Saturday, December 12, 2009

తెలంగాణా ప్రజల మనోభావాలకు విలువ లేదా? ...



అత్యధిక తెలంగాణా ప్రజలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనీ, తమ భాషా సంస్కృతులనూ, చరిత్రనూ పదిలంగా కాపాడుకోవాలనీ తహతహలాడతారు. 1956 కు ముందు నుంచే వారిలో ఈ స్వాభిమాన భావన బలంగా వుంది.

తెలంగాణా సామాన్య ప్రజానీకం1948కి పూర్వమే నిజాం నవాబుకూ, దొరలకూ, జాగిర్దార్లకూ వ్యతిరేకంగా మహత్తరమైన సాయుధ రైతాంగ పోరాటం సాగించింది. తెలంగాణా చరిత్రలోనే కాదు ప్రపంచ భూస్వామ్య వ్యతిరేక ప్రజాపోరాటాలలో అదొక ఉజ్వల ఘట్టం.

ఆ పోరాటం విజయవంతమవుతున్న దశలో 'సైనిక చర్య' జరిగి తెలంగాణా ప్రజల ఆకాంక్షల మీద నీళ్లు జల్లింది. తెలంగాణా ప్రజలు ఏ వ్యవస్థ వద్దని తమ ప్రాణాలకు తెగించి పోరాడారో తిరిగి ఆ దుర్మార్గపు భూస్వామ్య వ్యవస్థే వారి మీద బలవంతంగా రుద్దబడింది.

తెలంగాణా ప్రజల మనోభావాలకు తగిలిన మొదటి శరాఘాతం అది.


ఊళ్లల్లోంచి పారిపోయిన దొరలే షేర్వానీలు, రూమీ టోపీలు విసర్జించి ఖద్దరు బట్టలు, గాంధీ టోపీలు ధరించి రాజకీయనాయకులై మళ్లీ తెలంగాణా ప్రజానీకం నెత్తి మీద కూచున్నారు. తెలంగాణా దొరలకు తమ స్వార్థమే తప్ప తెలంగాణా ప్రజల బాగోగులు ఎప్పుడూ పట్టవు. అందుకే తెలంగాణా నాయకత్వం ఎప్పుడూ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ తన ప్రజానీకాన్ని తనే వంచిస్తూ వస్తోంది. మెజారిటీ ప్రజల అభిప్రాయాలను గ్రహించకుండా నాటి తెలంగాణా నాయకత్వం 1956లో తెలంగాణాను తీసుకెళ్లి ఆంధ్రాలో (గంగలో) కల్పింది. తెలంగాణాకు మరోసారి బానిస సంకెళ్లు వేసింది.

తెలంగాణా ప్రజల మనోభావాలకు తగిలిన రెండవ శరాఘాతం అది.


ఉమ్మడి రాష్ట్రంలో తొలి రోజునుంచే చేసుకున్న ఒప్పందాలనన్నింటినీ ఆంధ్ర నేతలు ఉల్లంఘించడం మొదలుపెట్టారు. అయినా తెలంగాణా నేతలు తమ పదవులు తమ స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటూ వుండిపోతూ వచ్చారు.1969 లో తెలంగాణా విద్యార్థులు ఆ అన్యాయాలకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమించినప్పుడు చెన్నారెడ్డి వంటి (భూస్వామ్య) నేతలు ఉద్యమాన్ని హైజాక్‌ చేసి తమ పదవులకోసం టోకున ఆంధ్ర నేతలకు అమ్మేశారు.

తెలంగాణా ప్రజల మనోభావాలకు తగిలిన మూడవ శరాఘాతం అది.

ఆంధ్ర పాలకులు తెలంగాణా సమస్య ఎప్పుడు తెరమీదకు వచ్చినా ఏవో ''ఆపద మొక్కుల'' వంటి ఒప్పందాలు, వరాలు, ఫార్మూలాలు, జీవోలు ప్రసాదించి ఆ తర్వాత ఉద్యమ వేడి చల్లారగానే వాటిని బుట్ట దాఖలు చేయడం అ లవాటుగా మారింది. ఆ మోసాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న తెలంగాణా ప్రజలు ప్రత్యేక తెలంగాణా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని తీర్మానించుకున్నారు. అందుకు ఉవ్వెత్తున ఉద్యమించారు. ఎన్నాళ్లనుంచో కంటున్న తమ అస్తిత్వ కల నిజమవబోతున్న ఈ వేళ దానిని ఛిద్రం చేసేందుకు మళ్లీ ప్రతీప శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆ దిశలో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు చూస్తుంటే తెలంగాణా ప్రజల గుండెలు అవిసిపోతున్నాయి.

తెలంగాణా ప్రజలు తమ కష్టం తమకు దక్కాలని కోరుకునే వారే తప్ప ఇతరుల కష్టం దోచుకొవాలనుకునేవారు కాదు. వారు తమ రాష్ట్రం తమకు కావాలని వాంఛిస్తున్నారే తప్ప ఇతర ప్రాంతాలను ఆక్రమించుకోవాలనుకోవడం లేదు.

తెలంగాణా ప్రజలకు ఆంధ్ర ప్రజల మీద ద్వేష భావం లేదు.
ఆంధ్ర ప్రజలకే తెలంగాణా ప్రజల మీదా వారి భాషా సంస్కృతుల మీదా చాలా చులకన భావం వుంది. ఉమ్మడి రాష్ట్రంలో నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, విద్య తదితర అన్ని రంగాలలో తెలంగాణా ప్రజలు అడుగడుగునా దారుణమైన అన్యాయానికి గురయ్యారు.
ఇందుకు కావలసిన వివరాలు అనేక తెలంగాణా వెబ్‌సైట్లలో చూడవచ్చు. వాటిని ఇక్కడ పేర్కొనడం చర్విత చర్వణమే అవుతుంది.

