Wednesday, August 6, 2025

వో బస్‌ ముసల్మానోంసే డర్‌తాథా

 

 

 

వో బస్‌ ముసల్మానోంసే డర్‌తా థా !

…………………………………………………..

(కాన్పూర్‌కు చెందిన యువకవి నిఖిల్‌ సచాన్‌ (1986 - ) ఉద్యోగ రీత్యా గురుగ్రామ్‌ (దిల్లీ) లో వున్నప్పుడు వివిధ హిందూ సంఘాలకు చెందినవాళ్లు అక్కడి శుక్రవారం ప్రార్థనల (నమాజ్‌) పై సృష్టిస్తున్న గొడవల్ని చూసి స్పందించి రాసిన హిందీ కవితకు ఇది నా స్వేచ్ఛానువాదం. -  ప్రభాకర్‌ మందార)

వో బస్‌ ముసల్మానోంసే డర్‌తాథా ...

......................................

నా దోస్తొకడు జాతీయ సమైక్యతా కబుర్లు

వినడానికే బాగుంటాయనేవాడు

ఎప్పుడైనా ముస్లిం మొహల్లాకి ఒంటరిగా వెళ్లావా

వెళ్లిచూడు నాకైతే వొణుకొస్తుందనేవాడు!

 

వాడు ముస్లింలంటే భయపడేవాడు

కానీ, షారూఖ్‌ ఖాన్‌ అన్నా.. అతని బుగ్గలపై పడే సొట్టలన్నా

దీపావళికి విడుదలయ్యే అతని సినిమాలన్నాతెగిష్టపడేవాడు

దిలీప్‌ కుమార్‌ అసలు పేరు యూసఫ్‌ ఖాన్‌ అని వాడికి తెలియదు

దిలీప్ నటనకు ఫిదా అయిపోయేవాడు

వాళ్లంటే వాడికి ఎలాంటి భయమూ వుండేదికాదు

వాడు కేవలం ముస్లింలంటేనే భయపడేవాడు!

 

క్రిస్‌మస్‌కు విడుదలయ్యే అమీర్‌ ఖాన్‌

సినిమాలకోసం ఎదురుతెన్నులు కాచేవాడు

ఈద్‌ నాడు విడుదలయ్యే సల్మాన్‌ ఖాన్‌ సినిమాను

బ్లాకులో టికెట్లు కొని మరీ ఈలలు వేస్తూ చూసోచ్చేవాడు

వాళ్ళంటే వాడికి భయంవేసేదే కాదు

కానీ, ముస్లింలంటేనే వాడు వణికిపోయేవాడు.

 

నాతో పాటే ఇంజనీరింగ్ చదువుకున్నాడు  

సైన్సన్నా, అబ్దుల్‌ కలాం అన్నా వాడికెంత ఆరాధనో

ఏనాటికైనా సైంటిస్టునౌతా, దేశానికి పేరు తెస్తాననేవాడు

కలాంకు సలాం కొట్టేవాడు తప్ప భయపడేవాడు కాదు

వాడు కేవలం ముస్లింలంటేనే భయపడేవాడు!

 

క్రికెట్ అంటే వాడికి మహా పిచ్చి

ప్రత్యేకించి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ నవాబీ సిక్సర్లు

మహ్మద్ అజారుద్దీన్ మణికట్టు మాయాజాలం

జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ బంతులతో చేసే

విన్యాసాలు చూసి ఉప్పొంగి పోయేవాడు

టీం లో వాళ్ళుంటే పాకిస్తాన్ మటాషె అనేవాడు తప్ప

వాళ్ళంటే ఎప్పుడూ భయపడేవాడు కాదు

వాడు కేవలం ముస్లిం లంటేనే బెదిరిపోయేవాడు

 

నర్గీస్‌, మధుబాలల అసలు అందాలు

బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే చూడాలనేవాడు

వహీదా రెహమాన్‌ చిరునవ్వుకు చిత్తయిపోయేవాడు

పర్వీన్‌ బాబీ రొమాన్సుకు మెలికలు తిరిగేవాడు

వాళ్లంటే ఎప్పుడూ భయపడేవాడు కాదు

కేవలం ముస్లింలంటేనే వాడు భయపడేవాడు!

