Wednesday, November 12, 2014

హైందవ పునాదులపై ఇండియా



హైందవ పునాదులపై ఇండియా

పెరి ఆండర్సన్రచించిన ది ఇండియన్ఐడియాలజీ గత రెండు సంవత్సరాలుగా ఇండియన్మేధావి వర్గంలో పెద్ద దుమారాన్నే లేపింది. వర్గం తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు పుస్తకాన్ని హైదరాబాద్బుక్ట్రస్ట్అనువదించి ప్రజలకు పరిచయం చేయటం చాలా సంతోషం,

ఇండియాను బ్రిటిష్పాలకులే డిస్కవరీ చేశారన్న ఆండర్సన్వాదనతో నేను వ్యక్తిగతంగా ఏకీభవించను. కానీ, అతను లేవనెత్తిన అనేక వాదనలు, ప్రశ్నలు భారతదేశంలోని వాస్తవాలను ఎత్తిచూపుతున్నాయి. ఎందుకు అతనితో ఏకీభవించనంటే ఇండియాను డిస్కవరీ చేసింది హిందూ మేధావి వర్గం. రాజా రామ మోహన్రాయ్దగ్గర నుంచి జవహర్లాల్నెహ్రూ వరకు ఆంగ్ల విద్యను వంటబట్టి ంచుకున్న తరం ఇండియాను డిస్కవరీ చేయటమే పనిగా పెట్టుకుని వేద కాలం నుంచి నేటి వరకు ఇండియాలో దాగి వున్న హిందూత్వాన్ని వెలికి తీశారు. ఇది ఇండియాను ఒక అప్రకటిత హిందూ దేశంగా తీర్చిదిద్దింది.

పుస్తకం ప్రధానంగా చెప్పేదేమంటే ప్రతి రాజకీయ పార్టీ సిద్ధాంత రాద్ధాంతాలకు అతీతంగా   హైందవ సాంస్కృతిక పునాదుల మీద నిర్మించబడి సంస్కృతిని బలోపేతం చేసింది. అదేవిధంగా సనాతన వాదులు, ప్రగతిశీల వాదులన్న తేడాలేకుండా ప్రతి హిందువూ ఇండియన్హైందవ ధర్మ రక్షణకే పాటుపడ్డాడు. పడతాడు కూడా. అందుకే రోజు వల్లభ్భాయ్పటేల్ఆర్‌.పస్‌.ఎస్‌.ను కాంగ్రెస్పార్టీలో విలీనం కావాలని కోరాడు.

ఇప్పుడు ఆరువందల అడుగుల ఎత్తు పటేల్విగ్రహాన్ని (స్టాచ్యూ ఆఫ్యూనిటీ) నిర్మించటానికి నరేంద్ర మోదీ తాపత్రయపడుతున్నారు. అంటే దేశంలోని ఐక్యత విషయం ప్రక్కన పెడితే, కాంగ్రెస్కీ బీజేపీకీ హిందూత్వ విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి తేడాలేదు.

కాంగ్రెస్లౌకికవాదానికి దేశం మోసపోయిందని పుస్తకం బలంగా చెబుతుంది. అంతేకాదు, కాంగ్రెస్దాని నాయకులు గాంధీ, నెహ్రూలు చేసిన మోసాలు ఇన్నీ అన్నీ కావని పుస్తకం రూఢి చేస్తుంది

సాధారణంగా వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన అధ్యయనాన్ని మనం జాతీయ ఉద్యమంలాగా భావిస్తాము. మన అగ్రకుల చరిత్రకారులు దీన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా ఉద్యమంగా అభివర్ణించారు. అయితే ఉద్యమం హైందవ ధర్మరక్షణకే జరిగిందన్న విషయం మనకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది.


