Thursday, August 27, 2009

దళితులను హిందువులుగా ఎప్పుడు చూశారని?!

భారతదేశంలో దళితులను నిన్న మొన్నటి వరకు దేవాలయాల్లోకే అడుగుపెట్టనివ్వలేదు. వాళ్లని తాకితేనే కాదు వాళ్ల నీడ సోకినా చాలు మైలపడిపోతామ్నన్నట్టు ప్రవర్తించారు. వాళ్లను గుడుల్లోకే కాదు బడుల్లోకీ రానివ్వలేదు. ప్రధాన వీధుల్లోకీ అడుగుపెట్టనివ్వలేదు. ఊరి చివరన వెలివేసినట్టు వుండనిచ్చారు తప్ప ఊళ్లో అందరితో కలవనివ్వలేదు. వాళ్ల మీద అంటరానివాళ్లు అనే ముద్రవేసి పరమ కిరాతకంగా అణగదొక్కారు. సాటి మానవులన్న స్పృహలేకుండా జంతువుల కంటే హీనాతి హీనంగా చూశారు. (ఇప్పటికీ ఈ వివక్ష అనేక గ్రామీణ ప్రాంతల్లో కొనసాగుతూనే వుంది).

ఈ దేశాన్ని వేలాది సంవత్సరాలుగా హిందూమతమే (మను ధర్మమే) ఇష్టారాజ్యంగా పాలించింది. మతమూ అదే, ప్రభుత్వమూ అదే. చట్టమూ అదే. శాసనమూ అదే. అందుకే దళితులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా అన్నివిధాలా అణగారిపోయారు. చదువుకూ, చైతన్యానికీ, అభివృద్ధికీ దూరంగా వుండిపోయారు.

ఈ అన్యాయాన్ని సరిచేసేందుకే ... హిందూమతం/హిందూ పాలక వర్గాలు దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో తరతరాలుగా చేసిన అన్యాయాన్ని కొంతైనా సరిదిద్దేందుకే రిజర్వేషన్లు వచ్చాయి. అంతే తప్ప రిజర్వేషన్లు హిందూ మతాన్ని ఉద్ధరించడానికి వచ్చినవి కావు. రిజర్వేషన్లకీ హిందూ మతానికీ సంబంధంలేదు. దళితులు ఏ మత ధర్మాన్ని పాటించాలి, ఏ దేవుణ్ని పూజించాలి, అసలు ఏ దేవుణ్నయినా తప్పనిసరిగా పూజించాలా, వద్దా అనే వాటితో రిజర్వేషన్లకు నిమిత్తం లేదు.

ఈ రిజర్వేషన్ల వల్ల హిందూ మతంలో దళితుల హోదా ఏమీ పెరగదు. ఈ రిజర్వేషన్ల వల్ల దళితులు అమాంతం బ్రాహ్మణులతో సమానులైపోరు. ఈ రిజర్వేషన్ల వల్ల హిందూమతంలో సర్వ కుల సమానత్వం యేమీ ఏర్పడదు. నిజంగా హిందూ మతంలోని లోపాలను సరిదిద్దాలనుకుంటే అందుకు వేరే కార్యక్రమం పెట్టుకోవాలి.

అట్లాగే చాలామంది తెలిసో తెలియకో ఈ రిజర్వేషన్లను ఆర్థిక చట్రంలో బిగించాలని చూస్తున్నారు. తద్వారా రిజర్వేషన్ల అసలు స్ఫూర్తినే దెబ్బతీయాలనుకుంటున్నారు. రిజర్వేషన్ల లక్ష్యం భారతదేశంలో ఆర్థిక అసమానతలను తొలగించడం కానే కాదు. రిజర్వేషన్ల వల్ల భారత దేశంలో సమసమాజమేమీ రాదు. సమసమాజ స్థాపనకు వేరే కార్యక్రమం చేపట్టాల్సి వుంటుంది

నిజానికి హిందూ మతం అనేది ఊహల్లోనే తప్ప వాస్తవికంగా ఎన్నడూ లేదు. హిందూ ధర్మం, మను ధర్మంలనే మతంగా పరిగణిస్తున్నారు. ఈ దేశంలో వున్నవి కులాలు మాత్రమే. మతం మనకి ఊహాజనితం. కులాలే వాస్తవం. అన్ని కులాల వాళ్ళూ ఒకేరకం దేవుళ్లకి దండం పెట్టుకోవడంలో మాత్రమే సారూప్యత వుంటుంది తప్ప ఇతరత్రా కాదు. ఒక్కొక్క కులం ఒక్కో మతంలా తనదైన ప్రత్యేకతను, తనదైన గుర్తింపును కలిగి వుంటుంది. ఒక కులం వాళ్ళు మరో కులం వాళ్లను పెళ్లిల్లు చేసుకోడానికి వీలు లేదు. ఈ కులాల మధ్య అనేక హెచ్చుతగ్గులు. చిన్నచూపులు. అహంభావాలు. ద్వేషాలు, అనుమానాలు, అవహేళనలు ఎన్నెన్నో వివక్షలు.

మన దేశం మీద మహ్మదీయుల, ఆంగ్లేయుల పాలన మొదలైన తర్వాతే, అంటే ఇక్కడిి అగ్రవర్ణాల ఆధిపత్యానికి గండి పడిన తర్వాతే ఈ పెద్దమనుషులకి మతం ముసుగు కావలసి వచ్చింది. అప్పటినుంచే ఒకపక్క కుల వ్యవస్థ చెక్కుచెదరకుండా జాగ్రత్తపడుతూనే మరోపక్క హిందుత్వ, హిందూమత భావనను జనంలో రగిలించడం మొదలుపెట్టారు. గతంలో తాము చేసిన పొరపాట్లను ఇప్పుడైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. ఎవడి కులం పరిథిలో వాడు మగ్గిపోతూనే వుండాలి కాకపోతే ఓట్లు వేయాల్సి వచ్చినప్పుడు, జండాలు మోయాల్సి వచ్చినప్పుడు మాత్రం మాలమాదిగలతో సహా అన్ని కులాలవాళ్లూ హిందువులం అన్న భ్రమతో మూకుమ్మడిగా అగ్రవర్ణాలవారికి జైకొట్టాలి. రాజ్యాధికారం మాత్రం అగ్రవర్ణాల చేతిలోనే వుంటుంది. అంతే.

