Monday, September 21, 2009

Bathukamma Songs కొన్ని బతుకమ్మ పాటలు ...


Photo: Bathukamma Festival at Chicago. Courtesy: Andhra Prabha

కొన్ని బతుకమ్మ పాటలు
బతుకమ్మ పండుగ ఎంత విశిష్టమైనదో బతుకమ్మ పాటలు అంత విలక్షణమైనవి. తెలంగాణా సంస్కృతికి ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ. ఆతరువాత స్థానం బోనాలది.
తెలంగాణ జాగృతి, ఆంధ్రజ్యోతి, టీవీ 9 కలిసి దేశవిదేశాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం ఎంతో ముదావహం. తెలంగాణా జిల్లాల్లో, దేశ రాజధానిలోనే కాక దుబాయ్‌లో, అమెరికాలోని న్యూజెర్సీ, వాషింగ్‌టన్‌, బోస్టన్‌, చికాగో, కాలిఫోర్నియా వంటి నగరాల్లో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు.

ఇదే క్రమంలో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, అనంతపురం తదితర ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తే మరింత బాగుండేది. ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలు విలీనమై 54 ఏళ్లు కావస్తున్నా బతుకమ్మ పండుగ ఇప్పటికీ ఆంధ్రప్రాంతానికి పరాయి పండుగలాగే వుండిపోయింది. బతుకమ్మ పాటలు ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి కానీ పక్కనే వున్న ఆంధ్రలో మచ్చుకు కూడా వినిపించకపోవడం విషాదం.

సరే, ఇదిలా వుంటే మొన్న మా పక్కింటి అమ్మాయి వచ్చి ''బతుకమ్మ పాటలు ఏవైనా నెట్‌లోంచి ప్రింట్‌అవుట్‌ తీసివ్వరా అంకుల్‌ పాడుకుంటాం'' అని అడిగింది. దాంతో పది ఇరవై పాటలతో చిన్న బుక్‌లెట్‌ తయారుచేసిద్దాం అని ఎంతో ఉత్సాహంగా వెతికాను. కానీ ఆశ్చర్యంగా నాకు కనీసం ఒక్క బతుకమ్మ పాట సాహిత్యం కూడా దొరకలేదు. తెలంగాణా జాగృతి వారి వెబ్‌సైట్‌కి వెళ్తే ... పాటల సంగతి అటుంచి అక్కడ అసలు తెలుగు అక్షరాలే కనిపించలేదు. మార్కెట్‌లో కూడా నాకు బతుకమ్మ పాటల పుస్తకాలు లభించలేదు. ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో కూడా బతుకమ్మ పాటలు లభించకపోవడం బాధాకరంగా అనిపించింది. బతుకమ్మ వెబ్‌సైట్‌లో, తెలంగాణా డెవలప్‌మెంట్‌ ఫోరం వెబ్‌సైట్‌లో, డిస్కవర్‌ తెలంగాణా వెబ్‌సైట్‌లో కొన్ని ఎంపి3 ఆడియో పాటలు మాత్రం కనిపించాయి. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని ఓపిగ్గా వింటూ ఓ నాలుగు పాటలు టైప్‌చేసి ప్రింట్‌అవుట్‌ తీసి ఇచ్చి పరువు నిలబెట్టుకున్నాను. వాటినే దిగువన కూడా పొందు పరుస్తున్నాను. వీటిని పై వెబ్‌ సైట్‌లలో వినవచ్చు.

నేను సరిగ్గా వెతకలేదేమో అని అనుమానంగా వుంది. దయచేసి ఎవరైనా బతుకమ్మ పాటల జాడ తెలిస్తే సత్వరమే తెలుపవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.

బంగారు బతుకమ్మ...

(ప్రధాన గాయని:)
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !
(అందరూ:)
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !!
(ప్రధాన గాయని పాడుతుంటే అందరూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ''ఉయ్యాలో'' అంటుంటారు.)

ఆనాటి కాలాన ... ఉయ్యాలో!
ధర్మాంగు డను రాజు ... ఉయ్యాలో!
ఆరాజు భార్యయు ... ఉయ్యాలో!
అతి సత్యవతి యంద్రు ... ఉయ్యాలో!
నూరు నోములు నోమి ... ఉయ్యాలో!
నూరు మందిని గాంచె ... ఉయ్యాలో!
వారు శూరు లయ్యి ... ఉయ్యాలో!
వైరులచె హత మైరి ... ఉయ్యాలో!

తల్లిదండ్రు లపుడు ... ఉయ్యాలో!
తరగని శోకమున ... ఉయ్యాలో!
ధన ధాన్యములను బాసి ... ఉయ్యాలో!
దాయాదులను బాసి ... ఉయ్యాలో!
వనితతో ఆ రాజు ... ఉయ్యాలో!
వనమందు నివసించె ... ఉయ్యాలో!
కలికి లక్ష్మిని గూర్చి ... ఉయ్యాలో!
జనకోసం బొనరింప ... ఉయ్యాలో! ....
....
ఊరికి ఉత్తరాన ..