తెలంగాణాకు తెలుగు తల్లి మీద ద్వేషం లేదు.
పొట్టి శ్రీరాములు త్యాగం మీద ద్వేషం లేదు.
ఆంధ్ర శబ్దం మీద ద్వేషం లేదు.
ఆంధ్ర సామాన్య ప్రజల మీదా ద్వేషం లేదు.
ఇటీవల జరిగిన సంఘటనలన్నీ ఉద్యమం ఉధృతంగా సాగేప్పుడు కొందరు ఆవేశపరులు చేసినవే తప్ప మరొకటి కాదు. ఏ ఉద్యమంలోనైనా అట్లాంటి సంఘటనలు, మాటలు, పదజాలం అత్యంత సహజం. స్వప్నం సాకారమై, ఆవేశకావేశాలు తగ్గిన తరువాత ఇట్లాంటివి ఇక కనిపించనే కనిపించవు.

తెలంగాణా అంటేనే తెలుగు వాళ్లు నివసించే చోటు అని అర్థం. (ఆణెము=నివాసము). అట్లాగే ఆంధ్ర శబ్దం తెలంగాణాలోనే మొదటినుంచీ విస్తృతంగా వాడకంలో వుంది. అంతెందుకు ఆనాటి తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటానికి బీజం వేసిన ''సంఘం'' పేరే ''ఆంధ్ర మహాసభ''. అట్లాగే " ఆంద్ర జనసంఘం " , ''ఆంధ్రోద్యమం'' " ఆంద్ర సారస్వత పరిషత్తు " వంటి ఇతర సంఘాలు ఎన్నో నిజాం సంస్థాన కాలంలో వుండేవి. గ్రంథాలయోద్యమంలో భాగంగా హైదరాబాద్‌లో (కోఠీ సుల్తాన్‌ బజార్‌) అ లనాడు స్థాపించిన గ్రంథాలయం పేరు ''శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం ''. అట్లాగే వరంగల్లు (హన్మకొండ)లోని అ లనాటి గ్రంథాలయం పేరు ''రాజరాజ నరేంద్ర గ్రంథాలయం''. అవి ఇప్పటికీ వున్నాయి.

1956 తర్వాత సమైక్యత పేరుతో ఆంధ్ర రాజకీయ నాయకులు చేస్తూ వచ్చిన అన్యాయాలు, కుత్సితాల మూలంగానే తెలంగాణాలో తెలుగుతల్లి అన్నా,'' ఆంధ్ర '' పదమన్నా ఒకవిధమైన అ లెర్జీ ఏర్పడింది. అందుకు ఆంధ్ర రాజకీయ నేతల్నే నిందించాల్సి వుంటుంది తప్ప తెలంగాణా ప్రజల్ని కాదు. అయినా ఆంధ్ర రాష్ట్రం - తెలంగాణా రాష్ట్రం విడిపోయిన తరువాత ఇట్లాంటి చిన్న చిన్న అ ల్లరి చిల్లరి పనులేమీ మునుముందు వుండవు. అందరూ అన్న దమ్ముల్లా కలిసి మెలసి వుంటారు.

తమ రాష్ట్రం తమకు కావాలనేది తెలంగాణా ప్రజల న్యాయమైన కోరిక.
చాలా చిన్న ప్రజాస్వామిక కోరిక.
ఇందులో సామ్రాజ్యవాద దృక్పథంలేదు.
ఏ దోపిడీ కుతంత్రమూ లేదు.
ఇది మూడున్నర కోట్ల తెలంగాణా ప్రజల 40 సంవత్సరాల పోరాట దీక్ష.

తెలంగాణా ప్రజల తరతరాల స్వప్నం నిజం కానివ్వండి.
తెలంగాణా సంకెళ్లు తెగిపోనివ్వండి.
తెలంగాణా ప్రజల మనోభావాలను గౌరవించండి.

జై తెలంగాణా!
జై ఆంధ్రా!
జై రాయలసీమ!

28 comments:

  1. jai telangana..
    jai andhra..
    jai rayalaseema..

    very nice.. :) ..

    to complete ur list...



    [b]JAI SAMAIKYANDHRA....

    ReplyDelete
  2. అదేంటి మమ్మలను మర్చి పోయారు :(

    జై సమైక్య గ్రెటర్ హైదరాబాద్ స్టెట్.

    ReplyDelete
  3. neeyabba...
    తెలంగాణాకు తెలుగు తల్లి మీద ద్వేషం లేదు.
    పొట్టి శ్రీరాములు త్యాగం మీద ద్వేషం లేదు.
    ఆంధ్ర శబ్దం మీద ద్వేషం లేదు.
    ఆంధ్ర సామాన్య ప్రజల మీదా ద్వేషం లేదు.
    ఇటీవల జరిగిన సంఘటనలన్నీ ఉద్యమం ఉధృతంగా సాగేప్పుడు కొందరు ఆవేశపరులు చేసినవే తప్ప మరొకటి కాదు. ఏ ఉద్యమంలోనైనా అట్లాంటి సంఘటనలు, మాటలు, పదజాలం అత్యంత సహజం. స్వప్నం సాకారమై, ఆవేశకావేశాలు తగ్గిన తరువాత ఇట్లాంటివి ఇక కనిపించనే కనిపించవు.

    kodakallara...covering ah??? kannatallini kuda anagala samarthuluraa... siggu lajja oonamanalu unte kada.. anna naakodukulaki samskruti/bhasha/pedar ikam/kastam/viluvalu ante em telusu????