ఇలాంటి నేపథ్యంలో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ పుణ్యమాని రిజర్వేషన్‌ విధానం కారు చీకటిలో కాంతి కిరణంలా ముందుకొచ్చింది. అది కొంతమంది దళితుల జీవితాల్లో నైనా మార్పునకు దోహదం చేస్తోంది. వెనుక బడిన కులాల్లో చైతన్యాన్ని పెంచుతోంది. దాని వల్ల కొందరు దళితులైనా ప్రభుత్వోద్యోగాల్లో ఉన్నత పదవులను, శాసనసభ, లోకసభల్లో కనీస ప్రాతినిధ్యాన్ని పొందగలుగుతున్నారు. ముందే చెప్పినట్టు రిజర్వేషన్లు ఆర్థిక సమానత్వం కోసమో, సమసమాజ నిర్మాణం కోసమో లేక హిందూమతంలోని లోపాలను సవరించి దానిని పటిష్టం చేయడం కోసమో వచ్చినవి కాదు. కేవలం తరతరాల అన్యాయానికి గురైన దళితులకు న్యాయం చేసేందుకు వచ్చినవి మాత్రమే.

దళితులు హిందూ దేవతలనే పూజించాలి, ఇతర దేవతల వంక కన్నెత్తి చూడకూడదు, నాస్తికులుగా మారకూడదు అట్లా అయితేనే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి వంటి నిబంధనలు పెట్టాలనుకోవడం అర్థ రహితం, అప్రస్తుతం. ఆమాటకొస్తే రిజర్వేషన్లను ప్రవేశ పెట్టిన డాక్టర్‌ బి. ఆర్‌. అంబేడ్కరే '' నేను హిందువుగా చచ్చిపోను '' అని చాలా కసిగా ప్రకటించారు. అన్నట్టుగానే ఆయన లక్షలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధమతాన్ని స్వీకరించి ఒక గొప్ప బౌద్ధుడిగా చనిపోయారు.

కాబట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులకు రిజర్వేషన్లు వర్తింప చేయడం ఏవిధంగానూ ఆక్షేపణీయం కాదు. ఏ మతాన్ని స్వీకరించినా, ఏ దేవుడ్ని ఆరాధించినా లేక పరమ నాస్తికులుగా మారినా దళితులు దళితులే. తరతరాల వివక్షకు ప్రతీకలే. వారి ప్రస్తుత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా అందరికీ రిజర్వేషన్లు వర్తింపజేయాల్సిందే. ఈ దృష్ట్యా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు పూనుకోవడం, ఆ ప్రతిపాదనను తెలుగుదేశం, ప్రజారాజ్యం, టిఆర్‌ఎస్‌, సిపిఐ, సిపిఎం, తదితర పక్షాలు సమర్థించడం ఆహ్వానించదగ్గ పరిణామం.

36 comments:

 1. క్రైస్తవ మిషనరీల నుంచి ఆర్థిక సహాయం పొంది కూడా రిజర్వేషన్ అనుభవించి డబల్ బెనెఫిట్ పొందడం సరైనదా? మా బంధువులలో కూడా కొంత మంది మతం మార్చుకున్నారు. సర్టిఫికేట్ల మీద హిందువులమని వ్రాయించుకుని రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు.

  ReplyDelete
 2. రిజర్వేషన్ల ముఖ్యోద్దేశం "కుల అసమానతలను రూపుమాపడం" కాదు కేవలం అవకాశాలు అందుకోలేని వారికి తోడ్పాటునందించడమే అన్న మీ వాదన బాగుంది. ఇప్పటివరకూ అందరూ భావిస్తూ వస్తున్న విధంగా కాకుండా భిన్నంగా సాగింది మీ వివరణ. మరి ఆ ప్రకారం రిజర్వేషన్లు ఆర్ధిక పరంగా వెనుకబడిన వాళ్ళకు మాత్రమే లభించాలి కదా?

  "కేవలం తరతరాల అన్యాయానికి గురైన దళితులకు న్యాయం చేసేందుకు వచ్చినవి మాత్రమే."
  మనవిధానం వెనుకబడిన వాళ్ళదరికీ సహాయంచేయడానికి ఉద్దేశించినదైవుండుండాల్సింది. అప్పుడు అందులో లబ్దిదారులు ఎక్కువమంది ఖచ్చితంగా "తరతరాల అన్యాయానికి గురైన" దళితులై వుంటారు. కానీ ప్రస్తుతం సదుపాయాలు లేక "అన్యాయనికి గురౌతున్న" కొన్ని ఇతర వర్గాల వారుకూడా లబ్ది పొందుతారు. తరువాత హిందూ మతాన్ని సంస్కరించడానికి మీరుచెప్పిన విధంగా ఏదైనా వేరే కార్యక్రమం పెట్టుకుంటే సరిపోతుంది. రిజర్వేషన్లేవో ప్రతీకారాత్మకం అన్న అర్ధం ధ్వనిస్తోంది మీ post లో గమనించగలరు.

  ReplyDelete
 3. మీ విశ్లేషణ చాలా వరకు సరియైనదే. రిజర్వేషన్లు అనుభవించటం దళితుల సమస్యకు పరిష్కారం కాదన్నది కూడా వాస్తవం. కాకపోతే క్రైస్తవ మతాన్ని స్వీకరించిన దళితులకు రిజర్వేషన్లు వర్తింపచేయటం వలన, నీచ మత ప్రవక్తలకు అవకాశం కల్పించినట్లే. వాళ్ళు అమాయకులైన ప్రజలను మభ్యపెట్టి మత మార్పిడులకు ప్రోత్సహిస్తారు.
  ఏ దేవుడిని పూజించాలి అనేది వారి వారి వ్యక్తిగత విషయం. దానిని ఎవరూ మార్చలేరు. కాకపోతే ప్రజల మీద తమ విశ్వాసాలను బలవంతంగా రుద్దితే మంచిది కాదు.
  దేవుడిని పూజించటం ఒక్కటే ఇక్కడ సమస్య కాదు. ఆచార వ్యవహారాలు కూడా మారిపోతాయి.

  ReplyDelete
 4. నాస్తిక గురువు పెరియార్ అభిమాని ప్రభాకర్ గారికి కూడా హిందూ కోటాలో రిజర్వేషన్లు అవసరమా?

  ReplyDelete
 5. "రిజర్వేషన్ల లక్ష్యం భారతదేశంలో ఆర్థిక అసమానతలను తొలగించడం కానే కాదు. రిజర్వేషన్ల వల్ల భారత దేశంలో సమసమాజమేమీ రాదు. సమసమాజ స్థాపనకు వేరే కార్యక్రమం చేపట్టాల్సి వుంటుంది"


  ఆ వేరే కార్యక్రమం ఏమిటో శెలవియ్యండి. ఫ్రధానిగానూ, రాష్ట్రపతిగానూ దళితుడిని చేసే కార్యక్రమమా? రాజకీయనాయకులందరూ దళితులే అయిఉండాలా? చెప్పండి.

