Thursday, December 10, 2009

తెలంగాణా అమర వీరులకు జోహార్లు



1969లో ప్రత్యేక తెలంగాణా కోసం విద్యార్థులు పోరాటం ప్రారంభిస్తే ఆ తరువాత ఆ పోరాటాన్ని రాజకీయ నాయకులు తమ చేతుల్లోకి తీసుకుని ఆ తరువాత దానికి ద్రోహం చేశారు. ఆనాటి పోరాటంలో దాదాపు 370 మంది పోలీసు కాల్పుల్లో అమరులయ్యారు. వారిలో కొందరి వివరాలను ఈ కింది లింకులో చూడవచ్చు.

1969 ప్రత్యేక తెలంగాణా పోరాట అమర వీరులు: http://telangana1969.com/martyrs1.html

ప్రస్తుత ప్రత్యేక తెలంగాణా పోరాటం రాజకీయంగా ప్రారంభమై విద్యార్తుల చేతుల్లోకి వెళ్లింది. కె.సి.ఆర్‌. 2009 నవంబర్‌ 29న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన తరువాత డిసెంబర్‌ 9న దీక్ష విరమించేనాటి వరకు ఈ ఉద్యమంలో మొత్తం 37 మంది అసువులు బాశారు. వీరిలో 23 మంది ఆత్మహత్య చేసుకోగా, 13 మంది గుండె ఆగి మరణించారు. ఒకరు పోలీసుల లాఠీ దెబ్బలకు చనిపోయారు. వారి వివారాలు ఈ కింది విధంగా వున్నాయి: (ఆంధ్ర జ్యోతి 10-12-2009 సౌజన్యంతో)

వరంగల్‌ జిల్లా (11మంది)
1. 2009 నవంబర్‌ 30 భూక్యా ప్రవీణ్‌ (24), గోపాతండా - ఆత్మహత్య
2. డిసెంబర్‌ 3 మల్లవేవి రాజ్‌కుమార్‌ (16), కేశవాపురం - ఆత్మహత్య
3. డిసెంబర్‌ 5 చెరుకు అంజయ్య (32), వల్మిడి - ఆత్మహత్య
4. డిసెంబర్‌ 6 ముక్కెర జనార్థన్‌ (45), వరంగల్‌ - ఆత్మహత్య
5. డిసెంబర్‌ 6 నాగరాజు (25), కురవి, - ఆత్మహత్య
6. డిసెంబర్‌ 7 వాకిడి బుచ్చయ్య (47), జగ్గయ్యపేట - గుండెపోటు
7. డిసెంబర్‌ 7 దేవులపల్లి శాంత (36), రేగొండ - గుండెపోటు
8. డిసెంబర్‌ 7 గుండెబోయిన బొందయ్య (80), రేగొండ - గుండెపోటు
9. డిసెంబర్‌ 8 మోరె పుల్లారెడ్డి (50), మొట్లపల్లి - గుండెపోటు
10. డిసెంబర్‌ 9 రవి (30), పాలంపేట - గుండెపోటు
11. డిసెంబర్‌ 9 రంగాన రాజు (23), వెల్ది గ్రామం - ఆత్మహత్య

కరీంనగర్‌ జిల్లా (8 మంది):
1. డిసెంబర్‌ 2, దండిక పృథ్వీరాజ్‌ (22), వాల్గొండ - ఆత్మహత్య
2. డిసెంబర్‌ 6 నాలుక రాజయ్య (50), తిమ్మాపూర్‌ - గుండెపోటు
3. డిసెంబర్‌ 6 బరిగెల అశోక్‌ (22), నారాయణపూర్‌ - ఆత్మహత్య
4. డిసెంబర్‌ 6 ఆరెల్లి కృష్ణ (18), రాచపల్లి - ఆత్మహత్య
5. డిసెంబర్‌ 7 బొల్లి సారయ్య (40), బస్వాపూర్‌ - ఆత్మహత్య
6. డిసెంబర్‌ 7 కడారి ఎల్లమ్మ (36), ఉప్పల్‌ - ఆత్మహత్య
7. డిసెంబర్‌ 8 బైరి సుదర్శన్‌, నిట్టూరు - ఆత్మహత్య
8. డిసెంబర్‌ 8 కోల రవి (25), మల్లారెడ్డిపల్లి – ఆత్మహత్య

మెదక్‌ జిల్లా (8 మంది):
1. నవంబర్‌ 30 బొల్లి లక్ష్మీనారాయణ (50), కమ్మర్లపల్లి - గుండెపోటు
2. నవంబర్‌ 30 శ్రీకాంత్‌ (18), దుద్దెడ - ఆత్మహత్య
3. డిసెంబర్‌ 2 లక్ష్మి (35), కొండపాక - గుండెపోటు
4. డిసెంబర్‌ 5 గురువయ్య (48), మగ్దుంపూర్‌ - ఆత్మహత్య
5. డిసెంబర్‌ 6 నర్సింలు (32), భూంపల్లి - గుండెపోటు
6. డిసెంబర్‌ 6 నర్సింగ్‌నాయక్‌ (54), తునికిల్లా తండా - ఆత్మహత్య
7. డిసెంబర్‌ 6 నరేందర్‌ గౌడ్‌ (32), గౌతాపూర్‌ - గుండెపోటు
8. డిసెంబర్‌ 7 వరాల వెంకటేశం (32), అందె – ఆత్మహత్య

