కూలని గోడలు (కథ) ...
తలుపుల మీద దబదబ బాదుతున్న చప్పుడుకు ఉలిక్కిపడి నిద్రలేచాను.
అప్రయత్నంగా నా చూపు గోడ గడియారం వైపు మళ్లింది.
పన్నెండు పది!
ఇంత అర్థరాత్రి ఎవరబ్బా అనుకుంటూ వెళ్లి తలుపు తీశాను.
ఎదురుగా అభిలాష్. ఎనిమిదేళ్ల కుర్రాడు. ఆర్టీసీ డ్రైవర్ బలరాం కొడుకు.
సంశయంగా వాడి భుజం పట్టుకుని 'ఏంట్రా' అన్నాను.
''నాన్నకు గుండెనొప్పొచ్చింది. అమ్మ, మిమ్మల్ని తొందరగా తీసుకురమ్మంది''
నేను నిర్ఘాంత పోయాను.
ఆర్నెళ్ల క్రితమే బలరాంకి మైల్డ్‌గా హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు అతణ్ని నేనే హైదరాబాద్ తార్నాక లోని ఆర్టీసీ ఆసుపత్రికి తీసుకెళ్లాను. వాళ్లు వెంటనే నిమ్స్‌కి డైరెక్ట్ చేశారు. నెల రోజుల పాటు నిమ్స్‌లో చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొచ్చాడు బలరాం. అప్పుడు లక్షన్నర వరకు ఖర్చయింది. అయితే ఆ ఖర్చంతా ఫూర్తిగా ఆర్టీసీయే భరించింది.
అప్పుడే మళ్లీ ఇదేమిటి!
అసలు బలరాంను చూస్తే ఎలాటి జబ్బులైనా ఆమడ దూరం పారిపోతాయనిపిస్తుంది.
పేరుకు తగ్గ పర్సనాలిటీ. ఉక్కు మనిషిలా వుంటాడు. పైగా వయసు ముఫ్ఫై ఐదేళ్లు కూడా దాటలేదు. అతనికి గుండెపోటేమిటి కాల వైపరీత్యం కాకపోతే.
నేను గబగబా బట్టలు మార్చుకుంటుండగా ''ఎక్కడికండీ'' అంటూ ప్రశ్నించింది మా ఆవిడ.
''బలరాంకు మళ్లీ గుండె నొప్పొచ్చిందట.''
''అయ్యయ్యో. నేనూ వస్తానుండండి'' అంటూ లేచింది ఆందోళన పడిపోతూ.
''ఆలస్యమవుతుంది. నువ్వు తర్వాత రా'' అంటూ అభిలాష్‌తో వాళ్లింటివేపు నడిచాను.
బలరాం మా బంధువేం కాదు. నా ప్రియ శిష్యుల్లో ఒకడు. చిన్నప్పుడు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు నా వద్దే చదువుకున్నాడు. స్కూలు అయిపోయిన తరువాత కూడా మా ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. చదువులో అందరికంటే ముందుండేవాడు.
బలరాం అంటే నాకూ, మా ఆవిడకూ ఎంతో అభిమానం. అతని వినయవిధేయతలూ, చదువు మీది శ్రద్ధా చూడ ముచ్చటగా వుండేవి. ఒక దశలో మేం బలరాంని మా అ ల్లుడిని చేసుకోవాలని కూడా అనుకున్నాం.
బలరాం పదోతరగతిలో ప్రవేశించేనాటికే మా పెద్దమ్మాయి అరవింద, రెండో అమ్మాయి అనుపమల వివాహాలు అయిపోయాయి. మా చిన్నమ్మాయి అపూర్వ బలరాం కంటే ఏడాది చిన్నది. వాళ్లిద్దరికీ ఈడూ జోడూ సరిపోతుందనుకున్నాం.
