Showing posts with label మరికొన్ని కథలు 2. Show all posts

Thursday, June 12, 2025
ఆడియో రూపం లో "బంగిన పల్లి మామిడి పండు" కథ
దేవి గారు తన 'శ్రీ కథ సుధ' యూ ట్యూబ్ చానల్ లో
నా బంగిన పల్లి మామిడి పండు కథను చదివి ఆడియో ఫైల్ రూపంలో అప్లోడ్ చేసారు.
లింక్ :
https://youtu.be/9zc37Vpf-hs
కథ రచయిత పేరును పొరపాటున "ఉయ్యాల గారు" అన్నారు.
ఆ కథను ఇక్కడ చదవవచ్చు:
https://uyyaala.blogspot.com/2009/11/blog-post.html
Friday, November 27, 2009
బంగినపల్లి మామాడిపండు ... మరో సరసమైన కథ ...
బంగినపల్లి మామాడిపండు ...
అప్పుడే అచ్చయి ఇంకా ఆరని శుభలేఖల్లో ఒకదాన్ని అందుకుని పరీక్షగా చూసేడు ప్రణీత్.
పూలదండ ఆకారంలో మంగళసూత్రం... ఒక శతమానంలో వధువు ఫొటో... మరో శతమానంలో వరుడి ఫొటో... దండ మధ్య వివాహ మహోత్సవ ఆహ్వానం.. మల్టీ కలర్ స్క్రీన్ ప్రింటింగ్‌లో విలక్షణంగా, చూడముచ్చటగా వుందది.
వధూవరుల ఫొటోలని గమనిస్తే ఎవరైనా ముసి ముసి నవ్వులు చిందించక తప్పదు.
వధువు వరుని వంక, వరుడు వధువు వంక ఓరగా, దొంగ చూపులు చూస్తున్నట్టుగా వున్నారు. తను కావాలనే వాళ్లని ఆవిధంగా ఎంతో కష్టపడి ఫొటోలు తీసేడు. ఆ డిజైన్‌ని రూపొందించింది కూడా తనే..
వధువు చి.ల.సౌ. ఆదిలక్ష్మి!
వరుడు చి.విష్ణుమూర్తి!!
ఆహా... కులాలు వేరైనా వీళ్ల పేర్లు ఎంత అతికినట్టు కలిశాయో!
కవర్ మీద ''పెళ్లంటే నూరేళ్ల పంట'' అన్న అక్షరాలు బంగారం రంగులో ధగధగ మెరిసిపోతున్నాయి.
శుభలేఖ తను ఆశించిన దానికంటే అందంగా వచ్చినందుకు ప్రణీత్ పొంగిపోయాడు. ప్రెస్సువాడికి సంతోషంగా బిల్లు చెల్లించి వాటిని తీసుకుని ఉత్సాహంగా ఇంటికి బయలుదేరేడు.
వీధిగేటు తీసుకుని లోనికి అడుగుపెడుతుండగా వరండాలో తీరుబడిగా కూచుని భగవద్గీత పారాయణం చేస్తున్న పెళ్లికొడుకు విష్ణుమూర్తి దర్శనమిచ్చేడు.
ఆ దృశ్యం చూడగానే ఒళ్లు మండిపోయింది.
ప్రణీత్ దాదాపు నాస్తికుడు. విష్ణుమూర్తేమో పదహారణాల ఆస్తికుడు. మామూలుకంటే భక్తి భావం ఒకింత ఎక్కువనే చెప్పాలి. ఇటీవల టీవీలో రామాయణం, మహాభారతం సీరియళ్లను చూసేక అది మరింత ముదిరింది.
ఈయనగారి పెళ్లి పనులన్నీ నెత్తినేసుకుని నానా హైరానా పడుతుంటే ఈ మానవుడు ఎంత నిశ్చింతగా వున్నాడో. పైగా అదేదో పరీక్షకు ప్రిపేరవుతున్నట్టు ఇప్పుడీ గీతా పారాయణమేమిటో అనుకున్నాడు కసిగా.
ఖాళీ కుర్చీని పెద్దగా శబ్ధం అయ్యేలా లాగి విష్ణుమూర్తి ఎదురుగా కూర్చున్నాడు.
తలెత్తి ప్రణీత్‌ని చూసిన విష్ణుమూర్తి మొహంలో బుగ్గలు చొట్టలు పడేలా చిరునవ్వు వెలిసింది.
ఆహా ఏం స్మైల్ అనుకుంటూ చేతిలోని ప్యాకెట్‌ని అందించాడు ప్రణీత్.
''ఏమిట్రా యిది?'' కళ్లు చిట్లిస్తూ అడిగాడు విష్ణుమూర్తి.
''నీ వెడ్డింగ్ కార్డులు'' సీరియస్‌గా చెప్పేడు ప్రణీత్.
విష్ణుమూర్తి నిర్ఘాంతపోతూ ''ఇవన్నీ ఎందుకురా?'' అన్నాడు.
''బాగుంది. సరిపోతాయో లేదో అని నేను హడలిపోతుంటే ఇవన్నీ అంటావేంటి?''
''అంటే ఎంత మందిని పిలుద్దామనిరా నీ ఉద్దేశం?''
''ఊళ్లో వాళ్లందర్నీ''
విష్ణుమూర్తికి ఆ తలతిక్క సమాధానం కించిత్ కోపం తెప్పించింది. అయినా తమాయించుకున్నాడు.
''ఎందుకురా ఈ అనవసరపు ఖర్చు? దగ్గరివాళ్లని ఓ నలుగుర్ని పిలుచుకుంటే చాలదా? నాకోసం నువ్విలా డబ్బు తగలెయ్యడం నాకేం నచ్చడంలేదు.'' అన్నాడు.
ప్రణీత్ విసురుగా లేస్తూ ''డబ్బు గురించి నువ్వేం పట్టించుకోవద్దన్నానా? అసలు నీ ఉద్దేశం ఏంటి? ఈమాత్రం ఖర్చుపెట్టే స్థోమత నాకు లేదనుకుంటున్నావా? ఓ సత్కార్యం చేసే అదృష్టం లభించినందుకు నేనెంతో పొంగిపోతుంటే అడుగడుగునా అడ్డుపడతావెందుకు? ఇంకోసారి డబ్బు మాటెత్తావంటే చూడు..'' అన్నాడు తెచ్చిపెట్టుకున్న కోపంతో.
''అదికాదురా...''అంటూ విష్ణుమూర్తి ఏదో చెప్పబోయేడు.
''నాకింకేం చెప్పొద్దు. శుభలేఖలెలా వచ్చాయో చూసుకో. పెళ్లికి ఇంకా నాలుగు రోజులు కూడా లేదు. నాకు అవతల బోలెడు పనులున్నాయి'' అంటూ లోపలికి వెళ్లిపోయేడు ప్రణీత్.
చేసేదేం లేక శుభలేఖల ప్యాకెట్‌ని విప్పాడు విష్ణుమూర్తి. ఒక్కసారి అతని మొహం విప్పారినట్టయింది. అంత గొప్పగా అచ్చువేయిస్తాడని ఊహించలేదు. 'ఏమిటో వీడి అభిమానం' అనుకున్నాడు. దృష్టి పెళ్లికూతురు మీద నిలిచిపోయింది.
''ఎంత అందంగా నవ్వుతోంది ఆదిలక్ష్మి. పైగా ఆ ఓరచూపు ఎంత కవ్వింపుగా వుందో. ఆ నవ్వే కదూ తనను పిచ్చివాణ్ని చేసింది.''
ఒక్కసారి చిన్నప్పటి రోజులు స్మృతిపథంలో మెదిలాయి.
అప్పట్లో ఆదిలక్ష్మికుటుంబం తమ ఇంటిపక్కనే వుండేది. తమవి వేరు వేరు కులాలైనప్పటికీ తమ రెండు కుటుంబాల మధ్య ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఏర్పడింది.
తనకు నాలుగేళ్ల వయసప్పుడు ఆదిలక్ష్మి పుట్టింది. చిన్నప్పటినుంచే చాలా బొద్దుగా ముద్దుగా వుండేది. ఆడపిల్లంటే అమ్మకు ఎంతో ఇష్టం అందుకే ఎప్పుడూ ఆదిలక్ష్మి చుట్టూ తిరుగుతుండేది అమ్మ. అమ్మతో పాటు తనూ కూడా ఎక్కువగా వాళ్లింట్లోనే గడిపేవాడు. ఎత్తుకోవడం చాతకాకపోయినా ఆదిలక్ష్మిని పోట్లాడి మరీ ఎత్తుకునేవాడు. ఆదిలక్ష్మి తన మీద ఎన్నిసార్లు ఒంటేలు పోసిందో... అయినా సరే తను కోపంగానీ అసహ్యంగానీ తెచ్చుకోకుండా రబ్బరు బొమ్మలా వుండే ఆదిలక్ష్మిని ఎత్తుకుని ఆడించేందుకు ఎప్పుడూ ప్రయాసపడుతుండేవాడు.
మాటలు నేర్చిన తరువాత ఆదిలక్ష్మి తనని 'బావా' అని సంబోధించడం మొదలుపెట్టింది. ఎంతో కాలం ముందునుంచే తమ తల్లిదండ్రులు ''వదినా, అన్నయ్యా'' అనే ఆత్మీయ సంబంధాలు కలిపేసుకోవడమే అందుకు కారణం.
ఊహ తెలుస్తున్న కొద్దీ ఆ పిలుపు తనకు అదోలా అనిపించేది. ఆదిలక్ష్మి మాత్రం నిష్కల్మషంగా ఎప్పుడూ బావా, బావా అంటూ తనతో మాట్లాడేది.
పద్నాలుగో ఏట కాబోలు ఒకరోజు హఠాత్తుగా ఆదిలక్ష్మి పెద్దమనిషయింది అన్నారు. పెద్దమనిషి అవడం అంటే ఏమిటో తనకు అప్పుడు ఏమీ తెలీదు. రెండు వారాల పాటు ఆదిలక్ష్మి తన కంటికి కనిపించలేదు. ఇదవరకటిలా చూద్దామని వాళ్లింటికి వెళ్తే ఆదిలక్ష్మి వున్న గదిలోకి వెళ్లనిచ్చేవారు కాదు.
నిన్న మొన్నటి వరకూ తనతో చెట్టపట్టాలేసుకుని తిరిగిన అమ్మాయి ఉన్నట్టుండి పెద్దమనిషిగా ఎట్లా మారుతుందో, ఆమెను బడికి పంపకుండా గదిలో ఎందుకు నిర్బంధించారో అంతా అయోమయంగా వుండేది.
ఆడపిల్లకు చదువెందుకు అన్న తల్లిదండ్రుల సాంప్రదాయిక మనస్తత్వం వల్ల ఆదిలక్ష్మి చదువుకు అర్థంతరంగా ఫుల్‌స్టాప్ పడింది.
కొన్ని రోజులు గడిచాక ఆదిలక్ష్మి అప్పుడప్పుడు ఏ కిటికీ చాటునుంచో, తలుపు చాటునుంచో కనిపించడం మొదలుపెట్టింది. తమ రెండిళ్ల మధ్య చిన్న పిట్టగోడే అడ్డు కాబట్టి ఒకర్నొకరు చూసుకునేందుకు, కళ్లతో పలకరించు కునేందుకు వీలయ్యేది. మరికొన్నాళ్లకి ఆ ఆంక్షలు కూడా సడలిపోయి రాకపోకలు ఎప్పటిలా సాధారణమైయ్యాయి.
ఓణీ పరికిణీలో ఆదిలక్ష్మి నిజంగా ఆరిందాలా అనిపించేది. శరీరంలో ఏవో ఒంపులు, సొంపులు, మొహంలో తెలీని మెరుపు తనలో ఎంతో ఆసక్తిని రేకెత్తించేది. అప్రయత్నంగా తన దృష్టి ఆదిలక్ష్మి ఛాతీ మీద నిలిచిపోతుండేది. తను అది గమనించి ఓణీని సవరించుకుంటూ సిగ్గుతో మెలికలు తిరిగిపోయేది. చేతులు అడ్డుపెట్టుకుంటూ మాట్లాడేది.
