Monday, October 29, 2012

సీమాంధ్ర నగరాల్లో బతుకమ్మ ఎందుకు కనిపించదు ?





తెలంగాణా లో సరే...

డల్లాస్ లో బతుకమ్మ...
కాలిఫోర్నియాలో బతుకమ్మ...
న్యూ జెర్సీ లో బతుకమ్మ ...
అట్లాంటాలో బతుకమ్మ ...
డెట్రాయిట్ లో బతుకమ్మ ...
చికాగోలో బతుకమ్మ ...
బోస్టన్ లో బతుకమ్మ ...
వాషింగ్టన్ లో బతుకమ్మ ...
టోరంటో లో బతుకమ్మ
సిడ్నీ లో బతుకమ్మ ...
లండన్ లో బతుకమ్మ...
బెర్లిన్ లో బతుకమ్మ ...
దుబాయ్ లో బతుకమ్మ ..

కానీ .....
విజయవాడలో నో బతుకమ్మ ....
విశాఖపట్నం లో నో బతుకమ్మ ...
రాజమండ్రి లో నో బతుకమ్మ ...
కడపలో నో బతుకమ్మ ...
తిరుపతి లో నో బతుకమ్మ ...

ఎందుకు?
సీమాంధ్ర నగరాల్లో ఎక్కడా
పట్టుమని పదిమంది
తెలంగాణా ఆడ పడచులే లేరా ??????

ఆరు దశాబ్దాల సమైక్యత ఫలితంగా
తెలంగాణలో ఏ నగరం లో చూసినా
వేలకు వేల సంఖ్యలో
ఆంద్ర ఆడపడచులు కనిపిస్తారు కదా

ఆంద్ర నగరాల్లో తెలంగాణా ఆడపడచులు
లేకపోవడం ఏమిటి?!
కారణాలు ఎవరైనా విశ్లేషించ గలరా ...?



Wednesday, October 24, 2012

కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు సునీల్‌ గంగోపాధ్యాయకు నివాళి ...


కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు, సుప్రసిద్ధ బెంగాలీ కవి, కథా రచయిత సునీల్‌ గంగోపాధ్యాయ (78)  23 అక్టోబర్‌ 2012 తెల్లవారు జామున రెండు గంటలకు కోల్‌కతాలో, గుండెపోటుతో మరణించారన్న వార్త విషాదాన్ని కలిగించింది.

2010 ఆగస్ట్‌ 20న గోవాలో వారి చేతుల మీదుగానే నేను కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదక పురస్కారాన్ని  అందుకున్నాను.  (డా. యాగాటి చిన్నారావు గారి  'దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ' అన్న థీసిస్‌ను ''ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర'' పేరిట చేసిన అనువాదానికి, 2009 సంవత్సరానికి గాను ఈ బహుమతి లభించింది. ఆ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ వారు ప్రచురించారు).

అకాడమీవారు పంపించిన బహుమతి ప్రదానోత్సవ ఫొటోను నేను షోకేసులో భద్రంగా దాచుకోవడం వల్ల ఈ రెండేళ్లలో వారు నాకు ఎంతో సుపరిచితుడిలా మారారు.

సునీల్‌ గంగోపాధ్యాయ 200కు పైగా పుస్తకాలు ప్రచురించారు. అనేక కథలూ, నవలలూ, బాల సాహిత్యం, యాత్రా రచనలు చేశారు. అయితే ఆయనకు కవిత్వమంటేనే ఎక్కువ ఇష్టం. స్వయంగా క్రృతిబాస్‌ అనే కవిత్వ మాసపత్రికను నిర్వహిస్తూ అనేక మంది యువకవులను ప్రోత్సహించారు. వారి 'నీరా' కవితలు బెంగాల్‌లో ఆబాల గోపాలనాన్ని ఆకుట్టుకున్నాయి.

వారు రాసిన కొన్ని నవలలను సత్యజిత్‌ రే ( అరణ్యర్ దిన్ రాత్రి , ప్రతిద్వంది ) , గౌతం ఘోష్ ( అబర్ అరణ్య  ) వంటి ప్రఖ్యాత దర్శకులు చలన చిత్రాలుగా మలిచారు. తన పేరుతోనే కాకుండా ''నీల్‌ లోహిత్‌, నీల్‌ ఉపాధ్యాయ్‌, సనాతన్‌ పాఠక్‌'' వంటి కలం పేర్లతో కూడా ఆయన రచనలు చేశారు.

సునీల్‌ గంగోపాధ్యాయ 1985 లో " సి సమోయ్ (అప్పటి రోజులు)" నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు.
ఆ తరువాత ఐదు సంవత్సరాలు ఉపాధ్యక్షులుగా పనిచేసి 2008లో కేంద్ర సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్‌ నగరంలో వుంటున్నారు. అతను వచ్చిన తరువాత అంత్యక్రియలు జరుగుతాయి.