నిజానికి బలరాంది మా అంతస్తుకు తగ్గ కుటుంబమేమీ కాదు. బలరాం తండ్రి రాఘవులు ఒక ప్రైవేట్ ప్రింటింగ్ ప్రెస్‌లో కంపోజిటర్‌గా పనిచేసేవాడు. చాలీ చాలని జీతం. ఐదుగురు పిల్లలు, ఊళ్లో ఎక్కడ చూసినా అప్పులు. ఇంటిలో పిలవకపోయినా పలికే దారిద్య్రం. అయినా సరే మాకు బలరాం అంటే చాలా ఇష్టంగా వుండేది. పిల్లవాడు బుద్ధిమంతుడు. చదువు మీద శ్రద్ధాసక్తులున్నవాడు. అతనికి మంచి భవిష్యత్తు వుంటుంది, మా అపూర్వ తప్పక సుఖపడుతుంది అనేది మా నమ్మకం.
అందుకు బలమైన కారణం కూడా వుంది. మా అరవింద, అనుపమలను గొప్పిళ్లకే ఇచ్చాం. అయితే మాత్రం ఏం లాభం, అనుక్షణం గొడవలే. వాళ్ల గొప్పతనమంతా ఆస్తికే పరిమితం. మిగతా అన్నిట్లోనూ అ లగాతనమే. ఎంత ఆస్తి వుంటే ఏం లాభం మా అమ్మాయిలు కన్నీళ్లు పెట్టుకోని రోజు, మేం ఆందోళన పడని రోజు లేదు.
అందుకే ఆడపిల్ల సుఖంగా వుండాలంటే పెళ్లికొడుకు ఆస్తిపాస్తులనూ డాబు దర్పాలనీ కాకుండా అతని మంచితనాన్నీ, సంస్కారాన్నీ చూడాలని అనుభవపూర్వకంగా తెలుసుకన్నాం. అందుకే బలరాం మీద అంత అభిమానం ఏర్పడింది. నా ప్రతిపాదనను మా ఆవిడకు చెబితే ఆమె కూడా నిస్సంకోచంగా ఒప్పుకుంది. కళ్ల ముందు పెరిగిన పిల్లవాడు. నాలుగిళ్లవతలే వుండేవాడు. రేపు పెళ్లయినా మన అమ్మాయి ఎప్పుడూ మన కళ్ల ముందే వుంటుంది అని తను కూడా ఎన్నో కలలు కంది.
అయితే ఈ విషయం మా ఇద్దరి మనసుల్లోనే వుండిపోయింది తప్ప అప్పుడూ ఇప్పుడూ మా ఆమ్మాయితో సహా మరెవరికీ చెప్పలేదు. మాకు ఆ అవసరమూ రాలేదు.
బలరాం పదో తరగతి చదువుతుండగానే అతని తండ్రి రాఘవులు హఠాత్తుగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.
ఆ రోజు అర్థరాత్రి వరకూ ప్రింటింగ్ ప్రెస్సులో పనిచేసి అ లసి సొలసి సైకిల్ మీద ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహన మేదో అతణ్ని ఢీకొట్టి వెళ్లిపోయింది.
అంతే. ఒక్కసారిగా ఆ కుటుంబం పరిస్థితి తుపానులో చిక్కుకున్న పడవలా అయిపోయింది.
పాతికేళ్లుగా తన రక్తాన్ని ధారపోసినప్పటికీ ఆ ప్రింటింగ్ ప్రెస్సు యజమాని రాఘవులు కుటుంబానికి ఒక్క పైసా కూడా సాయం చేయలేదు. అంతవరకు వడ్డీ రూపంలో రాఘవులు మూలుగల్ని పీల్చిన వడ్డీ వ్యాపారస్తులు ఒక్కసారిగా తమ అసలు ఇచ్చేయమంటూ ఆ ఇంటి మీదపడ్డారు. దాంతో వున్న చిన్నపాటి ఇంటిని అమ్మేయక తప్పలేదు వాళ్లకి. అయినా అప్పులు పూర్తిగా తీరనే లేదు. పిల్లలంతా తలోదిక్కు అయిపోయారు. ఒకరు హోటళ్లో, ఇంకొకరు సైకిల్ షాపులో, ఆడపిల్లలు బీడీల కార్ఖానాల్లో పనులకు కుదిరారు. బలరాం కూడా ఓ మోటార్ కంపెనీలో హెల్పర్‌గా చేరాడు.
