Sunday, December 13, 2009

ప్రత్యేక తెలంగాణా - ప్రజాకవి కాళోజీ కవితలు



ప్రత్యేక తెలంగాణా - ప్రజాకవి కాళోజీ కవితలు

ఉస్మానియా విద్యార్థులు 1969లో వీరోచితంగా సాగించిన ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కాలంలో ప్రజాకవి కాళోజీ అనేక ఉత్తేజకరమైన కవితలు రాశారు. నలభై సంవత్సరాల అనంతరం ప్రధానంగా అదే విద్యార్థుల పోరాట స్ఫూర్తి కారణంగా ప్రత్యేక తెలంగాణా స్వప్నం సాకారం కాబోతున్న తరుణంలో ఒకసారి వాటిని స్మరించుకుందాం.

తెలంగాణ వేరైతే


తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?

తెలంగాణ వేరైతే
కిలోగ్రాము మారుతుందా?
తెలంగాణ వేరైతే
తెలివి తగ్గిపొతుందా?

తెలంగాణ వేరైతే
చెలిమి తుట్టి పడుతుందా?
తెలంగాణ వేరైతే
చెలిమి లెండిపొతాయా?

కులము తగ్గిపొతుందా
బలము సన్నగిలుతుందా
పండించి వరికర్రల
గింజ రాలనంటుందా?

రూపాయికి పైసాలు
నూరు కాకపొతాయా?
కొర్టు అమలు అధికారము
ఐ.పి.సి. మారుతుందా?

పాకాల, లఖ్నవరం
పారుదలలు ఆగుతాయా?
గండిపేటకేమైనా
గండితుటు పడుతుందా?

ప్రాజెక్టులు కట్టుకున్న
నీరు ఆగనంటుందా?
పొచంపాడు వెలసి కూడ
పొలము లెండిపొతాయా?

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
–కాళోజీ
...............

దోపిడి చేసే ప్రాంతేతరులను...

దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం

దోస్తుగ ఉండే వారితొ మేమును
దోస్తే చేస్తం - ప్రాణమిస్తం
ఎంతకు అంత అన్న ధోరణితో
చింతమాని బ్రతుకును సాగిస్తం

తెలంగాణమిది - తెలంగాణమిది
తీరానికి దూరాన వున్నది
ముంచే యత్నం చేస్తే తీరం
మునుగును తానే - మునుగును తప్పక
-కాళోజి
....................

నిర్వాకం


నమ్ముకొని పెత్తనము ఇస్తే
నమ్మకము పోగొట్టుకొంటివి
కుప్పకావలి ఉండి కట్టలు
తప్పదీస్తివి ముద్దెరేస్తివి

సాటివాడు చేరదీస్తే
నోటినిండా మన్ను గొడ్తివి
పదవి అధికారముల బూని
పదిలముగ తల బోడి జేస్తివి

దాపునకు రానిస్తె చనువుగ
టోపి పెడితివి లాభపడితివి
అన్నవై తమ్ముళ్ల తలలను
నున్న జేస్తివి మురియబడితివి

తొత్తులను చుట్టూర జేర్చుక
పెత్తనాలు చేయబడితివి
‘పొచంపాడు’ పథకము
కూచికూచి చేసేస్తివి

‘దొంగ ముల్కి’ సనదులిచ్చి
దొరతనమ్ము వెలిగిస్తివి
తమ్ములను ఇన్నాళ్లబట్టి
వమ్మజేస్తివి తిన్నగుంటివి

ఎన్నిసార్లు మొత్తుకున్నను
అన్నవయ్యును గమ్మునుంటివి
అన్న అధికారమునకు తగిన
న్యాయబుద్దిని కోలుపోతివి

చిలిపి చేష్టలు చేసి ఇప్పుడు
చిలుక పలుకలు పలుకుచుంటివి
–కాళోజి
................

పోదాం పదరా!!

పదరా పదరా పోదాం పదరా
తెలంగాణ సాధిద్దాం పదరా
దొంగల దూరం కొడదాం పదరా
వేరే రాజ్యం చేద్దాం పదరా || పదరా ||

షాట్లకు బెదరక చెదరక పదరా
హిరణ్యకశిపుడు హడలగ పదరా
నర్సింహుడవై ముందుకు పదరా
పదరా పదరా … || పదరా ||

అధికృత హింసనే పాలన అంటే
ప్రహ్లాదుని హేళన చేస్తుంటే
ప్రత్యక్షంగా నర్సింహులమై
ప్రతిహింసకు పాల్పడదాం || పదరా ||

హిరణ్యకశివుల పొట్టలు చీల్చి
ఫెగుల మాలలు చేద్దాం పదరా
పదరా పదరా ….

వేర్పడదామని ఇద్దరికుంటే
కాదను వారిని కాలదన్నమా
వేరే రాజ్యం చేయబూనమా
పదరా పదరా …..

–కాళోజి
................

నాగరికుడా ‘విను’...

నా నోటికాడి బుక్కను
నాణ్యంగా కాజేసిన
నాగరికుడా ‘విను’

నా నాగటి చాలులోన
నాజూకుగ పవ్వళించి
నను కాటేసిన
నాగరికుడా విను?

నావారల చేరదీసి
నానా విధ బోధలతో
నాణ్యంగా నన్ను కొరిగి
నలుబదైదు సంతకాల
నాటకమాడిన నటుడా
నాగరికుడా విను!

కోటిన్నర మేటి ప్రజల
గొంతోక్కటి గొడవొక్కటి
తెలంగాణ వెలిగి నిలిచి
ఫలించెలె భారతాన
భరత మాతాకీ జై
తెలంగాణ జిందాబాద్

-కాళోజి
.............

తెలంగాణ ‘యాస’ నెపుడు యీసడించు

తెలంగాణ ‘యాస’ నెపుడు
యీసడించు భాషీయుల
‘సుహృద్భావన’ ఎంతని
వర్ణించుట సిగ్గుచేటు

వాక్యంలో మూడుపాళ్ళు
ఇంగ్లీషు వాడుకుంటు
తెలంగాణీయుల మాటలో
ఉర్దూపదం దొర్లగానే
హిహీ అని ఇగిలించెడి
సమగ్రాంధ్ర వాదులను
ఏమనవలెనో తోచదు.

