...నా చిన్నతనంలో కంప్యూటర్లు లేవు.
సాఫ్ట్‌వేరులూ కాడలూ కొమ్మలూ ఏమీ లేవు. అమెరికా వుండేది(ట) కానీ డాలర్ డ్రీమ్స్ లేవు.
ఇప్పుడైతే సగటు విద్యార్థులు సైతం - ఏదో ఒకవిధంగా జిఆర్‌ఇ, టోఫెల్ రాసేసి ... వీసా సంపాదించేసి... అమెరికా ఫ్లయిటెక్కేసి ... సకల భోగభాగ్యాలు సొంతచేసుకోవాలని కలలు కంటున్నారు. (ఆ కలలకు ''తాత్కాలిక'' విఘాతం కలిగిందనుకోండి అది వేరే విషయం).
అప్పుడు మాకు కెరీర్‌గురించి ఇంత స్పృహ వుండేది కాదు.
ఏదో డిగ్రీ పూర్తి చేయడం, ప్రభుత్వ కార్యాలయంలోనో, బ్యాంకులోనో ఓ గుమస్తా ఉద్యోగం సంపాదించుకోవడం ఆతర్వాత - ''పెళ్లి చేసుకుని - ఇల్లు చూసుకుని - హాయిగ కాలం గడపడం'' ... బస్ అంతే...! అంతకు మించిన కలలకు ఆస్కారమే వుండేది కాదు.
బీదరికం నుంచి బయటపడాలన్న తహతహ మాత్రం మెండుగానే వుండేది.
బీదరికంలో శాశ్వతంగా మగ్గిపోవాలని ఎవరికుంటుంది?
అందుకే అప్పుడప్పుడు రంగుల కలలు కనేవాళ్లం.
హఠాత్తుగా - భారీ స్థాయిలో నోట్ల కట్టలు... బంగారు బిస్కెట్లు... లంకెబిందెలు వంటివి దొరికినట్టు ... ఏ లాటరీయో తగిలినట్టు ... జీవితమే మారిపోయినట్టు తరచుగా రాత్రి కలలూ - పగటి కలలూ గిలిగింతలు పెడ్తుండేవి. వాస్తవాన్ని కాసేపు మరిపించి మురిపిస్తుండేవి.
అట్లాంటి నేపథ్యంలో -
పదకొండో తరగతి చదువుతుండగా ఒక విచిత్రం జరిగింది...
నా క్లాస్‌మేట్ ఒకరు తాళ పత్ర గ్రంథంలాంటి ఓ పురాతన పుస్తకం పట్టుకొచ్చాడు.
దాని పేరు ''అపూర్వ తాంత్రిక విద్యలు'' అనుకుంటా సరిగా గుర్తులేదు.
అందులో రకరకాల మంత్ర తంత్రాలు వాటి మహత్యాలు, వశీకరణం, గుప్తనిధులు, చేతబడి, బాణామతి వంటివి చాలా వున్నాయి. చదువుతుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
అత్యంత అరుదైన ఆ పుస్తకం ద్వారా మేం అద్భుత శక్తులను సొంతం చేసుకోబోతున్నట్టు... మా భవిష్యత్తు అనూహ్యమైన మలుపు తిరగబోతున్నట్టు ఎంతో ఉద్వేగానికి గురయ్యాం!
ఆ మంత్ర శక్తులను సాధించేందుకు చేయాల్సిన సాధన, తంతు మాత్రం చాలా క్లిష్టమనిపించింది..
శ్మశానాలకు వెళ్లడం,, అమావాస్య నాడు ఏవో హోమాలు చేయడం, శవపూజలు, రక్తమాంసాల నైవేద్యాలు, ఎముకలు, బొమికలు, బలులు వంటివి ఆ వయసులో మేం చేయగలిగేలా లేకపోవడంతో తీవ్ర నిరాశ కలిగింది.
