నయాగరా !
ప్రపంచంలోనే అతిపెద్దదైన నయాగరా జలపాతాన్ని చూసేందుకు ఆరోజు బాల్టిమోర్ నుంచి ప్రొద్దున్నే కారులో బయలుదేరాం.
'నయాగరా సిటీ' చేరుకునేసరికి మధ్యాహ్నం రెండయింది.
నగర పొలిమేరలోనే 'నయాగరా నది' మమ్మల్ని పలకరించింది.
రోడ్డుకు సమాంతరంగా చాలాదూరం మాతోపాటే పరవళ్లు తొక్కుతూ వచ్చింది.
ఆన్‌లైన్‌లో ముందే బుక్ చేసుకున్న హోటల్‌కి నేరుగా వెళ్లాం.
కాసేపు నడుం వాల్చాలనుకుంటూనే యదాలాపంగా విండో కర్టెన్స్‌ని పక్కకు జరిపాం.
అంతే, నయాగరా నది మళ్లీ ప్రత్యక్షమయింది.
మధ్యాహ్నపు ఎండకు మిలమిల మెరిసిపోతూ, ప్రశాంతంగా, గంభీరంగా ప్రవహిస్తోంది.
మేం దిగిన హోటల్ నయాగరా నది ఒడ్డున్నే వుందన్న సంగతి అప్పటివరకు మాకు తెలియదు.
చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది.
మర్నాడు ఉదయం జలపాతం చూసేందుకు వెళ్దామనుకున్నవాళ్లం కాస్తా ఆ నయనమనోహర దృశ్యాన్ని చూశాక మనసు మార్చుకుని గబగబా ఫ్రెషప్ అయి వెంటనే జలపాతం వద్దకు వెళ్లిపోయాం.
ఆరోజు వర్కింగ్ డే కాబట్టి పర్యాటకుల రద్దీ తక్కువగా వుంది.
వీకెండ్‌లో, సెలవురోజుల్లో అయితే క్యూ లైన్లలోనే గంటలకు గంటలు గడపాల్సి వస్తుంది.
''మేడ్ ఇన్ అమెరికా'' స్టోర్ పక్కన వివిధ టూరిస్ట్ ఏజెన్సీలవాళ్లు టికెట్లు అమ్ముతూ కనిపించారు. నయాగరాను పూర్తిగా కవర్ చేసే మూడున్నర గంటల టూరిస్ట్ ప్యాకేజీ వుందని, ఆరోజు అదే చివరి ట్రిప్ అని చెప్పారు. సరే అని ''ఓవర్ ది ఫాల్స్ టూర్స్'' అనే ఏజెన్సీ వద్ద టికెట్లు తీసుకున్నాం.
ప్యాకేజీ టూర్‌లో సౌకర్యాలూ- అసౌకర్యాలూ రెండూ సరిసమంగా వుంటాయి. అన్నింటినీ కవర్ చేయగలగడం ఒక అడ్వాంటేజ్ అయితే - అడుగడుగునా టైమ్ రిస్ట్రిక్షన్ వల్ల దేనినీ పూర్తిగా ఆస్వాదించలేకపోవడం ఒక డిజడ్వాంటేజ్. ఖర్చు కూడా ఎక్కువే. అయినా ఒకోసారి తప్పదు.
కాసేపట్లోనే టూరిస్టు బస్సు వచ్చింది. అందరినీ ఎక్కించుకుని కొంత దూరం వెళ్లాక ఒకచోట ఆపి ''డ్రైవర్ కమ్ గైడ్'' తనని తాను పరిచయం చేసుకున్నాడు. అందరికీ ఆహ్వానం పలికాడు. ఆ పరిచయాలప్పుడు తెలిసింది బస్సులో మా ముగ్గురితోపాటు మొరాకో, సిరియా, ఇటలీ, చైనా, జర్మనీ దేశాలనుంచి వచ్చిన ఫామిలీస్ వున్నాయి. గైడ్‌ను మినహాయిస్తే అమెరికాకు చెందినవాళ్లు ఒక్కరు కూడా లేరు.
రిచర్డ్ అనే ఆ గైడ్ సరదాగా నవ్విస్తూ నయాగరా గురించి బోలెడు విశేషాలు చెప్పాడు. మధ్య మధ్య ఇలాగే చెప్తుంటానని అందరూ శ్రద్ధగా వినాలన్నాడు. పర్యటన ముగిసాక అందరూ ఒక పరీక్షను ఫేస్ చేయాల్సి వుంటుందన్నాడు. ఆ పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చినవారికి వెయ్యి డాలర్ల నజరానా ఇవ్వడం జరుగుతుందని ఊరించాడు.