తమకు ఊరు చివర చిన్న మామిడి తోట వుండేది. ఓ వేసవి సాయంత్రం ఆదిలక్ష్మి అనుకోకుండా తనతో పాటు మామిడి కాయలు కోసేందుకు తోటకు బయలుదేరింది.
పచ్చని ఆ తోటలో తామిరువురూ ఎంతో స్వేచ్ఛగా గెంతులు వేశారు. చల్లని వాతావరణం, ఏకాంతం, స్వేచ్ఛ ... తనలో చిలిపి ఊహాలను రగిలించాయి.
ఆదిలక్ష్మిని ఒక్కసారి ఏదో సినిమాలో ఎన్టీరామారావు హీరోయిన్ని గట్టిగా కౌగలించుకున్నట్టు కౌగలించుకోవాలనీ, ఆమె బుగ్గల మీద ముద్దుపెట్టుకోవాలనీ అనిపించింది. ఆ కోరిక అంతకంతకూ ఉధృతమై పోయింది. తను ఆ ప్రయత్నంచేస్తే అరుస్తుందేమో...గొడవ చేస్తుందేమో అన్న జంకు... భయం ఒక పక్క... వివశుణ్ని చేసే కోరిక మరోపక్క... ఆ రెంటి మధ్య ఎంతగానో సతమతమైపోయాడు తను.
ఆదిలక్ష్మిని చిన్నప్పుడు ఎన్నిసార్లు బుగ్గల మీద ముద్దు పెట్టుకోలేదు. ఎన్నిసార్లు చంకనేసుకుని తిప్పలేదు. ఇప్పుడు అడిగితే ఎందుకు కాదంటుందిలే!
నవ్వుతూ, తుళ్లుతూ నిష్కల్మషంగా మాట్లాడుతున్న ఆదిలక్ష్మిని కల్మషమనసుతో చూస్తున్న కొద్దీ తనలో ఉద్రేకం పరవళ్లు తొక్కసాగింది. వయసు, ఏకాంతం, వాతావరణం అగ్నికి ఆజ్యం పోయసాగాయి.
''ఏంటి బావా ఆలోచిస్తున్నావు?'' అనుమానంగా అడిగింది.
''అబ్బే ఏం లేదు.''అని మొహం తిప్పేసుకున్నాడు. ఎలా ప్రొసీడ్ కావాలో తెలియలేదు. అంతలో ఓ చెట్టుకు కాస్త ఎత్తులో ఎర్రగా ఓ మామిడి పండు కనిపించింది. చటుక్కున మనసులో ఫ్లాష్ వెలిగినట్టయింది.
''లక్ష్మీ ఈ చెట్టు పళ్లు ఎంత తీయగా వుంటాయో తెలుసా. చక్కెరకేళీలే అనుకో. ఆ మగ్గిన పండు రుచి చూస్తావా?'' అన్నాడు తను.
ఓ అన్నట్టు తల ఊపింది ఆదిలక్ష్మి అమాయకంగా.
తను ఆ పండును అందుకునేందుకు ఒకటి రెండు సార్లు ఎగిరి ప్రయత్నించాడు. నిజంగా ప్రయత్నిస్తే అందుతుంది. కానీ తన ఆలోచనవేరుకదా. అందుని ఎన్నిసార్లు గెంతినా అందలేదది.
''పోనీ నేను నిన్ను ఎత్తుకుని పైకి లేపుతాను. నువ్వే తెంపేయ్'' అన్నాడు తను అప్పుడే ఆ ఆలోచన తట్టినట్టు.
తన ప్లాన్ అర్థమయిందో లేదో తెలీదు కానీ ఆదిలక్ష్మి సరే అన్నట్టు తలాడించింది. అంతే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తను ఆదిలక్ష్మిని అ ల్లుకుపోయినంత పనిచేశాడు. కాస్త వంగి నడుము చుట్టూ చేతులు బిగించి పొట్టను గుండెలకు హత్తుకుంటూ పైకి ఎత్తాడు. చక్కిలిగింతలు పెట్టినట్టయి కిలకిలా నవ్వింది ఆదిలక్ష్మి. అంతలోనే సర్రున కిందికి జారిపోయింది. కాదు తనే జారవిడిచాడు. ఆమె గుండెలు తన మొహాన్ని, గొంతును, ఛాతీని తాకుతూ తన గుండెల్లో చిక్కుకు పోయాయి. ''పట్టు పరికిణీ కదూ జారిపోతోంది'' అంటూ మళ్లీ పైకి ఎత్తడం, జారవిడవడం అ లా ఎన్నిసార్లు చేశాడో. ఆ స్పర్శ తనను ఉన్మత్తుణ్ని చేసింది. ఆ దొంగాటని ఆదిలక్ష్మి కూడా ఎంజాయ్ చేస్తున్నట్టనిపించింది. అందుకే అడ్డు చెప్పలేదు. దాంతో తను మరింత రెచ్చిపోయి ఆమె మొహం మీద ముద్దుల వర్షం కురిపించాడు.
''వద్దు బావా ఎవరైనా చూస్తారు. ప్లీజ్ బావా...'' పైకి ప్రతిఘటిస్తున్నట్టు ప్రవర్తిస్తూనే తనకు సహకరించింది.
అంతే...
అనూహ్యంగా తాము ఆ చల్లని ప్రకృతి ఒడిలో ఒక్కటైపోడం జరిగింది.
ఆదిలక్ష్మికి తన మీద కోపం వస్తుందేమో అనుకున్నాడు కానీ ఆమె చూపులో ఆరాధనే తప్ప మరే భావమూ కనిపించలేదు.
''లక్ష్మీ మనం పెళ్లి చేసుకుందాం. నాకు నువ్వు కావాలి.'' అన్నాడు తను.
''నాకు కూడా నువ్వే కావాలి బావా. నువ్వు లేకుండా నేను బతకలేను.'' అంది తను.
ఆవిధంగా తామిరువురూ ఆవేశంతో ఏవేవో ప్రతిజ్ఞలు చేసుకుంటుండగా ఎక్కడినుంచో హఠాత్తుగా ఊడిపడ్డాడు నాన్న.
ఆయనలో ఎప్పుడూ అంత కోపం చూడలేదు. ఆదిలక్ష్మి ముందే తన చెంప చెళ్లు మనిపించాడు. ఆమెను గొరగొరా ఈడ్చుకుపోయి ''ఆడపిల్లను కని వదిలేయడం కాదు. కాస్త అదుపులో పెట్టుకోండంటూ చాలా అసభ్యంగా ఆదిలక్ష్మి తల్లిదండ్రుల మీద విరుచుకుపడ్డాడు.
ఆరోజు నుంచే తమ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. బంధుత్వం కంటే గొప్పదనుకున్న తమ అనుబంధం పుటుక్కున తెగిపోయి దాని స్థానంలో శత్రుత్వం చోటు చేసుకుంది. కనిపించని కులం ఎంత బలమైనదో తనకి అప్పుడే అర్థమయింది. మాటలు కాదు కదా తమ మధ్య చూపులు కూడా కరువయ్యాయి.
నాన్న దృష్టిలో తమది గొప్ప కులం. ఆదిలక్ష్మివాళ్లది తక్కువ కులం. ఇన్నాళ్లుగా ''అన్నయ్యా... వదినా... బావా...'' అని కలుపుకున్న వరుసలన్నీ బూటకమని తేలింది. కేవలం ఆత్మవంచనకు, పరవంచనకు ఉద్దేశించినవవి. ఒకే దేవుళ్లని పూజించి, ఒకే పండుగలు చేసుకునే తమ మధ్య ఈ కులం అడ్డుగోడలేమిటో! స్నేహానికి అడ్డుచెప్పని కులం పెళ్లికి ఎందుకు అడ్డుచెబుతుందో! కులవృత్తులను కాలదన్ని ఎవరికి తోచిన వృత్తిని వారు చేసుకుంటున్న ఈ రోజుల్లో ఇంకా కులాన్ని ఎందుకు పాటిస్తున్నారో తనకి ఏమాత్రం అర్థం అయ్యేది కాదు.
ఎవరు ఎన్ని రకాలుగా అడ్డు పడ్డా పెళ్లంటూ చేసుకుంటే ఆదిలక్ష్మినే చేసుకుంటానని మనసులోనే గట్టిగా నిర్ణయించుకున్నాడు తను. ఆవిషయం చెప్పి ఆదిలక్ష్మికి భరోసా కల్పించేందుకు అవకాశం చిక్కేది కాదు.
ఒకరోజు తన మనసులోని ఉద్దేశాలను కాగితం మీద పెట్టి పాలవాడి ద్వారా లక్ష్మికి చేరవేశాడు తను. ఆ వెంటనే ఆదిలక్ష్మి నుంచి ఉత్తేజభరితమైన సమాధానం వచ్చింది. అంతే అక్కడనుంచీ తమ మధ్య కొన్నాళ్లు లేఖాయణం సంతోషదాయకంగా సాగింది.
దురదృష్ట వశాత్తు ఓ రోజు ఆదిలక్ష్మి రాసిన ఉత్తరం నాన్న చేతిలో పడింది.
అంతే మళ్లీ పెద్ద రభస. నాన్న వాళ్లని చాలా ఘోరంగా అవమానించాడు. పాలుతాగే ప్రాయంనుంచీ ఆదిలక్ష్మిని తమ చేతుల్లో ఆడిస్తూ ఎంతో ఆత్మీయతను పంచిన తన తల్లిదండ్రులు ఆ అమ్మాయి మీద అట్లా విరుచుకుపడుతుంటే... అన్యాయంగా అభాండాలు వేస్తుంటే తను ఎంతో విలవిలలాడిపోయాడు.
ఇన్నేళ్ల స్నేహం, ఆత్మీయత అంతా ఉత్తదేనా? కనిపించని కులం ముందు అవన్నీ దిగదుడుపేనా?
మొట్టమొదటిసారి తను నాన్నను తిరగబడ్డాడు. చేయి ఎత్తితే విదిలించి కొట్టాడు. మాటకు మాట జవాబు చెప్పాడు. ఆదిలక్ష్మి లేకుండా తను బతకలేనని అమ్మను ఎన్నో విధాలా ప్రాధేయపడ్డాడు. ఎవరి మనసూ కరగలేదు. తమ గొడవలు అట్లా సాగుతుండగా ఆదిలక్ష్మివాళ్లు ఇల్లు ఖాళీ చేసి, ఊరొదిలి వెళ్లేందుకు ఉద్యుక్తులయ్యారు.
ఆరోజు సామాను సర్దుకుని వాళ్లు స్టేషనుకు వెళ్తున్నారని తెలియగానే తను కూడా ఎవరి కంటా పడకుండా స్టేషనుకు చేరుకున్నాడు. తనను స్టేషన్లో చూసిన ఆదిలక్ష్మి ఎంత పొంగిపోయిందో. వాళ్లు ఎక్కిన ట్రైన్‌లోనే తనూ ఎక్కేశాడు.
రెండు మూడు స్టేషన్లు దాటిన తరువాత సైగ చేయగానే ఆదిలక్ష్మి గప్‌చుప్‌గా తల్లిదండ్రుల కన్నుగప్పి తనవెంట వచ్చేసింది. అంత చిన్న వయసులో తమ ఇద్దరికీ అంత తెగువెలా వచ్చిందోతిప్పటికీ ఆశ్చర్యంగా వుంటుంది. కట్టుబట్టలతో స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టిన తమకు స్నేహితులే అండగా నిలిచారు. ఆ తరువాత తమ ప్రేమను పెద్దలు గుర్తించారు. తాము ఏ అఘాయిత్యానికైనా పాల్పడతామేమోనని భయపడి తమ రెండు కుటుంబాలూ కులం అడ్డుగోడల్ని అధిగమించేందుకు సిద్ధమయ్యాయ్యాయి.
తీయని గత స్మృతులనుంచి బయటపడి పెళ్లి కూతురు ఆదిలక్ష్మికి పెళ్లి శుభలేఖ చూపిద్దామని కుర్చీలోంచి లేచేడు విష్ణుమూర్తి.
--- --- ---
ఆవేళ ...
