Sunday, January 20, 2013

" నువ్వు జై తెలంగాణా అంటే - నేను సై తెలంగాణా అంటాను" - డాక్టర్ సి. నారాయణ రెడ్డి ...

ఇవాళ (20జనవరి 2013) ఏవీ కాలేజ్, హైదరాబాద్ లో జరిగిన తెలంగాణా రచయితల వేదిక ' సాహిత్య యుద్ధభేరి '  సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న డాక్టర్ సి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ  
స్వయంగా నిలదోక్కుకోగలిగే వనరులు కలిగివున్న చిన్న రాష్ట్రాలు బాగా అభివృద్ది చెందుతాయని, ఈ దృష్ట్యానే భాషా ప్రయుక్త రాష్ట్రాల వాదనతో నిమిత్తం లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం మూడు హిందీ మాట్లాడే రాష్ట్రాలను విభజించి చత్తీస్స్ ఘర్, జార్ఖండ్, ఉత్తరాంచల్ అనే మూడు కొత్త రాష్టాలను ఏర్పాటు చేసిందని అన్నారు.

 హిందీ మాట్లాడే వారికి ఏడు రాష్ట్రాలు వున్నప్పుడు తెలుగు వారికి రెండు రాష్ట్రాలు వుంటే తప్పేమీ లేదని చెప్పారు.
తెలంగాణా రచయితలను ఉత్తేజ పరుస్తూ " నువ్వు  జై తెలంగాణా అంటే - నేను సై  తెలంగాణా అంటాను" అని హర్షద్వానాల మధ్య  ప్రకటించారు.

9 comments:

  1. i was wondering how come the same C.Narayana Reddy garu wrote telugu jaati manadi song ? what i feel is he has to come up in cine field at that time so to get the support of then super star N.T.R he wrote that song . So no need to give any value or weightage to people like C.Narayana Reddy.

    ReplyDelete
    Replies
    1. సినిమాకు పాటలు రాసినప్పుడు సొంత అభిప్రాయాలు ముఖ్యం కాదు. దర్శకనిర్మాతలు ఎ వాదం వినిపించమంటే అదే రాయాల్సి ఉంటుంది. కూటి కోసం కోటి తిప్పలు అని ఊరికే అన్నారా.

      Delete
  2. అవునండి ఎంత ఘోరం రాముడిగా నటించిన రామ రావు రావణుడిగా నటించాడు. రాముడికి పాడిన ఘంటసాల రావణుడికి పాడాడు

    ReplyDelete
  3. అంతేలేండి, గాలి ఎటు వీస్తే అటు
    అది డబ్బులు కోసం
    ఇది దెబ్బలు (తప్పించుకోవడం) కోసం

    కూటి కోసం కోటి తిప్పలు అని ఊరికే అన్నారా.