‘రోడ్డని’ పలికేవారికి
సడకంటె ఎవగింపు
ఆఫీసని అఘొరిస్తూ
కచ్చేరంటే కటువు
సీరియలంటే తెలుగు
సిల్సిల అంటే ఉరుదు

సాల్టు, షుగర్, టిఫిన్ తెనుగు
షర్కర్, నాష్తంట్ కొంప మునుగు
టీ అంటే తేట తెనుగు
చా అంటే ‘తౌరక్యము’
పొయినడంటే చావు
తోలడమంటే పశువు

దొబ్బడమంటే బూతు
కడప అంటే ఊరి పేరు
త్రోవంటె తప్పు తప్పు
దోవంటేనే దారి.

బొక్కంటే ఎముక కాదు
బొక్కంటె పొక్క తెలివి
మందలిస్తె తిట్టినట్లు
చీవాట్లు పెట్టినట్లు
పరామర్శ కానేకాదు

బర్రంటె నవ్వులాట
గేదంటేనే పాలు
పెండంటె కొంప మునుగు
పేడంటేనే ఎరువు

రెండున్నర జిల్లాలదె
దండి భాష తెలుగు
తక్కినోళ్ల నోళ్ల యాస
త్రొక్కి నొక్కి పెట్టు తీర్పు

వహ్వారే! సమగ్రాంధ్ర
వాదుల ఔదార్యమ్ము
ఎంత చెప్పినా తీరదు
స్నేహము సౌహర్ద్రమ్ము

భోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
భోయి భీమన్న ఒకడు
బెజవాడ గోపాలుని
సభ్యత నెర్గిన ఆంధ్రుడు

భోయీ భీమన్న ఒకడు
పదారణాల ఆంధ్రుడు
తెనుగు సభ్యత సంస్కృతి
ఆపాద మస్తకంబు
నోరు విప్పితే చాలు
తెనుగు తనము గుబాళించు

కట్టుబొట్టు మాట మంతి
నడక ఉనికి ఒకటేమిటి
ఎగుడు దిగుడు ఊపిరిలో
కొట్టొచ్చే తెనుగు తనము
గోపాల కీర్తనమే జీవిక
పాపము అతనికి

ఉర్డంటే మండి పడెడి
పాటి తెనుగు ఆవేశము
జౌనపదుని లేఖ లేవో
జౌఇన రహిత ప్రాయంబున
వ్రాసినాడు అంతెకాని
తెలివిన పడి, వృద్ధదశలో
కాస్మా పాలిటన్ తనము
శిఖరోహణ అనుకొని
పరిణతి దశ నందు కొనగ
తాపత్రయ పడుచున్నడు

భోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
సమైక్యాంధ్రవాది వాడు
భీమశాస్ర్తి అని నాతో
పిలుపించు కొన్నవాడు
జానపదుని లేఖావళి
నాటి సఖుడు భీమన్న
-కాళోజి
............

ప్రత్యేక తెలంగాణ అంటే

ప్రత్యేక తెలంగాణ అంటే
పక్కలిరగ తన్నేందుకు
ఆ.ప్ర.రా. ప్రభుత్వాన్కి
అధికారము ఎక్కడిది?

ప్రజాస్వామ్య రాజ్యాంగం
పరిపాలన గల దేశము
ప్రజా మతము ప్రకటిస్తె
పట్టి కొట్టి చంపేస్తద?

వేలు లక్షలు ప్రజలు
జేలుకేగ సిద్ధపడితే
ఏర్పట్లు చేయలేక
లాఠీచార్జి పరిపాలన?

కాడెద్దుల ధోరణిలో
కూడని పనియే లేదా?
వినిగి వేసారి జనం
హింసకాండ తలబెడితే
కేంద్రానిది బాధ్యతంత

‘ప్రెస్టేజి’ పేర హింస
ప్రభుత్వాన్కి సబబైతె
ప్రాణిధర్మ హింసకాండ
ప్రజలకు కూడా సబబే

బ్రహ్మన్న చంపు చంపు
ఏ పాటి చంవుతావో
తూటాలు ఎన్నున్నయో
పేల్చుకో, ఆబాలం గోపాలం

చంపు చంపు చంపు అనుచు
బరి రొమ్ములతో బజార్లో
తూటాలను ఎదురుతాన్రు
ఒకటో రెండో వుంచుకో
తుదకు ఆత్మహత్యకైన
అక్కరకొస్తె నీకు, లేకుంటే
ప్రాణాలతో ప్రజల చేతికే
చిక్కితే నీకున్నది కుక్కచావు

తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తా
భరతమాతాకీ జై
తెలంగాణ జిందబాద్.

–కాళోజి
.................

సాగిపోవుటె బ్రతుకు...

సాగిపోవుటె బ్రతుకు
ఆగిపోవుటె చావు
సాగిపోదలచిన
ఆగరాదిచటెపుడు

ఆగిపోయిన ముందు
సాగనే లేవెపుడు
వేచియుండిన పోను
నోచుకోనే లేవు.

తొలగి తోవెవడిచ్చు
త్రోసుకొని పోవలయు.
బ్రతుకు పోరాటము
పడకు ఆరాటము.

బ్రతకదలచిన పోరు
సుతరాం తప్పదు.
చూపతలచిన జోరు
రేపనుట ఒప్పదు.

-కాళోజి
...............

ప్రజా కవి కాళోజీ వెబ్ సైట్ సౌజన్యంతో . మరిన్ని కాళోజీ కవితలకు సందర్శించండి
http://kaloji.wordpress.com/
ప్రజా కవి కాళోజీ

22 comments:

  1. కాళోజీ కాదు కుళ్ళోజీ కవితలు ఇవి. ద్వేషాన్ని నరనరాన నింపుకున్న నికృష్ట మేధావి

    ReplyDelete
  2. అనామక, నేను ఆంధ్రా వాడినే మీరు కాళోజిని నోటి కోచ్చినట్లు అనడం బాగా లేదు. మనం దానిని ఆయన తన ప్రాంతాన్ని ఎంతగా ప్రేమించాడొ చూడాలి. అదేకాకా నువ్వు ఎదో ఆంధ్రా వాళ్లాంత చాలా మంచి వాళ్ళనుకొంట్టునావు. కొంతమంది అగ్రవర్ణ భూస్వామ్య ఆంధ్రా వాళ్ళకి డబ్బు సంపాదన ధ్యేయం, వారి అధికార, ధన ప్రదర్శన,వ్యాపార స్వభావం తెలంగాణా ప్రజల మనో భావాలను అర్థం చేసుకోవడం లో విఫలమైంది. ఇప్పుడు తీరిక గా కూచొని వారిని తిట్టటం లో లాభం లేదు. కాళోజిని గురించి నీకు ఎమీ తెలుసు నూటికో కోటికో అలాంటి వారు పుడతారు. వెధవ నాయకులను ఫాలో అయి ముర్ఖూలుగా మనం తయారైతే ఆయన ఎమీ చేస్తాడు దానికి.

