Monday, October 29, 2012

సీమాంధ్ర నగరాల్లో బతుకమ్మ ఎందుకు కనిపించదు ?

తెలంగాణా లో సరే...

డల్లాస్ లో బతుకమ్మ...
కాలిఫోర్నియాలో బతుకమ్మ...
న్యూ జెర్సీ లో బతుకమ్మ ...
అట్లాంటాలో బతుకమ్మ ...
డెట్రాయిట్ లో బతుకమ్మ ...
చికాగోలో బతుకమ్మ ...
బోస్టన్ లో బతుకమ్మ ...
వాషింగ్టన్ లో బతుకమ్మ ...
టోరంటో లో బతుకమ్మ
సిడ్నీ లో బతుకమ్మ ...
లండన్ లో బతుకమ్మ...
బెర్లిన్ లో బతుకమ్మ ...
దుబాయ్ లో బతుకమ్మ ..

కానీ .....
విజయవాడలో నో బతుకమ్మ ....
విశాఖపట్నం లో నో బతుకమ్మ ...
రాజమండ్రి లో నో బతుకమ్మ ...
కడపలో నో బతుకమ్మ ...
తిరుపతి లో నో బతుకమ్మ ...

ఎందుకు?
సీమాంధ్ర నగరాల్లో ఎక్కడా
పట్టుమని పదిమంది
తెలంగాణా ఆడ పడచులే లేరా ??????

ఆరు దశాబ్దాల సమైక్యత ఫలితంగా
తెలంగాణలో ఏ నగరం లో చూసినా
వేలకు వేల సంఖ్యలో
ఆంద్ర ఆడపడచులు కనిపిస్తారు కదా

ఆంద్ర నగరాల్లో తెలంగాణా ఆడపడచులు
లేకపోవడం ఏమిటి?!
కారణాలు ఎవరైనా విశ్లేషించ గలరా ...?28 comments:

 1. అంతా అమేరికా వెళ్ళిపోయారు కనుక.
  తొక్కేసి తొక్కేసి మేము వాళ్ళను అమేరికా పంపాము.

  ReplyDelete
 2. అయ్యా,

  మీ సందేహం అర్థం అయింది.
  తెలుగు వారు ఈ నాడు ప్రపంచంలో అన్ని చోట్లా కనబడతారు. తెలంగాణా ఉద్యమం పుణ్యమా అని విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లలో తెలంగాణాకు చెందిన వారు బతుకమ్మ పండుగను ఒక ఉద్యమ ప్రతీకగా తీసుకుని ఈ మధ్యనే నిర్వహించటం‌ మొదలు పెట్టారు.

  అంతకు ముందు బతుకమ్మ పండుగ, ఒక ప్రాంతీయమైన పండుగగా కేవలం తెలంగాణాలోనే కనిపించేదని అనుకుంటున్నాను.

  ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదు కాబట్టి తెలంగాణేతర తెలుగువారూ ఇక్కడకు వచ్చి స్థిరపడినా, అలా ఉద్యోగార్థులుగా వచ్చిన వారు బతుకమ్మ పండగను చేసుకోవటం తక్కువేననుకుంతున్నాను. తెలంగాణావారు తదితర తెలుగుప్రాంతాలకు వలసపోవటం తక్కువ కాబట్టి తెలంగాణాలో‌తప్ప బతుకమ్మ ఇతర తెలుగు ప్రాంతాలలో కనిపించక పోవటంలో వింత లేదు కద.

  ReplyDelete
 3. మనుషులు తమకు ఎక్కడ రక్షణ, మర్యాద దొరుకుతాయో అక్కడికే వలస వెలతారు, అవి రెండూ తెలంగాణవాసులకు సీమాంధ్రలో దొరకవు. కనీసం వ్యవసాయపనులకు కూడా తెలంగాణనుండి సీమాంధ్రకు వెల్లడంలేదంటేనే తెలుస్తుంది.

  ఎక్కడో ఒకచోట కొద్దిమంది ఉన్నా బిక్కుబిక్కుమంటూ ఉంటారు, ఇంకా బతుకమ్మలు కూడానా? బాక్సింగ్ పోటీలకని వైజాగ్ వెల్లినవారిని కొట్టిపంపించారు!!

  ReplyDelete
  Replies
  1. బాక్సిగ్ పోటీలను రాజకీయం చేసి తెలబానిజం చూపిస్తే ఏదో కొద్దిగా 'సమైక్యం' చేసివుంటే వుండవచ్చు. తెలబాన్లు 'రక్తాలు పారుతాయి, తరిమి కొడతాం, సంక్రాంతి వెళ్ళిన వాళ్ళను రానిచ్చేది లేదూ ... ఇలా చెత్త వాగారా లేదా? విగ్రహాలు కూల గొట్టారా లేదా?

   Delete
 4. తెలంగణా వాదం అంటె ఎడుపుగొట్టు వాదం.

  తెలంగణా వాళ్ళు ఏ దేశమైన వెల్లచ్చు.
  ఎక్కడైనా ఉండొచ్చు. ఎదైన తినొచ్చు తాగొచ్చు.వెరే ఎవరైన మాత్రం రాకుడదు.

  ఫ్రతిభ ఉండాలి కాని, కూర్చొని ఎడిస్తే ఎన్ని years ఐన అవే బతుకులు. ఎప్పుడు మిగిలేవి తినగా మిగిలిన మెతుకులు.

