Monday, January 11, 2010
డాక్టర్ సి.నారాయణరెడ్డి నోట ప్రత్యేక తెలంగాణా పాట ....!
డాక్టర్ సి.నారాయణరెడ్డి నోట ప్రత్యేక తెలంగాణా పాట...
నమ్మలేకపోతున్నాను.
1969లో తెలంగాణా అంతటా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లోనే సమైక్యతకు ఊపునిచ్చే ... '' తెలుగు జాతి మనదీ - నిండుగ వెలుగు జాతి మనదీ...'' అనే గీతం రాసి తెలంగాణా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న డాక్టర్ 'సినారె' నేడు '' ..తెలంగాణా ఏర్పడి తీరుతుంది, తెలుగు మాట్లాడేవారు వేర్వేరు రాష్ట్రాలుగా వుంటే నష్టమేమీ లేదు '' అన్నారంటే...
నిజంగానే నమ్మలేకపోతున్నాను.
ఇవాళ్టి ఆంధ్ర జ్యోతిలో వచ్చిన ఆ వార్త చదవగానే ముక్కోటి రతనాల వీణలు ఒక్కసారి లయబద్ధంగా మ్రోగినంత ఆనందం కలిగించింది.
సినారే గారూ,
తెలంగాణా పై జాతి జనులు నిత్యం పాడుకునే మరో పాట రాసి ఆనాటి పాపానికి ప్రాయశ్చితం చేసుకోవాలి. మీకు జన్మనిచ్చిన తెలంగాణా తల్లి రుణం తీర్చుకోవాలి. ఇది మీకు మా వినయపూర్వక అభ్యర్ధన .
.......................
ఇదిగోండి ఆ వార్త
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి ... తెలంగాణా ఏర్పడి తీరుతుంది : సినారె
వేములవాడ, జనవరి 10 (ఆన్‌లైన్)
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా వేములవాడలో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఈనాటిది కాదనీ, దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్ష, ప్రజలందరి ఏకగ్రీవ కోరిక అని చెప్పారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా వుండాలన్న ప్రతిపాదనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారని, అయితే తెలుగు మాట్లాడేవారు వేర్వేరు రాష్ట్రాలుగా వుంటే నష్టమేమీ లేదన్నారు.
ఎన్‌డిఎ హయాంలో కొత్తగా ఏర్పడిన మూడు చిన్న రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధించాయని, చిన్న రాష్ట్రాల వల్ల ఆర్థికంగా, రాజకీయంగా, పరిపాలనాపరంగా స్వయం సమృద్ధికి అవకాశం వుంటుందని చెప్పారు.
ప్రాంతాల మధ్య వైషమ్యాలు అవసరం లేదని, ఒక ప్రాంతం వారు మరో ప్రాంతం వారిని దూషించడం సరైంది కాదని అన్నారు.
'' తెలంగాణ నాది, రాయలసీమ నాది, కోస్తా నాది....'' అన్న పాట ఎన్టీఆర్ కోరిక మేరకు రాశానని, నాటి పరిస్థితులు నేడు లేవని, ఇప్పుడు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం కోరుకుంటున్నారని సినారె అన్నారు.
- ఆంధ్రజ్యోతి 11 జనవరి 2010 సౌజన్యంతో
....................................................
జయహో తెలంగాణా జయహో!
.
Subscribe to:
Post Comments (Atom)
jai telangana
ReplyDeleteసినారే ఆ పాట రాయడం పాపమా? This is a very dangerous mindset. He himself said, the conditions today are different.
ReplyDeleteఒక సమైక్య వాది జై తెలంగాణా అంటే తప్పు లేదు! కానీ తెలంగాణా వద్దు, తెలుగు జాతి ఒకటిగా ఉండాలి అనేవారంతా పాపం చేస్తున్న వారు ....! అందరమూ బాగుండాలి అనుకోవడం, మన జాతి అంతా ఒకటిగా ఉండాలి అనుకోవడం చాలా తప్పు కదా! అందుకే సినారె గారు ఉన్నట్టుండి మంచివారైపోదామని అనుకుంటున్నట్టున్నారు - !!
