
నేను అనువాదం చేసిన డా.యాగాటి చిన్నారావు పరిశోధన గ్రంథం ''ఆంధ్ర ప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర'' (దళిత్ స్ట్రగుల్ ఫర్ ఐడెంటిటీ) కి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు(2009) ప్రకటించారని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను.
ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ వారికీ, గ్రంథ పరిశోధకులు డాక్టర్ చిన్నారావు గారికీ, ఈ అద్భుతమైన పుస్తకాన్ని తెలుగు లోకి అనువదించే అవకాశం కల్పించిన హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారికీ ప్రత్యేకించి ట్రస్ట్ నిర్వాహకులు శ్రీమతి గీతా రామస్వామి గారికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
నాకు గతం లో ఆకాశ వాణి వారు అఖిల భారత స్థాయిలో నిర్వహించిన రేడియో నాటక రచనల పోటిలో ( 1988 ) "అపరాజిత" నాటకానికి తృతీయ బహుమతి లభించింది. ఆ తరువాత కారణాంతరాల వల్ల అనువాదాల్లో కూరుకు పోయిన నాకు ఇప్పుడు ఈ విధంగా మరో జాతీయ పురస్కారం లభించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఒక పక్క అవధుల్లేని ఆనందం - మరో పక్క స్వోత్కర్ష అవుతుందేమో అన్న జంకు వల్ల ప్రస్తుతానికి ఇంతకంటే ఏమీ రాయలేక పోతున్నాను.
అందరికీ అభివందనములు.
- ప్రభాకర్ మందార
ది హిందూ లో (27 ఫిబ్రవరి 2010) ప్రచురించిన న్యూస్ ఐటం
http://www.hindu.com/2010/02/27/stories/2010022754300400.htm
Andhra Jyothy
http://www.andhrajyothy.com/unicodevividhashow.asp?qry=2010/mar/1/vividha/1vividha5&more=2010/mar/1/vividha/vividhamain
.....
ఈ అవార్డును 20 ఆగస్టు 2010 న పనాజీ (గోవా) లో జరిగిన కార్యక్రమం లో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు శ్రీ సునీల్ గంగోపాధ్యాయ ప్రదానం చేసారు.
ఆ సందర్భంగా తీసిన కొన్ని చాయా చిత్రాలు దిగువన పొందుపరుస్తున్నాను.





