2012 యుగాంతం 4012 కు వాయిదా !
కోటానుకోట్ల జనం గజ గజ వణుకుతూ ఎదురు చూస్తున్న 2012 యుగాంతం
అనివార్య కారణాల వల్ల 4012 కు వాయిదా పడిందని తెలియజేయడానికి విచారిస్తున్నాము.
గతం లో "అష్టాగ్రహ కూటమి"- "1999 డిసెంబర్ 31 ప్రళయం" నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే..
అయితే 4012 యుగాంతం మాత్రం ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడదని కొందరు ఆస్తికులు ఢమకా బజాయించి చెప్తున్నారు. 4012 యుగాంతానికి స్వాగతం పలికేందుకు వారు ఇప్పటినుంచే సన్నాహాలను మొదలు పెట్టారు.
నాస్తికులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ బతుకు పోరాటాల్లో తాము నిమగ్నమై వున్నట్టు మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. కాగా , యుగాంతం ఇలా వాయిదాల మీద వాయిదాలు పడటం వల్ల ప్రజల్లో బొత్తిగా భయభక్తులు లేకుండా పోతాయని మత పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై కొందరు ప్రముఖుల అభిప్రాయాలు అడిగి తెలుసుకునే ముందు విశ్వ వాణి వార్తల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
(ఫేస్ బుక్ లో ఒక మిత్రుడి వ్యాఖ్య చూసి సరదాగా)
ప్రళయానికి, యుగాంతానికి తేడా తెలియని వారు,ఇంగ్లిష్ సినిమా చూసి యుగాంతం అంటే ఇలా ఉంటుందా అని గజ గజ వణికే వారికి ఒక శుభ వార్త (నవ్వులాటదైనా సరే) చెప్పారు."దీపావళి చేసుకోనంత మాత్రాన అమావాస్యా రాదా!పోదా!".ఇది అంతే. డిసెంబర్ 21'2012 యుగాంతమే. ఏమి మార్పులు జరుగుతాయి అన్నది వేచి చూడాల్శిందే."రాక్షస బల్లుల్లా మనం తుడిచి పెట్టుకు పోయే ప్రళయం" మాత్రం ఇప్పుడే రాదు లెండి. దానికి మీరు గ్యారంటి ఇవ్వవచ్చు. మీరు చెప్పిన దానికి నాకూ నవ్వు వచ్చింది.అహహ...అహహహ.....అహహహహహ.....అహహహహహహ............అబ్బా ఇక నవ్వ లేను బాబూ!
ReplyDelete2012 యుగాంతం పేరిట అర్థంలేని సొల్లు కబుర్లు చెప్పే "జ్యోతిశ్యులు" పేరుప్రఖ్యాతులు పొందారు. అద్భుతమైన రీతిలో వేల కోట్ల (కన్నా కూడా ఎక్కువేమో!) డాలర్ల వ్యాపారం జరిగిపోయింది. వెర్రి జనం జేబుల్లోని ద్రవ్యానికి రెక్కలొచ్చి ఎగిరిపోయి, బడాబాబుల bank accounts లో వాలింది. జరగాల్సిన వ్యాపారం జరిగింది.
ReplyDeletenext round వ్యాపారం కోసం మరీ 4012 దాకా ఆగాలంటే కష్టం!!