.
'' జై తెలంగాణా'' నినాదానికి - పోటీగా - గత డిసెంబర్ 10 నుంచి ''జై సమైక్యాంధ్ర'' నినాదం హాడావిడిగా తెరమీదకు వచ్చింది!
లోగడ ''జై ఆంధ్ర!'',
''జై గ్రేటర్ రాయలసీమ!''
నినాదాలు విన్నాం కానీ ఎప్పుడూ ఈ '' జై సమైక్యాంధ్ర! '' నినాదం వినలేదు.
1952లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, 1972లో జై ఆంధ్ర ఉద్యమం తప్ప సమైక్యాంధ్ర పేరుతో ఎప్పుడూ ఏ ఉద్యమమూ జరుగలేదు.
ఇంతకీ ''జై సమైక్యాంధ్ర'' అంటే అర్థం ఏమిటి?
ఆంధ్ర - రాయలసీమ ప్రాంతాలు సమైక్యంగా వుండాలనేనా?
ఆ నినాదంలో అదే ధ్వనిస్తోంది!
1953లో పొట్టి శ్రీరాములు బలిదానంతో ఏర్పడింది ఆంధ్ర రాయల సీమ ప్రాంతాలతో కూడిన '' ఆంధ్ర '' రాష్ట్రమే కదా!
అందువల్ల ''జై ఆంధ్ర'' అన్నా, ''జై సమైక్యాంధ్ర'' అన్నా ఆంధ్ర, రాయల సీమ ప్రాంతాలే ధ్వనిస్తాయి తప్ప తెలంగాణా మాత్రం కాదు.
1956లో ఆంధ్ర - తెలంగాణా ప్రాంతాలు కలిసి ''ఆంధ్ర ప్రదేశ్'' రాష్ట్రంగా అవతరించాయి.
దరిమిలా చేస్తే గీస్తే ''జై సమైక్యాంధ్రప్రదేశ్'' అంటూ నినాదం చేయాలి గానీ జై సమైక్యాంధ్ర అని నినదించడం వల్ల ఆశించిన భావం రాదు.
ఎన్‌టివీ వారు నిన్న రాత్రి విద్యార్థులతో నిర్వహించిన చర్చలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రతినిధి అజయ్ వేసిన ప్రశ్న ఇది.
నిజానికి 1956లో ఈ రెండు రాష్ట్రాలూ విలీనమవుతున్నప్పుడు కొత్త సమైక్య రాష్ట్రానికి ముందుగా అనుకున్న పేరు ''ఆంధ్ర తెలంగాణా రాష్ట్రం''
ఢిల్లీలో ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్‌లో అడుగుపెట్టే లోపే ఆంధ్ర తెలంగాణా రాష్ట్రం కాస్తా ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది. ఆంధ్రా నాయకులకు ఈ సంకరజాతి పేరే బాగా నచ్చింది. తెలంగాణా పేరంటేనే వారికి అప్పటినుంచే చిన్నచూపు.
''ప్రదేశ్ '' అనేది తెలుగు పదం కాదు.
హిందీ పదం.
ప్రదేశ్ అన్న ఆ దిక్కుమాలిన పదాన్ని అరువు తెచ్చుకోవడంతోనే మనం తెలుగుదనాన్ని, తెలుగు స్వాభిమానాన్ని, తెలుగు ఆత్మగౌరవాన్ని కోల్పోయాం.
మొదట్లో ఆంధ్ర రాయలసీమ రాష్ట్రాలతో కలిసి ఏర్పడిన ''ఆంధ్ర రాష్ట్రం'' లో చక్కని తెలుగుదనం వుంది !
తెలంగాణా అన్న పేరులో తేనెలొలికే చిక్కని తెలుగుదనం వుంది !!
తెలంగాణము అంటే తెలుగు వాళ్లు నివసించే ప్రాంతం అని అర్థం (ఆణెము=నివాసము).
కానీ ఆ రెండూ కాదని "ఆంధ్రప్రదేశ్" అన్న హైబ్రీడ్ పేరు ఎవరికి ఎందుకు నచ్చిందో తెలియదు.
తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా వంటి మన ఇరుగు పొరుగు రాష్ట్రాలకు లేని హిందీ/ఢిల్లీ బానిసత్వం మనకెందుకో అర్థంకాదు.
తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా గొప్పలు చెప్పుకోవడమే గానీ ఇప్పటికీ మన రాష్ట్రంలో అధికార భాషగా తెలుగును మనమే పూర్తిగా అమలు చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో వున్నాం. మన నేతలకు మెక్కడం మీద వున్న యావ తెలుగు భాషను అభివృద్ధిపరచడం మీద లేదు గాక లేదు.
తమిళనాడును చూసైనా మన పెద్దలకు బుద్ది తెచ్చుకోరు.
