Thursday, February 4, 2010

ఉస్మానియా యునివర్శిటీ క్యాంపస్‌లో మరణించిన వేణుగోపాల్‌ది ఆత్మహత్యే అని నిర్ధారించిన ఫోరెన్సిక్‌ నివేదిక

.


.

జనవరి 19 రాత్రి ఎంసిఎ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి కొండేటి వేణుగోపాల్‌రెడ్డి ఉస్మానియా యునివర్శిటీ క్యాంపస్‌లో ఆత్మాహుతి చేసుకున్న సంఘటన తెలంగాణా ఉద్యమాన్ని శోకసంద్రంలో ముంచిన విషయం తెలిసిందే. ఆ మరునాడు వేణు భౌతిక కాయాన్ని ఉస్మానియా యునివర్సిటీ నుంచి నాంపల్లిలోని తెలంగాణా మృతవీరుల స్థూపం వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించేందుకు అనుమతించక నానా భీభత్సం సృష్టించిన సంఘటన మన ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చగా మిగిలిపోయింది.

దీనికి తోడు అసలు వేణుగోపాల్‌ది ఆత్మహత్య కాదు ఎవరో కావాలని ఆయనను హత్యచేసి ఆత్మహత్యగా సృష్టించారు అన్న దుష్ప్రచారం తెలంగాణా గుండెను మరింత గాయపరిచింది.

సిద్దాంతాలనూ నీతి నిజాయితీలనూ గాలికి వదిలేసి పరమ రోతగా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీల, నేతల తీరును, తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక ఇప్పటికే తెలంగాణాలో దాదాపు 250 మంది అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

అయినా మన వ్యవస్థకు చీమకుట్టినట్టయినా లేకపోవడం, ఆత్మహత్యలను నివారించేందుకు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, నేతలు నిర్థిష్టమైన చర్యలేమీ తీసుకోకపోవడం దారుణం.
పైగా పుండు మీద కారం చల్లినట్టు వేణుది ఆత్మహత్య కాదు హత్య అనే దుర్మార్గపు ప్రచారానికి ఒడిగట్టడం నిజంగా రాక్షసత్వమే.

కాగా, ఇవాళ వేణుగోపాల్‌రెడ్డిది ఆత్మహత్యేనని ఫోరెన్సిక్‌ వర్గాలు నిర్ధారించాయి. మృతదేహంతో పాటు లభించిన సూసైడ్‌ నోట్‌లోని చేతిరాత వేణుగోపాల్‌దేనని కాలిగ్రఫీ నిపుణులు నిర్థారించారు.
ఈమేరకు ఈ రోజు దినపత్రికల్లో వార్తలు వెలువడ్డాయి.

వేణూ నీ విషయంలో నిజం నిప్పులాంటిది, సత్యమేవ జయతే అని మరోసారి నిరూపితమయింది.
వృధా కాదు నీ మరణం !
తెలంగాణా రాష్ట్ర సాధనే నీకు నిజమైన నివాళి !









.

4 comments:

  1. Good to see another pro Telangana blog. see mine and pls add it. jaitelangaanaa. blog spot. com

    ReplyDelete
  2. వేణు తెలంగాణా ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొనేవాడు. మంచి ఆర్గనైజర్ మరియు వక్త. నిరంతరం తెలంగాణా కోసం పరితపించేవాడు. అట్లాంటి వాడు ఆత్మ హత్య చేసుకోవడము చాలా విచారకరం. ఆత్మహత్య చేసుకొనడానికి 15 రోజుల ముందు అతను "సోనియమ్మా తెలంగాణా ఇవ్వడానికి నీకు ఎంత మంది ప్రాణాలు కావాలి. చెప్పు ? నేను కూడా నా ప్రాణాలు ఇవ్వడానికి సిద్దంగా వున్నాను! " అన్న మాటలు జీ 24 గంటలు చానల్ లో ప్రసారం అయ్యాయి. అంటే అతనికి చాల రోజుల నుంచే సూసైడ్ టెన్డేన్సీ వుంది . కానీ అది చాల తప్పు ఆలోచన. తెలంగాణా పోరాటం ఆత్మ గౌరవ పోరాటం అని మనము చెప్పుతున్నాము కదా. ఆత్మహత్య చేసుకుంటే ఆత్మగౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? ఇదేమి రాంగ్ టెన్దేన్సీ ? తెలంగాణా రావాలంటే మనము చావాలా? మనము చచ్చిన తరువాత ఎవరికోసం తెలంగాణా? ఇది ప్రతి ఒక్క విద్యార్ది చాలా ఆలోచించాలి.

    ReplyDelete
  3. మీ "తెలంగాణ ఉద్యమ చరిత్ర" అనువాదానికి జాతీయ సాహిత్య బహుమతి వచ్చిన సందర్భంగా మీకు నా హార్దిక శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. నాగరాజు రవీందర్ గారూ
    పుస్తకం పేరు "ఆంద్ర ప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర".
    అవార్డు ఇస్తున్నది కేంద్ర సాహిత్య అకాడమి వారు, అనువాద విభాగం లో 2009 సంవత్సరానికి.
    ఈ సమాచారాన్ని నా బ్లాగులో పెడదామా వద్దా అనుకుంటుండగానే మీరు అభినందనలు తెలియజేసారు.
    ధన్యవాదాలు.

    ReplyDelete