జెండర్-కులం... విడివిడిగా కనబడే ఈ రెండు అంశాల నడుమనున్న సంబంధం విడదీయరానిది.
కులవ్యవస్థ బలపడుతున్న క్రమంలోనే స్త్రీలపై జెండర్‌పరమైన వివక్ష, అణచివేత పెరుగుతూ వచ్చింది. వ్యక్తిగత ఆస్తి, కులవ్యవస్థ కలిసి కుటుంబ నిర్మాణాలను స్త్రీలపాలిటి నిర్బంధ శిబిరాలుగా మార్చాయి.
ఆస్తినీ, సామాజిక హోదానూ ఆధిపత్య కులాలకు వంశపారంపర్యంగా అందించటానికి ఆ కులాల స్త్రీలను సాధనాలుగా మార్చింది బ్రాహ్మణీయ వ్యవస్థ.
మరొక వైపున తరతరాల సామాజిక బానిసత్వాన్నీ, భౌతిక శ్రమనూ నిరంతరంగా మోసుకుపోయే పనిముట్లుగా మారారు పీడిత కులాల స్త్రీలు.
శ్రామికుల నడుమ విభజన రేఖలు గీసి అంతరాలు సృష్టించిన బ్రాహ్మణీయ వ్యవస్థే స్త్రీలను కూడా కులాల పేరిట విడదీసి పరస్పర వైరుధ్యాల్లోకి నెట్టింది.
భారతదేశంలోని శ్రామికోద్యమాన్నీ, స్త్రీల సంఘటిత పోరాటాన్నీ కూడా బలహీనపరుస్తున్న ఈ పరిణామాలను చారిత్రక అధారాలతో సవివరంగా చర్చించారు ఉమా చక్రవర్తి.
కులానికీ, జెండర్‌కూ మధ్యనున్న పరస్పర సంబంధాన్ని బట్టబయలు చేస్తూ స్త్రీలందరి నడుమ ఐక్యత కొరకు స్త్రీవాద దృక్పథంతో కొన్ని విలువైన ప్రతిపాదనలను అందించే రచన ఇది.
స్త్రీవాద దృక్కోణంలో జెండర్ - కులం
మూలం : జెండరింగ్ క్యాస్ట్ - త్రు ఎ ఫెమినిస్ట్ లెన్స్
ఉమా చక్రవర్తి
తెలుగు అనువాదం : కాత్యాయని
పేజీలు : 200
ధర : రూ. 150/-
ప్రచురణ : మలుపు, హైదరాబాద్.
ప్రతులకు :
2 - 1 - 1 / 5 ,
నల్లకుంట,
హైదరాబాద్ - 500 044,
తెలంగాణ.
Courtesy : Sakshi 27-3-2017
No comments:
Post a Comment