Saturday, December 12, 2020

వాళ్లు అభూతకల్పనల్ని చరిత్ర అంటారు - ప్రొ. రొమిలా థాపర్

వాళ్లు అభూతకల్పనల్ని చరిత్ర అంటారు
ప్రొ. రొమిలా థాపర్

నరేంద్ర మోడీ, ఆయన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, లేదా బిజెపి, 2014 లో ఎన్నికైందగ్గర నుంచి వాళ్లు భారతదేశ చరిత్ర ను తమకు అనుకూలంగా రాసుకోవడం ద్వారా హిందూ జాతీయవాద దృక్పథాన్ని అమోదింప చేసే ప్రయత్నాలు పునఃప్రారంభించారు. ఇవి నిజానికి 1999-2004 మధ్య బిజెపి భారతదేశాన్ని మొదటిసారి పాలించినప్పుడే మొదలయ్యాయి. మోడీ గారి పాలనలో ఆయన పార్టీ చేతే పాలింపబడుతున్న రాష్ట్రప్రభుత్వాలు చరిత్రను మార్చే ఈ ప్రయత్నాన్ని అనేక రూపాల్లో చేపడుతున్నాయి. కొన్ని తమ దృక్పథానికి భిన్నంగా ఉన్న అధ్యాయాల్నీ, భాగాల్నీ పాఠ్యపుస్తకాల్లోంచి తొలగిస్తుంటే, మరికొన్ని తామే తయారుచేసిన పాఠాంతరాల్ని వాటిల్లో చేరుస్తున్నాయి .
దేన్నైనా వక్రీకరించగలిగే ప్రసార సాధనాలు వాళ్లకున్నాయి. వాటి ద్వారా పోగు చేసిన అభూత కల్పనల్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహించే పాఠశాలల్లో చరిత్ర గా ఇప్పటికే బోధిస్తున్నారు. ఈ సంఘ్ మోడీ గారి పార్టీ బిజెపి కి మాతృసంస్థ. ఈ సంస్థ లోనే ఆయన చాలా కాలం కార్యకర్తగా నిర్వహకుడిగా బాధ్యతలు నిర్వహించారు.
హిందూ జాతీయవాదులకు చరిత్రెందుకు అంత ముఖ్యమైపోయిందీ !?
జాతీయవాదులు ఎవరినైతే జాతి లో భాగమనుకుంటారో వారిని గతం లో గుర్తించే చరిత్ర రచనకు పూనుకుంటారు. తీవ్ర జాతీయవాదులకైతే వర్తమానంలో తమ చర్యలను సమర్థించే గతాన్ని రూపొందించు కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి హిందూ జాతీయవాదులు తమ దృక్పథాన్ని న్యాయసమ్మతం చేసుకోవడానికి భారతదేశ చరిత్రను తమకు అనుకూలంగా రాసుకోవడం మొదలుపెట్టారు.
మోహన్ దాస్ కే గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి వారి సారధ్యం లో వలసవాద వ్యతిరేక లౌకిక జాతీయవాద సంస్థ అయిన భారత జాతీయ కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజల ప్రతినిధి గా స్వాతంత్ర్యాన్ని సాధించింది. అయితే ఈ ధోరణిని సవాలు చేస్తూ 1920 లలో అప్పటికి తక్కువ జనామోదం ఉన్న రెండు రకాల జాతీయవాదాలు తలెత్తాయి. మహమ్మదీయ భూస్వాములూ చదువుకున్న మధ్యతరగతి కలిసి స్థాపించిన ముస్లిం లీగు ప్రాతిథ్యం వహించిన ముస్లిం జాతీయవాదం ఒకటైతే, హిందూ ఆధిక్య వర్ణాలూ మధ్యతరగతి కలిసి స్థాపించిన హిందు మహాసభ ప్రాతినిథ్యం వహించిన హిందూ జాతీయవాదం రెండోది. ఈ రెండవ సంస్థే తర్వాత కాలంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లేదా ఆరెస్సెస్ గా రూపం మార్చుకుంది. 1947 లో పాకిస్తాన్ ఏర్పడడంలో ముస్లింలీగ్ ప్రధాన పాత్ర వహించింది. కాగా, ఆరెస్సెస్ దాని అనుబంధ సంస్థలు భారతదేశాన్ని లౌకిక ప్రజాస్వామ్యాన్నుండి హిందూ రాజ్యంగా మార్చడానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. హిందూ మెజారిటీవాదాన్ని చట్టబద్ధం చేయడానికి పూనుకున్న వారి దృక్పథమే 'హిందూత్వ' గా పిలువబడుతోంది.
నిజానికి ముస్లిం, హిందూ జాతీయవాద రెండిటి మూలాలు భారతదేశ చరిత్ర మీద వలసవాద బ్రిటన్ కు ఉన్న అవగాహనలో ఇమిడి ఉన్నాయి. 1817 లో ప్రచురితమై ఎంతో ప్రభావం చూపిన James Mill
