Monday, December 14, 2009

తెలంగాణా వద్దు - సమైఖ్య ఆంధ్ర ముద్దు : ఒక పాట ……



తెలంగాణా వద్దు - సమైఖ్య ఆంధ్ర ముద్దు : ఒక పాట ……

సమైక్యత ఆవశ్యకతను చాటుతూ నిన్న (2009 డిసెంబర్‌ 13) సాయంత్రం నుంచీ దాదాపు అన్ని ఛానెళ్లలో ఒక పాట ప్రకటన రూపం లో పదేపదే వినిపిస్తోంది.. అనేకవిధాలుగా ఆలోచింప జేసేదిగా వున్న ఆ పాట:

ఓయి తెలుగు వాడా...

ఓయి తెలుగు వాడా!
పద అదే వెలుగు వాడ
మన కలల పసిడి మేడ
తగ దింటి నడుమ గోడ! ... ఓయి తెలుగువాడా...

ఇటురా ఓ సోదరుడా
ఓ నా చెలికాడా
ఇటురా ఓ సోదరుడా
ఓ నా చెలికాడా

మనదే ఈ పెద్ద చెట్టు
ఈ చల్లని నీడ ........ మనదే ...

ఆంధ్ర, సీమ, తెలంగాణ
ఒక్కొక్కొ టొక ఊడ
ప్రతి ఊరూ, ప్రతి పల్లె
తెలుగు చెట్టు కాడ

పట్టిచ్చా వనుకో ఇపుడూ
''వేరుపాటు చీడ''
ఇంకేమున్నది?
ఏమున్నది??
ఏమున్నది???
ఏమున్నది .... ????

ఓయి తెలుగు వాడా!
పద అదే వెలుగు వాడ
మన కలల పసిడి మేడ
తగ దింటి నడుమ గోడ! ... ఓయి తెలుగువాడా...

జాతి మహా యాత్ర
ఇలా సాగే పోవాలి గాని
నడుమన మన అడుగులు
తడబడి పోతే
నడకలలో వడి పోతే
మనకు మనకు చెడి పోతే
గొంతుకలన్నీ విడి పోతే
కలయిక సందడి పోతే
ఒక స్నేహపు ముడి పోతే ... చెడి పోతే ...

ఏమున్నది?
ఏమున్నది?
ఏమున్నది?
ఏమున్నది?

ఓయి తెలుగు వాడా!
పద అదే వెలుగు వాడ
మన కలల పసిడి మేడ
తగ దింటి నడుమ గోడ! ... ఓయి తెలుగువాడా...

తగదింటి నడుమ గోడ
తగదింటి నడుమ గోడ.....!

…………………………………………………………………..

వింటూ రాసుకోవడంలో ఏవైనా పొరపాట్లు దొర్లివుంటే సరిదిద్ద గలరు.
మరో మాట సమైఖ్య - సమైక్య వీటిలో ఏది సరైన పదం?



……………………………………………………………………

7 comments:

  1. సమైఖ్య అనేది తప్పు! సమ+ఐక్య= సమైక్య ..ఇది కరెక్ట్!

    పాట ఆలోచింపజేసేలాగానే ఉంది. ఎవరు రాశారో తెలీడం లేదు..ప్రకటన కాబట్టి!

    దీని వెనక రాజకీయ ప్రయోజనం ఆశించడం ఏదైనా ఉందా అనేది ఆలోచించాల్సిన విషయం!

    ReplyDelete
  2. గజల్స్ శ్రీనివాస్ పాడినట్టుగా ఉంది. అతనే వ్రాసిఉండవచ్చు.

    ReplyDelete
  3. vaddu babo ante..inka samikya antaru enduko teliyadu..telangana lo gulli gulli velli adagandi..cheptaru..telangana kaavali ani.

    ReplyDelete
  4. జై సమైక్యాంధ్ర. తెలబాన్లు, ఆంధ్ర జిన్నాలను ఉరితీయాలి.

    ReplyDelete
  5. మీ అంధ్రావాళ్ళు -- మీ ఆంధ్రావాళ్ళు అంటూ మాట్లాడే తెలంగాణా వేర్పాటువాదులకి - ఈ పాట ఒక కనువిప్పు కావాలి. మనల్ని విడగొడితే వేరే వాళ్ళ ప్రయోజనాలు నెరవేరుతాయన్న విషయం అందరికీ అర్ధం అయితే బాగుండు. అన్నగారు అన్నట్లు - వచ్చిండన్నా, వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటే నన్నా. తెలుగు జాతి మనది . నిండుగ వెలుగు జాతి మనది. దయచేసి తెలుగు వారంతా సమైక్యంగా ఉండాలని అందరమూ ప్రయత్నిద్దం. రొట్టె కోసం పిల్లులు కొట్టుకుంటుంటే మధ్యలో కోతి దాన్ని ఎగరేసుకుపోయినట్లు, మనకు వచ్చే కాసిని కేటాయింపులూ, పెట్టుబడులు కూడా రాకుండా కొందరు స్వార్ధ పరులు పన్నే పన్నాగాన్ని ప్రజలు అర్ధం చేసుకుని, వారిని తిప్పి కొట్టాలి. ఈ రాష్ట్రం తెలుగు వారందరిదీ. తెలంగాణా విడిపోతే వారికి ఈ మాత్రం నిధులు కూడా రావు సరికదా, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలనుంచీ మావోయిష్టుల ముప్పు పొంచి ఉంది. మన అభివృధ్ధి మన చేతుల్లోనే ఉంది. విడిపోతే అభివృద్ధి ఆగిపోతుంది. కలిసుంటే అభివృధ్ధి పెరుగుతుంది.

    ReplyDelete
  6. nijangaa Develop aitE gitE jillaakO raashTrangaa khanDinchinaa tappu lEdu. KCR laanTi raajakeeya nirudyOgula family business kaitE sasEmiraa vaddu

    Sankar

    ReplyDelete
  7. Mari telangana thalli paata?

    Chala bagundi kadu...., Kaloji kavithalu manchi message nu isthunnayi kadu..

    Meeku nachevi oka emotion kaavali, adi edina paravaledu. Anthe kaani manchi msg vunnavi nachavukada.

    Meeru inka Nizaam palanalo leru.. Melukondi.
    Sayudhaporatam kaadu .... Verpatu vaadam kaadu..

    Nizaanni aloochinchu...
    Needina marganni enchuko...
    Niggadeesi adugu nee nayakulanu ninda emani...
    Niladeesi aduugu nikrustulanu nizam emitani..

    Nizanga neeku nirdistamina alochana vunte..

    JAI ANDHRAPRADESH JAIJAI ANDHRAPRADESH

    ReplyDelete