ఇంకెందుండీ భాష పేరిట ఈ మేడిపండు సమైక్యత?
మనం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడే -
మన తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు ఔన్నత్యం రెండు రాష్ట్రాల్లో పోటీ పడి దేదీప్యమానంగా వెలుగొందుతాయి. ఇది తథ్యం.
అందుకే సామరస్యంగా, మనస్ఫూర్తిగా అర్థవంతంగా నినదిద్దాం....
జై సమైక్యాంధ్ర (సీమాంధ్ర) !!
జై తెలంగాణా !!
రాయలసీమలో 60% మందికి తెలంగాణాపై వ్యతిరేకత లేదు. డి.ఎల్. రవీంద్రారెడ్డి ఈ విషయం చెప్పినందుకు అతని దిష్టి బొమ్మని తగలబెట్టారు. హైదరాబాద్ అభివృద్ధి వల్ల రాయలసీమకి నయాపైసా ప్రయోజనం ఉండదు, కనుక రాయలసీమ వాళ్ళని సమైక్యవాదులు అనొద్దు అని ఎం.వి.రమణారెడ్డి అన్నాడు. రాయలసీమ ఫాక్షన్ ఏరియా. అక్కడ లొకల్ ఫాక్షనిస్ట్ సమైక్యాంధ్ర అంటే ప్రజలు కూడా సమైక్యాంధ్ర అనాలి. లేకపోతే వాళ్ళ షాపులు లేదా ఇతర ఆస్తులు ద్వంసం అవుతాయి.
ReplyDelete"తెలంగాణాంధ్ర" - అందాం లేదా "ఆంధ్ర తెలంగాణా" అందాం. అలానే సాధ్యమైనన్ని తెలుగు పేర్లు పెట్టుకుందాం. "కడప" ను "గడప" గానే ఉన్నిద్దాం. ఇందులో తప్పేమీ లేదు.
ReplyDeleteఅలానే,
తెలుగు భాష అమలుకూ పాటుపడదాం. చేవచచ్చిన నాయకులను ఈ విషయమై నిలదీద్దాం.
పై సమస్యలకూ విడిపోవడానికి పొంతన ఏముంది? ఆ సమస్యలను సమైక్యంగానే ఉండి పరిష్కరించుకోవచ్చు కదా!
మీరు చెప్పేది ఎలా ఉందంటే, చిన్నప్పుడు మన అమ్మ నాన్నలు మనకో పేరు పెడ్తే పెద్దైన తరువాత మనకు నచ్చదు, ఎందుకంటే స్టైల్ గా లేదని (ఇంగ్లీష్ లో Namesake అనే సినిమాలో లా)
ReplyDeleteఎప్పుడో 60 సంవత్సారాలా క్రింద పెట్టిన పేరుని ఈ రోజు ఇలా వేరు వేరు కోణాలలో చూడటం మంచిది కాదు
ఇప్పుడైనా రాష్ట్రం పేరు తెలంగాణ అని మార్చేద్దాం.
మరే కదా అందుకే వాళ్ళు వాళ్ళు ఏదో అరుచుకుంటారు చప్పుడు చేయకుండా కూచోరి , అంతేకాకుండా వాళ్ళు విడగోట్టద్దు అనేది ఆంధ్రప్రదేశ్ కాని తెలంగాణా ని కాదు కనుక ఊరికే లొల్లి చేయకున్ద్రి .
ReplyDeleteఓయ్ ప్రభాకర్! నీ పేరులో మందార తీసేసి ఉమ్మెత్త అని పెట్టుకుంటే బాగుంటుంది.
ReplyDelete@తెలుగుభూమి! agree with you.
తెలబాన్లను, t idiotsలను చూస్తే మమ్మీ సినిమాలో విలన్ పిలవగానే mindlessగా దాడిచేసే పుర్రె బొమ్మలు గుర్తుకొస్తున్నాయి. అమాయకులైన విద్యార్థుల బ్రతుకులు నాశనం చేస్తున్నారు గదరా ముదనష్టపు మేధావుల్లాలా!
