...
...
...
''తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ...
అవసరమైతె బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం...
కుష్టురోగినైనా కౌగిలించుకుంటాం...!''
బేత్రీన్‌గున్నది డైలాగు!
మొదటిసారి విన్నప్పుడు నేను సుత ''వారెవ్వా...'' అని సప్పట్లు కొట్టిన!!
కాని ''పాడిందె పాటరా పాసిపండ్ల దాసుడా'' అన్నట్టు గీ డైలాగు వినీ వినీ బేజారైంది.
గిప్పుడు సప్పుట్లు కొట్టుడు ఆపి సోంచాయించుడు షురు చేసిన.
ఔ...!
బొంత పురుగును ముద్దు పెట్టుకుంటె ...
కుష్టు రోగిని కౌగలించుకుంటె ... తెలంగాణ ఎట్ల వస్తది?!
అసెంబ్లీల తెలంగాణ మాట ఎత్తితె చెమ్డా వలిచేస్తా ఖబడ్దార్ అన్న మనిషితోని...
తెలంగాణా ద్రోహుల పార్టీ అని దుమ్మెత్తి పోసిన పార్టీతోని...
సమైక్య రాష్ట్రానికే ఇప్పటికీ కట్టుబడివున్నాం అని ఢంకా బజాయించి చెప్పే పార్టీతోని...
తోక పార్టీలని చీదరించుకున్న పార్టీలతోని ...
''రాత్రి బారు పగలు దర్బారు'' అని ఎక్కిరించినోళ్లతోని ...
చేతులు కలిపేది గిందుకేనా...????
నిన్న కాంగ్రెస్ పార్టీని కౌగలించుకున్నది...
ఇప్పుడు ఇంకో పార్టీని ముద్దుపెట్టుకునేది గిందుకేనా?
ఇండ్ల ఎవరు బొంతపురుగులు? ...
ఎవరు కుష్టు రోగులు...??
కడుపుల సల్ల కదలకుంట గింత వీజీగా తెలంగాణాను సాధించుకోవచ్చా..!
వార్నీ...ఎంత ఇచిత్రం !
గీ ఫార్మూలా తెల్వక 1969 ప్రత్యేక తెలంగాణా ఉద్యమంల ఫుజూల్‌గ ...
ఉత్తపుణ్యానికి దగ్గరదగ్గర నాలుగువందల మంది పోరగాండ్లు సచ్చిపోయిండ్లు కదా పాపం!!
అయితె అప్పుడు సుత తెలంగాణా నేతలు గీ ఫార్మూలను పాటించిండ్లనుకొండ్రి.
కాకపోతె జెర ఆలస్యంగ పాటించిండ్లు.
తెలంగాణ పేరు చెప్పి ... తెలంగాణా ప్రజాసమితి తరపున గెలిచినంక ...
చెన్నారెడ్డితో సహా 10 మది ఎంపీలు
తెలంగాణకు లాత్ కొట్టి కాంగ్రెస్‌ను కౌగలించుకున్నరు!!!
మొన్నటికి మొన్న పది మంది ఎం ఎల్ ఏ లు ... టి ఆర్ ఎస్ తరపున గెల్చి ...
అటెంక టి ఆర్ ఎస్ ని లాత్ గొట్టి ఎవర్నో కావలించుకుంట ,
ఎవర్నో ముద్దు పెట్టుకుంట కూసున్నరు కదా !!
ఎవరు ఎప్పుడు ఎవర్ని కౌగలించుకున్నా ...
ఎవర్ని ముద్దుపెట్టుకున్నా...
అమాయక జనం నోరెళ్లబెట్టుకోని తమాష సూసుకుంట కూసోవాల్సిందె కద?!
అంతకంటె చేసేడ్ది ఏముంటది?!
ఒక దిక్కు ఆంధ్ర నేతలు ... అటు అదిలాబాద్ నుంచి ఇటు వరంగల్ దాక ...
మొత్తం తెలంగాణాను దున్నిపారేస్తున్నరు.
