Thursday, December 17, 2009

అన్నదమ్ముల్లా కలసీ వుండలేం...అన్నదమ్ముల్లా విడిపోనూలేం! ... వహ్వా తెలుగువాడా!!

...



''మనవాళ్లు (తెలుగువాళ్లు) ఉఠ్ఠి వెధవాయిలోయ్‌...'' మహాకవి గురజాడ వందేళ్ల క్రిందట అన్నమాట యిది. అదేమాటని ఇవాళ యావద్భారతదేశం అనేలా వుంది!

కాంగ్రెస్‌, తెలుగుదేశం, ప్రజారాజ్యం తదితర పార్టీలన్నీ నిన్న మొన్నటి వరకూ ప్రత్యేక తెలంగాణాకు అనుకూలమే అంటూ వచ్చాయి. తమ ఎన్నికల మానిఫెస్టోల్లో కూడా ఈ అంశాన్ని చేర్చాయి. ఎన్నికల ప్రచారంలో తెలంగాణా ప్రజలకు వాగ్దానాలు చేశాయి. ప్రత్యేక తీర్మానాలు చేశాయి.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిల పక్షసమావేశంలో సైతం ''మీరు అసెంబ్లీలో తెలంగాణా తీర్మానం పెట్టండి. మేం సమర్ధిస్తాం'' అని చేతిలో చెయ్యేసి మరీ చెప్పాయి. (ఎట్లాగూ వాళ్లు పెట్టేదీ లేదు-మేం సమర్థించేదీ లేదు అన్న ధీమా కాబోలు. అందుకే ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా ఆ తతంగం చాలాకాలంగా జరుగుతున్నా మీరు అట్లా తీర్మానాలు ఎట్లా చేస్తారు అని అడగలేదు).

ఆ మాటలు నమ్మి కేంద్ర ప్రభుత్వం తెలంగాణా ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధపడిందో లేదో ఒక్కసారిగా పార్టీలన్నీ ఇన్నాళ్లుగా తాము కప్పుకున్న తెలంగాణా సానుకూల ముసుగును తీసి అవతల పారేసి సమైక్య ... తెలంగాణా వ్యతిరేక విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తున్నాయి.

రాజకీయమా నీ పేరు అవకాశ వాదమా?
అవకాశవాదమా నీ పేరు రాజకీయమా??
మాటతప్పే వాడే - మాట మార్చేవాడే నేటి హీరోనా???!!!

తెలంగాణా పట్ల 1956 నుంచీ ఆంధ్ర రాజకీయ నాయకులు ఇట్లాగే ''పైకి ఒకటి లోపల ఒకటి''గా వ్యవహరిస్తూ తెలంగాణా ప్రజలను వంచిస్తూ వస్తున్నారు.

''పెద్దమనుషుల ఒప్పందం, ముల్కీనిబంధనలు, ఆరు సూత్రాల పథకం, ఎన్‌టీఆర్‌ జారీ చేసిన 610 జీవో, వైఎస్‌ఆర్‌ అట్టహాసంగా నిధులూ అధికారాలూ ఇవ్వకుండా ఉప్పునూతలకు క్యాబినెట్‌ ర్యాంక్‌ ఇచ్చి మరీ నెలకొల్పిన ''తెలంగాణా ప్రాంతీయ అభివృద్ధి మండలి'' ఇట్లా ఎన్నైనా ఉదాహరణలు పేర్కొనవచ్చు.

ఇప్పుడిక ఏ హామీలిచ్చినా తెలంగాణా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
ఆంధ్ర రాజకీయ నేతలంటేనే తెలంగాణా ప్రజలకు ఎలర్జీ ఏర్పడింది.
ఇన్నాళ్లూ అమ్ముడు పోతూ వచ్చిన తెలంగాణా నేతలు కూడా ఇప్పుడు సిగ్గుపడుతున్నట్టనిపిస్తోంది.

సామ, దాన, భేదోపాయాలన్నీ అయిపోయాయి !
ఇక మిగిలింది దండోపాయమే !!
కాబట్టి బలప్రయోగంతోనైనా సరే సమైక్యతను కాపాడాలనే మొండితనంతో .... ప్రపంచంలో ఎక్కడా లేని '' బలవంతపు సమైక్యతా '' ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు!