(ప్రథాన గాయని పాడుతుంటే అందరూ లయబద్ధంగా చప్పట్టు కొడుతూ ''వలలో'' అంటుంటారు)

ఊరికి ఉత్తరానా ... వలలో
ఊడాలా మర్రీ ... వలలో
ఊడల మర్రి కిందా ... వలలో
ఉత్తముడీ చవికే ... వలలో
ఉత్తముని చవికేలో ... వలలో
రత్నాల పందీరీ ... వలలో
రత్తాల పందిట్లో ... వలలో
ముత్యాలా కొలిమీ ... వలలో

గిద్దెడు ముత్యాలా ... వలలో
గిలకాలా కొలిమీ ... వలలో
అరసోల ముత్యాలా ... వలలో
అమరీనా కొలిమీ ... వలలో
సోలెడు ముత్యాలా ... వలలో
చోద్యంపూ కొలిమీ ... వలలో
తూమెడు ముత్యాలా ... వలలో
తూగేనే కొలిమీ ... వలలో
చద్దన్నమూ తీనీ ... వలలో
సాగించూ కొలిమీ ... వలలో
పాలన్నము దీనీ ... వలలో
పట్టేనే కొలిమీ ... వలలో
......

శ్రీలక్ష్మి నీ మహిమలు

1: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
2: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
1: గౌరమ్మ చిత్రమై తోచునమ్మా
భారతీ దేవివై బ్రహ్మ కిల్లాలివై
2: భారతీ దేవివై బ్రహ్మ కిల్లాలివై

1: పార్వతీ దేవివై పరమేశు రాణివై
పరగ శ్రీలక్ష్మివైయ్యూ గౌరమ్మ
భార్య వైతివి హరికినీ గౌరమ్మ

2: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ

1: ముక్కోటి దేవతలు సక్కనీ కాంతలు
ఎక్కువగ నిను గొల్చి పెక్కు నోములు నోచి
ఎక్కువా వారయ్యిరీ గౌరమ్మ
ఈలోకమున నుండియూ గౌరమ్మ

2: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ .... //శ్రీలక్ష్మి//
....

చిత్తూ చిత్తూల బొమ్మ

1: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
2: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
1: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
2: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
1: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
2: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
1: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
2: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన

రాగీ బిందె దీస్క రమణీ నీళ్లాకు బోతె ... //రాగీ//
రాములోడు ఎదురాయె నమ్మో ఈ వాడ లోన... //రాము//
ముత్యాల బిందె దీస్క ముదితా నీళ్లాకు బోతె ... //ముత్యాల//
ముద్దు కృష్ణు డెదురాయె నమ్మో ఈ వాడలోన ... //ముద్దు//
వెండీ బిందె దీస్క వెలదీ నీళ్లాకు బోతె ... //వెండి//
వెంకటేశు డెదురాయె నమ్మో ఈ వాడలోన ...//వెంకటేశు//
పగడీ బిందె దీస్క పడతీ నీళ్లాకు బోతె ...//పగడీ//
పరమేశుడెదురాయె నమ్మో ఈ వాడలోన ...//పరమేశు//

1: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
2: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
1: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
2: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
....

రామ రామా రామ ఉయ్యాలో ...

రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో!!
రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో !! //రామ రామా//

చారెడు బియ్యంలో ఉయ్యాలో! చారెడూ పప్పు పోసి ఉయ్యాలో!
చారెడు బియ్యంలో ఉయ్యాలో! చారెడూ పప్పు పోసి ఉయ్యాలో!
చారెడు పప్పుపోసి ఉయ్యాలో! వన దేవుని తల్లి ఉయ్యాలో!
చారెడు పప్పుపోసి ఉయ్యాలో! వన దేవుని తల్లి ఉయ్యాలో!
అక్కెమ్మ కేమొ ఉయ్యాలో! అన్నీ పెట్టింది ఉయ్యాలో! .....//అక్కెమ్మ కేమొ//
అప్పుడూ అక్కెమ్మ ఉయ్యాలో! తిన్నట్టు తిని ఉయ్యాలో! ....//అప్పుడూ//
తిన్నట్టు తినీ ఉయ్యాలో! పారేసినాది ఉయ్యాలో! //2//