  ReplyDelete
 5. ఎందుకంటే ఉద్యోగావకాశాలు హైదరాబాదు మూలంగా తెలంగాణాలోనే ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి తెలంగాణా వారు ఇతర ఆంధ్రా వూళ్ళకి వెళ్ళి స్థిరబడాల్సిన అవసరం లేదు కాబట్టి

  ReplyDelete
 6. నేటి బతుకమ్మ పండగ కేవలం ఉద్యమం కోసం చేస్తున్న పండగ. అదొక ఉద్యమ సూచికగా మాత్రమే జరుపుతున్నారు. అందుకే అట్లాంటా నుంచి దుబాయి దాకా ఎక్కడ ఉద్యమ సానుభూతి పరులుంటారో అక్కడ ఈ పండగ జరిపిస్తారు. ఒకసారి ఈ ఉద్యమం వేడి సమసిపోయిందంటే (ఏ కారణం వల్లనైనా) ఈ వేడుక కూడా క్రమంగా తగ్గిపోయి, ఆగిపోతుంది. అప్పుడు బతుకమ్మ ఆడేవాళ్ళూ ఉండరు, ఆడటం లేదేంటీ అని ఆశ్చర్యపోయే వాళ్ళు, ఎందుకో విశ్లేషించమని అడిగేవాళ్ళూ ఉండరు. అంతెందుకు, ఉద్యమమే లేకపోతే, అసలీ ప్రశ్న తలెత్తేదేనా? ఇవ్వాళ ఆ పండగ ఉద్యమానికి ఒక సూచిక కాబట్టి, వాళ్ళు వేడుకలు జరుపుకున్నారు, అన్యాపదేశంగా ఉద్యమాన్ని ఉద్దేశించడానికి మీరు దీన్ని బ్లాగుల్లో రాసుకున్నారు. బెజవాడలో బతుకమ్మ ఎందుకు ఆడటం లేదంటే అక్కడ ఉద్యమం లేదు కాబట్టి, అంతే!

  అయితే, తెలంగాణ పల్లెలు ఇందుకు మినహాయింపు. ఉద్యమాలు ఉన్నా లేకున్నా అక్కడ బతుకమ్మ జరుపుకుంటూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సాంస్కృతిక వారసత్వాన్ని వాళ్ళింకా మర్చిపోలేదు. బలవంతాన గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరమూ లేదు. అవి నిజమైన వేడుకలు.

  ReplyDelete
  Replies
  1. వీళ్లందరికీ ఇప్పుడే వాళ్ళ సంస్కృతులు బలవంతంగానైనా గుర్తు తెప్పిస్తున్నారు. 5ఏళ్ళ క్రితం విదేశాల్లో బతుకమ్మలు, బోనాలు, పోతరాజుల వూసే వుండేది కాదు. ఈ మధ్యనే పోతరాజులు బ్లాగుల్లో కూడా తయారయ్యారు. :)

   Delete
  2. ఆర్యా, బతుకమ్మ పండుగ అనాదిగా వస్తున్న ఆచారం. పండుగలు ఒక ఉద్యమం కోసం పుట్టవు.

   Delete
  3. అనార్యా, వీధినాటకాలు, దొమ్మరాటలు, సర్కస్‌లు ఈ మధ్య తగ్గిపోయినయ్. మీరు సీమాంద్ర సిటీల్లో వచ్చి ఎందుకు బతుకమ్మ ఆడి పైసల్ వసూల్ చేసుకోవచ్చు కదా.

   Delete
 7. బతుకమ్మ / బోనాల గురించిన మాటలు మాట్లాడే ముందు ఒక చిన్న విషయాన్ని తెలంగాణా సొదర సొదరీమణులు గమనించాలి. ప్రతీ ఒక ప్రాంతానికీ కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. బతుకమ్మ పూజ కూడా అలాటిదే. దసరా తరువాత జరిగే పైడితల్లి సిరిమాను ఉత్సవం - కేవలం విజయ నగరంలోనే జరుగుతుంది. మరి దాన్ని తెలంగాణా లో జరపట్లేదే అని ఏ మూర్ఖుడూ అడగడు. అలాగే ప్రతీ ఒక్క ఊరికీ కొన్ని ప్రత్యేక జాతరలూ, అమ్మవారి కొలుపులూ ఉంటాయి. అవన్నీ ప్రతీ ఒక్కరూ పాటించాలనీ పూజలు చేయాలనీ అనుకోకూడదు. అంతెందుకు - శ్రావణ మాసంలో చాలా మంది వేడుకగా చేసుకునే వరలక్ష్మీ వ్రతం కొన్ని చోట్ల జరపరు - అది వారి వారి ఇంటి ఆనవాయితీని బట్టీ ఉంటుంది. అలాగే అట్లతద్ది కూడా అందరూ చేసుకోరు. కొన్ని సినిమాల్లో చూపించినంత మాత్రాన ప్రతీ ఒక్కటీ అందరూ చేసే పూజలుగా పరిగణించలేము. మా ఊరిలో మహాలయ అమావాస్య రోజున ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది. అలాగే నెల్లూరు జిల్లాలో ముస్లిం సోదరులతో పాటుగా కలిసి రొట్టెల పండుగ అని చేస్తారు. ప్రతీ ప్రాంత ఆచారాలూ మంచివే - కానీ ఇంటిలో ఆనవాయితీ లేకుండా కొన్ని పూజలు మన పెద్దవారు నిర్వహించరు. అందుకే తెలంగాణాలో పోలేరమ్మ కొలుపులు ఉండవు. అట్లతద్ది చేసుకోరు. గొబ్బెమ్మలు అందరూ పెట్టరు. తెలంగాణాలో బొమ్మల కొలువు దీపావళికి పెడతారు - మరి మిగతా వారు కొందరు సంక్రాంతికి పెడితే మరి కొందరు దసరా కి పెడతారు. అరవ వారు కూడా దసరా కి బొమ్మల కొలువు పెడతారు - మరి దసరా కి బొమ్మల కొలువు పెట్టిన వారంతా తెలుగు వారు కానట్లా? పిచ్చి వ్యాఖ్యానాలు మాని, ఏ రూపంలో ఉన్నా, ఆ అమ్మని కొలవండి. మీ శక్తి కొలదీ, భక్తి కొలదీ ఆమెను అర్చించండి, ఆమెను బతుకమ్మా అన్నా వరాలిస్తుంది, గౌరమ్మా అన్నా దయ తలుస్తుంది, పోలేరమ్మా అన్నా కరుణిస్తుంది, పైడితల్లీ అన్నా పలుకుతుంది. మన శుష్క వాదాల్లోకి అమ్మని కూడా లాగకండి.

