Friday, February 6, 2009

వాలంటైన్ డే నాడు ప్రేమికులకు పెళ్లిల్లు చేయడంతో పాటు ... అదే చేత్తో వాళ్లకి ఉద్యోగాలు కూడా ఇప్పించి పుణ్యం కట్టుకోండి !!!

ఆడవాళ్లు బురఖా లేకుండా బయటకు వస్తే ...
తాట వలిచేస్తామని ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు ఫర్మానా జారీ చేశారు.
స్త్రీలు ఉద్యోగాలు చేయడం, బడికి వెళ్లి చదువుకోవడం యహా చల్తానై ...
వాళ్లు ఇంట్లో నాలుగు గోడల మధ్య పతిసేవ చేసుకుంటూ బుద్ధిగా పడుండాలని తాఖీదు ఇచ్చారు.
ఆ తాఖీదును ఉల్లంఘించిన కొందరు మహిళల తాట వలిచేసినట్టు కూడా వార్తలొచ్చాయి.

ఈ మధ్య మన పత్రికల్లో కూడా అప్పుడప్పుడు ...
అట్లాంటి ఫర్మానాలే జారీ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

అయితే-
మన దేశంలో విడుదలవుతున్నవి అంత అమానుషమైన ... అంత ప్రమాదకరమైన తాఖీదులేం కాదనిపిస్తోంది.

లోతుగా ఆలోచిస్తే మన తాఖీదులవెనక
మహిళల భద్రత, ఔన్నత్యం, వారి సంక్షేమం పట్ల ఎనలేని ఆవేదన వున్నట్టు అర్థమవుతుంది.

పబ్బులకు వెళ్లి చెడిపోకండి...
మన సంస్కృతిని అప్రదిష్టపాలు చేయకండి అంటున్నారు... అంతేకదా !

వాళ్లు అన్నదాంట్లో తప్పేముంది?

చెప్పినా వినకుండా మొండికేస్తున్న మహిళామణుల వీపు మీద నాలుగు దెబ్బలు వేస్తున్నారు.
బస్‌ ... అంతే కదా.
చెప్పిన మాట వినకపోతే మన చెల్లెల్ని మాత్రం మనం కొట్టుకోమా ఏంటి?

కొట్టింది మన అన్నయ్యలేగా.
అదీ మన మంచి కోసమేగా?
ఎందుకు అంత ఉక్రోషపడాలి.

పబ్బులకు వెళ్లని వాళ్లని కొట్టడం లేదుగా.
పబ్బులను నడిపేవాళ్లనీ కొట్టడం లేదు. పబ్బులకు అనుమతినిచ్చే ప్రభుత్వాలనీ పడగొట్టడంలేదు.

కాబట్టి ఆఫ్ఘనిస్థాన్‌తో పోల్చుకుని మనం నానా హైరానా పడాల్సిన పనిలేదు.

నిన్ననే మరో ఫర్మానా జారీ అయింది.

రేపు ఫిబ్రవరి 14న
'' వాలెంటైన్‌ డే '' రోజునాడు

రోడ్ల మీద ప్రేమికులెవరైనా కనిపిస్తే అప్పటికప్పుడు అదే రోడ్డు మీద వాళ్ల పెళ్లి చేసిపారేస్తారట.
నిజం పెళ్లేనండి బాబూ. వేరేగా పొరబడకండి.
పైగా అది అ ల్లా టప్పా పెళ్లి కాదు. పక్కాగా రిజిష్టరు కూడా చేయిస్తారట.
ఇందు నిమిత్తం వేల సంఖ్యలో మంగళ సూత్రాలు, దస్తావేజులు సైతం సిద్ధం చేశారట కూడాను.

ఆహా...
ఎంత మంచి తాలిబన్లండీ మన వాళ్లు!

అనవసరంగా భయపడుతున్నారు గానీ ఆడ పిల్లల పెళ్లి సమస్యను చిటికెలో పరిష్కరించే
మా మంచి అన్నయ్యలు కాదూ మనవాళ్లు.
నిజంగా దేవుడిచ్చిన అన్నయ్యలు.

అయితే ఆ చేత్తోనే ఈ ప్రేమికులకు ఉద్యోగాలు కూడా చూసిపెడితే ఎంత బాగుంటుందో కదా.
ఉద్యోగం లేక, నికరమైన ఆర్థిక వనరు లేకపోతే కాపురాలు సజావుగా సాగేందుకు ఆస్కారం లేదు కదా.

ప్రేమికులకు కుల గోత్రాల పట్టింపు వుండదు.
కాబట్టి ఈ తరహా పెళ్లిల్లలో నూటికి తొంభై కులాంతర వివాహాలే అయివుంటాయి.
వాళ్లలో నూటికి తొంభైతొమ్మిది మందికి తల్లిదండ్రుల ఆమోదం వుండదు.