పెద్దోడు రామన్న ఉయ్యాలో! బుద్ధిమంతుడాని ఉయ్యాలో! 2
ఏడు రోజుల్ల ఉయ్యాలో! చెల్లెరో అక్కెమ్మ ఉయ్యాలో! 2
అక్కెమ్మా కురులు ఉయ్యాలో! దురవాసినాయి ఉయ్యాలో! 2
అందరానికాడ ఉయ్యాలో! ఆకు అందుకోని ఉయ్యాలో! 2
ముట్టరాని కాడ ఉయ్యాలో! ముల్లు ముట్టుకోని ఉయ్యాలో! 2
పెద్ద నేలు రాత ఉయ్యాలో! పేరువాడా రాసి ఉయ్యాలో! 2
సిటికెనేలూ రాత ఉయ్యాలో! సిక్కువాడా రాసి ఉయ్యాలో! 2

రాకి గొంట బొయ్యి ఉయ్యాలో! రామన్న కిచ్చె ఉయ్యాలో! 2
కూసుండి రామన్న ఉయ్యాలో! రాకి గట్టుకోని ఉయ్యాలో! 2
రాయనాసి నచ్చి ఉయ్యాలో! పోయెనాసి నచ్చి ఉయ్యాలో! 2
బుడ్డెడూ నూనె ఉయ్యాలో! తీసుకా పోయింది ఉయ్యాలో! 2
చారెడంత నూనె ఉయ్యాలో! చదిరి తలకంటి ఉయ్యాలో! 2
కడివెడంత నూనె ఉయ్యాలో! కొట్టి తలకంటి ఉయ్యాలో! 2
గిద్దెడంత నూనె ఉయ్యాలో! గిద్ది తలకంటి ఉయ్యాలో! 2
ఆరసోడూ నూనె ఉయ్యాలో! అందంగ తలకంటి ఉయ్యాలో! 2
సోలెడూ నూనే ఉయ్యాలో! సోకిచ్చే తల ఉయ్యాలో! 2

వెండి దువ్వెనా ఉయ్యాలో! వెయ్యి చిక్కూతీసె ఉయ్యాలో! 2
తల్లి రావే తల్లి ఉయ్యాలో! తల్లిరో పెద్దమ్మ ఉయ్యాలో! 2
నాకునూ కష్టాలు ఉయ్యాలో! ఎందమ్మా తల్లి ఉయ్యాలో! 2
ఏమి కష్టాలనూ ఉయ్యాలో! తలపెట్టినావమ్మ ఉయ్యాలో! 2
పిడికెడంత మిరెము ఉయ్యాలో! కండ్లల్ల పోసె ఉయ్యాలో! 2
మంట అనీ అంటె ఉయ్యాలో! సంతోషపడుదును ఉయ్యాలో! 2
అట్లయిన మంచిదె ఉయ్యాలో! సప్పుడే చెయ్యదీ ఉయ్యాలో! 2

పొగాకు కండెమూ ఉయ్యాలో! తీసినాడు దేవుడూ ఉయ్యాలో! 2
కాళ్లకిందా యేసి ఉయ్యాలో! నలిపినాడుదేవుడు ఉయ్యాలో! 2
నశ్యమూ జేసిండు ఉయ్యాలో! ముక్కులాపెడ్టిండు ఉయ్యాలో! 2
ఒక్క తుమ్మన్న ఉయ్యాలో! తుమ్మినా గానీ ఉయ్యాలో! 2
నాయినీ భ్రమలూ ఉయ్యాలో! తీరునేమో గానీ ఉయ్యాలో! 2

రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో!!
రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో !!

ఏడున్నొక్క మేడలూ ఉయ్యాలో! కాలికూలాబట్టె ఉయ్యాలో! 2
ఏడు దొడ్ల బాసి ఉయ్యాలో! కాలికూలబట్టె ఉయ్యాలో! 2
బుచ్చపోళ్ల ఏసెమూ ఉయ్యాలో! సేసినాడు దేవుడు ఉయ్యాలో! 2
అక్కెమ్మ తల్లిగారు ఉయ్యాలో! ఏడువా బట్టిరీ ఉయ్యాలో! 2
ఏడువా బట్టిరీ ఉయ్యాలో! తూడువా బట్టిరీ ఉయ్యాలో! 2
సెల్లె నొక్క సేత ఉయ్యాలో! బల్లె మొక్క సేత ఉయ్యాలో! 2
పట్టుకోని అన్నలూ ఉయ్యాలో! ఏడువా బట్టిరీ ఉయ్యాలో! 2

ఏడుగురు అన్నలూ ఉయ్యాలో! చెల్లెనూ తీస్కోని ఉయ్యాలో! 2
చెల్లెనూ తీస్కోని ఉయ్యాలో! జంగలూ బాటనూ ఉయ్యాలో! 2
జంగలూ బాటనూ ఉయ్యాలో! అన్నలే బట్టిరీ ఉయ్యాలో! 2
ఉడుకుడుకు దుబ్బల్ల ఉయ్యాలో! నడుస్త ఉన్నరూ ఉయ్యాలో! 2
నడిచేటి కాళ్లకూ ఉయ్యాలో! పొక్కులొచ్చినాయి ఉయ్యాలో! 2