ఎంతో చక్కని భవిష్యత్తు వుందనుకున్న బలరాం అ లా అయిపోవడం నా మనసును కలిచి వేసింది. నేను వాళ్ల అమ్మను కలిసి బలరాం చదువు ఖర్చులన్నీ నేను భరిస్తాను వాణ్నొక్కడినైనా చదివించమని కోరాను. కానీ ఆవిడ ''నా కొడుకు మీద మీకు అంత ప్రేమ వున్నందుకు నాకు సంతోషమేనండి. కానీ పెద్దోడిని చదివిస్తూ చిన్నపిల్లల్ని కూలిపనికి పంపించడం న్యాయమవుతుందా మీరే చెప్పండి'' అంది.
నేనా ప్రశ్నకి సమాధానం చెప్పలేక నిస్సహాయంగా వుండిపోయాను. నా ఆశలన్నీ అడియాశలయ్యాయి.
ఆతర్వాత బలరాం మా ఇంటికి రావడమే మానేశాడు. మరకల దుస్తులతో నా కంటపడటానికే ఇష్టపడేవాడు కాదు. కొన్నాళ్లకి వాళ్ల కుటుంబం పట్నానికి వలస పోయింది. బలరాం మెకానిక్ నుంచి లారీ డ్రైవర్‌గా మారాడు. ఆ తదనంతరం ఆర్టీసీలో బస్సు డ్రైవర్ అయ్యాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అంతకుముందే మంచి సంబంధం కుదిరితే మా అపూర్వకి కూడా వివాహం చేసేశాము.
ఆవిధంగా మా కల కల్లగా మిగిలిపోయినప్పటికీ బలరాం మీద మాకున్న వాత్సల్యం కానీ, వాడికి నా మీద వున్న గురుభక్తిగానీ ఏమాత్రం తగ్గలేదు. ఎప్పుడైనా కనిపిస్తే ఎంతో అభిమానంగా మాట్లాడుతాడు. తన కష్టసుఖాలన్నీ అరమరికలు లేకుండా చెప్తాడు.
ఆర్టీసీలో డ్రైవర్‌గా ఉద్యోగం, గుణవంతురాలైన అమ్మాయితో పెళ్లి బలరాం జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చాయి. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నప్పుడు అతనికి సిగరెట్లు, గుట్కా, తాగుడు వంటి దురలవాట్లు అంటుకున్నాయి. కానీ ఇప్పుడు అట్లాంటివేమీ లేవు. చదువుకునే రోజుల్లో మాదిరిగా తిరిగి హుందాగా తయారయ్యాడు. జీవితానికి మళ్లీ ఒక లక్ష్యమంటూ ఏర్పడింది.
ఆర్టీసీ వాళ్లిచ్చిన గృహనిర్మాణ రుణం సహాయంతో అతను గతంలో అమ్మేసిన తమ పెంకుటిల్లునే తిరిగి కొని అక్కడే చక్కని డాబా ఇల్లు కట్టించాడు. అతని కుటుంబ మంతా ఇప్పుడు ఆ ఇంట్లోనే వుంటున్నారు. ఊళ్ళో బలరాంకి మంచి పేరుంది. బస్టాపుల్లోనే కాదు మార్గమధ్యంలో ప్రయాణికులు కనపడ్డా బస్సాపి పిలిచి మరీ బస్సెక్కించుకుంటాడు. ప్రయాణికులందరితో మర్యాదగా, కలుపుగోలుగా మాట్లాడతాడు. వారు కోరిన చోట విసుక్కోకుండా బస్సాపి దింపుతాడు. బలరాం బస్సంటే పిల్లలకీి, పెద్దలకీ ఎంత ఇష్టమో. బలరాం బస్సు వుందంటే ఆటోల మీద వెళ్లేవాళ్లు కూడా ఎంతసేపైనా ఎదురుచూస్తూ నిలబడతారు. డ్రెవింగ్ కూడా ఎంత బాగా చేస్తాడో. గతుకుల రోడ్డుమీద సైతం కుదుపులు లేకుండా నడపగలిగే నైపుణ్యం అతనిది.
అట్లాంటి బలరాంకి ఇంత చిన్న వయసులో గుండెపోటేమిటో తలచుకుంటే మనసు విలవిలలాడిపోతోంది.
