‘‘జీసెస్ క్రైస్తును ఎందుకు చంపించి వుంటారో
గాంధీజీని కూడా అందుకే చంపించి వుంటారు!’’
............................................
తిరుమల రామచంద్ర, పెరల్ ఎస్ బక్, త్రిపురనేని గోపీచంద్, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, పి.వి. నరసింహా రావు, కొడవటిగంటి కుటుంబరావు మొదలైన వారి రచనలతో కూడిన గాంధీయే మార్గం రెండవ సంపుటి డా.నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో (జనవరి 2022) వెలువడింది.
అందులోంచి నోబెల్ బహమతి గ్రహీత, గుడ్ ఎర్త్ నవల రచయిత్రి పెరల్ ఎస్ బక్ రాసిన నాలుగు వాక్యాలు:
లోకమే గాంధీ కోసం
మా కుగ్రామంలో మామూలు వలెనే సూర్యోదయమైంది. దూరాన బడికి పోవలసిన కుర్రవాళ్లను పెందలకడనే నిద్రలేపవలసి వొచ్చింది. ఆకాశం బూడిద రంగుతో వుంది. మంచు దట్టంగా పడుతూవుంది.
హఠాత్తుగా మా ఇంటి పెద్ద వచ్చి ‘‘ఇంతకు ముందే రేడియో అతి విషాద వార్తను చెప్పింది ... గాందీజీ మరణించారట?’’ అన్నారు. కొన్ని వేలమైళ్ల దూరంలో అమెరికాలో వున్నవారికి యీ వార్త ఎలా ఉంటుందో ఊహించలేము. తన జీవితాన్నంతటినీ ప్రజాసేవకు వినియోగించిన శాంతిదూత గాంధీజీ హత్యచేయబడ్డారు. పది సంవత్సరాల కుర్రవాడు కన్నీటితో ‘‘తుపాకుల్ని ఎవ్వరూ కనిపెట్టకుండా ఉన్నట్టయితే ఎంత బాగుండేది’’ అన్నాడు.
మా కుటుంబంలో ఎవరమూ గాంధీజీని చూచి ఉండలేదు. మేము ఇండియా వెళ్లినప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. ఆయన మాకొక యోగి. తాను నమ్మినదాన్ని ధైర్యంగా ఎదుర్కోగల మహాత్ముడు.
విచారంతోనే మామూలు దైనందిన కార్యాలు చేసుకుపోసాగాం.
గాంధీజీ పలుకుబడి అమెరికాలో ఇంత గొప్పగా ఉండటంలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు.
గంటక్రితం రోడ్డున పోతూవుంటే ఒక రైతు ‘‘లోకంలో అందరూ గాంధీజీ చాలా మంచివాడని అంటారు, మరి ఎందుకని హత్య చేయబడ్డాడు?’’ అని అడిగాడు. నేను తల ఊపాను.
‘‘జీసెస్ క్రైస్తును ఎందుకు చంపించి ఉంటారో ` అలాంటి కారణమే కావొచ్చు’’ అన్నాడు నిట్టూరుస్తూ.
ఆ రైతు నిజం మాట్లాడాడు. క్రీస్తును శిలువ వేసిన సంఘటనకూ గాంధీజీ కాల్చబడ్డ సంఘటనకూ ఎంతైనా పోలిక వుంది. మా ఒక్క కుటుంబమే కాకుండా ఈ అమెరికా దేశంలోని ప్రతి కుటుంబమూ ` లోకమే గాంధీజీ కోసం ` విచారపడుతూ వుంది.
‘గాంధీయే మార్గం’ రెండవ సంపుటి
216 పేజీలు, వెల రూ.200/`
ప్రతులకు:
Nagasuri Academi of Media & Science
B-517, Villa Heights, Brahmanvadi, Begumpet,
Hyderabad - 500016
Email : venunagasuri@gmail.com
Phone : 9440732392
No comments:
Post a Comment