ఎండకాలం రోజు ఉయ్యాలో! దూపలూ కాబట్టె ఉయ్యాలో! 2
దూపైతాందాని ఉయ్యాలో! అంటలేరు మరి ఉయ్యాలో! 2
ఆకలైతాందనీ ఉయ్యాలో! అంటలేరు మరి ఉయ్యాలో! 2
వన దేవుని తల్లి ఉయ్యాలో! వనపున్నూ రాలు ఉయ్యాలో! 2
అప్పుడూ వనదేవుడు ఉయ్యాలో! ఏడుగురన్నలకూ ఉయ్యాలో! 2
ఏడుగురన్నలకూ ఉయ్యాలో! ఏడుపండ్లు ఇచ్చి ఉయ్యాలో! 2
అక్కెమ్మ కేమొ ఉయ్యాలో! వెన్న పండు యిచ్చె ఉయ్యాలో! 2
వెన్నె ముద్దపండు ఉయ్యాలో! పదాడబట్టింది ఉయ్యాలో! 2

ఏం పిల్లా నమ్మ ఉయ్యాలో! ఎందుకింతా గర్వం ఉయ్యాలో! 2
గొల్లాయినయి ఉయ్యాలో! పాలు తెచ్చినాడు ఉయ్యాలో! 2
ఏడుగురన్నలూ ఉయ్యాలో! పాలు తెచ్చినారు ఉయ్యాలో! 2
గిలాసెడూ పెరుగు ఉయ్యాలో! అక్కెమ్మ కిచ్చిండ్లు ఉయ్యాలో! 2
వనదేవుడేమొ ఉయ్యాలో! గొల్ల వేషంతోని ఉయ్యాలో! 2
గొల్ల వేషంతోని ఉయ్యాలో! వచ్చినాడనుకొని ఉయ్యాలో! 2
వచ్చినాడనుకొని ఉయ్యాలో! అక్కెమ్మగూడా ఉయ్యాలో! 2
అక్కెమ్మ గూడా ఉయ్యాలో! అయినా పెరుగునూ ఉయ్యాలో!2
అయినా పెరుగునూ ఉయ్యాలో! పారా బోసింది ఉయ్యాలో! 2

చాలోడూ అయి ఉయ్యాలో! చీరెలూ తెచ్చిండు ఉయ్యాలో! 2
ఏడుగురు అన్నలకూ ఉయ్యాలో! ఏడు దోతులిచ్చి ఉయ్యాలో! 2
సన్నయి వొయ్యెలు ఉయ్యాలో! అక్కెమ్మ కిచ్చిండు ఉయ్యాలో! 2
నాకు ఎందుకాని ఉయ్యాలో! పారేసీనాది ఉయ్యాలో! 2
ఆయినీ సీరెలూ ఉయ్యాలో! తీసుకుంటేనేమొ ఉయ్యాలో! 2
తీసుకుంటెనేమొ ఉయ్యాలో! వనదేవునికేమొ ఉయ్యాలో! 2
వనదేవుని కేమొ ఉయ్యాలో! బ్రమలూ తీరునూ ఉయ్యాలో! 2

అట్లనన్న బ్రమ ఉయ్యాలో! తీరుననుకున్నడు ఉయ్యాలో! 2
అప్పుడూ అక్కమ్మ ఉయ్యాలో! ఆయినీ సీరెలను ఉయ్యాలో! 2
నాకు ఎందుకానీ ఉయ్యాలో! పారేసి నాది ఉయ్యాలో! 2
అట్లగాకపోతె ఉయ్యాలో! మరిఎట్ల జేతును ఉయ్యాలో! 2
తూర్పు దిక్కున ఉయ్యాలో! కొసినా కొరకలూ ఉయ్యాలో! 2
కోసినా కొరకలూ ఉయ్యాలో! పండుతాందీ పిల్ల ఉయ్యాలో! 2
ఆ పంట కోసమూ ఉయ్యాలో! మీ అన్నదమ్ములూ ఉయ్యాలో! 2
మీ అన్నదమ్ములూ ఉయ్యాలో! పోతారు పిల్ల ఉయ్యాలో! 2

రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో!!
రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో !!

ఊల్లెకూ మీరు ఉయ్యాలో! చేరవచ్చే నేమొ ఉయ్యాలో! 2
సుంకరోన్నయి ఉయ్యాలో! నేను వస్తా పిల్ల ఉయ్యాలో! 2
మీ ఏడుగురన్నలూ ఉయ్యాలో! మనిషి కొక్కా దెబ్బ ఉయ్యాలో! 2

(వీటిలో కొన్ని అసంపూర్తిగా వున్నట్టున్నాయి. మరికొన్నింటిని తరువాత వీలునుబట్టి విని టైప్‌ చేసి పొందుపరుస్తాను)
......