    Sri

    ReplyDelete
    Replies
    1. కాళోజీ అర్ధంకావాలంటే
      సాహిత్యంతో పనిలేదు.
      మనిషితనం కావాలె.
      నీలోనుంచి నువు బైటికి రావాలె.
      కడుపునిండ మక్కంబలి దాగి
      ఖుల్ల ఆస్మాన్ కింద చెద్దరేకోని
      తాత,అవ్వతోని ముక్చటవెట్టాలె
      సద్ద,జొన్న,మక్క చేన్లల్ల
      మురుసుకుంట తిరుగాలె
      ఇవి తెలువకుంటెమాయె
      ఆకరికిఅమ్మ చేతి కమ్మటి
      సద్దన్నమ్ముద్దన్నా
      రుశిజూసుండాలె
      నాది అనేది పరిచయముండాలె
      అప్పుడు కాళోజీముచ్చటెత్తాలె
      కమ్మటి నవ్వు మొకమంత పర్సుకోదూ

      ప్రాంతీయ అస్తిత్వంకొరకు
      కొట్లాటేందో అర్ధంకాదూ?
      కాళోజీ కాళ్ళు మొక్కబుద్ది కాదూ?.

      Delete
    2. కాళోజీ అర్ధంకావాలంటే
      సాహిత్యంతో పనిలేదు.
      మనిషితనం కావాలె.
      నీలోనుంచి నువు బైటికి రావాలె.
      కడుపునిండ మక్కంబలి దాగి
      ఖుల్ల ఆస్మాన్ కింద చెద్దరేకోని
      తాత,అవ్వతోని ముక్చటవెట్టాలె
      సద్ద,జొన్న,మక్క చేన్లల్ల
      మురుసుకుంట తిరుగాలె
      ఇవి తెలువకుంటెమాయె
      ఆకరికిఅమ్మ చేతి కమ్మటి
      సద్దన్నమ్ముద్దన్నా
      రుశిజూసుండాలె
      నాది అనేది పరిచయముండాలె
      అప్పుడు కాళోజీముచ్చటెత్తాలె
      కమ్మటి నవ్వు మొకమంత పర్సుకోదూ

      ప్రాంతీయ అస్తిత్వంకొరకు
      కొట్లాటేందో అర్ధంకాదూ?
      కాళోజీ కాళ్ళు మొక్కబుద్ది కాదూ?
      సుభాషిణి.ఎన్.
      అసిస్టెంట్ ప్రొఫెసర్

      Delete
  3. Excellent. I love this poetry. Thanks for letting me know.

    ReplyDelete
  4. తెలంగాణ నాది - రాయలసీమ నాది సర్కారు నాది - నెల్లూరు నాది అన్నీ కలసిన తెలుగునాడు - మనదే మనదే మనదేరా

    అని నినదించిన కవిగారెవరో కాస్త చెప్పండి సార్. పుణ్యముంటుంది

    ReplyDelete
  5. " తెలంగాణ నాది - రాయలసీమ నాది సర్కారు నాది ... @@@
    ఈ కవిత రాసింది ఎవరో అడిగిన వ్యక్తికీ తెలుసు అందరికీ తెలుసు.
    సినారె.
    కానీ ఆ నినాదం ఇప్పుడు కేవలం
    రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళది,
    కాం ట్రా క్తర్లది ,
    రాజకీయ దళార్లది ,
    వాణిజ్య వేత్తలది !
    తెలంగాణా విదిపోతుంటే
    తమ దోపిడీ సామ్రాజ్యం కూలిపోతోందని
    వాళ్ళే కకా వికలవుతున్నారు.
    అమాయక విద్యార్ధుల్లో దుష్ ప్రచారాలు చేస్తూ
    విలయం సృష్టిస్తున్నారు.
    కాళోజీ అన్నది నిజం
    తెలంగాణా విడిపోతే సామాన్య ప్రజలకు,
    దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు.

    ReplyDelete
  6. ప్రతాప్ గారు బాగా చెప్పారు. మీరన్నదే నిజమైతే కాళోజీ కవితలు కూడా కేసీయార్ లాంటి తాగుబోతులు కొందరు నిరొద్యగులు అవసరార్థం వాడుకుంటున్నరనుకోవచ్చుగా.