  ReplyDelete
  Replies
  1. ఇక్కడ ప్రశ్న గుంటూరు, బెజవాడలో తెలంగాణవారు (ఆంధ్రా వారు కాదు) బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకోవడం లేదని. ఒకవేళ అక్కడ తెలంగాణావారు లేకపోతే ఎందుకులేరు? ఉంటే వారికి జరుపుకునే స్వేఛ్చ ఎందుకులేకపోయింది?

   న్యూయార్క్, దుబాయిలలో బతుకమ్మజరుపుకుంది అక్కడివారు కాదు, తెలంగాణవారే. చాలా శ్రమపడ్డట్టున్నారు.

   Delete
  2. మనీష్ గారు,

   తెలంగాణా వాళ్ళకు ఆంధ్రలో బతుకమ్మ జరుపుకొనే స్వేచ్ఛ ఎందుకులేదనుకుంటున్నారు? ఆంధ్రవాళ్ళు బతుకమ్మ జరుపుకుంటే అడ్డుపడిన సందర్భాలు మీకెమైన తెలుసా?

   నేను Londonలో ఉంటాను. ముందు మీరు London లాంటి places లో బతుకమ్మ ఈ మద్యనే ఎందుకు జరిగింది, కొన్ని సంవత్సరాల క్రితం ఎందుకు జరగలేదో చెప్పండి? ఇంతకు ముందు ఇక్కడ తెల్లవాళ్ళు బతుకమ్మ జరగకుండా ఆపేసారా? లేదా ఇక్కడ తెలంగాణ వాళ్ళకు స్వేచ్ఛ లేదా?   Delete
  3. Q: ఒకవేళ అక్కడ తెలంగాణావారు లేకపోతే ఎందుకులేరు?
   A: కడుపు కాలిన వాళ్ళు, కస్టపడి పైకి రావాలనుకునే వాళ్ళే వలస పోతారు. ఒళ్ళు కొవ్వెక్కి ఏదో ఒక గొంతెమ్మ వుజ్జమాలు చేసి, వుచితంగా తాయిలాలు తిని బ్రతికేద్దాం అనే సోమరులు వలస ఎందుకెళతారు?

   Q: ఉంటే వారికి జరుపుకునే స్వేఛ్చ ఎందుకులేకపోయింది?
   A: స్వేచ్చ లేక కాదు. ఆంధ్రాలో వున్న నాగరిక జీవనానికి అలవాటు పడి, గిరిజన సామూహిక నృత్యరీతులు మరచి పోయివుంటారు. అరకులో వున్న గిరిజనులతో మమేకమైతే వాళ్ళు బతుకమ్మ తెలగానులకన్నా గొప్పగా ఆడగలరు. :)

   Delete
 8. మన రాష్త్రంలో ప్రతి ప్రాంతానికి బతుకమ్మ లాంటి పండుగలు ఉన్నాయి.. ఉదహరణకి మావ్వుల్లమ్మ, పొలెరమ్మ జాతరలు. ఇవి ఆయా ఊర్లలో పెద్ద పండగలే, కాని ఆ ప్రాంతానికి సంబంధిచినవి... దశరా, దీపవళి లాంటి పండుగలు మన పురనేతిహాసలు ద్వార మనకు లబించినవి. అందుకే, ప్రాంతాలకు అతీతంగా దెశంలో అందరూ జరుపుకుంటారు.

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పే పోలేరమ్మ జాతర తరహావి తెలంగాణాలో కూడా ఉన్నాయి. ఈ టపా అలాంటి వాటి గురించి కాదు.

   బతుకమ్మ పండుగ ఎదో ఒక ఊరికో, ఒక తాలూకాకో పరిమితం కాదు. తెలంగాణా అంతటా జరుపుకునే పెద్ద పండుగ.

   Delete
  2. జై గారు,
   ఈ టపా చిన్న పండుగా, పెద్ద పండుగా అనే దాని మీద చర్చించుకోవాడానికి కూడా కాదు, అది ఒక ప్రాంతీయ పండుగ అని చెప్పడం కోసమే పైన చెప్పడం జరిగింది.

   ఆంధ్రాలో ఉన్న తెలంగాణవాళ్ళు అది చెసుకుంటున్నరా లేదా అనేది, వాళ్ళ ఇష్టం. ఐనా చెసుకోవడం లేదు అనుకోవడం కూడ మూర్ఖత్వం. హైదరాబాదు లో ఉన్న మా అత్తయ్య అక్కడ ఉన్న తెలంగాణ పండుగల్లన్నీ చేసుకుంటుంది కాని మా ఊరి మవులమ్మ పండుగ చెసుకోదు, అంతమాత్రాన ఆవిడ మా పండుగలు మరిచిపోయిందనా? పేరు వేరైన, ఊరు ఏదైనా, భక్తి అనేది మనసులో ఉంటుంది.

   Delete
 9. సీమాంధ్ర నగరాల్లో బతుకమ్మ ఎందుకు కనిపించదు? This question was framed very improperly.
  From the description given with the original post, I feel it should be "సీమంధ్రా నగరాల్లో తెలంగాణ ప్రజలు బతుకమ్మ ఎందుకు చెయ్యరు?" It is more appropriate because it tells whom you are addressing it to. And, Telangana people in Andhra region should answer this question.

