Wednesday, December 20, 2017

'కాల'కూట విషం




కవీ

నువ్వు బతికున్నంతకాలం

ఏలినవారికి బద్ధ శత్రువ్వి

నీపై పన్ని నిర్బంధాలు, ఎన్ని ఆంక్షలు !

నువ్వు చనిపోగానే వారికి

ఆప్తమిత్రుడివి, ఆదర్శప్రాయుడివి !!

నీ కవిత్వాన్ని పారాయణం చేస్తారు

నీ పటానికి దండలేసి దండాలుపెడ్తారు

మనువు సైతం వచ్చి అంబేడ్కర్‌ విగహ్రానికి

పాలాభిషేకం చేసివెళ్లినట్టు !!

                                  - ప్రభాకర్‌ మందార




No comments:

Post a Comment