ReplyDeleteతెలంగాణా పై జాతి జనులు నిత్యం పాడుకునే మరో పాట రాసి ఆనాటి పాపానికి ప్రాయశ్చితం చేసుకోవాలి. ఈ ఒక్క మాట చాలు తెలంగాణా వాదుల పక్కా విద్వేష ధోరణి స్పష్టం చేయడానికి. ఆ పాట రాయడాన్ని పాపంగా భావించి ప్రాయశ్చిత్తం చేసుకుంటే తెలంగాణా తల్లి సంతోషిస్తుందన్నమాట.
ReplyDeleteఏ ఎండకాగొడుగు పట్టే సినారె అంత పనీ చేసినా ఎవరూ ఆశ్చర్యపోరులెండి!
సినారె పీర్ ప్రెజర్ వల్ల అలా అని ఉంటాడు.
ReplyDeleteఅంతే సంగతులు.
@ ఒరెమూన, సుజాత, విరజాజి, అనానిమస్, అప్పారావు శాస్త్రి గార్లకు ధన్యవాదాలు.
ReplyDeleteసినారే కేవలం పీర్ ప్లెజర్ వల్లనో, సహజసిద్ధ లౌక్యంతోనో అట్లా అనివుంటే ఆయన ఖర్మ.
1969నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో దాదాపు నాలుగువందల మంది విద్యార్థులు అమరులైన నేపథ్యంలో అట్లాంటి ఉద్యమ వ్యతిరేక పాట రాయడం నిజంగా పాపమే. తెలంగాణా ప్రజలకు చెన్నారెడ్డి చేసిన ద్రోహం లాంటిదే ఇదీనూ.
రెండు ప్రాంతాలకు న్యాయం జరిగితేనే సమైక్యతకు సార్థకత.
కానీ, కేవలం ఒక్క ప్రాంత ప్రయోజనాలను (అదీ మరొక ప్రాంతంమీద పెత్తనం ద్వారా) కాపాడేది సమైక్యత ఎలా అవుతుంది?
సమైక్యత పేరిట తెలంగాణా అస్తిత్వాన్ని కాలరాయాలనుకోవడం దుర్మార్గం కాక మరేమవుతుంది?
అలాంటి అన్యాయానికి ఒడిగట్టేవారిమీద ఎవరికైనా ద్వేషం కాక ఇంకేం వుంటుంది?
తెలంగాణా ప్రజలకు ఇప్పుడు 'సమైక్యత' అంటే వంచనకూ మోసానికీ పర్యాయపదం, ఒక బూతుమాట!
దొంగ జెంటిల్‌మెన్ అగ్రిమెంట్ కుదుర్చుకుని తెలంగాణాను విలీనం చేసుకున్నారు.
అందులో ఒక్క నిబంధననైనా అమలు పరిచిన పాపాన పోలేదు.
ఒప్పందాన్ని ఉల్లంఘించారు కాబట్టి విడిపోదాం అంటే ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు.
ముల్కీనిబంధనలు, ఆరుసూత్రాల పథకాలు, 610 జీవోలు ఇట్లా గట్టిగా అడిగినప్పుడల్లా ఏవో తాయిలాలు ఇవ్వడం
ఆ తరువాత వాటిని బుట్టదాఖలుచేయడం ఆంధ్ర పాలకులకు పరిపాటి అయింది!
తెలంగాణా ప్రజలకు తమ నేల మీద తమకు ఈ పరాధీన, బానిస బతుకు ఇంకా ఎంత కాలం?
పాలక వర్గం చేసిన పాపాల్లో ఉద్యోగస్తులో, విద్యార్థులో, సామాన్య జనమో ఎందుకు పాలుపంచుకుంటున్నారో మాకైతే అర్థం కావడం లేదు?
తెలంగాణా వస్తే రాజకీయ దళారులకూ, అక్రమార్కులకూ నష్టం కానీ సామాన్య ఆంధ్ర ప్రజలకు ఏం నష్టం?
మరి సమైక్యతను కోరుకునేవారిగా తెలంగాణా ప్రజలకు మీరిచ్చే భరోసా ఏమిటి?