గ్రంధం 'The History of British India’ లో ప్రతిపాదింపబడిన ద్విజాతి సిద్ధాంతాన్ని వలసవాద విధాన నిర్ణేతలు బలపరిచారు. మిల్ భారతదేశం లో ఉన్న హిందువులు, ముస్లింలు రెండు వేర్వేరు జాతులని అవి నిరంతరం సంఘర్షణలోనే సాగాయని అన్నాడు. దీనికి సంధానం చేస్తూ ఆయన భారతదేశ చరిత్రను హిందు, ముస్లిం, బ్రిటిష్ అనే మూడు యుగాలుగా విభజన చేశాడు. తొలిదశలో ఈ రెండు దృక్పథాలూ భారతీయుల ఆమోదం పొందినప్పటికీ, చరిత్రకారులు యాభై ఏళ్ల క్రితమే వాటిని ప్రశ్నించి నిగ్గు దేల్చి పూర్వపక్షం చేశారు. అయినా ఇప్పటికీ హిందూత్వ కు ఈ భావజాలమే పునాది గా ఉంది.
హిందువులు అధికంగా ఉండటమనే వాస్తవమే ప్రజాస్వామ్యం స్థానంలో ఒక హిందూ రాజ్య స్థాపనకు మార్గం సుగమం చేస్తుందని వారభిప్రాయం. బ్రిటిష్ ఇండియా పరిధిలో ఉన్న ఏ ప్రదేశం తమ పూర్వీకుల మాతృభూమి అయి ఉందో ఎక్కడైతే తమ హిందూమతం పుట్టిందో ఆ ప్రదేశానికీ చెందినవాడే హిందువు అని హిందుత్వ నిర్వచనం. ఇది బయటి ప్రదేశాలనుంచి వచ్చిన వారినే కాక క్రైస్తవ, ముస్లిం, పార్శీ వంటి ఇతర మతస్థుల్ని కూడా హిందువుల్నుంచి స్పష్టంగా విభజించాలని వారి అభిమతం.
హిందువుల మూలాలు ఆర్య సంస్కృతి లో కనుగొనబడ్డాయి. ఆర్య అనేది భాషా లేదా సంస్కృతీ సంబంధమైన పదమనీ, ఇది కీపూ రెండవ సహస్రాబ్దికి చెందిందనీ, అదికొన్ని శారీరక లక్షణాలు కల్గిన జాతిని సూచించే పదం కాదనీ, రుజువైంది. కానీ, హిందూత్వ దృక్పథం కలిగిన చరిత్ర దీని మూలాల్ని అంతకంటే వెయ్యేళ్లకు ముందు విలసిల్లిన సింధులోయ నగర నాగరికతను కూడా కలుపుకుని దానికంటే వెనక్కు వెళ్లడానికి సమకట్టింది. ఇదంతా హిందూ మూలాల్ని వీలైనంత వెనక్కు తీసుకువెళ్లే ప్రయత్నమే! హిందువుల మూలాలు ఆర్యులలో ఉన్నాయనుకుంటే, ఆర్య శబ్దానికి గౌరవనీయుడనే అర్థం ఉంది కాబట్టి హిందువులు ఇతరుల మీద ఆధిక్యత పొందవచ్చునని వారి ఉద్దేశ్యం. ఇది ఆర్యనిజం గురించిన 19 వ శతాబ్ది యూరోపియన్ భావజాలాన్ని ప్రతిబింబించడమే కాక, 1930 ల నాటి జర్మన్, ఇటాలియన్ ఫాసిజాల బలమైన ముద్రను కలిగి ఉంది. ఈ జాడల్ని ఆరెస్సెస్ వ్యవస్థాపకుల రచనల్లో స్పష్టంగా గమనించవచ్చు.
భారతదేశం లో మొదటి, రెండవ సహస్రాబ్దాల్లో స్పష్టంగా జరిగిన వివిధ జాతుల సంస్కృతుల సమ్మేళనం గురించి చరిత్రకారుల పరిశొధనలు తేటతెల్లం చేస్తుంటే హిందుత్వ సిద్ధాంతకర్తలు వాటినన్నిటినీ మింగి వేస్తూ ఉపఖండమంతా హిందు పూర్వ ఆర్య సంస్కృతే పరుచుకుని ఉందనే అవాస్తవాన్ని బలవంతంగా రుద్దుతున్నారు. ఇటీవలి పురావస్తు పరిశోధనల వల్ల తెలియవచ్చిన జన్యు సంబంధ సాక్ష్యాలు ఉత్తర భారతీయులు ఇరాన్, మధ్య ఆసియా జాతుల తో సమ్మిశ్రితమైనట్లు రుజువు చేస్తున్నాయి. చరిత్ర కారులు దీన్ని వివిధ జాతులు భారతదేశం లోకి వలస వచ్చిన వైనానికి దృష్టాంతంగా చూస్తుంటే, హిందుత్వ చరిత్ర నిర్మాణానికి ఇదొక శాపంగా పరిణమించింది.
ముస్లిములు భారతదేశానికి రాక పూర్వం అంటే క్రీపూ 1000- క్రీశ 1200 మధ్య అంతా భారతదేశ చరిత్రలో స్వర్ణయుగమనీ, ఆ యుగం లో శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందాయనీ, ఆధునిక కాలానికి చెందినవని భావిస్తున్న విమానాలూ, ప్లాస్టిక్ సర్జరీ, మూల కణ పరిశోధన వారికి అప్పుడే తెలుసుననీ నొక్కి చెపుతున్నారు. ఇవన్నీ ప్రాచీన కాలానికి చెందిన దేవతల గాథలకు అన్వయించి అవి వాస్తవాలని నమ్మబలుకుతున్నారు.