అయితే ఆ పుస్తకాన్ని తిరగేయగా మరగేయగా అందులో ఒక్క మంత్ర శక్తిని సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు అని తేలింది. దాంతో మళ్లీ ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.
అదొక మహిమాన్విత తావీజు తయారీకి సంబంధించిన కిటుకు.
- ముందుగా ఒక తొండ యొక్క కుడి ముంజేతి ఎముకను (ఏమాత్రం విరగకుండా, దెబ్బతినకుండా) సంపాదించాలి.
దానిని పంచ లోహాలలో చుట్టి తాయత్తుగా చేసుకోవాలి.
అమావాస్యనాడు అర్థరాత్రి పన్నెండు గంటలకు ఏదో ముగ్గు వేసి మధ్యన కూచుని దానిని కుడి చేతికి కట్టుకుని ఓం..హ్రీం...క్రీం... వంటి మంత్రమేదో 108 సార్లు ఏకాగ్రతతో కళ్లు మూసుకుని పఠించాలి.
అంతే
ఇక అప్పటినుంచి మనం మనసులో ఏం తలచుకుంటే అది వెంటనే జరిగిపోతుంది!
ఆ తాయెత్తు చేతికి వున్నంత కాలం దేనిలోనూ అపజయం అన్నది వుండదు!!
ఫస్ట్ రావాలనుకుంటే ఫస్ట్ వచ్చేస్తాం.
ఉద్యోగం కావాలనుకుంటే ఉద్యోగం వచ్చేస్తుంది.
లాటరీ తగలాలనుకుంటే లాటరీ తగులుతుంది. అంతేకాదు కోరుకున్న అమ్మాయి మన దగ్గరకొచ్చి సిగ్గులొలకబోస్తూ తనంతట తను ఐ లవ్యూ చెప్తుంది. వావ్... అంతకంటే వైభోగం ఇంకేం కావాలి ఈ జన్మకి!
ఇక అక్కడినుంచి ఓ వారం పది రోజులు మాకు చదువు సంధ్యల మీద బొత్తిగా ధ్యాస లేకుండా పోయింది.
ఇరవైనాలగు గంటలు దాని గురించిన ఆలోచనలే.
ఒక విధమైన ట్రాన్స్‌లోకి వెళ్లిపోయాం.
తొండ ముంజేతి ఎముకను ఎట్లా సంపాదించాలి?
పంచలోహాలను ఎట్లా సిద్దం చేయాలి?
పంచలోహాలు అంటే ఇనుము, రాగి ఇత్తడి, వెండి, బంగారం ఫరవాలేదు సులువుగానే దొరుకుతాయి.
మేం వున్న సువిశాలమైన లేబర్ కాలనీలో తొండలకేం కొదవలేదు.
కానీ వాటిని ఎట్లా పట్టుకోవాలి. ముంజేతి ఎముకను ఎట్లా సేకరించాలి అన్నదే సమస్య. పైగా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి. తెలిస్తే ఎక్కడ అభాసుపాలవుతామోనని భయం.
కర్రతోనో, రాళ్లతోనో కొడితే తొండ కాలు విరిగి పోవచ్చు.
మరెట్లా?
ఆలోచించగా ఆలోచించగా ఒక అవిడియా తట్టింది.
ఓ సీతాఫలం చెట్టు కింద గొయ్యి తీశాం. చెట్టు మీద తొండ కనిపించినప్పుడు కొమ్మలు ఊపి అది గొయ్యిలో పడేట్టు చేయాలి. పడగానే మట్టితో కప్పెయ్యాలి. దాంతో తొండ చచ్చూరుకుంటుంది.
దాని కాళ్లు చెక్కుచెదరకుండా వుంటాయి.
ఓ రెండు రోజులపోయాక తొండ శవాన్ని బయటకు తీసి జాగ్రత్తగా ముంజేతి ఎముకను తీసేసుకోవాలి.