ఉత్తరాంధ్ర నిరుపేద బామ్మగారు కూడా ఈ ఉద్యమాన్ని అధర్మం, అన్యాయం అంటోంది.! (జాజిమల్లి బ్లాగు http://jajimalli.wordpress.com చూడండి)

... '' ఆళు...మీ తోటి ఉండమని తెగేసి సెప్పేస్తంటే... ఈళే టొలే వదలవంటున్నారు. ఈ బావులు సేస్తన్న పని నాకేటి బావులేదు ''


శకుని పాచికల మోసానికి బలై శిక్షను పూర్తిగా అనుభవించి, అన్ని రకాల వేధింపులను భరించి మరీ వచ్చి ఒప్పందం ప్రకారం మా రాజ్యం మాకివ్వండని పాండవులు మర్యాదగా అడిగినప్పుడు ధుర్యోధనుడు ఇవ్వనిరాకరించినందువల్లే నాడు కురుక్షేత్ర సంగ్రామం సంభవించిన సంగతి మనకు తెలుసు.

ఇప్పుడు తెలంగాణా ప్రజల న్యాయమైన డిమాండ్‌ కూడా ఆనాటి లాగే మరో కురుక్షేత్రం వైపే వెళ్తోందా? ఎందుకు, ఎవరికోసం, ఎంతమంది అమాయకులు బలికావాలి? ఎవరి మానాన వారు బతకడానికి అభ్యంతరం ఎందుకు? ఏ రాష్ట్రం ఏర్పడినా జరగని దిక్కుమాలిన సంత ఇక్కడే ఎందుకు జరుగుతోంది?

ఈ సమస్యకు శాశ్వత పరిష్కార మార్గమే లేదా ....?
ఆంధ్ర తెలంగాణాలు సామరస్యంగా విడిపోయే అవకాశమే లేదా....?
మరో కురుక్షేత్ర సంగ్రామాన్ని నివారించే ఉపాయమే లేదా.........?



.........

11 comments:

  1. people who are in the samikya andhra movement were
    not having clear idea on their movement.if vasantha nageswara rao have fame ,this movement will become jai andhra movement.the present samaikya andhra movement will further catalyse (speedup) the separation of state

    ReplyDelete
  2. *ఇన్నాళ్లూ అమ్ముడు పోతూ వచ్చిన తెలంగాణా నేతలు కూడా ఇప్పుడు సిగ్గుపడుతున్నట్టనిపిస్తోంది.*

    మందార గారు,
    తెలంగాణా నేతలు ఎమీ సిగ్గు పడటం లేదు. కాక పోతె కేంద్రప్రభుత్వం ఇంత తొందరగా ఒప్పుకొంటోందని ఎవరు ఊహించలేక పోయారు. ఇప్పుడు తెలంగాణా నేతలకి పదవుల కొరకు ఆశలు మొదలైయినాయి. అందువలననే పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నారు ఒక సారి జీవన్ రేడ్డి వ్యాఖ్యలను చూడండి, కె.సి.యర్. మీద పోటి చేసినప్పుడు ఎమ్మన్నాడు ఇప్పుడేమంటున్నాడు. ఆంధ్రా ప్రాంత నేతలు వ్యతిఎకిస్తుంటే ఇప్పుడు వాళ్ళకు రాబోయె పదవులు పోతున్నాయని బాధ పడుతున్నారు అంతే.
    ---------------------------------------------
    మరో కురుక్షేత్ర సంగ్రామాన్ని నివారించే ఉపాయమే లేదా.........?
    పోరాటాలు చేయడానికి స్పష్టమైన అజెండా ఉండాలి, తెలుగు ప్రజలకు ఎప్పుడు రెండు అజెండాలు. చూస్తున్నాము గదా అందరి వాదాలు. ఇటువంటి రెండు అజెండాల వారు కలసి కురుక్షేత్ర సంగ్రామచేయ లేరు. అందరు రాజకీయాలు చేయటం మొదలు పెడితె ఎవరిని ఎవరు నమ్మలేక ఇతరులను నమ్మించ లేక సమస్యకి సుదూర దూరం లో పరిష్కారం కాన రాక విసుగెత్తి వేసారి ఆత్మహత్యలు చేసుకోవలసిందే. అదే జరగ బోయెది జరుగు తున్నాది.