  ReplyDelete
 10. @
  శ్యామలీయం,
  విశ్వరూప్‌,
  తుమ్మల శిరీష్‌ కుమార్‌,
  జై గొట్టిముక్కల,
  విరజాజి,
  మనీష్‌,
  జఫ్ఫా,
  అనానిమస్‌లకు ధన్యవాదాలు.

  విరజాజిగారు ఈ పోస్టును సరిగా చదవకుండా, అర్థం చేసుకోకుండా అనవసరంగా ఆవేశపడ్డారు. 'మూర్ఖుడు... పిచ్చి వ్యాఖ్యానాలు... శుష్క వాదాల్లోకి అమ్మని లాగకండి...' వంటి అసందర్భ పదాలను ఇష్టారాజ్యంగా ప్రయోగించారు.
  అనానిమస్‌లది కూడా దాదాపు ఇదే పద్ధతి.

  తెలంగాణావాళ్లని మూర్ఖులు, తెలబాన్లు, ఎంగిలిమెతుకులు తినేవాళ్లు, ఒళ్లు కొవ్వెక్కినవాళ్లు, సోమరులు, ప్రతిభ లేనివాళ్లు అంటూ వెటకారం చేయడం... ఆధిపత్య అహంకారాన్ని ప్రదర్శించడం ... ప్రత్యేకించి ఇలాంటి ఒక సాధారణ పోస్ట్‌ మీద స్పందించేటప్పుడు ... ఎంతవరకు సమంజసమో ఎవరికివారు ఆత్మవిమర్శ చేసుకోవాలి.

  ఆనాడు "అరవ" ఆధిపత్యంలో మీకు ఎలాంటి అవమానాలు, అన్యాయాలు జరిగాయో ఇవాళ తెలంగాణా వాళ్లకు మీ వల్ల అవే అవమానాలు, అన్యాయాలు ఎదురవుతున్నాయి.

  మీరు మద్రాసు నుంచి విడిపోయేందుకు ఎంత తహ తహ లాడారో
  ఇవాళ తెలంగాణా కూడా మీ నుంచి విడిపోయి తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు అంతకంటే ఎక్కువగా తహతహలాడుతోంది.

  మా బతుకమ్మను మా గడ్డ మీద జరుపుకునేందుకే పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితిలో వున్నాం.
  ఇక మీ గడ్డ మీద ఆడడం కూడానా?

  మేం మా సొంతగడ్డ మీదనే రెండో తరగతి పౌరులుగా అవమానాలు, అణచివేతలను ఎదుర్కొంటుంటే ఇక మీ గడ్డ మీద తలెత్తుకుని సగౌరవంగా తిరిగే భాగ్యం కూడానా?

  మన సమైక్యత ఒక మేడిపండు
  అని ఇవాళ మెజారిటీ తెలంగాణా ప్రజలు గ్రహించారు.

  తుమ్మల శిరీష్‌ కుమార్‌ గారు ... '' ఏ కారణం వల్ల నైనా ఈ ఉద్యమం వేడి సమసిపోయిందంటే ... '' అన్నారు.
  ఏ కారణం వల్లనో కాదు ...
  తెలంగాణా రాష్ట్రం సాకారమయినప్పుడు మాత్రమే ఈ ఉద్యమం ఆగిపోతుంది.
  అప్పుడు తెలంగాణాలో బతుకమ్మ పండుగను
  మరింత వేడుకగా,
  సగౌరవంగా జరుపుకుంటారు.  ReplyDelete
  Replies
  1. ప్రభాకర్ గారు,

   మీరు చెప్పినట్లు, తెలంగాణ ప్రజల గురుంచి నీచంగా మాట్లడిన వాళ్ళ comments నేను ఖండిస్తున్నాను. ఆ విషయంలో మీరు react అయిన విధం కూడ correctయే.

   అయితే, మీరు వ్రాసిన రెండు విషయాలు గురుంచి మాట్లడుకుందాం:

   "మా బతుకమ్మను మా గడ్డ మీద జరుపుకునేందుకే పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితిలో వున్నాం. ఇక మీ గడ్డ మీద ఆడడం కూడానా?"

   తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి అంటే నేను ఒప్పుకోను. అయినా ఈ పరిస్థితికి కారణం ఎవరు? Tank Bund మీద విగ్రహాలు పడగొట్టేసి, రాష్త్ర Governor మీద చెప్పులు విసిరిన వాళ్ళెవ్వరో వారిని అడగండి. ఇప్పుడున్న పరిస్థితికి కారణం అలాంటివాళ్ళు. మధ్యలో ఆంధ్రవాళ్ళు ఏమి చేసారు? ఇంతకు మునుపు మీరు పండుగలు ఇలాగే జరుపుకున్నారా?

   "మేం మా సొంతగడ్డ మీదనే రెండో తరగతి పౌరులుగా అవమానాలు, అణచివేతలను ఎదుర్కొంటుంటే ఇక మీ గడ్డ మీద తలెత్తుకుని సగౌరవంగా తిరిగే భాగ్యం కూడానా?"

   మీ బాధలు, కష్టాలు, మీ పరిస్థితి గురుంచి ముందు మీరు ఎంచుకున్న నాయకుల్ని నిలదీసి అడగండి. వాళ్ళు దీనికి బాధ్యులు...

   Delete
  2. "అప్పుడు తెలంగాణాలో బతుకమ్మ పండుగను
   మరింత వేడుకగా,
   సగౌరవంగా జరుపుకుంటారు." - నేననేదీ అదే. కానీ అమెరికా నుండి ఆస్ట్రేలియా దాకా అప్పుడు వేడుకలు జరగవు. ఎందుకంటే ఉద్యమం లేనపుడు ఆ ప్రాంతాల్లో బతుకమ్మ అవసరం ఉండదు గదా! అదీ నేననేది. పోతే..