10 comments:


 1. Chikkudu vakitlo uyyalo ..... Siri saddulu katti uyyalo .....
  Podamu chittoori uyyalo ..... chuttalo chooda uyyalo .....
  Adevarunnare uyyalo ..... ambojja banthi uyyalo .....
  Ammaku thamullu uyyalo ..... manake mamalu uyyalo .....

  bava bamardulu kalisi uyyalo ..... baavi thodiche uyyalo .....
  Bavilo unnadi uyyalo ..... bangaru binde uyyalo .....
  Bindela unnadi uyyalo ..... patte mancham uyyalo .....
  Patte mancham meeda uyyalo ..... thonduri parupu uyyalo .....
  Thondori parupu meeda uyyalo ..... indruni metha uyyalo .....

  Indruni metha meeda uyyalo ..... shivudochi orige uyyalo .....
  Shivudi kalla kaada uyyalo ..... gauramma gangamma uyyalo .....
  gauramma gangamma uyyalo ..... gavvaladanga uyyalo .....
  Akkada merise uyyalo ..... gundam la merise uyyalo .....

  Gundam la neellanni uyyalo ..... kumkumalaaye uyyalo .....
  Kumkuma jodinchi uyyalo ..... kuppale voyinchi uyyalo .....
  Ralina kumkuma uyyalo ..... rachale voyinchi uyyalo .....
  Migilina kumkuma uyyalo ..... middele kattinche uyyalo .....

  Muddala eerannaku uyyalo ..... yememi sommulu uyyalo .....
  Kakarakaya koyanga uyyalo ..... kalla kadiyalu uyyalo .....
  Munagakaya koyanga uyyalo ..... Mukkuku mukkera uyyalo .....
  Pesarakaya koyanga uyyalo ..... peyininda sommulu uyyalo .....

  ReplyDelete
 2. ధన్యవాదాలు అనానిమస్ గారూ,
  ఎప్పుడూ వినని పాట.
  బావుంది.
  ఆంగ్ల అక్షరాలలో తెలుగు చదవడం ఇబ్బందిగా వుంటుంది కదా
  అందుకని మళ్ళీ అదే పాట తెలుగు అక్షరాలలో ఇక్కడ పొందుపరుస్తున్నాను :
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  చిక్కుడు వాకిట్లొ ఉయ్యాలో ..... సిరి సద్దులు కట్టి ఉయ్యాలో .....
  పోదాము చిత్తూరు ఉయ్యాలో ..... చుట్టాల చూడ ఉయ్యాలో .....
  ఆడెవరున్నారె ఉయ్యాలో ..... అమ్బొజ్జ బంతి ఉయ్యాలో .....
  అమ్మకు తముల్లు ఉయ్యాలో ..... మనకే మామలు ఉయ్యాలో .....

  బావ బామ్మర్దులు కలిసి ఉయ్యాలో ..... బావి తోడిచ్చే ఉయ్యాలో .....
  బావిలో ఉన్నదీ ఉయ్యాలో ..... బంగారు బిందె ఉయ్యాలో .....
  బిందెల ఉన్నదీ ఉయ్యాలో ..... పట్టే మంచం ఉయ్యాలో .....
  పట్టె మంచం మీద ఉయ్యాలో ..... తొండురి పరుపు ఉయ్యాలో .....
  తొండురి పరుపు మీద ఉయ్యాలో ..... ఇంద్రుని మెత్త ఉయ్యాలో .....

  ఇంద్రుని మెత్త మీద ఉయ్యాలో ..... శివుడొచ్చి ఒరిగే ఉయ్యాలో .....
  శివుడి కాళ్ళ కాడ ఉయ్యాలో ..... గౌరమ్మ గంగమ్మ ఉయ్యాలో .....
  గౌరమ్మ గంగమ్మ ఉయ్యాలో..... గవ్వలాడంగ ఉయ్యాలో .....
  అక్కడ మెరిసే ఉయ్యాలో ..... గుండం ల మెరిసే ఉయ్యాలో .....

  గుండం ల నీళ్ళన్ని ఉయ్యాలో ..... కుంకుమలాయే ఉయ్యాలో .....
  కుంకుమ జోడించి ఉయ్యాలో ..... కుప్పలే వోయించి ఉయ్యాలో .....
  రాలిన కుంకుమ ఉయ్యాలో ..... రాశులె వోయించి ఉయ్యాలో .....
  మిగిలిన కుంకుమ ఉయ్యాలో ..... మిద్దేలే కట్టించే ఉయ్యాలో .....

