( ఫోటో వ్యాఖ్య )
ఎవరన్నారు బాపూ
మేం నిన్ను మరచిపోయామని !?
ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకూ
మా శ్వాస, ధ్యాస, ప్రయాస
మా గమనం, గమ్యం అంతా నువ్వే కదా
నిన్నెలా మరచిపోగలం ?
మా అణువణువణువణువునా నువ్వే వ్యాపించి వున్నావు
సమసమాజం ఏర్పడేంతవరకూ
నీ మీద మా భక్తి పారవశ్యాలకు ఢోకాలేదు బాపూ
nijam
ReplyDeleteరిజర్వేషన్‌ల గురించి చర్చ జరిగినప్పుడు మీరు దళితవాద భాషలోనే మాట్లాడారు (మీరు దళితుడో, కాదో నాకు తెలుయదు). ఇక్కడ ఒక విషయం మాత్రం చెప్పదలచుకున్నాను. గాంధీని నమ్ముకుంటే దళితులకి ఏమీ రాదు. గాంధీ కుల వ్యవస్థని బహిరంగంగానే సమర్థించాడు. ఎవరి కులవృత్తులు వాళ్ళు చేసుకుంటే వాళ్ళపై దేవతలు పూల వర్షం కురిపిస్తారని అన్నాడు. ఒక అగ్రకులంవాడు గాంధీని పొగిడితే నాకు ఆశ్చర్యం కలగదు. కానీ దళితవాద భాషలో మాట్లాడే వ్యక్తి దళిత వ్యతిరేకి అయిన గాంధీని పొగిడితేనే ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే ఈ లింక్ ఇస్తున్నాను, చదవండి: http://gandhism.net
ReplyDeleteప్రముఖ రచయిత శ్రీ గుడిపాటి వెంకటచలం గాంధీగారి సిధ్ధాంతాలకు పట్టిన గతిగురించి ఇలా బాధపడ్డారు
ReplyDelete"గాంధీగారి అహింసా సిద్ధాంతం ఒక ఉపకరణ, ఒక పాలసీ.ఆయన అనుచరులకి ఒక ధర్మం కింద, ఒక సత్యంకింద, ఎవరికీ విశ్వాసం లేదు"(మ్యూజింగ్స్ 290వ పుట-5వ ముద్రణ).
Dare2Write
ReplyDeleteప్రవీణ్ మండంగి గారికి,
శివరామ ప్రసాదు కప్పగంతు గారికి
స్పందించినందుకు ధన్యవాదాలు..
ప్రవీణ్ గారూ
గాంధీని పొగిడినట్టు ఎలా అనిపించిందండి మీకు .
దయచేసి పైన ఇచ్చిన ఫోటోను చూస్తూ మరోసారి చదవండి.
.