 

మనసు బాగోలేనప్పుడు మహ్మద్‌ రఫీ

పాటలు వింటూ సేదదీరేవాడు

ఆయన కంఠంలో దేవుడు కొలువై వున్నాడనేవాడు

సాబ్‌ అనే పదాన్ని తగిలించాకుండా  రఫీ పేరును

ఉచ్ఛరించేవాడే కాదు

సాహిర్‌ లుధియాన్వీ పాటలు వింటున్నప్పుడు

వాడి కళ్లు ఆనందంతో చెమర్చేవి

వాళ్లంటే ఎప్పుడూ భయపడేవాడు కాదు

వాడు కేవలం ముస్లింలంటేనే భయపడిపోయేవాడు!

 

మహ్మద్‌ ఇక్బాల్‌ రచించిన సారే జహాసే అచ్ఛాను

ప్రతి గణతంత్ర దినోత్సవం నాడు పరవశించి గానం చేసేవాడు

ఆ పాటకు బిస్మిల్లా ఖాన్‌ షెహనాయీ, జకీర్‌ హుస్సేన్‌ తబలా తోడైతేనా

వాహ్.. ఎంత అద్భుతంగా వుంటుందో అనేవాడు

వాళ్లంటే వాడికి భయం వేసేదే కాదు

కేవలం ముస్లింలంటేనే వాడు భయపడిపోయేవాడు !

 

గాలిబ్‌ గజళ్లను తన ప్రియురాలికి సదా వినిపించేవాడు

ఆమెకు రాసే ప్రతీ ప్రేమలేఖలో ఫైజ్‌ కవితల్ని,

ఉర్దూ షాహెరీలని ఉటంకించేవాడు

ఆ ప్రియురాలే ఇప్పుడు వాడి ధర్మపత్నిఅయింది  

ఉర్దూ కవులంటే అభిమానమేతప్ప వాడికి భయముండేదికాదు

వాడు కేవలం ముస్లింలంటేనే భయపడిపోయేవాడు !

 

నా దోస్త్‌ నిజంగా అబద్ధాలకోరు, వట్టి అమాయకుడు కూడా

తనకు తెలియకుండానే ఎందరో ముస్లింలను ఆరాధిస్తుంటాడు    

అయినా నాకు ముస్లింలంటే భయమని ఎప్పుడూ అంటుంటాడు!

 

వాడుండేది దిల్ ఖుష్ గా ముస్లింలున్న దేశంలోనే

మరి ఒంటరిగా ఏ ముంస్లిం మొహల్లాలో తిరిగేందుకు

వాడికంత భయం వేసేదో నాకు అర్ధమయ్యేదికాదు

బహుశా వాడికి దేవుడు సృష్టించిన

ముస్లింలంటే ఏ భయమూ లేదు

కానీ,

మత రాజకీయాలూ , పత్రికలూ , ఎన్నికలూ సృష్టించిన

అభూత ముస్లింలంటేనే వాడిలో అంత భయం ఏర్పడింది  

నిజానికి,

అసలైన ముస్లింలు ఈద్‌ నాటి షీర్‌ ఖుర్మాకంటే

ఎంతో తీయనైనవాళ్లు !

...    ...     ...    ...

హిందీ మూలం : నిఖిల్ సచాన్

స్వేచ్చానువాదం : ప్రభాకర్ మందార

..................................................................................

वो बस मुसलमानों से डरता था

……………………………….