  ముద్దలా ఈరన్నకు ఉయ్యాలో ..... ఏమేమి సొమ్ములు ఉయ్యాలో .....
  కాకరకాయ కోయంగా ఉయ్యాలో ..... కాళ్ళ కడియాలు ఉయ్యాలో .....
  మునగకాయ కోయంగా ఉయ్యాలో ..... ముక్కుకు ముక్కెర ఉయ్యాలో .....
  పెసరకాయ కోయంగా ఉయ్యాలో ..... పెయినిండా సొమ్ములు ఉయ్యాలో .....

  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  లేఖిని లేదా గూగుల్ ట్రాన్స్ లిటరేషన్ ఉపయోగించి కామెంట్లు
  కాపీ పేస్ట్ ద్వారా తెలుగు అక్షరాలలోనే పొండుపరుస్తే అందరికీ సౌకర్యంగా వుంటుంది.

  http://www.google.com/transliterate/Telugu

  http://lekhini.org/


  .

  ReplyDelete
 3. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ  ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
  ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
  తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ
  తంగేడు కాయొప్పునే గౌరమ్మ
  తంగేడు చెట్టు కింద ఆట
  సిల్కాలార పాట సిల్కాలారా
  కల్కి సిల్కాలారా కందుమ్మ
  గుడ్డలు రానువోను అడుగులు
  తీరుద్ద ఆశలు తారు గోరంటలు
  గణమైన పొన్న పువ్వే గౌరమ్మ
  గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
  ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
  ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
  గుమ్మడి పువ్వొప్పునే గౌరమ్మ
  గుమ్మడి కాయొప్పునే గౌరమ్మ
  గుమ్మడి చెట్టు కింద ఆట
  సిల్కాలార పాట సిల్కాలారా
  కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు
  రానువోను అడుగులు
  తీరుద్ద ఆశలు తారు గోరంటలు
  గణమైన పొన్న పువ్వే గౌరమ్మ
  గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
  ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
  ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
  రుద్రాక్ష పువ్వొప్పునే గౌరమ్మ
  రుద్రాక్ష కాయొప్పునే గౌరమ్మ
  రుద్రాక్ష చెట్టు కింద
  ఆట సిల్కాలార పాట సిల్కాలారా
  కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు
  రానువోను అడుగులు
  తీరుద్ద ఆశలు తారు గోరంటలు
  గణమైన పొన్న పువ్వే గౌరమ్మ
  గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
  ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
  ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
  కాకర పువ్వొప్పునే గౌరమ్మ
  కాకర కాయొప్పునే గౌరమ్మ
  కాకర చెట్టు కింద ఆట
  సిల్కాలార పాట సిల్కాలారా
  కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు
  రానువోను అడుగులు
  తీరుద్ద ఆశలు తారు గోరంటలు
  గణమైన పొన్న పువ్వే గౌరమ్మ
  గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
  ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
  ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
  చామంతి పువ్వొప్పునే గౌరమ్మ
  చామంతి కాయొప్పునే గౌరమ్మ..
  చామంతి చెట్టు కింద ఆట
  సిల్కాలార పాట సిల్కాలారా
  కల్కి సిల్కాలారా కందుమ్మ
  గుడ్డలు రానువోను అడుగులు
  తీరుద్ద ఆశలు తారు గోరంటలు
  గణమైన పొన్న పువ్వే గౌరమ్మ
  గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ
  ఆ పూలు తెప్పించి పూజించి
  గంధముల కడిగించి కుంకుమల జాడించి
  నీ నోము నీకిత్తుమే గౌరమ్మ
  మా నోము మాకియ్యవే గౌరమ్మ
  నీ నోము నీకిత్తుమే గౌరమ్మ
  మా నోము మాకియ్యవే గౌరమ్మ
  నీ నోము నీకిత్తుమే గౌరమ్మ
  మా నోము మాకియ్యవే గౌరమ్మ