  ReplyDelete
 6. good post in right time

  అభినందనలు

  ReplyDelete
 7. @Indian Minerva:Undoing of systematic social denial to "access resources" is the core aim of reservation policy in India.ఈ విషయం ప్రభాకర్ గారు కొత్తగా చెప్పడం లేదు. రిజర్వేషన్లు ఎందుకు కల్పించాలి అని మహామహులు constituent assembly లో రోజులకురోజులు, పేజీలకు పేజీలు చర్చించుకుని నిర్ణయించారు. అప్పుడుగానీ అది భారత రాజ్యాంగంలో భాగమయ్యింది.

  కాబట్టి రిజర్వేషన్ల ప్రాతిపదిక సామాజికమేకానీ ఆర్థికం కాదు. అంటే ఆర్థికపరంగా వెనుకబాటున్నవాళ్ళకు వెసులుబాటు కల్పించమనికాదు. కానీ, వారి ఆర్థిక వెనుకబాటుని దూరం చెయ్యడానికి "రిజర్వేషన్ to resources" దారికాదు. As a welfare state భారతదేశంలో కులంతో నిమిత్తం లేకుండా Below Poverty Line (BPL) కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సమస్య ఆర్థికపరమైనది కాబట్టి ఇలాంటి ఆర్థికపరమైన వెసులుబాటులు కల్పించడం ప్రభుత్వం బాధ్యత.రేషన్ కార్డులనుంచీ, ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ యాక్ట్ వరకూ ఇలాంటివి ఎన్నో. విద్య,వైద్యం విషయాలలో స్కాలర్ షిప్పులు, హెల్త్ కార్డులద్వారా BPL కుటుంబాలకు సహాయం అందించబడుతోంది.

  రిజర్వేషన్లు ప్రతీకారానికి కాదు.సమానత్వానికి బాటగా ప్రతిపాదించడం జరిగింది. దాన్ని మీరు ప్రతీకారంగా భావిస్తే అది మీ అవగానాలోపమో లేక అక్కసో అనిపించుకుంటుంది. కాబట్టి political rhetoric ని పక్కనబెట్టి నేపధ్యాన్ని, సైద్ధాంతిక ప్రాతిపదికనీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

  ReplyDelete
 8. What about double benefit enjoyed by christian converts? I am not pro-Hindu but enjoyment of double benefit is not justifiable.

  ReplyDelete
 9. @Praveen Sharma: What do yo mean by "double benefits"?ప్రభుత్వ విద్యాసంస్థలూ, ఉద్యోగాలూ చర్చ్ నడపడం లేదే! మరి రెండుసార్లు దళితులు ఎలా లబ్ధిపొందుతున్నారు?

  నీకు జీతం వస్తోందికదా అని బ్యాంక్ లోనిస్తే వద్దంటావా? లేదా ఎవరైనా తేరగా ఒక లక్ష ఇస్తామంటే కాదంటావా? ఏదోఒక లబ్ధికలిగిస్తామంటే తృణీకరిస్తావా? లాభపడేది ఏదైనా మనిషి కావాలనే కోరుకుంటాడు.అది ఎన్ని రకాలుగా ఉన్నా అది కావలసిందే! దీనికి దళితులు మాత్రం వంచితులు ఎందుకవ్వాలి?

  చర్చ్ మంచి విద్యనిస్త్రే తీసుకుంటాం. వైద్యాన్ని అందిస్తే సంతోషిస్తాం. ఆర్థిక వనరులు కల్పిస్త్రే అందుకుంటాం. దానికీ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకూ లంకెకలిపి double benefit అనడం మీ తెలియనితనానికి ఒక ఉదాహరణగా మాత్రమే అనిపిస్తోంది.

  ReplyDelete
 10. నువ్వు దక్షిణ ఒరిస్సా, దండకారణ్యం, నల్లమల లాంటి గిరిజన ప్రాంతాలకి వెళ్తే కనీస సౌకర్యాలు అందని వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. సౌకర్యాలు ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చి అవి లేని వాళ్ళని నిర్లక్ష్యం చెయ్యడం వెనుకబడిన వర్గాల ఉద్దరణ అవ్వదు. దక్షిణ ఒరిస్సాలోని గిరిజన గ్రామాల్లో తిరిగి వచ్చిన ఎక్స్పీరియెన్స్ తో చెప్పగలను. మా నాన్న గారు దక్షిణ ఒరిస్సాలోని రాయగడ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామంలో పుట్టారు. ఆ రాష్ట్రంలోనే బరంపురం యూనివర్శిటీలో ఎల్.ఎల్.బి. చదివి కొంత కాలం హైదరాబాద్ లో ఒక లాయర్ దగ్గర అప్రెంటిస్ గా పని చేశారు. ఆ తరువాత వరంగల్ ఆంధ్రా బ్యాంక్ లో ఉద్యోగంలో చేరారు. అప్పట్లో మా అమ్మగారు కాజీపేట ఆంధ్రా బ్యాంక్ లో పని చేశారు. ఇప్పుడు మేము ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నాము. మాకు రిజర్వేషన్లు అవసరం లేదు. రిజర్వేషన్లు పేదవాళ్ళకి అందకుండా డబ్బున్న వాళ్ళు అనుభవించడం పరాన్నభోగం అవుతుంది.

  ReplyDelete
 11. "రిజర్వేషన్లు హిందూ మతాన్ని ఉద్ధరించడానికి వచ్చినవి కావు."
  "రిజర్వేషన్ల వల్ల భారత దేశంలో సమసమాజమేమీ రాదు"
  "ఈ దేశంలో వున్నవి కులాలు మాత్రమే. మతం మనకి ఊహాజనితం."

  సో, రిజర్వేషన్లు ఓ చిన్న నష్టపరిహారం మాత్రమే. నష్టం అని మీరంటున్నప్పుడు, ఆ నష్టం ఎంత? ఎంత పరిహారం ఇవ్వాలి? నష్టపరిహారం సరైన వ్యక్తులకు అందుతుందా లేదా? ఇవన్నీ ఆలోచించాలి. మా వూళ్ళో కరవు కు మొన్నామధ్య నష్టపరిహారం ఇచ్చారు. నేనో రైతును కనుక్కుంటే, ఆయన చెప్పినది, 1000 నష్టానికి 850 రుపాయలు నష్ట"పరిహారం". (పరిహారం, నష్టానికంటే తక్కువ ఉండడం గమనించాలి) నష్టపరిహారం జరిగిన నష్టాన్ని పూడ్చుకోడానికి ఉద్దేశించబడాలి తప్ప, జరిగినన్నాళ్ళూ ఆ నష్టం జరిగిందన్న పేరుతో సహాయం పొందుతునే ఉండటం కాదు. రిజర్వేషన్లను ఎన్ని ఏళ్ళపాటు నడుపుతూనే ఉండాలి? అసలు సమస్య పరిష్కారం దిశగా సాగుతోందా? మొదటి తరంలో నష్టపరిహారం పొంది, ఆ తర్వాత జీవితాలు బాగుపడ్డాక, తర్వాత తరంలో వాళ్ళకూ మళ్ళీ పరిహారం పేరుతో రిజర్వేషన్లు ఇస్తూ పోతుండడమేనా? ఇప్పుడు జరుగుతున్న రిజర్వేషన్ల వల్ల తిరిగి "నష్ట" పోయిన, పోతున్న వారే లేరా? ఇది మరో సామాజిక సమస్య కాదా?