నల్లగొండ జిల్లా (4):
1. డిసెంబర్‌ 3 కాసోజు శ్రీకాంత్‌ (23), పొడిచేడు - ఆత్మహత్య
2. డిసెంబర్‌ 6 సుధాకర్‌ నాయక్‌ (20), గోగులగుట్ట తండా - ఆత్మహత్య
3. డిసెంబర్‌ 6 వీరనాగులు (26), పాలారం - ఆత్మహత్య
4. డిసెంబర్‌ 7 సతీశ్‌ యాదవ్‌ (29), రాయగిరి – ఆత్మహత్య

ఆదిలాబాద్‌ జిల్లా (2):
1. డిసెంబర్‌ 4 చిన్న బాపన్న, సూర్జాపూర్‌ - గుండెపోటు
2. డిసెంబర్‌ 4 భాస్కరాచారి, భైంసా - ఆత్మహత్య

నిజామాబాద్‌ జిల్లా (2):
1. డిసెంబర్‌ 1 కిష్టయ్య (38), కానిస్టేబుల్‌, శివయ్యపల్లి - ఆత్మహత్య
2. డిసెంబర్‌ 7 అయిండ్ల లింగయ్య (45), ఇస్సాయిపేట - గుండెపోటు

హైదరాబాద్‌లో (2)

1. నరసింహ - లాఠీచార్జిలో గాయపడి
2. ఈదయ్య - ఆత్మహత్య

తెలంగాణా తల్లి ముద్దుబిడ్డలైన అమరవీరులకు జోహార్లు.
మీ త్యాగం తెలంగాణా ప్రజలకు సదా స్ఫూర్తినిస్తూనే వుంటుంది.

7 comments:

  1. అసలు కామెడి ఇప్పుడే మొదలయ్యింది.
    తెలంగాణ లేకపోతే మిగతా ప్రాంతాలవరికి దిక్కులేదని తెలిసొచ్చింది.
    పులినిజూసి నక్కలు వాతలు పెట్టుకుంటున్నయి.
    జోకర్గాల్లు తమషాజేసుడు షురూజేసారు.
    కావలసినంత వినోదం.
    పైసా విలివజేయని రాజీనామాల డ్రామా మొదలయ్యింది.

    ReplyDelete
  2. pirikolla perlanni sekarinchi raasinanduku thanks.

    ReplyDelete
  3. @Anonymous,
    ఉమ్మడిగా అభివృద్ది చేసుకున్న హైదరాబాద్ ఒక్కళ్ళే కొట్టేసి బ్రతికేద్దామని మీరు మొదలుపెట్టిన కామెడీ కన్నానా ఇది. మీ కేసీయార్ సెలైన్, పళ్ళరసాల నిరాహారదీక్ష చూసి దేశమంతా ముక్కుమీద వేలేసుకుంది. జోకర్గాళ్ళు మీరా మేమా. గెలిచి తెచ్చుకున్న పదవులు ఒదిలిపెట్టారు మా వాళ్ళు, నెత్తి మీద పావలా పెడితే రూపాయి విలువ చెయ్యని మీ కాకా, కేకే, కూకూ గాళ్ళలాగా సోనియాను గడ్డం పట్టుకుని, మీ పుట్టినరోజు కానుకగా మాకు రాష్ట్రం దానం చెయ్యమని బ్రతిమాలుకోలేదు.

    ReplyDelete
  4. పిరికోళ్ళైతే చావుకి ఎందుకు సిద్ధపడతారు? పోలీసుల్ని పంపించి చంపిస్తారు కానీ.

    ReplyDelete
  5. తెలంగాణా రావాల్నా వద్దా - అన్న యిసెయం నాకైతె సమఝ్ గావట్లె గాని, అమ్మ అయ్య, ఆలి బిద్ద ఎమవుతారొ ఆలొచించకుందా ఇట్ట ఆత్మహత్య చెసుకొవదం నాకైతె పరెషాణ్ ఐతాంది. ఆత్మహత్య చెసుకునె బదులు ఎదైన వ్యపరం పెట్టి నలుగురికి ఉద్యొగలిస్తె బాగుండు.

    ReplyDelete
  6. ఇప్పుడు ఆంధ్ర నాయకులూ రాజీనామాలు వెన్నక్కి తీసుకుంటే వాళ్ళని ఏమందాం? దొంగ రాజీనామాలు అందామా లేక బెదిరింపు రాజీనామాలు అందామా ?

    ReplyDelete
  7. Amara Veerudu anta, Poradi maraninchina vaadu.

    Atmahatya chesukunnavadini.. Pirikivaadu antaru.

    Evarikosam poratam?
    Evarimeeda poratam?
    Endukosam Poratam?

    Mundu mee alochano lo clarity ni thechukondi, tharuvatha nirnayam theesukondi.

    Anyam? Denimeeda? Evaru chesaru? Mee MLA/MP mee vallu kada? Valla meeda poratam cheyandi mundu mee hakkulakosam.

    Banchan dora nee kaalmokkutha kaadu..... Mammalni abhivruddi cheyakunte nee kaallu virichestha anaali.....

    Eee poratam lo maranisthe vaadu amara veerudu, vaadiki Sahasthra Joharlu.

    Emotions ki longi Atmahatya chesukone vaadu Papatmudu, Sasthram lo ku da deeniki parskaram ledu.

    Mari dekikayya ee block? Mundu emotions ki lonu avvakunda alochinchu, telustundi.

    JAI ANDHRA PRADESH.. JAI JAI ANDHRAPRADESH

    ReplyDelete