Friday, August 28, 2009

దళితులను హిందువులుగా ఎప్పుడు చూశారని?....2 ...

''దళితులను హిందువులుగా ఎప్పుడు చూశారని?'' పోస్టుపై వచ్చిన స్పందనల్లో కొన్నింటికి వివరణ ఇద్దామని చేసిన ప్రయత్నమిది. నిడివి పెరగడంతో దానికి కొనసాగింపుగా 2వ టపాగా పొందు పరుస్తున్నాను.

@ Praveen Sarma, @ Indian Minerva, @ Venkata Ramana, @ Viswamitra, @ Bolloju Baba, @ Katti Mahesh Kumar, @ Ravi, @ Malakpet Rowdy, @ Anonymous @ Sharat @ Punarvasu

స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

వెటకారాలు, వ్యక్తిగత విమర్శలు, బిలో ది బెల్ట్ పంచ్ లు, దూషణలు తగ్గించుకుని సబ్జెక్ట్ కే పరిమితమై సభ్య పదజాలంతో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోగలిగితే మన బ్లాగులు ఆరోగ్యకరమైన ఆలోచనలకు వేదికలవుతాయి. మరెందరో ఆలోచనాపరులను ఆకర్షించ గలుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా కొందరు ఉద్దేశ పూర్వకంగా సంయమనాన్ని కోల్పోతున్నారు అనిపిస్తోంది.. సరే దీనిని ఆయా వ్యక్తుల విజ్ఞతకు వదిలేయడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు.

ఇక్కడ కొందరు లేవనెత్తిన ప్రశ్నలకు మహేష్ కుమార్ గారు సమాధానాలు చెప్పారు. వాటితో నేను ఎకీభవిస్తున్నందువల్ల తిరిగి వాటిని ప్రస్తావించడం లేదు.

అదేవిధంగా రిజర్వేషన్ల అమలులో లోపాలు, అవకతవకలు వంటి అంశాల జోలికి వెళ్లి అసలు సమస్యను గందరగోళ పరచ దలచుకోలేదు. (ఎందుకంటే మనదేశంలో తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య వంటి ఏ కార్యక్రమాన్ని పరిశీలించినా వాటి అమలులో ఘోరమైన వైఫల్యాలూ, అక్రమాలే కనిపిస్తాయి. ఆడలేక మద్దెల వోడన్నట్టు అమలులో చిత్తశుద్ధి లేక పథకాలనే తప్పుపట్టలేం కదా) .

కాబట్టి ముఖ్యంగా ఈ కింది వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని నా అభిప్రాయాలను మీతో పంచుకునేందుకు ప్రయత్నిస్తాను.


1) >>>>> ఇప్పుడు కుల రిజర్వేషన్లు మరో మతానికి పాకించటం వల్ల, ఇతర మత వ్యాప్తి అవుతుంది అన్నది ఒక valid argument గా పరిగణించాలి.<<<< (@ Ravi) 2) >>>>> the constitution says that the Dalits who want reservations must remain Hindus. Since Christianity/Islam doesnt have caste system in place, they are NOT dalits once they get converted.<<<<< (@ Malakpet Rowdy) 3) >>>>> He wanted the government to increase reservation under the BC-C quota, now being given to Dalit Christians. It was the only way to uplift Dalit Christians, he suggested.<<<<< (@ Malakpet Rowdy)

''కుల రిజర్వేషన్లు మరో మతానికి పాకించడం వల్ల ఇతర మత వ్యాప్తి అవుతుంది'' అనడం లేని ''బూచి'' ని చూపించి పిల్లల్ని భయపెట్టడం లాంటిదే. ఈ వాదనలో పక్షపాతవైఖరి, పరమత ద్వేషం తప్ప వాస్తవికత లేదు. రిజర్వేషన్లు లేనప్పటినుంచీ మన దేశంలో మతమార్పిడులు వున్నాయి. రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా మునుముందు కూడా వుంటాయి.

కొందరు వ్యక్తుల మత విశ్వాసాలు మారినంత మాత్రాన మన దేశానికి వాటిల్లే నష్టమేమీ లేదు. మతం, దేవుడు వంటి వ్యక్తిగత విశ్వాసాలను ఎవరూ నియంత్రించలేరు. మతానికీ, దేశభక్తికీ / దేశద్రోహానికీ ఏమాత్రం సంబంధం లేదు. 'పృథ్వీరాజ్‌'లు/ 'జయచంద్రులు' అన్ని మతాల్లోనూ వుంటారు.

ఇక ఎవరైనా ఎందుకు మతం మారతారన్నది అసలు ప్రశ్న.

మహాత్మాగాంధీ 1925 లో కేరళలోని శివగిరిని సందర్శించినప్పుడు ఆయనకూ, నాటి కేరళ సామాజిక తత్వవేత్త శ్రీనారాయణ గురుకూ మధ్య జరిగిన ఈ కింది సంభాషణ చూడండి:
....
మహాత్మా గాంధీ: అంటరానితనాన్ని నిర్మూలించడం కాకుండా ఇంకా అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి మనం ఏం చేయాలంటారు?

శ్రీ నారాయణ గురు: వాళ్లను విద్యావంతుల్ని చేయాలి. తమ అవసరాలకు సరిపడినంత ఆదాయాన్ని సంపాదించుకోగలిగేలా చేయాలి. కులాంతర వివాహాలు, సహపంక్తి భోజనాలు వంటివి తక్షణమే చేపట్టాలని నేను భావించడం లేదు. ముందుగా వాళ్లు ఇతరులతో పాటు సమానంగా ఎదిగేందుకు తగిన అవకాశాలు కల్పించాలి.

మహాత్మా గాంధీ: నిమ్న కులాల వాళ్లు పెద్ద ఎత్తున క్రైస్తవ మతంలోకి మారడం చాలా దురదృష్టకరమైన విషయం కదా?

శ్రీ నారాయణ గురు: కొత్త నమ్మకం వారికి ఆనందాన్నిస్తున్నట్టయితే, అది వారికి ఫలసిద్ధినిస్తున్నట్టయితే తమ మతాన్ని మార్చుకునే స్వేచ్ఛ వారికి సంపూర్ణంగా వుంటుంది. కాబట్టి వాళ్లని అందుకు అనుమతించక తప్పదు.

మహాత్మా గాంధీ: కానీ వాళ్లు మత మార్పిడి చేసుకుంటున్నది అందుకు కాదు. ఏవో కొన్ని సౌకర్యాలు, హక్కులు పొందేందుకు మాత్రమే వాళ్లు వెళ్లిపోతున్నారు.

శ్రీ నారాయణ గురు: అ లాంటప్పుడు ఆ సౌకర్యాలూ హక్కులూ ఏవో వాళ్లకి మీరే కల్పించండి. అప్పుడు వాళ్లు హిందువులుగానే వుండిపోతారు కదా.
....

శ్రీనారాయణ గురు (1856-1928) మరో సందర్భంలో ఇలా అన్నారు:

''హిందూ మతం అనేది అసలు లేదు. (సింధూ నదే ఇందూ నదిగా మారి అందులోంచే హిందూ, హిందుస్థాన్‌, ఇండియా, ఇండియన్స్‌ అనే పదాలు ఆవిర్భవించాయని అంటారు). విదేశీయులు ఈ దేశాన్ని హిందూ దేశమనీ, ఇక్కడి మూలవాసులను హిందువులనీ వ్యవహరించేవారు. అంతే తప్ప హిందూ మతం అనేదే లేదు. హిందూ దేశంలో నివాసమేర్పరచుకున్న విదేశీయ క్రైస్తవ, ఇస్లాం మతాలకు చెందిన వాళ్లను కాక ఇతర్లను సంబోధించేందుకు ఈ పదాన్ని వాడేవారు. ఈ కారణంగానే కొందరు బౌద్ధ, జైన మతాలు కూడా హిందూమతంలో అంతర్భాగమని భావిస్తారు.''
.....

హిందూ మతంలో అగ్ర కులాలు ఎంత సుఖసంతోషాలతో, సౌలభ్యాలతో వున్నాయో మాల మాదిగ తదితర నిమ్నకులాలు అడుగడుగునా అవమానాలను ఎదుర్కొంటూ, అనాదరణకు గురవుతూ అంత అసౌకర్యంగా వున్నాయి. అందుకే వాళ్లు తమ ఆత్మ గౌరవంకోసం, మానసిక శాంతికోసం మరో మతం వైపు చూడాల్సి వస్తోంది. హిందూ మతంలో ఈ కాలానికి తగిన విధంగా సంస్కరణలు జరిగితే ఈ సమస్య వుండేది కాదు.

ఇక దళిత క్రైస్తవులకు ప్రస్తుతం ఇస్తున్న బి.సి. (సి) కోటా పట్ల ఎవరికీ ఏ ఆక్షేపణ లేనట్టు కనిపిస్తోంది. వారికి ఎస్‌.సి. కోటా యివ్వడంను మాత్రం కొందరు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. నిజానికి క్రైస్తవ మతంలో (ఫార్వర్డ్‌ రిలిజియన్‌) బి.సి.లు కూడా వుండకూడదు కదా మరి. దాని నెలా ఒప్పుకుంటున్నారో అర్థం కాదు.

ప్రస్తుతం వున్న నిబంధనల ప్రకారం ఒక దళితుడు (ఎస్‌సి) క్రైస్తవ మతం స్వీకరిస్తే వెంటనే అతని ఎస్‌సి హోదా రద్దయిపోతుంది. అతడిని బిసి సి గానో ఎఫ్‌సి గానో పరిగణిస్తారు. అతనే మళ్లీ కొన్నాళ్ల తరువాత తిరిగి హిందూ మతంలో చేరితే అతని ఎస్‌సి హోదా పునరుద్ధరించబడుతుంది.
ఎంత విచిత్రమిది.
అసలు రిజర్వేషన్లు వేల సంవత్సరాల అన్యాయానికి గురైన దళితులను ఉద్ధరించడానికా లేక హిందూ మతాన్ని, కుల వివక్షను కాపాడడానికా తెలియడం లేదు.

క్రైస్తవ మతం అభివృద్ధిచెందిన (ఫార్వర్డ్‌) మతం కావచ్చు. అంతమాత్రాన అందులో చేరీ చేరగానే ఒక్కసారిగా నిరుపేద దళితులంతా ఫార్వర్డ్‌ అయిపోరు. బట్ట, పొట్టకు సంబంధించి చిన్న చిన్న సౌకర్యాలు సమకూడుతున్నాయేమో గానీ క్రైస్తవులుగా మారిన బీద దళితులు పెద్దగా బావుకుంటున్నదేమీ లేదు. మన సమాజంలో వారి స్టేటస్‌ ఏమాత్రం మారడంలేదు. ఎల్లయ్యను చూసినట్టే ఏసుపాదాన్నీ చూస్తోంది మన సమాజం.

దళితులను సృష్టించింది హైందవ సమాజమే కావచ్చు
కానీ ఆ దళితులను ఉద్ధరించేందుకు రిజర్వేషన్ల ద్వారా నడుం కట్టింది మాత్రం కేవలం స్వతంత్ర భారత ప్రభుత్వం తప్ప హిందూ మతం కాదు.
మనది మత ప్రమేయం లేని లౌకిక ప్రజాస్వామ్యం. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా మతం గురించి ఆలోచించడంలో ఔచిత్యంలేదు. మనమిప్పుడు వేలాది సంవత్సరాలుగా సాగిన అన్యాయాన్ని సరిదిద్దడం మీద మాత్రమే దృష్టిని కేంద్రీకరించాలి తప్ప వారి వారి మత విశ్వాసాల మీద కాదు.

హిందూ మతంలో దళితుల పట్ల చిన్నచూపు ఇంకా అట్లాగే కొనసాగుతున్నా కూడా వారిని చచ్చినట్టు అదే మతంలో పడివుండాలనడం, లేకపోతే రిజర్వేషన్లు ఇవ్వమని బెదిరించడం... నిజంగా దళితుల మేలు కాంక్షించేవారు చేయాల్సిన పనికాదు.

దానికి బదులు హిందూ మతంలో తగిన మార్పు తీసుకురావడం, సర్వ కుల సమానత్వం కోసం ప్రయత్నించడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇతర మతాల్లో మాదిరిగా హిందూ మతంలో కూడా కులాల ప్రాధాన్యత తగ్గి, సమానత్వం సహోదరత్వం, పర్సపర ప్రేమాభిమానాలు పెరిగితే ఎవ్వరూ హిందూమతాన్ని వీడి పోయే పరిస్థితే వుండదు.



......

85 comments:

  1. వాదన సహేతుకంగా ఉంది.

    దళితులను చిన్న చూపు చూసే ఈ సో కాల్డ్ హిందువులకు (హిందుమత పరిరక్షణ అంటూ గొంతుచించుకొనే వారు), వాళ్లు మతం మారితే వచ్చే నష్టం ఏమిటో నాకెప్పటికీ అర్ధం కాదు.


    బొల్లోజు బాబా

    ReplyDelete
  2. ప్రభాకర్ గారు,
    మీ టపా చాలా హెతుబద్ధం గానూ, ఆలోచనా స్ఫోరకం గానూ ఉంది. ముఖ్యంగా భావోద్వేగాలకు చోటివ్వకుండా తార్కికంగా విషయాన్ని చర్చించిన విధానం ప్రశంసనీయం. చివరికి మీరిచ్చిన పరిష్కారం కూడా బాగుంది.

    ReplyDelete
  3. ప్రభాకర్‌ మందార గారు,
    మీరు క్రైస్తవులా? లేక హిందువులా? మహేష్ తాను హిందూ మాదిగనని అని చెప్పుకున్నారు. మీరు హిందువు దళిత్ ఐతే క్రైస్తవ దళీతుల తరపున మాట్లాడటానికి ఎవరు లేరా? అలాగె నాకు మహేష్ హిందువు అయివుండి క్రైస్తవ దళితుల తరపున ఎందుకు వకాల్తా పుచ్చు కోవాలి? నేను పెpaర్ లో క్రైస్తవ దళితుల అధిక భాగం ఆంధ్ర మాలలు అని నిన్న ఆంధ్రజ్యొతి లో రాశారు. అది నిజమేనా? వారి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మిగతా దళితుల తొ పోలిస్తె చాలా మెరుగు అని విన్నాను. దానికి కారణం ఎమిటి? మహాత్మా గాంధీ, శ్రీ నారాయణ గురు సంభాషణ 1925 లోనిది. అప్పటికి ఇప్పటికి దళితుల జీవితా ల లో మార్పు లేదా?

    ReplyDelete
  4. ఇదేదో అలోచించాల్సిన సంగతే!!

    ReplyDelete
  5. పైన సత్యనారాయణ శర్మ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. సంయమనంతో అర్థవంతంగా, హేతుబద్దంగా చర్చించిన తీరును, ఒక మనిషిగా అభినందిస్తున్నాను

    ReplyDelete
  6. అవకాశవాదమే ప్రామాణికమైనప్పుడు....ఏ మతమైతే నే౦టి, ఏ కులమైతే నే౦టి.

    దళితులు సాటి హి౦దువులతో సమాన హోదాను పొ౦దక పోవట౦ చేత మత౦ మారారు.
    హి౦దువులు తమ దళితులను ఇతర మతస్తులకు కోల్పోతే కానీ వారి విలువ తెలిసిరాలేదు.
    దళితులు అనేక ప్రయోజనాలకోస౦ ఇతర మతాలకు మారినా, అవకాశ౦ ఉన్నప్పుడల్లా రె౦డి౦టి ప్రయోజనాలనూ పొ౦దుతున్నారు.

    ఇతర మతస్తులు హి౦దూ సమాజ౦లోని లోపాలను అవకాశ౦ చేసుకుని, ప్రలోభాలకు గురి చేసి మత మార్పిడులు చేస్తున్నారు....ఆ మతాల్లో లోపాల్లేవా? తమ సమాజ౦ లోని లోపాలను ప్రక్షాళన చేసుకోలేదు. కేవల౦ తమ జనాభాను పె౦చుకుని ఆయా సమాజాలలో వర్గ విభేధాలను సృష్టి౦చటమే వారి లక్ష్య౦. ప్రలోభాలకు గురిచేసో, లేక ఇతర మతస్తుల లోపాలను అడ్డ౦ పెట్టుకుని మత మార్పిడులను ఒక వ్యాపార౦గా నిర్వహి౦చటమే వారి హీనతకు నిదర్శన౦.