మీటింగుల మీద మీటింగులు పెడ్తున్నరు,
రోడ్డు షోల మీద రోడ్డు షోలు చేస్తున్నరు.
ఇగ, మన తెలంగాణా నాయకులకు ఆంధ్రను దున్నే దమ్ము ఎట్లైనా లేదు గని...
కమ్‌సె కం సొంత నేలనన్న దున్నుకునెందుకు చాతనైతలేదాయె...!!!
చాన బాదయితాంది.
కడుపుల రగిలిపోతాంది బిడ్డా!
అయినా ప్రపంచంల ఎక్కడలేని బేత్రీన్ ఫార్మూలా
( గదె...బొంతపురుగును ముద్దు పెట్టుకోవడం... కుష్టురోగిన కౌగలించుకోవడం )
మన దగ్గరున్నంక గీ ఎండలల్ల చెమటలు కక్కుకుంట ఎందుకు తిర్గాలె...
ఎడ్డి జనాన్ని ఎందుకు చైతన్య వంతుల్ని చేయాలె....!
జనం టైముకు ఓట్లేసి కడుపుల సల్ల కదలకుంట ఇంట్ల కూసుంటె సాలు.
ఎవర్ని ఎప్పుడు ముద్దుపెట్టుకోవాల్నో,
ఎవర్ని ఎప్పుడు కౌగలించుకోవాల్నో మన లీడర్లు సూసుకుంటరు.
మనం ''దొరా నీ కాల్మొక్త బాంచెన్'' అనుకుంట వాళ్లకు జై కొడ్తె సాలు.
ఏమంటరు?
జై తెలంగాణ! జైజై తెలంగాణ !!
నీకు బ్రెయిన్ ట్యూమర్ , మోకాల్ల నొప్పులు రెండూ ఉంటే... నువ్వు దేనికి మొదట ఆపరేషన్ చేయించుకుంటవ్... పరిస్థితులను బట్టి తెలంగాణ కోసం బొంత పురుగు..చంద్ర బాబు ని., తోక పార్టీలను .... కలుపుకుపోతే తప్పేంటి... ముందే చెప్పిండు కదా.. ముద్దు పెత్తుకుంటా....కౌగలించుకుంటా.. అని... పట్టు పట్టి 45+, 9+ సీట్లు వచ్చెట్ట్లు రూట్ గీసిండా లేదా....
ReplyDeleteఏమంటవ్....అన్నా.???
ReplyDeleteబాగజెప్పినవ్...
ReplyDelete@ వంశీ కిరణ్ భాయ్
ReplyDeleteబొంత పురుగు - కుష్టు రోగి ఫార్మూలా తోనే పరేషాన్ గున్నది అంటే నేమో .. . బ్రెయిన్ ట్యూమర్ - మోకాళ్ళ నొప్పులు అనుకుంట ఇంకో కొత్త ఫార్మూలా ముందుకు దెస్తివి వంశీ కిరణ్ భాయ్. జనాన్ని, ఉద్యమాన్ని గాలికి ఇడిసిపెట్టి కే సి ఆర్ మస్తు ఇకమతులు పడుతున్నడు. మల్ల 1969 ల జరిగినట్టు జరుగుతదో ఏంపాడో అని బుగులు పడుతున్నారు తమ్మీ జనం.
@ డాక్టర్ శ్రీను
థాంక్యూ డాక్టర్ సాబ్.
అస్సలు కెసిఆర్ లెకపోతె ఈడ గీ బ్లాగు ఉండేది కాదు, ఎ కవితలో కాకరకాయల గురించో రాసుకునేటోంవి.
