Friday, May 15, 2009

ఉష్ట్ర పక్షులు ...





ఉష్ట్ర పక్షులు


ఉన్న పిడికెడు ఉద్యోగాలను
ఉత్తరాలూ, దక్షిణాలూ రాబందుల్లా
తన్నుకుపోతున్నప్పుడు
నువ్వింకా ఎంతకాలం ప్రతిభా ప్రతిభా
అంటూ పలవరిస్తూ కూచుంటావు?
ఇంకా ఏం తాకట్టుపెట్టి, ఏం అమ్ముకుని
ద్రవ్యోల్బణాన్నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తావు?

ఈ దుష్ట వ్యవస్థ సృష్టించిన రోగక్రిములతో
నువ్వు తినే తిండీ, తాగే నీరూ, పీల్చే గాలీ
కలుషితమైపోతున్నప్పుడు
ఏ యోగాసనాలు, ఏ ప్రాణాయామాలు
క్షీణిస్తున్న నీ ఆరోగ్యాన్ని కాపాడతాయని భ్రమిస్తావు?

నీ చుట్టూ కోట్లాదిమంది
ఆకలిమంటల్లో అ ల్లాడిపోతున్నప్పుడు
నువ్వు కూడబెట్టుకున్న ధాన్యాన్నీ, దనరాసుల్నీ
ఏ సొరంగాల్లో భ్రద్రంగా దాచుకోగలవు?

నేల అట్టడుగు పొరల్లోంచి ఉద్యమ
భూప్రకంపనాలు ప్రజ్వరిల్లుతున్నప్పుడు
నువ్వు నీ హంసతూలికా తల్పం మీద
ఇంకా ఎంత కాలం నిశ్చింతగా నిద్రపోగలవు??


(ఎపిఎస్‌ఆర్‌టిసి ఆర్ట్స్‌కో 1991లో నిర్వహించిన కవితల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత)

8 comments:

  1. అంత బాగున్నది కనుకనే బహుమతి వచ్చింది....

    ReplyDelete
  2. ఉద్వేగం కలిగించేంత, ఆలోచన రేకెచ్చేంత బాగుంది, నేను ఒకప్పుడు ఈ మాదిరి వ్రాసుకున్న కవిత త్రిశంకు నరకం చూసొద్దామా? కాదంటే మనమొకటి కట్టేద్దామా? http://maruvam.blogspot.com/2009/01/blog-post_08.html

    ReplyDelete
  3. ప్రభాకర్ సర్ ! ఏం చెప్పను ? అధ్బుతం !

    ReplyDelete
  4. కళ్ళు తెరిపించారు ..బావుంది ..great

    ReplyDelete
  5. @ పద్మార్పిత, ఉష, పరిమళం, హరికృష్ణ గార్లకి
    ఈ పాత చింతకాయ ఇప్పుడెవరికి నచ్చుతుందిలే అనుకున్నాను.
    మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా వుంది.
    ధన్యవాదాలు.
    అవును ...ఉష్ట్ర పక్షులు అంటే ఆఫ్రికన్ ఎడారుల్లో వుండే నిప్పు కోళ్ళే !
    వేటగాడు వెంటాడినప్పుడు.. అవి పరుగెత్తి పరుగెత్తి చివరికి ఆయాసం రాగా తలను మాత్రం ఇసుక లో దూర్చి ఆగిపోతాయట.
    తను వేటగాడికి కనపడకుండా తెలివిగా దాక్కున్నానని ... పాపం అది భ్రమ పడుతుంది.
    వేటగాడేమో తాపీగా దగ్గరకొచ్చి దాన్ని బంధించి తీసుకెళతాడు
    అని ప్రతీతి.

    ReplyDelete
  6. ప్రభాకర్ మందార గారూ !
    మీకు నా 'తెలంగాంణ అవ్వ 'నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదములు. ఇప్పుడే మీ కవితలు 'వైతరణి మీద వంతెన కోసం' మరియు 'ఉష్ట్ర పక్షులు ' కవితలు చదివాను. రెండూ సామాజిక స్పృహ కలిగి ఉన్న గొప్ప కవితలు అనడంలో సందేహం లేదు.
    మీరు ఇంకా మరిన్ని మంచి రచనలు చేయాలని ఆశిస్తూ...

    ReplyDelete
  7. నాగరాజు రవీందర్ గారూ,
    మీ ఆత్మీయ వచనాలకు, సహృదయతకు ధన్యవాదాలు.

    ReplyDelete