    ReplyDelete
  4. న్యాయమైన కోరిక ante entraa....???
    paapam NTR vaalla vijayawada develop chesukoledu..
    Babu vaalla chithuru develop chesukoledu..
    kaasu brahmanadareddy guntur ni pattinchukoledu.
    kaani vaallandariki hyd developmente mukhyam...endukante meelanti kuchita mansulu kaavu kadaa....
    rajadhaani chuttu unna jillallo abhivrudhi ledaa??
    alergy anta.. siggu undaaa??

    asalu rendo pakisthan laaga unna city ilaa tayarayinanduku konchem anna anandapadutunnaraa?
    charitra teliyani heenulaki followers raa meerantha...
    pallelu pedarikam annichotla unnayi.. kallu terichi telangaana bayatakochi chudandi.
    samskruti/pedarikam/raajakeeyanayakula dopidi anni telangana bayatakuda kanipisthayi.

    siggulekapothe sari..

    ReplyDelete
  5. Andhra vallaku Telangana ante emito kuda teliadu. vallu enta sepu valla sodi tappi pakkavadi vishayalu ento kuda pattichukoru

    ReplyDelete
  6. ఇంకెన్నాళ్లు ఎవరిమీదనో పడి ఏడుస్తారు?

    ReplyDelete
  7. 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.

    ReplyDelete
  8. "తెలంగాణాకు తెలుగు తల్లి మీద ద్వేషం లేదు.
    పొట్టి శ్రీరాములు త్యాగం మీద ద్వేషం లేదు.
    ఆంధ్ర శబ్దం మీద ద్వేషం లేదు.
    ఆంధ్ర సామాన్య ప్రజల మీదా ద్వేషం లేదు.
    ఇటీవల జరిగిన సంఘటనలన్నీ ఉద్యమం ఉధృతంగా సాగేప్పుడు కొందరు ఆవేశపరులు చేసినవే తప్ప మరొకటి కాదు. ఏ ఉద్యమంలోనైనా అట్లాంటి సంఘటనలు, మాటలు, పదజాలం అత్యంత సహజం. స్వప్నం సాకారమై, ఆవేశకావేశాలు తగ్గిన తరువాత ఇట్లాంటివి ఇక కనిపించనే కనిపించవు. "

    అవునా???

    మరి భాగో ఆంధ్రా వాలా అన్నవాడు కూడా ఎదో పిచ్చికుక్కయెనా? తెలుగు తల్లి మీద ద్వెషం లేకపొతే బాలీవుడ్ భామ లాగా ఓ తెల్ల తల్లిని కొత్తగా ఎందుకు తెచ్చిపెట్టినట్లు? తెలుగుతల్లి అనేది తెలుగుభాష కు సంబందించింది కాని, ఒ ప్రాంతానికి సంబందించింది కాదు కదా? అప్పుడు సెప్పకపోయారా మీ వోడికి ఈ కవరింగ్ మాటలు?
    ఆంధ్ర శబ్దం మీద ద్వేషం లెదా, లేకపోతే ప్రతి ఊళ్లొ హోటళ్ల పేర్ల దగ్గరనుండి, బ్యాంక్ పేర్ల వరకూ ఎందుకు తుడిచినట్లో? అది ప్రాంతానిది కాదు, ఓ జాతిది అని తెలిసినా? అది కొద్ది మంది చేసినపనా? ఓ ప్రాంతమంతా చేసినపనా?

    మీకు ద్వేషం అంటూ ఉంటే, తెలంగాణా పేరు చెప్పుకొని సాయంత్రమయితే ఎవరిమీదయితే గొఱ్ఱెలను రెచ్చగొడుతున్నారో , వాళ్లతో మందుకొడుతూ, మమూళ్లు వసూలు చేసుకొని, కోట్లు కూడేసుకొనే వాళ్ల మీద ఉండాలి. మీ ప్రాంత అభివృద్ది గురించి పట్టించుకోని పాలకుల మీదండాలి. తెలంగాణా పేరుతో మాఫియా గా తయారయ్యి, కాలేజీ లదగ్గరనుండి, చిన్న చిన్న పరిశ్రమలవరకూ మామూళ్లు వసూళ్లు చేస్తున్న గుండాగాళ్లు, తమ బంధువర్గాన్నంతా తెలంగాణా భవన్ లో దింపిన వాళ్ల మీదౌండాలి, ముందు మీ లీడర్షిప్ ను క్లీనప్ చేసుకోండి, అప్పుడు ఈ కవరింగ్ కబుర్లు ఎవ్వరయినా నమ్ముతారు. అప్పటివరకూ తెలంగాణా అనెది కొంతమంది రాజకీయ నిరుద్యొగులు తమ స్వార్ధంకోసం, గొఱ్ఱెలు లాంటి తమను నమ్మి, రెచ్చిపోయే వాళ్ల ను రెచ్చగొట్టే ఉద్యమం మాత్రమే. మీరు చెప్పినవన్నీ కావచ్చు ముందు దానిని జనాలు (అందరూ) నమ్మాలంటే నాయకత్వాన్ని మార్చండి, అప్పుడు ఎంతో కొంత సానుభూతి నమ్మకం వస్తుంది.

    చివరిగా, గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ వాళ్లదే అని మాత్రం మరవకండి. స్వపరిపాలన స్వపరిపాలన అని గౌంతు చించుకొనే ముందు, గ్రేటర్ వాళ్లకు కూడా (కోటి మందికి) వాళ్ల స్వపరిపాలన కావాలనుకొనే కొరిక ఉంటుంది అని గ్రహించండి.