బంధుమిత్రులతో ప్రణీత్ ఇల్లు కళకళలాడుతోంది. రంగురంగుల కాగితాలు, తోరణాలు, విద్యుద్దీపాల వెలుగులతో కొత్త అందాలను సంతరించుకుంది.
హాల్లో పొందికగా అమర్చిన భారీ కుర్చీల్లో పెళ్లికొడుకు విష్ణుమూర్తి, పెళ్లికూతురు ఆదిలక్ష్మి ఆసీనులై వున్నారు. వాళ్ల మొహాల్లో సిగ్గుతో కూడిన వింత సోయగం తొణికిసలాడుతోంది. బంధు మిత్రులు, పిల్లలూ పెద్దలూ అందరి కళ్లూ వారిమీదే కేంద్రీకృతమయ్యాయి.
ప్రణీత్ రెండు భారీ పూలదండలు తెచ్చి చెరొకటి అందించాడు. వధూవరులు దండలు మార్చుకుం టుండగా హాలంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది.
ప్రణీత్ గొంతు సవరించుకుని ఉద్వేగంగా మాట్లాడడం మొదలుపెట్టాడు.
''అరవైఏళ్లు దాటితే షష్టిపూర్తి జరుపుకుంటారు. అది సర్వ సాధారణం. అయితే ఇది అట్లాంటి షష్టి పూర్తి ఉత్సవం కాదు. వయసు పరంగా మా తాతయ్యకీ, నానమ్మకీ ఎప్పుడో షష్టి పూర్తులు అయిపోయాయి. తాతయ్య వయసు ఇప్పుడు ఎనభై దాటింది. నానమ్మ వయసు డెబ్బై ఆరేళ్లు. అయినా ఇది మరోరకంగా షష్టిపూర్తి ఉత్సవమే. ఎందుకంటే వీళ్ల వివాహం జరిగి నేటికి సరిగ్గా అరవై ఏళ్లు!''
ప్రణీత్ ప్రసంగానికి హోరున వెల్లువెత్తిన చప్పట్లు కొన్ని క్షణాలపాటు అంతరాయం కలిగించాయి.
పళ్లు లేని బోసి దవడల్ని కొరుక్టుంటూ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని సైలెంట్‌గా మోచేత్తో పొడిచాడు. పెళ్లి కూతురు తనేం తక్కువ తిన్లేదన్నట్టు బోసినోరును మరింత ముడిచి పెళ్లికొడుకు తొడమీద గిల్లింది.
ఆ అపురూప దృశ్యం చూసినవారికి గిలిగింతలు పెట్టింది.
ప్రణీత్ తన మాటల్ని కొనసాగించాడు ''పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్న అనేక ప్రేమ వివాహాల్లో గానీ, పెద్దలు కుదిర్చిన వివాహాల్లో గానీ ఆ పవిత్ర భావనే కనిపించడంలేదు. వ్యాపార సంస్కృతి, ధనవ్యామోహం, అహం వల్ల అనేక పెళ్లిళ్లు మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. వరకట్న మరణాలు, విడాకులు పెరిగిపోతున్నాయి.
కానీ...
అరవై ఏళ్ల క్రిందట నిష్కల్మషమైన మనసుతో ఒక్కటైన మా తాతయ్యా నానమ్మలు పవిత్రమైన భారత వివాహ వ్యవస్థకు అసలు సిసలు ప్రతీకలుగా నిలిచారు. కులాలను, కట్టుబాట్లను, పెద్దలు సృష్టించిన అడ్డంకుల్ని కాలదన్ని పెళ్లి చేసుకున్న ఈ ఆది దంపతుల ఇన్నేళ్ల కాపురంలో ఒక్క చిన్న అపశృతి కూడా లేదనడంలో అతిశయోక్తి ఏమీ లేదు.
మనసున మనసై బ్రతుకున బ్రతుకై ... రెండు శరీరాలూ ఒకే ఆత్మగా కలసి సాగుతున్న వీరినుంచి మనమంతా నేర్చుకోవలసింది ఎంతో వుంది. అందుకే నేను ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు పూనుకున్నాను. ఇందుకు బలవంతంగానైనా అంగీకరించిన తాతయ్యకీ, నానమ్మకీ శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను.'' అంటూ ప్రణీత్ వధూవరుల పాదాలను కళ్లకద్దుకున్నాడు.
కథ అక్కడితో ముగియలేదు.
ఆ రాత్రి విందు ముగిసి ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లిపోయాక ... సినిమాలోలా అ లంకరించిన శోభనం గదిలోకి ఆ వృద్ధ దంపతులను తోసి తలుపులు మూశారు.
పందిరిమంచం, మల్లెపూల దండలు, అగరొత్తుల పరిమళం ఏదో కలల ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుంది. ఇద్దరికీ తమ తొలి కలయిక గుర్తుకొచ్చింది. కటిక నేల మీద, మట్టి వాసన మధ్య ప్రకృతి ఒడిలో జరిగినప్పటికీ ఆ అనుభూతికి ఈ కృత్రిమ అ లంకారాలు సాటి రావు అనిపించింది. వరుడు పెళ్లి కూతురువంక కొంటెగా చూశాడు. ఏంటా చూపు అన్నట్టు మూతిముడుపుతోనే కసిరింది వధువు.
సీలింగ్ ఫాన్‌కి వేలాడుతున్న బంగినపల్లి మామిడిపండును హఠాత్తుగా గమనించి ఆశ్చర్యపోతూ చూడు చూడు అన్నట్టు కనుబొమలెగరేశాడు పెళ్లికొడుకు.
'ఆరి భడవాకానా' అని ఆ పనిచేసిన మనవణ్ని మనసులోనే తిట్టుకుంటూ సిగ్గుల మొగ్గయింది పెళ్లికూతురు.
''అప్పుడంటే నాజుగ్గా ఏడుమల్లెలెత్తుండే దానివి కాబట్టి ఎత్తుకున్నాను. కానీ ఇప్పుడు పిప్పళ్ల బస్తాలా తయారయ్యావు. నిన్ను ఎత్తడం నా వల్ల కాదే బాబూ... నా నడుం విరిగిపోతుంది!'' అంటూ బెంబేలు పడిపోయాడు పెళ్లికొడుకు.
ఆ మాటలకి పెళ్లి కూతురు ఉక్రోషపడిపోతూ పెళ్లి కొడుకు ముగ్గుబుట్ట తలమీద ఒక మొట్టికాయ మొట్టింది. ఆ తరువాత వీర నారిలా పైటను నడుముకు చుట్టింది. తనే వెళ్లి తన చేతికర్ర సాయంతో ఆ మామిడి పండుని టప్‌మని కొట్టి కిందకు పడగొట్టింది.
పాన్పు మీద పడ్డ ఆ బంగిని పల్లి మామిడిపండు వంక లొట్టలేస్తూ చూసేడు పెళ్లి కొడుకు.
--- --- ---
(18 జనవరి 1991 నాటి స్వాతి సపరివార పత్రికలో ప్రచురించబడిన సరసమైన కథ యిది. స్వాతి సంపాదకులకు ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను)

Thursday, October 22, 2009
లాహిరి లాహిరి లారీలో ... (కథ) ...
తారు రోడ్డు మీద అరవై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది లారీ. స్టీరింగ్ ముందు కూచుని వున్న శ్రీకాంత్ చూపులు నిశ్చలంగా వున్నా అతని మనసు మాత్రం ప్రశాంతంగా లేదు.
చెల్లెలి పెళ్లి చూపులంటూ డ్రైవర్ ఆరోజు పన్లోకి రాలేదు. కాలుకు దెబ్బతగిలి బాధపడ్తున్న క్లీనర్‌ని తనే వద్దని పంపించేశాడు. సమయానికి ఇంకో వ్యక్తి దొరక్కపోవడంతో తానే ఒంటరిగా బయల్దేరవలసి వచ్చింది.
డ్రైవింగ్ తనకేం కొత్తకాదు. లారీ మంచి కండిషన్లో వుంది. ఈమధ్యే టైర్లు మార్చాడు. దార్లో ట్రబులిస్తుందన్న బెంగలేదు. ఎటొచ్చీ వాతావరణమే ఆందోళనకరంగా వుంది.
లోడింగ్ చేసేప్పుడు ఆకాశం నిర్మలంగానే వుంది. అప్పటికింకా పడమటి సూర్యుడు గొరువెచ్చని కిరణాలను వెదజల్లుతూనే వున్నాడు. తీరా లారీ స్టార్ట్ చేసేక హఠాత్తుగా ఎక్కడినుంచో కారుమబ్బులు కమ్ముకొచ్చాయి.
వరంగల్ నుంచి నాగపూర్‌కి వెళ్లాలి. అందులోనూ టైం బౌండ్ డెలివరీ అది. సమయానికి సరుకును చేరవేయకపోతే బిల్లులో కోత పడుతుంది.
భూమ్మీద దాడి చేసేందుకు సిద్ధమవుతున్న మేఘసమూహాలు వుండి వుండీ కత్తులు ఝళిపిస్తూ యుద్ధభేరీలు మ్రోగిస్తున్నాయి. అంతలో దూరంగా ఎక్కడో ఫెటీల్మని పిడుగుపడ్డ చప్పుడయింది. శ్రీకాంత్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. సరిగ్గా అప్పుడే చినుకులు కూడా మొదలయ్యాయి. ప్రంట్ గ్లాస్ మీద పడుతున్న చినుకులు ముత్యాల్లా మెరిసిపోతున్నాయి.
వేగం తగ్గించి వైపర్స్ ఆన్ చేశాడు. చూస్తుండగానే వర్షం ఉధృతమైపోయింది. దేవుడి మీద భారం వేయడం తప్ప ఇప్పుడు తను చేయగలిగిందేంలేదు. మనసును కుదుటపరచుకునేందుకు టేప్‌రికార్డర్ బటన్ నొక్కాడు.
''లాహిరి లాహిరి లాహిరిలో ... ఓహో.. జగమే ఊగెనుగా... తూగెనుగా ...'' స్పీకర్ లోంచి పాట మంద్రస్థాయిలో వినిపించసాగింది. కుండపోత వర్షం వల్ల నిజంగానే లారీని కాకుండా పడవను నడుపుతున్నట్టుగా వుంది. వైపర్లు ఎంత వేగంగా కదులుతున్నా అద్దాలను క్లియర్ చేయలేకపోతున్నాయి.
హుజురాబాద్ సమీపిస్తుండగా ఓ యువతి రెండు చేతులూ గాల్లో ఊపుతూ హఠాత్తుగా రోడ్డు మీదకు వచ్చింది.
శ్రీకాంత్ చప్పున యాక్సిలేటర్ మీంచి కాలు తీసి బ్రేక్‌ని గట్టిగా అదిమాడు. సర్రుమంటూ రెండడుగుల దూరం జారుకుంటూ వెళ్లి ఆగిపోయింది లారీ. మరికాస్తయితే ఆమెను ఢీకొట్టి వుండేదే!
అసలే అసహనంతో వున్న శ్రీకాంత్‌కి ఆ సంఘటనతో మరింత చిర్రెత్తింది. కిటికీ అద్దం పక్కకు జరిప,ి తల బైటకు పెట్టి ''ఏం చావాలని వుందా?'' అనరిచాడు.
''కొంచెం డోర్ తెరవరా ప్లీజ్'' అందామె నడిరోడ్డు మీద నుంచి అతని వైపు వస్తూ.
అంతలో మరో లారీ హారన్ కొడుతూ ఆమె పక్కనుంచే దూసుకుపోయింది. ఆ శబ్దానికి భయపడి కెవ్వుమని అరిచింది.
కుండపోతగా కరుస్తున్న వర్షంలో తడిసి ముద్దైపోతున్న ఆమెను చూసి జాలిపడి ''ఎక్కడికి వెళ్లాలి?'' అనడిగాడు.
''కరీంనగర్'' అందామె.
''ఊ అటునుంచి రా...'' అంటూ ఎడమ పక్క డోర్ తెరిచాడు. ఆమె గబగబా లారీ ముందు నుంచి వెళ్లి అటువైపు వచ్చింది.