ReplyDeleteఆంధ్ర అనేది తెలుగుభాషకి, తెలుగువారికి ఉన్న ప్రాచీన సంస్కృతనామం. కాబట్టి తెలంగాణవారితో సహా తెలుగువారంతా ఆంధ్రులే. అందుకే తెలంగాణ ప్రాంతానికి చెందిన బమ్మఱ పోతనమహాకవి కూడా తన మహాభాగవతానికి ఆంధ్రమహాభాగవతం అని పేరు పెట్టాడు కానీ తెలంగాణ భాగవతం అనలేదు. తెలంగాణలో రాజధానిని కలిగి ఉన్న కాకతీయులు, వారి ఆస్థానకవులూ తమ సామ్రాజ్యాన్ని ఆంధ్రసామ్రాజ్యం అని వ్యవహరించారు తప్ప తెలంగాణ సామ్రాజ్యం అనలేదు. వర్తమాన తెలంగాణలో ప్రచారమైనట్లు ఆంధ్ర అనేది ఆ 13 జిల్లాల పేరు కాదు. అందువల్లనే నిజామ్ కాలంలో తెలంగాణవారు ప్రారంభించిన తెలుగుభాషోద్యమానికి కూడా ఆంధ్రోద్యమం/ ఆంధ్రమహాసభ అనే పేర్లు తెలంగాణ చరిత్రలో నమోదయ్యాయి. ఈ సంగతి తెలంగాణవారి పూర్వీకులకి తెలుసు. ఆ 13 జిల్లాల పూర్వీకులకి కూడా తెలుసు. కానీ ఈ కాలపు తెలంగాణవారికి తెలియదు. తెలియకపోవడానికి రాజకీయ నాయకులతో పాటు ఇంగ్లీషు చదువులు కూడా ఒక కారణం. ఆ రోజుల్లో -అంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్ర అంటే తెలుగుభాష, తెలుగునేల, తెలుగుజాతి అని అందఱికీ తెలుసు కాబట్టే ఆ పేరుకు అప్పట్లో ఎలాంటి వ్యతిరేకతా రాలేదు. ఇప్పుడు అజ్ఞానం వల్ల వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి కోస్తావారు తమని కోస్తాంధ్రులుగా పిల్చుకుంటారు. తమని తెలంగాణవారు ఆంధ్రావారని పిలవడం పట్ల చాలామంది కోస్తా-సీమజనానికి ఆశ్చర్యమూ, అభ్యంతరాలూ ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆంధ్రశబ్దానికి తెలుగువారనే సార్వజనిక అర్థం తప్ప కేవలం 13 జిల్లాలనే సంకుచిత అర్థం వాడుకలో లేదు. సార్వజనికార్థమే సరైన అర్థం. ఈ సంకుచితార్థం ఇటీవలిది.
ReplyDeleteరాష్ట్రం ఏర్పడ్డ కొత్తల్లో రాజకీయ నాయకులంతా బ్రాహ్మణులు. వారంతా సంస్కృతాభిమానులు కనుక తెలుగు అనే పదానికి బదులు ఆంధ్ర అనే పదాన్ని ప్రిఫర్ చేసారు. అనంతరకాలంలో అది ఇలా వివాదాలకి దారితీస్తుందని వారు ఊహించలేదు.
By the way, తెలంగాణ (తెలుంగాణ) మాత్రం ఎక్కడనుంచి వచ్చింది ? తెలుగు/ తెలుంగు అనే పదంలోనుంచే కదా ? మఱి అటువంటప్పుడు తెలంగాణ ఒక్కటే తెలుగునేల అయ్యి మిగతా ప్రాంతాలు తెలంగాణ కాకుండా పోతాయా ? By definition అవి కూడా తెలంగాణనే అవుతాయి. మఱి తెలంగాణవాదులు ఎవఱిని ద్వేషిస్తున్నట్లు ?
అదీ గాక ఆంధ్రప్రదేశ్ కి ఆంధ్ర అనేది క్లుప్తనామం. పత్రికలతో సహా చాలామంది ఈ క్లుప్తరూపాన్ని వాడతారు. నేనూ వాడతాను.
ReplyDeleteతాడేపల్లి వారు సరిగా చెప్పారు. ఆంద్ర అంటే తెలుగు భాష, తెలుగు వారు సరి అయిన అర్థము .
ReplyDeleteఇప్పుడు సర్కారు, కోస్త జిల్లాలకు ఆంద్ర అని, రాయలసీమ ప్రాంతానికి సీమ అని రెండిటిని కలిపి సీమ-ఆంద్ర అని తప్పుగా పలుకుతున్నారు టి వి లో కుడా.
తెలంగాణా 2౦౦౯ ఉద్యమానికి ఈ పొరపాటు కుడా ముఖ్య కారణము.
పొట్టి శ్రీరాములు దీక్ష వలన ఆంద్ర రాష్ట్రము ఏర్పడింది అప్పటికి తెలంగాణ అనే రాష్ట్రము లేదు. హైదరాబాదు అనే రాష్ట్రము మాత్రమె
' సమైఖ్య ఆంద్ర ' నినాదము స మైఖ్య ఆంద్ర ప్రదేశ్ కు క్లుప్తీకరణ
చరిత్ర వెనక్కి వెల్లడము ఎందుకు ?