గాంధీకి స్వరాజ్మతపరంగా ఒక తప్పనిసరి ఆవశ్యకత. రాజకీయ రూపం అనేది దీనిని ముందుకు తీసుకెళ్లే సాధనం తప్ప మరొకటి కాదు. మతాన్ని రాజకీయాలతో జోడించి ఉద్యమాన్ని నిర్మించడం  గాంధీ ప్రత్యేకత. క్రమంలో హైందవ మత ఉద్ధరణం ప్రధానాంశం కావటం చూస్తాము. రాజకీయ స్వేచ్ఛ రెండవ అంశం కావటం చూస్తాము. వాస్తవంగా గాంధీ చేసిన రాజకీయ ఉద్యమాలు ఏవీ  కచ్చితమైన ఫలితాలను సాధించకుండానే ముగుస్తాయి. అట్టహాసంగా మొదలుపెట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం చౌరీచౌరాలో జరిగిన హింసాత్మక సంఘటనతో అర్థాంతరంగానే ముగుస్తుంది. కానీ, అసలు కారణం హింస కాదు. ఉద్యమం కొద్ది రోజుల్లోనే ప్రజా ఉద్యమంగా మారింది. బ్రిటిష్పాలన       కంటే ప్రజా విప్లవమే ప్రమాదకరమని భావించి సహాయ నిరాకరణోద్యమాన్ని ముగిస్తారు. అప్పటికి ఇండియా హిందువైజేషన్కాకపోవటం కూడా ఒక ప్రధాన కారణం.

దండి సత్యాగ్రహం ఒక డిఫెన్సివ్ఆట. క్విట్ఇండియా ఉద్యమం ప్రజల నుంచి వచ్చింది. ఇందులో గాంధీ ప్రమేయం అంతంత మాత్రమే. గాంధీ రాజకీయ ఉద్యమాల్లో విజయం సాధించలేదు. కానీ,   హైందవ మత విషయంలో విజయాన్ని సాధించారు.

గాంధీ తన ప్రజా జీవితం మొత్తాన్ని హిందూ ధర్మరక్షణ కోసమే వెచ్చించారని పుస్తకం రూఢి చేస్తుంది. వ్యక్తిగత, ప్రజా జీవితం రెండూ మత మౌఢ్యంలోనే నడిచాయి. గాంధీ బ్రహ్మచర్యం కూడా  హిందువులం మైలపడతామన్న భయం నుంచి రూపు దిద్దుకుంది. వ్యక్తిగత స్థాయిలో అన్ని మతాలూ సమానమని నమ్మినా రాజకీయ స్థాయిలో మాత్రం హిందూ మతం, ఇస్లాం మతం కంటే కాస్త ఎక్కువ అని నమ్మేవారు. ఒక ముస్లిం యువతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న తన కుమారునికి అది 'ధర్మ విరుద్ధం' అని హెచ్చరించారు. రాజకీయాల్ని పక్కనబెట్టి పెళ్లి కాకుండా చూశారు.

గాంధీ లౌకిక వాదంలో హిందూత్వం దాగి వుందని ముస్లింలు చాలా కొద్ది కాలంలోనే కనిపెట్టారు. నాటకీయంగా జరిగిన ఖిలాఫత్ఉద్యమం తరువాత గాంధీ ముస్లింలను వదిలివేశారు. ఆనాటి నుంచి అత్యధిక శాతం ముస్లింలు ఆయనను ఎప్పుడూ నమ్మలేదు. లౌకిక వాదానికి ప్రతీకగా వున్న మహమ్మ దలీ జిన్నా కూడా గాంధీ హిందూత్వ రాజకీయాలకు విసిగిపోయి కాంగ్రెస్నుంచి బయటికి వచ్చేశారు. నిష్పక్షపాతి అయిన మోతీలాల్నెహ్రూ కాంగ్రెస్పార్టీ కచ్చితంగా హిందూ పార్టీయే అనడం గమ నించదగ్గ విషయం. హైందవ రాజకీయాలే దేశ విభజనకు దారితీశాయి. కానీ, చరిత్రలో దేశ విభజనకు జిన్నాను దోషిగా నిలబెట్టారు.