   "తెలంగాణావాళ్లని మూర్ఖులు, తెలబాన్లు, ఎంగిలిమెతుకులు తినేవాళ్లు, ఒళ్లు కొవ్వెక్కినవాళ్లు, సోమరులు, ప్రతిభ లేనివాళ్లు అంటూ వెటకారం చేయడం... ఆధిపత్య అహంకారాన్ని ప్రదర్శించడం" ... "ఎంతవరకు సమంజసమో ఎవరికివారు ఆత్మవిమర్శ చేసుకోవాలి." - కానీ అది కేవలం ప్రతిస్పందన మాత్రమేనని మీరు అర్థం చేసుకోవాలి. మీలాగే అవతలి వాళ్ళ సహనానికీ ఒక హద్దుంటుందని, తమను, తమ ప్రాంతాన్నీ అడ్దగోలుగా తిట్టినపుడు, అసహ్యంగా మాట్టాడినపుడు తిరిగి మాట్టాడకుండా ఎక్కువకాలం ఉండరనీ తెలుసుకోవాలి. అవతలివాళ్ళను ఆత్మవిమర్శ చేసుకొమ్మని చెప్పేముందు మీరూ లోచూపు ప్రసరింపజేయాలి. మూడు వేళ్ళు మీవైపు చూపిస్తున్నాయని గ్రహించుకోవాలి.

   Delete
  3. ముందుగా ఒక విజ్ఞప్తి:

   ఇక్కడ స్పందించిన వారిలో 11 మంది "అనానిమస్ " లు వున్నారు.(లేక ఒక్కరే పదకొండు సార్లు స్పందిన్చారా?)

   అనానిమస్ అనేది జీ మెయిల్ ఐడీ లేని వాళ్లకు ఒక సౌలభ్యం.
   అంతే తప్ప స్పందించిన వాళ్ళు తమ పేరు వెల్లడించ కూడదని , తప్పని సరిగా అజ్ఞాతవాసం చేయాలని కాదు. .
   స్పందన చివర తమ సొంత పేరో, కలం పేరో రాయడానికి అభ్యంతరమేమిటో అర్ధం కావడం లేదు.
   అలా పేరు రాయక పోవడం వాళ్ళ ఏ అనానిమస్ ఎవరో తెలియక అంతా కలగాపులగమై అర్ధం లేకుండా పోతోంది.
   దయచేసి అనానిమస్ సౌకర్యం వినియోగించికునే వాళ్ళు చివర్న తమ సొంత పేరో కలం పేరో తప్పక పేర్కొనవలసింది గా కోరుతున్నాను.
   .........................................................................

   ఇక పై అనానిమస్ గారికి

   ఈ పరిస్థితి కి కారణం ఎవరు అన్నారు....
   మీరే ఆలోచించండి ... ఎవరు?
   తెలంగాణా ప్రజల ఆకాంక్షను గుర్తించామని…. నెరవేరుస్తామని బహిరంగంగా వాగ్దానాలు చేసి…. టీ ఆర్ ఎస్ తో పొత్తుపెట్టుకుని… వాళ్లకు కేంద్రం లో రాష్ట్రం లో మంత్రి పదవులిచ్చి…. కామన్ మినిమం ప్రోగ్రాం లో తెలంగాణా అంశాన్ని చేర్చి…. రాష్ట్ర పతి అబ్దుల్ కలాం చేత పార్లమెంటులో ప్రకటన చేయించి…. ప్రణబ్ ముకర్జీ కమిటీ అనే నాటకం ఆడించి ... చివరికి కేంద్ర ప్రభుత్వం తరఫున అప్పటి హోమ మంత్రి చిదంబరం చేత ... The Process of Formation of Telangana State will be initiated. An appropriate Bill will be moved in the Andhra Pradesh Assembly ...అంటూ 2009 డిసెంబర్ 9న ప్రకటన చేయించి మళ్ళీ డిసెంబర్ 23 న ప్లేటు ఫిరాయించి నానా రచ్చ చేసి మా బతుకులతో చెలగాటం ఆడుకుం టున్నది ఎవరు.??

   మీరు బిల్లు పెట్టండి మేం మద్దతిస్తాం అంటూ ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ , సామాజిక తెలంగాణా అంటూ ప్రజా రాజ్యం పార్టీ , మేం తెలంగాణాకు వ్యతిరేకం కాదు అంటూ వై ఎస్ ఆర్ పార్టీ ఆడిన … ఆడుతున్న నాటకాలు …. దగుల్భాజీ రాజకీయాలు మీకు తెలియవా???

   తెలంగాణా ప్రజల్ని ఎం చేయమంటారో ఆంద్ర ప్రజల్ని ఎం చేయమంటారో మీరే చెప్పండి.
   శ్రీ శ్రీ అంతటి వాడే " దొంగ లంజా కొడుకులసలె మెసలే దూర్తలోకం లో వేగలేక తల వంచుకుని వెళ్ళిపోయావా నేస్తం " అని రాసారు.
   కడుపు మండినప్పుడు భాష ఇలాగే వుంటుంది,
   పిల్లిని గదిలో బంధించి చావ బాదాలని చూస్తె అది రక్క కుండా ఉంటుందా?
   అసలు కారణాలను చూడకుండా ప్రజల్ని తప్పు పట్టడం విజ్ఞత కాదు.
   ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

   తుమ్మల శిరీష్ కుమార్ గారూ

   ప్రస్తుత ఉద్యమం తెలంగాణా అస్తిత్వాన్ని, తెలంగాణా సంస్కృతిని, తెలంగాణా ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకునేందుకు సాగుతున్న ఉద్యమం.
   ఉద్యమం విజయవంత మైన తరువాత తెలంగాణా వాళ్ళు తమ సంస్కృతిని, అస్తిత్వాన్ని గాలికి వదిలేస్తారని నేను అనుకోను.
   మరింత ప్రగాఢ మైన అభిమానంతో బతుకమ్మను ఆరాధిస్తారు.