    ReplyDelete
  9. "1956 తర్వాత సమైక్యత పేరుతో ఆంధ్ర రాజకీయ నాయకులు చేస్తూ వచ్చిన అన్యాయాలు, కుత్సితాల " అన్నారు, మీకో మాట, మీ తెలంగాణా రాజ్కీయనాయకులు ఎంత ఎదవలో, వెరె ప్రాంత రాజకీయనాకులు కుడా అంతే ఎదవలు, వాళ్లెకెవరకీ వాళ్ల కుటుంబాలకు న్యాయం చేసుకోవటం లొ ఉన్న నిజాయితీ వెరే విసయాలలో ఉండదు. అన్యాం, కుస్తితం??? ఏమయినా kcr కరిచాడా మిమ్మలను?


    మీరు చెప్పె 1956 తర్వాతే కెంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు," విద్య, వైద్యం, పారిశ్రామికప్రగతి, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయరంగం" ఎ ఎ ప్రాంతాలలో ఎంతెంత ఖర్చుపెట్టారో చెబ్తారా? website లనిండా బండెడు సమాచారం అక్కర్ల, పైన పేర్కొన్న చాలా సింపుల్ లెక్కలు చూస్తే అర్ధం అవుతుంది కదా? ఏ తెలంగాణా website లో నయినా, ఏ తెలంగానా వీరులయినా పైన పేర్కొన్న సింపుల్ లెక్కలు refer చేసి మాట్లాడుతున్నరో చెబ్తారా? ఆ తర్వాత అన్యాయం, కుత్సితం గురించి మాట్లాడితే కొంచం బాగుంటుందేమో కదా? లేక మీరూ kcr శిష్యులేనా?

    ReplyDelete
  10. 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.

    ReplyDelete
  11. IMPORTANT

    TELANGANA ane peru ela vachindo asalu telusa?

    total AP was called as " TRILINGA DESAM" - DESTINATION OF THREE SIVA KSHETRAS.

    DUSHTA NIZAM AND BRITISHERS COULD NOT SPELL OUT AND COVERTED IT TO TELENGANA IN 500 YEARS.

    UR BACKWARDESS IS DUE TO NIZAMS RULE, THE DEVELOPMENT IN TELANGANA NOW IS BROUGHT BY COASTAL ANDHRA AND RAYALASEEMA PEOPLE, DEFFINETLY BETTER THAN PAST 10 YEARS.

    HYDERABAD belongs to total Andhra pradesh not only to any particular region.

    what you said about the problems are true, these are the problems faced not oly in telangana but also in all rural parts of india, GETTING SEPERATED IS NOT THE SOLUTION TO THE PROBLEM", JUST KNOW HOW PEOPLE WWHO GET DAILY WAGES ARE AFFECTED BY THE AGITATION STARTED BY kcr, because of the this problem raised oue develpmant went back for 10 years.

    we must think about our national integration. Now so many are asking for formation of new states, this is nothing but division of united india and IMMEDIATE THREAT FROM CHINA.
    if there is no integration of states from where can you get the development.

    TELANGANA PROBLEM CAN BE SOLVED BY STRENTHENING OF REGIONAL DEVELOPMENT BOARDS, people should vote, people sholud always question their MLA and MP whom they have elected , what will they do for 5years TO THEM, WHAT HAVE DO DONE FOR US IN THESE 5 YEARS SO THAT WE WILL HAVE TO ELECT YOU AGAIN?

    ASKING FOR SEPERATE STATE MEANS
    1. ASKING FOR POWER, new ministries.
    2. GETTING FUNDS FROM GOVT. NOT FOR DEVELOPMENT BUT FOR THEIR GREED, more money.

    FIGHT WITH THE MP'S AND MLA'S , USE YOUR ENERGY ,QUESTION THEM IF YOU HAVE ELECTED,

    DO NOT WASTE YOU ENERGY BY ASKING FOR SEPERATION " SEPERATION IS A SIN"

    we must work together to solve our problems, for out Andhra Pradesh and importantly India.

    remember the old saying
    "kalisi unte kaladu sukhamu" " united we stand divided we fall".

    ReplyDelete
  12. kalasi unte kaladu "meeku" sukham, maaku "dukham"

    ReplyDelete
  13. kalasi unte kaladu "meeku" sukham, maaku "dukham

    అందుకే సెపరేట్ హైదరాబాద్ కావాల.
    జై హైదరాబాద్ స్టెట్, జై దానం.

    ReplyDelete
  14. "ఖద్దరు బట్టలు, గాంధీ టోపీలు ధరించి రాజకీయనాయకులై మళ్లీ తెలంగాణా ప్రజానీకం నెత్తి మీద కూచున్నారు. తెలంగాణా దొరలకు తమ స్వార్థమే తప్ప తెలంగాణా ప్రజల బాగోగులు ఎప్పుడూ పట్టవు.

    పరిస్థితి ఇప్పటికీ అలానే ఉంది. ఇది ఒక్క తెలంగాణాకే పరిమితం కాదు. రాజకీయ నాయకుడెవడికయినా తన ప్రాంతం కంటే తన సంపాదన, అధికారం లాంటివే ముఖ్యం. ఇన్ని ఏళ్ళు తెలంగాణా సెంటిమెంటు సజీవంగా ఉండగా, అసలు తెలంగాణా అభివృద్ది కోసం పని చేసిన తెలంగాణా నాయకులు ఎంత మంది ? తెలంగాణా వాళ్ళెవరూ అసెంబ్లీకీ, పార్లమెంటుకీ వెళ్ళలేదా ? ఆ మాటకొస్తే కేసీయారు వెళ్ళలేదా ?
    తెలంగాణా నేతలందరూ పూనుకుని ప్రాంతం అభివృద్ది చేయ్యాల్సిందే అని ఒత్తిడి తీసుకొస్తే అభివృద్ది జరిగేది కాదా ? లోపం ఎక్కడ ఉంది ?
    ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఒస్తే ఎదో బాగు పడిపోతుందనీ, భూతల స్వర్గం ఐపోతుందనీ ఎందుకు అనుకుంటున్నారు ?
    అసలు ఉద్యమం ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో మొదలయిందో అర్ధం చేసుకుని, ఇప్పుడున్న సమస్యలకే సరైన పరిష్కారం విడిపోవడమే అని పూర్తిగా నమ్మకం కుదిరాకేనా ఆందోళన చేస్తున్న వాళ్ళందరూ చేస్తున్నది ? వీళ్ళలో గుడ్డిగా చేసేవాళ్ళు ఎంత మంది ?