  ReplyDelete
 4. ఇసుకల పుట్టె గౌరమ్మ

  ఇసుకల పుట్టె గౌరమ్మ ఇసుకలో పెరిగే గౌరమ్మ
  ఇసుకలో వసంతమాడంగా పోయిరా గౌరమ్మ
  తీగె తిరుపతి మావిళ్లు పొన్నగంటితళ్లు పోగలవంటి వనములు
  వనముల చిలుకలు గలగల పలికితె వనమంతా కదిలె గౌరి మేడంతా కదిలె
  పసుపులో పుట్టె గౌరమ్మ పసుపులో పెరిగే గౌరమ్మ
  పసుపులో వసంతమాడంగా పోయిరా గౌరమ్మ
  తీగె తిరుపతి మావిళ్లు పొన్నగంటితళ్లు పోగలవంటి వనములు
  వనముల చిలుకలు గలగల పలికితె వనమంతా కదిలె గౌరి మేడంతా కదిలె
  కుంకుమలో పుట్టె గౌరమ్మ కుంకుమలో పెరిగే గౌరమ్మ
  కుంకుమలో వసంతమాడంగా పోయిరా గౌరమ్మ
  తీగె తిరుపతి మావిళ్లు పొన్నగంటితళ్లు పోగలవంటి వనములు
  వనముల చిలుకలు గలగల పలికితె వనమంతా కదిలె గౌరి మేడంతా కదిలె
  గంధంలో పుట్టె గౌరమ్మ గంధంలో పెరిగే గౌరమ్మ
  గంధంలో వసంతమాడంగా పోయిరా గౌరమ్మ
  తీగె తిరుపతి మావిళ్లు పొన్నగంటితళ్లు పోగలవంటి వనములు
  వనముల చిలుకలు గలగల పలికితె వనమంతా కదిలె గౌరి మేడంతా కదిలె.

  ReplyDelete
 5. ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ

  ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
  దూరాన దోర పండే గౌరమ్మ ॥2॥
  దూరాన దొరలైరి గౌరమ్మ
  పట్నాన పంతులైరి గౌరమ్మ ॥2॥
  అటు చూసి మాయన్నలు గౌరమ్మ
  ఏడు మేడ లెక్కిరి గౌరమ్మ ॥2॥
  ఏడు మేడ లెక్కి ఎత్తులు దాటంగా
  ఎదుర్కోలియంగా ॥2॥
  దొంగలెవరు దోసిరి గౌరమ్మ
  బంగారు గుండ్ల వనమే గౌరమ్మ ॥2॥
  ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
  దూరాన దోర పండే గౌరమ్మ ॥2॥
  శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
  చిత్రమై తోచునమ్మ గౌరమ్మ ॥2॥
  భారతీ దేవివై బ్రహ్మకిల్లాలివై ॥2॥
  పార్వతీదేవివై పరమేశురాణివై ॥2॥
  పరగ శ్రీలక్ష్మివై గౌరమ్మ
  భార్యవైతివి హరికినీ గౌరమ్మ ॥2॥
  ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
  దూరాన దోర పండే గౌరమ్మ ॥2॥
  ఎన్నెన్నో రూపాలు ఏడేడు లోకాలు ॥2॥
  ఉన్న జనులకు కోరికలు సమకూర్చగా ॥2॥
  కన్న తల్లివైతివి గౌరమ్మ
  కామధేనువు అయితివి గౌరమ్మ ॥2॥
  ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
  దూరాన దోర పండే గౌరమ్మ ॥2॥
  ముక్కోటి దేవతలు సక్కని కాంతలు ॥2॥
  ఎక్కువ పూలు గూర్చి పెక్కు నోములు నోమి ॥2॥
  ఎక్కువ వారిరై గౌరమ్మ
  ఈ లోకముల నుండియు గౌరమ్మ ॥2॥
  ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
  దూరాన దోర పండే గౌరమ్మ ॥2॥
  తమరి కంటే ఎక్కువ దైవము ఎవ్వరూ లేరు ॥2॥
  తమకింపు పుట్టింపు సకల లోకంబుల ॥2॥
  క్రమముచే పాలించగా గౌరమ్మ
  కన్నుల పండుగాయే గౌరమ్మ ॥2॥
  ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
  దూరాన దోర పండే గౌరమ్మ. ॥2॥

  ReplyDelete
 6. ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ

  ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
  దూరాన దోర పండే గౌరమ్మ ॥2॥
  దూరాన దొరలైరి గౌరమ్మ
  పట్నాన పంతులైరి గౌరమ్మ ॥2॥
  అటు చూసి మాయన్నలు గౌరమ్మ
  ఏడు మేడ లెక్కిరి గౌరమ్మ ॥2॥
  ఏడు మేడ లెక్కి ఎత్తులు దాటంగా
  ఎదుర్కోలియంగా ॥2॥
  దొంగలెవరు దోసిరి గౌరమ్మ
  బంగారు గుండ్ల వనమే గౌరమ్మ ॥2॥
  ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
  దూరాన దోర పండే గౌరమ్మ ॥2॥
  శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మ
  చిత్రమై తోచునమ్మ గౌరమ్మ ॥2॥
  భారతీ దేవివై బ్రహ్మకిల్లాలివై ॥2॥
  పార్వతీదేవివై పరమేశురాణివై ॥2॥
  పరగ శ్రీలక్ష్మివై గౌరమ్మ
  భార్యవైతివి హరికినీ గౌరమ్మ ॥2॥
  ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
  దూరాన దోర పండే గౌరమ్మ ॥2॥
  ఎన్నెన్నో రూపాలు ఏడేడు లోకాలు ॥2॥
  ఉన్న జనులకు కోరికలు సమకూర్చగా ॥2॥
  కన్న తల్లివైతివి గౌరమ్మ
  కామధేనువు అయితివి గౌరమ్మ ॥2॥
  ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
  దూరాన దోర పండే గౌరమ్మ ॥2॥
  ముక్కోటి దేవతలు సక్కని కాంతలు ॥2॥
  ఎక్కువ పూలు గూర్చి పెక్కు నోములు నోమి ॥2॥
  ఎక్కువ వారిరై గౌరమ్మ
  ఈ లోకముల నుండియు గౌరమ్మ ॥2॥
  ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
  దూరాన దోర పండే గౌరమ్మ ॥2॥
  తమరి కంటే ఎక్కువ దైవము ఎవ్వరూ లేరు ॥2॥
  తమకింపు పుట్టింపు సకల లోకంబుల ॥2॥
  క్రమముచే పాలించగా గౌరమ్మ
  కన్నుల పండుగాయే గౌరమ్మ ॥2॥
  ఒక్కేసి వెలగ పండే గౌరమ్మ
  దూరాన దోర పండే గౌరమ్మ. ॥2॥