సునీల్‌ గంగోపాధ్యాయ మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను.








.



Wednesday, October 17, 2012

" తెలంగాణా కలం పై కత్తి " - అల్లం నారాయణ ...


వాళ్లు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు
నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి మాట్లాడలేదు

తర్వాత వాళ్లు యూదుల కోసం వచ్చారు
నేను యూదును కాదు కాబట్టి ఎదురు మాట్లాడలేదు

తర్వాత వాళ్లు కార్మిక నాయకుల కోసం వచ్చారు
నేను కార్మిక నాయకుడిని కాదు కాబట్టి మాట్లాడలేదు

తర్వాత వాళ్లు క్యాథలిక్కుల కోసం వచ్చారు
నేను ప్రొటెస్టెంట్‌ను కాబట్టి మాట్లాడలేదు

చివరకు వాళ్లు నా కోసం వచ్చారు
అప్పటికి నా కోసం మాట్లాడేందుకు ఎవరూ మిగిలిలేరు.

- మార్టిన్‌ నీమోల్లర్‌
(జర్మినీలో నాజీల పాలన గురించి)

ఇవాల్టి (17 10 2012 ) నమస్తే తెలంగాణా సంపాదకీయం
" తెలంగాణా కలం పై కత్తి " చదవండి 


http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=76911&boxid=96896896


http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=76921&boxid=96918792



Sunday, October 14, 2012

నందిని అధిరోహించిన రెండు తెలంగాణా పోరాట పాటలకు వందనం !



నందిని అధిరోహించిన రెండు తెలంగాణా పోరాట పాటలకు వందనం !

రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా

రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా
రక్త బంధం విలువ నీకు తెలియదురా
నుదుటి రాతలు రాసే ఓ దేవ దేవా
తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా //రాతి//

తెలిసుంటె చెట్టంత నా కొడుకును
తెలిసుంటె చెట్టంత నా కొడుకును
తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలో... //రాతి//

పువ్వులో పూవునై నీ పూజ చేశాను
నీరై నీ అడుగు పాదాలు కడిగాను
ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను
దిక్కు నీవని చెప్పి ధీమాగ బతికాను
నా కన్నకొడుకుపై ఈశ్వరా...ఆ...
నా కన్న కొడుకుపై ఈశ్వరా
నీ కరుణ ఏమైందిరా శంకరా
నీ సతికి గణపతిని ఇచ్చావురా
నీ సతికి గణపతిని ఇచ్చావురా
ఈ తల్లి పై నీ మతి ఏమైందిరా ... //రాతి//

శివరాత్రి నీ శిలకు నైవేద్యమైనాను
దీప మారాకుండ పడిగాపు లున్నాను
నీ కళ్లలో వేకువ దీవెననుకున్నాను
కడుపులో పేగునూ కోస్తవనుకోలేదు
తొలుసూరు కొడుకనీ ఈశ్వరా... ఆ...
తొలుసూరు కోడుకనీ ఈశ్వరా
నీ పేరు పెట్టుకుంటీ శంకరా
అందుకే వేశావా ఈ శిక్షనూ
అందుకే వేశావా ఈ శిక్షనూ
అమరవీరుణ్ని చేశావా నా కొడుకును ... // రాతి//

ఆడజన్మల వున్న అర్థాన్ని వెతికాను
అమ్మా అనె పిలుపుకై అల్లాడిపోయాను
చిననోట నా కొడుకు అమ్మని పలికితే
ఆడజన్మని నేను గెలిచెననుకున్నాను
పురిటినొప్పుల బాధ ఈశ్వరా... ఆ...
పురిటినొప్పుల బాధ ఈశ్వరా...
నీ పార్వతిని అడగరా శంకరా
తల్లిగా పార్వతికి ఒక నీతినా
ఈ తల్లి గుండెల మీద చితిమంటలా... //రాతి//

-మిట్టపల్లి సురేందర్ ( పోరు తెలంగాణా)

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

పొడుస్తున్న  పొద్దుమీద  నడుస్తున్న  కాలమా 
పోరు  తెలంగాణమా 

అదిగో  ఆ  కొండల నడుమ  తొంగి  చూసే ఎర్రని  భగవంతు డెవడు  ... సూర్యుడు ఆ  ఉదయించే  సూర్యునితో  పొడుస్తున్న  పొద్దుతో
పోటీ పడి  నడుస్తుంది  కాలం , అలా  కాలంతో  నడిచినవాడే  కదిలిపోతాడు , ఓ  పొడుస్తున్న  పొద్దు  వందనం...  వందనం