అతని ఇంగ్లీష్ యాక్సెంట్ నాకు మాత్రం సంక్లిష్టంగా అనిపించింది. అందువల్ల సగం సగమే అర్థమయ్యేది.
నయాగరా జలపాతం నిజానికి మూడు జలపాతాల సమాహారం. 170 నుంచి 190 అడుగుల లోతైన లోయలో పడే ముందు నయాగరా నది రెండుగా చీలిపోయింది. మధ్యలో పెద్ద భూభాగం వుంటుంది. దానిని 'గోట్ ఐలాండ్' అంటారు.
అమెరికావైపు వున్న జలపాతాలను 1) ''అమెరికన్ ఫాల్స్'', 2) ''బ్రైడల్ వీల్ ఫాల్స్'' గా వ్యవహరిస్తారు. కెనడా వైపు జలపాతాన్ని ''హార్స్ షూ ఫాల్స్'' అంటారు.
అమెరికన్ ఫాల్స్ వెడల్పు 1060 అడుగులైతే, కెనడావైపు వున్న హార్స్ షూ ఫాల్స్ వెడల్పు 2600 అడుగులు.
అమెరికావైపు నుంచి హార్స్ షూ పాల్స్ పూర్తిగా కనిపించదు. అదే కెనడా వైపు నుంచైతే మొత్తం నయాగరా జలపాతపు విశ్వరూపాన్ని వీక్షించవచ్చు. ఆ దృశ్యం చాలా అద్భుతంగా వుంటుందట. అయితే కెనడావైపు వెళ్లాంటే తాత్కాలిక వీసా తీసుకోవాలి. అమెరికన్ పౌరసత్వం వున్నవాళ్లైతే గుర్తింపు కార్డుతో వెళ్లొచ్చట.
ఒకప్పుడు నయాగరా జలపాతం దాదాపు 11 కిలో మీటర్ల దిగువన ఎక్కడో వుండేదట. భూమిని కోత కోస్తూ, దిశను మార్చుకుంటూ ప్రస్తుత రాతి ప్రదేశంలో స్థిరపడిందట. అయితే ఇప్పటికీ ప్రతి సంవత్సరం అతి స్వల్పంగానైనా ఇంకా కోతకు గురవుతూనే వుందంటారు.
నయాగరా నది లోయ మీద నిర్మించిన ''రైన్‌బో బ్రిడ్జ్'' అమెరికా కెనడా దేశాలను కలుపుతోంది. దాని పొడవు కేవలం 1400 అడుగులే. అమెరికా ఒడ్డున నిలబడి ఈల వేస్తే కెనడా ఒడ్డుకు వినపడుతుంది. అంత దగ్గర.
కెనడా వైపు నయాగరా తీర ప్రాంతంలో ''ఆంటారియో'' నగరం వుంది. అనేక ఆకాశ హర్మ్యాలు, కేసినో, స్కైలాన్ టవర్ మొదలైన వాటితో ఆ నగరం చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంటుంది. అమెరికావైపు ఒక్క ''అమెరికన్ అబ్జర్వేషన్ టవర్'' తప్ప ఎలాంటి భారీ నిర్మాణాలూ లేకపోవడం వల్ల వెలవెలబోతున్నట్టుగా అనిపిస్తుంది.
బస్సు దిగి లిఫ్ట్‌లో దాదాపు 18 అంతస్తుల కిందకు నది ఒడ్డుకు వెళ్లాం. అక్కడ అందరికీ బ్లూ కలర్ రెయిన్ కోట్లు ఇచ్చారు. వాటిని ధరించి 'మెయిడ్ ఆఫ్ ది మిస్ట్' బోట్ ఎక్కాం. కెనడా వైపు నుంచి వచ్చే ప్రయాణికులు రెడ్ కలర్ రెయిన్ కోట్‌లు ధరించి తమ బోట్‌లో మన పక్కనుంచే వెళ్తూ కనిపిస్తారు.
బోట్ డెక్‌పై నుంచుని నయాగరా నదిలో ముందుకు సాగుతూ అమెరికన్ ఫాల్స్‌నీ, హార్స్ షూ ఫాల్స్‌నీ దర్శించడం ఎంతో అద్భుతమైన, అనిర్వచనీయమైన అనుభూతి కలిగిస్తుంది. హార్స్ షూఫాల్స్ బేసిన్ వరకు బోట్ వెళ్తుంది. అక్కడ 188 అడుగుల ఎత్తు మీద నుంచి ప్రతి సెకండ్‌కి ఆరు లక్షల గ్యాలన్‌ల చొప్పున నీళ్లు కిందకు దూకుతుంటాయి. ఒకటే హోరు.