  ReplyDelete
 7. గోపాల రావు గారూ ఏడేళ్ళ తర్వాత ఈ పోస్ట్ కు మరికొన్నిఅందమైన బతుకమ్మ పాటలతో మెరుగులు దిద్దినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు బతుకమ్మ శుభాకాంక్షలు

  ReplyDelete
 8. కలవారి కోడలు ఉయ్యాలో
  కనక మహాలక్ష్మి ఉయ్యాలో
  కడుగుతున్నది పప్పు ఉయ్యాలో
  కడవళ్లోన పోసి ఉయ్యాలో
  అప్పుడే వచ్చేను ఉయ్యాలో
  ఆమె పెద్దన్న ఉయ్యాలో
  కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో
  కన్నీళ్లు దీసి ఉయ్యాలో
  ఎందుకు సెల్లెలా ఉయ్యాలో
  ఏమి కష్టాలమ్మా ఉయ్యాలో
  తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో
  ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో
  ఎత్తుకో బిడ్డాను ఉయ్యాలో
  వెళ్లి వద్దాము ఉయ్యాలో
  చేరిమి వారితో ఉయ్యాలో
  చెప్పిరా పోవమ్మా ఉయ్యాలో
  పట్టె మంచం మీద ఉయ్యాలో
  పవళించినామా ఉయ్యాలో
  మాయన్నల వచ్చిరి ఉయ్యాలో
  మమ్ము పంపుతారా ఉయ్యాలో
  నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
  మీ అత్తను అడుగు ఉయ్యాలో
  అరుగుల్ల కూసున్న ఉయ్యాలో
  ఓ అత్తగారు ఉయ్యాలో
  మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
  మమ్ము పంపుతారా ఉయ్యాలో
  నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
  మీ బావను అడుగు ఉయ్యాలో
  భారతం చదివేటి ఉయ్యాలో
  బావ పెద్ద బావ ఉయ్యాలో
  మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
  మమ్ము పంపుతారా ఉయ్యాలో
  నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
  మీ అక్కను అడుగు ఉయ్యాలో
  వంటశాలలో ఉన్న ఉయ్యాలో
  ఓ అక్క గారూ ఉయ్యాలో
  మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
  మమ్ము పంపుతారా ఉయ్యాలో
  నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో
  నీ భర్తనే అడుగు ఉయ్యాలో
  రచ్చలో కూర్చున్న ఉయ్యాలో
  రాజేంద్రబోగి ఉయ్యాలో
  మా అన్నలు వచ్చిరి ఉయ్యాలో
  మమ్ము పంపుతారా ఉయ్యాలో
  కట్టుకో చీరలు ఉయ్యాలో
  పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో
  ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో
  వెళ్లి రా ఊరికి ఉయ్యాలో
  పుట్టినింటికి నీవు ఉయ్యాలో
  శుభముగా పోయిరా ఉయ్యాలో
  మెట్టినింటికి నీవు ఉయ్యాలో
  క్షేమంగా తిరిగి రా ఉయ్యాలో
  మెట్టినింటికి నీవు ఉయ్యాలో
  క్షేమంగా తిరిగి రా ఉయ్యాలో.

  ReplyDelete
  Replies
  1. ఈ పాట నిజంగా ఇలాగే పూర్వం నుంచి ఉందో, మీరే వ్రాసారో తెలియదు. ఒకప్పుడు కలవారి కోడలు కలికి కామాక్షి అంటూ ఒక పాట చిన్నతరగతులకి తెలుగు వాచకంలో ఉండేది. ఇప్పుడు ఆపాటని మీరు ఉయ్యాల్లో వేసుకున్నట్లున్నారు!

   Delete