...
ఉత్తమ చిత్రంతో సహా ఏకంగా ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెలుచుకుని స్లమ్ డాగ్ మిలియనీర్ చరిత్ర సృష్టించింది.
ఆధునిక భారతీయ సంగీత మాంత్రికుడు ఎ.ఆర్. రహమాన్ (బెస్ట్ ఒరిజనల్ సాంగ్, బెస్ట్ ఒరిజనల్ స్కోర్) రెండు అవార్డులతో, రసూల్ ఫూకుట్టి (బెస్ట్ సౌండ్ మిక్సింగ్) అవార్డుతో ఆస్కార్ వేదికమీద భారతీయ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశారు..
దీనికి తోడు స్మైల్ పింకీ అనే లఘు చిత్రానికి కూడా ఆస్కార్ అవార్డు రావడం మరో విశేషం.
ముంబయి మురికివాడల దరిద్రాన్ని తెరకెక్కించి మన పరువు తీశారని ఒకవైపు ఈ సినిమాను చూసిన, చూడని విమర్శకులు తిట్టిపోస్తుండగానే ...
సినీరంగపు నోబుల్ ప్రైజులాంటి ఆస్కార్ అవార్డులను (ఏకంగా ఎనిమిదింటిని) గెలుచుకుని సంచలనం సృష్టించిందీ చిత్రం!
ఈ చిత్రాన్ని తెగడినవాళ్లూ పొగిడినవాళ్లూ అందరూ తమ తమ అభిప్రాయాలను పునస్సమీక్షించుకోవాల్సిన సమయం ఇది.
ఈ చిత్రం మన ఔన్నత్యాన్ని, మన ప్రతిభను లోకానికి చాటిందా లేక
మన దరిద్య్రాన్ని పంచరంగుల్లో చూపించి పరువుతీసిందా... మళ్లీ మరోసారి చర్చించుకోక తప్పదు.
ప్రపంచంలోనే అత్యధికంగా సినిమాలు తీసే, చూసే వాళ్లున్న మన దేశానికి
ఆలస్యంగా నైనా ఈ గౌరవం లభించడం సంతోషదాయకం.
ఎంత దరిద్రపుగొట్టు సినిమాలను తీసినా ఫరవాలేదు కానీ వున్న దారిద్య్రాన్ని మాత్రం తెరకెక్కించకూడదు అనడంలో అసలు అర్థంవుందా?
గాంధీ కూడా గోచీతో తిరిగి మన పరువు తీశాడని వాదించడం సబబేనా?
ఈ వాదనలమాట ఎలా వున్నా ఈ అపూర్వ, చారిత్రాత్మక శుభ సందర్భంలో మన మంతా నిండుమనసుతో వేడుకలు చేసుకోవాలి. ఎ.ఆర్.రహమాన్‌కు, రసూల్ ఫూకుట్టీ లకు, స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్ర దర్శక నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, రచయితకు జేజేలు పలకాలి.
జయహో ... స్లమ్ డాగ్ మిలియనీర్!
జయహో ... ఎ.ఆర్.రహమాన్, రసూల్ ఫూకుట్టీ !!
...............
బాగా చెప్పారు. భారతదేశంలో బోలెడంత దరిద్రం ఉంది . ఉన్నప్పుడు చూపిస్తే తప్పేమీలేదు. అసూయపరులే ఈ చిత్రాన్ని విమర్సిస్తుంది .
ReplyDeletesir!మహా శివరాత్రి శుభాకాంక్షలు .
ReplyDeleteబాగా చెప్పారు.
ReplyDelete@ శివ గారు,
ReplyDeleteధన్యవాదాలు.
కథానాయికలను వ్యాంపుల స్థాయికి దిగజార్చి, చెత్త కథలు, కుళ్ళు జోకులు, వెకిలి శృంగారం, ద్వంద్వార్ధాల డైలాగులు,పిచ్చి పాటలు , అర్ధం లేని ఫైట్లు , అంగాంగ ప్రదర్శనలతో సినిమాలను కుటుంబ సమేతంగా చూడడానికి వీల్లేకుండా చేసినవాల్లే ఇవాళ స్లమ్ డాగ్ మిలియనీర్ వంటి చిత్రాలని, సత్యజిత్ రే వంటి డైరక్తర్లని ఎక్కువగా విమర్శిస్తున్నారు.
ఈ పక్షపాత వైఖరి, హిపోక్రసీ పాలిటి ఆశని పాతాలు ఈ అవార్డులు.
మన భారతీయ సినిమాకు ఇదో మేలి మలుపు కావాలని ఆశిద్దాం.
@ పరిమళం గారు,
ఈ శివరాత్రి సోమవారం నాడు రావడమే ఒక విశేషం అనుకుంటే, ఇన్ని ఆస్కార్ అవార్డులను అందించి చిరస్మరణీయంగా నిలిచింది కదా. మీకు కూడా శివరాత్రి శుభాకాంక్షలు.
@ హీరో నెంబర్ వన్ గారు
థాంక్యూ .