    ReplyDelete
  3. మందార గారు,
    మీరు మీలాంటి వాళ్ళ తప్పు కూడా ఒప్పుకుంటే బాగుంటుంది . ప్రజల మధ్య మీరు చిచ్చు పెట్టాలా ? ఇదేనా మీ నాయకులూ మీరు వేరే రాష్ట్రము అడిగే తీరు. ఇవాళ సగం ప్రజలు ఎందుకు ఇలా చేస్తున్నారో మీకు తెలుసా ? మీరు మీ నాయకులూ పారేసుకున్న నోళ్లకు ,పిచ్చోళ్ళు అని మీ ఇష్టం వచ్చిన వాగుల్లకు . ఈ జనానికి తెలియదా ఒక వేళ ఇవాళ రాష్ట్రం విడిపోకపోయినా ఇల్లాంటి సమస్యలు తలెత్తవని . ఒక మీరు అనుకుంటునట్లు హైదరాబాద్ లో ఆస్తులు కారనమైతే ఇప్పుడు రాష్ట్రము విడిపోకపోయినా అదే పరిస్తితి అని అందరికి తెలుసు. దోపిడీ దోపిడీ ఎవరు దోచుకుంటున్నారు అందుకు సామాన్య జనాలే మీద మీకు అంత కసి . ఒక ౫౦ కాదు ౧౦౦ ఏండ్లు ఈ ప్రాంతం లో ఉన్న మీకు ఆంధ్రోల్లు గానే కనపడతారు మన అనే భావన మీరు పెంచుకోనివ్వరు. ఎక్కడ ఆంధ్ర అంతా బాగు పడింది అని అంత ఏడుస్తున్నారు ఒక్కసారి అక్కడ పల్లెలు చూసారా ఎల్ల ఉన్నాయో యువత లేక ముసలి ముతక కాలం గడుపుతున్నారు . అంత అభివృద్ధి చెందితే ఎందుకు ఈ వలసలు . తెలంగాణాకు ఉన్న అదృష్టం రాజధానికి దగ్గర గా ఉండడం ఈ ౨౪ గంటల న్యూస్ వాళ్లకు అందుబాటు లో ఉండటం వాళ్ళు దానికి ప్రచారం ఇవ్వటం . దీని మొలనే మీ నాయకులూ ఇప్పుడు మోనార్క్ లు .వాళ్ళు ఏమి చేసిన న్యూస్.

    contdd...

    ReplyDelete
  4. దానికి తోడూ ఈ పనికి మాలిన మానవ హక్కులు వాళ్ళు , వాళ్ళకు మీ జనాల సమస్యలు తప్ప ఆంధ్ర వాళ్ళను పట్టిచుకునే తీరికేది , ఇక్కద జనాలకు కాలే కడుపులక్కన్నా దానికి ఎవరో ఒక్కళ్ళు ని అడిపోసుకోనికి ఎవరో ఒకళ్ళు దొరకాలి అందుకు ఆంధ్ర వాళ్ళు బాగా దొరికారు మీకు. ఎందుకు ఇవాళ పరిస్తితి చూడండి జనాలు నీరహదీక్షలని , ౧౦ రోజులనుండి రోడ్డు పడి కొట్టుకుంటుంటే దిక్కు లేదు , అదే మీ కెసిఆర్ గారు పళ్ళ రసాలు , ఇడ్లీ లలో దీస్ఖ చేస్తుంటే ఆ దేశం ముంగిపోఎంట కవరేజి . ఇది చూస్తుంటే కూడా మీకు ఏమి అనిపించటం లేదా . ఎవరు వెనకబద్దరో ఎవరు తెలివి కల వాళ్ళో . ఈ వాళ ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే ఈ దారుణాలు కారణం కెసిఆర్ అతని అనుచరులు చేసిన డ్రామా , నిజం గా న్యాయం ధర్మం ఉంటె వీళ్ళందరి ఉసురు పోసుకొని కెసిఆర్ కుళ్ళి కుళ్ళి ఈ భాధలన్నీ అనుభవించాలి .

    ReplyDelete
  5. plz visit www.raki9-4u.blogspot.com
    for telangaanaa songs

    ReplyDelete
  6. ఆంధ్ర రాజకీయ నేతలంటేనే తెలంగాణా ప్రజలకు ఎలర్జీ ఏర్పడింది.
    ఇన్నాళ్లూ అమ్ముడు పోతూ వచ్చిన తెలంగాణా నేతలు కూడా ఇప్పుడు సిగ్గుపడుతున్నట్టనిపిస్తోంది.

    >>అవును నిజమే సిగ్గు పడాలి ఒక సారి పోయి మీ గద్దర్ అన్నాను అడగండి ఈయన గారు కొడుకులను ఎవరు సాకిరో సిగ్గు లేని మూక ఇప్పుడెల్లి వాళ్ళ బడి నే నాశనం చేస్తారు ఇవే బుద్దులు తినేవి తిన్టనే ఉంటారు మళ్ళి నగనాచి కబుర్లు ఛీ సిగ్గు లేని బతుకులు . మీ అవసరాలు ఆంధ్రోల్లు కావలె కెసిఆర్ లాంటి పిచ్చ గాళ్లు డబ్బులు తీసుకుని దీక్షలు జేస్తే వాడి ఏనాకలా బడి అందే అన్ద్రోల్లను తిడుతుంటారు .