నేను బలరాం ఇంటికి చేరుకునే సరికే అక్కడ ఇరుగుపొరుగు వాళ్లు చాలామంది గుమికూడి వున్నారు. బలరాం తల్లి, భార్య పెడ్తున్న శోకాలు దూరంనుంచే వినపడసాగాయి.
ఒక్కసారిగా ఏదో వణుకు, భయం ఆవహించాయి నన్ను. నో. అ లా జరగి వుండదు! అ లా జరగ కూడదు! బలరాంకి ఏం కాకూడదు. భగవంతుడు అంత దుర్మార్గుడు కాదు. అనుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టాను.
కానీ ఏదీ మనం అనుకున్నట్టు జరుగదు కదా. అప్పటికే బలరాం విగతజీవుడయ్యాడు. అతని శరీరంలో కదలికలు లేకపోయినా అతని కళ్లు మాత్రం ఇంకా ఏ భవిష్యత్తులోకో తొంగిచూస్తున్నట్టు అ లా తెరిచే వున్నాయి. ఆ కంటి రెప్పలను మూసే ప్రయత్నం చేస్తూ కడుపులోంచి దుఃఖం తన్నుకొస్తుండగా నేను కూడా బలరాం కళేబరం మీద వాలిపోయాను.
--- --- ---
బలరాం చనిపోయి ఏడాది కావస్తోంది.
ఇప్పటికీ వాడు చనిపోయాడంటే నా మనసు ఎందుకో ఒప్పుకోవడంలేదు. అందుకే ఏ బస్సుని చూసినా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నది బలరామే నేమో అనిపిస్తుంటుంది. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా ఆర్టీసీ బస్సు హారన్ మోగిస్తూ వచ్చి నా పక్కనే ఆగినట్టు... బలరాం నవ్వుతూ ఎక్కడికి వెళ్తున్నారు సార్. రండి అని ఆహ్వానిస్తున్నట్టు అనిపిస్తుంది.
వాడికి ఏమీ కాని నాకే ఇలా వుంటే వాడి కన్నతల్లికి, భార్యకి, పిల్లలకి ఎలా వుంటుందో. బలరాం తండ్రి అకాల మృత్యువు పాలవడం, బలరాం చిన్నవయసులోనే గుండెపోటుకు గురికావడం... ఏమిటో ఆ కుటుంబం చేసుకున్న పాపం అని మనసు విలవిలలాడుతుంది.
అయితే రాఘవులు చనిపోయినప్పుడు మాదిరిగా ఆ కుటుంబం ఇప్పుడు వీధిన పడలేదు. అప్పులవాళ్ల బాధ పడలేక ఉన్న ఇంటిని అమ్ముకుని కుటుంబమంతా ఛిన్నాభిన్నమైపోయే ఆనాటి దుస్థితి వీరికి రాలేదు.
ఆర్టీసీ వాళ్లు ఇంటి నిర్మాణంకోసం తీసుకున్న రుణాన్ని పూర్తిగా మాఫీ చేసేశారు. ప్రావిడెంట్ ఫండ్, గ్రాచ్యుటీ, ఎస్‌బిటి, ఎస్‌ఆర్‌బిఎస్, ఇడిఎల్‌ఐఎఫ్, అడిషనల్ మానిటరీ బెనిఫిట్ స్కీం, పెన్షన్ స్కీం ఇట్లా అనేక రకాల కార్మిక సంక్షేమ పథకాల వల్ల, దానికితోడు బలరాం ముందు చూపుతో చేసిన ఎల్‌ఐసి పాలసీ వల్ల ఆ కుటుంబానికి పెద్ద మొత్తంలో ఆర్థిక ఆసరా లభించింది. వచ్చిన డబ్బుని అధిక భాగం సిసిఎస్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. దానిపై వచ్చే ఇంట్రెస్ట్, పిఎఫ్ పెన్షన్ డబ్బులు కలిపితే బలరాం నెలజీతం కన్నా రెట్టింపు ఆదాయం వస్తోంది వాళ్లకి.
ఇవాళ బలరాం భార్య అనాథ కాదు.
తన తండ్రి చనిపోయినప్పటిలాగా ఇప్పుడు బలరాం పిల్లలు చదువు మానేయనవసరంలేదు.
రాఘవులు తాను చనిపోతూ తన పిల్లలకు మంచి భవిష్యత్తనేది లేకుండా చేశాడు.
