Sunday, February 28, 2010

కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక అవార్డు రూపంలో నాకు అపూర్వ గుర్తింపు !


నేను అనువాదం చేసిన డా.యాగాటి చిన్నారావు పరిశోధన గ్రంథం ''ఆంధ్ర ప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర'' (దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ) కి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు(2009) ప్రకటించారని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను.

ఈ సందర్భంగా కేంద్ర సాహిత్య అకాడమీ వారికీ, గ్రంథ పరిశోధకులు డాక్టర్‌ చిన్నారావు గారికీ, ఈ అద్భుతమైన పుస్తకాన్ని తెలుగు లోకి అనువదించే అవకాశం కల్పించిన హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారికీ ప్రత్యేకించి ట్రస్ట్‌ నిర్వాహకులు శ్రీమతి గీతా రామస్వామి గారికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

నాకు గతం లో ఆకాశ వాణి వారు అఖిల భారత స్థాయిలో నిర్వహించిన రేడియో నాటక రచనల పోటిలో ( 1988 ) "అపరాజిత" నాటకానికి తృతీయ బహుమతి లభించింది. ఆ తరువాత కారణాంతరాల వల్ల అనువాదాల్లో కూరుకు పోయిన నాకు ఇప్పుడు ఈ విధంగా మరో జాతీయ పురస్కారం లభించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.

ఒక పక్క అవధుల్లేని ఆనందం - మరో పక్క స్వోత్కర్ష అవుతుందేమో అన్న జంకు వల్ల ప్రస్తుతానికి ఇంతకంటే ఏమీ రాయలేక పోతున్నాను.

అందరికీ అభివందనములు.
- ప్రభాకర్ మందారది హిందూ లో (27 ఫిబ్రవరి 2010) ప్రచురించిన న్యూస్ ఐటం

http://www.hindu.com/2010/02/27/stories/2010022754300400.htm

Andhra Jyothy

http://www.andhrajyothy.com/unicodevividhashow.asp?qry=2010/mar/1/vividha/1vividha5&more=2010/mar/1/vividha/vividhamain

.....

ఈ అవార్డును 20 ఆగస్టు 2010 న పనాజీ (గోవా) లో జరిగిన కార్యక్రమం లో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు శ్రీ సునీల్ గంగోపాధ్యాయ ప్రదానం చేసారు.
సందర్భంగా తీసిన కొన్ని చాయా చిత్రాలు దిగువన పొందుపరుస్తున్నాను.25 comments:

 1. అభినందనలు ప్రభాకర్ గారూ.

  ReplyDelete
 2. Dear Prabhakar gaaru:

  elaa vunnaaru?

  meeku saahitaya academy awardu raavadam nijamayina krushiki
  satkaaraalu dakkavaccu anna aasaa samketam. abhinandanalu.

  iteevali mee anuvaada krushi chaalaa baavumdi. prayojanaatkam.

  mee krushi marimta munduku saagaalani aasistoo


  afsar

  ReplyDelete
 3. అభినందనలు ప్రభాకర్ గారు.మీరు మరిన్ని పురస్కారాలను అందుకోవాలని ఆకాంక్షిస్తూ.మీ...

  ReplyDelete
 4. అభినందనలు ప్రభాకర్ గారూ...

  ReplyDelete
 5. నా అభినందనలు కూడ అందుకోండి.

  ReplyDelete
 6. హృదయపూర్వక అభినందనలు ప్రభాకర్ గారు !
  ఈ రోజే ఒక సభలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధిపతి ప్రొఫెసర్ కిషన్ రావుగారు చెప్పితే తెలిసింది.
  ఇంటికి వచ్చాక మీ బ్లాగులో చూసి అభినందిస్తున్నాను.
  మీ జీవితం సఫలమయింది. ముందు మీ ప్రొఫైల్ ను "కేంద్ర సాహిత్య అవార్డ్ గ్రహీత" స్థాయిలో అప్ డేట్ చేయండి.

  ReplyDelete
 7. మీరిలాంటి అవార్డులు మరిన్ని తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అభినందనలు.

  ReplyDelete
 8. అభినందనలు.మీతో కలిసి ఈ వేదిక పంచుకోవడం గర్వంగ ఉంది.లోగడ మనం ఒక సారి కలుసుకొన్నప్పుడు మి పుస్తకం గురించి నేను మీతో గ్లొవింగ్ ట్రిబ్యూట్ ఇచ్చాను.కాబట్టి సాహిత్య అకాడెమీ కన్నా నేనే ముందుగా మీ ప్రతిభని గుర్తించాను.

  ReplyDelete
 9. ప్రభాకర్ గారు, అభినందనలు! మొన్ననే ఒక మీడియా మిత్రుడు చెప్తే తెలిసింది ఈ వార్త. మీ బ్లాగులో ప్రకటిస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను. సాహితీ కృషీవలులై ఇంకా ఎన్నో అవార్డులు అందుకోవాలని ఆశిస్తున్నాను.

  ఇది అందరికీ లభించే అదృష్టమా చెప్పండి? మీ ప్రతిభకు పురస్కారం. దాన్ని అందరితో పంచుకోవడం సముచితమేగా!దీన్ని స్వోత్కర్ష అనడం మీ వినయమే!

  ReplyDelete
 10. సర్వ శ్రీ శివ, కొండముది సాయి కిరణ్ కుమార్, రాజేంద్ర కుమార్ దేవరపల్లి , చిలమకూరు

  విజయమోహన్, కత్తి మహేష్ కుమార్, నరసింహ (వేదుల బాలకృష్ణ మూర్తి), చదువరి, వెన్నెల

  రాజ్యం గార్లకు ధన్యవాదాలు.