హిందుత్వ వాదన లోని మరొక అవాస్తవమేమిటంటే వెయ్యేళ్ల ముస్లిం పాలన పొడవునా హిందువులు పీడనకు గురై బానిసల్లా జీవించారనడం. హిందూ రాజ్య స్థాపన డిమాండ్ ను తమ అణచివేత కు ప్రతి గా దక్కవలసిన చారిత్రక హక్కు గా ప్రకటిస్తున్నారు. రెండవ సహస్రాబ్దికి చెందిన 'ముస్లిం యుగ' చరిత్ర అంతా ద్వేషాన్ని రగిల్చే ఈ కోణం లోంచే చూడబడుతోంది. నిజానికి ఇటువంటి సాధారణీకరణాలకు చరిత్రకారులకు సాక్ష్యాలు లభించలేదు. కానీ వీళ్లు వారి వాదనని వినిపించుకోరు. అవును, హిందువులకు ముస్లిములకు కొన్ని ఘర్షణలు జరిగిన మాట నిజమే. అవి ముస్లిం యుగానికి పూర్వం హిందువులకూ బౌద్ధులకు జరిగిన ఘర్షణల్లాంటివే. కొందరు బలవంతులైన ముస్లిములు హిందూ దేవాలయాల మీద ధనం కోసమే కాదు , మతానికి వ్యతిరేకంగా దాడి చేసిన మాట కూడా నిజమే. అట్లాగే కొందరు హిందు పాలకులు సైతం ధనం కోసం హిందు దేవాలయాల మీద దండెత్తిన సందర్భాలున్నయ్. అంటే ఇటువంటి సందర్భాలలో మత విద్వేషాన్ని మించిన దేదో పనిచేసినట్టు అర్థమౌతుంది.
ఏ యుగం లో అయితే తాము అణచివేయ బడ్డామని వారంటున్నారో ఆ యుగంతో పాటు రెండు వేల సంవత్సరాల పాటు అంటరాని తనం పేరిట అగ్రవర్ణ హిందువులు క్రింది కులాల్ని అణచివేసిన విషయాన్ని వారు విస్మరించడమే ఐరనీ! కానీ, ఈ యుగం లోనే మహమ్మదీయ భక్తి సంప్రదాయాల చేత ప్రభావితమైన ఎన్నో నూతన ఆలోచనలు హైందవాన్ని సుసంపన్నం చేశాయి. కానీ వాళ్లు వీటిని చెదురు మదురు ఘటనలుగా కొట్టిపారవేస్తారు. మహమ్మదీయ కవులు హిందు దేవతల మీద అల్లగా ఇప్పటికీ సంప్రదాయ సంగీత కచేరీ లలో ఆలాపించ బడుతున్న దివ్య కీర్తనల్ని ప్రస్తావించరు. అట్లాగే ఈ కాలం లో ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో అత్యధిక భాగం హిందూ అగ్రవర్ణస్థులే నిర్వహించారనే వాస్తవాన్ని కూడా సౌకర్యవంతంగా మరచిపోతారు.
సమకాలీన భారత దేశం లో వలసవాద వ్యతిరేకతకూ, లౌకికతే దేశ సామాజికతకు కేంద్రమనే అవగాహనకూ ప్రతీక అయిన భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మీద ప్రణాళికా బద్ధంగా జరుగుతున్న దాడులు దేశ లౌకిక ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దొంగ దాడులు గానే పరిగణించాలి. నెహ్రూ విజయాల్ని తగ్గించడానికీ ఆయన మీద వ్యతిరేకతను పెంచడానికి చేస్తున్న ఈ ప్రయత్నమంతా భారత వలసవాదవ్యతిరేక ఉద్యమంలో భాగం కాని ఆరెస్సెస్ తనను తాను వ్యక్తీకరించు కోవడమే.
హిందుత్వ ధోరణి చరిత్ర నాటుకుపోవడం లోని ప్రమాదం ఏమిటంటే శాస్త్రీయమైన చరిత్రను ప్రక్కకు నెడుతూ గతాన్ని హిందు మెజారిటీవాద దృక్పథానికి కట్టబెట్టడం పెరుగుతూ పోవడమే! దీనికి ప్రభుత్వ అండదండలున్నాయి. పోషణ ఉంది. నిధులున్నాయ్. అనేక ప్రచార మార్గాలున్నాయ్. చరిత్ర పరిశోధనను కూలడోయడం లో భాగంగా హిందుత్వ చరిత్ర దృక్పథాన్ని విమర్శించే వారిని ఇప్పటికే జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయనే వేశారు.
( మే 17, 2019 ది న్యూయార్క్ టైంస్ )
తెలుగు అనువాదం : కొప్పర్తి వెంకటరమణమూర్తి