  ఇవి అటుంచితే, రిజర్వేషన్లను జీవితాలు బాగుపర్చుకోవటం కోసం కాక, "enjoyment" కోసం వాడుకుంటున్న వారి సంఖ్య తక్కువ లేదు. అలాగే ఈ వెసులుబాటు ఏర్పడడం వల్ల, కష్టించి, సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో వారి లెక్కలు తెలియవు.

  ఒక్క మంచి ప్రభుత్వాధికారి, అద్భుతమైన పనితీరు కనబర్చిన ఇంజినీర్లు, స్మాజాన్ని మార్చగలిగిన నేతలు, మంచి ఆటగాళ్ళు...ఇలా అన్ని వర్గాల్లో చెప్పుకోదగ్గ ప్రతిభ కనబర్చిన దళితులు ఎంతమందో తెలియదు.

  మీరు మతం - తూచ్ అంటున్నారు. కానీ ఎంతోమందికి మతం అన్నది ఒక అస్తిత్వం. వారూ దేశానికి ముఖ్యమే, వారి వాదనా, వేదనా కూడా సమంజసమే. ఇప్పుడు కుల రిజర్వేషన్లు మరో మతానికి పాకించటం వల్ల, ఇతర మత వ్యాప్తి అవుతుంది అన్నది ఒక valid argument గా పరిగణించాలి. మీకిది పట్టకపోవచ్చు. మీకు పట్టకపోయినంతమాత్రాన ఇది సమస్య కాకుండా పోదు. ఆ మాటకొస్తే ఈ దేశ చరిత్రలో అప్పుడెప్పుడో చాణక్యుడనే ఆయన పరమత వ్యాప్తిని అరికట్టటానికి దేశాన్ని మొత్తం సంఘటితపర్చిన చరిత్ర ఈ దేశానికి ఉన్నది.

  ఇవన్నీ అటుంచి, ఓ సామాజిక సమస్యకు "నష్టపరిహారం" అన్న model తో పరిష్కారానికి ఉపక్రమించటం కేవలం ఈ సమస్యలో మాత్రమే కనబడుతున్నది. ఇదివరకు స్త్రీల బాల్య వివాహాలు కూడా ఒక సామాజిక సమస్య. ఆ సమస్యకు నేతలు "ఇలాంటి" పరిష్కారం సూచించలేదు. ఒకవేళ అలా అయి ఉంటే, ఆ సమస్య ఇప్పటికి నానుతూనే ఉండేదేమో. ఆ సమస్యకు ప్రక్షాళనా మార్గం దిశగా పరిష్కారం ఆలోచించారు తప్ప, ఎలాగోలా "సర్దుకోవాలని" ఆలోచించలేదు. ఆ రకంగా చూస్తే, అంబేద్కర్ దళితులకు అగ్రనేత కావచ్చునేమో తప్ప, ఓ గొప్ప సామాజిక సమస్యకు పరిష్కారం కనుగొన్న గొప్ప వ్యక్తిగా మిగలడు.

  ReplyDelete
 12. @రవి: రిజర్వేషన్ "నష్టపరిహారం" కాదు.ప్రతీకారం అంతకన్నా కాదు.అన్నితరాలుగా వివక్షని అనుభవిస్తున్న కొన్ని కులాలకు సమానమైన అవకాశాలు కల్పించడానికి ఏర్పాటుచేసిన వెసులుబాటు. Its an attempt towards affirmative action to undo the denial rather than to compensates for all the organised crime,injustice and violence perpetuated against Dalits from ages.

  నిజంగా నష్టపరిహారం చెల్లించాలని ప్రతిపాదిస్తే...I am sure nobody can PAY for it and neither can this society compensate for it.

  ఇప్పటిదాకా అసలు ఒకసారికూడా జీవితంలో రిజర్వేషన్ అనుభవించని కుటుంబాలు కనీసం 60% ఉన్నాయి.స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నాళ్ళకి కనీసం స్కూలుకూడా లేని దళితవాడలు దాదాపు 90%.స్కూలు చదువులు పూర్తిచేసిన దళితులు 10% మించరు. కాలేజీ చదివినవాళ్ళు 3% మించరు. యూనివర్సిటీ చదివిన దళితులు కనీసం 1% కూడా లేరు.

  ఇక ఉద్యోగాల్లో ఇప్పటికీ చప్రాసీలుగానో, స్వీపర్లు నాలుగోతరగతి ఉద్యోగులుగా ఎవరి మిగిలారో ఆరాతియ్యండి.ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తంలో ఎంత శాతం దళితులున్నారో లెక్కగట్టండి! వీరందరినీ వదిలేసి మీకు "enjoyment"చేస్తున్న ఒకరిద్ధరు మాత్రమే పరిస్థితిని నిర్దేశించడానికి కనిపించడం మా దురదృష్టమో లేక మీ దృష్టిలోపమో మీకే తెలియాలి.

  దళితులకి మతంతో పనిలేదు. మనుషులుగా గౌరవప్రదంగా బ్రతకడమే ముఖ్యం.అలా బ్రతికే అవకాశం ఇవ్వని ఏ మతమైనా అందుకే "తూచ్!"

  ఈ రిజర్వేషన్ నమూనా miracles చేసి కొన్ని సహస్రాబ్ధాల అసమానతల్ని రూపుమాపడంలో సఫలం కాలేదుగాక, మీరు ఒక కొత్త నమూనా ప్రతిపాదించండి. ఖచ్చితంగా దాని గురించి చర్చిద్ధాం. నచ్చితే దానికోసం పోరాడటానికి నేను రెడీ!