   >>>>>>> అది కేవలం ప్రతిస్పందన మాత్రమేనని మీరు అర్థం చేసుకోవాలి. మీలాగే అవతలి వాళ్ళ సహనానికీ ఒక హద్దుంటుందని, తమను, తమ ప్రాంతాన్నీ అడ్దగోలుగా తిట్టినపుడు, అసహ్యంగా మాట్టాడినపుడు తిరిగి మాట్టాడకుండా ఎక్కువకాలం ఉండరనీ తెలుసుకోవాలి.<<<<<<

   బాగా చెప్పారు
   నిజానికి తెలంగాణా ప్రజలదే ప్రతిస్పందన .
   ఈ అవాంచనీయమైన ఆట మొదలెట్టిందే సీమాన్ద్రులు.
   వెటకారాలు, అవహేళనలు, చీత్కారాలు మీ వైపు నుంచే మొదలయ్యాయి.
   తెలంగాణా అంటే ఆంధ్రులకు ఎంత చులకనో నూటికి తొంభైతొమ్మిది సినిమాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
   ప్రత్యక్షంగా మేం చూస్తూనే వున్నాం.

   మీకు తెలంగాణా భూములూ, నిధులూ, నీళ్ళూ, ఉద్యోగాల మీద ఉన్న వ్యామోహంతో పాటు తెలంగాణా ప్రజల మీద, వారి సంస్కృతీ సంప్రదాయాలమీద, భాష మీదా కాస్త .... చిటికె డంత …. గౌరవం, సుహృద్భావం వుంటే మన సమైక్యత ఇలా “మేడిపండు” లా ఎందుకు మారేది. ???!!!


   Delete


 11. related post:
  http://kotiratanalu.blogspot.fi/2012/10/blog-post_8448.html

  ReplyDelete
 12. Anonymous October 30, 2012 9:59 PM "మనీష్ గారు, తెలంగాణా వాళ్ళకు..."
  Anonymous October 31, 2012 10:04 PM "జై గారు, ఈ టపా చిన్న పండుగా..."
  Anonymous November 2, 2012 7:25 PM "ప్రభాకర్ గారు, మీరు చెప్పినట్లు..."
  పైన ఈ comments నావి.

  ముందుగా నేను తెలంగాణవాదానికి, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లడటం లేదు అని మీరు తెలుసుకోవాలి. కేవలం నేను ఆంధ్ర ప్రజల్ని సమర్ధిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మీలాంటి వారే, వాళ్ళలోను మీరనే తెలంగాణ ప్రజల్లాగా అనగదొక్కబడినవారూ ఉన్నారు.

  మీరడిగిన రెండు ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానం - రాష్త్రంలోని కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు. వారు ఏ ప్రాంతంవారు అవ్వనీనివ్వండి, ఏ పార్టీవారు అవ్వనీనివ్వండి. ఆంధ్ర నాయకులే స్వార్ధపరులు అని ఒకవేళ అనుకుంటే, మరి అదే సమయాన గడచిన యాభై ఏళ్ళలో తెలంగాణ నేతలు ఏమి చేస్తున్నారు? వారిని ఏమి అనాలి? ముందు వాళ్ళని అనకుండా, ఆంధ్ర ప్రజలే దీనికి కారణం అనుకోవడం చాలా తప్పు. ఉదాహరణకి, TRS congressలో విలీనం చెస్తారంటే, ఎవరి రాజకీయ లబ్ధి వారు చూసుకుంటున్నారు..Congress ఏమి ఆంధ్ర పార్టీ కాదు, తెలంగాణ నుంచి కూడా Congress నేతలున్నారు. మరి మీకనిపించింది వారికి ఎందుకనిపించడంలేదు?

  సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. మీరు విడిపోవాలి అనేవాదానికి ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని కలుపుకోలేదు అనే కారణం జోడించవద్దు. అది సరికాదు, అది ఆంధ్ర ప్రజలు ఎవ్వరు హర్షించరు. అదే నిజమైతే, మేము ఆంధ్ర రాష్త్రం కావాలనే కోరుకుంటాం.

  ReplyDelete
 13. సంపత్ కుమార్ గారూ

  నా విజ్ఞప్తిని మన్నించి మీ వ్యాఖ్యానాల కింద సంతకం చేసినందుకు ధన్యవాదాలు.
  తెలంగాణా వాదానికి, తెలంగాణా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్నందుకు కృతజ్ఞతలు.

  తెలంగాణలో ఉన్నట్టే ఆంధ్రాలో కూడా అణగ దొక్క బడిన ప్రజలు వున్నారు అన్నారు. ఈ మాట తో ఎవరూ విభేదించరు . అయితే అక్కడ వారిని అణగ దొక్కుతున్నది ఎవరు? తెలంగాణా వారైతే కాదుకదా.
  కానీ తెలంగాణను అణగ దొక్కుతున్నది, అన్యాయం చేస్తున్నది మాత్రం కచ్చితంగా సీమాంధ్ర నాయకులు. సీమాంధ్ర పాలన ! (మా లత్తకోరు నాయకుల పాత్ర లేదా అంటే ఎందుకు లేదు. ఎంతో వుంది. అది మరో చరిత్ర )
  తెలంగాణా విషయంలో లగడపాటి, కావూరి, టీ జీ వెంకటేష్ , చంద్రబాబు నాయుడు వంటి వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఆటలు మీకు తెలియనివి కావు.
  వాళ్ళ ని నిలదీస్తే మీరు మొత్తం సీమంధ్ర ప్రజలను ధూషిస్తున్నారని అపోహ పడుతున్నారు.