ఆ .. పొడుస్తున్న ..బలే  బలే  బలే  బలే  బలే  బలే ...
పొడుస్తున్న  పొద్దుమీద  నడుస్తున్న  కాలమా
పోరు  తెలంగాణమా - పోరు  తెలంగాణమా
కోట్లాది  ప్రాణమా... కోట్లాది  ప్రాణమా...  //పొడుస్తున్న  పొద్దుమీద //

ఓ  భూతల్లి  సూర్యుడిని  ముద్దాడిన  భూతల్లి , అదిగో  చిన్నారి  బిడ్డల్ని  జన్మనిచ్చింది , అమ్మా  నువ్వు  త్యాగాల  తల్లివి  త్యాగాల  గుర్తువు

భూతల్లి  బిడ్డలు  చిగురించే  కొమ్మలు
చిదిమేసిన  పువ్వులు  త్యాగాల  గుర్తులు
హా... మా  భూములు  మాకేనని ...  బలే  బలే  బలే  బలే  బలే హా.
మా  భూములు  మాకేనని  మర్లబడ్డ  గానమ
తిరగబడ్డ  రాగమా  మర్లబడ్డ  రాగమా  తిరగబడ్డ  రాగమా
పోరు  తెలంగాణమా  .. కోట్లాది  ప్రాణమా. //పొడుస్తున్న  పొద్దుమీద //


అమ్మా  గోదావరి  నీ  వొడ్డున  జీవించే కోట్లాది  ప్రజలకు  జీవనాధారము , అమ్మా  కృష్ణమ్మా  కిల  కిల నవ్వే  కృష్ణమ్మా
అమ్మా  మీకు  వందనం

గోదావరి  అలలమీద  కోటి కలల  గానమా
కృష్ణమ్మా  పరుగులకు  నురుగుల  హారమా
హా...  మా  నీళ్ళు  ... బలే  బలే  బలే  బలే  బలే బలే
మానీళ్ళు  మాకేనని  కత్తుల  కోలాటమా
కన్నీటి  గానమా  కత్తుల  కోలాటమా  కన్నీటి  గానమా ... // పోరు  తెలంగాణమా//

అదిగో  ఆ ప్రక్రుతిని  చూడు  అలా  అలుముకుంటుంది , ఆ  కొమ్మలు  గాలితో  ముద్దడుతాయి , ఆ  పువ్వులు  అలా  ఆడుతాయి
అదిగో  పావురాలజంట  నేనెప్పుడు  విదిపోనంటాది

విడిపోయిన  బంధమా    చెదిరిపోయిన  స్నేహమా
ఎడబాసిన  గీతమా  ఎదలనిండా  గాయమ
పూవులు   పుప్పోడిలా    బలే  బలే  బలే  బలే  బలే
పువ్వు  పుప్పోడిల  పవిత్ర బంధమా  పరమాత్మునిరూపమా  
పవిత్ర బంధమా    పరమాత్ముని  రూపమా  // పోరు  తెలంగాణమా//
//పొడుస్తున్న  పొద్దుమీద //

అదిగో  రాజులు దొరలు వలస దొరలు , భూమిని  నీళ్ళని  ప్రాణుల్ని  సర్వస్వాన్ని  చెరబట్టారు , రాజుల  ఖడ్గాల కింద    తెగిపోయిన  శిరస్సులు

రాజరికం  కత్తిమీద   నెత్తుర్ల   గాయమా
దొరవారి  గడులల్లో  బలే  బలే  బలే  బలే  బలే  బలే
దొరవారి  గడులల్లో  నలిగిపోయిన  న్యాయమా
ఆంద్ర వలస    తూటాలకు  ఆరిపోయిన  దీపమ
మా  పాలన  బలే  బలే  బలే  బలే  బలే  బలే
మా  పాలన  మాకేనని  మండుతున్న  గోళమ
అమరావేరుల  స్వప్నమా  మండుతున్న  గోళ మా అమరవీరుల   స్వప్నమా
మండుతున్న  గోళమ  అమరవీరుల  స్వప్నమా
అమరవీరుల  స్వప్నమా  అమరవీరుల  స్వప్నమా  అమరవీరుల  స్వప్నమా  అమరవీరుల  స్వప్నమా

- గద్దర్ (జై బోలో తెలంగాణా ) 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,




Wednesday, October 3, 2012

మానవ మృగాలు చెలరేగిన నేల... ఖైర్లాంజీ ... ఒక చేదు పాట ...


Khairlanji, A Strange and Bitter Crop by Anand Teltumbde

2006 సెప్టెంబర్‌ 29 నాడు మహారాష్ట్రలోని ఖైర్లాంజీ గ్రామంలో సురేఖా భోట్‌మాంగే అనే మహిళనూ, ఆమె కూతురు ప్రియాంకా భోట్‌మాంగేనూ వివస్త్రల్ని చేసి, నగ్నంగా ఊరేగించి, వారిపై సామూహికంగా అత్యాచారం జరిపి హత్యచేశారు. 

