Saturday, September 12, 2015

ప్రజల మధ్య సామాజిక సమానత్వం, స్వేచ్ఛ లేనప్పుడు ఆ ప్రజాస్వామ్యానికి అర్థంలేదు. - బి.ఆర్‌.అంబేడ్కర్‌

భారతదేశం ప్రజాస్వామ్యం - బి.ఆర్‌.అంబేడ్కర్‌

''ప్రజల ఆర్థిక, సామాజిక జీవితాల్లో విప్లవాత్మక మార్పులను ఏ రక్తపాతమూ లేకుండా తెచ్చే ప్రభుత్వరూపమే ప్రజాస్వామ్యం'' - అంబేడ్కర్‌

రాజ్యాంగం, ఓటు హక్కు, ఎన్నికలు ... ఈ మూడూ వుంటే చాలు ఆ దేశంలో ప్రజాస్వామ్యం వున్నట్లే అని భావించడం పొరపాటు. అవన్నీ పాలకవర్గానికే ఉపయోగపడుతున్నాయనీ, పైగా వారి పెత్తనానికి చట్టబద్ధత కల్పిస్తున్నాయనీ, సామాన్య జనానికి వాటివల్ల ఒరుగుతున్నదేమీ లేదనీ ఆవేదన చెందుతాడు అంబేడ్కర్‌.

ప్రజల మధ్య సామాజిక సమానత్వం, స్వేచ్ఛ లేనప్పుడు ఆ ప్రజాస్వామ్యానికి అర్థంలేదు.

సామాజిక సమానత్వానికి, ఆదర్శాలకు, సమైక్యతకు భారతదేశంలో కుల వ్యవస్థ పెద్ద అడ్డంకి. అది ప్రజాస్వామ్య మూలాలను తొలచివేస్తోంది.

ఒక కులం వారు ఒక వృత్తికే కట్టుబడివుండాలనడం ప్రజాస్వామ్య మూలసూత్రాలకే విరుద్ధం. దొంతరలతో కూడిన కులవ్యవస్థ వల్ల వెనుకబడిన, దళితకులాల్లో కూడా ఒకరు మరొకరికంటే ఎక్కువనో తక్కువనో భావిస్తున్నారు.

ఏ కులంవాడూ తనకంటే తక్కువ కులం వాడి హక్కులకోసం పోరాడేందుకు ముందుకురాడు. భారతీయులు కుల ప్రాతిపదికనే ఓటు వేస్తారు. చివరికి పార్టీలు కూడా ఆ నియోజకవర్గంలో ఏ కులం ఓటర్లు ఎక్కువగా వుంటే ఆ కులం అభ్యర్థినే పోటీకి నిలబెడుతున్నాయి.

భారతీయు ఆలోచనలు అడుగడుగునా తప్పుడు విలువలతో, తప్పుడు దృక్పథాలతో పక్కదార్లు పడుతున్నాయి. ప్రస్తుత విద్యావిధానం కూడా కులవ్యవస్థను పెంచి పోషిస్తోందే తప్ప కుల నిర్మూలనకు ఏమాత్రం దోహదం చేయటంలేదు.

చదువుకున్న వ్యక్తుల్లో కూడా సామాన్యులకంటే ఎక్కువగా స్వార్థం, కుల పిచ్చి పెరిగిపోవడం గమనించవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం భవిష్యత్తు ఏమైపోతుంది?
మన జ్రాస్వామ్యానికి దిక్కెవరు?
దీనిని ఎలా రక్షించుకోవాలి?
అనే అంశాలపై డా. అంబేడ్కర్‌ ఆలోచనల సమాహారమే ఈ పుస్తకం.

భారతదేశం ప్రజాస్వామ్యం
- బి.ఆర్‌.అంబేడ్కర్‌
ఆంగ్లమూలం: Dr.Babasaheb Ambedkar Writings and Seeches

తెలుగు అనువాదం : ప్రభాకర్‌ మందార

http://hyderabadbooktrust.blogspot.in/2015/09/blog-post_12.html

No comments:

Post a Comment