    ReplyDelete
  7. నిన్న గాక మొన్న వరదలు వచ్చి మహబూబ్నగర్ మునిగి పొతే అక్కకేల్లె దిక్కు లేదు మీ కెసిఆర్ కి హెలికాప్టర్ లో వెళ్లి యాడ ప్రాణాలు పోతాయో నని నంగి నంగి నడకల్ నడిచి వచ్చిదిండు ఇప్పటిదాకా దిక్కు లేదు ఇవేవి పట్టవు మీకు ప్రతి దానికి ఎప్పుడు ఆంధ్రోల్లు దొరుకుతారు మీకు ఆడిపోసుకోనీకి .

    ReplyDelete
  8. so called telangana saviours should have think of this before their vicious campaign against other parts. now its too late; one calls the other AndhrA nazia and they reply as telabans. we ccant be united and the division also seem very difficult as the stakes are too high. KCR needs power, Lagadapati needs money they will do anything to meet their ends.
    It will be a miracle if the state gets divided without a bloodshed and I pray for that!!

    -Karthik

    why am i unable to paste the matter from lekhini in ur comment box? did you make any settings to prevent??

    ReplyDelete
  9. ఎవరు వద్దనుకొన్నా లేక కావాలనుకొన్నా, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో ఒక్కో అడుగు ముందుకు పడుతూ, కార్యాచరణ సాగిపోతూనే ఉంది. ముఖ్యంగా ఈ రోజు పరిణామాలు ఈ విషయాన్ని విశదీకరిస్తున్నాయి. సమైక్యాంధ్ర కోసం కేంద్రం నుండి స్పష్టమైన హామీని తీసుకొస్తామని ఢిల్లీకి బయలుదేరిన J.C. దివాకర రెడ్డి, T.G. వెంకటేశ్, సాయంత్రానికల్లా మొహాలు వేళ్ళాడదీసుకొని, MLAలంతా రాజినామాలు వెనుకకు తీసుకోవాలని, విద్యార్థులు ఉద్యమాలు ఆపేయాలని కోరారు. ప్రక్రియ ప్రారంభమైందని, బిల్లు రాష్ట్రపతి వద్దకు త్వరలో వెళుతుందని, ఆయన దానిని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానానికి పంపిస్తారని వారి మాటల ద్వారా స్పష్టంగా అర్థమయింది. వారు ఆంధ్రా ప్రజలకు ఏం చెప్పుకోవాలో తోచక, " అధిష్ఠానం ఆ తీర్మానాన్ని ఆత్మప్రబోధానుసారం ఓటు వేసి ఓడించే అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆందోళన చెందనక్కర లేదని చెప్పింది." అని చిలుక పలుకులు పలికారు. కాని వారు అదంతా లాంఛనమేనని తెలియని అమాయకులేం కారు. లోగడ ’మద్రాసు’ రాష్ట్రం నుండి ’ఆంధ్ర’ రాష్ట్రం ఏర్పర్చినప్పుడు, మద్రాసు అసెంబ్లీలో తీర్మానం వీగిపోయినా, పార్లమెంటులో బిల్లు పెట్టి, రాష్ట్రాన్ని ఏర్పర్చిన విషయం ఈ వృద్ధ జంబుకాలకు తెలియనిది కాదు. ఇటీవల ’బీహార్’ నుండి ’జార్ఖండ్’ రాష్ట్రం ఏర్పడింది కూడా ఇలాగేనని మనందరికీ తెలుసు. ఏమీ తెలియక, మోసపోతున్నది ’ఆంధ్రా’ ప్రాంతపు అమాయక ప్రజలే. నాకు బాగా ఆశ్చర్యం కలిగించే విషయం - ఆ ప్రాంతంలో ’యూనివర్సిటీ’ స్థాయి విద్యార్థులకు ఈ మాత్రం అవగాహన, లోకజ్ఞానం లేకపోవడమే.

    ReplyDelete
  10. @Karthik

    Right click in comment box and select 'This Frame'

    ReplyDelete
  11. ఇంకొక 2 తల్లులని పేట్టుకుంటె బాగుంట్టుంది. ఒకటి మీ ఊరి తల్లి ర్నెడొది మీ వీధి తల్లి.

    ReplyDelete