బలరాం తాను చనిపోతూ తన పిల్లల ఆలనాపాలనకు, ఉజ్వల భవిష్యత్తుకు అన్ని ఏర్పాట్లు చేసిపోయాడు.
ప్రైవేట్ రంగంలో పనిచేసే కార్మికుడి పరిస్థితికీ ... ప్రభుత్వ రంగంలో పనిచేసే కార్మికుడి పరిస్థితికీ మధ్య ఎంత తేడా.
బలరాం నువ్వు లేవు. నీ ఆశాసౌధం వుంది.
అది ఎప్పటికీ కూలిపోదు!
.....
(ఆర్టీసీ ప్రస్థానం మాస పత్రిక మే 1994 సంచికలో ప్రచురించబడిన కథ స్వల్ప మార్పులతో)
...

బాగుందండి మీ గోడల కథ. ఒక విషయం, ఏమనుకోనంటే, ఈ "గోడ" అనే పేరు కథలకు కామనా ఆ రోజుల్లో ? అంటే నాలుగో గోడ, ఐదో గోడ, ఎనిమిదో గోడ అని ఈ మధ్య కథల పేర్లల్లో కూడా చూసా - అందుకు
ReplyDelete@ Anonymous
ReplyDeleteనిజమే. గోడను ప్రతీక గా వాడటం తెలుగు లో ఎక్కువే. గోడ అనే పదంలో విస్తృతమైన భావం వుంది. చైనా గోడ, జర్మనీ గోడ అనగానే మనకు కళ్ళముందు ఒక చరిత్ర సాక్షాత్కరిస్తుంది.
" మాకు గోడలు లేవు ... గోడలు పగులగొట్టడమే మా పని " అంటాడు శ్రీ శ్రీ . "జైలు గోడల మధ్య" పుస్తకం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. అట్లాగే రంగనాయకమ్మ గారి "కూలిన గోడలు" నవల ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ కథా శీర్షికకు ఆ పేరే స్ఫూర్తి.
ప్రైవేట్ రంగం లోని కార్మికుల పరిస్థితితో పోలిస్తే ప్రభుత్వ రంగం లోని కార్మికుల పరిస్థితి ఎంతో మెరుగు అని చెప్పడం కోసం అమెచ్యూర్ గా చేసిన ప్రయత్నమే నా కథ.
స్పందించినందుకు ధన్యవాదాలు.
బావుందండీ కధ ! గవర్నమెంట్ ఉద్యోగస్తుడనే కాదు ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఎలా(తమ ) పిల్లల జీవితాలు చిందరవందర అయిపోయాయో ...అలా తనపిల్లలు కాకుండా కాపాడుకున్న బలరాం వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం . బైట కెళ్తే తిరిగి వస్తామన్న నమ్మకంలేనిరోజులివి ! ప్రతీ కుటుంబ పెద్ద తనమీద ఆధారపడ్డ వారికోసం జాగర్తలు తీసుకోవడం ఎంత అవసరమో తెలియచేస్తుందీకధ .
ReplyDelete@ పరిమళం గారూ
ReplyDeleteధన్యవాదాలు.
ప్రతీ తల్లి దండ్రులూ తమ పిల్లల భద్రత కోసం, వారి భవిష్యత్తు కోసం అనుక్షణం పరితపిస్తారు.
అయితే ప్రైవేట్ రంగం లో పనిచేసే సగటు కార్మికులు ఎలాంటి సంక్షేమ పదకాలకూ నోచుకోక, ఎలాంటి హక్కులూ లేక, చాలీ చాలని జీతాలతో సతమత వవుతూ తమ పిల్లల కోసం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి లో వున్నారు.
వారి స్థితి గతుల గురించి ఆలోచింప జేయడమే ఈ కథ ఉద్దేశం. అయితే నా భావాన్ని ఈ కథలో బలంగా, సమగ్రంగా వ్యక్తం చేయలేకపోయాననిపిస్తోంది.
చాలా బాగుందండీ కథ.
ReplyDeleteధన్యవాదాలు భోగారావు గారు. చాలా కాలం తర్వాత స్పందన చాలా సంతోషం.
ReplyDelete