  సీమాంధ్ర నాయకత్వం , మీడియా ఒక పధకం ప్రకారం అలాంటి అభిప్రాయం కలిగించేందుకు గోరంతలను కొండంతలు చేసి ప్రచారం చేస్తోంది.
  తెలంగాణా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కృషి చేస్తోంది.
  తెలంగాణా ప్రజల ఆకాంక్షలమీద బురద జల్లుతోంది.
  అదే సమస్యను రావణ కాష్టం చేసి, మన రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలను రగిలిస్తోంది.

  సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి అన్నారు
  తెలుసుకున్నమండీ.
  సుహృద్భావం లేని, పరస్పర గౌరవం లేని, సమానత్వం, న్యాయం, ధర్మం లేని మన విలీనం లోనే వుంది.
  మన సమైక్యత ఒక మేడిపండు అని, విడిపోవడం లోనే పరిష్కారం వుందని అందరూ గ్రహించారు.
  కొందరు సీమాంధ్ర స్వార్ధ రాజకీయ బెహారులే ఈ సమస్య పరిష్కారానికి అడ్డు పడుతూ విద్వేషాలకు, అనేక మంది తెలంగాణా యువత ఆత్మా బలిదానాలకు కారణ మవుతున్నారు.
  సత్వరమే విడిపోతే ఆంద్ర తెలంగాణా ప్రజల మధ్య ఈ అనవసరపు విద్వేషాలకు ఆస్కారం వుండదు.

  అదేం ఖర్మమో గానీ ప్రత్యెక తెలంగాణా కోసం తెలంగాణా ప్రజలు ఉద్యమిస్తున్నప్పుడు (1969 ) ఆంద్ర ప్రజలు గమ్మునుంటారు.
  ప్రత్యేక ఆంద్ర కోసం ఆంద్ర ప్రజలు ఉద్యమిన్స్తున్నప్పుడు (1971 ) తెలంగాణా ప్రజలు మౌనంగా వుంటారు.
  ఇరు ప్రాంతాల ప్రజలు ఒకేసారి నడుం బిగిస్తే ఇరు ప్రాంతాల స్వార్ధ రాజకీయ నాయకుల ఆట ఎప్పుడో కట్టయ్యేది.

  ...................................................

  విశ్వరూప్ గారూ

  మీ జీరో టాలరెన్స్ పోస్ట్ సమగ్రంగా వుంది.
  నేను పై పై న తడిమిన పాయింట్ ని మీరు మరింత వివరంగా రాశారు.
  సంతకం లేని అనానిమస్ ల వ్యాఖ్యానాలు మీకు కూడా అసహనం కలిగిస్తున్నాయికదా.
  అసలు ఈ అనానిమస్ ఫెసిలిటీ ని తొలగిస్తే బెటరేమో.

  ReplyDelete
 14. ప్రభాకర్ గారు,

  ఈ మధ్య కాలంలొ బ్లాగులొ తెలంగనా పక్షాన వాదిస్తూ బూతులు వాడనందుకు అభినందనలు.

  చంద్రబాబు అతి తెలివి వల్లె "మీరు తీర్మానం పెత్తండి - మేము మద్దతు ఇస్తాము" అని వాగి నెత్తి మీదకు తెచ్చుకున్నాడు.

  చంద్రబాబు నాయుడుది మాత్రమె రెండుకళ్ళ సిద్ధాంతం కాదు, భ జ పా ఏమి తక్కువ తినలెదు.... వుత్తర ప్రదెష్ అంత పెద్ద రాష్త్రం - దాన్ని విడదీయ కూడదు ఎందుకని - రెండుకళ్ళ సిద్ధంతం?? కర్నాతకలోని బెల్గాం జిల్లాలొ 80% ప్రజలు మహరాస్త్రీయులు, జిళ్ళా పరిషత్ నుంచి, మునిసిపాలిటీ వరకు మహారాష్త్ర ఏకీకరణ సమితి గెలుస్తున్నది. భా జ పా మహారాస్త్ర వారు ఎం ఈ ఎస్స్ కి మద్దతు - భా జ పా కరనాటకా వారు వ్యతిరేకం.

  నగపూర్ కెంద్రంగా విదర్భ రాస్త్రాన్ని "వేర్పాటు" చెయ్యాలని ఫజల్ అలీ గారి తీర్పు చాలా స్పష్తంగా వుంది. కాని, విదర్భ గురించి మాత్లాడితె సివసేన ఠాకరే మరో ఒస్మానియా విద్యార్ధి అవుతాడు. కాబట్టి అక్కడ కూడా భ జ పా వారిది రెండు కళ్ళె.

  కె చ రా గారు అప్పటి వరకు తె దె పా, సి పి ఇ, తదితర పార్టీలతో పొత్తు పెత్తుకోని భా జ పా కి వ్యతిరేకంగా ప్రచారం చెసి, ఫలితాలు రాకమునుపే భా జ ప పంజాబ్ ర్యాలీలొ సన్మానం చేఇంచు కున్నాడు. ఇది రెందుకళ్ళ సిధాంతం కాదా. జైలుగన్ సారీ జగన్ పార్టీని అతి తక్కువగా విమర్సిస్తూ, తె దె పా మీద ఒంటి కాలు మీద లేచే తె రా సా ది రెండు కళ్ళ సిధాంతం కాదా?? వారి మీడియా వీరిని తప్పు పట్టదు వీరి మీడియా వారిని తప్పు పట్టదు. ఇది రెండు కళ్ళ సిధాంతం కాదా??