ReplyDelete'జై తెలంగాణ ' అనే బదులు "నిజాము పాలించిన జై హైదరాబాదు రాష్ట్రము " అందామా
ANDHRA ZINNA KCR
ReplyDeleteపాముకి కోరల్లో విషముంటే నీ లాంటి వేర్పాటు వాదులకు వళ్ళంతా విషమే . మీకు తోడూ ఆ విధ్యార్దులమని చెప్పే వెధవలు వాళ్ళ నోటికి హద్దు వాపు లేదు ఛీ ఛీ.
ReplyDeleteప్రవీణ్, రవి, తాడేపల్లి, చంద్రలేఖ, కెవిఆర్‌ఎన్, తెలుగుభూమి, అనానిమస్ ల స్పందనలకు ధన్యవాదాలు.
ReplyDeleteఆంధ్ర అనే పదానికి అర్థం తెలియనివాళ్లెవరూ అటుగానీ ఇటుగానీ లేరు.
అయితే, అది సీమాంధ్ర ప్రాంతానికి ప్రతీకగా మారి చాలా కాలమైంది.
1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
అంటే అది తెలంగాణాతో సహా తెలుగు వాళ్లందరి రాష్ట్రం ఏమీ కాదు కదా!
1972లో జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది.
అంటే తెలంగాణాతో సహా తెలుగు వాళ్లందరికీ జైకొట్టడం ఆ ఉద్యమం లక్ష్యం కాదు కదా!
తెలంగాణా అంటే తెలుగు వాళ్లు నివాసించే ప్రాంతం అని అర్థం.
మరి కోస్తాంధ్రలో నివసించే వాళ్లు , రాయల సీమ వాసులు మనమంతా తెలంగాణా వాళ్లమే అని చెప్పుకోగలరా?
తెలంగాణా వాళ్లు అని అక్కడ చులకనగా మాట్లాడుకోవడం,
ఆంధ్రోళ్లు అని ఇక్కడ ఏవగించుకోవడం ఇవాళ గ్రౌండ్ రియాలిటీ.
జై సమైక్యాంధ్ర అని మీరు మీ బట్టలు చింపుకుంటూ,
జై తెలంగాణా అని మేం మా బట్టలు చింపుకుంటూ
దేశమంతా పగలబడి నవ్వేవిధంగా ఇంకా ఎంత కాలం సాగాలి మన గొడవ?
ఒక జెంటిల్‌మెన్ అగ్రిమెంట్ కుదుర్చుకుని రెండు రాష్ట్రాలు ఒకటయ్యాయి.
ఆతరువాత ఆ అగ్రిమెంట్ బేఖాతరు చేశారు.
ఆరు సూత్రాల పథకం,
610 జీవో అన్నీ పచ్చి బూటకంగా మిగిలిపోయాయి.
తెలంగాణా ప్రజలు అన్నివిధాలా దగాపడ్డారు.
తెలంగాణా ప్రజలు తమకు అన్యాయం జరిగింది, మీతో కలిసివుండటం మా వల్లకాదు,
విడిపోయి మా బతుకు మేం బతుకుతాం అని గట్టిగా కోరుకుంటుంటే ....... టాఠ్ వీల్లేదు
ఒక్కసారి మా '' ధృతరాష్ట్ర కౌగిలి'' లోకి వచ్చిన తరువాత ఎక్కడికి పోతారు అని వికటాట్టహాసం చేయడం భావ్యమా?
ఎవరైనా బలవంతంగా ఎలా కలిసి వుండగలరు?
ఇప్పుడు రాష్ట్రం పేరు మార్పు, తెలుగు భాషాభివృద్ధి ముష్టి దానాలు, తాయిలాలూ ఏవీ పనిచేయవు.
మనం మాట్లాడుకోవాలసింది ఆస్తులు ఎట్లా పంచుకోవాలి,
అప్పులు ఎట్లా పంచుకోవాలి వంటి అంశాల గురించే.
1956 తరువాత 10 - 15 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
అవన్నీ కొత్తవి.
కానీ తెలంగాణా రాష్ట్రం అంతకు ముందు హైదరాబాద్ రాష్ట్రం పేరిట ఆల్‌రెడీ వుంది.
ఆంధ్ర రాష్ట్రమూ వుండింది.
ఇప్పుడవి గతంలో మాదిరిగా విడిపోతే కొంపలేం అంటుకుపోతాయో,
ఇతర రాష్ట్రాలు ఏర్పడినప్పుడు లేని గొడవ, ఇంత గగ్గోలు ఎందుకు పెడుతున్నారో అర్థం కాదు.
neeku burra ledu anna vishayam ardham ayindi modati line chadavagaane.
ReplyDeletemeeku teluso teliyado andhra ane padam telangana nunche vachindi.. nijamga poradite hakkukla kosam poradandi.. ma peru ledu maku gauravam ledu ani kaburlu cheppoddu
ReplyDeleteseenu: telangana nalugu kotla rathanala veena telanga gurunchi charithra teliya kunda matlada vaddu
ReplyDelete