    ReplyDelete
  7. kaloji kadu vaadu kulloji

    ReplyDelete
  8. కాళోజీని "కుల్లోజీ" అని వెక్కిరించి ఏదో గొప్ప విమర్శ చేసినట్టు చంకలు గుద్దుకుంటున్న వాళ్ళని చూస్తుంటే జాలేస్తోంది.
    మిడి మిడి జ్ఞానం తో ఎవర్ని పడితే వాళ్ళని వెకిలిగా విమర్శిస్తే తమ లేకి తనమే బయట పడుతుంది.
    కాళోజీ గురించి ముందు కాస్తయినా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తోలి నాల్ల లో కాళోజీ విశాలాంధ్ర వాది.1956 కు ముందు నుంచే ఆంధ్ర ప్రాంత వలసల పట్ల అనేకమంది తెలంగాణా ప్రజల్లో ఆగ్రహా వేషాలు వుండేవి . "ఇడ్లీ సాంబార్ గో బ్యాక్" అనే ఉద్యమం ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక ముందే వచ్చింది. తెలంగాణా ప్రజల్లో చాలా మంది హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంద్ర రాష్ట్రం లో కలపడం ఏమాత్రం ఇష్టం లేదు. అప్పుడే తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసు కాల్పుల్లో అప్పుడే ఏడుగురు చనిపోయారు. అట్లాంటి రోజుల్లో కాళోజీ సమైక్యతను కోరుకున్నాడు. శ్రీ శ్రీ తో కలసి విశాలాంధ్ర కోసం ప్రచారం చేసాడు. వరంగల్ లో శ్రీ శ్రీ మీద జనం దాడి చేయబోతే తను అడ్డం పది కాపాడాడు. ౧౯౫౬ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఆంద్ర నేతలు పెద్ద మనుషుల ఒప్పందాన్ని, ముల్కీ నిబంధలను, మొదలైన వాటన్నింటినీ తుంగలో తొక్కి తెలంగాణాకు బాహారంగా అన్యాయం చేయడం, తెలంగాణా ప్రజలకు వారి భాషకు ఆంధ్రుల చేత అడుగడుగునా ఎదురయ్యే పరాభవాలు చూసిన తరువాతే కాళోజీ ప్రత్యెక తెలంగాణా వాది గా మారాడు. ప్రత్యక తెలంగాణా కోసం అహర్నిశలు పాటు పడ్డాడు. చరిత్ర తెలియకుండా తల తోక లేని వెకిలి కామెంట్లు రాసిన వాడికి సంతోశాన్నిస్తున్నఎమో కాని ఎందరినో గాయ పరుస్తాయి. గ్రహిస్తే మీరు మనుషులవుతారు. లేదంటే వాటిని కుక్కలా మొరుగుళ్ళు గా భావించి ఎవరూపట్టించుకోరు.

    ReplyDelete
  9. khaminchali.........
    Kaloji garu gopa kavi, thelugu basha prajakavi, kaani naadoka vinnapamu, ippude chadiva ayanaraasina patalu.

    Ivi evo bhuswamulanu vethirekinchinattuvunnayi, kaani andhra vallani vethirekinchi nattu levu.

    నమ్ముకొని పెత్తనము ఇస్తే
    నమ్మకము పోగొట్టుకొంటివి
    కుప్పకావలి ఉండి కట్టలు
    తప్పదీస్తివి ముద్దెరేస్తివి

    Deeni artham enti? 1956 lo Telangana, Vishala andhara lo vileenam ayindi kada.
    meeru cheppinattu 1965 lo Telangana vudyamam vachindi.. adi 1969 lo viplavam jarigindi annamata.

    motham gap maha ante 10 yrs... andulo kuda oka Telangana CM vunnattu vunnadu, ee 10yrs lo entha Dopidi Jarigindi, Meevullu dochukellara? mee adavalla nagalu dochukellara??....

    Neenu cheptha vinandi..
    Konthamandi Telangana Sayudha poratam lo vunnavallu..., GOVT of India Miltary action thechaka.. Emicheyalo theleeka danne Telagana vimochana potanga marchi.. pabbam gadupukovadaniki chesthunna pane ee vudyamam.

    Meeru inka NIZAM palanalone vunnattu vuhinchukoni, yeduguthunna varinichoosi emicheyalo theleka ayomaya sthithi lo raasina kavithalau laga vunnayi.

    Kavi ante.. Praja la samsyalanu thevali? ee kavithalalo naku ekkada samsya kanapadaledu, kevalam okarini thittinattu vunnayi.

    Ivi raasedi NAXALITELU... PRAJA KALA SANGHALA VALLU.

    Sama smaajam korukone vallu kadu.. santhi kamukulu anthakannakaadu.

    Kavitha chadivithe andulo bhavam choodali Bhavodwgam chudakudadu.

    ReplyDelete
  10. @Sai Kiran,
    Well said. It is good to know more information about KalOji. Some people do not have minimum commensense before accusing others. It is time to keep ourself restrain not balming historical persons. Whichever region they belongs to.

    Sri

    ReplyDelete
  11. by publishing kaloji's poems in your blog, you have done great service.well done.

    ReplyDelete
  12. 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయేనాటికి నిజాం సంస్థానంలో ఉన్న తెలుగు ప్రజలు 1948 September 17 నాటికే తన పరిపాలనలో ఉన్న ప్రాంతాన్ని అయితే పాకిస్తానులో కలపాలనీ లేదంటే స్వతంత్రదేశంగా ఉందాలనీ అనుకుంటున్న నిజాము పరిపాలన నుంచి విడివడి స్వతంత్ర భారతదేశంలో విలీనమై హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పరచుకుని ఉన్నారు.నిజానికి తెలంగాణ ప్రజల సంస్కృతి ఒక రకమైన అమాయకత్వం, అంతులేని బోళాతనం, మితిమీరిన తిరుగుబాటు ధోరణి కలగలిసిన సంక్లిష్టతను కలిగి ఉండటం వల్ల ఆ ప్రాంతపు రాజకీయ నాయకులు చాలామంది తెలంగాణ ప్రజల్ని తమ సొంత ప్రాభవాల కోసం ఇష్టారీతిన ఒకప్పుడు వాడుకున్నారు, ఇప్పటికీ వాడుకుంటున్నారు, ఎప్పటికీ వాడుకుంటూనే ఉంటారు.ఇతరులకి అన్యాయం చెయ్యని వారినీ తమకు అన్యాయం చేస్తే సహించలేనివారినీ రెచ్చగొట్టటం చాలా తేలిక - మరీ ముఖ్యం ఎదటివారు చెప్పే మాటలలోని నిజానిజాల్ని తరచి చూడలేని అమాయకుల్ని "ఫలానా వాళ్ళు మిమ్మల్ని అణిచేస్తున్నారు కాబట్టే మీరు వృద్ధిలోకి రాలేకపోతున్నారు!వాళ్ళని చంపేస్తేనో తన్ని తగిలేస్తేనో తప్ప మీరు బాగుపడరు - ఇది నిజం. " అని చాడీలు చెప్పి వేరేవాళ్ళ మీదకి వాళ్ళని రెచ్చగొట్టటం చాలా తేలిక!