  ReplyDelete
 13. మహేష్, ప్రభాకర్ లకి కబుర్లు చెప్పడానికి నాస్తికత్వం కావాలి కానీ వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు ఇప్పించడానికి హిందూ ఐడెంటిటీ అయిన కులం కావాలి. ఏమి గొప్ప ఆదర్శం ఇది? నేను కూడా నాస్తికుడినే. కొన్ని నెలల క్రితం నేను హిందూ మతం పైనా, బ్రాహ్మణత్వం పైనా ఎంత నిప్పులు కక్కానో అందరికీ తెలుసు. అదే సమయంలో మహేష్ కూడా హిందూ మతానికి వ్యతిరేకంగా గొప్ప blasphemous వ్యాసాలు వ్రాసి నా కంటే గొప్ప వక్త అనిపించుకున్నాడు. ఇప్పుడు అతని పిల్లలకి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు ఇప్పించడానికి హిందూ ఐడెంటిటీ అయిన కులం కావాలనుకుంటున్నాడు. కులం మతానికి అతీతమైనది అంటున్నాడు.

  ReplyDelete
 14. "ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తంలో ఎంత శాతం దళితులున్నారో లెక్కగట్టండి! "

  ఎంతశాతం ఉండాలంటారు? ఎంత శాతం ఉంటే సమానావకాశాలు ఉన్నట్లు భావించాలి? దానికి దేశమూ, సో కాల్డ్ అగ్ర వర్ణాలు ఎంత మూల్యం చెల్లించాలంటారు? సరే, ఉన్న శాతంలో అత్యంత ప్రతిభ కనబర్చి, పైకి ఎదిగిన వారి శాతం ఎంత? ఈ ప్రశ్నకు ఏ సర్వే సమాధానం చెబుతుంది? మహేష్, నేనూ ఇదివరకు ప్రభుత్వ రంగం (భారత వైమానిక దళం) లో పనిచేసిన వాణ్ణేనండి. మీ లాగ నేను లెక్కలు చెప్పలేను (నాకు వాటి మీద ఆసక్తీ లేదు) కానీ, ఉజ్జాయింపుగా నేనూ ఊహించగలను, నా సంస్థలో ఎంతమంది దళితులు, వారి productivity, దళితులు కాని వారి productivity ఎంత, తదితర వివరాలు. నా అనుభవాలను సిద్ధాంతాల ముసుగులో trivialize చేయడం కుదరదు.

  "ఇప్పటిదాకా అసలు ఒకసారికూడా జీవితంలో రిజర్వేషన్ అనుభవించని కుటుంబాలు కనీసం 60% ఉన్నాయి.స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నాళ్ళకి కనీసం స్కూలుకూడా లేని దళితవాడలు
  దాదాపు 90%.స్కూలు చదువులు పూర్తిచేసిన దళితులు 10% మించరు. కాలేజీ చదివినవాళ్ళు 3% మించరు. యూనివర్సిటీ చదివిన దళితులు కనీసం 1% కూడా లేరు."

  నాకీ లెక్కలు తెలియవు. లెక్కల authenticity ని కూడా నేను పూర్తిగా నమ్మను. ఈ దేశంలో ఏదైనా సాధ్యమే.

  రిజర్వేషన్లు మొదట అంబేద్కర్ గారు ప్రతిపాదించిన లెక్క ప్రకారం 5 యేళ్ళు. 62 యేళ్ళ తర్వాత పరిస్థితి ఎక్కడి గొంగళి అక్కడే ఉంది (మీ లెక్కల ప్రకారం) అంటే అర్థం ఏమిటంటారు? సరే, రిజర్వేషన్ quota లో యే యేడుకా యేడు సీట్లు (చదువులోనూ, ఉద్యోగాల్లోనూ) నింపబడకుండా అలానే మిగిలి పోతున్నాయా? చదువుల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయిన తర్వాత చదువులు మానేయబడుతుంటే, ఎవరిది తప్పు? ప్రభుత్వానిదా? అమలు పద్ధతి లోపమా? లేక ఎప్పుడో తమ పూర్వీకులు దళితులు దేవాలయాలలోకి రానివ్వలేదన్న పాపానికి ప్రతిభ ఉండి, తమ బిడ్డలను చదివించలేకపోతున్న కొన్ని "అగ్ర" వర్ణాల వారిదా? మీకింకో సంగతి చెబుతాను. ఇది కూడా నా అనుభవమే. "defined data" కాదు కాబట్టి పక్కకు తోసేస్తారో, లేదు ఇందులోనూ, "సమస్య తాలూకు మరోకోణం" ఉంది అని ఆలోచిస్తారో మీ ఇష్టం.

  మా ఆవిడ స్వయంగా ఓ సాంఘిక సంక్షేమ, బాలికల గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయిని. పని చేసేది ఒక మారుమూల పల్లెలో. అక్కడ మిగిలిపోయిన సీట్లు లేవు. వచ్చిన రిజల్టు 97 శాతం. పిల్లలు చదువు మధ్యలో మానిపించడానికి నేను చూసిన కారణాలు, బాహ్యం కావు. అవి అంతర్గత కారణాలు. తొందరగా పెళ్ళి చేయాలనో, చదువెందుకు, పని చేస్తే చాలుననో, ఇలా. ఈ కారణాలు రూపు మాపాలంటే, "రిజర్వేషన్లు" అనే పద్దతే సరిపోతుందా? రిజర్వేషన్లకు మీరు చెప్పినది సమాన అవకాశాలు కల్పించడం అన్న కారణం. సమాన అవకాశాలు కల్పించి, మిగతా కారణాల వల్ల చదువు పట్టకపోతే తప్పెవరిది అంటారు?

  "వీరందరినీ వదిలేసి మీకు "enjoyment"చేస్తున్న ఒకరిద్ధరు మాత్రమే పరిస్థితిని నిర్దేశించడానికి కనిపించడం మా దురదృష్టమో లేక మీ దృష్టిలోపమో మీకే తెలియాలి."

  ఒకరిద్దరు! వారిని excuse చేసేయాలంటారు! చేసేయచ్చండి. కానీ ఈ దేశం "బలిసిన" స్థితిలో లేదు. బ్రిటిష్ వాళ్ళు రాక ముందు బలిసిందేమో, ఇప్పుడు అలా లేదు. సంవత్సరానికి కనీసం నలుగురైదుగురు రిజర్వేషన్ quota లో సీట్లు తెచ్చుకున్న ఇంజినీర్లు పరీక్షలు రాయకుండా, హాస్టల్లో "12" (దళితులు కాని వారికి 8 యేళ్ళు మాత్రమే అర్హత) యేళ్ళ పాటు అనుభవించి, ఆ తర్వాత ఉద్యోగాలు సంపాదిస్తే, జరిగే నష్టం పైకి తక్కువగా కనబడచ్చు. అది చూసే దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. ఆ దృక్పథమే దృష్టిలోపమని భావించడం మీ ఇష్టం.అయినా నేను దళితులందరూ అలాంటి వాళ్ళు అనలేదు.

  "అలా బ్రతికే అవకాశం ఇవ్వని ఏ మతమైనా అందుకే "తూచ్!""