వారితోపాటు సురేఖ కుమారులు రోషన్‌, సుధీర్‌లను కూడా దారుణంగా కొట్టి చంపారు. ఈ పాపంలో గ్రామస్తులంతా పాలుపంచుకున్నారు. తరువాత ఆ నాలుగు శవాలనూ తీసుకెళ్లి పక్కనే వున్న కాలువలో పడేశారు. 

భోట్‌మాంగేలు దళితకులానికి చెందినవాళ్లు. జనం అప్పుడే వాళ్లని మరిచిపోయారు. ప్రతి రోజు సగటున ఇద్దరు దళితులు ఈవిధంగా హత్యకు గురయ్యే ఈ దేశంలో ఇదో మామూలు విషయమైపోయింది. స్వాతంత్య్రానంతరం మన దేశంలో జరిగిన కులపరమైన అత్యాచారాల్లో అత్యంత దారుణమైన ఖైర్లాంజీ ఉదంతాన్ని ఆనంద్‌ తెల్‌తుంబ్డె ఈ పుస్తకంలో నిశితంగా విశ్లేషించారు. మన చుట్టూ ఖైర్లాంజీలు పదేపదే ఏవిధంగా, ఎందుకు పునరావృతమవుతున్నాయో వివరించారు.

21వ శతాబ్దపు భారతదేశంలో ఒక దళిత కుటుంబాన్ని బహిరంగంగా, సంప్రదాయకంగా ఊచకోతకోసిన సంఘటనపై ఆనంద్‌ తెల్‌తుంబ్డే చేసిన ఈ విశ్లేషణతో మన సమాజం ఎంత కుళ్లిపోయివుందో అర్థమవుతుంది. 

ఈ ఊచకోత వెనకవున్న కారణాలనూ, ఇ లాంటి కిరాతకాలు జరగడానికి దోహదం చేస్తున్న సామాజిక, రాజకీయ అంశాలనూ, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సమాచార ప్రసార మాధ్యమాలు అన్నింటినీ ఎండగడుతుంది. సమాజంలో పశుప్రవృత్తి పెరగడానికి, ఆతరువాత వాటిని కప్పిపుచ్చడానికి అవన్నీ ఎలా తోడ్పడుతున్నాయో వివరిస్తుంది.  

భూస్వామ్య వ్యవస్థ అవశేషాలనో అంతిమదినాలనో అభివర్ణించే పుస్తకం కాదిది. భారతదేశంలో ఆధునికత అంటే అర్థమేమిటో తెలియజెప్పే పుస్తకం. సమకాలీన భారతదేశంలో అత్యంత ముఖ్యమైన అంశాన్ని లోతుగా చర్చించిన పుస్తకం.

- అరుంధతీ రాయ్‌

..................................................................................................................................


మానవ మృగాలు చెలరేగిన నేల  ఖైర్లాంజీ 
ఒక చేదు పాట 

ఆనంద్ తెల్ తుంబ్డే రచించిన   KHAIRLANJI, A Strange And Bitter Crop కు తెలుగు అనువాదం 
" మానవ మృగాలు చెలరేగిన నేల...  ఖైర్లాంజీ ... ఒక చేదు పాట " 
ఆవిష్కరణ సభ 
 08 అక్టోబర్ 2012, సోమవారం, సాయంత్రం  6-00 గంటలకు 
బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో
 .
అధ్యక్షత :................... ప్రొఫెసర్ కే. సత్యనారాయణ, EFLU
ముఖ్య అతిధి :............ ఆనంద్ తెల్ తుంబ్డే 
ఆవిష్కర్త :.................. కే. ఆర్. వేణుగోపాల్ IAS Retired
పుస్తక పరిచయం :......ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి 
ప్రచురణ కర్తలు :.........మలుపు బుక్స్ 
పుస్తక అనువాదకులు: ప్రశాంత్, ప్రభాకర్ మందార 


Malupu Books
2-1-1/5, Nallakunta, 
Hyderabad- 500044

Email ID :........ malupuhyd@gmail.com
Malupu Blog:... http://malupu.wordpress.com









.



Tuesday, October 2, 2012

గాంధీ సిద్ధాంతాలను మరచిపోయినా గాంధీని మాత్రం మరచిపోలేం !



( ఫోటో వ్యాఖ్య )

ఎవరన్నారు బాపూ
మేం నిన్ను మరచిపోయామని !?
ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకూ
మా శ్వాస, ధ్యాస, ప్రయాస
మా గమనం, గమ్యం అంతా నువ్వే కదా
నిన్నెలా మరచిపోగలం ?
మా అణువణువణువణువునా నువ్వే వ్యాపించి వున్నావు
సమసమాజం ఏర్పడేంతవరకూ
నీ మీద మా భక్తి పారవశ్యాలకు ఢోకాలేదు బాపూ