Thursday, July 6, 2017

అరుంధతీ రాయ్ "ధ్వంసమైన స్వప్నం" పునర్ ముద్రణ
'చిదంబరం వార్,
బ్రోకెన్ రిపబ్లిక్,
వాకింగ్ విత్ ద కామ్రేడ్స్ '
అనే అరుంధతీ రాయ్ మూడు ఆంగ్ల వ్యాసాలను తెలుగులోకి అనువదించి మలుపు బుక్స్ వారు "ద్వంసమైన స్వప్నం" పేరుతొ ఒకే పుస్తకంగా ప్రచురించారు. 


ఆ పుస్తకం పునర్ముద్రణ వెలువడింది.
చిదంబరం వార్‌
చిదంబర రహస్యం - అనువాదం : ప్రభాకర్‌ మందార


భారతదేశం అనే దేశం గానీ, ఒరిస్సా అనే రాష్ట్రం గానీ లేకముందు నుంచీ కూడ దక్షిణ ఒరిస్సాలోని
ఈ చదునైన తక్కువ ఎత్తు కొండల వరస డోంగ్రియా కోందుల నివాస స్థలంగా ఉంది.
వాకింగ్‌ విత్‌ ద కామ్రేడ్స్‌
కారడవిలో కామ్రేడ్స్‌తో - అనువాదం : పి. వరలక్ష్మి

నా తలుపు కింది నుంచి లోపలికి తోసుకొచ్చిన క్లుప్తంగా టైప్‌ చేసిన చీటీ 'భారతదేశపు అతిపెద్ద
అంతరంగిక భద్రతా సవాలు'తో నా కలయికను నిర్ధారించింది. వాళ్ల సందేశం కోసం నేను ఎన్నో
నెలలుగా ఎదురు చూస్తున్నాను.
ట్రికిల్‌డౌన్‌ రెవల్యూషన్‌
మానవజాతి మనుగడ కోసం విప్లవం - అనువాదం : 'కడలి'

2010 జూలై 2 తెల్లవారు జామున ఆదిలాబాద్‌లోని మారుమూల అడవుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర
పోలీసులు చెరుకూరి రాజకుమార్‌ అనే వ్యక్తి ఛాతీలోకి తూటా దించారు. ఆ వ్యక్తి సహచరులకు
ఆజాద్‌గా పరిచితుడు.

ధ్వంసమైన స్వప్నం
అరుంధతీ రాయ్‌ వ్యాసాలు
వెల : 150/-
ప్రతులకు : ఇంటి నెం 2-1-1/5,
నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044.
ఇ మెయిల్ : malupuhyd@gmail.com