    ఇవన్నీ నిజ౦గా మత సిద్దా౦తాలే ప్రభోది౦చినవా అ౦టే సమాధాన౦ చెప్పట౦ కష్ట౦. ఆయా మతాలలోని చీడపురుగులు చేస్తున్న అకృత్యాలే ఇవన్నీ, అమాయకులున్న౦త వరకూ ప్రతి సమాజ౦లోనూ దగా చేసే ఘరానామనుషులు ఉ౦టూనే ఉ౦టారు. ప్రతి కుల౦లోనూ, మత౦లోనూ, ఏ ఇతర వర్గమైనా ఇది సహజ౦. కేవల౦ తమ స్వప్రయోజనాలకోస౦ భావోద్వేగాలను రెచ్చగొట్టి తమ పబ్బ౦ గడుపుకోవడమే వారి ధ్యేయ౦.

    మన భారతీయ సమాజ౦ ఏనాడో విడగొట్టబడి౦ది. మన విలువలను ఏనాడో కోల్పోయా౦. కేవల౦ లోపాలనే ప్రచార౦ చేస్తూ అనేక రాబ౦దులు స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. మన౦ వాటి వలలో పడి, ఆర్థిక అభివృద్ది అ౦టూ పరుగులు తీస్తూ మన విలువలను మరి౦త వేగ౦గా హరిస్తున్నా౦.

    కళ్ళు తెరవ౦డి...

    దళితులు మొత్త౦ వివక్షకు గరవుతు౦టే, మాల మాదిగ విభేధాలె౦దుకు? అది కూడా అగ్రవర్ణాల కుట్రే న౦టే ఇక చెప్పేదేమీ లేదు..మీరు మీరు కొట్టుకున్న౦త కాల౦ అగ్రవర్ణాల పేరుతో అనేక వర్ణాలు మీతో ఆడుకు౦టూనే వు౦టాయి.

    ReplyDelete
  7. ప్రభాకర్ గారూ, ఈ విషయమ్మీద మీ మొదటి టపాలో ఉన్న పస ఈ ప్రత్య్త్తరంలో లేదు. ఇతరులు మెచ్చినట్టు మీ వాదన సహేతుకంగా కూడా లేదు. "అందరికీ సమానావకాశాలు ఉండాలి" - లాంటి సార్వత్రిక నినాదాల్లాంటి మాటలు తప్ప విషయాన్ని గురించి అవగాహన పెంచే ఆలోచనలు గానీ చర్చకి పనికొచ్చేవిగానీ నాకైతే ఏం కనబళ్ళేదు.
    మొదటగా ఒక విషయం గుర్తించండి. ప్రభుత్వ ప్రతిపాదనని వ్యతిరేకిస్తూ రాస్తున్నవారిలో ఎవ్వరూ దళితులు అణగారి ఉండాలని కోరుకోవడం లేదు. ఇంకా మాట్టాడితే అందరికీ సమానావకాశాలు రావాలని మీకంటే బలంగానే కోరుకుంటున్నారు.
    మీ వాదనలో ఇంకో పెద్దలొసుగు - మరి కొందరు పౌరులు క్రైస్తవం తీసుకున్నంతమాత్రాన దేశానికొచ్చిన నష్టం లేదని. దేశమంటే ఏమిటి, ఎవరు? దేశమంటే మత ప్రమేయంలేని ప్రభుత్వమని మీరంటే, బహుశా దానికి ఒరిగేదీ తరిగేదీ ఏం లేకపోవచ్చు, కొత్తగా ఏర్పడే వోటుబేంకులు తప్ప. కానీ .. దేశమంటే ప్రజలు అనుకుంటే, ఆ ప్రజల్లో అత్యధికులు నమ్మి ఆచరించే హిందూ మతానికి ఇటువంటి ప్రభుత్వ జోక్యం పెద్దదెబ్బ - అందులో ఎంతమాత్రం సందేహం లేదు. ఒక యెనాలజీ చెబుతాను. రేపు తెలుగు దేశం పార్టీ వొచ్చి, మాకు వోటేసిన దళితులందరికీ, వారి ఇతర సమాచారంతో సంబంధం లేకుండా ఇంకో కొత్త రిజర్వేషనేదో కల్పిస్తాము అని ప్రకటిస్తే, అప్పటిదాకా కాంగ్రెసు వోటర్లుగా ఉన్న కొందరు తెలుగు దేశం వేపు మొగ్గు చూపితే అది కాంగ్రెసుకి నష్టమని ఏమైనా సందేహమా? ఇదీ అంతే!

    ReplyDelete
  8. కుల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే రిజర్వేషన్లని నేను సమర్థిస్తాను అని చెప్పాను. డబ్బున్న వాళ్ళ పిల్లలు రిజర్వేషన్లని దుర్వినియోగం చెయ్యడం గురించి దళిత నాయకులు మాట్లాడరేం? పైగా అలా చెయ్యడం తప్పు కాదని మహేష్ అన్నాడు. పేరు చివర "మాదిగ" అని టైటిల్స్ తగిలించుకుని తమని తామే కించ పరుచుకునే మంద కృష్ణ లాంటి వాళ్ళ సంగతి ఏమిటి? అగ్రకులాల వాళ్ళు చేస్తున్నది తప్పే కానీ దళిత నాయకుల తప్పుల గురించి మాట్లాడే ధైర్యం ఎంత మంది దళిత మేధావులకి ఉంది? "మేము మాదిగలం" అని గొప్పగా చెప్పుకోవడం తప్పు కాదని ఓ సారి మహేష్ అన్నాడు కూడా. హైదరాబాద్ లో బాగయ్య అనే దళితుడు తన పేరు మార్చుకుని తన కులం సంప్రదాయానికి విరుద్ధంగా భాగ్య వర్మ అని క్షత్రియ పేరు పెట్టుకున్నాడు. దళితులు తమ గౌరవం కోసం ఇలా గ్లోరియస్ పేర్లు ఎందుకు పెట్టుకోకూడదు? పేరు చివరన "మాదిగ" లాంటి పేర్లు తగిలించుకుని తమని తాము కించ పరుచుకుని దాన్ని దళితుల ఆత్మగౌరవం అనుకోవడం సిగ్గు సిగ్గు.

    ReplyDelete
    Replies
    1. అతని పేరు భాగ్యరెడ్డి వర్మ. పేరు చివరన కులసూచికలను పెట్టుకోవడం ముమ్మాటికీ తప్పే. అలా తీసేసుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు కూడా. ప్రభుత్వరికార్ఢులల్లో కులం కాలం ఉన్నని రోజులు కులసూచికలు తీసివేసినా లాభం లేదు. ఎప్పుడో వేల యేళ్ల క్రితం ఉన్నదనుకుంటున్న మనుధర్మం శాస్త్రాన్నొకదాన్ని సాకుగా చూపి ఇప్పటికీ అగ్రవర్ణమని పిలిచే పేదవాడి బాధలను ఎవరూ గుర్తించడం లేదు.

      Delete
  9. >>>>>
    "అందరికీ సమానావకాశాలు ఉండాలి" - లాంటి సార్వత్రిక నినాదాల్లాంటి మాటలు తప్ప విషయాన్ని గురించి అవగాహన పెంచే ఆలోచనలు గానీ చర్చకి పనికొచ్చేవిగానీ నాకైతే ఏం కనబళ్ళేదు.
    >>>>>
    డబ్బున్న దళితులకి మాత్రమే రిజర్వేషన్ల పేరుతో అవకాశాలు ఇచ్చి "అందరికీ అవకాశాలు" అనడం హాస్యాస్పదం కాదా?

    ReplyDelete
  10. హిందూ మతం వదిలి వేరే మతంలో చేరిన వాళ్ళు కులం పేరు చెప్పుకోవడాన్ని అంబేద్కర్ వ్యతిరేకించాడు. ఈ విషయం అంబేద్కరే స్వయంగా తన పుస్తకాలలో వ్రాసుకున్నాడు. అంబేద్కర్ రచనలలో ఒక్క ముక్క కూడా చదవకుండా అంబేద్కర్ కి వ్యక్తిపూజ చేసే దళితులు క్రైస్తవ మతంలోకి మారిన తరువాత కూడా కులం పేరు చెప్పుకుంటూ అంబేద్కర్ ఆశయాలకే పోట్లు పొడుస్తున్నారు.

    ReplyDelete
  11. My questions are straight -

    1. Did or Didnt Ambedkar say (Since you quoted Ambedkar in your previous post) that non Hindus should not be given reservations?

    2. Doesnt the constitution say that only the Hindu Dalits are eligible to be SCs?

    3. Doesnt it require consitutional amendment to enforce the abovesaid reservations and doesnt it require 2/3 majority?

    4. Didnt the Supreme court say that the Christian Dalits aint no SCs?

    ReplyDelete
  12. సాధారణం గా ఉయ్యాల లో జోలపాటలుంటాయి,కానీ ఇక్కడ మేల్కొలుపు గీతాలు వినగలుగుతున్నా, పూర్తి వివరణ తో విశ్లేషణ తో పోస్ట్ సూపర్.

    ReplyDelete
  13. అగ్రకులాల్ని తిట్టేముందు దళితుల పుట్టుపూర్వోత్తరాలేంటో ఎవరైనా ఎప్పుడైనా యోచించారా ?

    ReplyDelete
  14. హిందూ దళితుల్లాగానే క్రైస్తవ దళితులు కూడా వివక్షతను ఎదుర్కుంటున్నారు కనుక వారిని ఎస్.సీ కేటగిరీలోనికి చేర్చమని అంటున్నారు. సబబే. అది రిజర్వేషన్లు మొదలుపెట్టినప్పుడే చేయాల్సినది. కానీ ఇప్పుడూ హిందూ దళితులతో పోలిస్తే వాళ్ళలో ఎక్కువమంది అభివృద్ది చెందినవారు ఉన్నారు. ప్రస్తుత రిజర్వేషన్ల పద్దతిలో అయితే వాళ్ళకే ఎక్కువ అవకాశాలు వస్తాయి. టార్గెట్ గ్రూప్‌కి అవకాశాలు చేరవు. ఇప్పటికే టార్గెట్ గ్రూప్‌కి చేరటం లేదు. రిజర్వేషన్లు ఇచ్చే పద్దతిలో మార్పులు రావాలి. అప్పుడు వారిని ఎస్.సిలో చేర్చినా సరే సమస్యలు ఉండవు. అలా కాకుండా వాళ్ళని చేరిస్తే వెనుకబడిన వాళ్ళు ఇంకా వెనుకబడతారు..బాగుపడినవారు ఇంకా బాగుపడతారు.

    రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా మతమార్పిడులు జరుగుతాయని నేనూ అంగీకరిస్తాను. ఇప్పుడైనా క్రైస్తవ మతం పాటిస్తూ, హిందువులని చెప్పుకోవటం లేదా? ఇంకో మతాన్ని ఏ విధంగానైనా అవలంబించవచ్చు.

    అసలు ముందు ఎందుకు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఇక్కడెవరికైనా కారణాలు తెలిస్తే చెప్పగలరు.

    ReplyDelete
  15. ప్రభాకర్ గారు మహేష్ అభిప్రాయాలు, తన అభిప్రాయాలు ఒకటేనని చెప్పుకున్నారు. మహేష్ ఎలాంటి వ్రాతలు వ్రాసాడో ప్రభాకర్ గారికి తెలుసా? మహేష్ నాతో అన్నాడు "నీకు లక్ష రూపాయలు ఫ్రీగా వస్తే వదులుకుంటావా?" అని. బ్యాంక్ ఆఫీసర్ల కుటుంబంలో పుట్టిన నాకు లక్ష రూపాయలు ఫ్రీగా తీసుకోవలసిన అవసరం ఏమిటి? మహేష్ సిద్ధాంతం ప్రకారం డబ్బున్న ఫామిలీలో పుట్టినా లక్ష రూపాయలు ఫ్రీగా తీసుకోవడం తప్పు కాదన్న మాట. కొన్ని నెలల క్రితం నేను కూడా మహేష్ ని సపోర్ట్ చేశాను, అభిమానించాను. అతను హోమోసెక్స్, వ్యభిచారానికి చట్టబద్ధత అంటూ చెత్త వ్రాయడం వల్ల అతని మీద నాకు అభిమానం పోయింది. ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దానికి పూర్తిగా విరుద్ధమైన కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం మహేష్ మాత్రమే సాధ్యమనుకున్నాను. ప్రభాకర్ కి కూడా అది సాధ్యమే అని ఇప్పుడు అర్థమయ్యింది. నేను, మహేష్, ప్రభాకర్ ముగ్గురం నాస్తికులమే. కుల వ్యవస్థని సృష్టించిన హిందూ మతాన్ని తీవ్రంగా దూషించాము. ఇప్పుడు మహేష్, ప్రభాకర్ లు తమ పిల్లలకి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు ఇప్పించడానికి హిందూ గుర్తింపు అయిన కులం కోరుకుంటున్నారు. కథ అడ్డం తిరిగింది. నాస్తికులే నాస్తికత్వానికి వెన్నుపోటు పొడిచారు. ఈ నాస్తికుల కంటే మూఢ భక్తులకే నిజాయితీ ఎక్కువ ఉంటుంది. రమణ మహర్షి భక్తుడైన చలం గారు కూడా నిజాయితీగా కుల వ్యవస్థని వ్యతిరేకించారు. ఇక్కడ చలం గారి పేరు చెప్పుకుని చలం గారి సిద్ధాంతాలకి వ్యతిరేకమైన వ్యభిచారం, కులతత్వం లాంటి వాటిని సమర్థిస్తూ చలం గారి ఆశయాలకి పోట్లు పొడిచే వాళ్ళని చూస్తున్నాం.

    ReplyDelete
  16. రంగనాయకమ్మ గారు వ్రాసిన "దళిత సమస్య పరిష్కారానికి" పుస్తకం చదివిన తరువాత కొంత మంది డబ్బున్న దళితులు తాము రిజర్వేషన్లని స్వచ్ఛందంగా వదులుకుంటామని ప్రకటించారు. మాల మహానాడు, MRPS వాళ్ళు ఆ పుస్తకాన్ని వ్యతిరేకించారు.

    ReplyDelete
  17. మతం అనేది అజ్ఞానం, సైన్స్ ప్రగతికి విరుద్ధం అని నాస్తికులందరూ అంటారు. కానీ కొందరు నాస్తికులకి తమ పిల్లలకి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలిప్పించడానికి అజ్ఞాన మతం నుంచి పుట్టిన కులం కావాలి. రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి మెటాఫిజికల్ నాస్తికులకి కూడా కులం గుర్తుకి వస్తుంది.

    ReplyDelete
  18. సమానత్వం కావాలి అంటారు కానీ దానికోసం ఏమి చేయాలి అనే దాని మీద ఎవరికీ స్పష్టత లేదు. ఉచిత విద్య, ఉద్యోగాలో రిజర్వేషన్లు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు అనేవి కొంతవరకు వారికి సమాన స్థాయి కల్పించడానికే కదా! ఉద్యోగ అవకాశాలు లేనప్పుడు వారు ఆర్ధికంగా నిలబడి వ్యాపారాలు చేసుకోడానికి రుణాలిస్తున్నారు. ఇంతకన్నా మంచి విధానం ఉంటే చెప్పాలి గానీ అణగదొక్కేశారు అని పదే పదే అనుకొంటూ కాలక్షేపం చేద్దామనుకొంటే ఉపయోగం ఉండదు.

    ReplyDelete
  19. డబ్బున్న దళితులు రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు చెయ్యడం వల్లే రిజర్వేషన్లు ఇంత వివాదాస్పదం అయ్యాయి. లేకపోతే ఇంత వివాదాస్పదం కావడం జరగదు. డబ్బున్న వాళ్ళకి బ్యాంక్ లు లోన్లు ఇస్తాయి కదా, మరి వీళ్ళకి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలెందుకు?

    ReplyDelete
  20. @బొల్లోజు బాబా, @సత్యనారాయణ శర్మ, @సురేంద్ర, @Sat‌, @పెదరాయుడు, @సుధ

    మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు.