నీళ్లోడుతున్న చీర శరీరానికి పూర్తిగా అతుక్కుపోయి వుండటం వల్ల లారీ ఎక్కేందుకు ఇబ్బంది పడింది. గత్యంతరం లేక చీరని పైవరకు లాగి దోపుకుని కాలు లోనికి పెట్టింది. శ్రీకాంత్ చప్పున చూపులు పక్కకు తిప్పుకున్నాడు. ఆమె అదేం గమనించకుండా క్యాబిన్‌లో కూచుంటూ డోర్ మూసేసింది.
''డోర్ సరిగా పడలేదు. గట్టిగా వేయి.'' అన్నాడు శ్రీకాంత్ లారీని ముందుకు పోనిస్తూ. ఆమె డోర్‌ని రెండు చేతులతో పట్టుకుని బలంగా తనవైపు లాక్కుంది.
''అ లాక్కాదు'' అంటూ వంగి ఎడమ చేత్తో డోర్‌ని మళ్లీ తెరిచి బలంగా వేశాడు శ్రీకాంత్. యాదృచ్ఛికంగా ఆమె పొట్టకి తన మోచేయి తగలడంతో ఒక్కసారి అతని ఒళ్లు జలదరించినట్టయింది. తమాయించుకుని దృష్టిని రోడ్డు మీదకు మళ్లించి లారీ వేగం పెంచాడు.
ఆమె అదేం పట్టించుకోకుండా ''అబ్బ ఏం వర్షం'' అంటూ చీర కుచ్చిళ్లని పిండుకోసాగింది.
రోడ్డు క్లియర్‌గా వున్నప్పుడల్లా అతని చూపులు ఆమె వైపే మళ్లసాగాయి. లేత పసుపు రంగు చీర, అదే రంగు జాకెట్‌లో అపరంజి బొమ్మలా వుంది. ఆమె ఒంటి ఛాయలో జాకెట్ కలగలిసిపోయింది. సన్నని నడుము పిడికిట్లో ఇమిడేలా వుంది. వయసు రెండు పదులు దాటి వుండదు. పెళ్లయిన దాఖలాలు లేవు. ఇంత వర్షంలో... ఒంటిరిగా, అదీ చీకటి పడుతున్నవేళ ప్రయాణం చేయడం, తన లారీని ఆపి ఎక్కడం అతనికి వింతగా అనిపిస్తోంది. కుచ్చిళ్లు పిండుకోవడం అయిపోయాక పైటని తీసేసి వడిపెట్టసాగిందామె. కళ్లు చెదిరిపోయాయి.
అతని చూపులు తన శరీరాన్ని తడుముతున్న విషయం ఆమెకు తెలుస్తోనే వుంది. ''ఇటు కాదు కాస్త అటు చూస్తూ నడపండి. ఏదన్నా జరిగితే ఆనక నన్నంటారు'' అందామె చిలిపిగా.
శ్రీకాంత్ సర్దుకుని కూచున్నాడు.
''కొంచెం మీ టవల్ ఇస్తారా?''
''ఊ..'' అంటూ ముందుకు వంగాడు శ్రీకాంత్. అతని సీటు వెనకున్న టర్కీ టవల్‌ని తీసుకుని తలని తుడుచుకుంది. ఆ తర్వాత రెండు చేతుల్తో టవల్‌ని తన ఎదమీద కప్పుకుని అదుముకుంది. మెడనీ, భుజాలనీ, చేతులనీ తుడుచుకుంది. ఆమె పైట ఇంకా మోకాళ్ల మీదే వుంది.
చూపులు దారిమళ్లకుండా తనని తాను నిగ్రహించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు శ్రీకాంత్. లారీలో ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం మామూలే అయినా అతనికి ఈ అనుభవం కొత్తగా వుంది.
''మీరు లారీ ఆపి ఎక్కించుకోకపోతే ఈపాటికి వర్షంలో చచ్చుండేదాన్ని'' అంది టవల్‌ని తిరిగి అతని సీటు వెనక ఆరేస్తూ.
అతనేం మాట్లాడలేదు.
పైటని ఒంటి చుట్టూ కప్పుకుంటూ తిరిగి అంది ''ఇంత పాత పాట వేశారేంటి? కొత్త పాటలేం లేవా?''
అప్పటికి 'లాహిరి లాహిరి లాహిరిలో... పాట అయిపోయి 'పయనించే మన వలపుల బంగరు నావా...'' పాట మొదలయింది.
''ఏం పాటలు కావాలి?'' రోడ్డు మీదనుంచి దృష్టి మళ్లించకుండానే అడిగాడు శ్రీకాంత్.
''ఏదైనా హృషారైన పాట!''
''అంటే?''
''బావలు సయ్యా?... సై... మరదలు సయ్యా?... సై..''లాంటిది.
ఆమె సమాధానానికి శ్రీకాంత్ ఎంత షాకయ్యాడంటే - యాక్సిలేటర్ మీద కాలు, స్టీరింగ్ మీది చేతులు పట్టుదప్పి లారీ ముందుకీ వెనక్కీ నాలుగైదు జర్క్‌లిచ్చింది.
''అబ్బే... ఊరికే అన్నాను. ఇవన్నీ బాగా విన్న పాటలే కదా అని...'' నవ్వుతూ అంది.
శ్రీకాంతేం మాట్లాడలేదు.
''ఈ లారీ మీ సొంతమేనా?'' అనడిగింది. అతను పెదవి విప్పలేదు.
''చాలా బావుంది.''
తలతిప్పి చివ్వున చూశాడు. ''మిమ్మల్ని కాదు, లారీని'' అంది
వెనకవైపు వున్న బెర్త్‌ని పరిశీలిస్తూ ''అబ్బ ఎంత విశాలంగా వుంది. ఇద్దరు పడుకోవచ్చు దీంట్లో'' అంది మళ్లీ తనే.
నిర్ఘాంతపోయాడు శ్రీకాంత్. చూడబోతే గొప్పింటి పిల్లలా వుంది. చదువుకున్న దాన్లా వుంది. ఇవేం మాటలు, ఇదేం బుద్ధి అనుకున్నాడు.
చలికి వణికిపోతున్నట్టు చేతులు కట్టుకుని ''నా పేరు జయశ్రీ... మీ పేరు?'' అనడిగింది.
''కాసేపు మాట్లాడకుండా కుదురుగా కూచోలేవా?'' కోపంగా అన్నాడు.
''ఉహు... పక్కన మనిషిలేనప్పుడు తప్ప'' అంది. ''మాట్లాడుతూ లారీ నడపడం కష్టమా?
''ఔను. నీలాంటి ఆడపిల్లలతో మరీ కష్టం''
''నాలాంటి ఆడపిల్లలంటే ... మీ ఉద్దేశం?''
''అపరిచితుల్తో కూడా వసపిట్టలా వాగేవాళ్లు అని...''
''పరిచయాలదేముంది... చేసుకుంటే అవుతాయి, మూతి ముడుచుకుని కూచుంటే అవవు. అది సరే నా పేరు చెప్పాను మీ పేరు చెప్పరా?''
''శ్రీకాంత్'' తప్పదన్నట్టు చెప్పాడు.
''అరె... మన ఇద్దరి పేర్లలోనూ శ్రీ లున్నాయి. జయశ్రీ శ్రీకాంత్ అని రాస్తే రెండు శ్రీలూ దగ్గరవుతాయి. శ్రీకాంత్ జయశ్రీ అని రాస్తే దూరమవుతాయి. చిత్రంగా వుంది కదూ?''
''...''
''ఇందాకటి ప్రశ్నకు సమాధానం చెప్పనేలేదు మీరు?''
''ఏంటి?''
''ఈ లారీ మీ సొంతమేనా అనడిగాను!''
''ఔను ... కాదు...!''
''అదేంటి?!''
''నేనే కొన్నాను కాబట్టి అవును ... బ్యాంక్ లోను ఇంకా తీరలేదు కాబట్టి కాదు.''
''అబ్బో ఏమో అనుకున్నాను. మీరు కూడా భలే మాట్లాడగలరే...!'' అంది నవ్వుతూ. ''కాకపోతే కాస్త స్టార్టింగ్ ట్రబుల్ వున్నట్టుంది' అని సణిగింది.
''ఏంటీ?!'' అన్నాడు శ్రీకాంత్ పౌరుషంగా.
''అబ్బే ఏం లేదుగానీ అటు చూడండి..అటు చూడండి'' అంది గాభరాపడిపోతూ.
హెడ్‌లైట్ల వెలుతురులో రోడ్డు మీద అడ్డదిడ్డంగా పరుగెత్తుకొస్తున్న గేదొకటి కనిపించింది. శ్రీకాంత్ లారీని బాగా స్లో చేశాడు. గేదె కొమ్ము లారీని గీచుకుంటూ పోయింది.
''ఇందాక లేదు కానీ, ఇప్పుడు బాగా చలిపెడుతోంది.''
''బెర్త్ మీద శాలువా వుంటుంది. తీసి కప్పుకో'' అన్నాడు శ్రీకాంత్.
జయశ్రీ లేచి శాలువా అందుకోబోతూ తూలి అతని మీద పడిపోయింది. ఒక్కసారిగా షాక్ తగిలినట్టయిందతనికి. ఆమె మరుక్షణమే తేరుకుని సిగ్గుపడిపోతూ ''సారీ'' అంది. ఆ స్పర్శ నుంచి తేరుకోడానికి శ్రీకాంత్‌కి మాత్రం చాలాసేపు పట్టింది.
ఆమె నిండుగా శాలువా కప్పుకుని ఏమీ ఎరగనిదాన్లా కూచుండిపోయింది.
కరీంనగర్ సమీపిస్తుండగా ఒక వ్యక్తి గొడుగు పట్టుకుని టార్చ్‌లైట్ ఊపుతూ ఎదురొచ్చాడు. శ్రీకాంత్ వెంటనే లారీ ఆపాడు. ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. జేబులోంచి యాభై రూపాయలు తీసి అతనికిచ్చి తిరిగి లారీ స్టార్ట్ చేశాడు శ్రీకాంత్.
''ఎవరతను? మీరతనికి డబ్బెందుకిచ్చారు? నన్ను చూస్తూ ఏదో అంటున్నాడేంటి?'' లారీ కదిలాక ప్రశ్నల వర్షం కురిపించింది జయశ్రీ.
''నీ కెందుకవన్నీ'' అన్నాడు శ్రీకాంత్.
''ప్లీజ్ చెప్పండి''
''తన మామూలు వసూలు చేసుకోడానికి వచ్చిన మనిషతను. దారిపోడవునా పోలీసులూ, వెహికిల్ ఇన్‌స్పెక్టర్లూ, ఆర్‌టీఓవాళ్లూ ఇట్లాగే తగులుతుంటారు మాకు''
''డబ్బివ్వకపోతే ఏం చేస్తారు?''
''ఏదో ఒక కేసు రాస్తారు. పగబడ్తారు. వేధిస్తారు.''
''మరి నన్ను చూసి ఏదో అంటున్నాడేమిటి?''
''ఎవరా పిల్ల అని అడిగాడు. లారీలో వున్న సరుకు ఓనరని చెప్పాను'' అన్నాడు.
లారీ మానేరు బ్రిడ్జి దాటి కరీంనగర్‌లో ప్రవేశించింది.
''ఎక్కడ దిగాలి?'' అడిగాడు.
''మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు?'' ఎదురు ప్రశ్నించిందామె.
''నాగ్‌పూర్ వరకు ఏం?''
''మీరు అనుమతిస్తే నేనూ నాగ్‌పూర్ వరకూ వస్తాను... ప్లీజ్...'' జాలిగా అందామె.
నిర్ఘాంతపోతూ పిచ్చిదాన్ని చూసినట్టు చూశాడు శ్రీకాంత్. ''నాగపూర్ అంటే ఏ మంకమ్మ తోటో అనుకుంటున్నావా ఏంటి?''
''నాకు తెల్సులెండి.''
''మరి సరదాగా అన్నావా?''
''కాదు. సీరియస్‌గానే అడుగుతున్నాను. నేను వరంగల్ ఆర్.ఇ.సి.లో చదువుతున్నాను. రోడ్ ట్రాన్‌సపోర్టేషన్ మీద థీసిస్ రాస్తున్నాను. అందుకే ఇట్లా పనిగట్టుకుని మీ లారీ ఎక్కాను. మీరు మంచి వారని మీతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాను'' అందామె.
శ్రీకాంత్ విస్తుపోయాడు.
''అబద్ధం కాదు. నిజం. ఒట్టు. ప్లీజ్...అన్ని దానాల్లోనూ విద్యాదానం గొప్పది'' అంది.
''సరుకు అన్‌లోడింగు... లోడింగు అయి తిరిగి రావడానికి నాకు మూడు నాలుగు రోజులు పడుతుంది.''
''ఫరవాలేదు.''
నమ్మలేనట్టుగా చూస్తూనే ''సరే నీ ఇష్టం'' అన్నాడు శ్రీకాంత్.
''థాంక్యూ ... థాంక్యూ వెరీ మచ్!'' ఎగిరిగంతేసినంత పనిచేసింది.
వర్షం ఇకా పడుతూనే వుంది. రోడ్డు మీద పెద్దగా జనసంచారం లేదు. కరెంట్ పోయిందేమో చీకటిగా వుంది రోడ్డు.
''వేడి వేడి టీ తాగాలని వుంది'' చేతులు రుద్దుకుంటూ అంది జయశ్రీ.
శ్రీకాంత్ లారీని ఓ హోటల్ ముందు ఆపాడు. ముందు తనుదిగి ఆమె డోర్ వైపు వచ్చాడు. ఈలోగా జయశ్రీ శాలువా మడతపెట్టి సీటు మీద వేసింది. పైట సరిచేసుకుని కొంగుని బొడ్లో దోపుకుంది. ఫుట్‌రెస్ట్ మీద కాలుపెట్టి దిగుతుంటే ఆసరాగా చేయి అందించాడు శ్రీకాంత్. ఆమె జారిపడిపోబోతూ అతని మెడను చుట్టేసుకుంది. ఒక్కసారిగా అతని గుండెలో విద్యుత్తు ప్రవహించినట్టయింది. క్షణకాలం అచేతనుడైపోయాడు. జయశ్రీయే ముందుగా తేరుకుని సిగ్గుపడిపోతూ దూరంగా జరిగింది.
ఇద్దరూ హోటల్లో అడుగు పెట్టారు. హోటల్లో కస్టమర్స్ ఒకరిద్దరే వున్నారు. టీకి ఆర్డరిచ్చి శ్రీకాంత్ సిగరెట్ వెలిగించాడు
''అదేంటి మీరు సిగరెట్ కాలుస్తారా?'' ఆశ్చర్యంగా అడిగింది.
''అవును ఏం?!'' అన్నాడు.
''అహ ఏంలేదు. లారీలో ఇప్పటివరకూ కాల్చకపోతేనూ...''
''దేవుడి పటం ముందు నేను సిగరెట్ కాల్చను. క్యాబిన్ నాకు దేవేలయంతో సమానం.'' అన్నాడు.
''ఓహో ఏం చేసినా క్యాబిన్ బయటే నన్నమాట.''తనలో తను అనుకుంటున్నట్టు నెమ్మదిగా అంది. ఆ మాటలోని ద్వంద్వార్థాన్ని గమనించి సూటిగా ఆమె కళ్లలోకి చూశాడు శ్రీకాంత్. ఆమె నవ్వుతూ చప్పున మొహం పక్కకు తిప్పింది. అంతలో సర్వర్ టీలు తీసుకొచ్చాడు. చెరో కప్పు అందుకుని టీ తాగడంలో నిమగ్నమయ్యారు ఇద్దరూ.
కరీంనగర్ నుంచి బయలుదేరాక వాళ్ల సంభాషణ పూర్తిగా లారీ ఫీల్డు గురించి సాగింది. లారీ ఓనర్ల, సాధక బాధకాలు, ప్రభుత్వోద్యోగుల వేధింపులు, అవినీతి, టాక్సులు, యాక్సిడెంట్లు, రోడ్ల పరిస్థితి, డ్రైవర్ల సమస్యలు, వాళ్ల వ్యసనాలు, అజ్ఞానం, పొగరుబోతుతనం మొదలైన వాటి గురించి శ్రీకాంత్ వివరిస్తుంటే జయశ్రీ శ్రద్ధగా వింది.
లక్సెట్టిపేట ఎప్పుడొచ్చిందో తెలియనేలేదు.
భోజనం చేసేందుకు లారీ ఆపాడు శ్రీకాంత్. తనకి ఆకలిగా లేదంది ఆమె. ఇంకా చాలా దూరం వెళ్లాలి. ముందు ముందు తినడానికి ఎక్కడా మంచి భోజనం దొరకదని బలవంతపెట్టాడతను. సరే అంటూ లేచింది. ఈసారి తనకు తానుగా పడిపోకుండా లారీ దిగింది.
ఆ ప్రాంతంలో వర్షం పడ్డ ఛాయలేం లేవు. ఆకాశంలో మబ్బు తునక కూడా లేదు. పైగా పుచ్చ పువ్వులా వెన్నెల కాస్తోంది.
ఇద్దరూ భోంచేస్తుండగా శ్రీకాంత్‌కు తెలిసిన డ్రైవర్లు ఒకరిద్దరు పలకరించారు. జయశ్రీ వంక అనుమానంగా చూశారు. కొందరు వెకిలిగా కామెంట్లు కూడా చేశారు. ఆ వాతావరణం, వాళ్ల మాటలు ఆమెకు మనస్తాపం కలిగించాయి. గబగబా రెండు మెతుకులు తిని వెళ్లి లారీ లో కూచుంది.
శ్రీకాంత్ మాత్రం కడుపు నిండా భోజనం చేసి తాపీగా సిగరెట్ కాల్చుకుని, వక్కపొడి నములుతూ వచ్చి లారీ స్టార్ట్ చేశాడు.
''నా మూడ్ పాడైపోయింది. ఏదైనా మంచి పాట వేయండి'' అందామె.
''నువ్వు మెచ్చే పాటలు నాదగ్గరేం లేవు కదా.'' అన్నాడు.
''పోనీ మీరే పాడండి.''
శ్రీకాంత్ గొంతు సవరించుకుని ''బావలు సయ్యా సై మరదలు సయ్యా సై'' అంటూ వెక్కిరింతగా పాడాడు.
జయశ్రీ పకపకా నవ్వింది. ''నేనేదో ఊరికే అన్నాను బాబూ. నాకు కూడా పాత పాటలంటేనే ఇష్టం'' అంది.
శ్రీకాంత్ క్యాసెట్ మార్చి టేప్ ఆన్ చేశాడు.
''ఆకాశ వీధిలో అందాల జాబిలి.... ఒయ్యారి తారను చేరి ఉయ్యాల లూగెనే... సయ్యాట లాడెనే ...''శ్రావ్యంగా వినిపించసాగింది పాట.
విండో లోంచి చందమామని చూస్తూ ''ఓహ్ మార్వలెస్'' అంది.
''ఏమిటి పాటనా..ప్రకృతా...?'' అడిగాడు.
''రెండూనూ.'' అంది.
ఓ అందమైన ఆడపిల్లని పక్కన కూచోబెట్టుకుని, వెన్నెల రాత్రి పెద్దగా ట్రాఫిక్ రద్దీలేని రోడ్డు మీద లారీ నడపడం థ్రిల్లింగ్ గా వుంది శ్రీకాంత్‌కు. శ్రమ తెలియకపోవడమే కాకుండా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, వింతగా అనిపిస్తోంది. మైలు రాళ్లు చకచకా అదృశ్యమై పోతున్నాయి.
అప్పుడే గుడిహత్నూర్ వచ్చేసింది.
జయశ్రీ బద్ధకంగా ఆవులించింది. ''టీ తాగుదామా'' అనడిగాడు.
''వద్దు మీరు తాగండి. నాకు నిద్రొస్తోంది.'' అంది. ఆ వెంటనే '' నేను నిద్రపోతే మీ డ్రైవింగ్‌మీద ఎఫెక్టేం పడదు కదా?'' అడిగింది.
''ఉహు. ఏం కాదు. బెర్త్ మీద పడుకో.'' అంటూ దాబా ముందు లారీ ఆపాడు.
అతను టీ తాగి వచ్చే సరికి జయశ్రీ బెర్త్ మీద గురకపెట్టి నిద్రపోతోంది. ఆమె కుడి చేయి తన సీటు మీద వేలాడుతోంది. 'ఈ కాలపు ఆడ పిల్లల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ముక్కూ మొహం తెలియని తనతో రాత్రి పూట, ఒంటరిగా నాగ్‌పూర్ వరకు ఏ ధైర్యంతో వస్తోందీ అమ్మాయి' అనుకున్నాడు.
సీటు మీద వేలాడుతున్న ఆమె చేతిని నెమ్మదిగా ఎత్తి ఆమె పొట్టమీద పెట్టాడు. శాలువాని నిండుగా కప్పాడు. రెప్పవాల్చకుండా రెండు క్షణాలు ఆమె మొహాన్ని తేరిపారా చూశాడు. ఎంత అందంగా వుందో' అని మనసులో అనుకోకుండా వుండలేకపోయాడు.
టేప్ రికార్డర్ ఆఫ్ చేయబోతుంటే ''నా హృదయంలో నిదురించే చెలీ.... కలలోనే కవ్వించే సఖీ...'' పాట మొదలయింది. తనకు ఎంతో ఇష్టమైన పాటల్లో అదొకటి.
పాట అయిపోయాక ఆఫ్ చేద్దాంలే అనుకుని, లారీ స్టార్ట్ చేసి, కేబిన్‌లోని లైట్ తీసేశాడు.
అతనికి హఠాత్తుగా కళ్యాణి గుర్తుకొచ్చింది.
కళ్యాణి ... తన ప్రేయసి ... కాబోయే తన శ్రీమతి.
కళ్యాణి ఇంటర్, తను డిగ్రీ సెకెండ్ ఇయర్‌లో వున్నప్పుడే తమ మధ్య ప్రేమ అంకురించింది. ఆర్థికంగా స్థిర పడ్డ తర్వాత పెళ్లి చేసుకోవాలని తాము అప్పుడే స్థిర నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ పూర్తయి రెండేళ్లు గడిచినా తనకి ఏ ఉద్యోగం దొరకలేదు. సమీప భవిష్యత్తులో దొరుకుతుందన్న ఆశ కూడా అడుగంటింది. దాంతో నాలుగు జీతం రాళ్ల కోసం మాటలు పడుతూఎవరి కిందో పనిచేయడం కంటే స్వయం ఉపాథి వెతుక్కోవడం బెటర్‌కదా అనిపించింది. ఆవిధంగా తను బ్యాంకు లోన్‌తో లారీ కొని ఈ ఫీల్డులో ప్రవేశించాడు. తన మిత్రుల్లో కొందరు ఈ ఫీల్డులో వుండటం కూడా అందుకు ఓ కారణం. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా స్థిరపడుతున్నాడు. మరో ఆరు నెలలయితే అప్పులన్నీ తీరి లారీ పూర్తిగా సొంతమవుతుంది. అప్పుడిక తమ పెళ్లికి ఏ ఆటంకమూ వుండదు.
ఈ అమ్మాయి స్థానంలో తన కళ్యాణే వుండి వుంటే ఎంత బావుండేదో. మదిలో ఆ ఊహ మెదలగానే మనసంతా అదోలా అయిపోయింది. అప్పటికే 'నా హృదయంలో నిదురించే చెలి' పాట కూడా అయిపోవడంతో క్యాసెట్‌ని రివైండ్ చేసి మళ్లీ అదే పాటను వేసుకున్నాడు.
సరిగ్గా అదే సమయంలో ''ఈ పాటంటే మీకు అంత ఇష్టమా?'' అన్న ప్రశ్న వెనక నుంచి వినిపించడంతో శ్రీకాంత్ తత్తరపడిపోయాడు.
''ఏంటీ నువ్వింకా నిద్రపోలేదా?'' ఆశ్యర్యంగా అడిగాడు.
''ట్రైన్‌లోనే నాకు నిద్రపట్టి చావదు. ఇంక లారీలో ఏం పడుతుంది?''అంది జయశ్రీ బెర్త్ మీదనుంచి కిందకు దిగుతూ.
''మరి ఇందాక గురకపెట్టినట్టున్నావ్?''
''ఊరికే. మీరేం చేస్తారో చూద్దామని. మీరు లారీ ఎక్కడం, మీ సీటు మీంచి నా చేతిని తీసి నా మీద పెట్టి శాలువా కప్పడం అన్నీ తెలుసు నాకు.'' అంటూ నవ్వింది.
బహుత్ ఖతర్‌నాక్ ఛోక్రీ అనుకున్నాడు శ్రీకాంత్ తన మనసులో.
''చెప్పండి. మీ హృదయంలో నిదురించే చెలి ఎవరు?''
''నోర్మూసుకుని పడుకోఫో'' అన్నాడు శ్రీకాంత్.
''నిద్ర రావట్లేదు అన్నాను కదా?''
''ప్రయత్నిస్తే అదే వస్తుంది.''
''సరే ముందు మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి ఆ తరువాత మళ్లీ ప్రయత్నిస్తాను.'' అంది గారంగా.
కళ్యాణి గురించి చెబితేనన్నా పిచ్చి వేషాలు వేయకుండా వుంటుందనిపించి తమ ప్రేమ వృత్తాంతం అంతా వివరించాడు శ్రీకాంత్. అప్పులతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించడం ఇష్టంలేకే ఇన్నాళ్లు ఆగాల్సి వచ్చిందని, మరో ఆరు నెలళ్లో తాము వివాహం చేసుకోబోతున్నామని కూడా చెప్పాడు.
''కళ్యాణి ఎంత అదృష్టవంతురాలో...''అంది జయశ్రీ.
''ఎందుకు?'' అన్నాడు శ్రీకాంత్.
''జీవితం పట్ల స్థిరమైన అభిప్రాయాలు, పర్‌ఫెక్ట్ ప్లానింగ్ వున్న మీలాంటి పురుషోత్తముడు ఎంత పుణ్యం చేసుకుంటే దొరకాలి ఈ రోజుల్లో. నాకు మీ కళ్యాణి మీద జెలసీగా వుంది.''
''చాలు చాల్లే. వెళ్లి పడుకో, ఇక.'' కసురుకున్నాడు శ్రీకాంత్.
''అ లాగే...! ఆ ల్ ది బెస్ట్! ఇక మళ్లీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే ఒట్టు'' అని తిరిగి బిస్తరెక్కింది జయశ్రీ. అన్నట్టుగానే కాసేపట్లోనే నిద్రలోకి జారుకుంది. లారీ నాగపూర్ పొలిమేరల్లో ప్రవేశించేవరకూ ఆమె లేవలేదు.
నాగపూర్ వచ్చేక బెర్త్ మీంచి కిందకు దిగుతూ ''అరె, అప్పుడే తెల్లారిపోయిందా?'' అంది ఆశ్చర్యపడిపోతూ.
''తెల్లారడం కాదు. పదికావస్తోంది.''అన్నాడు శ్రీకాంత్. ''లారీలో నిద్రే పట్టదని ఓ పెద్ద గోల చేశావుగా అప్పుడు?''
జయశ్రీ సిగ్గు పడిపోయింది.
''నన్ను కొంచెం రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయరా? ట్రైన్‌లో కాజీపేటకు వెళ్లి పోతాను.'' అర్థిస్తున్నట్టుగా అడిగింది.
శ్రీకాంత్ ఆశ్చర్యపడుతూ ''అదేమిటి? ఇంత హఠాత్తుగా మనసు మార్చుకున్నావేం?'' అన్నాడు.
''మరేం లేదు. ఇంట్లో చెప్పిరాలేదు. ఆందోళన పడ్తారేమోనని.'' అంటూ నసిగింది.
''సరే గానీ ఇంకోసారెప్పుడూ ఇట్లా పిచ్చి పిచ్చి సాహసాలు చేయకు. నీకే మంచిది కాదు. ఈ లారీని ఇక్కడే కంపెనీ దగ్గర అప్పగించి స్టేషన్‌కు వెళ్దాం'' అన్నాడు శ్రీకాంత్.
''సరే'' అని బుద్ధిగా తలూపింది.
... ఃఃః ... ఃఃః
హుజురాబాద్ తిరిగి చేరుకున్న జయశ్రీ నేరుగా కళ్యాణి ఇంటికి పరుగు పరుగున వెళ్లింది.
హుషారుగా వస్తున్న స్నేహితురాలిని అ ల్లంత దూరం నుంచే చూసిన కళ్యాణి గుండెలు దడదడలాడాయి.
జయశ్రీ వస్తూనే కళ్యాణిని వాటేసుకుని గిరగిరా తిప్పుతూ ''నువ్వే గెలిచావే. నీ ఫియాన్స్ నిజంగా హీరోనే.'' అంది సంతోషంగా.
''నువ్వు... నిజంగా అన్నంత పనీ చేశావా? ఆయనతో లారీలో వెళ్లావా? నిజంగా?'' నమ్మలేకపోతున్నట్టుగా అడిగింది కళ్యాణి.
''ఆ బేషుగ్గా వెళ్లాను. ఇక్కడి నుంచి కరీంనగర్ వరకు కాదు, ఏకంగా నాగ్‌పూర్ వరకు వెళ్లాను'' గర్వంగా అంది జయశ్రీ.
''ఎంత ధైర్యమే నీకు. అసలు ఎట్లా వెళ్లావు. ఏం జరిగింది వివరంగా చెప్పు'' కుతూహలాన్ని ఆపుకోలేకపోయింది కళ్యాణి.
''చెబుతున్నా కదే. నీ నిర్ణయం సరైందే. నీ కాబోయే భర్త నిజంగా చాలా ఉత్తముడు. లారీ ఫీల్డ్ మీదా, డ్రైవర్ల మీదా నాకున్న దురభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. చేసే వృత్తి ఏదైతేనేం మనసు సరిగా వుండాలి. శ్రీకాంత్ రియల్లీ ఎ జెమ్.''
''నిజమా?''
''ఒట్టు. ఎన్ని రకాలుగా కవ్వించినా అస్సలు హద్దు మీరలేదు. చాలా హుందాగా ప్రవర్తించాడు. పైగా మాటల సందర్భంలో తను నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో కూడా చెప్పాడు.''
కళ్యాణి భావగర్భితంగా నవ్వింది.
తన స్నేహితురాలినుంచి తను ఆశించిన రియాక్షన్ రాకపోయేసరికి ''ఏంటే ఒంట్లో బాగో లేదా?'' అని అడిగింది.
''అబ్బే, బాగానే వుంది'' అంది కళ్యాణి.
'' మరి...? నేను ఎంతో ఇన్‌వెస్టిగేట్ చేసి అందించిన వార్తకు ఎగిరి గంతేస్తావనుకుంటే ఇట్లా బెల్లం కొట్టిన రాయిలా అయిపోయావేంటి?'' అనుమానంగా చూస్తూ అడిగింది జయశ్రీ.
''లేదే నాకెంతో ఆనందంగా వుంది.''
''ఉహు... నీ మొహం చూస్తుంటే నాకలా అనిపించడం లేదు. నువ్వేదో దాస్తున్నావు. నిజం చెప్పు, లేకపోతే నా మీద ఒట్టే.'' కళ్యాణి చేతిని బలవంతంగా లాక్కుని తన తల మీద పెట్టుకుంది జయశ్రీ.
దాంతో కళ్యాణి కాసేపు తటపటాయించింది. ఆ తరువాత నిర్వికారంగా చూస్తూ ''నీ దగ్గర దాపరికం ఎందుకు ... నేను...నేను... శ్రీకాంత్‌కి ఈ విషయం ముందే లెటర్ ద్వారా తెలియజేశాను.'' అంది.
''అంటే.....'' కెవ్వుమని అరిచింది జయశ్రీ.
''జయశ్రీ అనే గడుగ్గాయి నిన్ను పరీక్షించడానికి వస్తోంది. జాగ్రత్తగా ప్రవర్తించమని...''
మాట పూర్తికాకముందే ''ఛీ .........'' అంటూ ఆమెను ఒక్క తోపు తోసింది జయశ్రీ. ఆ విసురుకు కిందపడిపోబోయి అతి ప్రయత్నం మీద నిలదొక్కుకుంది కళ్యాణి.
''ఎంత ద్రోహం చేశావే. నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది కదే. ఇందుకా ఆ మానవుడు అపర ప్రవరాఖ్యుడిలా ప్రవర్తించాడు. మీరిద్దరూ కలిసి నన్ను ఫూల్‌ని చేశారన్నమాట. ఛి...ఛి... చ్ఛీ...ఇక జన్మలో నీ మొహం చూడను'' ఆక్రోశంగా అంది జయశ్రీ.
''అది కాదే నామాట విను. ఈ ప్రయోగం వికటించి... సరసం కాస్తా విరసంగా మారి ... నీ కేదైనా జరిగితే నేను తట్టుకోగలనా చెప్పు. ఆ భయంతోనే అట్లా లెటర్ రాశాను తప్ప నిన్ను అవమానించడానికి కాదే... ప్లీజ్ నన్ను అర్థం చేసుకో....'' అర్థిస్తూ అంది కళ్యాణి.
''చాలు చాల్లేవే. నేను నీకు ముందే చెప్పాను కదా. కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్‌ని. నన్ను నేను రక్షించుకోగలను. నాకేం కాదని. అయినా నా మాట నమ్మకుండా, నాకు తెలియకుండా అతనికి ముందే లీక్ చేస్తావా? బుద్ధుందా నీకు. ఇక అఘోరించు. ఈ మాత్రం దానికి ముందే గట్టిగా వద్దనలేకపోయావా?'' కోపంతో ఊగిపోయింది జయశ్రీ.
వాళ్లు అ లా వాదులాడుకుంటుండగానే ''పోస్ట్...'' అంటూ పోస్ట్‌మెన్ వచ్చి కళ్యాణికి రెండు ఉత్తరాలు యిచ్చి వెళ్లాడు.
ఓ ఉత్తరాన్ని చూసి ''అరె...! ఇది నేను రాసిన ఉత్తరమే. శ్రీకాంత్‌కి అందలేదన్నమాట'' అంది నిర్ఘాంతపోతూ.
జయశ్రీ గభాల్న ఆ ఉత్తరాన్ని కళ్యాణి చేతుల్లోంచి లాక్కుంది. శ్రీకాంత్ చిరునామా కొట్టివేయబడి 'అడ్రస్సీ నాట్ ఫౌండ్' అని ఎర్ర పెన్నుతో రాసి వుంది. ఈసారి నిర్ఘాంతపోవడం ఆమె వంతయింది.
ఈలోగా కళ్యాణి రెండో కవర్ తెరిచింది. అది శ్రీకాంత్ తనకు రాసిన ఉత్తరం. అప్రయత్నంగా కళ్యాణితో పాటు జయశ్రీ కూడా దానిని కలిసి చదివింది. అందులో స్వీట్ నథింగ్స్ ఏమీ లేవు. ''తాము అనుకోకుండా వరంగల్ నుంచి హనుమకొండకు మకాం మార్చినట్టు తెలిపాడు. ఇదివరకటిది చిన్న ఇల్లు, ఇప్పుడు తీసుకున్నది చాలా పెద్ద ఇల్లు, పెళ్లయ్యాక తమకు చాలా కన్వీనియంట్‌గా వుంటుందని రాశాడు. ఇక నుంచి ఉత్తరాలు కొత్త అడ్రస్‌కి రాయమని'' సూచించాడు.
వాస్తవం బోధపడిన తరువాత స్నేహితురాళ్లిద్దరూ కాసేపు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కొయ్యబారిపోయారు.
ఃఃః ఃఃః ఃఃః
(స్వాతి సపరివార పత్రిక 18-3-1994 సంచికలో ప్రచురించబడిన ''సరసమైన కథ'' యిది. ఫోను సౌకర్యం విస్తరించక ముందు, సెల్‌ఫోన్లు ఆవిర్భవించక ముందు, ఉత్తరాల కాలంలో రాసిన కథ. స్వాతి సంపాదకులకు కృతజ్ఞతలతో -ర)
...................

Wednesday, July 1, 2009
సారే జహాసే అచ్ఛా ... కథ
కథ
నగరం నిద్రకు ఉపక్రమించే వేళ ఒకటీ అరా వాహనాల కదలిక తప్ప రోడ్లన్నీ నిర్మానుష్యమైపోయాయి. ఆకాశంలో పుచ్చపువ్వులా వెన్నెల విరగకాస్తోంది.
ఉండి ఉండి చల్లగా పిల్ల తెమ్మెరలు వీస్తున్నాయి.
చంద్రిగాడి గుండె కువకువలాడుతోంది. నరాల్లో రక్తం ఉడుకెత్తిపోతోంది. పక్కనే పడుకుని వున్న పెళ్లాం మీంచి వచ్చే ఆడవాసన వాడిని ఉన్మత్తుణ్ని చేస్తోంది.
నెమ్మదిగా ఆమెవైపు ఒత్తిగిలి నడుంమీద చేయి వేశాడు.
ఒక్కసారి షాక్ తగిలినట్టు ఉలిక్కి పడింది మల్లి. విసురుగా భర్త చేతిని వెనక్కి విసిరికొట్టింది.
చంద్రిగాడి ఉత్సాహమంతా నీరుగారిపోయినట్టయింది. కోపంగా పళ్లు పటపట కొరుక్కున్నాడు.
వాళ్లిద్దరికీ కొంచెం దూరంగా పడుకునివున్న మల్లి తండ్రి ఖళ్లు ఖళ్లు మని దగ్గడం మొదలుపెట్టాడు.
ఆ ముసలాడి దగ్గుకు రాత్రి పగలు అనే భేదం ఏమీ వుండదు. కాకపోతే అప్పుడప్పుడూ కొన్ని క్షణాల పాటో, నిమిషాలపాటో విరామం యిస్తుంటుందది. అంతే!
మరికాసేపటికే చంద్రిగాడి కోపం తగ్గి మల్లి మీద మళ్లీ తాపం పెరిగింది. ఈ సారి ఆమె జబ్బ మీద చేయివేసి తనవైపు తిప్పుకోబోయాడు. మల్లి గింజుకుంది. అయినా వాడి పట్టు సడలలేదు. పెళ్లాం మీద తనకు సర్వహక్కులు వున్నాయన్న స్పృహ వాడిని రెచ్చగొడ్తోంద
మగడివైపు తిరిగినట్టే తిరిగి రెండు చేతులూ వాడి చాతిమీద వేసి ''ఎహలే...'' అంటూ బలంగా తోసింది. దాంతో చంద్రి గాడు పట్టు సడలి వెల్లకిలా అయిపోయాడు. అదే అదనని ఆమె వాడికి రెండడుగులు ఎడంగా జరిగి పడుకుంది.
చంద్రిగాడిలో ఒక్కసారి కోపం, కసి, బాధ పెల్లుబికాయి.
అప్పటికి వాళ్ల పెళ్లయి నెల రోజుల పైనే అయింది!
పేరుకు పెళ్లయితే అయింది కానీ ఇంత వరకూ 'కార్యం' మాత్రం కాలేదు!!
అసలు మల్లి మనసులో ఏముందో వాడికి అంతుబట్టకుండా వుంది. తనంటే ఇష్టం లేదని అనుకుందామా అంటే ... ఒక్క రాత్రిపూట తప్ప పగలస్తమానం తనని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. చెరువుగట్టుకు తీసుకెళ్లి సుబ్బరంగా వీపు రుద్దుతుంది. తలంటుతుంది. అప్పుడప్పుడు వద్దన్నా వినకుండా కాళ్లు కూడా పడుతుంది.
కానీ, రాత్రయితే చాలు తనకి దూరంగా వుంటుంది!
ఎంత జుట్టు పీక్కున్నా వాడికి కారణం కనిపించడంలేదు. పక్కనే ముసలి తండ్రి వున్నాడని బిడియమా? అట్లా అయితే ఇట్లా ఎంత కాలం? ముసలాడు చచ్చే వరకూ తన గతి ఇంతేనా?
వాడు అసహనంగా అటూ ఇటూ పొర్లుతూ వుండిపోయాడు.
ముసలాడికి దగ్గు తెమ్మర ఎక్కువ కావడంతో లేచి కూచున్నాడు. ఫిరంగులు పేలుతున్నట్టు అతి భయంకరంగా వుంది ముసలాడి దగ్గు.
''అయ్యా...!'' ఆందోళనగా పిలిచింది మల్లి. ''గిన్ని మంచినీళ్లు గిట్ల తాగుతవా?'' అని అడిగింది.
''నువ్వింక నిద్రపోలేదా బిడ్డా?'' దగ్గుతూనే అడిగాడు ముసలాడు.
''నా నిద్ర కేం ముంచు కొచ్చింది తియ్యి గని, మంచి నీళ్లియ్యనా?''
''వద్దు బిడ్డా! గింత ఉప్పు గల్ల వుంటె ఇయ్యి.''
మల్లి లేచి ముంతలోంచి నాలుగు ఉప్పు రవ్వలు తెచ్చి తండ్రికి యిచ్చింది. దగ్గుకు దరిద్రులు వాడే పరమ ఔషదం ఉప్పే!
రెండు రవ్వలు జాగ్రత్తగా నాలిక కింద పెట్టుకుని చప్పరించాడు ముసలాడు. దగ్గు ఆపుకోడానికి విశ్వప్రయత్నం చేస్తూ మళ్లీ వీళ్ల వైపు వీపు పెట్టి నడుం వాల్చాడు. అతను పొరపాట్న కూడా వీళ్ల వైపు తిరగడు.
చిరిగిన బొంత తండ్రి మీద కప్పి నిట్టూర్చింది మల్లి. మొగుడి వైపు చూస్తే అతను రెండు చేతులు దగ్గరగా మడచుకుని వాటిమీద మొహం పెట్టి బోర్లా పడుకుని వున్నాడు. పున్నమి వెన్నెల్లో ఏ ఆచ్ఛాదనా లేని వాడి వీపు నల్లగా నిగనిగలాడుతోంది.
మొగుడి అవస్థ చూసి జాలనిపించింది మల్లికి. కొంచెం దగ్గరగా వెళ్లి వాడికి ఆనుకుని పడుకుంది. అయినా వాడిలో చలనం రాలేదు.
''కోప మచ్చిందా?'' తల మీద చేయి వేసి గారంగా గుసగుసగా అడిగింది.
''అహ... సంబడం'' కసిగా అన్నాడు చంద్రిగాడు.
''ఉష్...జర మెల్లెగ మాట్లాడు. నాయిన ఇంటడు.'' అంది గాభరాగా.
''ఎహెపో... దూరంగ జరుగు'' అని కసురుకున్నాడు వాడు, తల ఎత్తకుండానే.
మొగుడి కోపం ఎంత తారాస్థాయిలో వుందో మల్లికి అర్థమయిపోయింది. ఎలగైనా అతడిని ప్రసన్నం చేసుకోవాలని మరింత దగ్గరగా జరిగింది. ఆమె వక్షోజాలు వాడి పక్కటెముకల్ని మెత్తగా తాకాయి. అర్థనగ్నంగా వున్న వాడి శరీరం మీద చేయి వేసి ప్రేమగా నిమిరింది.
చంద్రిగాడి శరీరంలో నెమ్మదిగా మళ్లీ వేడి రాజుకుంది. వాడి కోపం కరిగిపోయింది. చప్పున పక్కకు తిరిగి ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. ఆబగా మొహమంతా ముద్దులు పెట్టుకున్నాడు.
మల్లి తమకంలో తేలిపోతూనే ''వద్దు అయ్య లేస్తడు ... ఇక్కడద్దు ...ఇక్కడద్దు'' అంటూ గింజుకుంది.
''ఇక్కడ కాకపోతే ఇంకెక్కడే...'' అంటూ వాడు ఆగకుండా పెళ్లాన్ని పూర్తిగా ఆక్రమించేశాడు.
''చంద్రిగాడి శరీరం బరువుకు ఊపిరాడనట్టయింది మల్లికి. ఎంత ప్రయత్నించినా వాడిని కొంచెం కూడా కదల్చలేకపోయింది.
సరిగా అదే సమయంలో తిరిగి ఫిరంగులు పేలడం మొదలయింది.
ఖళ్...ఖళ్...ఖళ్...
చంద్రిగాడు హడలి పోతూ పెళ్లాం మీంచి పక్కకు దొర్లాడు. ముసలాడి తల బద్దలు కొట్టాలన్నంత కోపం వచ్చింది వాడికి. కసిగా నేల మీద పిడి గుద్దులు గుద్దాడు. అందులో ఒక్క దెబ్బ చాలు ముసలాడి ప్రాణాలు గుటుక్కు మనిపించడానికి!
తండ్రి వైపు తలతిప్పి చూసింది మల్లి. ఆయన దుప్పట్లో మునగదీసుకునే ఖళ్లు ఖళ్లు మని దగ్గుతున్నాడు. నిస్సహాయంగా నిట్టూర్చింది.
ఇటు చూస్తే చంద్రిగాడు జుట్టు పీక్కుంటున్నాడు. జాలిగా పక్కకు జరిగి వాడి చెంప నిమిరింది. కోపంతో తల విదిలించాడు.
చప్పున వాడి మీదకు వంగి ''ఇక్కడ లాబం లేదు గని అమ్మోరి గుడి దగ్గరికి పోదాం రా'' అంది చెవిలో గుసగుసగా.
''గిప్పుడు గుడికెందుకే?'' విసుగ్గా అన్నాడు వాడు.
''ఆ.. గందుకే'' అని కిసుక్కున నవ్వింది మల్లి.
వాడికి అర్థమై దిగ్గున లేచి కూచున్నాడు. వాడి చేయి పట్టుకుని చడీ చప్పుడు కాకుండా గుడివైపు నడిపించింది మల్లి.
గుడంటే అదేం పెద్ద గుడి కాదు. నిలువెత్తు కూడా లేని చిన్న గోపురం లాంటి కట్టడం. రోడ్డుకు కొంచెం దిగువన కాలువ పక్కన వుంటుంది. గుళ్లో అస్తవ్యస్తంగా చెక్కి రంగు పులమబడ్డ ఓ గ్రామ దేవత విగ్రహం వుంటుంది. అయ్యగారు కానీ, కాపలా వాడు కానీ ఎవరూ వుండరు అక్కడ. ఆ గుడికి అసలు తలుపులు కూడా లేవు.
అక్కడైతే కాస్త మరుగుంటుందని మల్లి ఉద్దేశం. వారం రోజుల కిందటనే ఆ 'చోటు'ని గుర్తించింది. కానీ అమ్మోరి గుడిలో 'పాడు పని' చేయాలంటే బుగులనిపించి ఒక నిర్ణయం తీసుకోలేక సతమతమైపోయింది. అమ్మోరికి ఆగ్రహం వస్తే ఇంకేమైనా వుందా ఈ నాలుగు మెతుకుల 'భాగ్యం' కూడా లేకుండా పోదూ! అయితే ఆమెకు అంతకంటే మెరుగైన చోటు ఆ మహానగరంలో మరెక్కడా కనిపించలేదు.
ఇటు చూస్తే మొగుడు ఆగేటట్టు లేడు. చూస్తుండగానే తమ పెళ్లయి అప్పుడే నెల రోజులు దాటిపోయింది. ''పెళ్లి చేసుకుని ఏం లాభం?''
మొగుడితో తన కోరిక తీర్చుకోవాలనే భావన కంటే మొగుడిని సంతోష పెట్టాలనే తపన ఎక్కువయిపోయింది మల్లికి.
అయినా తాము చేసేదేమీ లం... తనం కాదు కదా! కట్టుకున్న మొగుడితో చేసేది 'పాపం పని' ఎట్లా అవుతుంది? దేవతలు మాత్రం ఆ పని చేసుకోరా? అని ఈ వారం రోజులుగా తనకు తాను నచ్చ జెప్పుకుంది. 'చల్లని తల్లి అమ్మోరు ఏమీ అనుకోదు. పైగా ముచ్చటపడి పండంటి కొడుకు పుట్టేలా ఆశీర్వదిస్తుంది.'
రోడ్డు మీద నడుస్తూనే రోడ్డు కిరుపక్కలా వున్న బంగళాల వైపు ఈర్ష్యగా చూసింది మల్లి. వాటిలో వుండే జంటలు అనుభవించే సుఖాన్ని తలచుకుని ఒక క్షణం అసూయపడింది.
''ఛీ ముదనష్టపు బతుకు. తినడానికి తిండి లేదు. కట్టుకోడానికి సరైన బట్టలేదు. వుండటానికి గింత తడిక చాటన్న లేదు.'' తన దౌర్భాగ్యాన్ని తనే నిందించుకుంది మల్లి.
''ఇంకెక్క డున్నదే గుడి?'' అసహనంగా అడిగాడు చంద్రిగాడు. వాడికి మహ తొందరగా వుంది.
వాడికి ఇట్లాంటి ఆలోచనలేవీ రావు. అది వాళ్ల అదృష్టం... ఇది నా ఖర్మ అనే భావనతో రాజీ పడిపోయాడు వాడు.
మొగుడు పడుతున్న ఉరుకులాటను చూసి మల్లి మురిసిపోయింది.
''దగ్గర పడ్డత్తియ్యి ...'' అంటూ ప్రేమగా వాడిని గిల్లింది.
''ఇహిహి...'' అని నవ్వి వాడు పెళ్ళాం భుజం మీదున్న తన చేయిని ఆమె గుండెల మీదికి జరుపబోయాడు.
''ఊ ఏంటిదా తొందర...'' అని ఆ చేయిని అట్లాగే ఒడిసి పట్టుకుంది.
వాళ్లు గుడి దగ్గరకు చేరారు. గుడి పక్కన పెద్ద వేప చెట్టు వుండటం వల్ల గుడిమీద వెన్నెల ప్రసరించడంలేదు. దగ్గరలో వీధి లైటు కూడా లేకపోవడం వల్ల అక్కడంతా మసక చీకటిగా వుంది. కీచురాళ్లు కర్ణకఠోరంగా అరుస్తున్నాయి.
మల్లి గుడి ఎదురుగా నిలబడి ''తప్పయితే చమించు తల్లీ...'' అని దండం పెట్టుకుని చెంపలేసుకుంది. చిరిగిన జాకెట్టులోంచి పసుపు తాడును బయటికి లాగి కళ్లకు అద్దుకుంది.
మల్లి ఇంకా తాత్సారం చేయడాన్ని సహించలేక ''నడువెహె...'' అంటూ ముందుకు తోశాడు చంద్రిగాడు.
''ఆగు. అమ్మోరికి దండం పెట్టుకోవద్దా?''
''గిప్పుడా దండం పెట్టుకునేది? నడు నడు...!'' వాడికి బొత్తిగా 'భక్తి' లేదు, భయం లేదు.
మల్లి భర్త చేతిని గట్టిగా పట్టుకుని గుబులు పడుతూనే గుడిలోకి అడుగు వేయబోయింది.
అంతే...!
''ఓరేయ్ ఎవర్రా అదీ...'' అని గుళ్లోంచి బిగ్గరగా మగ కంఠం అరుపు వినిపించింది. మల్లి పై ప్రాణాలు పైనే పొయినట్టయ్యాయి.
ఒక్క క్షణం ఏమీ అర్థం కాక గజగజ వణికి పోయింది. ఆతరువాత ఆమెకు గుళ్లో రెండు ఆకారాలు కనిపించాయి. ఒక ఆడా ఒక మగా!
తాము శోభనం గదిలా వాడుకోవాలనుకున్న గుడిని అప్పటికే ఎవరో ఆక్రమించేశారని అర్థమైపోయింది.
''మల్లీ ఏమైందే ? ఎవరు వాళ్లు?'' దూరంగా జరిగిపోయిన మల్లి గురించి గాల్లో చేతులు ఆడిస్తూ అయోమయంగా అడిగాడు చంద్రిగాడు.
చప్పున వాడి చేయి అందుకుని ''ఎవరో మనకెందుకు గని పోదాం రా...'' అంది మల్లి.
''ఎక్కడికి?''
''ఎక్కడినుంచి వచ్చినమో గక్కడికె''
''థూ నీ యవ్వ. నేను రాను పో. ఇయ్యాల్టి సంది నీకు నాకు ఏం సంబంధంలేదు పో. నువ్వు నాకు పెళ్లానివే కాదు. నేను నీకు మొగుడ్నే కాదు పో నీ యవ్వ....'' మల్లి చేయిని గట్టిగా విదిల్చి కొట్టి ముందుకు పోబోయాడు వాడు. రెండడుగులు వేశాడో లేదో కాలికి రాయి తగిలి బోర్లా పడిపోయాడు.
చంద్రిగాడికి రెండు కళ్లూ లేవు!
దయగల ప్రభువుల, ధర్మ తల్లుల మనసు కరిగి దానం చేయాలంటే ముష్టి వాళ్లకి ఏదో ఒక అంగవైకల్యం వుండాలి. అందుకే వాడి రెండు కళ్లల్లో చిన్నప్పుడే జీళ్లు పోశారు.
మల్లి గబగబా కుంటుతూ వెళ్లి మొగుణ్ని లేవదీసేందుకు ప్రయత్నించింది. ఆమెకు ఒక కాలు సొట్ట. ఒకరికొకరు తోడుగా వుంటారన్న ఉద్దేశంతో తోటి ముష్టివాళ్లంతా నెల రోజుల కిందే వాళ్లిద్దరికీ సంబంధం కుదిర్చి పెళ్లి చేశారు.
చంద్రి గాడికి నా అనే వాళ్లెవరూ లేరు. మల్లికి మాత్రం రేపో మాపో అనే ముసలి తండ్రి వున్నాడు.
చంద్రిగాడికి కళ్లు లేకపోయినా శ్రావ్యమైన కంఠస్వరం వుంది. స్వయంగా చిన్న డప్పును వాయిస్తూ ఎంతో మధురంగా పాటలు పాడతాడు.
''ఉందిలే మంచి కాలం ముందు ముందూనా ...
అహ అందరూ సుఖ పడాలీ నంద నందానా ......''
''కారులో షికారు కెళ్లే పాల బుగ్గల పసిడీ దానా ...
బుగ్గ మీదా గులాబి రంగూ ఎలా వచ్చెనో తెలుప గలవా...?''
చాలా మంది ముఖ్యంగా ఫాక్టరీ కార్మికులు, కాలేజీ పిల్లలు వాడి చేత కోరి కోరి ఇట్లాంటి పాటలు పాడించుకుంటుంటారు. తను పాడే పాటల్లోని భావం వాడికి తెలుసో తెలియదో కానీ అవి అందరినీ అ లరించి దండిగా డబ్బులు రాలుస్తుంటాయి.
చంద్రిగాడితో ముడిపడక ముందు ముసలి తండ్రితో మల్లి బతుకు దుర్భరంగా వుండేది. ఒకోసారి సరైన తిండి దొరక్క ఆకలితో నకనకలాడాల్సి వచ్చేది.
అట్లాంటిది ఇప్పుడు చంద్రిగాడి 'దండి' సంపాదనతో ఆమె బతుకు 'హాయి'గా గడిచిపోతోంది. అందుకే మల్లికి చంద్రిగాడంటే వల్లమాలిన ప్రేమ!
ఎలాగోలా వాణ్ని బతిమిలాడి, బామాలి మళ్లీ తాముండే ధర్మసత్రం అరుగు మీదికి చేర్చింది. చాలామంది ముష్టివాళ్లు మాంచి నిద్రలో జోగుతున్నారక్కడ. తన ముసలి తండ్రి అటుతిరిగి అట్లాగే దగ్గుతున్నాడు. ఉత్సాహమంతా చచ్చిపోయిన చంద్రిగాడు తన శాశ్వత చీకటిని మునిగిపోయి కసికసిగా ఏవో ఆలోచించుకుంటూ వెల్లకిలా పడుకున్నాడు. మల్లి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో కాసేపు అట్లాగే కూచుండి పోయింది.
అంతలో ఎక్కడి నుంచే ఒక ఆడ కుక్క అటు వేపు పరుగెత్తు కొచ్చింది. దాన్ని వెంబడిస్తూ వెనకాలే ఓ మగకుక్క కూడా వుంది.
మల్లి తదేకంగా వాటినే చూడసాగింది.
చాటుకోసమేమో ఆడ కుక్క అటు తిప్పి ఇటు తిప్పి ఇక లాభం లేదనుకుని నడి రోడ్డులో ఆగి మగ కుక్కకు లొంగిపోయింది.
తనలో తను నవ్వుకుంది మల్లి. తమ బతుకులు ఈ కుక్కల కంటే ఏమంత గొప్పగా వున్నాయి గనక? అసలు తమని మనుషులుగా గుర్తించేదెవరు? జంతువులకు లేని సిగ్గు తమకెందుకు?
ఏదో స్థిర నిశ్చయానికొచ్చేసింది మల్లి.
ఒంటి మీదున్న చిరుగు పాత బట్టల్ని తీసి పారేసి వివస్త్రగా మారింది. మొగుడి చేయిని తీసుకుని తన గుండెల మీద వేసుకుంది.
మెత్తటి స్పర్శ! చంద్రిగాడికి ఒక్కసారి వళ్లు ఝల్లు మంది. గబగబా ఆమె శరీరమంతా తడిమాడు. ''మల్లీ...!'' అన్నాడు నమ్మలేకపోతూ.
''అవును మామా. నీ మల్లినే...రా... '' అంటూ మొగుడ్ని తన మీదకు లాక్కుంది.
ఇప్పుడామెకు ముసలి తండ్రి దగ్గు వినిపించడంలేదు. పక్కన తోటి ముష్టివాళ్లు దొంగ చూపులు చూస్తుంటారేమో అన్న భావన భయపెట్టడం లేదు. మనస్ఫూర్తిగా, తెగువగా తనను తాను మొగుడికి అర్పించుకుంది.
ఆ మర్నాడు ...
కొత్తగా నేర్చుకున్న హిందీ పాటను మహోత్సాహంగా పాడి రెట్టింపు కలెక్షన్లు సాధించాడు చంద్రిగాడు.
''సారే జహాసే అచ్ఛా... హిందూ సితా హమారా...
( స్వాతి సపరివార పత్రిక 10 జూన్ 1988 సంచికలో ప్రచురించబడిన కథ ఇది. స్వాతికి మరో మారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ)
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఒక మాట
సాహిత్యం సమాజానికి మేలు చేయకపోయినా కీడు మాత్రం చేయకూడదని నమ్మే వాళ్లలో నేను కూడా ఒకడిని. ఈ దృష్ట్యానే కొందరు సరసాన్ని తృణీకరిస్తారు. సరసం లేకపోతే జీవితం ఎంత నిస్సారంగా వుంటుందో అది అవధులు దాటితే అంత ప్రమాదకరంగా కూడా పరిణమిస్తుంది.
నేను నాలుగు సరసమైన కథలు రాశాను. ఆ నాలుగింటి లోనూ సామాజిక దృక్పథం / స్పృహ కూడా వుందనీ, పాఠకుల్ని అవి ఆరోగ్యకరమైన ఆలోచనలవైపే నడిపిస్తాయనీ, సమాజానికి ఎట్లాంటి కీడూ చేయవనే అనుకుంటున్నాను. (లేదా భ్రమిస్తున్నాను).
ఈ కథ మీద వచ్చే ప్రతిస్పందనలను బట్టి మిగతా ఆ మూడు కథల్ని నా బ్లాగులో పెట్టాలో లేదో నిర్ణయించుకుంటాను. ఆ మిగతా మూడు కథలు: ''కొత్త పెళ్లి కొడుకు'', ''బంగినపల్లి మామిడిపండు'', ''లాహిరి లాహిరి లారీలో...''

Subscribe to:
Posts (Atom)