    2014 నాటి తెలంగాణ ఉద్యమ వీరులు ఆనాటి తెలంగాణ యొక్క రెండు విలీనాలకీ భారత దేశపు ప్రభుత్వానికీ ఆంధ్ర ప్రాంతపు నాయకులకీ దురుద్దేశాలు అంటగడుతున్నారు గానీ జరిగిన చరిత్రని జరిగినట్టు చూస్తూ ఆ రెండు సన్నివేశాల్లోని తెలంగాణ నాయకులు ఆనాడు ఎలా స్పందించారు ఎలా ప్రవర్తించారు అని చూస్తే చాలు ఈనాటి తెలంగాణ నాయకులు చేస్తున్న ఆరోపణలు అబద్ధం అని తెలుస్తుంది.ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టి చెప్పాలంటే, ఈనాటి తెలంగాణ ఉద్యమ వీరులు ఆనాటి తెలంగాణ యొక్క రెండు విలీనాలకీ భారత ప్రభుత్వానికీ ఆంధ్ర ప్రాంతపు నాయకులకీ దురుద్దేశాలు అంటగట్టడం తమ వెనకటి తరం తెలంగాణ ప్రాంతపు నాయకుల్ని అవమానించడమే అవుతుంది!

    తెలంగాణ ప్రాంతం భారతదేశంలో హైదరబాదు రాష్ట్రంగా కలిసిపోవడం అనేది ప్రశాంతమైన వాతావరణంలో జరగలేదు.అటువైపునుంచి నిజాము అయితే పాకిస్తానులో కలవాలి లేకపోతే స్వతంత్రదేశం అయిపోవాలని పట్టుదల చూపిస్తున్నాడు.సైనికచర్య జరిగే సమయానికి అతను ఒక దేశానికి కావలసిన అన్ని హంగుల్నీ సమకూర్చుకుని తన రాయబారుల్ని అన్ని ముస్లిం దేశాలకీ ఐక్యరాజ్యసమితికీ పంపించి ఉన్నాడు ప్రత్యేక దేశపు గుర్తింపు తెచ్చుకోవడం కోసం.సైనిక చర్య కొంత ఆలశ్యమై అతని ప్రయత్నాలు సఫలం అయి వుంటే పరిస్థితి ఎలా వుండేది?

    నిజాము అంతకుముందునుంచి తనను పాకిస్తానులో కలవమని ఒత్తిడి పెడుతున్న ఖాసిం రజ్వీని ఇప్పుడు భారత దేశంలో కలిసిపోవాలని అనుకుంటున్న సామాన్య ప్రజల మీదకీ ప్రజల్ని అతని కబంధ హస్తాల నుంచి విముక్తం చెయ్యాలనుకుంటున్న భారత ప్రభుత్వం మీదకీ వదిలాడు!Sunderlal Committee ఆనాటి September 1948న జరిగిన సైనిక చర్య గురించి "as a very reasonable & modest estimate...the total number of deaths in the state...somewhere between 30,000 & 40,000" అని చెప్పడమూ నిజమే, కొందరు నిజాయితీపరులైన పరిశీలకులు మృతుల సంఖ్య 2,00,000 కన్న ఎక్కువే ఉండొచ్చునని అంచనాలు కట్టడమూ నిజమే - కానీ ఆనాడు భారత సైన్యం పోరాడాల్సిందీ పోరాడిందీ యూనిఫాం ఉన్న నిజాం సైన్యం ఒక్కదానితోనే కాదు, ప్రజల్లో కలిసిపోయి తిరుగుతున్న రజాకార్లతో కూడా అనేది తెలుసుకుంటే గానీ ఆ భీబత్సం నూటికి నూరు శాతం భారత ప్రభుత్వం వల్ల జరిగింది కాదని అర్ధం అవుతుంది.ఇప్పటికీ ఆనాటి విలీనాన్ని వ్యతిరేకించే వారిలో ఖాసిం రజ్వీ పెట్టిన పార్టీని పేరు మార్చి కొనసాగిస్తున్న ఒవైసీ కుటుంబం పట్ల అనుకూలత ఉన్నదనేది వాస్తవం!

    ReplyDelete
  13. సెప్టెంబర్ 17న తనే కబురు చేసి తన ముందుకి రప్పించుకున్న K.M. Munshi గారితో జరిగిన సమావేశంలో "The vultures have resigned. I don't know what to do" అని రజాకార్ల దౌష్ట్యాల నన్నిట్నీ ఖాసిం రజ్వీ మీదకి తోసేస్తూ తనలో తను గొణుక్కుని 1948 సెప్టెంబర్ 23న రేడియోలో “In November last [1947], a small group which had organized a quasi-military organization surrounded the homes of my Prime Minister, the Nawab of Chhatari, in whose wisdom I had complete confidence, and of Sir Walter Monkton, my constitutional Adviser, by duress compelled the Nawab and other trusted ministers to resign and forced the Laik Ali Ministry on me. This group headed by Kasim Razvi had no stake in the country or any record of service behind it.By methods reminiscent of Hitlerite Germany it took possession of the State, spread terror ... and rendered me completely helpless.” అని ప్రకటించడంతో తెలంగాణ ప్రాంతపు చరిత్ర ఒక గొప్ప మలుపు తీసుకుంది.

    1950 జనవరి 26న నిజాముకు ఇచ్చిన రాజ్ ప్రముఖ్ హోదా 1956 అక్టోబర్ 31 వరకు కొనసాగింది.హైద్రాబాద్ సంస్థానం స్వాధీనం కాగానే మొదట 1950 జనవరి 26న M.K.Vellodiని ముఖ్యమంత్రిగా నియమించారు.అయితే, 1952 ఎన్నికల్లో కాంగ్రెసు నెగ్గి బూర్గుల రామకృష్ణా రావు గారు ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి అయ్యారు.ఇదే 1952లో ఇతర ప్రాంతాల వారికే కీలకమైన ఉద్యోగాలు దక్కడం మీద వ్యతిరేకత పెరిగి ముల్కి ఉద్యమం ఉధృతమైంది.అయితే, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన Reorganisation of the Indian States కమిటీ 1956లో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ తెలుగు భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాలను అప్పటికే మద్రాసు నుంచి చీలి ఏర్పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలోనూ కలపాలని సూచించింది.