  అఫ్సర్ గారూ మీకు కలిగిన అభిప్రాయమే నాకూ కలిగింది. మీ ఆత్మీయతకు కృతజ్ఞతలు.


  డా. ఆచార్య ఫణీంద్ర గారూ, నిజమే, మీరన్నట్టు నా జీవితం సఫలమైందనే భావిస్తున్నాను. మీ

  సూచన పాటిస్తాను. కానీ టెంప్లేట్ మార్చిన తరువాత బ్లాగులో కామెంట్స్ మొదలు ప్రతీదీ ఇబ్బందిగా

  వుంది.
  ప్రొ.కిషన్ రావు గారూ నేనూ ఒకే కాలేజీలో చదివాం, ఆయన నాకంటే ఒక సంవత్సరం సీనియర్. నలభై

  సంవత్సరాల తర్వాత నిన్న రాత్రి వారు నా ఫోన్ నెంబర్ కనుక్కుని మరీ ఫోన్ చేసి అభినందించారు.

  ఆత్మీయ సన్నివేశం. చాలా సేపు ఆనాటి సంగతులు గుర్తు కున్నాం. పూలకుండీ లోని మొక్కకు

  నాలుగు పాత టాబ్లెట్లు వేస్తె ఎలా వుంటుందో అలా వుంది. మీ అభినందలకు హృదయపూర్వక

  ధన్యవాదాలు.


  చె.దె. పూ.దం. గారూ, పెద్ద పరీక్షే పెట్టారు. ముందుగా మీ అభినందనలకు కృతజ్ఞతలు.


  సుజాత గారూ, ప్రతిభ అంటే ఇబ్బంది గా వుంది. అదృష్టమే ఇది. మీ శుభాకాంక్షలకు, అభినందనలకు ధన్యవాదాలు.

  ReplyDelete
 11. అభినందనలు ప్రభాకర్ గారు.

  ReplyDelete
 12. ప్రభాకర్ సర్ !స్వోత్కర్ష ఎందుకవుతుందండీ...అలా అనుకుంటే మాలాంటివారికెలా తెలుస్తుంది హృదయ పూర్వక అభినందనలండీ

  ReplyDelete
 13. ఏకలింగం గారూ, రమణ గారూ, శరత్ గారూ
  ధన్యవాదాలు.
  పరిమళం గారూ
  మీ ఆత్మీయ వచనాలకు కృతజ్ఞతలు.

  ReplyDelete
 14. థాంక్ యూ శ్వేతా,
  అకస్మాత్తుగా నిన్ను "ఉయ్యాలలో" చూసి సంభ్రమానికి గురయ్యాను. చాలా సంతోషం కలిగింది.
  గాడ్ బ్లెస్ యూ.
  ఈ వీకెండ్ కి వీలు చూసుకుని ఫోన్ చేయి.

  ReplyDelete
 15. ప్రభాకర్ గారు ,
  అభినందనలండి .

  ReplyDelete
 16. మాలా కుమార్ గారూ
  ధన్యవాదాలు.

  ReplyDelete
 17. ప్రభాకర్ మందారగారూ, యీ రోజు మీ బ్లాగును తెరచి యీ మహత్తర విషయం తెలుసుకున్నాను. కోట్ల మందిలో యెందరికో సాధ్యం కానిది, ఎంతటి క్రుషి పట్టుదల,దక్షత,మీకు వుంటే కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు (అనువాద విభాగంలో) అనే మహత్తర పురస్కారం పొందడంమీకు సాధ్యమైంది.... . కొంచెం లేటయినా అందుకోండి నా అభినందన. ....
  వడ్డించిన విస్తరి ఎగురదూ,
  పూర్ణ కుంభం మెసలదూ
  నిండుకుండ తొణకదూ....యిలా యిలా సాగే
  లోగడ నేను వ్రాసిన గేయ పంక్తులు గుర్తుకు వచ్చాయి.
  "స్వోత్కర్ష అవుతుందేమో అన్న జంకు" అన్న మీ మాటలు చదివినప్పుడు. యీ పదాలు చాలు మీ వ్యక్తిత్వానికి దర్పణం పడుతూ. తెలుగు సాహితీ వనం లోని ఓ పుష్పం బ్లాగ్లోకం . మీరున్న ఆ బ్లాగ్లోకపు ఓ పూరెమ్మగా నేనూ యీ పురస్కారం అందుకున్నంత గా ఆనందిస్తున్నాను అదే సౌరభాన్ని ఆపాదించుకొంటూ.. మరొక్క సారి అభినందనలతో. శ్రేయోభిలాషి........నూతక్కి రాఘవేంద్రరావు.

  ReplyDelete
 18. నూతక్కి రాఘవేంద్ర రావు గారూ
  మీ అభినందనలకు హృదయ పూర్వక ధన్యవాదాలు .
  అనూహ్యమైన ఈ అవార్డు లాగే - మీ ఆత్మీయత, అభిమానం నన్ను విచలితున్ని చేసింది.
  ధన్యవాదాలు చాలా చిన్న మాట . కానీ నావద్ద అంతకు మించిన పదం లేదు. మన్నించాలి.
  అభివందనములతో
  భవదీయుడు
  ప్రభాకర్ మందార

  ReplyDelete
 19. dear prabhakar mandaaraa! meeru nijangaa erra mandaarame! mandaara ante meeroppukoru, kadante nenoppukonu.pl receive my heartfelt congrats. u have really come off with flying colours with this award. in fact u deserve it , for u have that talent. thanks to the selectors too. it is a red letter day in ur life. pl cherish it. i have no words to express my bliss. sky is d limit for it. urs bosom friend bhaskar

  ReplyDelete