కుక్క తప్పిపోయింది
(కథ)
ఫోన్ గణ గణ మోగింది !
జ్యోతి పరుగు పరుగున వెళ్లి ఫోన్ అందుకుని “హలొ...” అంది ఆదుర్దాగా.
"నమస్కారం అండి" అట్నుంచి ఎవరిదో గొంతు !
"నమస్కారం. ఎవరు?”
"మీరు కుక్క తప్పిపొయింది అని పేపర్ లో ప్రకటన ఇచ్చారు కదా!"
“అవును. కానీ అది కుక్క కాదండీ. టామీ. మా ప్రాణం....”
“...”
“...టామీ మా కన్న కూతురు కంటే ఎక్కువండీ. అది కనపడకుండా పోయినప్పటి నుంచీ నాకూ మావారికీ నిద్రాహారాలు లేవు.”
జ్యోతి గొంతు జీర బోయింది. దుఃఖం ఆగలేదు.
“సరే సరే అండీ. ఏడవకండి. మీ టామీ ఎక్కడికీ పోలేదు. మాదగ్గర సురక్షితంగా ... హాపీగా వుంది.”
“ అవునా. నిజంగానా అండి. మీరెవరు? ఎక్కడినుంచి మాట్లాడుతున్నారు? మా టామీ మీదగ్గరికి ఎలా వచ్చింది ?” సంభ్రమంగా ప్రశ్నల వర్షం కురిపించింది.
" మేము వృద్ధాశ్రమం నుండి మాట్లాడుతున్నామండి. “
“........”
“రెండు వారాల క్రిందట మీ అత్తమామలను
మా దగ్గర వదిలి వెళ్లారు కదా. ఆ మర్నాడే వాళ్ళను వెతుక్కుంటూ మీ టామీ ఇక్కడికి వచ్చింది. “
“........”
“మీరు ఇచ్చిన నెంబర్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ... ఈ నెంబర్ తో ఏ ఫోనూ పనిచేయడం లేదు . అని వస్తోంది. మీరేమో ఒక్కసారైనా మీ అత్తమామలకు గానీ మాకు గానీ ఫోన్ చేయలేదు. అందుకనే మీకు ఇన్ఫార్మ్ చేయలేకపోయాం.
పేపర్ ప్రకటన లో మీరు ఇచ్చిన ఈ నెంబర్ చూసి ఫోన్ చేస్తున్నాం.
మీరేం బెంగ పెట్టుకోకండి మీ టామీ మీ అత్తమామల దగ్గర హాపీగా వుంది. “
“.........”
————————-
(వాట్సాప్ లో సర్కులేట్ అవుతున్న కథ స్వల్పం గా సవరించి)