-        निखिल सचान

 

मेरा इक दोस्त अक्सर कहता था, कि ये
कौमी एकता की बातें
बस कहने में अच्छी लगती हैं.
कहता था, कि तुम कभी
मुसलमानों के मोहल्ले में
अकेले गए हो ?
कभी जाकर देखो, डर लगता है।

 

वो मुसलमानों से बहुत डरता था
हालांकि उसे शाहरुख़ खान बहुत पसंद था
उसके गालों में घुलता डिम्पल
और उसकी दीवाली की रिलीज़ हुई फ़िल्में भी
दिलीप कुमार यूसुफ़ है, वो नहीं जानता था
उसकी फिल्में भी वो शिद्दत से देखता था
वो उनसे नहीं डरता था
बस मुसलमानों से डरता था

 


वो इंतज़ार करता था आमिर की क्रिसमस रिलीज़ का
और सलमान की ईदी का
गर जो ब्लैक में भी टिकट मिले
तो सीटियां मार कर देख आता था
वो उनसे नहीं डरता था
बस मुसलमानों से डरता था

 

वो मेरे साथ इंजीनियर बना
विज्ञान में उसकी दिलचस्पी इतनी कि
कहता था कि अब्दुल कलाम की तरह
मैं एक वैज्ञानिक बनना चाहता हूं
और देश का मान बढ़ाना चाहता हूं
वो उनसे नहीं डरता था
बस मुसलमानों से डरता था

 

वो क्रिकेट का भी बड़ा शौक़ीन था
ख़ासकर मंसूर अली खान के नवाबी छक्कों का
मोहोम्मद अज़हरुद्दीन की कलाई का
ज़हीर खान और इरफ़ान पठान की लहराती हुए गेंदों का
कहता था कि ये सारे जादूगर हैं
ये खेल जाएं तो हम हारें कभी न पाकिस्तान से
वो उनसे नहीं डरता था
बस मुसलमानों से डरता था

 

वो नरगिस और मधुबाला के हुस्न का मुरीद था
उन्हें वो ब्लैक एंड व्हाईट में देखना चाहता था
वो मुरीद था वहीदा रहमान की मुस्कान का
और परवीन बाबी की आशनाई का
वो उनसे नहीं डरता था
बस मुसलमानों से डरता था

 

वो जब भी दुखी होता था तो मुहम्मद रफ़ी के गाने सुनता था
कहत था कि ख़ुदा बसता है रफ़ी साहब के गले में
वो रफ़ी का नाम कान पर हाथ लगाकर ही लेता था
और नाम के आगे हमेशा लगाता था साहब
अगर वो साहिर के लिखे गाने गा दें
तो ख़ुशी से रो लेने का मन करता था उसका
वो उनसे नहीं डरता था
बस मुसलमानों से डरता था

 

वो हर छब्बीस जनवरी को अल्लामा इकबाल का
सारे जहां से अच्छा गाता था
कहता था कि अगर
गीत पर बिस्मिल्ला खान की शहनाई हो
और ज़ाकिर हुसैन का तबला
तो क्या ही कहने!
वो उनसे नहीं डरता था
बस मुसलमानों से डरता था

 

उसे जब इश्क़ हुआ तो लड़की से
ग़ालिब की ग़ज़ल कहता
फैज़ के चंद शेर भेजता
उन्ही उधार के उर्दू शेरों पर पर मिटी उसकी महबूबा
जो आज उसकी पत्नी है
वो इन सब शायरों से नहीं डरता था
बस मुसलमानों से डरता था

बड़ा झूठा था मेरा दोस्त
बड़ा भोला भी
वो अनजाने ही हर मुसलमान से
करता था इतना प्यार

 

  

फिर भी न जाने क्यों कहता था, कि वो
मुसलमानों से डरता था


वो मुसलमानों के देश में रहता था
ख़ुशी ख़ुशी, मोहोब्बत से
और मुसलमानों के न जाने कौन से मोहल्ले में
अकेले जाने से डरता था

दरअसल
वो भगवान के बनाए मुसलमानों से नहीं डरता था
शायद वो डरता था, तो
सियासत, अख़बार और चुनाव के बनाए
उन काल्पनिक मुसलमानों से
जो कल्पना में तो बड़े डरावने थे
लेकिन असलियत में ईद की सेंवईयों से जादा मीठे थे


- निखिल सचान


No comments:

Post a Comment