05.12.2020

...............................................................................................


They Peddle Myths and Call It History

India’s governing party rewrites the country’s history to justify its Hindu nationalist ideology.

By Romila Thapar

The election of Narendra Modi and his Bharatiya Janata Party, or the B.J.P., in 2014 led to renewed efforts to rewrite Indian history so as to legitimize Hindu nationalist ideology. These efforts had begun when the B.J.P. first governed India between 1999 and 2004.

Under Mr. Modi’s government and various state governments run by his party, the attempts to change history have taken many more forms, such as deleting chapters or passages from public school textbooks that contradicted their ideology, while adding their own make-believe versions of the past.

They have peddled myths and stereotypes through pliant media networks — and have been teaching these versions as history in schools run by the Rashtriya Swayemsevak Sangh, the parent body of Mr. Modi’s party, which he served as an outreach worker and organizer for numerous years.

Why is history so important to the Hindu nationalists?

Nationalists are known to construct an acceptable history to identify those they claim constitute the nation; extreme nationalists require their own particular version of the past to legitimize their actions in the present. Rewriting Indian history and teaching their version of it is crucial to justifying the ideology of Hindu nationalists.

Secular anticolonial nationalism, a primary organization of which was the Indian National Congress led by Mohandas K. Gandhi and Jawaharlal Nehru, won independence for India by basing itself on the equal and inclusive participation of all citizens as constituents of the nation.

This approach was challenged in the 1920s by two specific and at that time relatively minor forms of nationalism: the Muslim League, a party established by Muslim landowners and the educated middle class, which claimed to represent Muslim nationalism; and the Hindu Mahasabha, created by upper-caste, middle-class Hindus, which asserted that it represented Hindu nationalism. It later morphed into the Rashtriya Svayamsevak Sangh, also known as the R.S.S.

The Muslim League spearheaded the creation of Pakistan in 1947. The R.S.S. and its affiliates are still waiting to convert India from a secular democracy into a Hindu religious state. Their ideology, which attempts to legitimize the politics of Hindu majoritarianism, goes by the name of Hindutva (Hindu-ness).

Both Muslim and Hindu nationalisms were rooted in Britain’s colonial understanding of India. Policymakers endorsed the two-nation theory proposed by James Mill, author of the influential “The History of British India,” published in 1817. He maintained that there have always been two separate nations in India — the Hindu and the Muslim — constantly in conflict.