కాంగ్రెస్పార్టీయే పాకిస్థాన్స్థాపనకు నాంది పలికింది. భారత దేశంలో ఒకటికాదు, రెండు దేశాలున్నాయని జిన్నా 1940లో ప్రకటించారు. రెండు దేశాలు సహజీవనం చేసేందుకు భారత స్వాతంత్య్రం వీలు కల్పించాలనీ, ముస్లింలు అధిక సంఖ్యలో వున్న ప్రాంతాల్లో వారికి స్వయంప్రతిపత్తినీ, సార్వభౌమాధికారాన్నీ ఇవ్వాలనీ అన్నారు. అంటే జిన్నా ప్రత్యేకదేశం కావాలని కోరలేదు. ముస్లింలకు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకున్నారు. విషయాన్ని గందరకోళం చేసి కాంగ్రెస్పార్టీ పాకిస్థాన్ప్రతిపాదనను జిన్నాకు అంటగట్టింది. దేశ విభజన బ్రిటిష్ప్రభుత్వానికి కూడా ఇష్టంలేదు. క్యాబినెట్మిషన్ముస్లింలు అత్యధిక సంఖ్యలో వున్న ప్రాంతాలన్నీ స్వయం పాలనాధికారంతో వుండేవిధంగా ప్లాన్ను రూపొందించింది. కానీ, అది నెహ్రూకు రుచించలేదు. ముస్లింలకు ప్రత్యేక స్వయంప్రతిపత్తి ఇవ్వడం కంటే దేశ విభజనే మేలని నెహ్రూె భావించారు.

విచిత్రమేమంటే, కాంగ్రెస్‌, ముస్లిం లీగ్దేశ విభజన గురించి మాట్లాడుతున్నప్పుడు జిన్నా మాత్రం అఖండ భారత దేశంలో సంకీర్ణ ప్రభుత్వం గురించి కలలు కనేవారు. భారత దేశంలో ఆంక్షలు లేని సంపూర్ణ అధికారంతో కూడిన బలమైన కేంద్ర ప్రభుత్వం కావాలని నెహ్రూ కోరుకున్నారు. అది విభజనతోనే సాధ్యపడుతుందని భావించారు. చివరకు ఈస్ట్బెంగాల్ని కూడా జిన్నా కోరుకోలేదు. కానీ, ప్రాంతం ఇడియాతో వుంటే కోల్కతాలో ముస్లింల ప్రాబల్యం పెరుగుతుందని దానిని పాకిస్థాన్కు అంటకట్టారు.స్వతంత్ర భారత్లో హిందువుల ఆధిపత్యమే పునాదిగా దేశ విభజన జరిగిందన్న విషయాన్ని ఇక్కడ గుర్తించాలి.

గాంధీ, నెహ్రూల కుల రాజకీయాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరంలేదు. కుల రాజకీయాలు కాంగ్రెస్పుట్టుకలోనే వున్నాయి. గాంధీ ప్రకారం అంటరానితనానికి కులానికి మధ్య ఎలాంటి సంబంధమూ లేదు. కానీ, అంబేద్కర్కుల సమస్యను లేవనెత్తినప్పుడు అగ్రకుల హిందువులంతా ఏకమై ఆయన ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. గాంధీ దృష్టిలో అంటరానితనం పాపమే కావచ్చు. కానీ, అది ఆమరణ దీక్ష చేయాల్సినంత నైతిక సమస్య కాదు. కానీ అంటరానివాళ్లకు ప్రత్యేక నియోజకవర్గాలు మంజూరు చేయటం మాత్రం ఆయన దృష్టిలో చాలా తీవ్రమైన సమస్య. వాటికి వ్యతిరేకంగా ఆయన తన జీవితాన్నే పణంగా పెట్టడానికి సిద్ధం. అగ్రకుల హిందువుల ఒత్తిడికి, గాంధీ బ్లాక్మెయిలింగ్కు పూనా ఒప్పందం సమయంలో లొంగిపోయినందుకు అంబేడ్కర్తను చనిపోయేవరకూ బాధపడ్డారు.