    @ఎనానిమస్‌
    ఇక్కడ వ్యక్తిగత వివరాలు ఎందుకండి? నేనేమీ దళితుణ్ని కాను, క్రైస్తవుణ్నీ కాను. క్రైస్తవుల తరఫున వకాల్తా కూడా పుచ్చుకోలేదు. ఒక సమస్య మీద నా అభిప్రాయాలు వ్యక్తం చేశాను. అంతే. మనమిక్కడ కేవలం ఆ సమస్యకే పరిమితమై చర్చించుకుంటే బాగుంటుంది. ఆంధ్రజ్యోతిలో వ్యక్తమయిన అభిప్రాయం నిజమే అనుకుంటాను. రిజర్వేషన్ల వల్ల మాదిగలకంటే మాలలే ఎక్కువ లబ్దిపొందుతున్నారనే కదా మాదిగలు వర్గీకరణ కోసం పట్టుపడుతున్నది. మాలలే ఎక్కువ అభివృద్ధి చెందడానికి, మాదిగలు చెందక పోవడానికి కారణాలేమిటో ఈ అంశాన్ని లోతుగా అధ్యయనం చేసిన వాళ్లు చెబితే బాగుంటుంది. మీరన్నట్టు 1925లోని పరిస్థితికీ ఇప్పటి పరిస్థితికీ చాలా తేడావుంటుంది. నిజానికి ఈ 84 ఏళ్లలో అంటరానితనం, కులవివక్ష, రిజర్వేషన్లు, కులాలు అన్నీ నామరూపాల్లేకుండా పోవాల్సి వుండె. ఏం చేస్తాం మన రాజకీయ వ్యవస్థ పుణ్యమాని పాము చావలేదు, కర్ర విరగలేదు.

    ఒక చిన్న సూచన: ఏ ఎనానిమస్‌ ఎవరో తెలిసేందుకు లేదా అందరు ఎనానిమస్‌లు ఒకరే కాదని గుర్తించేందుకు మీ రొక కలంపేరైనా పెట్టుకుంటే బాగుంటుంది.

    @కొత్తపాళీ గారూ,
    ఈ ఆర్టికిల్‌లో ''విషయాన్ని గురించి అవగాహన పెంచే ఆలోచనలు గానీ, చర్చకి పనికొచ్చేవి గానీ నాకైతే ఏం కనబళ్ళేదు'' అంటూనే స్పందించినందుకు ధన్యవాదాలు.
    మీరు ఎందుకు ప్రస్తావించారో గానీ ''ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రాసిన వారు దళితులు అణగారి వుండాలని కోరుకుంటున్నారన్న'' అభిప్రాయాన్ని నేనెక్కడా వ్యక్తం చేయలేదు. అయినా హిందూ సమాజం ఆది నుంచీ ''సర్వే జనా సుఖినో భవంతు'' అంటూనే వుంది.
    కులం, మతం, ప్రాంతం ఏదో ఒక ఓటు బాంకు పాలసీని అనుసరించని రాజకీయ పార్టీయే లేదు. నేను ఆ కోణంలోంచి ఆలోచించలేదు. నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధంలేదు.
    హిందూమతం పరిథిలో అంటరానివాళ్లుగా ముద్రపడి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న వాళ్లు కొందరు అన్యమతంలో చేరివుండవచ్చు. అట్లాంటి వారికి కూడా తరతరాలుగా ఈ వ్యవస్థ కారణంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వ పరంగా రూపొందించిన రిజర్వేషన్లను వర్తింపజేయడం న్యాయమే అన్నది నా భావన. నా భావాన్ని ఈ రెండు ఆర్టికిల్స్‌లో సరిగానే వ్యక్తం చేశాననుకుంటున్నాను.

    ReplyDelete
  21. @మలక్‌పేట్‌ రౌడీ గారు
    డాక్టర్‌ అంబేడ్కర్‌ ''నేను హిందువుగా మాత్రం చనిపోనని'' 1935 అక్టోబర్‌ 13న నాసిక్‌ వద్ద జరిగిన ఒక బహిరంగ సభలో ప్రకటించారు. ఆతరువాత ఏ మతం తనకు, తన అనుచర దళిత వర్గానికి అనుకూలమైనదో నిర్ణయించుకునేందుకు ఆయనకు 20 సంవత్సరాలు పట్టింది. చివరికి 1956 నవంబర్‌ 14న నాగపూర్‌లో లక్షలాది మంది అనుచరులతో ఆయన బౌద్ధమతం స్వీకరించారు. ఆ తరువాత కొద్ది రోజులకే అంటే 1956 డిసెంబర్‌ 5న ఆయన చనిపోయారు. ఆయన గనక బౌద్ధమతాన్ని స్వీకరించిన తరువాత మరో పది సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో బ్రతికి వుంటే భారత దేశంలోని దళితుల జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చివుండేవనిపిస్తుంది నాకు. మీరు గత స్పందనలో ఈ అంశం గురించి ప్రస్తావించారు. అప్పుడు మిస్‌ అవడం వల్ల ఇప్పుడు వివరించాను.

    కేవలం రిజర్వేషన్ల వల్ల దళితుల జీవితాలు సమూలంగా మారవని డాక్టర్‌ అంబేడ్కర్‌కు నిశ్చయంగా తెలుసు. అందుకే మతమార్పిడి ద్వారా దళితులను సామాజికంగా బలోపేతుల్ని చేయాలని ఎంతగానో తపించారు. అందుకు ఒక మార్గాన్ని కనుగొన్న కొద్ది రోజులకే పరమపదించడంతో ఆయన ఆశయం నెరవేరలేదు. ఇక మీరు అన్నట్టు మతం మారిన వారికి అప్పుడు రిజర్వేషన్లను వర్తింపజేయలేదు. అయితే అంబేడ్కర్‌ కాలంలో రూపొందించిన రిజర్వేషన్ల విషయమై అనేక సార్లు మార్పులు చేర్పులు జరగడం, అందుకు ఎన్నోసార్లు రాజ్యాంగ సవరణలు కూడా చేయడం తెలిసిందే. కాలమానపరిస్థితులు, గ్రౌండ్‌ రియాలిటీస్‌ను బట్టి సవరణలు చేయక తప్పదు. ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం దళిత క్రైస్తవులకు ఎస్‌సి కోటా కల్పించడం విషయమై కేవలం తన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తోంది. అంతే. తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేతిలోనే వుంటుంది. రాజ్యాంగ సవరణ జరిగి చట్టం రూపొందించినప్పుడు ఉన్నత న్యాయస్థానం కూడా దీనిని ఆమోదిస్తుంది.

    @HateWeb గారూ,
    ''అగ్రకులాల్ని తిట్టేముందు దళితుల పుట్టుపూర్వోత్తరాలేంటో ఎవరైనా ఎప్పుడైనా యోచించారా?'' అంటున్నారు వాళ్ల పుట్టుపూర్వోత్తరాలేంటో మీరే చెప్పండి తెలుసుకుంటాం.

    @భవాని గారూ,
    తొలుత రూపొందించిన రాజ్యాంగానికీ ప్రస్తుత రాజ్యాంగానికీ మధ్య ఎంతో తేడా వుంది. మన రాజ్యాంగం అనేకసార్లు సవరించబడింది. అప్పుడు గుర్తించని ఎన్నో కులాలను బిసీల్లో చేర్చారు. బీసీల్లో వున్న పలు కులాలను ఎస్‌సిల్లో చేర్చారు. ఈ మార్పులు చేర్పులు సహజం.
    ఇక ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకున్న దళితుల పిల్లలకు రిజర్వేషన్లు కొనసాగించడం అనవసరం అన్నది ప్రస్తుత చర్చ పరిధిలోకి రాదు. కానీ అవశ్యం దాని గురించి కూడా ఆలోచించి సత్వర నిర్ణయం తీసుకుంటే నిరుపేద దళితులకు మరింత మేలు జరుగుతుంది.

    ప్రవీణ్‌ శర్మ గారూ
    ధన్యవాదాలు.

    ReplyDelete
  22. నేను కరీంనగర్ లో నేర్చుకున్న దళిత బాషలోనే చెపుతాను విను

    మన మహేషు ఓ టాపిక్ లో జ్ఞానం, సత్యశోధన ముఖ్యం అని చెప్పుకుండు. ఇంకో టాపిక్ లో పైసల్ ఫ్రీగా వస్తే ఎవడొద్దంటడు అన్నడు. జ్ఞానం, పైసల్ రెండింటినీ ముందల పెట్టి చూపిస్తే పైసలే కావల్నంటడు. గీ మహేష్ అభిప్రాయాలే నీవని చెప్పుకున్నవు. నువ్వు కూడా అన్నింటి కంటే పైసల్ ముఖ్యం అనుకుంటున్నావా?

    ReplyDelete
  23. @పెదరాయ్డు: మాలమాదిగల విబేధాన్ని మీరు అర్థం చేసుకున్న తీరు చాలా కృతకంగా ఉంది.

    వనరుల లభ్యతలోని అసమానతలకి వ్యతిరేకంగా జరుగుతున్నదే దళితుల పోరాటం. అలాంటప్పుడు, పోరాటం బయటివాళ్ళతోనైతేనేమి లోపలివాళ్ళతోనైతేనేమి? ఇదొక సైద్ధాంతిక పోరాటం. మొత్తం జనాభాప్రాతిపదికన వనరుల్లో భాగస్వామ్యం కోరుతున్నదళితులు అదే జనాభా ప్రాతిపదికని మాలలకూ మాదిగలకూ విబేధముంటే "కొట్టుకోవడం" ఎలా అవుతుంది?

    ReplyDelete
  24. http://samudram9.blogspot.com/2009/08/blog-post_28.html

    ReplyDelete
  25. వనరుల లభ్యత, వినియోగంలో డబ్బున్న దళితులకీ, పేద దళితులకీ మధ్య కూడా పోటీ ఉంది మహేష్. ఓ కథలో ఆవు వ్యాసం చెప్పే స్టూడెంట్ కి ఆవు గురించి మాత్రమే తెలిసినట్టు నీకు కులం గురించి మాత్రమే తెలుసు కానీ ఒకే కులంలోని డబ్బున్న వాళ్ళూ, పేదవాళ్ళూ మధ్య ఉన్న వైరుధ్యాల గురించి నీకు పట్టదు.

    ReplyDelete
  26. బ్లాగ్ లోని ఫొటో చూస్తోంటే ప్రభాకర్ గారు ఉండేది వరంగల్ లేదా హనుమకొండలో అనిపిస్తోంది. మీ వరంగల్\హనుమకొండ\కాజీపేట చుట్టు పక్కల ఉన్న పల్లెలకి వెళ్ళి దళితులని చూడు. పట్టణాలలో గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే దళితులకీ, పేద దళితులకీ మధ్య ఎంత తేడా కనిపిస్తుందో. టెంత్ క్లాస్ చదువు కూడా పూర్తి చేసుకోలేక రిజర్వేషన్ వల్ల నయా పైసా ప్రయోజనం పొందలేని దళితులు చాలా మంది కనిపిస్తారు పల్లెలలో. అందరికీ నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య అందించాలి అనడానికి బదులు మా కులానికి ఇంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అనడం ప్రగతివాదం అవ్వదు.

    ReplyDelete
  27. ప్రవీణ్,

    కత్తి మహేష్ ద్వంద్వ వైఖరి మీ ఇంటికొస్తే నాకేమి ఇస్తావు మా ఇంటికి కొస్తె నాకెమి తెస్తావు అనే దానిని మీరు సమర్దవంతం గా ఎత్తి చూపారు. వారికి కావలసింది ఎమీటొ అందరికి అర్థమైంది వారికి మికన్నా ఎక్కువ డబ్బులు ఉండవచెమో గాని నిజాయితి లేక పోవడం పెద్ద లోపం. కనీసం నేను నా కాళ్ళమీద నిలబడుతాను అనె నమ్మకం మహెష్ లాంటి వారికి ఉన్నట్లు లేదు. ఇటువంటి వారు దళితస్తాన్ ఏర్పాటుగురిచి ఆలోచిస్తాం అని మాట్లాడటం వింటుంటె ఉట్టి కేక్క లేనమ్మ స్వర్గానికి ఎక్కుతా అంట్లు ఉంది. హిందూ మతం లో ఎనంత అనైక్యత ఉందో అంత కంటె ఎక్కువ లోపాలు, అనైక్యత, సిద్దంత రాహిత్యం దళిత నాయకులలో ఉన్నాయి. ఆంధ్ర దళితులకి, తమిళ నాడు, మహారాష్ట్ర దళితులకు ఉన్న కామన్ అజెండా ఉందా వారికి ఉన్న అజెండా ఒక్కటె బ్రాహ్మణులని ఆడి పోసుకోవడం. మళ్ళీ వారికి అవసరమైతె సహాయం తీసుకొనేది బ్రాహ్మణుల న్యాయవాదుల నుంచె. తిట్టేటప్పుడు బ్రాహ్మణ వాదం (ఈ వాదన అంటె ఎమీటో నాకు తేలిదు ఎక్కడైనా పుస్తకం దోరుకుతుందా బ్రాహ్మణ వాదం మీద? రచయిత ఎవరు?) అని దానిని విమర్శించటం అంతే బ్రాహ్మణులని విమర్సించటం కాదని చేప్తారు. హిందువు దళిత్ అయిన మహేష్ కీ క్రైస్తవ దళితుల రిసర్వెషన్ గురించి మాట్లాడవలసిన అవసరం ఎమిటీ?

    Navin

    ReplyDelete
  28. నేను వ్రాసిన "ధనాంధకారంలో" కథలో మాలోళ్ళ అబ్బాయి రెల్లోళ్ళ అమ్మాయిని ప్రేమిస్తే అతని తల్లితండ్రులు ఆ పెళ్ళికి ఒప్పుకోరు. http://sahityaavalokanam.net/kathanilayam/2009/august/dhanandhakaramlo.html దళితుల మధ్యే ఐక్యత లేనప్పుడు దళిత నాయకులు బ్రాహ్మణవాదాన్ని ఓడిస్తాం అంటూ స్టేజిల మీద ప్రమాణాలు చెయ్యడం హాస్యాస్పదం.

    ReplyDelete
  29. దళిత కులాలో మాల, ఆది ఆంధ్ర, పార్ధీ (వర్గీకరణని వ్యతిరేకించే కులాలు) ఒక వైపు ఉన్నాయి. మాదిగ, రెల్లి, బుడగ జంగం (వర్గీకరణకి అనుకూలంగా ఉండే కులాలు) ఇంకో వైపు ఉన్నాయి. ఆ మధ్య కొంత మంది మాదిగ వీరులు ఇలా ప్రచారం చేసే వాళ్ళు "పాము కనిపిస్తే వదిలెయ్యండి, మాలోడు కనిపిస్తే చంపెయ్యండి". అమెరికా సామ్రాజ్యవాదులు పాలస్తీనీయుల గురించి లేదా హమాస్ కార్యకర్తలు అమెరికా సామ్రాజ్యవాదుల గురించి ఇలా మాట్లాడితే విచిత్రం కాదు కానీ ఒక దళిత కులం వాళ్ళు ఇంకో దళిత కులం గురించి ఇలా మాట్లాడడం విచిత్రం.

    ReplyDelete
  30. నవీన్ గారూ, మహేష్ నాస్తికుడు. అతన్ని హిందూ అనలేం. అతను నాస్తిక తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ శిష్యుడినని చెప్పుకున్నాడు. కులం హిందూ ఐడెండిటీ అయినప్పుడు నాస్తికుడైన మహేష్ కులం పేరు చెప్పుకోకూడదు. డబ్బు బాగా సంపాదిస్తూ కూడా తన పిల్లలకి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు ఇప్పించడానికి కులం పేరు చెప్పుకోవడం ఇంకా హాసాస్యాస్పదంగా ఉంటుంది. అతని హాస్యాస్పద ఐడియాలని జస్టిఫై చేసుకోవడానికి మతం వేరు, కులం వేరు అని అంటున్నాడు. అతని పర్ణశాల బ్లాగ్ లోనే అతను హిందూ మతానికి వ్యతిరేకంగా వ్రాసిన వ్యాసాలు చదవండి.

    ReplyDelete
  31. మేథావుల విశ్లేషణలన్నీ మా బోటి వోళ్ళకి అర్ధం కావుగానీ మా సామాన్యులకు అర్ధమైంయ్యింది ఏమిటంటే.
    మన పాలకులకు ఎవరిమీదో ప్రేమ కారిపోయి ఈ రిజర్వేషన్ అనుకుంటే పొరపాటే. పెద్ద ఎత్తున మత మార్పిడి కోసం మాత్రమే ఈ ప్రయత్నాలు. దళితులకు రిజర్వేషన్లున్నాయి మత మార్పిడి తగ్గుతుంది. కానీ పాలకుల మతంలోకి ప్రజలను మార్చడం ఏనాటినుండో ఉన్న సాంప్రదాయం. పెద్దాయన పాలనలో ఓ రెండు కులాలను పూర్తిగా మత మార్పిడి చేయాలనే దీక్ష తీసున్నారు.
    ప్రస్తుతం మన రాజా వారికి మతం, పదవి, ఓట్లు ఇంతకి మించి ఎవరిపైనా ఏ విధానాలపైనా ప్రేమేంలేదు. ఇంతోదానికి ఎందుకండీ ఏవేవో అనుకుని మీలోమీరు వాదించుకుంటారు.