Linked to this idea was Mr. Mill’s division of Indian history into three periods — Hindu, Muslim and British. Both these theories, initially accepted by Indians, were later questioned by historians and discarded half a century ago. However, they remain the bedrock of Hindutva.

To establish a Hindu state, democracy has to be replaced by a state where the fact of Hindus being in a majority in itself gives them priority. The Hindutva definition of the Hindu is that both his ancestral homeland and the Hindu religion’s place of origin are within the boundaries of British India. This makes the Hindu distinctly different from those that came from elsewhere, as well as from those of other religions — Christians, Muslims and Parsis are therefore aliens.

The origin of the Hindus is traced back to Aryan culture. Aryan identifies a language and a culture, not a biological race, whose emergence historians date to the second millennium B.C. But the Hindutva version of history is frantically pushing the date back to include the Indus civilization, a sophisticated urban civilization that preceded the Aryans by a millennium, as part of the Aryan origin of the Hindus.

The word is derived from “arya,” which means “those regarded with respect.” If the Hindus are of Aryan origin, therefore, they feel they can claim superiority over all others. This reflects not just the 19th century European obsession with Aryanism, but also the imprint of German and Italian Fascism of the 1930s on the founding members of the R.S.S., easily found in their writings.

Whereas historians are exploring the obvious interface between various communities and cultures of the second and first millenniums B.C., Hindutva ideologues insist on a single uniform culture of the Aryans, ancestral to the Hindu, as having prevailed in the subcontinent, subsuming all others.

Recent genetic evidence from archaeological sources has pointed to a mixture of populations in northern India at that time, with people of Iranian and Central Asian origin. Historians see this as evidence of migrations into India, but the idea is anathema to the Hindutva construction of early history.

To assert that the pre-Islamic period of Indian history was a golden age, claims are repeatedly made that this “Hindu period” from 1000 B.C. to 1200 A.D. was so scientifically advanced that Hindus were already using many modern scientific inventions, such as airplanes, plastic surgery and stem-cell research. These statements are applied to the activities of gods and men from the ancient past.

The other equally insistent Hindutva argument is that the Hindus were victimized by the Muslims and were slaves for the thousand years of Muslim rule. In demanding a Hindu Rashtra, or Hindu state, they claim to be asserting their historical rights and avenging their victimization. The history of the “Muslim period,” the second millennium A.D., is seen solely from this perspective and remains a mechanism for fueling hatred.

Historians find no evidence for such sweeping generalizations, but their views are dismissed. There certainly were conflicts between Hindus and Muslims, just as there had been conflicts between Hindus and Buddhists in pre-Islamic times. Some powerful Muslims did attack Hindu temples, both to loot their riches and to direct aggression against the religion. But this again was known in pre-Islamic times when some Hindu kings looted and destroyed temples to acquire wealth. There was more than religious prejudice involved in such actions.

The claim to victimization is ironic given that the worst form of victimization — declaring the lower castes to be so polluted as to be untouchable — was practiced by upper-caste Hindus for 2,000 years, including through the period when they were supposedly being victimized.

It is striking that remarkable new ideas surfaced in Hinduism during the period of Muslim rule, such as those developed by its many devotional sects, which enriched the religion and gave it a form that is currently observed by some Hindu devotees. But these are treated as isolated incidents. Nor is there reference to some of the most exquisite religious poems in praise of Hindu gods that were composed by Muslim poets, and that continue to be sung in repertoires of classical music. That the higher administrative offices of this period were manned largely by Hindu upper castes is conveniently ignored.

In contemporary India the concerted attacks on Jawaharlal Nehru, the country’s first prime minister and a symbol of the anticolonial movement who understood the centrality of secularism in Indian society, is a covert way of attacking secular democracy. The antipathy and the effort to diminish the achievements of Mr. Nehru also stem from the R.S.S. not being part of India’s anticolonial struggle.

The most dangerous aspect of the implanting of the Hindutva version of history across Indian society is that the divide between professional history and the version of the past used to legitimize Hindu majoritarianism is increasing. The latter has the patronage of the government, is well financed, and is popularized in a variety of ways. Those critical of this Hindutva history are already being labeled anti-national in an attempt to subvert historical research.

 Romila Thapar is a historian and the author of “The Past as Present: Forging Contemporary Identities Through History.”

May 17, 2019

Courtesy : The New York Times

......................................................



No comments:

Post a Comment