Sunday, January 1, 2012

తెలుగు బ్లాగర్ల రచనలకు 'ఆదివారం ఆంధ్రజ్యోతి' నీరాజనం!


ఈ కొత్త సంవత్సరం తెలుగు బ్లాగులు మరింత ఉజ్వలంగా వెలిగిపోనున్నాయా? 


ఆరోగ్యకరమైన చర్చలతో, ఆలోచింపజేసే రచనలతో, జీవితానుభవాలనూ వినోదాన్నీ, విజ్ఞానాన్నీ పంచే పోస్టులతో మరింత విస్తృతంగా నెటిజనులను ఆకర్షించనున్నాయా?


అవుననే అనిపిస్తోంది ఇవాళ్టి (1-1-12) ఆదివారం ఆంధ్రజ్యోతిని చూస్తుంటే!


మొత్తం సంచికను తెలుగు బ్లాగర్ల రచనలకు అంకితం చేయడం నిజంగా అద్భుతమనిపించింది. 
నూతన సంవత్సరం తొలి ఉదయమే మహదానందం కలిగించింది.


ఇందులో పొందుపరచిన బ్లాగర్ల రచనలు, బ్లాగుల వివరాలు ఇలా వున్నాయి:


1. లుంగి - వీజె : golisoda.in
2. పందిరాజము - అనిల్‌.ఎస్‌.రాయల్‌ : anilroyal.wordpress.com
3. మగపిల్లాడు పిల్లమగాడు - డి.ఎస్‌.గౌతమ్‌ : thotaramudu.blogspot.com
4. డెమ్మ డెక్కడాలి - యర్రపు రామనాధరెడ్డి : yarnar.blogspot.com
5. అసూబా'ల ఆహార్యం - వై.ఎ.రమణ : yaramana.blogspot.com
6. వెజిటెబుల్‌ సలాడ్‌ - పద్మార్పిత : padma4245.blogspot.com
7. చిన్న గీత - సుస్మిత : kothavakaya.blogspot.com
8. పాడమని నన్నడగవలెనా - నేస్తం : jaajipoolu.blogspot.com
9. నాకు ప్రేమించి పెళ్లి చేసుకునే యోగ్యత లేదా? - బులుసు సుబ్రహ్మణ్యం : bulususubrahmanyam.blogspot.com
10. సుత్తి! సుతిమెత్తగా!! - లలిత : naaspandhana.blogspot.com
11. ఐ యామ్‌ ఓకె, యు ఆర్‌ నాట్‌ ఓకె - కృష్ణప్రియ : krishna-diary.blogspot.com
12. చుక్కల మొక్కు - మధురవాణి : madhuravani.blogspot.com


పై బ్లాగర్లకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు !


తప్పక చదవండి ఆదివారం ఆంద్ర జ్యోతి
 http://www.andhrajyothyweekly.com/ 




..

7 comments:

  1. వాళ్ళందిరికీ అభినందనలండీ..మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలండీ.

    ReplyDelete
  2. Excellant Idea..Let us say thanks to the Editor..
    Congrates to the blogers..

    ReplyDelete
  3. సుభ గారూ
    ధన్యవాదాలు.

    అక్షర మోహనం గారూ,
    నిజమే బ్లాగర్లందరూ ఆంద్ర జ్యోతి ఎడిటర్ గారికి కృతజ్ఞతాభినందనలు తెలపాలి.
    మన అభిప్రాయాలని ఆంద్ర జ్యోతికి మెయిల్ చేస్తే బాగుంటుంది. వాళ్ళిచ్చిన ఈ మెయిల్ ఐడీ :
    sunday.aj@gmail.com

    .

    ReplyDelete
  4. ఆంద్ర జ్యోతి ఎడిటర్ గారికి , మీకు , ఇతర బ్లాగర్లకు, మరియు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలండి..

    ReplyDelete
  5. ఆ బ్లాగర్లకు అభినందనలు!
    మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

    ReplyDelete
  6. అవును. ఇది నిజంగా మంచి సర్ప్రైజ్...ఇండియా లో ప్రింట్ లో పేరు చూసుకోవటం ఇదే మొదటి సారి.. ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారికి ధన్యవాదాలు.
    నూతన సంవత్సర శుభాకాంక్షలు..

    ReplyDelete
  7. కృష్ణ ప్రియ గారూ,
    మీ గేటెడ్ కమ్యూనిటీ కథ కథనం బాగున్నాయి.
    టీ పెట్టాలంటే ప్రత్యేకంగా వేన్నీళ్ళు కాచక్కర్లేదు. కుర్చీల మధ్య నుండి అలా కేటిల్ తీసుకెళ్తే చాలు. పొగలు కక్కే చాయ్ తయార్ ! అలా వుంది పరిస్థితి వంటి చమత్కార వర్ణనలు
    ఎంతో ఆకట్టుకున్నాయి.
    ఆంద్ర జ్యోతి పుణ్యమాని మీ బ్లాగుతో పాటు మరిన్ని మంచి బ్లాగులు పరిచయమయ్యాయి. మీకు హృదయపూర్వక అభినందనలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    చిన్ని ఆశ గారూ,
    ధన్యవాదాలు.

    ReplyDelete