వలసవాద వ్యతిరేక ఉద్యమ రూపంలో హిందూయిజం, అగ్రకులతత్వం బలంగా తన ఆధిపత్యాన్ని సాధించుకుంది. అందుకే స్వతంత్ర భారతంలో మత మైనార్టీలు, అణగారిన కులాలు, ఆదిమ జాతులు భయంకరమైన అణచివేతకు, దోపిడీకి గురవుతున్నాయి.

రాజ్యాంగంలో లౌకికవాదాన్ని లిఖించుకున్నారు, కానీ రాజ్యాంగంలో హిందువులకు తప్ప మరే మతస్థులకు రక్షణ లేదు. హిందూ అణగారిన కులాలకు రిజర్వేషన్కల్పిస్తే మతం అడ్డురాదు. కానీ, ముస్లిం, క్రిస్టియన్మతాల్లోని పేదలకు రిజర్వేషన్కల్పిస్తే మాత్రం మతం అడ్డువస్తుంది. అంటే హిందూమత రక్షణ మన రాజ్యాంగంలో బహిరంగంగానే దాగి వుంది. ఎందుకు ఒక్క ముస్లిం కూడా ఇండియన్రక్షణ, పరిశోధన సంస్థల్లో లేరు? కానీ, నేపాల్కు చెందిన గూర్ఖాలు ఆర్మీలో ఉండవచ్చు. ఎందుకు కశ్మీర్లోని ముస్లింల మీదా, ఈశాన్య రాష్ట్రాల్లోని క్రిస్టియన్ఆదివాసుల మీదా నిరంతరం నరమేధం నడుస్తుంది? ఎందుకు దేశ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి? దేశ అగ్రకుల మేధావి వర్గం ఎందుకు హింస గురించి మాట్లాడదని పుస్తకం ప్రశ్నిస్తుంది.
 -  డాక్టర్భంగ్యా భుక్యా
యూనివర్సిటీ ఆఫ్హైదరాబాద్

(ఆంధ్రజ్యోతి 26 అక్టోబర్ 2014 ఆదివారం సౌజన్యంతో)

http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/TELANGANA/2014/10/26/ArticleHtmls/26102014006006.shtml?Mode=1


ఇండియాలో దాగిన హిందుస్థాన్
ఆంగ్ల మూలం :  The Indian Ideology, Perry Anderson, Three Essays Collective, Gurgaon (Haryana), October 2012, ©  Perry Anderson  
 
తెలుగు అనువాదం  :  ప్రభాకర్ మందార
175
పేజీలు ; ధర : రూ.150/-

ప్రతులకు, వివరాలకు:
హైదరాబాద్బుక్ట్రస్ట్‌,  ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్‌,  గుడిమల్కాపూర్‌, హైదరాబాద్‌ - 500 006
ఫోన్‌ : 040 23521849

For E Book:

Email ID : hyderabadbooktrust@gmail.com

Saturday, October 18, 2014

ఆసక్తి రేపే పుస్తకం “ఇండియాలో దాగిన హిందుస్తాన్” - సాక్షి సమీక్ష





గతం నుంచి వర్తమానం, వర్తమానం నుంచి భవిష్యత్తు నిర్మితమవుతాయి. చరిత్ర కూడా ఇలాగే అడుగులు వేస్తూ వెళుతుంది. ఒక్కోసారి తప్పటడుగులు కూడా. అయితే తప్పటడుగులు వేసిన వారికి తమ తప్పిదాలు తెలియకపోవచ్చు. ముందు తరాల వారు వాటిని గుర్తిస్తారు. గాంధీలో ఉన్న హిందుత్వ భావనే దేశ విభజనకు కారణమైందని, తరువాత నెహ్రూ దాన్ని పెంచి పోషించాడని పుస్తక రచయిత పెరి అండర్సన్ అంటారు. పెరి అండర్సన్ ఆంగ్లో-ఐరిష్ రచయిత. ప్రముఖ మార్క్సిస్టు మేధావి. ఆయన గతంలోఇండియన్ ఐడియాలజీపేరుతో ఇంగ్లిష్లో రాసిన పుస్తకమే ఇప్పుడుఇండియాలో దాగిన హిందుస్తాన్పేరుతో అనువాదమై వెలువడింది. పుస్తకంలోని అంశాలను మనం సమర్థించవచ్చు. లేదా విమర్శించవచ్చు. కాని చర్చించాల్సిన విషయాలు కొన్ని ఇలా ఉన్నాయి.

