డబ్బు తోని సంతోషాన్ని కొనలేం 
కని
(కిస్మత్ లాత్ గొట్టినప్పుడు)
సైకిల్ మీద కూసుని ఏడ్వడం కంటే 
కారు లోపల కూసుని ఏడ్వడం 
చాన సౌలత్ గ ఉంటది కద! 



Tuesday, September 18, 2012

Charlie Chaplin చార్లీ చాప్లిన్ మాట ...




My  pain may be the reason for sombody’s laugh 
But my laugh must never be the reason for somebody’s pain. 
.........................................................  - Charlie Chaplin


గీ చార్లీ చాప్లిన్ మాటల మత్లబ్ ఏంటిదంటే ...

నీ కష్టాన్ని చూసి ఇంకెవరో నవ్వితే నవ్వనీ, ఏం పర్వలేదు.
కని, నువ్వు మాత్రం ఇంకొకడి కష్టాన్ని చూసి ఎప్పుడు నవ్వకు బిడ్డ.

గా పని చెడ్డోళ్ళు చేస్తరు గని మంచోళ్ళు చెయ్యరు. అని


.



Sunday, September 16, 2012

విమోచనమా విద్రోహమా !?



విమోచనమా విద్రోహమా !?

సెప్టెంబర్‌ 17
విమోచన దినమా
ఎవరినుంచి ఎవరికి విమోచనం
తిరగబడ్డ ప్రజల నుండి జమీందార్లకూ, దొరలకా
ఎర్రదండు ప్రభంజనంనుండి 
నిజాము నవాబుకూ ఆయన తాబేదార్లకా
ఎవరికి విమోచనం?

సెప్టెంబర్‌ 17 
విద్రోహ దినమా
ఎవరిది విద్రోహం
పోరాటాన్ని సగంలో వదిలేసిన కామ్రేడ్లదా
అధికార తుపాకీ అంది ఏడాదైనా కాకముందే
పాముని రాజప్రముఖున్ని చేసి 
చీమల్ని చీల్చిచెండాడిన నల్లదొరలదా
ఎవరిది విద్రోహం?

ఈనాటి తెలంగాణా ప్రజల ఆకాంక్షను గుర్తించకుండా
వారి అస్తిత్వ పోరాటంలో పాలుపంచుకోకుండా 
ఏ దినాలనైనా జరుపుకునే అర్హత వుంటుందా
తమ 'దినాలను' తప్ప!



Friday, September 14, 2012

విరసం ఆవిర్భావం నాటి ఒక అరుదైన ఫోటో

విరసం ఆవిర్భావం నాటి ఒక అరుదైన ఫోటో :

పెద్దగా కనిపించేందుకు ఫోటో పై క్లిక్ చేయండి :



Wednesday, September 12, 2012

Nothing is permanent in this wicked world. Not even our troubles - Charlie Chaplin/ ఈ లత్తకోరు దునియాల ఏదీ శాశ్వితం కాదు. ఆఖరికి మన కష్టాలు సుత. - చార్లీ చాప్లిన్


Nothing is permanent in this wicked world.
Not even our troubles.  - Charlie Chaplin

ఈ లత్తకోరు దునియాల ఏదీ శాశ్వితం కాదు.
ఆఖరికి మన కష్టాలు సుత.   - చార్లీ చాప్లిన్