ఇటు ఉద్యోగమూ లేక అటు తల్లిదండ్రుల సపోర్టూ లేక కాపురాలు సజావుగా ఎలా సాగుతాయి చెప్పండి.
అందువల్ల ఈ మా మంచి అన్నయ్యలు వాళ్లకి పెళ్లిల్లు చేయడంతో పాటు ఉద్యోగాలు కూడా చూసిపెడితే దివ్యంగా వుంటుంది.

ఉద్యోగాలు సద్యోగాలు లేకుండా ఈ ప్రేమలేంటి...
ఈ వాలెంటైన్‌ డే లేంటి... ఈ విదేశీ సంస్కృతేంటీ అంటారా?

నిజమే కానీ,
ప్రేమకు సరిహద్దులు లేవు.
కొలమానాలు లేవు.
కొందరు ఆకర్షణనే ప్రేమ అనుకోవచ్చు.
మరికొందరు అవసరం కోసం ప్రేమించవచ్చు.
మరికొందరు స్పష్టమైన జీవిత లక్ష్యంతో, జీవిత భాగస్వామి గురించిన నిర్దిష్ట అవగాహనతో ప్రేమించవచ్చు.
అందరికీ ప్రేమించడం చాతకాదు.
అందరూ ప్రేమించే సాహసం చేయలేరు.
ఇంకొందరుంటారు ... పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న తరువాత ఇంటికొచ్చిన పెళ్లాన్ని కూడా ప్రేమించలేరు.!!!

చాలామంది ప్రేమికులు రేపెప్పుడో ఉద్యోగాలు దొరికిన తరువాత పెళ్లి చేసుకుందామనుకుంటారు.
అంతవరకు నిగ్రహంగా వుండాలని నిర్ణయించుకుంటారు.

పెళ్లికి ఉద్యోగం తప్పనిసరి కానీ ప్రేమకు కాదు కదా.

మీరు తొందరపడి పెళ్లి చేస్తున్నారు కాబట్టి మీరే ఆ బాధ్యత తీసుకోవాలి.
వాళ్లకి ముందు ఉద్యోగాలు చూసిపెట్టి ఆ తరువాతే పెళ్లి చేయాలి.

మంచి అన్నయ్యలు కదూ. కాస్త దయగా ఆలోచించండి.
ఆ పుణ్యం కూడా మీరే మూటట్టుకోండి.

ద్వాపర యుగంలో
ఇలాంటి అన్నయ్యలు, అన్నయ్యల దండు లేకపోబట్టి కానీ ...
రాధా కృష్ణులు ...
మన ఆదర్శ ప్రేమికులు ...
ప్రేమతత్వానికే ప్రతీకలు ...
అట్లా శాశ్వతంగా పెళ్లి చేసుకోకుండా వుండిపోయేవారు కాదేమో...!!!

7 comments:

  1. ఛల మంచి పొఇంత్ ని లెవనెథరు. మీ కు మా దన్యవదలు.ఒక వెల వల్లు దానికి కూద ఒప్పుకుంతె ఇక నిరుద్యొగులు ఒక ఇంతివరు అవుతరు. యెమంతరు?

    ReplyDelete
  2. :D Nice posting!!!! alochinchalsina vishayame

    ReplyDelete
  3. అన్నలు ప్రేమకి వ్యతిరేకులు గారు. ఫిబ్రవరి 14 రోజున మాత్రం "ప్రేమికుల రోజు" అంటు విదేశి సంసృతి అనుసరించొద్దు అంటున్నారు.

    ReplyDelete
  4. @ సురేష్ గారూ,
    మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు. అచ్చు తప్పులు అతిగా వున్నాయి.
    google indic transliteration సహాయం తో తెలుగు టైపు చేసి చూడండి. సులువుగా వుంటుంది.సైట్ అడ్రస్ : http://www.google.com/transliterate/indic/తెలుగు

    @ లక్ష్మి గారు
    Thank you.

    @ నాగ ప్రసాద్ గారూ,
    మీ అభిప్రాయం నిజమే అయితే ఆ రోజునాడు పట్టి బలవంతంగా పెళ్లి చేయడం ఏమిటండి ? అది సబబే నంటారా?

    ReplyDelete
  5. నిజంగా ప్రేమించుకునే జంటలకి ప్రతి రోజు ప్రేమికుల రోజే. టైమ్ పాస్ కోసం ప్రేమించుకునే వాళ్ళకే ఏడాదికొకసారి ప్రేమికుల రోజు అవసరం కనిపిస్తుంది.

    ReplyDelete
  6. Marthanda, I will play dogbert for a while.

    No, You're not entitled to your opinion. I copyrighted all of the stupidest opinions in the universe so they can never again be uttered.

    ReplyDelete
  7. @ మార్తాండ గారూ
    నిజంగా ప్రేమించు కునే వాళ్ళెవరో ... టైం పాస్ కోసం ప్రేమించు కునే వాళ్ళెవరో ఎట్లా తెలుస్తుంది? అయినా సమస్య అది కాదు. వాళ్లని పట్టుకుని బలవంతంగా పెళ్లి చేయడం, రోడ్డు మీద కొట్టి అవమానించడం ఏమిటని .??

    ReplyDelete