  మతాన్ని "తూచ్" అనడం ఒకరి వ్యక్తిగతం. నేను దాన్ని విమర్శించలేదు. అసలు మతమే ఆచరించని వారిని చూశాన్నేను (కొరియా). అలాగే మతాన్ని ఆచరించటమూ ఒకరి వ్యక్తిగతం. వారిని కించపర్చటమూ, వారి personal space లో అడుగుపెట్టటమూ తప్పే. కుల రిజర్వేషన్ లు మరో మతానికి వ్యాపించటం వల్ల, మతానికి దెబ్బ అన్నది మతాన్ని అనుసరించే వాళ్ళు చేస్తున్న వాదన. దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది.

  "మీరు ఒక కొత్త నమూనా ప్రతిపాదించండి."

  హాస్యాస్పదం. నేను సంఘ సంస్కర్తను కాదు. అలా అయితేనే ఈ బ్లాగులో "ఇలా" కామెంటాలి అన్న రూలు లేదనుకుంటాను.

  ReplyDelete
 15. మరో నమూనా చెప్పమన్నారు కాబట్టి, నేనో సామాజిక శాస్త్రవేత్త కాకపోయినా, చదువుకున్న వాణ్ణి కాబట్టి, నాకు తట్టిన సూచనలు చెబుతున్నాను.

  ౧. దళితులందరికీ ప్రాథమిక నిర్బంధ విద్య అమలు జరపాలి.
  ౨. దళిత కుటుంబంలో ప్రబుత్వోద్యోగం/మంచి ప్రైవేట్ ఉద్యోగం ఉన్న వారి సంతానానికి (వారి తరంలో ఇక ఎవ్వరికీ కూడా) రిజర్వేషన్ కేవలం "చదువు" వరకే పరిమితం చేయాలి.
  ౩. professional courses లో దళితుల పట్టా పొందే పరిమితి కాలం "6" యేళ్ళకు కుదించాలి. 6 యేళ్ళలో పట్టా పొందలేకపోతే, వారికి రిజర్వేషన్ అర్హత తీసివేయాలి.
  ౪. వెనుకబడిన వర్గాల ఇళ్ళల్లో పెళ్ళిల్ల వయసు మగవారికి 28, ఆడవారికి 25 ఖచ్చితంగా అమలు చేయాలి.
  ౫. గ్రామాల్లో దళితులకు స్వయం ఉపాధి పథకాలు కల్పించాలి.

  చప్పున ఆలోచిస్తే తోచినవి ఇవి. నిజంగా సమస్యను పరిష్కరించాలని ఉన్నవారికి పరిష్కార మార్గాలు తట్టకపోవు!

  ReplyDelete
 16. దళితులు తమ పేర్ల చివర "మాదిగ" లాంటి కులం పేర్లు పెట్టుకోవడం దళితులకే అవమానం అంటే మహేష్ అంగీకరించలేదు. ఇదేదో గొప్ప అన్నట్టు మాట్లాడాడు. నువ్వు వీధిలో పది లేదా ఇరవై మంది దగ్గరకి వెళ్ళి నువ్వు మాలవాడివనో, మాదిగవాడివనో, ఆది ఆంధ్రుడివనో, రెల్లివాడివనో గొప్పగా చెప్పుకుని అప్పుడు నిన్ను ఎంత మంది గౌరవిస్తారో చూడు. కులం పేరు చెప్పుకుంటే దళితులకి ఎంత అవమానమో తెలుస్తుంది.

  ReplyDelete
 17. ఆమాటకొస్తే రిజర్వేషన్లను ప్రవేశ పెట్టిన డాక్టర్‌ బి. ఆర్‌. అంబేడ్కరే '' నేను హిందువుగా చచ్చిపోను '' అని చాలా కసిగా ప్రకటించారు.
  _________________________________________________

  Curious question. Why didnt the same Ambedkar extend the reservations to the converts?

  ReplyDelete
 18. దళితులు ఏ మత ధర్మాన్ని పాటించాలి, ఏ దేవుణ్ని పూజించాలి, అసలు ఏ దేవుణ్నయినా తప్పనిసరిగా పూజించాలా, వద్దా అనే వాటితో రిజర్వేషన్లకు నిమిత్తం లేదు.
  _________________________________________________

  Yep. But as far as I understand (correct me if I am wrong), the constitution says that the Dalits who want reservations must remain Hindus. Since Christianity/Islam doesnt have caste system in place, they are NOT dalits once they get converted.

  ReplyDelete
 19. And yes one more interesting News item in this regard, conveniently ignored by all:  "Lok Satta Party’s Jayaprakash Narayan said that the resolution would not stand legal scrutiny. The Supreme Court had, in an earlier case, clearly stated that converted Christians could not claim SC status"


  He wanted the government to increase reservation under the BC-C quota, now being given to Dalit Christians. It was the only way to uplift Dalit Christians, he suggested.

  Minister D Manikya Varaprasad said it was up to Parliament to amend the Constitution and the Assembly could only pass resolution.

  _________________________________________________

  SO, UNTIL THE CONSTITUTION IS AMDENDED, NOTHING CAN BE DONE AND WE ARE BUSY FIGHTING OVER THIS ISSUE :))

  ReplyDelete
 20. మహేష్ నాస్తికుడే, ప్రభాకర్ కూడా నాస్తికుడే. మహేష్ బెర్ట్రాండ్ రస్సెల్ శిష్యుడైతే ప్రభాకర్ పెరియార్ శిష్యుడు. కానీ వీళ్ళు తమ పిల్లలకి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు ఇప్పించడానికి హిందూ ఐడెంటిటీ అయిన కులం కావాలనుకుంటున్నారు. నాస్తిక శాస్త్రానికే వెన్నుపోటు పొడిచిన నాస్తిక వీరులయ్యారు. వీరి అవకాశవాద ఆదర్శానికి జయము జయము!

  ReplyDelete
 21. Mahesh said that he wouldnt want to use the reservation facility for his kids. If I understood it correctly then I should say its a welcome move and must be appreciated - Some other Dalit family gets benefitted.