బస్ ఇక మన పంట పండినట్టే.
అట్లా తయారు చేసిన మొదటి తావీజును నేను ధరించేట్టు, ఆతరువాత మరొకటి తయారు చేసి మిత్రుడికిచ్చేట్టు మా మధ్య ఒప్పందం కుదిరింది.
అనుకున్నట్టే ఒక రోజు ఓ తొండను మేం తవ్విన గోతిలో పడేలా చేయగలిగాం.
వెంటనే దానిని మట్టితో కప్పేశాం.
సగం పని పూర్తయినట్టే.
మిగతా కార్యమ్రం అంత కష్టమైనదేంకాదు.
అంటే తాయెత్తు తయారైపోయినట్టే.
కొండెక్కినంత ఆనందం. లోపలినుంచి కోరికల లిస్టు తన్నుకురావడం మొదలయింది.
ఆ ఊహలు, కలలు తలచుకుంటే ఇప్పటికీ నవ్వుతాలుగా వుంటుంది.
మొత్తం మీద ఆ రెండ్రోజులు నిమిషమొక యుగంగా గడిచాయి.
ఆరోజు చెప్పలేనంత ఉద్వేగంతో గొయ్యి దగ్గరకు వెళ్లాం.
మొదటి తావీజు నాదే కనుక తొండ శవాన్ని వెలుపలికి తీసేందుకు నేనే ఉత్సాహంగా రెండు చేతులతో మట్టి తొలగించడం మొదలు పెట్టాను.
నా ప్రండు పక్కన నిలబడి చూస్తున్నాడు.
నాలుగు దోసిళ్ల మట్టి తీశానో లేదో ఎప్పుడో చచ్చిపోయి వుంటుందనుకున్న తొండ మట్టిని దులుపుకుంటూ గంపెడు నోరు తెరిచి బిరబిరా నా మీదకు వచ్చింది.
ఊహించని ఆ పరిణామానికి కెవ్వున అరచి వెల్లకిలా పడ్డాను.
నా మిత్రుడు ఎప్పుడో పారిపోయాడు.
నాకది తొండలా కాక నా మీదకు పగతో దూసుకొచ్చిన డైనొసార్‌లా అనిపించింది.
అంతే. ఆతరువాత ఏం జరిగిందో తెలియదు.
ఆ దెబ్బకి నేను వారం రోజులు హై ఫివర్‌తో మంచం నుంచి దిగలేదు.
మూడనమ్మకాలు, చేతబడులకు సంబంధించిన వార్తలు వచ్చినప్పుడల్లా ఆనాటి సంఘటన ఇప్పటికీ గుర్తుకొస్తుంటుంది. మట్టిలో కప్పెట్టినా ఆ తొండ ఎట్లా బతికిందో ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ఏది ఏమైనా ఒక్క ఎదురుదెబ్బకే అట్లా బెంబేలు పడిపోకుండా ... మరింత పట్టుదలగా, మరింత పకడ్బందీగా ప్రయత్నించి - అపూర్వమైన తాయెత్తును సాధించి - నా మాతృదేశానికి ... ఒంటి చేత్తో అనేక ఒలంపిక్ గోల్డ్ మెడళ్లు ... ఆస్కార్ అవార్డులు ... నోబెల్ ప్రైజులు ... సంపాదించిపెట్టగలిగే సూపర్ మేన్‌ను ప్రసాదించలేకపోయినందుకు అప్పుడప్పుడు నాకు చాలా బాధగా వుంటుంది. ప్చ్.
..............
:)
ReplyDeleteబాగుబాగు!
ReplyDelete:) :)
ReplyDelete:)))
ReplyDeleteసెబాసు!
ReplyDeleteమీరు తంత్ర విద్యలో ఫెయిలయితే అయ్యారు గానీ మాకు గొప్ప టపాని అందించారు.
ఇదివరలో మీనాక్షి గారనుకుంటా ఇట్లాంటి ప్రయోగాలు చేసిన గుర్తు!