    నిజాంకి వ్యతిరేకంగా చేసిన పోరాటం, వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా జరగాల్సినప్పుడు ఎందుకు చల్లారిపోయింది... మళ్ళీ వేర్పాటువాదంగా ఎందుకు మారింది. గతిలేకే అలా మారింది అని అనుకోవచ్చేమో, అసలు అభివృద్ది కోసం Honest Effort జరిగిందా లేద అని మనం ప్రశ్నించుకోవాలి .

    ReplyDelete
  15. Chudandi.... Naaku thelisi TELANGAANA ante Telugu Bhumi ani, Meeremina vere artham cheputhara?

    Sare meerantunnattu Samskruthi/Sampradayaniki vaddamu?
    1956 nunchi TELANGANA KADU/1500 years nunchi kuda Telugu varu vunnaru.
    POTHNA Evaru? Vari Basha Samskruthi Andhravari Basha samskruthi vera?

    Emandi? SANKRANTHI andaru jarupukuntaru? alge Vugadi Jarupukuntaru, viluvinavi ani.

    Mee local festivals vunnayi? Sarkar/Rayalaseema lo kuda local festivals vunnayi. Ayinantha matrana manam vera?

    Mundu Prajalu marali, 50 Yrs moment antunnaru, 1500 yrs relationship chudandi.

    Manam Telugu varam, mana di telugu rashtram.

    Inka Political vishayanikoddamu sare na.
    Rayalaseema: Independence ki mundu, Ikkada Reddy/karnam rajyam jarigedi, Prajalu peedimpabade vallu, Inka vaati effect vundi ade faction isam, Kaani Prajala abhimanam meekante ikkadi vaallaki ekkuva, pranam poyina mata marcharu.
    Intha daridra paristhithilo kuda maaki Samakya andra ne kaavali, Edina reason chepthara deeniki? emi labham Veeriki Telangana area nunchi.
    Prati Gramam vallu valla leaders ni vallaki anugunanga marchukoni Improve ayyaru, avuthunnaru, Kulam ledu, vishamyam ledu emi ledu...? Inka oka 50 Yrs ki emi vundadu akkada.

    Inka Telangana vishayanikoddamu
    TELANGANA(Meeru anukuntunnadi):
    Ikkada Patel vevastha vundedi(Independence ki mundu malli tharuvatha kuda), Evarina deeni meeda poradara????
    NTR mee jeevithalani marchadu, thanaku TELANGANA GURINCHI EMI THELEDU KABOLU?

    VEERIKI RAJAKEEYAM NERPINDI NTR, malli chaputhunna Mee leade vunnade KCR VADI KODUKU PERU KUDA TARAKA RAMARAVU.

    Ikkada Meeru telangana vallani, Rayalaseema vallani sarkaru vallani naaku 10th class varaku theledu... Meekemina 1st class nunchi chaputhunnara schols lo? Area feelings?

    Emandi? mundu meeru marandi malli nayakulanu marchandi? eppudina mee area MRO tho matladara Govt scheems gurinchi?

    Vibhagam pariskaram kaadu? Marpu Pariskaram?

    Denikosamina Poratam chesara?? maaku anyam jaruguthundi ani?

    Swartham kosam poratam kudadu, Charitra Kshaminchadu. manchi ga alochinchandi, naadi ani nirnayam kudadu.

    Maadi ani nirnayam thesukondi appudu thelustundi.

    JAI ANDRA PRADESH.. JAI JAI ANDRA PRADESH

    ReplyDelete
  16. ఆంధ్రా సోదరులు చెప్పినట్లు పేదరికం, రాజకీయ నాయకుల స్వర్ధ రాజకీయాలు భారత దేషం లో ఎక్కదనా ఉన్నయి. అయితే ఇక్కడ విషయం అది కాదు.

    తెలంగాణా వాసులకు చెందిన జల వనరులను తెలంగాణా వాల్లకు ఇవ్వకుండా ఆంధ్రా కు, రాయలసీమ కు తరలిస్తోంటే కడుపు మాడిన తెలంగాణా వాడి ఆక్రొషం ఈ ఉద్యమం. ఇది అంతటా ఉండేది కాదు.

    ఇక ఆంధ్రా మెస్సులపై దాడి సంగతి.. ఇంతకు ముందు చెన్నా రెద్ది ని దించడానికి జగన్ బాబు రాయలసీమ గుండాలను తెస్తే, ఇప్పుడు రోసయ్య ను దించడాని ఈ యువనేత చేసిన రాజకీయం మాత్రమే ఈ దాడులు.