  ReplyDelete
 22. Malak - For your comment at 9:34 PM on Aug 27 (your last comment) - please refer 9th comment from Top :-)

  ReplyDelete
 23. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 24. *శోధన,సాధన చేసిన జ్ఞానం మాత్రమే శాశ్వతమని నమ్ముతాను. నిరంతరం ప్రశ్నించుకుంటూ నిజాన్ని అన్వేషించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.*
  *నీకు జీతం వస్తోందికదా అని బ్యాంక్ లోనిస్తే వద్దంటావా? లేదా ఎవరైనా తేరగా ఒక లక్ష ఇస్తామంటే కాదంటావా? ఏదోఒక లబ్ధికలిగిస్తామంటే తృణీకరిస్తావా? లాభపడేది ఏదైనా మనిషి (మహేష్)కావాలనే కోరుకుంటాడు.అది ఎన్ని రకాలుగా ఉన్నా అది కావలసిందే! దీనికి దళితులు మాత్రం వంచితులు ఎందుకవ్వాలి?*

  మహేష్ ఇన్ని రోజులకి నాకు మీరు ఎందుకు శోధన సాధన చేస్తున్నారో అర్థమైంది. మీ సిద్దాంతం ఎమీటి అని అడిగిన ప్పుడు మీరు చేప్పక పోయినా మీ లక్ష్యన్ని ఒక్క మాటలో పైన వివరించారు. మరి మాలలు కూడా మీలాగె అనుకొని వారికి లభించే రీసర్వేషన్ల లాభాలు ఎందుకు మాదిగల కోసం వదులు కోవాలి? మీ (ప్రభాకర్‌ మందారా )గుణలు మయురీ సినేమాలో శుభకర్ పాత్ర కి సరిగ్గా సరి పోతుంది. ఆ సినేమాలో అతను జునియర్ గా ఉన్నప్పుడు కాలేజ్ ఫంక్షన్ ఏర్పాటు జరిగే టప్పుడు ఒక వాదన సీనియర్ అయినపుడు ఇంకొక వాదన వినిపిస్తాడు. రెండు వాదనలు అతనికే లాభించే విధంగా ఉంటాయి. అసలికి చదువుకున్న అతి తెలివి దళితుల కి కావలసిందే మిటంటె కష్టపడ కుండా తక్కువ కష్టం తో ఎక్కువ డబ్బు,దానికి వీరు నిత్యం మమల్ని అణ్గత్రొక్కారని పుస్త్కాలు రాసు కోవటం వారి సర్కిలో మేధావులు గా చేలామణి కావడం. రాజకీయ నాయకుల దగర బేర సారలు చేసి సుఖం గా జీవించటం. ఇదీ మీ వాదన లేక పోతె మీలో ఎవరికైనా చిత్త శుద్ది ఉంటె బూటా సింగ్ వ్యవహారం లో ఒక్క దళితుడు కూడా నోరు మెదపలేదు ఎందుకని? ఇదే మీరు ఎవరైనా అగ్రవర్ణ వాడు అదే పని చేస్తే ఎలా ఊగి పోయేవారో దళితుల నాయకత్వం ఎప్పుడు జూసినా మాకు అది కావలి ఇది చేయాలి అని చేయి చాచటంలో సిద్ద హస్తులు. మిమల్ని చూసి ఇప్పుడు అందరు అలాగే తయారౌ తున్నారు (ఉదా|| గుజ్జర్లు). చూసాము గా యస్.సి. రిసర్వెషన్ మాత్రమే కావాలని వారు ఎంత గలభా చేసారో.
  ------------------------------------------------------------------------------------------
  ఈ దేశాన్ని వేలాది సంవత్సరాలుగా హిందూమతమే (మను ధర్మమే) ఇష్టారాజ్యంగా పాలించింది.మతమూ అదే, ప్రభుత్వమూ అదే. చట్టమూ అదే. శాసనమూ అదే.

  నిజానికి హిందూ మతం అనేది ఊహల్లోనే తప్ప వాస్తవికంగా ఎన్నడూ లేదు.

  మందారా నువ్వు మోదటి లో రాసినది ఆఖరు కి వచెటపటికి హిందూ మతం అనేది లేదని రాశారు. సుబ్బి శెట్టి చింతామణి నాటకం లో అన్నట్టు నీది నోరా పంచాయితి బోర్డ్ పంపా!!!

  ReplyDelete
 25. ఇవన్నీ సరే, నాబోటి నాస్తి'కు(లా)'నికి రిజర్వేషన్ చేసే మార్గం ఏదయినా వుంటే చెబుదురూ. అందులో మళ్ళీ హిందూ నాస్తికులకి, ముస్లిం నాస్తికులకి, క్రిస్టియన్ నాస్తికులకి, దళిత నాస్తికులకి కోటాలుండాలి సుమా.

  ReplyDelete
 26. Well my observation was based on Comment #8 in this

  http://chaduvari.blogspot.com/2009/08/blog-post_26.html

  ReplyDelete
 27. Malak- Comment #8 in Chaduvari Blog and Comment #9 in This blog..

  నువ్వు అమ్మయకుడువి మలకాన్నా.. ఇంకా కత్తి నీకు అర్ధం కాలేదు.

  ReplyDelete
 28. మహేష్ వ్రాసాడు
  >>>>>>
  నీకు జీతం వస్తోందికదా అని బ్యాంక్ లోనిస్తే వద్దంటావా? లేదా ఎవరైనా తేరగా ఒక లక్ష ఇస్తామంటే కాదంటావా? ఏదోఒక లబ్ధికలిగిస్తామంటే తృణీకరిస్తావా? లాభపడేది ఏదైనా మనిషి కావాలనే కోరుకుంటాడు.అది ఎన్ని రకాలుగా ఉన్నా అది కావలసిందే! దీనికి దళితులు మాత్రం వంచితులు ఎందుకవ్వాలి?
  >>>>>>

  నేను నీకు అడుక్కునేవాడిలా కనిపిస్తున్నానా? మా అమ్మానాన్నలు 15 లక్షలు ఖరీదు చేసే ఆస్తి సంపాదించారు. లక్ష రూ. ఫ్రీగా ఇస్తే తీసుకోవలసిన ఖర్మ నాకు లేదు. నేను మొదట్లో వ్యాపారం పెట్టడానికే తీసుకున్న లోన్ 2 లక్షలు. 50 వేలు సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టాము. మొదటి వ్యాపారం మూత పడినా రెండవ వ్యాపారం చేసి సంపాదించగలను. రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం నాకు లేదు. ఉద్యోగం ఉన్నవాడికి బ్యాంక్ లోన్ ఎందుకు? అవసరమైతే క్రెడిట్ కార్డ్ తెచ్చుకుంటాడు కదా. హైదరాబాద్ లో ఉన్న నీకు క్రెడిట్ కార్డ్ గురించి తెలియదా? నువ్వు మా శ్రీకాకుళంలో ఉన్నా HDFC బ్యాంక్ లో 50 వేలు ఫిక్సెడ్ డిపాజిట్ వేస్తే క్రెడిట్ కార్డ్ వచ్చేస్తుంది.