    ReplyDelete
  32. కాంగ్రెస్ పార్టీకి రెడ్లు, కాపుల సపోర్ట్ ఉంది. కొత్తగా ప్రజారాజ్యం వచ్చినా కాంగ్రెస్ కి ఉన్న కాపుల సపోర్ట్ చెక్కు చెదరలేదు. కొత్తగా క్రిస్టియన్ల సపోర్ట్ కోసమే ఈ రిజర్వేషన్ ప్రతిపాదన.

    ReplyDelete
  33. అందుకే మతమార్పిడి ద్వారా దళితులను సామాజికంగా బలోపేతుల్ని చేయాలని ఎంతగానో తపించారు. అందుకు ఒక మార్గాన్ని కనుగొన్న కొద్ది రోజులకే పరమపదించడంతో ఆయన ఆశయం నెరవేరలేదు. ఇక మీరు అన్నట్టు మతం మారిన వారికి అప్పుడు రిజర్వేషన్లను వర్తింపజేయలేదు.
    _________________________________________________

    Buddhists and Sikhs were/are eligible for reservations, if you consider them to be non-Hindu - but I consider anything born in India to be part of the Hindu Culture. The issue is about the relgions that are considered alien.

    అయితే అంబేడ్కర్‌ కాలంలో రూపొందించిన రిజర్వేషన్ల విషయమై అనేక సార్లు మార్పులు చేర్పులు జరగడం, అందుకు ఎన్నోసార్లు రాజ్యాంగ సవరణలు కూడా చేయడం తెలిసిందే. కాలమానపరిస్థితులు, గ్రౌండ్‌ రియాలిటీస్‌ను బట్టి సవరణలు చేయక తప్పదు.
    _________________________________________________

    So you agree that the current "extention" of the reservations to the other groups was not recommended by Ambedkar but was brought in by the succesive politicians! That was my point too. So, to sum it up, Ambedkar was no way in favor of extending the reservations to non Indian cultures/religions, but the subsequent politicians are trying to do it.

    ReplyDelete
  34. హిందువులలో ఎలాగూ కులాల అనైక్యత ఉంది కదా. ఈ రిజర్వేషన్ల వల్ల రాజకీయ పార్టీలకి హిందువుల వోట్లు ఎలాగూ పోవు. కొత్తగా క్రిస్టియన్ వోట్లు వచ్చి చేరుతాయి. ఈ విషయం తెలిసే రాజకీయ పార్టీలు హిందువుల వోట్ల గురించి భయపడకుండా ఈ ప్రతిపాదనని సమర్థించాయి.

    ReplyDelete
  35. ప్రవీణ్ శర్మ మీరేంటండి ఆయనకు కొత్తగా క్రిస్టియన్స్ ఓట్లెయటమేంటీ! వాళ్ళు గెలిపించినందుకే గదా ఆయనింకా వున్నది. వైఎస్ క్రిస్టియన్ అనే సంగతి మీకు తెలియదా?

    ReplyDelete
  36. రిజర్వేషన్లు ఇచ్చుకోనివ్వండి మరెం పరవాలేదు ఎప్పటికైనా మేథస్సుదే పైచేయి.

    పోనివ్వండి ఎవరే మతంలోకి పోయినా హిందూ మతానికి ఒచ్చిన నష్టం ఏమీ లేదు, ఉన్నతమైన జీవనాన్ని అందించే మంచి సంసృతి నుండి వారి సంతానాన్ని వాళ్ళే దూరం చేస్తున్నారు.

    ReplyDelete
  37. "'కుల రిజర్వేషన్లు మరో మతానికి పాకించడం వల్ల ఇతర మత వ్యాప్తి అవుతుంది'' అనడం లేని ''బూచి'' ని చూపించి పిల్లల్ని భయపెట్టడం లాంటిదే. ఈ వాదనలో పక్షపాతవైఖరి, పరమత ద్వేషం తప్ప వాస్తవికత లేదు. రిజర్వేషన్లు లేనప్పటినుంచీ మన దేశంలో మతమార్పిడులు వున్నాయి. రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా మునుముందు కూడా వుంటాయి.

    కొందరు వ్యక్తుల మత విశ్వాసాలు మారినంత మాత్రాన మన దేశానికి వాటిల్లే నష్టమేమీ లేదు. మతం, దేవుడు వంటి వ్యక్తిగత విశ్వాసాలను ఎవరూ నియంత్రించలేరు. మతానికీ, దేశభక్తికీ / దేశద్రోహానికీ ఏమాత్రం సంబంధం లేదు. 'పృథ్వీరాజ్‌'లు/ 'జయచంద్రులు' అన్ని మతాల్లోనూ వుంటారు."

    ప్రభాకర్ గారు, మీ వాదన కృతకంగా ఉంది. భారతదేశంలో తరతరాల నుంచి, మత మార్పిడులన్నవి భయంతోనో, దౌర్జన్యంగానో ప్రధానంగా జరిగినవి తప్ప, మనఃస్ఫూర్తిగా కాదు. (బౌద్ధం అన్నది బుద్ధుడి ధర్మం మాత్రమే. అందుకని బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి, పాటించిన వారు converts కారు). గ్రీకులు భారత దేశం మీదికి దండెత్తినప్పుడు భారతావనికి ప్రధాన సమస్య "గ్రీకుల బీజారోపం" కావడం, తద్వారా ఒక దేశం (ఆ కాలం నాటికి దేశమూ, మతమూ ఒక్కటే) తప్ప, గ్రీకుల పాలనా వ్యవస్థ మీద వ్యతిరేకత కాదు. ఆ మాటకొస్తే, అలెక్జాండరు ప్రతినిధులయిన ఫిలిప్పోసిస్ వంటి వారి పాలనా వ్యవస్థ లో ప్రజావళికి తాత్కాలికంగా కలిగిన ఇబ్బందులు లేవు. జరిగే నష్టం శాశ్వతం. ఆ నష్టాన్ని కనిపెట్టగలిగిన వాడు చాణక్యుడనే అపూర్వ మేధావి. ఆయనే అప్పుడు దేశాన్ని మొత్తం సంఘటితపర్చాడు.

    ఇకపోతే క్రైస్తవం. అసలు క్రైస్తవులకు మన దేశపు పేద వర్గానితో పనేమిటండి? క్రైస్తవ మత వ్యాప్తి జరగాలని వారు కోరుకుంటే, బుద్దుడి లాగా, తన ధర్మం ఏమిటో వివరించి, స్వచ్చందంగా ఇష్టపడిన వారిని చేర్చుకోవాలి, కానీ, ధనమూ, facilities ఎర చూపించి ప్రచారం చేసుకునే అవసరం ఏమిటండి? ప్రపంచంలో ఏ దేశంలోనూ, ఎవడికి కాబట్టని pseudo secularism, విశాల దృక్పథమూ ఇక్కడ ఈ దేశంలో పౌరులకెందుకు అసలు?

    "ఈ వాదనలో పక్షపాతవైఖరి, పరమత ద్వేషం తప్ప వాస్తవికత లేదు."

    ఇంతకంటే అనాలోచనాపూరిత వాఖ్య మరొకటి లేదు. "India has conquered china by not sending a single soldier across it's border." ఒక ప్రముఖ చైనీయుని వ్యాఖ్య ఇది. హిందూ మతం (మీరెలాగూ మతాలను విశ్వసించరు. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చేయరు. అయినా సరే) ఎప్పుడూ, ఎవరినీ నిర్బంధించలేదు. బుద్ధ బోధకు ప్రభావం చెందిన వారిలో, అనేకమంది హిందువులు, ముఖ్యంగా బ్రాహ్మణులూను. పరమత ద్వేషం అనే అవసరం ఈ దేశపు సామాన్య ప్రజలకు అవసరం లేదు. క్రైస్తవం పట్ల అత్యంత భక్తిశ్రద్ధలు, విపరీతమైన అభిమానము ఉండి, క్రైస్తవ తత్వ విచారం రుచించి, దానికోసం సర్వం త్యాగం చేయదల్చుకున్న వారికి రిజర్వేషన్ లతో పనేమిటో అసలు?

    "కొందరు వ్యక్తుల మత విశ్వాసాలు మారినంత మాత్రాన మన దేశానికి వాటిల్లే నష్టమేమీ లేదు." - నష్టం లేదు. ఆ విశ్వాసాలు మారడం ప్రలోభం వల్ల కాక స్వచ్చందంగా అయినంతవరకు మాత్రమే.

    "మతం, దేవుడు వంటి వ్యక్తిగత విశ్వాసాలను ఎవరూ నియంత్రించలేరు." - ఎవరూ నియంత్రించాలనుకోవట్లేదు కూడాను. ఆ మాటకొస్తే, వ్యక్తిగతంగా నేనూ దేవుడు అనే "entity" పట్ల పూర్తిగా నమ్మకం పెంచుకున్న వాణ్ణి కాదు.

    ReplyDelete
  38. క్రిస్టియన్లలో కూడా తెలుగు దేశంకి అనుకూలంగా ఉండే ఓ వర్గం ఉంది. క్రిస్టియన్ వోట్లు చీలకుండా రాజశేఖరుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. కొత్తగా వచ్చే క్రిస్టియన్ వోట్లంటే కాంగ్రెస్ కి దూరంగా ఉన్న క్రిస్టియన్ వోట్లు అన్న మాట.

    ReplyDelete
  39. >>అందుకే వాళ్ళు తమ ఆత్మ గౌరవంకోసం మానసిక శాంతికోసం మరో మతం వైపు చూడాల్సి వస్తోంది <<

    ఆ మరో మతం ఉన్న దేశాలలో ఇలాంటి పరిస్థితులు లేవా? ఏ దేశంలోనైనా అసమానతలు లేవా?
    మతంపై ఆవిధానాలపై విశ్వాసంతో ఒక మతాన్ని స్వీకరించాలి గానీ ఎక్కడో అలిగి ఇంకెక్కడికో పోతానంటే పోయేచొట గౌవరం గ్యారెంటీ అనుకుంటూ కానివ్వండి ఎవరు ఎవరిని బతిమిలాడి అట్టే పెట్టుకోవాలి?


    >>> ఇతర మతాల్లో మాదిరిగా హిందు మతంలో కూడా కులాల ప్రాధాన్యత తగ్గి సమానత్వం సహోదరత్వం పరస్పర ప్రేమాభిమానాలు పెరిగితే ఎవ్వరూ హిందూ మతాన్ని వీడిపోయే పరిస్థితే ఉండదు <<<

    ప్రేమాభిమానాలు ఏవిధంగా ఎవరిపై ఎవరు చూపాలంటారు?
    ప్రపంచంలో ఏ వ్యక్తినైనా ప్రేమించమని కట్టడి చేయగలమా? వేరే ఏవిధమైన మర్యాదలు చూపాలంటారు? ఎవరింటి పెళ్ళి? దేశం లో సమస్యలు అన్ని కులాలవారికీ ఉన్నాయి ఫలానా గొప్ప కులమనగానే ఆయాచితంగా ఎవరికీ ఏదీ దొరకదు.

    (పోనీ బలవంతంగా ప్రతి బ్రాహ్మణ స్త్రీ కి దళితుడితో బిడ్డను కనే చట్టం చేస్తానంటారా?) అప్పుడొస్తుందా మనుషులకు ఒకరిపై ఒకరికి గౌరవ ప్రేమాభ్మానాలు !

    ReplyDelete
  40. ప్రభాకర్ గారూ,
    ఇప్పటి వరకూ చర్చ బాగుంది. కానీ, నావి కొన్ని ప్రశ్నలు.
    క్రైస్తవంలోకి మారిన మైనారిటీలకి, సాధారణ మైనారిటీలకంటే ఎక్కువ వనరులు లభ్యం అవుతాయి, రిజర్వేషన్ వర్తించే పక్షంలో.అప్పుడు మత మార్పిళ్ళు ఎక్కువ అవడం సహజం.
    కానీ ప్రభుత్వమే పూనుకుని చెయ్యడం ఓటు బాంకు రాజకీయాలకి పరకాష్ఠ.

    ఇది ముందు ముందు వెనుకబడిన వర్గాలకి ఊహించనంత చెడు చేస్తుందని నా ఉద్దేశం. ఇప్పటికే మాల మాదిగల మధ్య సమన్వయం లేదు. ఇప్పుడు కొత్తగా క్రైస్తవ మైనారిటిలంటూ ఒక వర్గం, ఈ కొత్త రిజర్వేషన్ల పుణ్యమా అని ఇప్పుడు ఉన్న వారికంటే ఎక్కువ అవకాశాలూ, వనరులూ అనుభవించడం మొదలు పెడితే, ఏ కుల వ్యవస్థ వల్ల నష్టపోయారో, ఇంచు మించు అలాంటి class system అనేది SCల్లో కూడా తయారవుతుంది. అప్పుడు SCలందరూ మూకుమ్ముడిగ క్రైస్తవం పుచ్చుకోవడమే దానికి పరిష్కారం. అది ఎలాగూ జరగదు. కోతి పుండు బ్రహ్మ రాక్షసి ఐనట్టు, సమస్య మరింత జఠిలమవుతుంది. ఏ వర్గం వారూ ఏకమై పోరాటం చెయ్యలేని పరిస్థితి సృష్టించడం, రాజకీయ నాయకులకి వెన్నతో పెట్టిన విద్య. I feel there's more to it than vote bank politics. This is an attempt to permanently damage the unity among backward classes, so that each group can be exploited when needed.

    ReplyDelete
  41. ఏంటండీ ఎవరకి ఎవరు గౌరవం చూపుతున్నారు ? స్వంతవారినుండే ప్రేమాభిమానాలు ఆశించే రోజులుకావు!
    ఎనభై శాతం మార్కులు వచ్చినా కళ్ళముందే ముఫై శాతం మార్కులు వచ్చిన వాడు ఉద్యోగం తన్నుకుపోతూ ఉంటే వచ్చే ప్రస్టెషన్ లో వాడూ మరొక మతం వారెవరైనా అన్నం పెడితే తన ఉన్నత కులాన్నే వదుకొవాలసిన రోజులొచ్చాయి.

    డివైడ్ అండ్ రూల్ మొదలయ్యింది ఇంకే కొట్టుకుచావండి అంటున్నారు పాలకులు .
    సహకార సేద్యం అంటున్నారు ఇకముందు రైతులకు భూమి ఉండదు, ధరలు పెరిగి సామాన్యుడు పేదరికం వైపు ఒరుగుతున్నాడు అక్రమాలు చేస్తున్నారు. అవినీతిప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పౌరులందరూ ఇలా రెండు గ్రూపులుగా చేరి కొట్టుకుచస్తున్నారు!