 ఇండియా అన్న భావనే యూరప్ నుంచి సంక్రమించింది. ఎందుకంటే అంతకు ముందు అది చిన్న చిన్న రాజ్యాల సమూహం. అందుకే బ్రిటిష్వాళ్లు సులభంగా జయించి ఒక్కటి చేశారు.

 లౌకికవాదాన్ని అనుసరించే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీకి చేతికి వచ్చిన తరువాత పురాణాలు, మత ధర్మశాస్త్రాలను చొప్పించి ఆయనకు తెలియకుండానే హిందుత్వని అమలు చేశారు. గాంధీ పట్ల ముస్లింల అపనమ్మకానికి ఇది బీజం వేసింది. మున్ముందు ఇది దేశవిభజనకు దారి తీసింది.

 1922లో చౌరీచౌరాలో పోలీసులపై హింస జరిగినందుకు నిరసనగా దేశవ్యాప్త ఉద్యమాన్ని నిలుపుదల చేయించిన గాంధీ, రెండవ ప్రపంచ యుద్ధాన్ని సమర్థించడమే కాకుండా సైన్యంలో చేరమని కూడా పిలుపునిచ్చారు. ఆయన  అహింసాయుధంపై ఆయనకే స్పష్టత లేదు.

 అంటరానివాళ్లకు ప్రత్యేక నియోజకవర్గాలను మంజూరు చేస్తూ బ్రిటిష్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా గాంధీ చేశారు. నిస్సహాయ స్థితిలో అంబేద్కర్ కూడా గాంధీకి లొంగిపోయారు. విషయమై చనిపోయేవరకూ అంబేద్కర్ బాధ పడుతూనే ఉన్నారు.

 నెహ్రూకి గాఢమైన మత విశ్వాసాలు లేకపోయినా అనేక అంశాల్లో గాంధీ హిందుత్వనే ఆయన అనుసరించాడు. కాశ్మీర్ విషయంలో నెహ్రూ చేసిన తప్పిదాల వల్లే ఈనాటికీ రక్తం ఏరులై పారుతోంది. వ్యక్తిగత ఇష్టాయిష్టాలను రాజకీయాలకు ముడిపెట్టే అలవాటు నెహ్రూకి ఉంది. బహిరంగ సభలో నాగాలాండ్ ప్రజలు తనకి పిరుదులు చూపించి అవమానించారనే కోపంతో ఆయన నాగాలాండ్పై కర్కశంగా ప్రవర్తించారు. (‘గాంధీ అనంతర భారతదేశంపుస్తకంలో రామచంద్ర గుహ కూడా ఇదే చెబుతారు)

 మతతత్వం వల్ల లబ్ది చేకూరుతుందనుకుంటే బిజెపి, కాంగ్రెస్లు ఒకేలా వ్యవహరిస్తాయి. 2002లో గుజరాత్లో చనిపోయిన వారి కంటే 1984లో ఢిల్లీలో జరిగిన ఊచకోతలో చనిపోయిన వాళ్ల సంఖ్యే ఎక్కువ.రాజకీయాలపై ఆసక్తి ఉన్న వాళ్లందరూ చదవాల్సిన పుస్తకమిది.
 
............................................................................................................. -
జి.ఆర్.మహర్షి

 ఇండియాలో దాగిన హిందుస్తాన్-
పెరి అండర్సన్;
హెచ్.బి.టి ప్రచురణ;
వెల: రూ.150;
ప్రతులకు: 040- 23521849

( సాక్షి 17-10-2014 ఫామిలీ   పేజ్ సౌజన్యంతో )
Pl Visit Hyderabad Book Trust Blog:
 

.