    తెలంగాణలోని కొందరికి నిజాము పాలనలో మ్రగ్గిన వెనుకబాటు తనం వల్ల తెలంగాణ ప్రజలు మద్రాసు రాష్ట్రపు ఆధునికత విద్య వల్ల ముందుకు చొచ్చుకుపోయే కోస్తాంధ్ర ప్రజలతో పోటీ పడి నెగ్గలేరని అనిపించింది.అందువల్ల కమిటీ ఇతరుల విషయంలో వలె గాక “One of the principal causes of opposition of Vishalandhra also seems to be the apprehension felt by the educationally backward people of Telangana that they may be swamped and exploited by the more advanced people of the coastal areas” అని చెప్పి రెండు రాష్ట్రాల ప్రజల విచక్షణకు వదిలేసింది.

    ఆనాటి తెలంగాణ సమాజం ఒక గందరగోళాన్ని ఎదుర్కొంటూ ఉన్నదనేది వాస్తవం.పోలీసు చర్య అనేది సహజంగానే వివాదాస్పదమైన పేరు.అక్కడ ఉన్నది భారత సైన్యం అయినప్పటికీ ఆ పేరు చెప్తే అంతర్జాతీయ రాజకీయాల ప్రకారం భారత దేశం నిజాము యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కోసం చేసిన యుద్ధం అవుతుంది.నిజాము కూడా ఖాసిం రజ్వీ ఒత్తిడి వల్ల రజాకార్లని స్వేచ్చగా వదిలేశాడు తప్పితే సొంతంగా అతనికి భారతదేశంతో యుద్ధం చెయ్యాలని ఉన్నట్టు తోచడం లేదు. ఇటువైపున ప్రజల్లో చాలామంది అప్పటికే నిజాము ప్రవేశపెట్టిన ఉర్దూకీ వాళ్ళ పరిపాలనా పద్ధతులకీ అలవాటు పడిపోయినట్టు కూడా తెలుస్తున్నది.పైన పోలీసు చర్యలో పాల్గొన్న ఆంధ్ర అధికారులు తెలంగాణ ప్రజలతో వ్యవహరించిన తీరు కూడా చాలా దుర్మార్గంగా ఉండటంతో వీళ్ళిద్దర్నీ కేవలం భాష పేరున కలపడం సాధ్యమా అనిపించే వాదనలు తలెత్తాయి.

    ReplyDelete
  14. ఇక్కడ మనం పట్టించుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉంది.వ్రాసిన తేదీ, సమయం తెలియడం లేదు గానీ బూర్గుల రామకృష్ణా రావు గారు అప్పటి భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షుడైన U N Dhebar గారికి "I may however, add one thing that in case Telangana is kept a separate unit there is no harm in having common aspects of the administration common" అని తెలంగాణను అంటే అప్పటి హైదరాబాదు రాష్ట్రాన్ని ఆంధ్రతో కలపకపోయినప్పటికీ కలిపితే ఒనగూరుతాయని అంటున్న ప్రయోజనాలను సాధించవచ్చనే తన సొంత అభిప్రాయాన్ని చెప్తూ ఒక ఉత్తరం వ్రాశారు.ఇందులో మళ్ళీ ఇరు వర్గాల వాదనలనూ ఎందుకు ఉటంకించారో అర్ధం కావడం లేదు నాకు.ఆయనకి కలయిక పట్ల వ్యతిరేకత ఉన్నప్పుడు తన వాదనకి సమర్ధనలను మాత్రం చెప్తే సరిపోతుంది.మరి, కలయికకు అనుకూలమైన వాదనలను కూడా ఇక్కడ ప్రస్తావించడం దేనికి?

    మొదలు పెట్టటమే తెలంగాణలో చాలామంది హైదరాబాదును యధాతధం కొనసాగించాలని బలంగా కోరుకుంటున్నారు అంటూ మొదలుపెట్టి "హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ" కలిపేశారు కాబట్టి ఒప్పుకోవలసి వస్తుందని అనేశారు. "హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ" కలపడానికి లేని విముఖత "హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాలను అప్పటికే మద్రాసు నుంచి చీలి ఏర్పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో" కలపడానికి ఎందుకు వచ్చింది? "హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ" కలిపేశాక "హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాలను అప్పటికే మద్రాసు నుంచి చీలి ఏర్పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో" మాత్రం కలపొద్దు అనడం న్యాయమేనా!

    బూర్గుల రామకృష్ణారావు గారు విశాలాంధ్ర అనేది కమ్యునిష్టుల నినాదం కాబట్టి తమ అధ్వర్యంలో జరిగిన రైతాంగ పోరాటపు విజయాన్ని రాష్ట్రమంతటికీ విస్తరింపజెయ్యడం కోసం కమ్యునిష్టులు వేసిన పాచిక అని అర్ధం చేసుకున్నారని అనిపిస్తుంది నాకు.భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన మౌలిక సూత్రమైన Cultural Integration అనేదాన్ని కూడా emotional approach మాత్రమే అని తీసి పారేస్తున్న బూర్గుల రామకృష్ణారావు గారు విలీనాన్ని వ్యతిరేకిస్తే సరిపోయేదానికి I shall now briefly summarise the pros and cons of the situation అని ఉత్తరం వ్రాయడం అనవసరం అనిపిస్తున్నది నాకు.భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన మౌలిక సూత్రమైన Cultural Integration అనేదాన్ని కూడా emotional approach మాత్రమే అని తీసి పారేస్తున్న బూర్గుల రామకృష్ణారావు గారు తెలంగాణ వారికున్న ఆంధ్రలో విలీనం పట్ల వ్యతిరేకత దగ్గిర కొచ్చేసరికి There is no agitation of a strong character in Andhra on this subject while there is a strong agitation in Telangana not to merge with Andhra అనటం చాలా దుర్మార్గం అనిపించింది నాకు.ఆంధ్ర ప్రాంతపు నాయకులు ప్రతిపాదించిన తెలుగువాళ్ళు ఒక్కటిగా ఉండటం అనేది మాత్రమే ఆయనకి “వూహల్లో బాగుండి వాస్తవంలో సాధ్యం కానిది”గానూ తెలంగాణ ప్రాంతపు నాయకులు ప్రతిపాదించిన ఉర్దూ సానుకూలతతో కూడిన మాతృభాష పట్ల వ్యతిరేకత ఏమో “బౌతిక పునాది ఉన్న శాస్త్రీయమైనది”గానూ కనపడటంలో కేవలం 175 ఏళ్ళ కింద మొదలైన తమ పరాయీకరణను ప్రేమించుకునే మితిమీరిన స్వానురాగం తప్ప ఎటువంటి ఆదర్శమూ లేదని అనిపిస్తున్నది నాకు.