లాఠీలూ తుపాకులతో తెలంగాణా ప్రజలను అణగద్కొడం,
ఎప్పటికీ ఈ రావణ కాష్టం ఇలా రగులుతూనే వుండాలనుకోవడం ......
ఇదేనా మీరు కోరుకునే సమైక్యత????
:)
ReplyDeleteఆ 'దొంగ జెంటిల్‌మెన్ అగ్రిమెంట్' మీద సంతకాలు పెట్టిన తెలంగాణ పెద్దమనుషులు ద్రోహులు కాదా?
రెండు రాష్ట్రాల విలీనం ప్రతిపాదనకు హై. రాష్ట్రపు శాసనసభలో 103 మంది అనుకూలంగా ఓటేస్తే, 29 మాత్రం వ్యతిరేకించారు. ఆ 103 మందీ ద్రోహులు కాదా?
మీరెన్నుకున్న నాయకుల్లో చాలామంది ద్రోహులే. ఇంతమంది ద్రోహులకు పట్టంగట్టి, వాళ్ళకు మీ మనసుల్లో పటం గట్టి, నెత్తికెక్కించుకుని, వాళ్ల ఏలుబడిలో ఉంటూ, వాళ్ళనే నాయకులుగా ఎన్నుకుంటూ ఆంద్రోళ్ళను ద్వేషించడం తె.వాదులకు తగునా?
చదువరి గారూ
ReplyDeleteధన్యవాదాలు.
జెంటిల్‌మెన్ అగ్రిమెంటు మీద సంతకం పెట్టిన తెలంగాణా నేతలూ,
హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో విలీనానికి అనుకూలంగా వోటు వేసిన ఆనాటి తెలంగాణా ఎంఎల్‌ఏలూ
తెలంగాణాకు చేసింది కచ్చితంగా ద్రోహమే.
అయితే ఆ ద్రోహం ఉద్దేశపూర్వకంగా చేశారా లేక
విలీనం వల్ల నిజంగా మేలు జరుగుతుందని నమ్మి మోసపోయారా అనేది చరిత్రకారులు పరిశోధించి తేల్చాలి.
ఎందుకంటే ఆరోజుల్లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు అంతటి వాడే సమైక్యత కోసం పోరాడాడు.
ఆంధ్ర నేతల నయవంచననూ, ఆన్యాయాలనూ కళ్లారా చూసిన తరువాతనే ఆయన తెలంగాణావాదిగా మారాడు.
అయితే ఒకటి మాత్రం నిజం.
తెలంగాణా అప్పటికి 300 సంవత్సరాలుగా నిరంకుశ రాచరిక వ్యవస్థలో మగ్గిపోయి వుంది.
ప్రజాస్వామిక ఉద్యమాలూ, ఎన్నికలూ ఏమీ తెలంగాణాకు తెలియవు.
కానీ ఆంధ్ర పరిస్థితి వేరు.
బ్రిటీషు వలసపాలనలో ఆంధ్ర నేతలు అప్పటికే అన్నివిధాలా రాటుదేలిపోయి వున్నారు.
ఇదే ఆనాటి మోసానికి మూలకారణం అయ్యుంటుంది.
ఇక-
మన ఎన్నికల వ్యవస్థ ఎంత గొప్పదో మీకు తెలియంది కాదు.
ఫూలన్ దేవి, వీరప్పన్ లాంటి వాళ్లు అవలీలగా గెలవగలరు.
దగుల్భాజీ నేతలు ఎన్నికల ముందు ఒకమాట - ఎన్నికల తరువాత ఒకమాట మాట్లాడుతున్నా ఏమి చేయలేని నిస్సహాయత మనది.
రేపు తెలంగాణా రాగానే మా లత్తకోరు నేతలు (అందరూ కాదులెండి)
మమ్మల్నేదో ఉద్ధరిస్తారన్న భ్రమలు మాకేం లేవు.
మా పోరాటాలేం ఆగిపోవు.
కాకపోతే, వాళ్లకి ఇప్పటిలా ఆంధ్ర నేతలకు అమ్ముడుపోయేందుకు అవకాశం వుండదు.