    ReplyDelete
  42. ఇక్కడ ఒక వ్యక్తి క్రైస్తవము పొగ్రసివ్ మతమని రాశారు. అందులో ఉన్న ప్రొగ్రెసివ్ ఆలోచన విధానం వారికే తెలియాలి. ఇది మా ఇంటి పనిమనిషి సంగతి ఆమే కోడుకు తాగుడుకు బానిసై రోజు కోడలిని కోడుతుంటె మన క్రైస్తవ మార్కేటింగ్ కంపేని వారు ఆమేను నువ్వు మా మతం లోకి మారూ మీ అబ్బాయి బాగుపడతాడు అని మార్చి, ప్రతి ఆది వారం చర్చ్ కి తీసుకేల్లి బుర్ర కడిగారు. దాని ఫలితం ఆమేకి మేము ఇచ్చె/పెట్టె ప్రతి తిండి పదార్థం హిందూ దేవుడి కి నైవేద్యం పేట్టలేదని చెప్పాలి అప్పుడు కాని ఆమే తినదు. ఇది కూడా నాకు తెలిసి ఒక విధమైన అంటరానితనం లాంటిది. లేక పొతే తిండి విషయం లో ఈ నిభందన్ లేమిటి? ఆ చదువు రాని వారికి సిగ్గు ఎగ్గు లేకుండా ఇటువంటి వాటిని హిందు దేవుళ్ళ ప్రసాదాలను తిన కూడదని ఎలా నూరీ పోస్తారు? చర్చ్ వారు ఇలా చేస్తారని తెలిసినా మహేష్ బోటి వారు ఒక్క సారి కూడా పాస్టర్లకు వ్యతిరేకం గా ఒక్క మాట రాయలేదు. ఇక పాస్టర్లు టి.వి. పోగ్రం కి వచ్చినపుడు చాలా అందం గా అబద్దాలు చెపుతారు. వారు ఎవ్వరిని వారి మతం లోనికి రమ్మనలేదని వారె చేరారని. అలాగైతే మావిధి లో ఒక్క క్రైస్తవుడు లేక పోయినా గోడల మీద కావాలనే రోజు బైబిల్ సూక్తులు రాయటం రెచ గోట్టటం కాదా? నీతి నిజాయితి లేని వీళ్ళు మళ్ళీ ప్రజలను మూఢనమ్మ కా లవైపు తీసుకొని పోతుందనటం లో ఎటువంటి సందేహం లేదు. కానీ కత్తి లాంటి వారికి వందల సంవత్సరాల క్రితం ఉన్నహిందూ మతం మూడన్నమ్మకాలత గురించి రాసి ఇప్పుడు అదీ ఈ కంప్యుటర్ యుగం లో తిండి వస్తువులకు మతం ఆపాదించే నీచులను గురించి ఎక్కడా ప్రస్తావించరు. అది వారికి మూడనమ్మకాలు కావేమో!!!ఇంతకీ ప్రభువు మహత్యంతో అతను త్రాగుడు మా నాడా అంటె అది ఎమీ లేదు. ఆమేకు అంటిచారు అనుమానపు రోగం, కొత్త మూడనమ్మకం అది క్రైస్తవ మతం యొక్క ప్రొగ్రెసివ్ నెస్ . ఇంత మూడనమ్మకాలను ఇతర మతాలపై నూరి పోసేవారు దేశం ఐకమత్యన్నికి ఎలా తోడ్పడతారో ఈ వ్యాస రచయితకే తెలవాలి.
    అసలికి దళితులకి ఈ మతం లో మారిన తరువాతా వొరిగిండెమిటొ ఒక్కరూ చెప్పరూ. నాకు తెలిసి హైదరాబాద్ లో ఒకసారి దళితు లు చర్చ్ ముందర దర్నా చేసారు కారణం అగ్రవర్ణానికి చెదిన వ్యక్తికి వారు పాస్టర్ పదవి అంట కట్టారు, మెజారీటీ దళితులకి మోచేయి చూపారు. ఇది అక్కడ వారికి జరిగే సన్మానం. ఇటువంటి సంఘ్టనలు తమిళనాడులో కోకొల్లలు.

    ReplyDelete
  43. *ఆయన గనక బౌద్ధమతాన్ని స్వీకరించిన తరువాత మరో పది సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో బ్రతికి వుంటే భారత దేశంలోని దళితుల జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చివుండేవనిపిస్తుంది నాకు*

    మందార గారు, మీరు నారాయణ గురు, గాంధీల సంభాషణ రాశారు. సంతోషం. ఎలా ఐతె మీరు అంబెద్కర్ బతికి ఉంటె మీకు దళితుల జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చివుండేవనిపిస్తుందో, నాకు నారయణ గురువు గారు ప్రస్తుతం జరుగుతున్న క్రైస్తవ మతాంతీకరణలూ చూస్తె వారు తన అభిప్రాయాలను మార్చు కునే వారని అనిపిస్తుంది. గాంధీగారి తో ఏకీభవించె వారని అనుకుంటాను.

    మహాత్మా గాంధీ: కానీ వాళ్లు మత మార్పిడి చేసుకుంటున్నది అందుకు కాదు. ఏవో కొన్ని సౌకర్యాలు, హక్కులు పొందేందుకు మాత్రమే వాళ్లు వెళ్లిపోతున్నారు.
    శ్రీ నారాయణ గురు: అ లాంటప్పుడు ఆ సౌకర్యాలూ హక్కులూ ఏవో వాళ్లకి మీరే కల్పించండి. అప్పుడు వాళ్లు హిందువులుగానే వుండిపోతారు కదా.
    *ఆ దళితులను ఉద్ధరించేందుకు రిజర్వేషన్ల ద్వారా నడుం కట్టింది మాత్రం కేవలం స్వతంత్ర భారత ప్రభుత్వం తప్ప హిందూ మతం కాదు.*
    పోని మీరు చెప్పిన విధంగా స్వతంత్ర భారత ప్రభుత్వం నడుం కట్టి వారి అభివృద్దికోరకు ఎన్నొ పథకాలను చెస్తే ఇంకా కూడేందుకు మతం మారాలి? నారాయన గురువు గారు చెప్పిన విధం గా సౌకర్యాలూ హక్కులూ గాంధి గారి పార్టి అయిన కాంగ్రెస్ పార్టి వారు కలి పించారూకదా. మరి వారు మతం మారటమేందుకు? దాని ని సమర్ధిస్తే మీ బోటి వారు ఎందుకు సమర్ధిస్తారు ?

    Jivan

    ReplyDelete
  44. నిజంగా హిందూ మతం మీద నమ్మకం లేకపోతే మతం మారొచ్చు. బైబిల్ పాత నిబంధనలూ, కొత్త నిబంధనలూ కలిపి మొత్తం 60కి పైగా గ్రంథాలు ఉన్నాయి. వీటిలో ఒక్క పేజి కూడా చదవకుండా ఆర్థిక ప్రయోజనాలని ఆశించి మతం మార్చుకోవడం మాత్రం తప్పే.

    ReplyDelete
  45. క్రైస్తవ మతంలో చేరిన తరువాత కూడా కులం కట్టుబాట్లని కొనసాగించే వాళ్ళు క్రైస్తవ మతం అణగారిన కులాల వాళ్ళకి గౌరవం ఇచ్చింది అనడం ఏమిటి? వీళ్ళ థీసిస్ నాకు అర్థం కావడం లేదు.

    ReplyDelete
  46. నాస్తికుడిగా నేను ప్రభాకర్ కి కొన్ని ప్రశ్నలు అడిగాను. అతను సమాధానం చెప్పలేకపోయాడు. "హిందూ మతం ఊహాజనితమే కానీ వాస్తవంగా ఎన్నడూ లేదు. మతం మిథ్య, కులం నిజం" అని అన్నాడు. మతం ఊహాజనితమనే విషయం జనానికి తెలిసినదే అయితే పల్లెటూర్లలో పండగల నాడు జనం జంతు బలులు ఇవ్వడం, గుడి దగ్గర వేప మండలతో బాదుకుంటూ డాన్స్ చెయ్యడం లాంటివి చేసే స్థితిలో ఎందుకు ఉన్నారు? "మతం అజ్ఞానం, సైన్స్ ప్రగతికి ప్రతిరోధం" అంటూ పుస్తకాలు వ్రాసిన మనం సడెన్ గా మాట మార్చి ఇలా మాట్లాడితే మనం డబ్బుల కోసమే నాస్తిక పుస్తకాలు వ్రాసామని జనం అనుకుంటారు. అప్పుడు నాస్తికత్వమే ఓడిపోతుంది. రిజర్వేషన్ల కోసం మత ఐడెంటిటీ అయిన కులం పేరు చెప్పుకున్నా నాస్తికత్వం ఓడిపోతుంది. అందుకే మందార ప్రభాకర్ నీ, కత్తి మహేష్ నీ తీవ్రంగా విమర్శించాల్సి వచ్చింది.

    ReplyDelete
  47. @ మలక్‌పేట్‌ రౌడి గారు,
    స్వదేశీ మతం, విదేశీ మతం అనేది కాకుండా దళితులకు తరతరాలుగా జరిగిన అన్యాయం ప్రాతిపదికగా రిజర్వేషన్లు వర్తింపజేయడమే న్యాయమని నా భావన. కొందరు దళితులు విదేశీ మతంలో చేరినంత మాత్రాన వారిపట్ల ప్రభుత్వ బాధ్యత తీరదు. వారిపట్ల మరో వివక్ష చూపడం భావ్యం కాదని నా ఉద్దేశం. ఇక మీ రెండో వ్యాఖ్యతో నేనూ ఏకీభవిస్తున్నాను. నా గత సమాధానం సారాంశం కూడా అదే కదా.

    @ రవి గారూ,
    మన బౌద్ధ మతం చైనా, జపాన్‌, బర్మా, కాంబోడియా తదితర దేశాలకు వ్యాపించడం మనకు గర్వంగా అనిపిస్తుంది. కానీ జెరూసలేంలో పుట్టిన క్రైస్తవం ఇతర దేశాల్లో లాగే మన దేశంలో ప్రవేశిస్తే అసహనంగా వుంటుంది.
    అమెరికన్లు ''హరేరామ హరేకృష్ణ'' అంటూ భజనలు చేయడం, విదేశీయులు సత్యసాయిబాబాకు లక్షలు, కోట్ల డాలర్ల నిధులు సమకూర్చడం మనకు సంతోషం కలిగిస్తుంది. క్రైస్తవులు విదేశీ నిధులతో స్వయంగా ఇక్కడ పాఠశాలలు, విద్యాలయాలు, అనాధ శరణాలయాలు నిర్వహించడం కంటగింపుగా వుంటుంది.
    మీకు ఇక్కడి బీదవాళ్లతో పనేమిటని వాళ్లని నిలదీస్తాం. గ్రాహం స్టెయిన్‌ను అతని ముక్కుపచ్చలారని కుమారులను (ఒరిస్సా) సజీవదహనం చేసేందుకు కూడా వెనుకాడనంత అసహనం ... అదీ ఈ ప్రపంచీకరణ కాలంలో... ఇది ఎంతవరకు వాంఛనీయం.

    దళిత హిందువులకంటే ఏమాత్రం మెరుగ్గా లేని నాకు తెలిసిన నిరుపేద దళిత క్రైస్తవులను దృష్టిలో పెట్టుకునే ఈ టపా రాశాను తప్ప నాకు క్రైస్తవం మీద అభిమానం ఏమీ లేదు. తమ పిల్లలకు వేలు, లక్షల డొనేషన్లు కట్టి, విదేశాలకు పంపి చదివించగల సంపన్న క్రైస్తవులకు ఈ రిజర్వేషన్లు వర్తింపజేయనవసరం లేదన్నదే నా భావన కూడా.

    @ వేమన గారూ
    రాజకీయ పార్టీలు మారినంత సులువుగా ఎవరూ మతం మారరు. మత మార్పిడి వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయం కాదు, కుటుంబపరంగా, సామూహికంగా తీసుకునే నిర్ణయం. మత మార్పిళ్లకు ఎదుటి మతాలను ఆడిపోసుకునే బదులు మన మతంలోని లోపాలను సరిదిద్దడం మీద దృష్టిని కేంద్రీకరిస్తే బాగుంటుంది. ఆనాడు గాంధీజీతో శ్రీనారాయణ గురు చెప్పింది ఇదే. ఇక ఈ రిజర్వేషన్ల వల్ల మీరనన్నట్టు కొన్ని కొత్త సమస్యలు ముఖ్యంగా వర్గీకరణ పరిథిలో ఉత్పన్నంకావచ్చు. అయితే అవి పరిష్కరించలేనంత జటిలమైనవి కావు. ఆ భయంతో నిరుపేద దళిత క్రైస్తవులను వారి ఖర్మానికి వారిని వదిలేయడం భావ్యం కాదు. వాళ్లేమీ విదేశాలనుంచి ఊడిపడ్డ వారు కాదు కదా. ఇక మన రాజకీయాలంటారా .... అంతే.

    @ ఎనానిమస్‌, @ ప్రవీణ్‌ శర్మ
    మీ స్పందనలకు ధన్యవాదాలు. పరస్పర అభిప్రాయాలను గౌరవించుకుంటూ ఈ చర్చను ఇక ఇంతటితో ముగిద్దాం.
    I may disapprove of what you say, but I will defend to the death your right to say it -- Voltaire

    ReplyDelete
  48. ప్రభాకర్ గారూ,
    మత మార్పిళ్ళకు వేరే మతాన్ని ఆడిపోసుకోవడం నా ఊద్దేశం కాదు.
    క్రైస్తవంలోకి మారే వాళ్ళకి చర్చ్ ఎలాంటి సదుపాయాలని కలుగజేసినా నాకేమి ఇబ్బంది లేదు. కాని ప్రభుత్వమే పూనుకుని వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తాం అనడం హాస్యాస్పదం. అంటే దళిత హిందువు అవ్వడం కంటే దళిత క్రైస్తవుడివి అయితే ఇంకా మంచిది అని ప్రభుత్వమే మైక్ లో చెప్తున్నట్టుంది. నా వాదమల్లా ఎవరో మతం మారిపోతారని కాదు, హిందూ మతానికే కట్టుబడి ఉన్న నిరుపేద హిందూ దళితులకి ఇది అన్యాయం అని. వాళ్ళ కళ్ళ ముందే సాటి దళితులు ఒక్క మతం మారడం మూలంగా మెరుగైన జీవితం అనుభవించడం. ఇది కచ్చితంగా విద్వేషాలని రేపుతుంది.
    ఇక ఇలాంటి సమస్యలు జఠిలం కాదు అంటారా, వర్గీకరణ విషయం ఆత్మాహుతులవరకూ ఎందుకు వెళ్ళింది మరి ?

    ReplyDelete
  49. ప్రభాకర్ గారు,
    హిందూ మతంలో వివక్షత ఉందన్నారు. తర్వాత మతమే లేదు పొమ్మన్నారు. ఆ తర్వాత హిందూ మతాన్ని వదిలేయాలన్నట్టు చెప్పారు. దళితులకు క్రైస్తవంలో చేరినా రిజర్వేషన్లివ్వాలనే ప్రతిపాదన వ్యతిరేకిస్తే, పరమతద్వేషమన్నారు.ఇప్పుడు క్రైస్తవం మీద అభిమానం లేదంటున్నారు.

    మీరు ఒక్క సంఘటన చెప్పారు. గోవాలో సారస్వత బ్రాహ్మణులను ఊచకోత కోసి, మిగిలిన వారిని కన్వర్ట్ చేసినప్పుడు, క్రుసేడ్లు జరిపినప్పుడు, జోన్ ఆఫ్ అర్క్ వంటి దేశభక్తులను సజీవదహనం చేసినప్పుడు, గెలిలియో వంటి శాస్త్రవేత్తలను వీధికి లాగి చావగొట్టినప్పుడు, మొన్నటికి మొన్న ఓషో ను విష ప్రయోగంతో చంపించినప్పుడు క్రైస్తవంలో కౄరత్వం కనబడలేదా?

    "కానీ జెరూసలేంలో పుట్టిన క్రైస్తవం ఇతర దేశాల్లో లాగే మన దేశంలో ప్రవేశిస్తే అసహనంగా వుంటుంది. "

    బుద్ధబోధ ఇతరదేశాలలో వ్యాప్తిచెందిన విధానం,క్రైస్తవ మత వ్యాప్తి, రెండూ ఒక్కలాంటివనడం - నేనేమీ చెప్పను.

    ReplyDelete
  50. స్వదేశీ మతం, విదేశీ మతం అనేది కాకుండా దళితులకు తరతరాలుగా జరిగిన అన్యాయం ప్రాతిపదికగా రిజర్వేషన్లు వర్తింపజేయడమే న్యాయమని నా భావన.
    _________________________________________________

    ఒక్క విషయం చెప్పండి - రిజర్వేషన్లు పొందిన ఎంతమంది (దొంగ) క్రైస్తవులు వివక్షకు గురైయారు? ( తర తరాలుగా అని అనద్దు - ఆ తరాలు ఇప్పుడు లేవు) - ఇప్పుడున్న తరంలో ఎంతమంది అనేది నా ప్రశ్న.


    అలగే ఇప్పటికీ వివక్షకు గురౌతున్న దళితులలో ఎంతమందికి రిజర్వేషన్ దక్కనిస్తున్నారు?


    ... మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి, అన్నట్టు .... మా తాతలు వివక్షకు గురైయ్యారు, మా ముని మనవళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వండి అనేది కొత్త నినాదం.


    Let the Christian Pastors openly declare that they also practice Casteism in Christianity, then once can start about reservations for DOWNTRODDEN CHRISTIANS.