    Telanganites feel that apart from being Telugus they have built up their own way of life during the last 175 years అనే భావంతో ఉన్న బూర్గుల రామకృష్ణారావు గారి మూడు నాలుగు పాయింట్లు కమ్యూనిష్టులు చేసిన రైతాంగ పోరాటానికి టార్గెట్ అయిన నిజాము పెంచి పోషించిన ఉర్దూ భాషాధిక్యత నిండిన మిశ్రమ సంస్కృతి మీద వారికి గల ప్రీతిని చూపిస్తుంది.కమ్యూనిష్టుల్నీ కమ్యూనలిస్టుల్నీ ఒకే గాటన కట్టేసి కమ్యూనిష్టులు మిగిలిన చోట్ల చేసినట్టే ఇక్కడా చేస్తున్నారు అని అర్ధం వచ్చేలా as in similar cases in other parts of India అని సెటైరు కూడా వేసి వాళ్ళే విశాలాంధ్రను కోరుకుంటున్నారనీ అదొక రాజకీయ క్రీడయే తప్ప వాళ్ళలో ప్రజల పట్ల నిజాయితీ లేదనీ తేల్చి చెప్పిన బూర్గుల రామకృష్ణా రావు గారు 175 సంవత్సరాల క్రిందట తాము వేరు దారి తీసుకోవడం గురించి గర్వించడం సహజమే కదా - ఇతరుల ఆదర్శాల్ని అసంబద్ధం, అశాస్త్రీయం అనేసి తమ పరాయీకరణను మాత్రం ఆదర్శం, ఔన్నత్యం అని చెప్పుకోవడం ఎంత విచిత్రం!

    ReplyDelete
  15. లేఖలో ఉన్న సందిగ్ధత Shri U.N.Dhebar బోరు కొట్టించి ఎవరికీ చెప్పలేదో చెప్పినా ఎవరూ పట్టించుకోలేదో బూర్గుల రామకృష్ణా రావు గారు లేఖలో పంపుతానన్న తదుపరి సుదీర్ఘ నివేదికని పంపించారో లేదో తెలియడం లేదు గానీ లేఖ వ్రాసిన కొన్ని నెలలకే, 1955 డిశెంబర్ 03న హైదరాబాద్ శాసనసభలో ఆంధ్రతో కలయిక గురించి వోటింగు పెట్టినప్పుడు మొత్తం 174 మంది శాసనసభ్యులలో 147 మంది వోటింగులో పాల్గొన్నారు.వీరిలో 103 మంది కలయికకు అనుకూలం, 16 మంది తటస్థం, 29 మంది వ్యతిరేకం అయ్యారు.మొత్తం తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు 94 మంది - వీరిలో 36 మంది కమ్యూనిష్టులు, 40 మంది కాంగెసు వాళ్ళు, 11 మంది సొషలిష్టులు.వీళ్ళందరిలో ఆంధ్రలో తెలంగాణ విలీనానికి 59 మంది అనుకూలం 25 మంది ప్రతికూలం.ఇందులో ఆంధ్ర ప్రాంతపు నాయకుల ప్రమేయం గానీ ప్రభావం గానీ ఏమీ లేదు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పేరుతో ప్రజల్ని ఉత్తేజపరిచి నిజామును బలహీనం చేసిన కమ్యూనిష్టులకే తెలంగాణ ప్రజల్లో పలుకుబడి ఎక్కువ గనక హైదరాబాద్ శాసనసభలో వారి మాటయే నెగ్గింది!

    అయితే, బూర్గుల రామకృష్ణా రావు గారికీ ఇతర తెలంగాణ మేధావులకూ ఉన్న సందేహాలను ఆంధ్ర ప్రాంతపు నాయకులు కూడా పట్టించుకున్నారు.అన్ని ప్రాంతాల కాంగ్రెసు నాయకులు కలిసి 1956 జూలై 19న ఒక ఒప్పందానికి వచ్చారు.దీనినే పెద్దమనుషుల ఒప్పందం అన్నారు.న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు 1956 ఫిబ్రవరి 20 అని కె.వి.రంగారడ్డి గారు తన స్వీయచరిత్రలో రాశారు.తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె.వి. నరసింగరావు ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న సంతకాలు చేశారు.ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవి:01).కనీసం ఐదేళ్ళపాటు, ప్రాంతాల వారీ రెవిన్యూ వసూళ్ళకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు పెట్టాలి.తెలంగాణ ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి.02).తెలంగాణాలో విద్యాసంస్థలను అభివృద్ధి చెయ్యాలి. స్థానిక విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషనులు ఇవ్వాలి.03).సివిలు సర్వీసులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి.04).ఐదేళ్ళ పాటు పాలనా వ్యవస్థలోను, న్యాయ విభాగం లోను ఉర్దూ వినియోగం కొనసాగాలి.05).రాష్ట్ర మంత్రివర్గంలో నిష్పత్తి ప్రకారం సభ్యులు ఉండాలి. ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ నుండి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి, ముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయితే ఉపముఖ్యమంత్రి ఇతర ప్రాంతాల నుండి ఉండాలి.06).ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తెలంగాణా అభివృద్ధి మండలికి ఉండాలి. మండలి సభ్యులు తెలంగాణా ప్రాంతం నుండి ఎన్నికైన శాసన సభ్యులు ఉండాలి.07).తెలంగాణాలో మధ్యపాన నిషేధాన్ని తెలంగాణా శాసనసభ్యులు కోరిన విధంగా అమలు చెయ్యాలి.08).తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు ఆ ప్రాంతంలో కనీసం 12 ఏళ్ళపాటు నివసించి ఉండాలని నిబంధన రూపొందించాలి.09).కాబినెట్ మంత్రులలో 40 శాతం తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.ఈ ఒప్పందం తరువాత తెలంగాణా నాయకులలో ఉన్న సందేహాలు తొలగి, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

    ReplyDelete
  16. 1973 డిసెంబర్ 10 మొదలు 1978 మార్చి 06 వరకు ముఖ్యమంత్రిత్వం నిర్వహించిన (16)జలగం వెంగళ రావు గారు తెలంగాణ ప్రాంతానికి కాకతీయ యూనివర్సిటీ, కోస్తా ఆంధ్ర ప్రాంతానికి నాగార్జున యూనివర్సిటీ, రాయలసీమ ప్రాంతానికి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ సాధించి తీసుకొచ్చి 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు చేసి 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్నీ 1972 నాటి జై ఆంధ్ర ఉద్యమాన్నీ కొంత చల్లబరిచారు.