@ నేస్తం గారు
ReplyDelete:) :)
@ రాజేంద్ర కుమార్ గారు
:) :) :)
@ నాగ ప్రసాద్ గారు
:)))
@ కట్టి మహేష్ గారూ
ధన్యవాదాలు.
@ కొత్తపాళీ గారూ
మీ స్పందనకు చాల చాల థాంక్స్
పైన నా కృతజ్ఞతలు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పేరుతో పొరపాటుగా వచ్చింది. అలాగే కత్తి మహేష్ గారి పేరులో తప్పు దొర్లింది. క్షమించాలి.
ReplyDeleteకామెంట్స్ లో ఇట్లాంటి తప్పులు దొర్లినప్పుడు ఎలా సరిదిద్దుకోవాలో దయచేసి ఎవరైనా సూచించగలరా?
ఏముంది డిలిట్ చేసి మరలా కరక్టెడ్ కామెంట్ ను పోస్ట్ చేయటమే.
ReplyDeleteమీ టపా బాగుంది.
@ బొల్లోజు బాబా గారు
ReplyDeleteకీ జేబులోనే పెట్టుకుని ఇల్లంతా వెతికినట్టు సెలెక్ట్ చేస్తూ డిలిట్ మీద నొక్కుతూ నానా హైరానా పడ్డాను. ఎవరో మంత్రమేసినట్టు కామెంట్ల పక్కనే వున్న అంతలావు సింబల్ నాకు కనిపించనే లేదు..... ధన్యవాదాలు.
బావుంది.
ReplyDelete(సరదాగా) పైన పేర్కొన్న కోరికల లిస్టు కిందకొచ్చాక మారిపోయిందేమిటి? బహుశా మీ ప్రయత్నం ఫెయిలయినందుకా? :)
చాలా బాగా రాసారు...
మంత్రాస్టిక్! :-)
ReplyDelete@ ఉమాశంకర్ గారూ
ReplyDeleteభలే పట్టేశారు. ఇది ఎప్పుడో జరిగిన సంగతి కదండీ..... పాత కోరికలు ( అరకొరగా నెరవేరి ) అవుట్ డేటెడ్ అయిపోయాయి. అయినా అన్ లిమిటెడ్ గా ఎన్నైనా కోరుకోవచ్చు. చాల పవర్ఫుల్ తాయెత్తది.
@ రానారె గారూ
మంత్ర దండం లాంటి మీ మాట కి ధన్యవాదాలు .
ప్రభాకర్ సర్ !భలే ఉంది మీ టపా .మీరు తావీద్ మహిమతో అనుకున్నది సాధించారేమో, ఈ సిటీలో తొండ నెక్కడ సంపాదించాలాని అనుకుంటూ ఉండగానే నీళ్లు జల్లేశారు :) :).
ReplyDelete@ పరిమళం గారూ
ReplyDeleteమీకు నా టపా నచ్చినందుకు సంతోషం వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు.
బాగుంది మీ తావీదు ప్రయత్నాలు :)
ReplyDelete@ రాము గారూ
ReplyDeleteమీ కామెంట్ కు ధన్యవాదాలు.
You know what. మీరు జ్వరం తగ్గిన తరువాత మళ్ళా ట్రై చేయవలసిమ్ది గురూ గారు
ReplyDeletehi..sir naku a pustakam kavali my mail saiteja787@yahoo.com plss
ReplyDelete@ సాయితేజ
Deleteఆ పుస్తకం కోసం , చిన్ననాటి ఆ మిత్రుడి కోసం నేను ఇంకా ఎడతెరిపి లేకుండా అన్వేషిస్తూనే వున్నాను.
దొరికితే ఆ పుస్తకం జెరాక్స్ కాపీ ని మీకు పంపడమే కాదు, ఈ బ్లాగులో కూడా పెడతాను. సరేనా?