Tuesday, May 29, 2018

బండను మొక్కితె దేవుడు దొరికితె




''పత్థర్‌ పూజే హరీ మిలై తో 
మై పూజూ పహాడ్‌!''
                 

''బండను మొక్కితె దేవుడు దొరికితె
(బండనేమి ఖర్మ) నేను కొండనె పూజిస్తాను!''


                                              - కబీర్‌ దాస్‌


(దాదాపు 650 సంవత్సరాల క్రితం విగ్రహారాధనపై సంత్‌ కబీర్‌ దాస్‌ ఎక్కుపెట్టిన ధిక్కార కవితల్లోని ఒక చరణమిది. 
''పిండిని ఇచ్చి కడుపును నింపే తిరగలిని ఎందుకు పూజించరు?'' 
అని కూడా ప్రశ్నిస్తాడు. 
ఇతరత్రా సమాజం ఎంత ముందుకు పోయినా 
మూఢనమ్మకాల విషయంలో మాత్రం ఇంకా వెనక్కిపోతుండటం ఒక విషాదం.)

Sunday, May 20, 2018

GO NOT TO THE TEMPLE వెళ్లకు గుడికి - రవీంద్రనాథ్‌ ఠాగూర్‌

GO NOT TO THE TEMPLE
by Rabindranath Tagore:

Go not to the temple to put flowers upon the feet of God,
First fill your own house with the Fragrance of love and kindness...

Go not to the temple to light candles before the altar of God,
First remove the darkness of sin from your heart...

Go not to the temple to bow down your head in prayer,
First learn to bow in humility before your fellowmen...

Go not to the temple to pray on bended knees,
First bend down to lift someone who is down-trodden.

Go not to the temple to ask for forgiveness for your sins,
First forgive from your heart those who have sinned against you!

........................................................................................................

వెళ్లకు గుడికి
- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌
...................................
వెళ్లకు గుడికి దేవుడి పాదాలపై పూలను పెట్టడానికి
ముందు ప్రేమ, జాలి అనే పరిమళాలతో నీ ఇంటిని నింపుకో !

వెళ్లకు గుడికి దేవుడి పీఠం ముందు కొవ్వొత్తులు వెలిగించడానికి
ముందు నీ హృదయంలోని పాపం, గర్వం, అహం అనే చీకట్లను తొలగించుకో

వెళ్లకు గుడికి ప్రార్థన కోసం నీ తలను వంచడానికి
ముందు సాటివారి ఎదుట వినయంగా తలవంచడం నేర్చుకో !

వెళ్లకు గుడికి దేవుడి ముందు మోకరిల్లడానికి
ముందు ఒక అట్టడుగువ్యక్తిని వంగి పైకి లేపు !

వెళ్లకు గుడికి చేసిన పాపాలను మన్నించమని కోరడానికి
ముందు నిన్ను బాధించిన వారిని మనస్ఫూర్తిగా క్షమించు !

.................................................................................

( విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ ఈ కవిత రాసి వందేళ్ళు దాటింది.
ఇవాళ దేశంలో చోటు చేసుకుంటున్న అమానుష సంఘటనలను చూస్తుంటే ...
ఆయన ఆశించిన మార్పు రాకపోగా మతోన్మాద పరంగా మనం
వందేళ్ళు వెనక్కి వెళ్లినట్టు అనిపించడం ఎంత విషాదం )

............ తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార