Khairlanji, A Strange and Bitter Crop by Anand Teltumbde
2006 సెప్టెంబర్ 29 నాడు మహారాష్ట్రలోని ఖైర్లాంజీ గ్రామంలో సురేఖా భోట్‌మాంగే అనే మహిళనూ, ఆమె కూతురు ప్రియాంకా భోట్‌మాంగేనూ వివస్త్రల్ని చేసి, నగ్నంగా ఊరేగించి, వారిపై సామూహికంగా అత్యాచారం జరిపి హత్యచేశారు.
వారితోపాటు సురేఖ కుమారులు రోషన్, సుధీర్‌లను కూడా దారుణంగా కొట్టి చంపారు. ఈ పాపంలో గ్రామస్తులంతా పాలుపంచుకున్నారు. తరువాత ఆ నాలుగు శవాలనూ తీసుకెళ్లి పక్కనే వున్న కాలువలో పడేశారు.
భోట్‌మాంగేలు దళితకులానికి చెందినవాళ్లు. జనం అప్పుడే వాళ్లని మరిచిపోయారు. ప్రతి రోజు సగటున ఇద్దరు దళితులు ఈవిధంగా హత్యకు గురయ్యే ఈ దేశంలో ఇదో మామూలు విషయమైపోయింది. స్వాతంత్య్రానంతరం మన దేశంలో జరిగిన కులపరమైన అత్యాచారాల్లో అత్యంత దారుణమైన ఖైర్లాంజీ ఉదంతాన్ని ఆనంద్ తెల్‌తుంబ్డె ఈ పుస్తకంలో నిశితంగా విశ్లేషించారు. మన చుట్టూ ఖైర్లాంజీలు పదేపదే ఏవిధంగా, ఎందుకు పునరావృతమవుతున్నాయో వివరించారు.
21వ శతాబ్దపు భారతదేశంలో ఒక దళిత కుటుంబాన్ని బహిరంగంగా, సంప్రదాయకంగా ఊచకోతకోసిన సంఘటనపై ఆనంద్ తెల్‌తుంబ్డే చేసిన ఈ విశ్లేషణతో మన సమాజం ఎంత కుళ్లిపోయివుందో అర్థమవుతుంది.
ఈ ఊచకోత వెనకవున్న కారణాలనూ, ఇ లాంటి కిరాతకాలు జరగడానికి దోహదం చేస్తున్న సామాజిక, రాజకీయ అంశాలనూ, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సమాచార ప్రసార మాధ్యమాలు అన్నింటినీ ఎండగడుతుంది. సమాజంలో పశుప్రవృత్తి పెరగడానికి, ఆతరువాత వాటిని కప్పిపుచ్చడానికి అవన్నీ ఎలా తోడ్పడుతున్నాయో వివరిస్తుంది.
భూస్వామ్య వ్యవస్థ అవశేషాలనో అంతిమదినాలనో అభివర్ణించే పుస్తకం కాదిది. భారతదేశంలో ఆధునికత అంటే అర్థమేమిటో తెలియజెప్పే పుస్తకం. సమకాలీన భారతదేశంలో అత్యంత ముఖ్యమైన అంశాన్ని లోతుగా చర్చించిన పుస్తకం.
- అరుంధతీ రాయ్
..................................................................................................................................
మానవ మృగాలు చెలరేగిన నేల ఖైర్లాంజీ
ఒక చేదు పాట
ఆనంద్ తెల్ తుంబ్డే రచించిన KHAIRLANJI, A Strange And Bitter Crop కు తెలుగు అనువాదం
" మానవ మృగాలు చెలరేగిన నేల... ఖైర్లాంజీ ... ఒక చేదు పాట "
ఆవిష్కరణ సభ
08 అక్టోబర్ 2012, సోమవారం, సాయంత్రం 6-00 గంటలకు
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో
.
అధ్యక్షత :................... ప్రొఫెసర్ కే. సత్యనారాయణ, EFLU
ముఖ్య అతిధి :............ ఆనంద్ తెల్ తుంబ్డే
ఆవిష్కర్త :.................. కే. ఆర్. వేణుగోపాల్ IAS Retired
పుస్తక పరిచయం :......ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
ప్రచురణ కర్తలు :.........మలుపు బుక్స్
పుస్తక అనువాదకులు: ప్రశాంత్, ప్రభాకర్ మందార
Malupu Books
2-1-1/5, Nallakunta,
Hyderabad- 500044
Email ID :........ malupuhyd@gmail.com
Malupu Blog:... http://malupu.wordpress.com
.
No comments:
Post a Comment