    On the one hand, Christians Pastors say that they have no castes but on the other they demand caste based reservations .... that leads to this problem. LET THE PASTORS DECLARE THAT CHRISTIANITY ALSO DISCRIMINATES PEOPLE BASED ON THE CASTE AND THEN LET THE GOVT DECIDE ON THE RESERVATIONS. IT WILL BE INTERESTING!

    ReplyDelete
  51. ఈ రెండుటపాల మొదటిభాగంలో, మీరిలా రాసారు..

    1. "ఈ దేశాన్ని వేలాది సంవత్సరాలుగా హిందూమతమే (మను ధర్మమే) ఇష్టారాజ్యంగా పాలించింది."
    2. "ఈ అన్యాయాన్ని సరిచేసేందుకే ... హిందూమతం/హిందూ పాలక వర్గాలు దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో తరతరాలుగా చేసిన అన్యాయాన్ని కొంతైనా సరిదిద్దేందుకే రిజర్వేషన్లు వచ్చాయి. అంతే తప్ప రిజర్వేషన్లు హిందూ మతాన్ని ఉద్ధరించడానికి వచ్చినవి కావు. రిజర్వేషన్లకీ హిందూ మతానికీ సంబంధంలేదు."
    3. "ఈ రిజర్వేషన్ల వల్ల హిందూ మతంలో దళితుల హోదా ఏమీ పెరగదు."

    పై మూడుచోట్లా హిందూమతం ఉన్నది.

    4. "నిజానికి హిందూ మతం అనేది ఊహల్లోనే తప్ప వాస్తవికంగా ఎన్నడూ లేదు. హిందూ ధర్మం, మను ధర్మంలనే మతంగా పరిగణిస్తున్నారు."

    ఈ చివరి పాయింటుకొచ్చేసరికి, హఠాత్తుగా హిందూమతం ఎన్నడూ లేదు.

    ఊహల్లోనే తప్ప వాస్తవికంగా లేకపోవడమంటే ఏంటో వివరించండి. ఊహల్లో కాకుండా వాస్తవంగా ఉన్న మతమేంటో చెప్పండి. అసలు మతమనేది ఎలా ఉండాలో ఎలా ఉంటే దాన్ని వాస్తవిక మతమని, ఎలా ఉంటే దాన్ని ఊహామతమనీ అంటారో చెప్పండి.

    ReplyDelete
  52. @మలక్పేట రౌడి: రిజర్వేషన్ ఉన్నది వివక్షను రూపుమాపడానికి కాదు.తరతరాలుగా వంచితులైనవారికి అవకాశాలను అందించడానికి. కాబట్టి వివక్షను రిజర్వేషన్నూ ఒకటిగా చేసి వాదించకండి.వివక్షని ఎదుర్కోవడానికి చట్టాలున్నాయి. రిజర్వేషన్ address చేసేది వివక్ష ద్వారా కోల్పోయిన అవకాశాలను అందించి social equalization కు దారిని ఏర్పరచడానికి.

    తరతరాల "accumulative disadvantage" ని compensate చెయ్యడానికి కనీసం నాలుగు తరాలుపట్టదా? అందరు దళితులూ రిజర్వేషన్ను మూడు-నాలుగు తరాలు అనుభవించేవరకూ కావాలి. కొందరు స్వచ్చందంగా మధ్యలోనే వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కొందరు ఇప్పటికే వదులుకున్నారు.

    ReplyDelete
  53. రిజర్వేషన్ ఉన్నది వివక్షను రూపుమాపడానికి కాదు.తరతరాలుగా వంచితులైనవారికి అవకాశాలను అందించడానికి.
    ________________________________________________

    I agree. కానీ ఇక్కడ నా ప్రశ్న, తాత వంచితుడైతే, మనవడికి రిజర్వేషన్ కావాలా అని. అలాగే ఇప్పుడు రిజర్వేషన్ పొందుతున్న వారిలో వంచితులెంతంది? ఇపటికీ వంచననెదుర్కుంటున్న వారికి ఎంతమందికి రిజర్వేషన్ దక్క్కుతోంది అని కూడా. ఈ వంచన క్రిష్టియన్లలో కూడా ఉంది అని వారొప్పుకుంటున్నారా?

    ఒక విషయం మాత్రం మనిద్దరికీ తెలుసు. ఇది మూడు తరాలతో ఆగేది కాదు అని :)) అలా ఆపడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారి మనుగడే ప్రశ్నార్ధకమౌతుంది. "దళితులని ఎవరూ ఉద్దరించక్కరలేదు. వాళ్ళ సంగతి వాళ్ళూ చూసుకుంటారు. రిజర్వేషన్లు తీసుకునే స్థాయి దగ్గర నుండీ, మిగతావారికి రిజర్వేషన్లు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు" అని ఒక సారి కాన్షీరాం అంటే "దళితులకు రిజర్వేషన్లు వద్దన్న కాన్షీరాం" అని ప్రచారం చేసి బీ.యస్.పీ సీట్లకి గండి కొట్టిన ఘనత మన పార్టీలది!

    ReplyDelete
  54. @ వేమన, @ రవి, @ మలక్‌పేట్‌ రౌడి, @ చదువరి

    చర్చ అసలు అంశం నుంచి డీవియేట్‌ అవుతున్నట్టు, ప్రస్తావించిందే మళ్లీ మళ్లీ ప్రస్తావించాల్సి వస్తున్నట్టు అనిపిస్తోంది. అయినా మరోసారి క్లుప్తంగా నా అభిప్రాయాల్ని వివరించేందుకు ప్రయత్నిస్తున్నాను.

    వేమన గారూ
    ''వర్గీకరణ'' విషయంలోనే కాదు ఆనాడు వి.పి.సింగ్‌ ప్రభుత్వం ''మండల్‌ కమిషన్‌''ను అమలు పరిచినప్పుడు కూడా ఎన్నో ఆత్మాహుతులు, ఎంతో ఆందోళనా జరిగాయి. కొందరికి న్యాయ మనిపించింది మరికొందరికి అన్యాయ మనిపించడం ఎప్పుడూ వుంటుంది. ఈ అంశం కూడా అంతే. ప్రజాస్వామ్యంలో పర్యవసానాలతో నిమిత్తం లేకుండా మెజారిటీ అభిప్రాయం/నిర్ణయమే అమలవుతుంది.

    మొత్తం దళితులందరూ వివక్ష బాధితులే, కులసర్ప దష్టులే. కాబట్టి రూల్‌ ప్రకారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల ప్రయోజనం అందరికీ వాళ్ల ప్రస్తుత మత/దైవ విశ్వాసాలతో నిమిత్తం లేకుండా సమానంగా దక్కడమే న్యాయం. దీని వల్ల విద్వేషాలు రేగుతాయని, మతమార్పిడులు పెరుగుతాయని నేనైతే భావించడం లేదు.

    ''మిమ్మల్ని సృష్టించిందే మేము, మా వల్లనే మీకు రిజర్వేషన్లు వచ్చాయి కాబట్టి మీరంతా ఎప్పటికీ పంచములుగా కొనసాగితేనే రిజర్వేషన్లను వర్తింపజేస్తాం లేకుంటే లేదని'' వర్ణవ్యవస్థ అనగలుగుతుందేమో గానీ లౌకిక ప్రజాస్వామిక ప్రభుత్వం అనలేదు. అనకూడదు.

    రవిగారూ
    హిందూమతం అనేది లేదని శ్రీనారాయణగురు ఎప్పుడో చెప్పారు. ఆయన కొటేషన్‌నే నేను పైన ఉటంకించాను. హిందూ మతం అన్న పద ప్రయోగం వేదాలలో గానీ, రామాయణ మహాభారతాలలో గానీ ఎక్కడా కనిపించదనీ, అసలు హిందూ అన్న పదం సింధూ నది నుంచి అపభ్రంశంగా వచ్చిందనీ, సింధుస్థానే హిందుస్థాన్‌ అయిందనీ, ముస్లింలూ, క్రైస్తవులూ కానివారిని అంటే ఈ దేశ మూలవాసులను విదేశీయులే మొట్టమొదటగా 'హిందువులు' అని సంబోధించడం ప్రారంభించారని, అంతవరకు ఆ పదమే ఉనికిలో లేదనీ అంటారు. క్రైస్తవం, ముస్లిం మతాల ప్రస్తావన వచ్చినప్పుడే హిందూమతం అన్న పదం ముందుకొస్తుంది. అన్య మతాల ప్రస్తావన లేకపోతే మనకు కులం తప్ప మతంతో నిమిత్తం వుండదు.

    సరే, ఇక్కడ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అన్నది ప్రధానాంశం కనుక దయచేసి ''హిందూమతం'' అన్న చోట ''వర్ణవ్యవస్థ'' అన్న పదాన్ని దృష్టిలో పెట్టుకుని చూడగోరుతున్నాను.

    క్రుసేడ్లు, జోన్‌ఆఫ్‌ ఆర్క్‌, గెలీలియో, శైవ వైష్ణవ మతాల ఘర్షణలు, హర్షవర్ధనుని అనంతరం పుష్యమిత్ర తదితర వైదిక రాజులు బౌద్ధ సన్యాసులపై సాగించిన ఊచకోత, బౌద్ధ ఆరామాల విధ్వంసకాండ వంటి అంశాల లోతుల్లోకి వెళ్తే మన ప్రధానాంశం మరింతగా డీవియేట్‌ అవుతుంది. కాబట్టి వాటిని ప్రస్తుతానికి వదిలేద్దాం.

    మలక్‌పేట్‌ రౌడీ గారూ
    అసలు దళితులకు రిజర్వేషన్లను మీరు ఆమోదిస్తున్నారా? అయితే ఏ ప్రాతిపదికన? ''తరతరాలు అనవద్దు - ఆ తరాలు ఇప్పుడు లేవు'' అన్నారు. అంటే రిజర్వేషన్ల ప్రాతిపదికనే మీరు విస్మరిస్తున్నారు.

    ప్రపంచంలో ఎక్కడా లేని వర్ణ వ్యవస్థ మన దేశాన్ని 3000 సంవత్సరాలు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలింది. అసలు ''రిజర్వేషన్లు'' మొదలయిందే వర్ణ వ్యవస్థతో. దేవుడి పేరుతో కులాలను ఏర్పాటు చేసి అగ్రవర్ణాల వారు మంచి ఉద్యోగాలను దక్కించుకుని రెక్కలు ముక్కలు చేసుకునే ఉద్యోగాలను శూద్రులకు కేటాయించారు.

    ఇక పంచములను/దళితులను అయితే మరీ దారుణంగా వంచించారు. వాళ్లపై అంటరానివాళ్లు అన్న ముద్రవేసి, ఊరు చివరికి తరిమేసి జంతువులకంటే హీనంగా చూశారు. ఆ వర్గానికి జరిగిన తీరని అన్యాయాన్ని సరిదిద్దేందుకే స్వతంత్ర భారత ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆ దళితుల్లో కొందరి మత విశ్వాసాలు మారినంత మాత్రాన వారు దళితులు కాకుండా పోతారా? వారికి జరిగిన అన్యాయం అంతా హుష్‌ కాకి అయిపోతుందా?

    ఈతరం వారికి వివక్ష లేకుండా చూసేందుకు భారత ప్రభుత్వం ఎప్పుడో ''అంటరానితనాన్ని'' నిషేధించింది. ''ఎస్‌సి ఎస్‌టి అట్రాసిటీస్‌ యాక్ట్‌ని'' ప్రవేశపెట్టింది. కాబట్టి ఇప్పుడు వివక్ష ఎదుర్కొంటున్న వారికే రిజర్వేషన్లు ఇవ్వాలి అన్న మీ వాదన సరికాదు. పాస్టర్లు క్రైస్తవంలో కూడా కులాలున్నాయని ప్రకటించి రిజర్వేషన్లకు అర్హత పొందాల్సిన అవసరం కూడా లేదు. వాళ్లు మా దగ్గర అందరూ సమానమే అని ప్రకటించినా అది నిజంకాదు. మన కులవ్యవస్థ ఎంత బలమైనదంటే అది మన దేశంలో అడుగుపెట్టిన క్రైస్తవ ముస్లిం మతాలను కూడా కమ్మేసిందన్నది కాదనలేని సత్యం.

    చదువరి గారూ,
    మీ ప్రశ్నలకు పై సమాధానాలు సరిపోతాయనుకుంటున్నాను.
    అగ్రవర్ణాలవారిలో, అక్షరాస్యులలో వున్నట్టు హిందూ మత భావన నిమ్నకులాల్లో, ఎస్‌సి ఎస్‌టిల్లో లేదు. వారు మీ కులం ఏమిటి అంటే చెప్పినట్టు మీ మతం ఏమిటి అంటే చప్పున చెప్పలేరు. ఎందుకంటే వాళ్లకి కులంతో సంబంధం వున్నట్టు మతంతో లేదు. ఏ కులానికి ఆ కులం ప్రత్యేకంగా సంఘటితమై వున్నాయి. కుల కార్యక్రమాలే తప్ప మత కార్యక్రమాలు వాళ్లు ఎరుగరు.
    నేను ఈ టపాల్లో '' హిందూమతం '' అనే పదం స్థానంలో ''వర్ణ వ్యవస్థ'' అనే పదాన్ని వాడివుంటే దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అన్న సబ్జెక్ట్‌ ఇలా డీవియేట్‌ అయి వుండేది కాదని ఇప్పుడనిపిస్తోంది.

    ReplyDelete
  55. అసలు దళితులకు రిజర్వేషన్లను మీరు ఆమోదిస్తున్నారా? అయితే ఏ ప్రాతిపదికన? ''తరతరాలు అనవద్దు - ఆ తరాలు ఇప్పుడు లేవు'' అన్నారు. అంటే రిజర్వేషన్ల ప్రాతిపదికనే మీరు విస్మరిస్తున్నారు
    _________________________________________________

    రిజర్వేషన్ల ప్రాతిపదిక - చదువుకోగలిగిన, ఉద్యోగం చేయగలిగిన సత్తా ఉండి, సాంఘికంగా అవకాశం రానివారికి పరిమిత కాలం పాటు ఇవ్వవలసిన చేయూత. కొన్ని తరాల తరవాత (నా దృష్టిలో రెండు - మహేష్ దృష్టిలో మూడు) వీటిని ఆపెయ్యాల్సిందే ( కానీ మీకు నాకూ కూడా తెలుసు ఇవి ఆగవని - అది వేరే విషయం). అణచివేత అనేది సాంఘిక దురాచారం - జెనెటిక్ వ్యాధి కాదు. తాతని అణచివేస్తే అది మనవడికి అంటుకోదు (తండ్రికూడా అణచివేయబడీతే తప్ప).

    ఇక క్రిష్టియన్లు చెబుతోంది తప్పని మీరంటున్నారు కానీ వారు ఒప్పుకోవడం లేదే! వాళ్ళలో కులాలు ఉనాయి అని వాళ్ళెందుకు ఒప్పుకోవడం లేదు. ప్రాగ్రెసివ్ రిలిజియన్ అనే ఇమేజ్ కి దెబ్బ అనా :))

    అన్నట్టు ప్రమోషన్లలో రిజర్వేషన్లకి నేను వ్యతిరేకం.

    ReplyDelete
  56. ''మిమ్మల్ని సృష్టించిందే మేము, మా వల్లనే మీకు రిజర్వేషన్లు వచ్చాయి కాబట్టి మీరంతా ఎప్పటికీ పంచములుగా కొనసాగితేనే రిజర్వేషన్లను వర్తింపజేస్తాం లేకుంటే లేదని'' వర్ణవ్యవస్థ అనగలుగుతుందేమో గానీ లౌకిక ప్రజాస్వామిక ప్రభుత్వం అనలేదు. అనకూడదు.
    _________________________________________________

    పంచములు కాకపోతే ఇక ఎస్ సీ రిజర్వేషన్లు దేనికి? అసలు ఎస్ సీ రిజర్వేషన్లు ఉన్నదే పంచముల పేరిట వెలివేయబడ్డవారికి. పంచములు కానివారికి SC రిజర్వేషన్ల్య్ ఇవ్వడం రిజర్వేషన్ల స్పూర్తికే వ్యతిరేకం.

    ReplyDelete
  57. @ మలక్పేట్ రౌడి గారూ,
    దళితులపై దాదాపు ౩౦౦౦ ఏళ్ళ పాటు సాగిన అణచివేత జెనెటిక్ వ్యాధి కంటే తీవ్రమైనది. ఇంత సుదీర్ఘ అణచివేత వల్ల జీన్స్ లో సైతం తప్పక మార్పులు వస్తాయి.