    వెంగళ రావు గారి తర్వాత 1978 మార్చి 06 మొదలు 1980 అక్టోబర్ 11 వరకు మొదటి విడత ముఖ్యమంత్రిత్వం నిర్వహించిన (17)మర్రి చెన్నారెడ్డి గారి అధ్వర్యంలోనే 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిచింది. మర్రి చెన్నారెడ్డి గారు 1956లో ఆంధ్రా తెలంగాణా కలయికని వ్యతిరేకించారు.బాగానే ఉంది, అతనికి కలయికపట్ల వ్యతిరేకత ఉన్నందువల్ల దోషం ఏమీ లేదు.కానీ, పెద్దమనుషుల ఒప్పందంలో తనూ భాగస్వామి అయ్యారు.తన డిమాండ్లు చెప్పారు.

    తర్వాత జరిగిన చరిత్ర ప్రకారం వికారాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికై 1957–62 మధ్యన Public Accounts Committeeలో పనిచేశారు.రెండుసార్లు Estimates Committeeకి చైర్మనుగా పనిచేశారు.Andhra Pradesh Regional (Telangana) Development Committeeకి చైర్మనుగా పని చేశారు.1962లో తండూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యాక మొదట Planning, Panchayat Raj శాఖలతోనూ పిదప Finance, Commercial Taxes, Industries శాఖలతోనూ మంత్రి పదవిని అలంకరించారు.మళ్ళీ 1967ల నాడు కూడా శాసనసభకు ఎన్నికై Finance, Education, Commercial Taxes శాఖలతో మంత్రిత్వం అనుభవించారు.అప్పుడు రాష్ట్ర మంత్రిత్వం నుంచి తప్పుకుని కేంద్రంలో 1967–68 మధ్యన Steel, Mines, Metals శాఖలతో మంత్రిత్వం సంపాదించాడు. అన్నీ చేసి తీరా ఏప్రిల్ 1968న రాజీనామా చేసి వెంటనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు!

    మహా ఘనత వహించిన మర్రి చెన్నారెడ్డి గారి అధ్వర్యంలో నడిచిన తెలంగాణ ఉద్యమపు నీచత్వాన్ని తెలుసుకోవటానికి ఈ కొంచెం చరిత్ర చాలదూ!తను మంత్రిత్వం వెలగబెట్టిన కాలం నాడు జరిగిన అన్యాయం మీద తనే తిరగబడటం ఏమిటో అందులోని మోసం ఏమిటో ఇప్పటికీ తెలుసుకోలేని తెలంగాణ ప్రాంతపు మేధావుల అజ్ఞానం మీద నాకు జాలి వేస్తుంది.వాళ్ళ ఆజ్ఞానంతో ఇన్నేళ్ళూ వాళ్ళని వాళ్ళు సర్వనాశనం చేసుకున్నది చాలక వాళ్ళకన్న పదింతలు తెలివైనవాళ్ళైన ఆంధ్ర ప్రాంతపు ప్రజల్ని కూడా సర్వనాశనం చేశారు!

    దేశం మొత్తం మీద ఎలా ఎన్నికలు జరుగుతాయో తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ అలాగే జరుగుతాయి కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యుల్ని తెలంగాణ వోటర్లే ఎన్నుకుంటారు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యుల్ని ఆంధ్రా వోటర్లే ఎన్నుకుంటారు కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధి కోసం పనిచెయ్యరు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతపు అభివృద్ధి కోసం పనిచెయ్యరు కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధిని అడ్డుకోలేరు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతపు అభివృద్ధిని అడ్డుకోలేరు కదా!

    1968 నాటి చెన్నారెడ్డి గారూ 2001 నాటి కేసీయార్ గారూ ఒకేలాంటి కబుర్లు చెప్పారు, రెండుసార్లూ తెలంగాణ ప్రజలూ మేధావులూ ఒకే రకం పిచ్చితనాన్ని ప్రదర్శించారు,పైన ఆంధ్ర ప్రాంతపు నాయకుల్ని దొంగలనీ దోపిడీదార్లనీ తిడుతున్నారు.

    చెన్నారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకి జరిగిన ఘోరమైన అన్యాయాన్ని సరిదిద్దాలంటూ ఆ సమయంలో ప్రభుత్వంలోనే ఉండి అదీ అత్యంత కీలకమైన శాఖలను నిర్వహిస్తూ ఆ అన్యాయంలో భాగస్వామియైన చెన్నారెడ్డియే ఉద్యమించడం ఏమిటో, ఆనాటి డొంకతిరుగుడు బెదిరింపు తతంగాన్ని పట్టుకుని ఇవ్వాళ కొందరు తెలంగాణ ప్రజలూ మేధావులూ మాది 1968 నాటి నుంచి రగులుతున్న స్వాతంత్య్ర కాంక్ష అని బట్టలు చింపుకోవడం ఏమిటో - అస్సలు కామన్ సెన్సు కూడా ఉండదా!

    అయిదేళ్ళ ఆర్భాటం తర్వాత 1973 నాటికి అనవసరపు విభజన ఇష్టం లేని శ్రీమతి ఇందిరా గాంధీ కలగజేసుకుని ఆరు సూత్రాల ఫార్ములా ప్రకటించి రాజీ చేశాక జరిగిన లోపాయకారీ ఒప్పందం ప్రకారం మర్రి చెన్నారెడ్డి గారు మొదట ఉత్తర ప్రదేశ్ గవర్నర్ పదవినీ వెంగళ రావు గారి తర్వాత 1978 నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిత్వాన్నీ దక్కించుకున్నారు.

    ReplyDelete