    ReplyDelete
  4. మహాకవిని అవమానిస్తుంటే మౌనంగా ఉండలేక పోతున్నాను.
    1969లో రాష్ట్రం ఏర్పడి పట్టుమని పన్నెండు పదమూడేళ్ళయినా కాలేదు. అప్పుడే సమస్యలకు పరిష్కారం కేవలం విభజనే అంటే ఎలా? సమస్యలు పరిష్కరింపబడవచ్చు- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు ప్రయత్నించేందుకు అవకాశమివ్వాలి అన్న ఆశాభావంతో సమైక్యవాదాన్ని బలపరచిన తెలంగాణ సాహితీవేత్తలు ఎందరో ఉన్నారు. సినారె అందుకే ఆ గీతంలో "ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా? కంటిలో నలక తీయాలంటే కనుగ్రుడ్డు పెరికివేయాలా?" అని ప్రశ్నించారు. కాని అసలు అరమరికలు లేవు... నలకలు లేవు అని ఆయన ఆనాడూ అనలేదు. అంతే కాదు ఆ వాక్యాలకు NTR తో కూడా ఆమోద ముద్ర వేయించగలిగారు. అయితే దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ మరింత దిగజారిన రాజకీయాలు ఇంకా దోపిడీకి రాజమార్గాలు వేస్తుంటే చూస్తూ కూడా అభిప్రాయాన్ని మార్చుకోకుండా ఎలా ఉంటారు? అరమరికలు 'అగ్నిజ్వాల'లై దహిస్తుంటే, కంటిలో నలక 'క్యాన్సర్' లా పరిణమిస్తే, కళ్ళ ముందు వందలాది మంది ప్రాణత్యాగం చేస్తున్నా చూస్తూ కరుగకుండా ఉండడానికి ఆయన రాయి కాదు. కవి .. మహాకవి!
    మహాకవిపై ఏమాత్రం సంకోచం లేకుండా నోరు జారే వారు- "1973లో ముల్కి రూల్స్ న్యాయబద్ధమే!" అని భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానం 'సుప్రీం కోర్టు' తీర్పిస్తే దాన్ని గౌరవించకుండా "జై ఆంధ్రా" ఉద్యమాన్ని నడిపిన సమస్త సీమాంధ్ర ప్రజానీకం ఇప్పుడు "సమైక్యాంధ్ర" అని మాట మార్చడాన్ని ఎలా సమర్థించుకొంటారు? ఎప్పుడూ స్వార్థమేనా? సిద్ధాంతాలు లేవా? విలువలు లేకుండా ప్రవర్తిస్తున్నది ఎవరు?
    "ఒకే భాషీయులైన బీహార్,ఝార్ఖండ్; మధ్యప్రదేశ్,చత్తీస్ఘడ్; ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతీయులు వేరుపడితే ఏం కొంపలు మునిగాయి?" అన్న భావనతో తానూ ఈ నిర్ణయానికి వచ్చానని సినారె చెప్పారు. ఆ స్థాయికి ఎదిగి ఆలోచించలేని స్వార్థపరులు ఆయనపై వ్యాఖ్యానిస్తే అది వారి దిగజారుడు తనమే అవుతుంది గానీ ... ఆయన వ్యక్తిత్వానికి ఏ భంగమూ వాటిల్లదు.

    ReplyDelete
  5. ఆ పాటను సినారె సొంతానికి రాసుకున్నది కాదు .. ఒక సీన్ వివరించ తమకు ఇలాంటి పాట కావాలని కోరినప్పుడు అల రాశాను సినిమా రచయితగా అది న విధి . సినారేగా తెలంగాణా నేను కోరుకుంటున్నాను అని గత సంవత్సరం సాక్షి టివి కార్యక్రమం లో ఈ పాట గురించి అడిగినప్పుడు చెప్పారు

    ReplyDelete
  6. సినారె గారు సీన్ కొరకు వ్రాసిన పాట అది అనేట్టయితే పైన అజ్జాతలు అలా చిల్లర మాటలు మాటాడకూడదు.
    కాని ఆ పాటకు ఆ సినిమా (తల్లా? పెళ్ళామా?) కథకు సంబంధమే లేదు. ఆ పాట కోసమే NTR ఆ సినిమాలో ప్రత్యేకంగా సన్నివేశాన్ని కల్పించారు.
    1969 ఉద్యమ నేపథ్యంలో ఒక దిన పత్రికలో అచ్చయిన సినారె వచన కవితను NTR పాటగా మలచమని కోరగా ఆయన ఐదు నిమిషాల్లో మార్చి ఇచ్చారని అప్పట్లో అందరికీ తెలిసిన విషయమే!
    ఏమైనా ఒక మహాకవిని గురించి మాటాడేటప్పుడు విజ్ఞతతో మాటాడడం సంస్కారమనిపించుకొంటుంది.

    ReplyDelete
    Replies
    1. అన్నా, చిల్లర మనుషులు చిల్లరగనె మాట్లాడుతరు.

      అయినా సినారె లాంటి బహుముఖప్రజ్యాశాలిని సినిమా పాటల రచయితగా చిత్రీకరించే వాళ్లను ఏమన్నా లాభం లేదు.

      जुन्ग्लीको क्या मालूम जाफ्रोंका मज़ा!

      Delete
  7. cnr ippudu sai ante manam ubbi tabbibbu avvaalsina avasaram eldu lendi! i dont think that this has come from the bottom of his heart! ninduga velugu jaati kadaa tanadi!

    ReplyDelete