    ReplyDelete
  17. *అత్యధిక తెలంగాణా ప్రజలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనీ, తమ భాషా సంస్కృతులనూ, చరిత్రనూ పదిలంగా కాపాడుకోవాలనీ తహతహలాడతారు*
    మందారా గారు, అసలికి తెలంగాణా కి ఉన్న సంస్క్రుతి ఎవిధం గా హిందూ/భారత సంస్క్రుతికి భిన్నం? తెలుగు బాష లో కొన్ని ఉర్దు పదాలతో మాట్లాడటం కొన్ని పాత తెలుగు పదాలాను అక్కడ స్తానిక ప్రజలు మాట్లాడుతారు. దానిని ఆంధ్రా వాళ్ళు వచ్చి ఎదో ద్వంసం చేసినట్టు రాస్తున్నారు. అసలికి ఎంత మంది ఆంధ్రా వాళ్ళు తెలంగాణా తో రాక పోకలు సాగిస్తున్నారు. నిజం చెప్పాలంటె ఆంధ్రా తెలంగాణా ప్రజలు ఎక్కడైనా కలిస్తారు అంటె అది ఎక్కువగా హైదరాబాద్ లో, చదువుకునే యునివర్సిటిలలో మాత్రమే. ఈ మాత్రం కలయిక తో మీ సంస్క్రుతి ని నాశనం చేస్తున్నామా? తెలంగాణా వారికి ఆత్మన్యునతా భావం మొదటి నుంచి ఎక్కువ. మీకు కున్న రాజకీయ, సామాజిక అవర్నేస్ నాకు తెలిసి ఆంధ్రా వాల్ల్లకు లేదు. ఆంధ్రా వాళ్ళు ఎలా డబ్బు సంపాదించుకొందాము అని ఆలోచిస్తె మీరె మో మహత్తరమైన సాయుధ రైతాంగ పోరాటం లాంటివా టిని నిదర లేచిన మొదలు నెమరేసుకుంటూ, పుస్తకాలు రాసుకుంటూ గొప్ప వీరులా చిత్రికరించుకుంటారు. గతం లో జీవించడం అంటె తెంగాణా వాళ్ళకు మహా ఇష్టం.

    ReplyDelete
  18. @Kumbha karna,
    *తెలంగాణా వాసులకు చెందిన జల వనరులను తెలంగాణా వాల్లకు ఇవ్వకుండా ఆంధ్రా కు, రాయలసీమ కు తరలిస్తోంటే కడుపు మాడిన తెలంగాణా వాడి ఆక్రొషం ఈ ఉద్యమం. ఇది అంతటా ఉండేది కాదు.*

    I am common man from andhra. Tell me if andhra people are taking water from you then what did telangana leaders are doing ? Insted of fighting for your share of water How come you fight for separate telangana.
    Thoguh we have 37 MPs from AP we could bot get more than one cabinet post in central govt. After split I do not think even one cabinet minister from TELUGU speaking people. Central govt took it for granted when it comes to cabinet minister post for telugu people. One thing it is sure all other state people make fun of telugu speaking people after split. Nobody listes our voice at center.

    ReplyDelete
  19. @ananymous

    We fought for water, but nothing happened. Water is one example I gave, however there are severval such issues.

    >>if andhra people are taking water from you then what did telangana leaders are doing!!

    Our leaders could not fight with these factionist goonda andhra CMs like YSR, so they are asking for separate state.

    The reason for no cabinet minister from AP is because all our senior congress leaders are factionists and mass leaders who are inferior compared to leaders from pther states like chidambaram, pranab, SM Krishna etc.

    ReplyDelete
  20. A small state can also get cabinet berths if they elect a handfull of capable educated and knowledged leaders instead of a bunch of idiots. Thats the reason so many small states have got sahre in the cabinet. Numbers are not the criteria.

    ReplyDelete
  21. Asalu Andhra vallu neella dopidi ani antunnaru....
    Meeku Eee vishyam thelusa?
    Manam kevalam 30% of water matrame utilize chesukutunnamy 70% Sea loki wast ga veltu vundi.

    Ekkadayya neella dopidi? Mee leaders li cheppandi edin aprojects pin akattadaniki anukulamina place vunte kadatharu.

    Deenikosam vudyamam cheyandi?
    Eppudina chesara? Edo analani ee karanam chupisthunnaru?

    Sodarulara alochinchandi?manam evaru? endukee gola? evarikosam ee gola?

    JAI ANDHRAPRADESH JAI JAI ANDHRAPRADESH

    ReplyDelete
  22. @Kumbha karna
    *Our leaders could not fight with these factionist goonda andhra CMs like YSR, so they are asking for separate state.*

    See KK, In meetings you people claim that you participated in Telangana Saayudha pOraaTam. Because of that ONLY you got freedom not for SPatel military action. People like you who dethroned Nizam nawab unable to fight with ExCM, that too in Democratic setup.

    ReplyDelete
  23. Telangana Saayudha pOraaTam?

    Asalu deeni gurinchi thelusa? Eppudu start ayindi idi? enduku start ayindi?

    Telangana rythu poratam... Deniki Nizam vethirekapalanaku, pannu vevastha, peditha vevastha, HINDU sangha samrakshanakosam idi vachindi, oka nirankusa prabhu palanaku vethirekanga.

    SPatel Miltaryaction? Idelekapothe velli Pakisthan lo vundevallu?
    Ante meeru idi kuda mimmalani anaga thokkadaniki jaringindannamata? Emi alochinsthunnarayya?
    Asalu mee alochanga ku joharlu

    Andhra CM Gundalu anutnnavu? Mee vallukuda Home lu gavunaru kada? anthenduku Meevallukuda oka 15yrs CM's ga vunnarukada?

    ante Only Andhravalle CM la State ku?

    Kasha alochinchi matladandi, edi padithe adi matladavaddu.. alage alochinchi matladu arthamavutundi emichesthunnamo ani.

    Eppudu Sayidhaporam antaru..., adi oka viplavam alagani Alluri seetharamaraju nadipina viplavaniki manyam vallani separate ga vunchudama?

    Entiayya alochinchu?