    పంచములు కాకపొతే రిజర్వేషన్లు దేనికి అన్నారు. వాళ్ళను పంచములను చేసింది గత వర్ణ వ్యవస్థ. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇక వాళ్ళు ఎంతమాత్రం పంచములు కాదని చాటి చెప్పింది భారత ప్రభుత్వం. అందుకు అనుగుణంగా అంటరాని తనాన్ని నిషేదించింది. వాళ్ళను పంచములుగా ఎవరైనా అవమానిస్తే తీవ్రంగా శిక్షించేదుకు ఎస్ సి ఎస్ టీ అట్రాసిటీస్ చట్టాన్ని చేసింది. రిజర్వేషన్లు గతంలో వారికి జరిగిన అన్యాయానికి పరిహారంగా అని గమనించాలి. ఇవాళ వాళ్ళు ఎంతమాత్రం అంటరాని వాళ్ళు కాదు. అందరితో సమానులు.

    ReplyDelete
  58. దళితులపై దాదాపు ౩౦౦౦ ఏళ్ళ పాటు సాగిన అణచివేత జెనెటిక్ వ్యాధి కంటే తీవ్రమైనది. ఇంత సుదీర్ఘ అణచివేత వల్ల జీన్స్ లో సైతం తప్పక మార్పులు వస్తాయి.

    _________________________________________________

    Do you have any evidence to say this?

    రిజర్వేషన్లు గతంలో వారికి జరిగిన అన్యాయానికి పరిహారంగా అని గమనించాలి.
    ________________________________________________

    It goes back to the same question -

    రిజర్వేషన్లు పొందిన ఎంతమంది ఇప్పుడున్న తరంలో(దొంగ) క్రైస్తవులు వివక్షకు గురైయారు?

    I repeat the otehr question too - ఇక క్రిష్టియన్లు చెబుతోంది తప్పని మీరంటున్నారు కానీ వారు ఒప్పుకోవడం లేదే! వాళ్ళలో కులాలు ఉనాయి అని వాళ్ళెందుకు ఒప్పుకోవడం లేదు. ప్రాగ్రెసివ్ రిలిజియన్ అనే ఇమేజ్ కి దెబ్బ అనా :))

    ReplyDelete
  59. *ప్రపంచంలో ఎక్కడా లేని వర్ణ వ్యవస్థ మన దేశాన్ని 3000 సంవత్సరాలు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలింది. ప్రపంచంలో ఎక్కడా లేని వర్ణ వ్యవస్థ మన దేశాన్ని 3000 సంవత్సరాలు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలింది..... అగ్రవర్ణాల వారు మంచి ఉద్యోగాలను దక్కించుకుని రెక్కలు ముక్కలు చేసుకునే ఉద్యోగాలను శూద్రులకు కేటాయించారు. *

    మందార గారు, మీరు 3000 సం|| నుంచి క్రీ.శ. 1800 వరకు అగ్రవర్ణాల వారు అనుభవి0చిన మంచి ఉద్యోగాల పేర్లు చెప్పగలరా? ఇంగ్లిష్ చదువులకు ముందున్న గొప్ప/మంచి ఉద్యొగాలు ఏవి? అవి ఎన్ని ఉన్నయని? నాకు తెలిసి ఆరోజులలో కవులు రాసిన కావ్యాలు తప్పితె ఇప్పటి లాగా సైన్స్, సోషల్, లెక్కలు, అర్థ శాస్రాలు ఉన్నాయ? ఉన్నా వాటి వలన ఎంతమంది కి ఉద్యొగాలు లభించాయి? మాహా ఐతె రాజుల దగ్గర ఉద్యొగలు అధికం గా సైన్యం లో లభించేవి. దానిలో అన్ని వర్గాల వారు పని చేసెవారు. ఆ రోజులలో ఉన్న ( 3000 సం|| క్రితం నుంచి సుమారు 18వ శతాబ్ది వరకు ) ప్రజలకందు బాటు లో ఉన్న యంత్రాలతో పని చేసే వస్తువులేమిటి? మా తాతగారు, ఆయన బంధువులు కూడా రెక్కలు ముక్కలు చేసుకొని వ్యవసాయం చేశారు శూద్రులోక్కరే కారు.

    Jivan

    ReplyDelete
  60. @ ప్రభాకర్ మందార, మలక్పేట రౌడి
    ఒక చిన్న విషయం. ఇప్పటికీ వివక్షత కొనసాగుతూనే ఉంది. ముందు తరాలలోనే కాదు. ఈ కాలంలో వివక్షతను మతానికి ముడిపెట్టటం అనవసరం. వాళ్ళు ఏ మతంలో ఉన్నా వివక్షతను ఎదుర్కుంటున్నారు.

    ReplyDelete
  61. ఈ కింద కామెంట్ లొ నాకొక్క విషయం అర్ధం కావట్లేదు.
    "ప్రపంచంలో ఎక్కడా లేని వర్ణ వ్యవస్థ మన దేశాన్ని 3000 సంవత్సరాలు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలింది. ప్రపంచంలో ఎక్కడా లేని వర్ణ వ్యవస్థ మన దేశాన్ని 3000 సంవత్సరాలు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలింది..... అగ్రవర్ణాల వారు మంచి ఉద్యోగాలను దక్కించుకుని రెక్కలు ముక్కలు చేసుకునే ఉద్యోగాలను శూద్రులకు కేటాయించారు"

    ఈ రొజు ఎవరు అగ్రవర్ణాలు.. ఎవరి చేతుల్లొ , డబ్బు ..అధికారం వుంది.. నాకయితె మూడు కులాలు కనిపిస్తాయి. " రెడ్లు , కమ్మ , కాపు ". ఏ రకం గా చూసినా ఈ మూడు కులాలదే అదిపత్యం. ఈ మూడు కులాలు పైన చెప్పిన శూద్రుల కేటగరి కదా.. వీళ్ళెలా డెవలప్ అయ్యారు (ఎలా శూద్రుల నుండి అగ్రవర్ణాలుగా ఎదిగారు) ?

    నిజం గా హిందుమతం లొనే ప్రాబ్లెం వుంటె .. ఈ శూద్రులను ఎలా ఎదగనిచ్చారు? వీళ్ళకి ఎప్పుడు ఎమీ రిజర్వేషన్స్ లేవే.. అంటే ఈ వివక్ష ఈ మద్యే మొదలయిందా..

    మీరు రాసిన / వాదిస్తున్న ఏ విషయం లొను పస లేని నాకు అనిపిస్తుంది.

    ReplyDelete
  62. @ భావాన్ని గారూ,
    >>>>ఇప్పటికీ వివక్షత కొనసాగుతూనే ఉంది. ముందు తరాలలోనే కాదు. ఈ కాలంలో వివక్షతను మతానికి ముడిపెట్టటం అనవసరం. వాళ్ళు ఏ మతంలో ఉన్నా వివక్షతను ఎదుర్కుంటున్నారు.<<<<
    నిజమేనండి. చాలా గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ దారుణమైన వివక్ష కొనసాగుతూనే వుంది. అక్కడ "ఎల్లయ్యకూ", "ఏసుపాదానికీ" ఎలాంటి తేడా లేదు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని ప్రచారాలు చేసినా వరకట్నం లాగే ఈ దురాచారం కూడా పోలేదు. నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అయితే నేను పైన ప్రస్తావించింది ప్రభుత్వం / రాజ్యం పరంగా / అధికారికంగా అంటరానితనం లేదు అనే ఉద్దేశంతో.

    @ మలక్పేట రౌడి గారూ
    >>>> దళితులపై దాదాపు ౩౦౦౦ ఏళ్ళ పాటు సాగిన అణచివేత జెనెటిక్ వ్యాధి కంటే తీవ్రమైనది. ఇంత సుదీర్ఘ అణచివేత వల్ల జీన్స్ లో సైతం తప్పక మార్పులు వస్తాయి. ...Do you have any evidence to say this? <<<<<

    ఈ విషయమై మహా శ్వేతా దేవి గారు రాసిన కథో,వ్యాసమో ఎప్పుడో చదివాను. ఆసక్తి కరమైన ఈ అంశం గురించి మరిన్ని వివరాలు సేకరించి ఎప్పుడైనా మరో టపా రాస్తాను.

    @ మంచుపల్లకి గారూ, @ ananymous గారూ
    కుల వ్యవస్థ అంటే స్థూలంగా వృత్తుల (ఉద్యోగాల) కేటాయింపే (రిజర్వేషనే) కదండీ. బ్రాహ్మణులు శారీరక శ్రమ లేని పూజారి
    ఉద్యోగాన్ని రిజర్వ్ చేసుకున్నారు. అట్లాగే కొందరికి రాజ్య పాలన, కొందరికి వ్యాపారం, కొందరికి బట్టలు ఉతికే వృత్తి, కొందరికి క్షవరం చేసే వృత్తి, కొందరికి చెప్పులు కుట్టే వృత్తి ......కేటాయించారు.
    ఒకప్పుడు తెలుగు వాచకంలో కుండలు చేయునా దెవ్వరు రా? బట్టలు ఉతుకున దెవ్వరురా? అంటూ అందమైన సచిత్ర కవితా పాఠం వుండేది.

    ఎప్పుడో ౩౦౦౦ సంవత్సరాల క్రిందటి నాటి ఈ వృత్తి/ఉద్యోగ రిజర్వేషన్లు వంశ పారం పర్యంగా ఇప్పటికీ చాలా వరకు కొనసాగుతూనే వున్నాయి. ఇక బ్రాహ్మణుల లో వ్యవసాయం చేసిన వాళ్ళు లేరా? రెడ్డి రాజులు లేరా? యాదవ రాజులు లేరా? అంటే వున్నారు. అది వేరు. అట్లాగే ఇవాళ ఈ ఆధునిక సమాజంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, డ్రైవర్లు , కండక్టర్లు, పైలెట్లు, మెకానిక్కులు ఇట్లా వేల రకాల కొత్త ఉద్యోగాలు / వృత్తులు పుట్టుకొచ్చాయి. వాటిలో ఏకులం వాళ్ళైన ప్రవేశించే స్వేచ్చ వుంది.

    అట్లాగే పాత కులాలనే పట్టుకుని వేలాడాల్సిన పరిస్థితిలో కొందరు ఇంకా అట్లాగే వున్నారు. మనం వర్ణ వ్యవస్థ మూలాల గురించి చర్చించేప్పుడు వీటన్నింటినీ చేరిస్తే సమస్య గందరగోళం అవుతుంది.
    ఇవాళ వర్ణ వ్యవస్థ ఒక్క బ్రాహ్మణుల పూజారి వృత్తి హక్కును కాపాడుతుండ వచ్చు, దళితులను ఎప్పటిలాగే ఈసడించు కుంటూ వుండవచ్చు కానీ మిగతా కులాలను, వృత్తులను నియంత్రించే స్థితిలో మాత్రం అది లేదు. " రెడ్లు , కమ్మ , కాపు " తదితర
    కులాల ఆధిపత్యాన్ని కూడా అది నియంత్రించలేదు.

    ReplyDelete
  63. నేను క్రైస్తవులకీ, ముస్లింలకీ రిజర్వేషన్లు ఇవ్వడానికి పూర్తి వ్యతిరేకం. క్రీమీ లేయర్ కి దిగువున ఉన్న హిందూ దళితులు, గిరిజనులకి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వడాన్ని అంగీకరిస్తాను. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి అయితే కొడుకుకి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం ఇవ్వడం కూడా తప్పే. ఆ మధ్య అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలలో కులాలు లేవన్నాడు. ఇప్పుడు అతని తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీ ఇస్లాం మతంలోకి మారిన దళితులకి కూడా రిజర్వేషన్లు ఇవ్వాలంటున్నాడు. క్రైస్తవులు కూడా తమ మతంలో కులాలు లేవని చెప్పుకుంటున్నారు. వాళ్ళు కూడా రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి మతం మారినంతమాత్రాన కులం పోదు అంటున్నారు. రిజర్వేషన్ల ప్రస్తావన వచ్చినప్పుడు కులం అవసరం, ఆ ప్రస్తావన లేనప్పుడు కులం అనవసరం. ఇవీ క్రైస్తవులూ, ముస్లింలూ పాటించే ప్రమాణాలు.

    ReplyDelete
  64. You skipped my question again -


    క్రిష్టియన్లు చెబుతోంది తప్పని మీరంటున్నారు కానీ వారు ఒప్పుకోవడం లేదే! వాళ్ళలో కులాలు ఉనాయి అని వాళ్ళెందుకు ఒప్పుకోవడం లేదు. ప్రాగ్రెసివ్ రిలిజియన్ అనే ఇమేజ్ కి దెబ్బ అనా :))

    ReplyDelete
  65. @ ప్రభాకర్ మందార, మలక్పేట రౌడి
    ఒక చిన్న విషయం. ఇప్పటికీ వివక్షత కొనసాగుతూనే ఉంది. ముందు తరాలలోనే కాదు. ఈ కాలంలో వివక్షతను మతానికి ముడిపెట్టటం అనవసరం. వాళ్ళు ఏ మతంలో ఉన్నా వివక్షతను ఎదుర్కుంటున్నారు.
    ________________________________________________


    In that case why are the Christians not declaring that they have the caste system too? The reason why I am asking this question is .. The main reason they are mentioning for the conversion is the "Caste system" .. if Christianity also has the caste system then why arent they delcaring it.

    Let them first declare that they have the discriminatory caste system in place and then initiate a discussion on the reservations.

    ReplyDelete
  66. రిజర్వేషన్ల ప్రస్తావ వచ్చినప్పుడు క్రైస్తవులు ఓపెన్ గానే కులం పేరు చెప్పుకుంటారు భరద్వాజా. రిజర్వేషన్ల ప్రస్తావన రానప్పుడు మాత్రమే తమ మతంలో కులాలు లేవని చెప్పుకుంటారు.

    ReplyDelete
  67. అర్చక వృత్తిలో కూడా ఏ కులం వాళ్ళైనా ప్రవేశించే అవకాశం ఉంది. అన్నట్టు మహశ్వేతాదేవిగారు జెనెటిక్ ఇంజనీరా? ఎందుకంటే నేణు అడిగింది జన్యుకణాల గురించి.

    ReplyDelete
  68. రిజర్వేషన్ల ప్రస్తావ వచ్చినప్పుడు క్రైస్తవులు ఓపెన్ గానే కులం పేరు చెప్పుకుంటారు భరద్వాజా. రిజర్వేషన్ల ప్రస్తావన రానప్పుడు మాత్రమే తమ మతంలో కులాలు లేవని చెప్పుకుంటారు.
    _________________________________________________

    Let them declare that they also Practice caste system, atleast in case of reservations. It will lead to a lot of questions.

    Prabhakar called it a progressive religion, I assume because, he thinks they dont practice the caste system. But I see a paradox there.

    As of the creamy layer - Yes. I agree, the reservations should reach the people who are thrown far away from the society, no those whose Dads are Civil Servants or Politicians

    ReplyDelete
  69. నాస్తికుడిగా నేను అన్ని మతాలూ ప్రతిరోధకాలు అంటాను. ప్రభాకర్ కూడా నాస్తికుడే అయినప్పటికీ అతను క్రైస్తవ మతాన్ని ప్రగతివాద(progressive) మతం అనడం విచిత్రంగా ఉంది.

    ReplyDelete
  70. @మలక్పేట రౌడి:క్రైస్తవం, ఇస్లాం రెండూ కులాల్ని పాటిస్తాయి. లేకపోతే షేక్,సయ్యద్,మాలిక్,దూదేకుల అనే బేధాలు ఇస్లాంలో, చర్చ్ ని బట్టి తేడాలు క్రైస్తవుల్లో ఉండేవి కావు. అంతెందుకు భారతదేశంలో చాలా చోట్ల దళితక్రైస్తవులు చర్చ్ లో వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపిన వైనం విదితమే. కాకపోతే హిందూమతంలో ఉన్నంత organised వివక్షమాత్రం కాదు. అంతేతేడా.