లోయలోంచి నీటి తుంపరలు పెద్ద ఆవిరి మేఘంలా తయారై ఆకాశాన్ని తాకుతుంటాయి. ఎటు చూసినా నీళ్లే నీళ్లు.
మా గ్రూపులో చైనా యువతి చొరవగా మమ్మల్ని అడిగి మరీ మా సెల్ తీసుకుని ఫొటోలు తీసింది. అలాగా తమ జంటనూ మా చేత ఫొటోలు తీయించుకుంది. ఫాల్స్‌కి దగ్గరవుతున్నా కొద్ది మన మీద నీటి తుంపర్లు పడటం ఎక్కువై ఇంక ఫొటోలు తీసుకునేందుకు వీలు కాదు. మంచి కెమరా తీసుకుని, తడవకుండా తగిన ఏర్పాట్లు చేసుకుని వెళ్తే బాగుండేది.
ఆ తరువాత బ్రైడల్ వీల్ ఫాల్స్ వద్ద ''కేవ్ ఆఫ్‌ది విండ్ '' లోకి వెళ్లడం మరో అపూర్వ అనుభవం. అక్కడ మనకి యెల్లో కలర్ రెయిన్ కోట్లతో పాటు ప్లాస్టిక్ శాండిల్స్ కూడా ఇస్తారు. ''మీ చెప్పులని పాలిథిన్ కవర్లలో పెట్టివ్వండి నేను బస్సులో భద్రపరుస్తాను'' అంటూ గైడ్ స్వయంగా అందరి చెప్పులను ఎలాంటి భేషజం లేకుండా తీసుకెళ్లడం కదిలించింది.
చెక్కలతో నిర్మించిన అనేక మెట్లు దిగుతూ, ఎక్కుతూ నీటి గుహలోకి వెళ్లాలి. జలపాతం మన నెత్తిమీదే పడుతుందేమో అనిపిస్తుంది. హోరుమనే గాలివానలో నిలబడ్డట్టుగా వుంటుంది. ఎంత రెయిన్ కోట్లు ధరించినప్పటికీ చాలావరకు తడిచిపోతాం. ఆ నీటి హోరు మధ్య ఫోటోలు తీసుకోడానికి వీలుండదు.
నయాగరా సందర్శనానికి వెళ్లినప్పుడు మంచి కెమెరాలు తీసుకెళ్లడం, అవి నీటిలో తడవకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవడం చాలా అవసరం అనిపించింది.
ఐదు దశాబ్దాల క్రితం వరంగల్ ఎవి హైస్కూల్‌లో చదువుకున్న నాటి రోజులు గుర్తుకు వచ్చాయి. మా స్కూలు భద్రకాళి చెరువు పక్కనే వుండేది. భారీ వర్షాలు పడ్డప్పుడల్లా ఆ చెరువు ''మత్తడి'' పారేది. మేం అక్కడికి కేరింతలు కొడుతూ పరుగెత్తుకెళ్లేవాళ్లం. పుస్తకాలను చెరువు కట్టమీద పెట్టి ఆ మత్తడి మీదుగా ఒక చివరి నుంచి మరో చివరికి వెళ్లే వాళ్లం. అప్పుడు అదో పెద్ద సాహస కార్యం. భద్రకాళి చెరువు మత్తడే మాకు పరిచయమైన తొలి మినీ నయాగరా! ఇన్నాళ్ల తరువాత ఇప్పుడు అసలు నయాగరా నా చేత వయసును మరచిపోయి ఆనాటిలాగా మళ్లీ కేరింతలు కొట్టించింది .
వాహ్ నయాగరా!

చాలా బాగా రాసారు ప్రభాకర్ గారు . నయాగరా విశేషాలు క్లుప్తంగా వివరించారు . మేము ఈ మధ్యే వెళ్ళాము. నేను నా పర్యటన గురించి వ్యాసం వ్రాసాను. మీ వాషింగ్టన్ ట్రిప్ పోస్ట్ వివరాలు నాకు కొంచెం సహాయం చేసింది కొన్ని విషయాల గురించి :)
ReplyDeletehttp://www.maverickvajra.com/2016/09/east-coast-travel.html
ధన్యవాదాలు వజ్రదీప్ గారు
ReplyDeleteమీ వ్యాసం ఇప్పుడే చూసాను.
చాలా వివరంగా రాశారు. తీరిగ్గా చదవాలి.
ఫోటోలు చాలా బాగున్నాయి.
ధన్యవాదాలు ప్రభాకర్ గారు. చూసిన అన్ని ప్రదేశాలు ఒకే పోస్ట్ లో వ్రాసేసారికి వివరణ ఎక్కువ అయిపోయింది :) నా పోస్ట్ చదివినందుకు కృతఙ్ఞతలు
Delete