    JAI ANDHRAPRADESH JAI JAI ANDHRAPRADESH

    ReplyDelete
  24. బాబు, మీరు అంతొ ఇంతొ కొంచెం ఆంధ్రా వాళ్ళ ను చూసి అభివ్రుద్ది, సంపద అంటె ఎమీటొ కనీసం ఆలోచించ గలుగుతున్నారు. ఆంధ్రా వాళ్ళు లేక పొతే మీకు పోల్చు కోవటానికి ఎవరు ఉన్నారు? తెలంగాణా లో భాగమైన ఇతర భాషల వాళ్ళు మహా నచ్చు నాగన్నలు (కర్నాటక,మహారాష్ట్ర వాళ్ళు). ఇక మీపాత బస్తి మిత్రులను చూసి మీరు వారి తో పోటి పడటానికి ఎముంది? రౌడిజం లో తప్ప, ఎంత సేపటికి ఇరాని చాయిలు తాగుతూ ఉండటం తప్ప. మీకు అలాంటి జనమైతె బాగా నచ్చెటట్టు ఉన్నారు. హైదరాబాద్ నుండి ఆంధ్రా వాళ్ళు అంతా ఖాళి చేసిన తరువాత వారి తో కలసి ఉంటె మీకు ఆంధ్రా వాళ్ళ విలువ అర్థమౌతుంది.
    -----------------------------------------------------
    ఈ దెబ్బతో అందరికి కనువిప్పు కలిగింది. హైదరాబాద్ లో ఇల్లు కొనాలనంటె 100 సార్లు ఆలోచించాలా, ఇంకె ఎవ్వరు ఇన్వెస్ట్ చేయటానికి పెద్ద ముందుకురారు. ఇది భూస్వామ్య తెలుగు ప్రజలు ఎన్ని అక్రమాలు, అవినితి పనులు చేసి సంపాదించారో ఈ దేబ్బతో అంతా పోగొట్టుకున్నారు.ఇరు ప్రాంతాల భుస్వామ్య వర్గాలు ఒకరితో ఒకరు పోటీ పడి భస్మాసురిడిలా వారి నెత్తిన వారె చేయి పేట్టుకున్నారు. ఈ విధంగా అన్ని ప్రాతాంతాల తెలుగువారు గ్లొబైసషన్ తరువాత సంపాదించిన సంపదల విలువలను కోల్పోయిన విధానం. పెరుగుట విరుగుట కోరకే!!!

    ReplyDelete
  25. @ వేణు, వెన్నెల రాజ్యం, అబ్రకదబ్ర, ఎన్‌రహమతుల్లా, కృష్ణ, బొల్జోజు బాబా, వేమన, కుంభకర్ణ, ఇతర అజ్ఞాతల స్పందనలకు ధన్యవాదాలు.

    పై కామెంట్ల వల్ల మళ్లీ మళ్లీ స్పష్టమవుతున్నది ఒక్కటే...
    తెలంగాణా వాళ్లంటే ఆంధ్రా వాళ్లకి చాలా చులకన!
    ఆంధ్రా వాళ్లంటే తెలంగాణా వాళ్లకీ అంతే!!

    54 సంవత్సరాల కాపురం వారిలో పరస్పర గౌరవాభిమానాలను ఏమాత్రం పెంపొందించలేకపోయింది.
    మన సమైక్యత మేడిపండు.
    తెలుగు తల్లి ఒకరికి కన్న తల్లయితే, మరొకరికి సవతి తల్లి అయింది.

    54 సంవత్సరాలు కలసి నడచిన తరువాత కూడా
    ఆంధ్రా వాళ్లు వేరు.
    తెలంగాణా వాళ్లు వేరు అనే భావనే వుంది.
    ఈ భావన ఇక మారదు గాక మారదు!

    రెండు రాష్ట్రాలు విలీనమైనప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాల నన్నింటినీ ఉల్లంఘించి-
    తెలంగాణా వనరులను, ఉద్యోగాలను, నీళ్లను ఇష్టారాజ్యంగా దోచుకుంటూ-
    తెలంగాణా ప్రజలను అవహేళన చేస్తూ-
    తెలంగాణా నాయకులను ఈసడించుకుంటూ-
    '' తెలంగాణా వద్దు - సమైఖ్య ఆంధ్ర ముద్దు '' అనడం హాస్యాస్పదం. ఆత్మవంచనా సదృశ్యం.

    రెండు రాష్ట్రాలు విలీనమైన తొలి రోజునుంచే కుదుర్చుకున్న పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఆంధ్ర నేతలు ఉల్లంఘించడం మొదలు పెట్టారు.

    నిన్నటి వరకు
    '' మేము ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకం కాదు.''
    ''ఈ సమస్య అధిష్టానం చేతిలో పెట్టాం. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం.'' -
    ''మీరు ప్రత్యేక తెలంగాణా తీర్మానం పెట్టండి మేం మద్దతు ఇస్తాం'' అంటూ ప్రగల్భాలు పలికి,
    ఎన్నికల సభల్లో తెలంగాణాలో ఒకరకంగా, ఆంధ్రాలో ఒకరకంగా వాగ్దానాలు చేసి
    తీరా తెలంగాణాకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోగానే అన్ని పార్టీలూ తమ నిజస్వరూపాలను, పచ్చి అవకాశవాదాన్ని బయటపెడుతూ తెలంగాణాకు బద్ధ వ్యతిరేకులుగా మారడం చూశాక ...

    తెలంగాణా ప్రజలు ఏ మొహం పెట్టుకుని మీతో సమైక్యతా గానం చేస్తారు?
    ఇంత నయవంచనను తెలంగాణా ప్రజలు ఎట్లా జీర్ణించుకుని మీతో సమైక్యంగా వుండగలుగుతారు?
    ఒక్క ప్రాంత నాయకులు మాత్రమే సమైక్యతను కోరుకుంటే సరిపోతుందా??

