Tuesday, December 31, 2024

నా ఇటీవలి అనువాదం .. జల్లికట్టు నవల

 జల్లికట్టు

.


.......

జల్లికట్టు (వాడివాసల్‌) నవలకు తమిళ సాహిత్యంలో విశిష్టమైన స్థానం వుంది. ప్రముఖ రచయిత, సాహితీ విమర్శకులు సి.ఎస్‌.చెల్లప్ప (1912`1998) ఈ నవలను 1949లో ఒక పత్రిక కోసం రాశారు. ఆ తరువాత 1959లో పుస్తక రూపంలో ప్రచురించారు.

ఏడు దశాబ్దాలు గడచినా ఈ నవల ఇప్పటికీ పునర్ముద్రణలు పొందుతూ ఈ తరం పాఠకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. జల్లికట్టు క్రీడపై తమిళంలో వెలువడిన తొలి నవల, బహుశా ఏకైక నవల కూడా ఇదే. 

ప్రతి యేటా మధురై, రామనథపురం జిల్లాల్లో జల్లికట్టును నిర్వహిస్తుంటారు. జల్లికట్టు స్పెయిన్‌లో జరిగే బుల్‌ఫైట్‌ను పోలి వున్నప్పటికీ రెండిరటికీ మధ్య చాలా వ్యత్యాసం వుంది.  అక్కడ విజయం సాధించడం అంటే ఎద్దును ఈటెలతో పొడిచి పొడిచి చంపడం. కానీ ఇక్కడ ఎద్దు మీదకు నిరాయుధంగా లంఘించి దాని కొమ్ములకు కట్టిన వాటిని నేర్పుగా స్వాధీనం చేసుకోవడం తప్ప దానిని చంపడం అనేది వుండదు. జల్లికట్టు అంటేనే ఆభరణాలను అలంకరించడం అని అర్థం. తమిళనాట తరతరాలుగా నిర్వహించబడుతున్న ఈ క్రీడను నిషేధించాలని ప్రభుత్వాలు పలుమార్లు ప్రయత్నించినా ప్రజా ప్రతిఘటన వల్ల అది సఫలం కాలేదు.

జల్లికట్టు గురించీ, మనిషికీ ఎద్దుకూ మధ్య జరిగే బలప్రదర్శన, హోరాహోరీ పోరు గురించీ ఈ చిన్న నవలలో కళ్లకు కట్టినట్టు చిత్రించారు రచయిత. 

 

(హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ (93815 59238) ప్రచురణ, ప్రభాకర్‌ మందార అనువాదం)