  ReplyDelete
 29. భరద్వాజా, అజ్ఞాత చెప్పింది నిజమే. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం పరధిలో అవ్వని పని. అది కేంద్ర ప్రభుత్వం వల్ల మాత్రమే అయ్యే పని. అది కూడా రాజ్యాంగ మార్పు ద్వారానే సాధ్యం. ఈ విషయం అర్థం చేసుకున్నావు కానీ మహేష్, ప్రభాకర్ లాంటి వాళ్ళ అవకాశవాద మెంటాలిటీ అర్థం చేసుకోలేకపోయావు. "జానకి విముక్తి" నవలలోని ప్రభాకర్ లోకం తెలియని అమాయకుడైతే కత్తి మహేష్, మందార ప్రభాకర్ లాంటి వాళ్ళు మాత్రం అమాయకుల్లా నటించే వెన్నుపోటుదార్లు.

  ReplyDelete
 30. రవి గారు చెప్పినదానికి జోడింపు.
  రిజర్వేషన్లతో ఒక డిగ్రి చేసిన వారికి తదుపరి చదువులో రిజర్వేషను ఉండరాదు.

  ReplyDelete
 31. SC\ST\BC స్కాలర్ షిప్ లు తీసుకునేవాళ్ళలో కూడా ఎక్కువ మంది డబ్బున్న వాళ్ళ పిల్లలే. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తోటాడ గ్రామానికి చెందిన ఒక మధ్య తరగతి BC రైతు తన వార్షిక ఆదాయం 10 వేలు అని దొంగ సర్టిఫికేట్ తెప్పించి, ప్రభుత్వం నుంచి స్కాలర్ షిప్ తీసుకుని తన కొడుకుని విశాఖపట్నంలోని ఒక కార్పరేట్ కాలేజిలో చదివించాడు.

  ReplyDelete
 32. అలాంటి BC రైతులు ఎంత మంది ఉన్నారో? శ్రీకాకుళం పట్టణంలో కూడా కార్పరేట్ కాలేజిలు ఉండగా వైజాగ్ లోని సూపర్ కార్పరేట్ కాలేజిలో తన కొడుకుని అడ్మిట్ చెయ్యాల్సిన అవసరం ఏమిటి? అది కూడా ప్రభుత్వ ఖర్చుతో!

  ReplyDelete
 33. మతం మారినంతమాత్రానా కులం పోదు అంటున్నారు, మతాన్ని పూర్తిగా వదిలి పెట్టి నాస్తికులుగా మారినా కులం పోదు అంటున్నారు. మరి మనం హిందూ మతాన్ని తీవ్రంగా విమర్శించి ఏమి సాధించాం? నేను హిందూ మతానికి పూర్తిగా వ్యతిరేకినే కానీ మీరు హిందూ మతం పై చేసిన విమర్శలలో నిజాయితీ లేదని మీరు ఒప్పుకుంటున్నారా?

  ReplyDelete
 34. >>దళితుడికి గతంలో మతం అనేది వుండెదా<<
  హిందూ మతమనేదే లేదనికదా మీరంటున్నది ఇక దళితుడికో చాకలో కుమ్మరో ఎవ్వరైనా మతంతో కాక కులంతోటే గుర్తింపబడ్డారనుకుందాం. ఇప్పుడు ఆ కులాలకేగా రిజర్వేషన్స్ ఇస్తున్నది.
  మళ్ళీ కొత్త మతంలోకి వాళ్ళు మారాలనుకుని తమ కులాన్ని వదులు కున్నప్పుడు ఆ కొత్త మతంలోకెడుతూ తమ కులాన్ని గత వివక్షతను ఎందుకు వెంటబెట్టుకుని అక్కడా ప్రత్యేకత కావాలని కోరుకుంటున్నారు? కులాన్ని కాదనుకుని కొత్త మతంలోకి వెళ్ళినప్పుడు ఆ మతానికి సంబంధించిన వన్నీ వాళ్ళకు వర్తిస్తాయి. కట్టుబాట్లు మతపద్దతులతో పాటు వాళ్ళు ఒప్పుకున్నా లేకున్నా వాళ్ళు ఎఫ్ సీ కొందకే వస్తారు. వాళ్ళు తమ ప్రత్యేక హక్కులు (కులంలోవున్నప్పుడు ఇచ్చినవి) వెంటబెట్టుకువెళతాననడం సరికాదు.

  >>దేవాలయాల్లోకే అడుగుపెట్టే అర్హతలేని దళితుడికి గతంలో<<
  ఎప్పటి సంగతి మీరు చెప్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్తానం హరిజనులకు తమ వేదపాఠాశాలలో స్టైఫండ్ ఇచ్చి మరీ వేదం భోధిస్తోంది. ఎంత మంది ఉపయోగించుకుంటున్నారు? తప్పు తమపై పెట్టుకుని ఎవరో తమకు గౌరవం ఇవ్వట లేదనటం సరికాదు.
  వీదుల్లో తిరుగుతూ మా మతంలోకి రండి అనడగటమే వాళ్ళిచ్చే గౌరవమైతే అలాంటి గౌరవాలు హిందూ మతం నుండి ఆశించకండి హిందూ మతం ప్రత్యేకంగా ఎవ్వరినీ బలవంత పెట్టి మత మార్పిడి చేయదు. అవకాశాలు అందిపుచ్చుకుంటే నిజంగా ఇష్టం వుంటే
  ఎవ్వరైనా ఇప్పుడు ఓ గుడి పూజారి అవడానికి అడ్డేం లేదు.

  మీరే కాలంలో వుండి మాట్లాడుతారో గాని, ఇప్పుడు ఇండియాలో ఏకులానికి ఎవరూ గౌరవం ఇవ్వట్లా. ఎవరిదారి వాళ్ళదే. ఎవరికి వారు గౌరవం ఇచ్చుకుంటే ఒకరిపైన పడి ఏడవలసిన అవసరం ఉండదు.

  ReplyDelete
 35. క్రైస్తవ, ఇస్లాం మతాలలో చేరిన వాళ్ళు తమ మతంలో లేని కులాలని నమ్మితే అది వాళ్ళు వ్యక్తిగతంగా చేసిన తప్పు. వాళ్ళు వ్యక్తిగతంగా చేసిన తప్పుల వల్ల వాళ్ళు చేరిన మతంలో లేని కులం కారణంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలా? ఇది అర్థం కాని ప్రొపోజల్ లా ఉంది.

  ReplyDelete
 36. కృపాకర్ మాదిగ అనే అతను చలం గారినీ, శ్రీశ్రీ గారినీ కూడా కులం పేరుతో తిట్టి తన కుల గజ్జిని బహిరంగంగా ప్రదర్శిస్తున్నాడు. ఈ సోకాల్డ్ దళితవాదుల గురించి నేను ఇందులో వ్రాసాను: http://stalin-mao.net/?p=60

  ReplyDelete