ReplyDeleteఇయ్యాల కెసిఆర్ ఓ మాట ఇచ్చిండు.. ఎన్నికల తరువాత తన మాట నిలబెట్టుకోకుంటె అప్పుడు గిసువంటి రాతలు రాస్తె మంచిగుండేది. నీలాంటోల్లు పూటకోమాట మాట్లాడుడు వలనే గదా తెరాస కి ఉప ఎన్నికలలో అనుకుంన్నదాని కంటే తక్కువ మెజారిటి వచ్చింది. ఉప ఎన్నికలలో కెసిఆర్ కి 2006 కరీంనగర ఎన్నికలలో వచ్చిన మెజారిటి వచ్చుంటే ఇపాటికి తెలంగాణ వచ్చేది గాదా. నువ్వేమైనా జోతిషుడివా? కెసిఆర్ తెలంగాణ ను తాకట్టుపెడతడు అని చెప్పుతున్నవ్ అస్సలు నీలాంటోల్లు తెరాసను సక్కగ అర్ధంచేసుకోకపోవడం చానా బాధాకరం.
@ శ్రీనాథ్
ReplyDeleteఎన్కట దొరలు దబాయించినట్టు గీ దబాయించుడు ఏంటిది తమ్మీ.
ఇయాల పొద్దుగాల టీవీ వార్తలల్ల గా డైలాగు మల్ల ఇనిపించినంక
సెటైర్ రాయాలనిపించి, అదిగూడ మరిచి పోతున్న తెలంగాణా మాండలికం రాసి సూద్దాం అనిపించి రాసిన.
దీన్ల పాయింటే లేదంటవా ? .
మనకు విమర్శలొద్దు ... ఆత్మవిమర్శ లొద్దా ??
మొన్న తెలంగాణా ప్రజాసమితి టికెట్ తోని గెల్చి అటెంక
అందరు కాంగ్రెస్ ల కలిసింది,
నిన్న టీఆరెస్ టికెట్ తోని గెలిచి పదిమంది
వేరే తొవ్వ తొక్కింది నిజం కాదంటావా?
ఏమైనా ఎలక్షన్లు, బై ఎలక్షన్లు, పొత్తులేనా ఉద్యమమంటే !
జరిగిన వాటి గురించి చర్చించుకుంటే తప్పేంటిది?
2006 ఉపఎన్నికలల్ల లక్ష మెజారిటీ వస్తేనేమో మీ గొప్పా?
2008 ఉప ఎన్నికలల్ల గా మెజారిటీ పదివేలకు పడిపోతే గది జనం తెలివితక్కువ తనమా?
ఎక్కడ పొరపాటు జరిగిందో ఆలోచించుకోనే వద్దా ?
నీ బాధ నా కర్త మయిత లేదు ... నా బాద నీ కర్త మైతలేదు.
అందరం బాధ పడేది మాత్రం దగా పడ్డ తెలంగాణా గురించే !!!
ప్రభాకర్ గారు,
ReplyDeleteనిజంగా నేను దబాయించగలిగితే నేను గా ఆంద్రాపాలకులను దబాయించెతోడ్ని ,నిత్యం తెలంగాణ ఆకాంక్షించే తెలంగాణ వాదులను కాదు.
సరె గీ గొడవ పక్కనబెడితే...
మీరు తెరాసని వచ్చే ఎన్నికలని ఉద్దేసించి గీ మాటలన్ని రాసింరు. మంచిది..
ఇప్పుడు మనవాళ్ళు ఉద్యమించే పరిస్తితి ఉందా.. ఆప్పటి కాసు బ్రహ్మానంద రెడ్డి కంటే ఈ రాజశేకరుడు పేద్ద నియంత కాదా..?
ఎన్నికల ద్వరానే తెలంగాణ అని ఆలోచించినప్పుడు మీరు రాసిన ఈ బ్లాగు తప్పుడు సంకేతాలు పంపడం లేదా?
2006 గెలిచింది కెసిఆర్ ..కాని గెలిపొంచింది ప్రజలే..అందులో సందేహములేదు.
మరి 2008 లో ఏమయింది?
నా భాద ఒక్కటే, ఈ రోజు తెరాస కి ప్రత్యమ్యాయం లేదు.. ఇప్పటివరకు తెరాస ఏమి అభివృద్ది చేసిందో ఆలోచించకు, ఈ రోజు కేంద్రంలో రాష్ట్రంలో అన్ని పార్టీలు తెలంగాణ అంటున్నయి అంటే అది తెరాస వలనే కదా? ఎన్నికల ముందే మీరు ఇలా తెరాస్ ను నిందించడం సబబేనా?