  మన పిల్లలు గుంటూరు విగ్నాన్ రత్తయ్య గారి దగ్గర "పేడ బిర్యానీ " తింటూ మంచి చదువులు చదువుకోవాలి గాని ఒస్మనియా విస్వ విద్యాలయంలో పిల్లలు మాత్రము రాబోయె వుద్యమానికి రాళ్ళు పోగేస్తు కూర్చోవాలి. ఇది రెండు కళ్ళ సిధాంతం కాదా.

  మనం మాత్రం "ఆంధ్రోళ్ళతొ" చాటు మాటుగా వ్యాపారాలు చేసుకోవాలి, టి వీ 10 లో చర్చల్లో నటిస్తూ అమాయకులు అగ్నికి ఆహుతి కావలి. ఇక్కడ పిల్లలు ప్రొఫెసరు గారి నాయకత్వంలొ బళ్ళు బందు పెట్టాలి, తన పిల్లలు మాత్రము అమెరికాలో హాయిగా చదువుకోవాలి. ఇది రెండు కళ్ళ సిద్ధాంతం కాదా?

  తన పత్రిక పేరు మార్చుకొవడానికే ఇస్తపడని సీ పీ ఇ (విసాలాంధ్ర) నారయనగారిది రెందుకళ్ళ సిధాంతం కాదా.

  విదదీయాలని అనుకునె వాడు వ్యతిరేకించెవాల్లని కలుపుకొవడానికి ప్రయత్నించాలి. అవతలి ప్రాంతంలో వ్యతిరేకత రాకమునుపే కావాలని భాగో జాగొ, తంతాము, పొడుస్తాము అని ఏరోజు అయితే నోరు పారెసుకున్నాడో ఆరోజే అర్ధం అయ్యింది ఆయన గారికి విభజన మీద అంత సుముఖంగా లేడని.

  చివరిగా - ప్రజలని విడదీసి, తెలుగుని తిట్టి, నిజాముని పొగిడి, గోడలుకట్టి రాష్త్రాన్ని విభజించలేరు. తెలుగుని తిదుతూ కె చ రా గారికి నిజంగా విభజనపై కోరిక వుంటే అతగాడు తీర సీమాంధ్రలో తిరుగుతూ ప్రజలని మెప్పించి ఒప్పించడం చాలా సులభం.

  ReplyDelete
 15. మాది ప్రకాశం జిల్లా. దురద్రష్ట వశాత్తు నేను తెలుగువాణ్ణీ అని ఘనంగా చెప్పుకొనేముందు ప్రాంతం పేరు చెప్పుకొవలసిన ఖర్మ దాపురించింది. తీర ప్రాంతంలోని జిల్లాల్లొ బ్రాహ్మనుల్లో ఒక ఆచారం వుంది. బ్రాహ్మన స్త్రీలు ఒక పెద్ద గొబ్బెమ్మను చేసి పూలతో అలంకరించి "గౌరి కల్యాణా వైభోగమే" అంటూ పాటలు పాడి చెరువులో వాళ్ళడిస్తారు. అక్కడికి వచ్చిన స్త్రీలకి దద్ధొజనం, పులిళోర పంచడం ఆనవాయితి. ఈ ఆచారం బ్రతుకమ్మ పందుగకి దగ్గరగా వుంది. కానీ, ఈరోజున బ్రాహ్మణ కుటుంభాలు పొట్ట చేతపట్టుకొని వివిధ ప్రాంతాల్లో, రాష్త్రాల్లొ స్థిరపద్దారు. ఇంకా వున్నవాళ్ళు ఒకటికి రెండు సార్లు (తాళి బాగ గట్టిగ వుంటుందని కాబోలు) పెళ్ళి చేసుకున్న మోహనుబాబు చేతా వారి సంతతి చేత, ఐలయ్య లాంటి మేధవులచేత (ఈయన గారి ప్రకారం పెట్రొల్ ప్రైసులు పెరగటం దగ్గరనుంచి గాలి/జైలుగన్ అక్రమాస్తుల వరకు బ్రాహ్మల్లే కారణం) గేలి చేయబదుతున్నారు. ఇదండి సంగతి.
  ReplyDelete
 16. @ Child Psychology

  మీ స్పందనకు కృతజ్ఞతలు.
  అన్ని రాజకీయ పార్టీల, నాయకుల ద్వంద్వ నీతిని, జిత్తులమారి తనాన్నిచక్కగా విశ్లేషించారు.

  ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు నిజాయితీ లేకుండా, ప్రజల పట్ల కనీస నిబద్ధత, కనీస బాధ్యత లేకుండా దుర్మార్గంగా, స్వార్ధ పూరితంగా వ్యవహరిసున్నాయన్నది అక్షరాలా నిజం.
  తెలంగాణా విషయంలో అన్ని పార్టీ లదీ దొంగ నాటకమే.

  కనీసం సామాన్య ప్రజలుగా మనమైనా నిష్పాక్ష పాతంగా ఆలోచిస్తూ, వాస్తవాలను బేరీజు వేసుకుంటూ సమస్య పరిష్కారానికి మనవంతు ప్రయత్నం చేయాలి.

  ప్రస్తుత దుర్మార్గపు రాజకీయాలను చూస్తుంటే ...భారత దేశానికి బద్ధ శత్రువు, సామ్రాజ్య వాది అయినప్పటికీ విన్స్టన్ చర్చిల్ అన్న మాటలు ఇక్కడ గుర్తుచేసుకోక తప్పడం లేదు.:

  "Power will go to the hands of rascals, rogues, freebooters;
  all Indian leaders will be of low calibre & men of straw.
  They will have sweet tongues & silly hearts.
  They will fight amongst themselves for power &
  India will be lost in political squabbles.
  A day would come when even air & water would be taxed in India.”
  – Winston Churchil


  .

  ReplyDelete