    ఏమైనాయి నిన్నటి వరకూ వినిపించిన "జై ఆంద్ర" ... "జై గ్రేటర్ రాయలసీమ" ... "జై కళింగాంధ్ర" నినాదాలు?
    హటాత్తుగా అన్ని అవకాశవాద పార్టీలు ఎట్లా సమైక్యంగా మారిపోయాయి? ఎందుకోసం?


    పరస్పర గౌరవం, అభిమానం అనేది లేకుండా కేవలం తెలంగాణా ప్రజల్ని అదిరించి, బెదిరించి, లొంగదీసుకుని సమైక్యతను సాధించాలని కలలు కనడం హాస్యాస్పదంగా, దుర్మార్గంగా, వంచనగా అనిపించడం లేదూ !!??

    ReplyDelete
  26. ఏమైనాయి నిన్నటి వరకూ వినిపించిన "జై ఆంద్ర" ... "జై గ్రేటర్ రాయలసీమ" ... "జై కళింగాంధ్ర" నినాదాలు?
    హటాత్తుగా అన్ని అవకాశవాద పార్టీలు ఎట్లా సమైక్యంగా మారిపోయాయి? ఎందుకోసం?

    Jai Telangana marchipoyaru.....

    Anni kalisi Jai Andhrapradeh ayyayi...

    Party lu kaadu mukyam, Prajalu mukyam...
    Enduku eppudu ala alochistharu, meeru inkaa Nijam palanalo vunnara?

    Meluko mitrama, melukoni mammalni eluko...Mee adipathanii meemu siddame.
    Kaani Vidadeeyaddu .., Telugu thallini verela choodakandi.

    Kannellatho padi kotla mandi andhrula vinnapamu idi, kevalamu edo sadhinchalani pachani rashtranni madchaddu.

    meeku nijanga athmabhimanam vunte., alochinchandi malli malli cheputhunna...

    Thelugo konda
    nee thelugokanda

    Ani anukoni alochinchu mitrama.

    edo poratamani anutunnavu..
    poratama??? eppudu vinalede, kevalam 10 yes gaplo vachina vudamamidi, Kevalam rajakeeya nayakula swartham tho vachindi.

    alochinchu....
    1956 lo Telangana Vishala andhra lo vileenam ayindikada, 1965 lo meerantunna vudyamam vachindi, kaneesam 10trs gap kuda sarigaledu...Idulone dopideena?

    evaru dochukuntunnaru? evarini dochukuntunnaru?
    mimmalni nayakulu dochukuntunnaru, mee abhimananni kuda dochukuntunnaru.

    Meeru cheppinattu nayakulu vinaledu, nayakulu cheppinattu meeru vintunnaru..

    avakasavadamannave?
    vallu separate annaru kada, adee avakadavadam
    Prajalao vachina vudyamaniki bhayapadi chethulu nalipukuntunnaru.

    Ippudu meeku kuda ee vudyamae adarsam.

    Jai Andhrapradesh Jai Jai andhrapradeh

    ReplyDelete
  27. బాబాగారూ
    మీరిచ్చిన సమాచారం బాగుంది.మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది. గోదావరి తూర్పు డెల్టా కింద యానాం తాగునీటి ట్యాంకులను నింపాల్సి ఉంది.పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించేందుకు ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నిస్తున్నది. తాళ్లరేవుకు కూతవేటు దూరంలో ఉన్న పుదుచ్చేరి కేంద్రం పాలిత ప్రాంత పరిధిలో యానాం వాసులకు అనేక ప్రత్యేక రాయితీలు అందుతోన్న విషయం విదితమే. రాష్ట్రాలతో పోల్చి చూస్తే కేంద్రపాలిత ప్రాంతంలో పన్ను రాయితీలు ఉన్నందున అక్కడ రేట్లు తక్కువగా ఉంటాయి. జిల్లా మధ్యలో ఉన్న యానాం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నందున కేంద్ర పాలిత ప్రాంత ప్రత్యేకతలు జిల్లావాసులకు ఎరుకే. అక్కడి సౌకర్యాలు అంది పుచ్చుకునేందుకు యానాం వాసులుగా నకిలీ ధ్రువపత్రాలతో ఆంధ్రావాసులు యానాంలో ఉంటున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతాలు పరిధి తక్కువ కావడంతో కేంద్ర నిధులు భారీగా ఉండడమే కాకుండా ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. యానాంలో పరిశ్రమల స్థాపనకు భారీ మొత్తాల్లో సబ్సిడీలు, ఇతరత్రా సదుపాయాల కోసం అక్కడ పరిశ్రమల స్థాపనకు ఆంధ్రా పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపేవారు. అయితే సౌకర్యాలు పొందిన తర్వాత పరిశ్రమలను మధ్యలో వదిలివేసిన సంఘటనలున్నాయి.క్రమేపీ పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించేందుకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి సుముఖత చూపుతుంటే, మంత్రి మల్లాడి కృష్ణారావు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాల నుంచి ఉన్న ఈ ప్రతిపాదనపై యానాంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. యానాంలో దేశంలోనే అతిపెద్ద 26 అడుగుల భారతమాత కాంస్య విగ్రహాన్ని విజయవాడకు చెందిన బొర్రా శివప్రసాద్‌ సుందరంగా తీర్చిదిద్దారు.తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.మీరు చెప్పినట్లు యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.

    ReplyDelete
  28. Karamazov Na Peru sridhar soud.na vayasu just 18 nenu telangana vadhene. monnate varaku jai telangana antu teregina andaru epudu mounangang andhuku unnaru? varandaru amyaru?epate vataku vidhyardulanu vadukunna nayakulu amyaru anndhe avarke theledhu. jai telangana antu vidhyardulanu rechagotina k c r amyadu ane nenu aduguthuna.e k c r aakada anne dabbulu theskunnadu annde saspens.

    ReplyDelete