    దళితులు అణచివేయబడ్డారు అనేది నిజం. వివక్షకు గురయ్యారనేది నిజం. అవకాశాలు అందకుండా చెయ్యబడ్డారనేది నిజం. వీటికి మీకు జెనెటి ఫ్రూఫులు అవసరం లేదు. అణచివేయబడ్డ జాతుల గురించి ఎన్నో పరిశోధనలు ఇప్పటికే జరిగాయి. వాటి గురించి కొంత తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

    ఒక సింపుల్ లాజిక్ చెప్పనా! learning capability విషయంలో first generation learner కు second generation learner కు తేడా ఉంటుందా..ఉండదా? ఇంట్లో learning ecology ఉన్న విద్యార్థికీ అది లేని విద్యార్థికీ తేడా ఉంటుందా..ఉండదా? మరి ఇన్నాళ్ళు social-psychological-emotional-cultural-human deprivation లో ఉన్న ఒక జాతిలో "అణచివేత మానసికత" లేదంటే ఏలా?

    అంతెందుకు 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ పాలన వల్ల మనది colonized mindset అంటున్నామే...కొన్ని వేల సంవత్సరాల అణచివేత ఆ వర్గానికి తీవ్రమైన హాని చెయ్యకుండా ఉందంటారా? There has been an irreversible damage done to part of this society by caste desrimination. Reservation is only a token..let me repeat just a TOKEN towards reversing that injustice.

    క్రీమీలేయర్ సంగతి...ఎక్కడి క్రీమీ లేయర్? కనీసం ఒక్కసారికూడా ఏ అవకాశం అందిపుచ్చుకోని దళితులు దాదాపు 60% ఉన్నారు ఈ దేశంలో. యూనివర్సిటీ డిగ్రీ ఉన్న దళితుల శాతం కేవలం 1. ఎక్కడి క్రీమీలేయర్? మీకు కనిపించిన వందమంది లేదా వెయ్యి మంది క్రీమీలేయరా? ఒక సామాజిక సమస్య గురించి చర్చిస్తున్నప్పుడు దాని విస్తృతత్వాన్ని పరిధిలోకి తీసుకోకుండా మీ వ్యక్తిగత పరిథుల్లో వాటిని నిర్వచించకండి. That is in no way acceptable.

    ReplyDelete
  71. If Christianity is really progressive, why did Christians massacre Muslims to win the Holy Land (Israel-Palestine) in crusades? It is ridiculous to claim Christianity (one of the mass murderer religions) as progressive religion.

    ReplyDelete
  72. మహేష్, నువ్వు అమాయకుడివి. ఆ ఒక్క శాతం దళితులే ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువ అనుభవిస్తున్నారు. పూర్వం ఒక గ్రామంలో వెయ్యి మంది జనాభా ఉంటే ఆ ఊరిలో కరణం, మునసబ్, టీచర్ ఈ ముగ్గురు తప్ప వేరే ప్రభుత్వ ఉద్యోగులు ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు పెరిగాయి కానీ ఆ అవకాశాలు గుంజుకుంటున్నది కూడా ఒక్క శాతం మందే.

    ReplyDelete
  73. వీటికి మీకు జెనెటి ఫ్రూఫులు అవసరం లేదు. అణచివేయబడ్డ జాతుల గురించి ఎన్నో పరిశోధనలు ఇప్పటికే జరిగాయి. వాటి గురించి కొంత తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
    ________________________________________________

    Well before asking me to understand something, why dont you first try to understand what I wrote? I was talking about the proof when he said the the repression would have genetic effect


    క్రైస్తవం, ఇస్లాం రెండూ కులాల్ని పాటిస్తాయి.
    ____________________________

    Let the Mullahs and Pastors declare that openly before asking for sreservations


    అంతెందుకు 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ పాలన వల్ల మనది colonized mindset అంటున్నామే.
    ________________________________________________

    I didnt say that. Our elders did have that mindset not our generation, definitely not our Kids. There may be a lil influence due to the educational system but the current mindset has nothing to do witht he colonial rule. In fact its now more AMERICAN than Colonial.

    ReplyDelete
  74. By the way the mindset has nothing to do with Genes. Its all in the mind!

    You are because you think you are.

    No point in blaming the Britishers for every failure

    ReplyDelete
  75. మా మతంలో కులాలు లేవు, మావి సమానత్వం ప్రసాదించే మతాలు అని పాస్టర్లు, ఇమాంలు చెప్పుకోకపోతే అమాయకులు వాళ్ళని నమ్మేసి ఆ మతాలలో చేరిపోవడం జరగదు. అందుకే పాస్టర్లు, ఇమాంలు అలా చెపుతారు. నేను ఆర్థిక ప్రాతిపదిక రిజర్వేషన్లకి అనుకూలమే. కానీ మతాధారిత రిజర్వేషన్లని వ్యతిరేకిస్తాను. టెంత్ క్లాస్ చదువులు కూడా పూర్తి చెయ్యలేక రిజర్వేషన్లు అందుకోలేని పేద దళితులు ఉన్నారు. వీళ్ళకి మంచి విద్యతో పాటు రిజర్వేషన్లు కూడా అందించాలి. మిషనరీ స్కూళ్ళలో ఇంగ్లిష్ మీడియం చదువులు చదువుకుని ఉద్యోగాలు సులభంగా సంపాదించగల క్రైస్తవులకి మాత్రం రిజర్వేషన్లు ఉండకూడదు.

    ReplyDelete
  76. నేను ఇప్పుడు కూడా గొప్ప నాస్తికుడినే. నేనేమీ హిందూ మతంలో తిరిగి చేరడం లేదు. డబ్బు ఉండి కూడా రిజర్వేషన్ కోసం కులం పేరు చెప్పుకునే సూడో నాస్తికులకే అలాంటి ఇంటెన్షన్స్ ఉంటాయి.

    ReplyDelete
  77. అగ్ర కులాల వారికి పుట్టుకతోనే సామాజిక గౌరవం వస్తుంది.మరి దళితులకు అది సాద్యపడదు.అంటే దళితులు కష్టపడి పైకి వస్తేనే సామాజిక గౌరవం లభిస్తుంది.ఎంత కాలం ఈ వివక్షను అనుభవించాలి.మరి హిందూమత పెద్దలు దీనికి పరిష్కారం చూపించరా?ఎంతకాలం ద్వితీయ శ్రేణి పౌరులుగా బ్రతకాలి? మరి దళితులను OC లో కలిపే దమ్ము ఉందా?

    ReplyDelete
  78. అంబేద్కర్ గారు దళితులుకి రిజర్వేషన్లు ఇచ్చి బాగా చదువుకుని పైకి రమ్మని చెబితే చదవకుండానే అన్నీ కావాలని చిన్న పిల్లల్లా మారం చేస్తున్నారు. అగ్రవర్ణాలు ఎంత చదువు ఉన్నా కాని ఉద్యోగాలు లభించని పరిస్థతి. కనీసం ఆర్మీ లో చేరడానికి కూడా దళితులు ప్రయత్నించడం లేదు ఎందుకంటే మాకు రిజర్వేషన్లు ఉన్నాయి స్టేట్ గవర్నమెంటు లోనే మేము ఉద్యోగాలు సంపాదించుకుంటా మంటున్నారు. దళితులు లో కూడా పోటీతత్వం పెరగాలి.

    ReplyDelete
  79. Anonymous March 7, 2017
    దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత స్పందించారు.
    ఇప్పటికే ఈ అంశం పై సమగ్ర చర్చ జరిగింది.
    అయితే
    "దళితులు చదవకుండానే అన్నీ కావాలని చిన్నపిల్లల్లామారాం చేస్తున్నారనే"
    మీ ఆరోపణ చైల్దిష్ గా వుంది.
    ఉద్యోగాలు లభించని పరిస్థితి ఒక్క అగ్రవర్ణాలకే కాదు అన్ని వర్ణాల లోని చదువుకున్న వారికి వుంది.
    ఆ మాటకొస్తే జనాభాలో దామాషా ప్రకారం చూస్తె గ్రూప్ 1,2, 3 ఉద్యోగాలలో అగ్రవర్ణాల వారికి దక్క వలసిన
    ఉద్యోగాలకంటే చాలా చాలా ఎక్కువే అనేది వాస్తవం.
    ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు రోజు రోజుకూ తగ్గిపోతున్నాయి. దాని ఫలితంగా అన్ని వర్ణాల వారిలోనూ
    నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది.
    ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల అగ్రవర్ణాల వారే ఎక్కువ లబ్ది పొందుతున్నారు.
    గత ఏడూ దశాబ్దాల రిజర్వేషన్ల వల్ల దామాషా రీత్యా దళితులకు దక్కింది నామ మాత్రమె.
    "కనీసం ఆర్మీలో చేరడానికి కూడా దళితులు ప్రయత్నించడం లేదన్నారు."
    ఆర్మీలో అగ్రవర్ణాల వారు ఎక్కువా? దళితులు ఎక్కువా? ఒకసారి లెక్కలు తీయండి
    అగ్రవర్ణాల వారు సైనికులుగా ఎందుకు చేరడం లేదు ?
    సైనికులు, స్కావెంజర్లు, స్వీపర్లు, హమాలీలు గా దళితులే ఎందుకు పని చేయాల్సి వస్తోంది
    దళితుల పిల్లలు ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో పెరుగుతూ, చదువుకోవాల్సి వస్తోందో ఒక్కసారి ఆలోచించండి.
    వర్ణ వ్యవస్థ పేరిట హిందూ సమాజం మూడువేల ఏళ్లుగా అమలు పరచిన కుల వృత్తుల రిజర్వేషన్లు
    దళితులను ఎంత దుర్భర స్థితిలోకి నెట్టాయో, ఆ అన్యాయం ఇంకా ఎలా కొనసాగుతోందో నిజాయితీగామీరే
    సమీక్షించండి తెలుస్తుంది.

    ReplyDelete
    Replies
    1. వర్ణ వ్యవస్థ పేరిట హిందూ సమాజం మూడువేల ఏళ్లుగా అమలు పరచిన కుల వృత్తుల రిజర్వేషన్లు

      వర్ణ వ్యవస్థవల్ల కుల వృత్తుల రిజర్వేషన్లు దళితులు కూడా పొందారు. ఉదా|| చెప్పులు కుట్టటం వృత్తి ఐతే అది మీకు మాత్రమే రిసెర్వ్ చేసుకొన్న వృత్తికాదా? ఏ మాత్రం లాభం లేకపోయి ఉంటే చెప్పులు కుట్టే వృత్తి వందలేళ్ళు గా ఉండేదా? ఆ రోజుల్లో ఎవరి వృత్తి వారు చేసుకొని, ఇప్పుడు ఆ వృత్తి వలన మమ్మల్ని అణచేశారు అని అంటే ఎలా?


      గత ఏడూ దశాబ్దాల రిజర్వేషన్ల వల్ల దామాషా రీత్యా దళితులకు దక్కింది నామ మాత్రమె

      నామ మాత్రమే అంటే ఎంత అని? మీకు పూర్తిస్థాయి వాటా దొరకాలి అంటే అది ఎంతో చెప్పండి? ఇప్పటి వరకు అగ్రవర్ణాల వారు దళితుల పట్ల సానుభూతితో ఉంట్టు వచ్చారు. ప్రభుత్వాలు ఈ రిసెర్వేషన్ సౌకర్యం ఇస్తూ వచ్చాయి. మీవాట మీరు బాగానే అనుభవించారని గ్రహించాలి. మూడు వేల సంవత్సారాలు అణచారని, రాబోయే మూడూవేల సంవత్సారాలు రిసెర్వేషన్ లు ఉండాలని అనుకొంట్టునట్ట్లున్నారు. ప్రజలందరు ఎకమై రిసర్వేషన్ల పై తిరుగుబాటు చేసేంతవరకు పరిస్థితిని లాగకండి.

      Delete
  80. మందార ప్రభాకర్ గారూ, రిజర్వేషన్ల సాఫల్యం గురించి అండేడ్కర్ మనవడు ఆనంద్ టేల్ టుమ్డే ఇలా అన్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
    రిజర్వేషన్ల సఫలం అయ్యాయా? అనే విషయం గురించి అంబేడ్కర్ మనవడు ఆనంద్ టేల్ టుమ్డే వ్రాసిన వ్యాస భాగం ఇది........Have Reservations Really Worked?

    Before extension of this exceptional principle to all and sundry, the responsible polity would evaluate whether it has served the original purpose in its prototype form in the case of SCs and STs. If we objectively look at the evidence, one could definitely say that it has catalyzed huge spread of education among these communities and caused significant socio-economic development through the employment in government and public sector. Although extremely limited in its potential, its motivational impact has been tremendous. Notwithstanding these positive aspects, like any other developmental scheme without remedial mechanism, it has accentuated inequality among these castes. The people (and the castes) with first movers advantage increasingly monopolized its benefits and left the rest relatively poorer. While the beneficiaries are individuals or their families, with the ruling idiom of caste, it engendered feelings of resentment against the beneficiary castes, and provided fodder for the vested interests to further divide these castes.

    This flaw in the policy could be easily plugged by bringing in a non-caste criterion of a family unit. The prospective reservation should be considered applicable to the families, which have not yet availed of reservation. (see my article Reservation within Reservation, EPW --). This is simple and doable solution but it would not be accepted by the political class as it takes away caste, which has been their golden goose.

    In addition, there is political reservation which is ignorantly mixed up with the reservation in education and employment available to the SCs and STs. It came from the Poona Pact between Gandhi and Ambedkar in 1932 as a compromise to do away the grant of separate electorates in the Communal Award of Ramsay McDonald. At the time of its incorporation into the Constitution, Ambedkar himself was not sure about its efficacy and wanted it only for 10 years. However, this reservation has been getting unanimously extended before it is due to expire by the ruling class parties. From this broad evidence also one could surmise who the real beneficiaries of this reservation are. But, even beyond this, one could find out whether it has benefitted the Dalits masses for whom it was meant. The answer is in definite negative. Late Kanshiram summarized his assessment of this policy in his pamphlet, ‘chamcha yug’ (the era of stooges). It produced totally contrary result to what was perhaps intended. Instead of creating a proportionate representation of Dalits in the legislative bodies, it has completely decimated their representation by producing stooges out of Dalit politicians. While in numbers, this reservation, unlike others, has been always fully implemented; it has never meant even a feeble voice of Dalits in legislature. The so called Dalit representatives have been always subservient to their ruling class upper caste bosses to whom they owed their existence. It only created a political class among Dalits, which fattens itself on the political rent derived from the ruling classes.

    ReplyDelete

  81. Reservation to Women

    The current bill purporting to give 33 percent reservation to women in state legislatures and Lok Sabha is also destined to be counterproductive in a much bigger measure. There are no two opinions that women who hold up half the sky are short-shrifted in the male dominated world and that they should rightfully own up at least half of the world. There is no dispute about their suffering myriad forms of discriminations and atrocities: As children, they are discriminated in food, health, education; as adult women they are discriminated in choice of livelihood, wages, and suffer physical abuse and rape. There cannot be any controversy therefore about the need to stop injustice on them and restore what is rightfully theirs but unjustly denied to them. The issue is about the way of doing it.

    Firstly, women are a very generic and broad category, comprising castes, classes, races, and communities of all kinds. Despite the history of over 150 years of women’s movement, they have not achieved a coherent voice and rather showed up as inevitable splintering in recent years. There is nothing common for instance between an urban upper caste woman and a typical Dalit woman in a village. The former though suffering subtle discrimination in patriarchal society enjoys enormous social power whereas the latter is triple-oppressed, as being poor, Dalit and a woman. The mainstream concept of women’s liberation therefore is alien to Dalit women. As a reaction, they have been observing their women’s liberation Day on 25th December, (instead of 8th March) the day the Manusmriti was burnt during the Mahad conference. Its stance is not against men but against the mainstream women’s movement that seeks to overlook the oppression of majority women. There is a tendency seen in even other caste and community groups to articulate their dissent against the mainstream women’s movement.

    Secondly, the idea of reservation has been problematic with regard to its professed objective but certainly useful to politicians. Reservation by design promotes the interests of the better placed ones among the target population. As a result, while a small section of the population progresses, the rest is left behind. At the time when reservation was conceived for the SCs and STs, these considerations were not material simply because there was no visible elite among them. Whosoever came up was to be a role model for the rest and was supposed to represent their interests. Now that the second and third generations of beneficiary Dalits are around, the evils of reservation system have surfaced clearly. The demand for categorization articulated by Madiga Dandora may not be maintainable in many ways but cannot simultaneously be dismissed as baseless or motivated. The point is that it basically bares the limitation of reservation policy. Since reservation for the SCs and STs is premised on the social prejudice, its outright abolition is out of question in view of these prejudices still visible, but there is certainly a case for plugging their obvious lacunae.

    ReplyDelete