తత్ఫలితంగా - కనీసం, మాకు న్యాయంగా... రాజ్యాంగ పరంగా దక్కాల్సిన
నీళ్లూ, నిధులూ, ఉద్యోగాలూ మాకు తప్పక దక్కుతాయి.
మా పాఠశాలల్లో పిల్లలకు మా తెలంగాణా చరిత్రను, తెలంగాణా వీరగాథలను బోధించే అవకాశం వుంటుంది.
ప్రతి ఏడూ... మాకు ముక్కూ మొహం తెలియని పొట్టి శ్రీరాములుకు శ్రద్ధాంజలి ఘటిస్తూ
మా తెలంగాణా రైతాంగ పోరాటంలో అమరులైన నాలుగువేల మందిని విస్మరించే దౌర్భాగ్యం నుంచి విముక్తి లభిస్తుంది.
ఇవాళ తెలంగాణా ఆత్మ -
తిండి కోసం కంటే స్వేచ్ఛకోసం, ఆత్మ గౌరవం కోసం ఎక్కువగా కొట్టుకుంటోంది.
.
*ఇవాళ తెలంగాణా ఆత్మ -తిండి కోసం కంటే స్వేచ్ఛకోసం,ఆత్మ గౌరవం కోసం ఎక్కువగా కొట్టుకుంటోంది.*
ReplyDeleteఆత్మ గౌరవం గురించి మీరు (తెలంగాణా) వరు మధన పడటం ఎందుకు మీరు దానిని గురించి ఎంత తక్కువ గా మాట్లాడితె అంత మంచిది. ఏ ఎండకు ఆ గోడుగు పట్టె సి.నా.రే. దానికి ఒక పెద్ద ఉదాహరణ. వారికి రోశయ్యా గారి పలన లో ఏ పదవి దక్కినట్టు లేదు అందువలన పల్లవి మార్చారు. ఇక పోతె ఇంతా తెలంగాణా అని ఊగి పోయె మీరు దేశ చరిత్ర లో మొదటి సౌత్ ఇండియన్ ప్రధాన మంత్రి ని అయిన మీ తెలంగాణా వాడు పి.వి. నరసిమ్హా రావు చనిపోతే డిల్లి నుంచి ఆయాన దేహాన్ని హైద్రాబద్ కి పంపిస్తున్నప్పుడు ఒక్కరి కి తెలంగాణా ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? కనీసం మీకు ఆయన పేరుని విమానాశ్రయం కు కూడా పేట్టు కోవాలని అని పించలేదు. ఇలా కర్ణాటక, తమిళ్ నాడు లో జరిగేదా? ఆత్మ గౌరవం అంటె వారిని చూసి నేర్చు కోండి. మీకు మూడొచ్చి నప్పుడు విధులో కొచ్చి గలభ చేయటం కాదు. తెలంగాణా ప్రజలు పి.వి. విషయం లో నే ఇంత డిటాచ్డ్ గా ఉన్నారు నిజం గా మీకు మొదటి నుంచి తెలంగాణా భావమే ఉండి ఉంటె ఇటువంటి సంఘటనల మీద మీరు పెద్దగా ప్రతిస్పందించి ఉంటె ఈ రోజు ప్రజలకు మీకు ఉన్న తెలంగాణా ప్రంతపు భావాల గురిచి ఒక అవగాహాన ఉండెది. ఇటువంటి అవకాశాలను వదిలేసి మీ రాజకీయ నాయకులకు అవసరమైనపుడు తెలంగాణా పాట వారు అందుకుంటే మీరు దానికి మద్దతు తెలపడమా?
Obviously, Dr.CNR is under duress & threat to give such political statement!
ReplyDeleteOnly fools can dream of Telangana state, it is a myth! It can never be achieved with hatread in a civilized society.
Telengana problems are creation/exaggeration by vested interests and lazy scoundrals who 'waited' for 53years for others to develop their region! Stupid!
దయచేసి సినారె లాంటి మహాకవిని మనందరము విసురుకునే ఈ బురదలోకి లాగకండి.
ReplyDelete