ఇంతగా అంటున్నమీరే చెప్పండి ఈ ఎన్నికలకు ఏం చేయాలో?
@ శ్రీనాథ్ గారు
ReplyDelete2008 లో మళ్ళీ రాజీనామాలు చేసి ఉప ఎన్నికల ప్రయోగం చేయడమే పొరపాటు .
ప్రత్యర్ధి పార్టీలు సమైక్య వాదంతో ముందుకొస్తే కదా ...
తెలంగాణా వాదాన్ని బలంగా చాటాలని ప్రజలకు పట్టుదల కలిగేది.
పైగా వున్న నాలుగు సీట్లనే మళ్ళీ గెలిచినంత మాత్రాన తక్షణ ప్రయోజనం ఏమిటో ఎవరికీ అంతుపట్టలేదు.
ఎన్నికల ముందు కాంగ్రెస్స్ తో సహా టీడీపీ, బీజేపీ, సేపేఐ ప్రజా రాజ్యం అన్ని పార్టీలు తెలంగాణా అనుకూల పాటనే పాడుతున్నాయి. సీపీఎం గోడ మీది పిల్లిలా వ్యవహరిస్తోంది
టీడీపీ అయితే ఎన్నికల ముందు ఎన్టీఆర్ బొమ్మని బయటకు తీసి ఆతరువాత డస్ట్ బిన్లో పడేయడం తెలిసిందే.
కాబట్టి తెలంగాణా విషయంలో. మనకు వున్నంత ఆరాటం ఆంద్ర నేతల ఆధ్వర్యంలోని పార్టీలకు అస్సలు వుండదు.
వాటిని నమ్ముకోవడం అంటే మరో వంచనకు సిద్ధ పడడమే అని పిస్తోంది. దానికంటే మన పార్టీని పటిష్ట పరుచుకోవడం, మన ప్రజలను నమ్ముకోవడం, మనకు మనంగా తెలంగాణాను సాధించుకోవడం ఆ దిశలో ప్రయత్నాలు చేయడం మంచిది కదా.
రేపు టీడీపీ మద్యపాన నిషేధం విషయం లో లాగే చాల నైస్ గా తెలంగాణా వాదాన్ని పక్కన పెట్టి నిర్వీర్యం చేయదనే గ్యారెంటీ ఏమి లేదు.
ఈ భయాలే నన్నూ నాలాంటి వాళ్ళను తొలుస్తున్నాయి.
One who held the flag of Telangana 8 years back , fighting uninterruptedly for all these years and still fighting in 2009 election also , without dropping the flag , is to be supported by each & every son of the soil of Telangana . Some of his strategies might have failed . One must realize that he is not a God and not even a monarch . It is the responsibility of all the people of Telangana ,who have not supported him whole-heartedly in bye-election , to recognize his efforts for sustaining the moment in high pedestal for such a long period . Our history reminds us about the leaders who won maximum number of seats on Telangana issue in 1971 and then joined Congress party , leaving the issue into the gutters . But here is a man who fought 2004 election and now fighting 2009 election with the same spirit & determination . Oh people of Telangana ! Please don’t get your mind disturbed and for your sake & for the sake of next generations, please support him .
ReplyDeleteఇంకో దారి లేదు, ఇంకో నాయకుడు లేడు గాబట్టి ఇప్పుడు అందరు తెలంగాణా ప్రజలు తప్పకుండ టీ ఆర్ ఎస్ కే సపోర్ట్ చెయ్యాలె. వేరే కొన్ని చిన్న చిన్న పార్టీ లున్నాగని వాటిని పట్టించుకోవద్దు. ఎందుకంటె తెలంగాణా వోటు చీలిపోవద్దు. తెలంగాణా వచ్చినంక తెలంగాణా నాయకుడు ఎవరనేది అప్పుడు ఆలోచించొచ్చు.
ReplyDelete