ఆయుధం అందుకో ద్రౌపదీ
- పుష్యమిత్ర ఉపాధ్యాయ్
(హిందీ యువకవి పుష్యమిత్ర ఉపాధ్యాయ్ రాసిన కవిత కు అనువాదం)
ఆయుధం అందుకో ద్రౌపదీ
ఇప్పుడు కృష్ణుడు రానే రాడు
గోరింటాకును పక్కనపెట్టు
ఖడ్గాన్ని చేతన పట్టు
నీ చీరని నువ్వే కాపాడుకో
పాచికలతో శకుని తిష్ట వేసాడు
మహానుభావులంతా తలలు వాల్చారు
సిగ్గులేని దుశ్శాసన సభని
ఎలా అడుగుతావు రక్షించమని !
అందుకే ద్రౌపదీ అందుకో ఖడ్గం
ఇప్పుడు కృష్ణుడు రానే రాడు
నిన్నటి వరకు కళ్ళు లేని రాజు
ఇప్పుడు వాడికి చెవులూ నోరూ సైతం లేవు
జనం నోళ్ళని కుట్టేసాడు
వారి చెవులపై కూడా నిఘా పెట్టేసాడు
ఎవరిని కరిగిస్తాయి
ఎవరిని కదిలిస్తాయి నీ కన్నీళ్లు ?!
అందుకే ద్రౌపదీ అందుకో ఖడ్గం
ఇప్పుడు కృష్ణుడు రానే రాడు
( హిందీ మూలం )
సునో ద్రౌపదీ శస్త్ర్ ఉఠాలో
-పుష్యమిత్ర ఉపాధ్యాయ్
సునో ద్రౌపదీ శస్త్ర్ ఉఠా లో
అబ్ గోవింద్ న ఆయేంగే!
ఛోడో మేహందీ ఖడగ్ సంభాలో,
ఖుద్ హీ అపనా చీర్ బచా లో
ద్యూత్ బిఛాయే బైఠే శకునీ
మస్తక్ సబ్ బిక్ జాయేంగే
సునో ద్రౌపదీ శస్త్ర్ ఉఠా లో
అబ్ గోవింద్ న ఆయేంగే.
కబ్ తక్ ఆస్ లగావోగీ తుమ్
బికే హుయే అఖబారోఁ సే
కైసీ రక్షా మాంగ్ రహీ హో
దుశ్శాసన్ దరబారోఁ సే
స్వయం జో లజ్జాహీన్ పడే హైఁ
వే క్యా లాజ్ బచాయేంగే
సునో ద్రౌపదీ శస్త్ర్ ఉఠా లో
అబ్ గోవింద్ న ఆయేంగే.
కల్ తక్ కేవల్ అంధా రాజా
అబ్ గూంగా బహరా భీ హై
హోంఠ్ సీ దియే హైఁ జనతా కే
కానోఁ పర్ పహరా భీ హై
తుమ్ హీ కహో యే అశ్రు తుమ్హారే
కిసకో క్యా సమఝాయేంగే?
సునో ద్రౌపదీ శస్త్ర్ ఉఠా లో
అబ్ గోవింద్ న ఆయేంగే .
***************
మూలం లోని ద్రౌపది అన్ని సరియైన పదం తమ అనువాదంలో ద్రౌపతి అన్ని భ్రష్టరూపానికి ఎలా వచ్చిందో దయచేసి చెప్పగలరా?
ReplyDeleteపొరపాటు. సవరించాను. ధన్యవాదాలండి.
Delete